పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

గుండె స్తంభన

గుండె స్తంభన

పరిచయం

మానవ శరీరం లో గుండె గుప్పెడoతే! కాని మనిషి మాతృ గర్భం లో ఉన్నప్పటి నుండి చనిపోయేoత వరకు అవిశ్రాంతం గా పనిచేస్తుంది. శిశువు, తల్లి గర్భం లో రూపు సంతరించుకుంటున్న 21 వ రోజు నుండే గుండె పని చేయడం ప్రారంభిస్తుంది. దీని కండరాలు శరీరంలోని అన్ని కండరాలకంటే కూడా ఎంతో బలమైనవి. గుండె నిమిషానికి 72 సార్లు చొప్పున రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది. వ్యాయామం చేసినప్పుడు, ఉద్వేగానికి లోనైనప్పుడు మాత్రం ఇది రెట్టింపు అవుతుoది.

ప్రాణవాయువైన ఆక్సిజన్ ను, పోషకాలు కలిగిన శుద్ధమైన రక్తాన్ని ధమనులు గుండె ఎడమ వైపునుండిశరీరం లోని అన్నీ భాగాలకు సరఫరా చేస్తాయి. అలాగే సిరలు, అవయవాలలోని వ్యర్థ పదార్థాలను రక్తం ద్వారా మోసుకొని కుడివైపున ఉండే గుండె గదులకు తీసుకొని వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియనే రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఈ వ్యవస్థలో లోపం ఏర్పడినప్పుడు వచ్చే వ్యాధులనే గుండె, రక్త నాళాల వ్యాధులు, ఇంగ్లీషు లో కార్డియో వాస్క్యులార్ వ్యాధులు అంటారు. వీటిలొ గుండె స్తంభన ఒకటి.

గుండె స్తంభన

గుండె స్తంభన అంటే హృదయంలోని శ్వాసప్రక్రియ హఠాత్తుగా స్తంభించిపోవడం. నాడి కొట్టుకోవడం, ఆగిపోవటo ద్వారా ఈ స్థితిని గుర్తించవచ్చు దగ్గు, శ్వాసపీల్చడం కష్టమవడం, రంగు మారడం, నరాలు ఉన్నట్లుండి లాగడం, వణకడం వంటి లక్షణాలను చూడవచ్చు. తక్షణ చికిత్స ద్వారా గుండె స్తంభన ను సాధారణంగా అధిగమించవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఈ పరిణామం తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించవచ్చు. ఎలాంటి చికిత్స చేయకపోతే మరణానికి దారి తీయవచ్చు.

కారణాలు

 • గుండె సంబంధిత వ్యాధులే హఠాత్తు గుండె స్ధంభనకు ప్రధాన కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో గుండె సంబంధేతర పరిస్థితులు కూడా ప్రమాదకరంగా మారొచ్చు.
 • రక్తంలో ప్లాస్మాశాతం తగ్గడం , చక్కెర శాతం తక్కువ లేదా ఎక్కువగా ఉoడడం, రక్తం గడ్డకట్టడం వలన కలిగే వ్యాధి కలగవచ్చు.
 • గుండెపోటు, గుండె సంబంధ ఒత్తిడి - గుండె చుట్టూ ద్రవం చేరడం
 • ఊపిరితి తిత్తులు పాడైపోవడం, ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కట్టడం, గాయాలు కావడం.
 • కణజాలానికి ప్రాణవాయువు పంపిణీ తక్కువగా వుండటo
 • శరీరంలో అసాధారణ ఆమ్లధర్మం లేదా అసిడిటి కలిగివుండటo,
 • మాత్రలు లేదా విష పదార్థాలు, పొటాషియo ఎక్కువవడం లేదా తగినంత లేకపోవడం, శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం.

నివారణ చర్యలు

 1. రక్తప్రసరణ లో లోపం వల్ల వచ్చే హృద్రోగం గుండె స్తంభనకు ప్రధాన కారణమైతే, పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ధూమపానం నిలిపివేయడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు. రక్తపోటు నియంత్రణ, కొవ్వు తగ్గించుకోవడం తో పాటు ఇతర వైద్య చికిత్సలు చేయించుకోవాలి.
 2. కార్డియో పల్మనరి రేసుసిటేషన్ (Cardio Pulmonary Resuscitation): అంటే గుండె స్తంభించిన వ్యక్తి కి నోటి ద్వారా శ్వాస ను అందించి గుండె పై బాహ్య ఒత్తిడిని అందిoచడం.తద్వారా ఆ వ్యక్తి తిరిగి మామూలు స్థితికి చేరుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడం మంచిది. కాని పునఃశ్వాస చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. లేదా నిపుణులు మాత్రమే చేయాలి.
 3. డి ఫైబ్రిలేషన్ చేయడం (తoతువికoపనo) : డి ఫైబ్రిలేటర్ పరికరాన్ని ఉపయోగించి గుండెను ఎలక్ట్రిక్ షాక్ కి గురి చేస్తారు. అప్పుడు గుండె తిరిగి పనిచేయడం ఆరంభిస్తుంది.
 4. రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్( ROSC): గుండె ఆగిపోయిన తర్వాత స్పృహ తిరిగి రాకుండా ఉంటే శరీరం లో అల్ప ఉష్ణాన్ని సృష్టించడం ద్వారా రోగిని ప్రశాంత పరిస్తే ఫలితాలు మెరుగవుతాయి. కానీ ఇది అరుదుగా చేసే ప్రక్రియ.
ఆధారం:
 1. డాక్టర్.కె.అపర్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆహారం & పోషణ విభాగం
 2. కుమారి కె.యోగిత, విద్యార్ధి ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/107.

 

3.0206185567
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు