హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / కీలక ఆరోగ్యాంశాలు (ప్రోబయోటిక్స్ & ప్రీబయోటిక్స్)
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కీలక ఆరోగ్యాంశాలు (ప్రోబయోటిక్స్ & ప్రీబయోటిక్స్)

కీలక ఆరోగ్యాంశాలు (ప్రోబయోటిక్స్ & ప్రీబయోటిక్స్)

పరిచయం

మన శరీరంలో మంచి బాక్టీరియాను వృద్దిచేసివి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేట్లుగా చేసేవి. ఈ రెండూ వినడానికి ఒకేలా ఉండీ, కొంచెం తికమకకు గురిచేస్తాయి. కాని ఈ రెండు దేనికదే ప్రత్యేకం.
ప్రో బయోటిక్స్ అంటే మంచి బాక్టీరియా, జీవంగలవి, మన జీర్ణ వ్యవస్థలో సహజంగానే ఉంటాయి. అవి చెడు బాక్టీరియాను ను నశింపచేసి మన జీర్ణ వ్యవస్థ ను, విసర్జక వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తాయి. వ్యాధినిరోధక వ్యస్థను పటిస్ట పరుస్థాయి.
ప్రీ బయోటిక్స్ అంటే మన తీసుకున్న ఆహారం నుంచి లభించి, జీర్ణాశయంలో జీర్ణం కానటువంటి పిండి పదార్థాలు. ఇవి ప్రో బయోటిక్స్ కు ఆహారం.
అంటే ప్రీబయోటిక్స్ & ప్రోబయోటిక్స్ మన శరీరానికి చాలా అవసరం, ప్రోబయోటిక్స్ శరీరంలో ఉండేట్లుగా చేసేవి ప్రీబయోటిక్స్. ఆ విధంగా రెండూ పరస్పరం అనుబంధం కలిగి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ప్రోబయోటిక్స్ ఎందుకు

 • మానవ శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ, నాడి వ్యవస్థల నిర్వహణలో జీర్ణవ్యవస్థ పాత్రచాలా ఉంటుంది. అందుకు మూలం జీర్ణ జీర్ణవ్యవస్థలోని ప్రోబయాటిక్స్ నిర్వహిస్తాయి. ఆందుకే జీర్ణ వ్యస్థను రెండవ మెదడు అంటారు. శరీరంలో పోషకాలు జీర్ణించబడి శోషించబడాలన్నా, విటమిన్లు, కొవ్వు ఆంలాల సంశ్లేషణ జరగాలన్నా, కొన్ని బాక్టిరీయాల వలన వచ్చే వ్యాధులను నివారించాలన్నా ప్రోబయోటిక్స్ చాలా అవసరం.
 • ఓక్కోసారి వ్యాధినివారణకు యాంటిబయాటిక్ ఇచ్చినపుడు మంచి బాక్టీరియా నశించిపోతాయి. అటువంటి సమయాలలో ప్రోబయోటిక్స్ శరిరాన్ని ఆదుకుంటాయి.
 • విరోచనాలు తగ్గిన తర్వాత, వీటి అవసరం చాలాఉంటుంది
 • యోనికి సోకే ఈస్ట్ ఇంఫెక్షన్, మూత్రనాళానికి సోకే ఇంఫెక్షన్లను నివారిస్తాయి, తగ్గిస్తాయి
 • విసర్జన కు సంబంధించిన అసౌకర్యానికి చికిత్స చేస్తాయి
 • జీర్ణాశాయానికి సంబంధించిన ఇంఫెక్షన్ లను త్వరగా తగ్గిస్తాయి.

ప్రోబయోటిక్స్ గల ఆహారం

ప్రోబయోటిక్స్ శరీరంలో సహజంగా ఉన్నప్పటికి, నిరంతరం కలిగి ఉండాలంటే , ప్రోబయోటిక్స్ గల ఆహారం తిసుకోవాలి.
 • పాలు, పాల పదార్థాలు ముఖ్యంగా పులవడం వల్ల తయారయ్యే పదార్థాలు పెరుగు, మజ్జిగ, జున్ను, మొదలైన వాటిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి.
 • పులియబెట్టి తయారుచేసే పదార్థాలలో- బ్రెడ్, ఇడ్లి, దోశ, డోక్లా వంటి వాటి ద్వారా లభిస్తాయి.
 • సోయా పాలు, సోయా పాలతో తయారుచేసే టెంఫూ లో ఉంటాయి
 • డార్క్ చాక్లెట్ లో ఉంటాయి. ఈమధ్య కాలంలో ఇవి బాగా అందుబాటులోకి వచ్చాయి. మధుమేహులకు కూడా ఇవి చాలా మంచివి.
 • కూరగాయలు, పండ్లు ఉపయోగించి చేసే ఊరగాయల ద్వారా కూడా వీటిని పొందవచ్చు.

ప్రీబయోటిక్స్ ఎందుకు

ప్రీబయోటిక్స్ శరీరంలో జీర్ణంగాని పీచు పదార్థాలు; ప్రోబయోటిక్స్ కు ముఖ్యంగా బిఫిడోబాక్టీరియా జాతికి చెందినవాటికి మంచి ఆహారంగా పనిచేస్తాయి, శరీరంలో వాటి సంఖ్యను పెంపొందిస్తాయి.

పెద్ద పేగు, పురిష స్థానం దగ్గర ఉండి, అక్కడ పనిచేసే ప్రో బయోటిక్స్ ఆహారంగా ఉంటాయి. ఇనులిన్, ఫ్రక్టోలిగోసాకరైడ్స్, గలాక్టోలిగోసాకరైడ్స్, లాక్టోస్, లఫినోస్ మొదలైనవి శరీరంలో సాధారణంగా ఉండే ప్రీబయోటిక్స్.

ప్రీబయోటిక్స్ గల ఆహారం

 • ఫప్పుధాన్యాలు
 • ముడి గోధుమ ఉత్పత్తులు
 • వెల్లుల్లి
 • ఉల్లి-పచ్చివి, ఉడికినవి
 • కాబేజి
 • చికోరి దుంప

సిన్ బయాటిక్స్

సిన్ బయాటిక్స్ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ కలిసి ఉండే పోషక అనుబంధాలు. ఆరోగ్యాన్ని చేకూర్చడానికి, మంచి బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడానికి ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ కలసిన మిశ్రమాలను తయారుచేస్తారు. ఇవి జీర్ణాశయంలో జీవక్రియను ప్రేరేపించి, అవసరమైన బాక్టీరియాను ఉత్తేజపరచి  ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.

వీటిని పూర్తిగా వైద్యుల సలహాల మేరకు వాడవలసి ఉంటుంది.

ఆధారం:

 1. డాక్టర్ కె. అపర్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆహారము మరియు పోషణ విభాగము
 2. శ్రీమతి. పర్జన్య కర్నాటి, ఫార్మసిస్ట్.
2.96774193548
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు