హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / గుండె,రక్త నాళాల వ్యాధులు–నివారణోపాయాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గుండె,రక్త నాళాల వ్యాధులు–నివారణోపాయాలు

గుండె,రక్త నాళాల వ్యాధులు–నివారణోపాయాలు

పరిచయం

మానవ శరీరం లో గుండె గుప్పెడంతే! కాని మనిషి మాతృగర్భం లో ఉన్నప్పటి నుండి చనిపోయేoత వరకు అవిశ్రాంతం గా పనిచేస్తుంది. శిశువు, తల్లి గర్భం లో రూపు సంతరించుకుంటున్న 21 వ రోజు నుండే గుండె పని చేయడం ప్రారంభిస్తుంది. దీని కండరాలు శరీరంలోని అన్ని కండరాలకంటే కూడా ఎంతో బలమైనవి. గుండె నిమిషానికి 72 సార్లు చొప్పున రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది. వ్యాయామం చేసినప్పుడు, ఉద్వేగానికి లోనైనప్పుడు మాత్రం ఇది రెట్టింపు అవుతుoది.

ప్రాణవాయువైన ఆక్సిజన్ ను, పోషకాలు కలిగిన శుద్ధమైన రక్తాన్ని ధమనులు గుండె ఎడమ వైపునుండిశరీరం లోని  అన్నీ భాగాలకు సరఫరా చేస్తాయి. అలాగే సిరలు, అవయవాలలోని వ్యర్థ పదార్థాలను రక్తం ద్వారా మోసుకొని కుడివైపున ఉండే గుండె గదులకు తీసుకొని వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియనే రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఈ వ్యవస్థలో లోపం ఏర్పడినప్పుడు వచ్చే వ్యాధులనే గుండె, రక్త నాళాల వ్యాధులు, ఇంగ్లీషు లో కార్డియో వాస్క్యులార్ వ్యాధులు అంటారు. మనుష్యులలో సాధారణంగా నాలుగు రకాల కార్డియో వాస్క్యులార్ వ్యాధులు వస్తుంటాయి.
గుండె స్తంభన
గుండె రక్త నాళాలలో లోపాలు
గుండె పోటు

గుండె కవాటాల వ్యాధి

మన దేశంలొ 1/4 వ వంతు మరణాలు గుండె రక్త ప్రసరణ వ్యాధుల వలన సంబవిస్తున్నాయని  ఒక అంచనా. గుండె రక్త ప్రసరణ వ్యాధులు  25-69 సంవత్సరాల వయస్సు వారిలొ  అధికంగా ఉంటున్నాయని గుర్తించబడింది. ప్రతి ఏట ఇవి పెరగటం చాలా ఆందొళనను కలిగించె విషయం. జన్యు పరమైన అంశాలు కొంతవరకు  కారణం కాగా ఆహార,వ్యాయామ నిబద్దతను పాటించకపొవటం మరికొంత కారణం .ఈ వ్యాధులు ఉన్నప్పుడు రక్త ప్రసరణ, శ్వాస,జీర్ణ వ్యవస్థలలొ కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి అవే ముఖ్య సంకేతాలు కాబట్టి  20 సంవత్సరాల వయస్సు పైబడినప్పటినుంచి  వైద్య పరీక్షలు చేయించుకుని, తగిన మందులు, ఆహార వ్యాయామ జాగ్రత్తలు పాటించటం ద్వారా ఈ వ్యాధులను నివారించవచ్చు.

ఆధారం:

  1. డాక్టర్.కె.అపర్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆహారం & పోషణ విభాగం
  2. కుమారి కె.యోగిత, విద్యార్ధి ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/107.
2.94623655914
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు