హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / గుండె కవాటాల వ్యాధి
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

గుండె కవాటాల వ్యాధి

గుండె కవాటాల వ్యాధి

పరిచయం

మానవ శరీరం లో గుండె గుప్పెడoతే! కాని మనిషి మాతృ గర్భం లో ఉన్నప్పటి నుండి చనిపోయేoత వరకు అవిశ్రాంతం గా పనిచేస్తుంది. శిశువు, తల్లి గర్భం లో రూపు సంతరించుకుంటున్న 21 వ రోజు నుండే గుండె పని చేయడం ప్రారంభిస్తుంది. దీని కండరాలు శరీరంలోని అన్ని కండరాలకంటే కూడా ఎంతో బలమైనవి. గుండె నిమిషానికి 72 సార్లు చొప్పున రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది. వ్యాయామం చేసినప్పుడు, ఉద్వేగానికి లోనైనప్పుడు మాత్రం ఇది రెట్టింపు అవుతుoది.
ప్రాణవాయువైన ఆక్సిజన్ ను, పోషకాలు కలిగిన శుద్ధమైన రక్తాన్ని ధమనులు గుండె ఎడమ వైపునుండిశరీరం లోని అన్నీ భాగాలకు సరఫరా చేస్తాయి. అలాగే సిరలు, అవయవాలలోని వ్యర్థ పదార్థాలను రక్తం ద్వారా మోసుకొని కుడివైపున ఉండే గుండె గదులకు తీసుకొని వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియనే రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఈ వ్యవస్థలో లోపం ఏర్పడినప్పుడు వచ్చే వ్యాధులనే గుండె, రక్త నాళాల వ్యాధులు, ఇంగ్లీషు లో కార్డియో వాస్క్యులార్ వ్యాధులు అంటారు. మనుష్యులలో సాధారణంగా నాలుగు రకాల కార్డియో వాస్క్యులార్ వ్యాధులు వస్తుంటాయి. వీటిలొ గుండె కవాటాల వ్యాధి ఒకటి.

గుండె కవాటాల వ్యాధి (Mitral valve prolapse -MVP)

గుండెలో ఎడుమ జఠరిక నుంచి ఎడమ కర్ణికలోకి రక్తం వెనక్కు రాకుండా అడ్డుకునే హృదయ కవటాన్ని మిట్రాల్ కవాటంగా గుర్తిస్తారు. దీనిలో రెండు రెక్కలు ఉంటాయి, ఒకటి ముందువైపుకు మరియు మరొకటి వెనుకవైపుకు పని చేస్తాయి ఎడమ జఠరిక సంకోచించినప్పుడు ఇవి మూసుకుపోతాయి. హృదయ సంకోచం సమయంలో అసాధారణ స్థాయిలో మందంగా మారిన మిట్రాల్ కవాట (ద్విపత్ర కవాట) రెక్క ఎడమ కర్ణికలోకి స్థానభ్రంశం చెందటాన్ని ద్విపత్ర కవాట భ్రంశంగా పరిగణిస్తారు.
ప్రతి రెక్కలో మూడు కణజాల పొరలు ఉంటాయి అవి ఆర్టియాలిస్ , ఫైబ్రోసా, మరియు స్పాన్‌జియోసా ప్రామాణిక ద్విపత్ర కవాట భ్రంశంతో బాధపడుతున్న రోగుల్లో అదనపు సంధాయక కణజాలం ఉంటుంది, ఇది స్పాన్‌జియోసాను మందంగా తయారు చేయడంతోపాటు, ఫైబ్రోసాలో కొల్లాజెన్ కట్టలను వేరు చేస్తుంది. ఒక గ్లైకోసామినోగ్లైకాన్ అయిన డెర్మటాన్ సల్ఫేట్ అధికంగా చేరడం వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది. రెక్కలను మరియు పక్కన ఉన్న కణజాలాన్ని ఈ పరిస్థితి బలహీనపరుస్తుంది, తత్ఫలితంగా రెక్క విస్తీర్ణం పెరుగుతుంది మరియు చోర్డీ టెండినీ సాగుతుంది. చోర్డే టెండినీ సాగడం తరచుగా చిట్లడానికి దారితీస్తుంది, సాధారణ పరిస్థితుల్లో చోర్డీ వెనుక రెక్కకు జతగా ఉంటుంది. వృద్ధి చెందిన గాయాలు-సాధారణంగా వెనుకవైపు రెక్కకు సంబంధించిన గాయాలు-రెక్క ముడుచుకుపోవడానికి, తిరగబడటానికి మరియు ఎడమ కర్ణికవైపు భ్రంశానికి కారణమవతాయి. గుండె దడ కూడా గుండె కవాటాల వ్యాధికి కారణo.

లక్షణాలు

గుండె కవాటాల వ్యాధితో బాధపడుతున్న కొందరు రోగుల్లో గుండె దడ, కర్ణిక దడ లేదా మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందిలో పాక్షిక ఛాతీ నొప్పి మరియు శ్వాసతీసుకోవడంలో కొద్దిగా సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఈ లక్షణాలకు ప్రత్యక్షంగా దిపత్ర కవాట భ్రంశం కారణం కాదు, అయితే మిట్రాల్ కవాటం నుంచి రక్తం నెట్టివేయబయటం వలన ఈ పరిస్థితి ఏర్పడతుంది, ఈ పరిస్థితి తరచుగా భ్రంశం వలన సంభవిస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు గాభరా మరియు భయానక దాడి లోపాలకు మిట్రాల్ కవాట భ్రంశంతో సంబంధం ఉందని సూచించింది. ద్విధ్రువ లోపం మరియు మిట్రాల్ కవాట భ్రంశం మధ్య ఒక సహసంబంధాన్ని గుర్తించారు.

నివారణ చర్యలు

 • రోజు కాసేపు నడుస్తుంటే గుండె ఆరోగ్యoగా పనిచేస్తుందని నిపుణులు చెబుతుంటారు. కేవలం నడవడం మాత్రమే కాదు. ఆహరంలో చేసుకునే చిన్న చిన్న మార్పులు కూడా గుండెను ఆరోగ్యముగా ఉంచేందుకు తోడ్పడతాయి.
 • గుర్తుతెలియని కారణాలతో, MVP రోగులు తక్కువ శరీర ద్రవ్యరాశి సూచి (BMI) కలిగివుంటున్నారు, MVP లేని వ్యక్తుల కంటే వీరు సన్నగా ఉంటారు.
 • రోజుకో అరటిపండు తినడం వల్ల ఒక్కసారిగా దాడిచేసే ఆకస్మిక గుండె నెప్పులనుంచి 40 శాతం రక్షణ పొందువచ్చుట దీనికి కారణం అరటిపండులో సమృద్దిగా ఉండే పొటాషియం బి.పి ని అదుపు లోవుంచి రక్త పోటు రాకుండా కాపాడుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
 • క్యారెట్లోని కెరోటినాయిడ్లకు గుండె జబ్బులు నివారించే శక్తి ఉంటుంది. రోజుకు 5 పచ్చిక్యారెట్లను తినాలని, ఇలా తినటం వల్ల గుండె జబ్బులను 68 శాతం నియంత్రిచవచ్చునని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
 • అలాగే ఎక్కువ శాతం గుండె జబ్బులకు రక్తం గడ్డ కట్టడమే ముఖ్య కారణంగా వుంటుంది - అందుకు " బ్లాక్ టీ " చక్కటిపరిష్కారమ ని చెప్తున్నారు. రోజుకి రెండు కప్పుల బ్లాకు టీ 60శాతం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాని దీనిలో నిమ్మరసం, చక్కర, పాలు వాడకూడదు. అలాగే మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది. ఏక కాలంలో ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్ర పోవడం చాలా మంచిది.
 • వై ద్యుల సూచనలు మేరకు గుండె జబ్బు ఉన్న వాళ్ళు రోజు 200 గ్రా. పండ్లు తీసుకోవాలి. మధుమేహం అదుపులో ఉన్న వాళ్ళు 100 గ్రా. పండ్లు తీసుకోవాలి. మధుమేహం ఎక్కువగా ఉన్న వాళ్ళు పండ్లను తీసుకోవడం మంచిది కాదు.
 • క్రొవ్వు, రక్త పోటులను తగ్గించే మందులు రోజు వాడాలి.
 • రోజు 300గ్రా. కూరగాయలను తీసుకోవాలి
 • 5 గ్రా. ల కంటే ఎక్కువ ఉప్పును రోజు వాడటం మంచిది కాదు.
 • ఎక్కువ ఫైబర్ కలిగిన అల్పాహారం తీసుకోవాలి.రోజు 30- 40 గ్రా పీచు తీసుకోవడం మంచిది.
 • నూనెలను చాలా తక్కువగా వాడాలి. సోయా నూనె, ఆవ నూనె, ప్రొద్దుతిరుగుడు నూనె లను కలిపి వాడితే శరీరం లో క్రొవ్వునిల్వలు తగ్గుతాయి.
 • నెయ్యి, వెన్న లాంటి పదార్థాలు వాడకూడదు.
ఆధారం:
 1. డాక్టర్.కె.అపర్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆహారం & పోషణ విభాగం
 2. కుమారి కె.యోగిత, విద్యార్ధి ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/107.
3.01136363636
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు