హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / గుండె మంట, కడుపు మంటకు ఈ పదితో చెక్ పెట్టండి....
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గుండె మంట, కడుపు మంటకు ఈ పదితో చెక్ పెట్టండి....

గుండె మంట, కడుపు మంటకు ఈ పదితో చెక్ పెట్టండి....

అనారోగ్య సమస్యలతో బాధపడేవారిలో ఎక్కువ మంది ఏదో ఒక దశలో ఎసిడిటీతో బాధపడుతుంటారు. ఈ సమస్యకు వయసుతో సంబంధం లేదు. చిన్నాపెద్దా అందరినీ ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు పది సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుని పాటిస్తే కడుపులో మంట ఉండదని వారు చెబుతున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి.


1. కొబ్బరి బోండా నీళ్లు తాగడం: కొబ్బరి నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జీర్ణ క్రియ సజావుగా జరగడానికి ఇది ఎంతగానో సహకరిస్తున్నాయని చెప్పారు.

 

2. గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగడం: సహజంగా చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే డాక్టర్లు ఈ అలవాటును మానుకోమని చెప్పట్లేదు కానీ గ్రీన్ టీ తాగమని సూచిస్తున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.

 

3. పాలు తాగడం: పాలంటే చాలామందికి ఎలర్జీ. పాల గ్లాసు చూస్తేనే దూరం జరిగే వాళ్లు చాలామంది ఉంటారు. అయితే రోజుకు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా వంటబడుతుందని తేలింది. అంతేకాదు, పాలల్లో ఉండే పోషకాల వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగిపోతుందట.

 

4. స్మోకింగ్ అలవాటు ఉంటే మానుకోండి: స్మోక్ చేయడం వల్ల ఊపిరితిత్తులు పాడవడమే కాదు తిన్న తిండి కూడా వంటబట్టదట. దీనివల్ల ఎసిడిటీ సమస్య మరింత పెరిగిపోతుందట. స్మోకింగ్ అలవాటును ఎంత త్వరగా మానుకుంటే అంత తొందరగా ఎసిడిటీకి దూరం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.

 

5. తినే ఆహారంలో కారం తగ్గించండి: మనం తినే ఆహారంలో కారం పరిమాణం తక్కువగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొంతమందికి ఇంట్లో పంచభక్ష పరవాణ్ణాలున్నా పచ్చడి వేసుకోనిదే ముద్ద దిగదు. అలాంటి వారు ఈ అలవాటు మానుకుంటే మంచింది. లేదంటే భవిష్యత్‌లో ఎసిడిటీతో బాధపడక తప్పదు.

6. తక్కువగా తినాలి.. కానీ క్రమం తప్పకూడదు: కొంతమంది పని ఒత్తిడిలో పడి సకాలంలో తినరు. దీనివల్ల భవిష్యత్‌లో కచ్చితంగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది మాత్రం ఏ పనీ లేనట్టు అదే పనిగా తింటుంటారు. ఇది కూడా ఎసిడిటీకి దారి తీస్తుందని తెలిసింది. మితంగా తినాలి... కానీ సకాలంలో తినాలి... అనే సూత్రాన్ని పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

7. పుదీనాను ఉడికించి, ఆ నీళ్లు తాగాలి: ఈ రోజుల్లో చాలామందికి సహజ సిద్ధమైన ప్రకృతి వనరుల గురించి తెలియదు. పుదీనా ఆకులతో మరిగించిన నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి జీర్ణాశయంలోకి చేరి చల్లబరుస్తాయి.

 

8. గుండెల్లో మంటగా అనిపిస్తే లవంగం దినుసును చప్పరిస్తే ఆ బాధ నుంచి విముక్తి పొందొచ్చు. ఇది జీర్ణ సంబంధ వ్యాధుల బారి నుంచి కూడా కాపాడుతుంది.

 

9. మునగకాయలు, బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజీ, క్యారెట్, నీరుల్లి లాంటివి తింటే ఎసిడిటీ రాకుండా అడ్డుకోవచ్చు.

 

10. నిద్రకు ఉపక్రమించే కనీసం రెండు మూడు గంటల ముందు తినడం మంచిది.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి
2.95454545455
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు