హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / కాఫీని ఇలా తాగితే బరువు తగ్గుతారట!
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కాఫీని ఇలా తాగితే బరువు తగ్గుతారట!

ప్రతిసారీ కాఫీలోచక్కెర వేసుకుని తాగడం వల్ల అధిక మొత్తంలో క్యాలరీలు శరీరంలోకి చేరి బరువు మాత్రం కచ్చితంగా పెరుగుతారని పరిశోధకులు అంటున్నారు.

మామూలుగా ఉదయం నిద్ర లేవగానే టిఫిన్ తిన్న తరువాత చిక్కని కప్పు కాఫీ తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల జిహ్వను తృప్తి పరచామనుకుంటారు. ఇలా ప్రతిసారీ కాఫీలోచక్కెర వేసుకుని తాగడం వల్ల జిహ్వను తృప్తిపరచడం మాటెలాఉన్నా అధిక మొత్తంలో క్యాలరీలు శరీరంలోకి చేరి బరువు మాత్రం కచ్చితంగా పెరుగుతారని పరిశోధకులు అంటున్నారు.

అదే కాఫీలో చక్కెర బదులు స్పూను బటర్ కలుపుకుని తాగితే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ అని వారు చెబుతున్నారు. బటర్ అనేది ఆరోగ్య రీత్యా అంత మంచిది కాకపోయినా కాఫీలో దీన్ని కలిపి తాగడం వల్ల కొన్ని గంటల వరకూ ఆకలి అనేది వేయదనీ, దాని కారణంగా ఆహారం ద్వారా అధిక క్యాలరీలు

శరీరంలో వచ్చి చేరే అవకాశం ఉండదని వారు అంటున్నారు. అదనపు క్యాలరీలు చేరకపోగా.. ఉన్న క్యాలరీలు ఖర్చు కావడం వల్ల బరువు తగ్గడం అనేది క్రమంగా జరుగుతుందని వీరి పరిశోధనల్లో రుజువైంది. బరువు తగ్గడంతో పాటు క్రీమీ కాఫీని తాగడం వల్ల మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందని వీరు చెబుతున్నారు. ఇదే విషయం మీద సుమారు రెండు వందల మంది మీద పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని కనుగొన్నారు.

వంద మంది చొప్పున రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి క్రీమీ కాఫీని, మరొక గ్రూపు వారికి మామూలు కాఫీని ఇచ్చి వారి ఆరోగ్యస్థితిని పరిశీలించగా, క్రీమీ కాఫీ తాగిన వారి బరువు క్రమంగా తగ్గడం వీరి దృష్టికి వచ్చింది. మామూలు కాఫీ తాగిన వారిలో కొద్దిగా బరువుపెరగడం వీరు గుర్తించారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

3.01834862385
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు