హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / కూలింగ్‌ ఎఫెక్ట్స్‌ ఇచ్చే యోగాసనాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కూలింగ్‌ ఎఫెక్ట్స్‌ ఇచ్చే యోగాసనాలు

మండుతున్న ఎండల నుంచి యోగా ద్వారా ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు

రోజువారీ కార్యక్రమాలలో కొన్ని రకాల యోగాసనాల ద్వారా కూలింగ్‌ ఎఫెక్ట్‌ను పొందవచు. వాటిలో చంద్ర నమస్కారం. సూర్య నమస్కారాలలోనే ఇవి కాస్త వైవిధ్యంగా ఉంటాయి. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా సూర్యనమస్కారాలు చేస్తే ముందుకు జంప్‌ చేయడం కాకుండా కాస్త ముందుకు నడవడం వల్ల లో వైబ్రేటరీ ఫీలింగ్‌ కలుగుతుంది. దీనితో పాటుగా సపోర్టెడ్‌ బ్యాక్‌బెండ్స్‌, లెగ్స్‌ అప్‌ ద వాల్‌, సపోర్టెడ్‌ షోల్డర్‌ స్టాండ్‌, ఫార్వాడ్‌ ఫోల్డ్స్‌, ఉష్‌త్రాసన్‌- కామెల్‌పోజ్‌ వల్ల కూడా మేలు కలుగుతుందని చెబుతున్నారు. ఈ ఆసనాల వల్ల శరీరం తనను తాను నియంత్రించుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఈ ఆసనాలు కాకుండా ప్రాణాయామాలు కూడా ఎంతో హెల్ప్‌చేస్తాయంటున్నారు యోగా గురువులు.

ఫార్వాడ్‌ బెండ్స్‌ :

ఫార్వాడ్‌ బెండ్స్‌వల్ల శరీరం కూల్‌ కావడంతో పాటుగా మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. ఉత్తనాసన (స్టాండింగ్‌ ఫార్వాడ్‌ బెండ్‌), ప్రసరిత పదోత్తాసన (స్టాండింగ్‌ వైడ్‌ లెగ్డ్‌ ఫార్వాడ్‌ బెండ్‌) లను కూలింగ్‌ స్టాండింగ్‌ పోజ్‌లుగా చెబుతుంటారు. పశ్చిమోత్తాసన (సీటెడ్‌ ఫార్వాడ్‌ బెండ్‌), బాలాసన (చైల్డ్‌ పోజ్‌) లు శవాసనానికి ముందు ట్రై చేయడం మంచిది.

 

ట్విస్ట్స్‌ :

బెల్లీ దగ్గర నుంచి దిగువ భాగం కూల్‌ కావడానికి ఇవి దోహదపడతాయి. సీటెడ్‌, సుపిన్‌ ట్విస్ట్స్‌ మంచి కూలింగ్‌ అనుభవాన్ని అందిస్తాయి. పరివ్రత్త ఉపవిష్ట కోసాసన (రివాల్వ్‌డ్‌ వైడ్‌ యాంగిల్‌ పోజ్‌) లేదంటే పరివ్రత్త సుఖాసన (రివాల్వ్‌డ్‌ ఈజీపోజ్‌) లేదా అర్ధ మత్సేంద్రాసన, బెస్ట్‌బ్యాక్‌బెండ్స్‌ (జెంటిల్‌) డీప్‌ బ్యాక్‌బెండ్స్‌ వల్ల హీట్‌ పెరగవచ్చేమో కానీ కొద్దిగా వంగడం వల్ల టెన్షన్‌ , అధిక వేడి కూడాతగ్గుతాయి. భుజంగాసన (కోబ్రా), సేతుబంధ సర్వాంగాసన (బ్రిడ్జ్‌ పోజ్‌)లు అద్భుతమైన కూలింగ్‌ ప్రాక్టీస్‌లుగా చెప్పొచ్చు.చక్రవాకాసన (కాట్‌-కౌ)కూడా బెస్ట్‌.

 

శీతలి ప్రాణాయామం :

ఈ టెక్నిక్‌లో మీ నాలుకను గుండ్రంగా చేసి పెదాల ద్వారా కాస్త బయటకు తీసుకొచ్చి గాలిని లోపలకు తీసుకోవాలి. లోపలకు తీసుకున్న గాలిని ముక్కుద్వారా బయటకు వదలాలి. ఇలా కనీసం 5-20 సార్లు చేస్తే మీ శరీరం చల్లబడిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఒకవేళ మీ నాలుకను గుండ్రంగా చేయడం కష్టమనిపిస్తే మీ పెదాలను డోనట్‌ షేప్‌లో ఉంచుకుని నోటి ద్వారా గాలిని పీల్చి ముక్కుతో గాలిని వదలాలి.

 

సింగిల్‌-నోస్ట్రిల్‌ బ్రీతింగ్‌

: ఈ టెక్నిక్‌ వల్ల ఒక ముక్కు రంధ్రం ఐడెల్‌గా ఉంచవచ్చు. సాధారణంగా వేసవి కాలంలో మనం ఎడమవైపు ముక్కు ద్వారానే ఎక్కువగా గాలి పీలుస్తుంటాం. దీనినే ఇద నాది అంటారు. ఇది బాడీ కూలింగ్‌ చానెల్‌. ఇది బాడీ లునార్‌ సైడ్‌ ఉంటుంది. కుడి వైపు ముక్కు రంధ్రం మూసి ఎడమ వైపు ద్వారా గాలి పీల్చుకుని వదలడం వల్ల కూలింగ్‌ ఎఫెక్ట్‌ కలుగుతుంది.

 

ఫలితాలు అధికం..

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. కానీ యోగాని థెరపాటిక్‌ ఇంటెన్షన్‌తో ప్రాక్టీస్‌ చేస్తే దాని ఫలితాలు మరింత ఉన్నతంగా ఉంటాయన్నది యోగా ప్రాక్టీషనర్ల భావన. యోగా థెరపీ/థెరపాటిక్‌ యోగా ఇటీవల ప్రాచుర్యం పొందింది. అన్ని రకాల జబ్బులకూ యోగాలో ఉపశమనం లభిస్తుందని చాలామంది నమ్ముతున్నారు. వ్యక్తులు, వారి సమస్యలను అనుసరించి యోగాసనాలు చేస్తేనే కావాల్సిన ఫలితాలు పొందవచ్చని యోగా నిపుణురాలు ప్రసూన పలు సూచనలు చేశారు.

మనసు ప్రశాంతత కోసం :

ఒత్తిడి జీవితాలు ఇప్పుడు. టార్గెట్‌ పెట్టుకుని మరీ పనిచేయాల్సి ఉంటుంది. ఏకాగ్రతకు భంగం కలగకుండా ఉండాలంటే ప్రాణాయామం మంచిది. విష్ణు ముద్ర ద్వారా త్వరగా రిలాక్స్‌ కావచ్చు.
బ్యాక్‌ పెయిన్‌ : సాఫ్ట్‌వేర్‌ అనేకాదు.. చాలా వరకూ కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య ఇది. బ్యాక్‌ పెయిన్‌ నుంచి ఉపశమనం కలిగించటానికి ఎన్నో ఆసనాలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే... సర్పాసనం, భుజంగాసనం, మార్జాలాసనం, శశంకాసనం, ఉద్ధానపదాసనం వంటివి మొదటి వరుసలో ఉంటాయి.

 

ఒబేసిటీ :

ఉద్యోగులనే కాదు.. ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య ఇది. డైట్‌ కంట్రోల్‌ చేయటం.. మెడికేషన్‌ ద్వారా కొంత వరకూ నయం చేయొచ్చని అందరికీ తెలుసు కానీ యోగా ద్వారా దీనికి పరిష్కారం లభిస్తుంది. ఈ యోగాసనాలలో హలాసనం ఒకటి. వీటితో పాటుగా సర్వాంగసన, ధనురాసన, పశ్చిమోత్తమాసన, సరళ హస్త భుజంగాసన, త్రికోణాసన, వీరాసన, అర్ధ మత్య్సేంద్రాసనాలు మంచి ఫలితాలనిస్తాయి.

 


నడుం దగ్గర చేరిన కొవ్వు తగ్గటానికి:

:
ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే నడుం దగ్గర కొవ్వు చేరటం సహజం. దీన్ని తగ్గించుకోవటానికి త్రికోణాసనం, పాదమస్తాసనం (తొడల్లో చేరిన కొవ్వు తగ్గటానికి ఉపయోగపడుతుంది), గోముఖాసనం, వృక్షాసనం ఫలితాలనిస్తాయి.

చక్కెర వ్యాధిగ్రస్తులకు :

నగరంలో షుగర్‌ పేషంట్లు ఎక్కువే ఉన్నారు. చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంచుకోవటానికి వక్రాసనం, అర్ధమశ్చేంద్రాసనం మంచిది.

 

ఏకాగ్రత కోసం :

టెన్షన్స్‌తో ఏకాగ్రత కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు చతుష్కోణాసనం, వృక్షాసనం మంచివి. ఇవి కాక సేతు బంధాసనం (బ్యాక్‌ పెయిన్‌/నెక్‌ పెయిన్‌ కోసం), పవన ముక్తాసనం (గ్యాస్ర్టిక్‌ సమస్యలకు), సర్వాంగాసనం (షోల్డర్‌ పెయిన్‌కి) మంచివి.

 

వాకింగ్‌ తర్వాత యోగానే..!

ఇండియాలో ఫిట్‌నెస్‌ కోసం ఎక్కువ మంది అనుసరిస్తున్న మార్గం వాకింగ్‌. ప్రతి రోజూ ఉదయం కనీసం అరగంట నడిస్తే చాలు అనారోగ్యం దరిచేరదని డాక్టర్లు చెప్పిన మాటలు బాగా ఒంటబట్టాయి. అందుకే ఉదయం లేచి కనీసం అరగంట నడవడానికే ఓటేస్తున్నారు. ఆ తర్వాత ఫిట్‌నెస్‌ కోసం ఎక్కువ మంది అనుసరిస్తున్న మార్గం యోగా. వాక్‌ ఫర్‌ హెల్త్‌ సర్వే 2016 అంటూ మాక్స్‌ బూపా సంస్థ చేసిన అధ్యయనం లో ఇదే విషయం వెల్లడైంది. యోగా తరువాత రన్నింగ్‌, సైక్లింగ్‌ ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగంలోనిఉద్యోగులు మొబైల్‌ హెల్త్‌ యాప్‌ల ద్వారా తాము ఖర్చుచేసిన కేలరీలను లెక్కగట్టాలనుకుంటున్నారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.97
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు