অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గుండెపోటు

పరిచయం

మానవ శరీరం లో గుండె గుప్పెడoతే! కాని మనిషి  మాతృ గర్భం లో ఉన్నప్పటి నుండి చనిపోయేoత వరకు అవిశ్రాంతం గా పనిచేస్తుంది. శిశువు, తల్లి గర్భం లో రూపు సంతరించుకుంటున్న 21 వ రోజు నుండే గుండె పని చేయడం ప్రారంభిస్తుంది. దీని కండరాలు శరీరంలోని అన్ని కండరాలకంటే కూడా ఎంతో బలమైనవి. గుండె నిమిషానికి 72 సార్లు చొప్పున రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది. వ్యాయామం చేసినప్పుడు, ఉద్వేగానికి లోనైనప్పుడు మాత్రం ఇది రెట్టింపు అవుతుoది

ప్రాణవాయువైన ఆక్సిజన్ ను, పోషకాలు కలిగిన శుద్ధమైన రక్తాన్ని ధమనులు గుండె ఎడమ వైపునుండిశరీరం లోని  అన్నీ భాగాలకు సరఫరా చేస్తాయి. అలాగే సిరలు, అవయవాలలోని వ్యర్థ పదార్థాలను రక్తం ద్వారా మోసుకొని కుడివైపున ఉండే గుండె గదులకు తీసుకొని వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియనే రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఈ వ్యవస్థలో లోపం ఏర్పడినప్పుడు వచ్చే వ్యాధులనే గుండె, రక్త నాళాల వ్యాధులు, ఇంగ్లీషు లో కార్డియో వాస్క్యులార్ వ్యాధులు అంటారు. వీటిలొ గుండెపొటు ఒకటి.

గుండె పోటు అంటే గుండె కండరాలకు  రక్తం సరఫరా కాకపోవడం. ఆక్సిజన్ అందక పోవడo వలన గుండె పనిచేయడం ఆగిపోతుంది.

లక్షణాలు

 • ఛాతి లో నొప్పి,
 • కుడి చేయి పై  భాగం లేదా రెండు చేతులలో, నడుము, మెడ, దవడలో నొప్పి.
 • పొట్ట పై భాగం లో అసౌకర్యం
 • శ్వాస  తీసుకోవడంలో  కష్టం

కొన్ని ఇతర లక్షణాలు:

 • బాగా చెమట పోసి ఒళ్ళు చల్ల బడటం
 • అలసిపోయినట్లుగా ఉండటం
 • వికారంగా ఉండటం, వాంతులవడం
 • తల తిరిగినట్లుగా ఉండటం
 • నీరసంగా  ఉంటుండడం
 • గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగాను, గుండెలో నొప్పి, పట్టేసినట్లు ఉండడం జరుగుతుంది. ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాన్ని బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టి చేస్తారు. రెoడవసారి బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయమే ఇఇసిపి.

నివారణ చర్యలు

 • గుండెపోటు వచ్చిన సందర్భాల్లో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం (ఈష్మిక్‌ స్ట్రోక్‌) ఎక్కువ. చేపలు తినేవారిలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది. చేపల నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికమొత్తంలో లభిస్తాయి. గుండె జబ్బులు, ఆర్థరైటిస్‌, డిప్రెషన్‌, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించడంలో ఈ ఒమేగా-3 కీలక పాత్ర పోషిస్తుంది. వారానికొక్కసారైనా చేపలు తినాలి.
 • వారంలో అయిదు రోజులు 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి, నడవాలి.
 • మానసిక ఒత్తిడితో కూడా కరొనరి హార్ట్ డిసీజ్, రావచ్చు.  టైప్-ఎ పర్సనాలిటీ లో మానసిక ఒత్తిడి పోటీతత్వం ఎక్కువ. గలవారికి కరొనరి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువ. వాళ్ళు అనుకున్న పని పూర్తికాకపోతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు. యోగ, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడికి గురయ్యే వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు.
 • గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు మొదలైన చిరుదాన్యాలలో కరిగే రకం పీచు ఎక్కువగా ఉంటుంది. వీటి నన్నిటినీ  పొట్టుతో పాటు కలిపి పిండి పట్టించుకు వాడటం  చాలా మంచిది. మిగతా ధాన్యాలతో పోలిస్తే ఓట్స్‌లో పీచు ఎక్కువగా ఉంటుంది. దీనితో జావ, ఉప్మా ఇలా రకరకాలుగా చేసుకుని తినటం మంచిది
 • పండ్లలో ప్రధానంగా తోలు, గింజలు ద్వారా పీచు అధికంగా లభిస్తుంది. పైకి పీచు పెద్దగా కనిపించదుగానీ బొప్పాయి, జామ  వంటి పండ్లలో పెక్టిన్‌ రూపంలో పీచు ఎక్కువగా ఉంటుంది. పండ్ల రసాల కంటే కూడా దోరగా ముగ్గిన బొప్పాయి, జామ, చెక్కు తీయని ఆపిల్‌ ఎక్కువగా తినాలి.
 • నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్‌ ఏ, బి 6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతో పాటు ఫోలేట్‌ పొటాషియమ్‌, ఫైబర్‌ ఎక్కువ. పొటాషియమ్‌ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది.
 • బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌ బెర్రీ, స్ట్రాబెర్రీ  పండ్లలో ఉండే విటమిన్‌ సి, ఫోలేట్‌, ఫైబర్‌ అన్నీ శరీర ఆరోగ్యానికి దోహద పడతాయి. ఇంకా ఇందులో మ్యాంగనీస్‌, పొటాషియమ్‌ గుండెను కాపాడటంలో ఎంతో కీలక పాత్ర వహిస్తాయి.
 • శరీరంలోని చెడు (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ను తగ్గించే సుగుణం ద్రాక్షలో ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలను చాలా వరకు నివారించవచ్చు. లినోలిక్‌ ఆసిడ్‌, ప్లేవనాయిడ్స్‌, ఫినోలిక్‌ ఆలిగోమెరిక్‌ ప్రో యాంథో సయానిడిన్స్‌, వంటివి ద్రాక్షగింజల్లో ఉండే పోషకాల్లో ప్రధానమైనవి. ఇవి హై కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటును అదుపులో ఉంచి, గుండెజబ్బులను వారించడంలో ఎంతగానో ఉపయోగపడుతాయి. మధుమేహం ఉన్న వాళ్ళువీటిని తక్కువగా తినాలి.
 • పప్పుల్లో ముడి శెనగలు, పెసలు, మినుములు, అలసందలు, బఠాణీలు మొదలైన వాటిలోనూ పీచు ఎక్కువగా ఉంటుంది. ముగా మినుములు, కందులు,శెనగలు, పప్పుల్లో కరిగే రకం పీచు ఎక్కువ. సాధ్యమైనంతవరకూ వీటిని పొట్టుతోనే వాడుకోవటం ఉత్తమం. గారెల వంటివి కూడా పొట్టుతో సహా రుబ్బుకొని వేసుకోవటం మంచిది. కరగని రకం పీచు ఎక్కువ ఉండే శెనగల మొలకలు తినటం కూడా మంచిది.
 • పప్పుల్లో ముడి శెనగలు, పెసలు, మినుములు, అలసందలు, బఠాణీలు మొదలైన వాటిలోనూ పీచు ఎక్కువగా ఉంటుంది. ముగా మినుములు, కందులు,శెనగలు, పప్పుల్లో కరిగే రకం పీచు ఎక్కువ. సాధ్యమైనంతవరకూ వీటిని పొట్టుతోనే వాడుకోవటం ఉత్తమం. గారెల వంటివి కూడా పొట్టుతో సహా రుబ్బుకొని వేసుకోవటం మంచిది. కరగని రకం పీచు ఎక్కువ ఉండే శెనగల మొలకలు తినటం కూడా మంచిది.
 • ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. అందువలన  కొవ్వు శాతాన్ని నియంత్రించే వీలు కలుగుతుంది.
 • కివీ పoడ్లు గుండెకు మేలు చేస్తాయి. ఇందులోని యాంటి  ఆక్సిడెంట్ లు  శరీరాన్ని దీర్ఘకాలంపాటు యవ్వనంగా  ఉంచుతుంది. ఆక్సి డేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుంది.
 • పీచు పoడ్లలో విటమిన్‌ సి, ఇ, మరియు కె, ఫైబర్‌, పొటాషియం అధికంగా, కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా  ఉండుట వలన గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
 • గుండె చుట్టూ కొవ్వు చేరకుండా నివారించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. అందుకే రోజు అర టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడిని తప్పనిసరిగా తీసుకోవాలి. దీన్ని ఇష్టపడని వారు ఆహరంలో వెల్లుల్లి చేర్చుకుంటే సరిపోతుంది
 • యాపిల్ ను ఆహరంలో ఓ భాగంగా చేసుకోవాలి. ఈ పండులో లభిoచే పొటాషియo , ఫాస్ఫరస్ చాలా మేలు చేస్తుంది.
 • అధిక  క్రొవ్వు తగ్గించడంలో ఉల్లిపాయలు మంచి మందులా పనిచేస్తాయి,  అందుకే ఉల్లిపాయలు రోజువారీ ఆహారంలో ఉండేలా చూడాలి.
 • మొనోసేచురేటెడ్ ప్యాట్ ఆధారిత ఆలివ్ నూనె  గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ ను సులువుగా తగ్గిస్తుంది. అందుకే సలాడ్ లో ఆలివ్ నూనె తప్పనిసరిగా వేయాలి.
 • గుండె ఆరోగ్యానికి మేలుచేసే మరో పండు బొప్పాయి. రోజు పరగడుపున చిన్న బొప్పాయి ముక్క  తినడం వలనఎంతో మార్పూ కనిపిస్తింది.
 • రోజులో ఏదో ఓ సమయంలో అరటిపండు తినడం అలవాటు చేసుకూవాలి. అరటిలోని సేరోతోటోనిన్ అనే పదార్దం మానసిక వ్యాకులతను దూరంచేస్తుంది. ఫలితంగా  గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు.
 • ఓవరటైం చేసే ఉద్యోగులకు మానసికఒత్తిడి ఎక్కువ. ఇలా పని చేసేవారికి నవ్వ కలిగే శక్తికోల్పోయి గుండె జబ్బులు సోకేఅవకాశం ఎక్కువ అని పరిశోధనలో చూపించారు. నవ్వు రక్తంలో కార్టిసాల్ అనే హార్మోన్ తగ్గిస్తుంది.దీని వల్ల మధుమేహం, గుండెపోటు వంటి వ్యాధులు సోకేఅవకాశం తక్కువ. ఒక సారి కేవలం పదిహేను క్షణాలు  నవ్వితేమనిషి జీవన పరిమాణం రెండురోజులు పెరుగుతుంది. హాస్య స్పూర్తి ఉండేవారు మిగతా వారికంటే ఎనిమిదిసంవత్సరాలు ఎక్కువ బతుకుతారు.
 • పచ్చగా ఉండే కూరగాయలన్నింటిలోనూ సెల్యూలోజ్‌ రూపంలో పీచు ఉంటుంది. ప్రతి కూరగాయ చెక్కుల్లోనూ, గింజల్లోనూ పీచు ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ కాయగూరలకు చెక్కులు తీయకుండా వాడటం అవసరం. ఉదాహరణకు సొరకాయ, గుమ్మడి వంటివాటికి చాలామంది చెక్కులోనూ, బెండ గింజలు, దొండ గింజలు, కాకర గింజల లోనూ పీచు ఎక్కువగా ఉంటుంది.
 • ఆకుకూరల్లో మొత్తం పీచు ఎక్కువ, ముఖ్యంగా కరిగే పీచు ఎక్కువే. ముఖ్యంగా కరివేపాకు, చింతచిగురు, మునగాకు, పొన్నగంటి కూర, పుదీనా, చేమాకులలోకరిగే పీచు ఎక్కువ. కాబట్టి వీటిని సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. కరివేపాకు పొడి రకరకాల పదార్ధాలతో కలిపి వండుకోవచ్చు.
 • క్యారెట్లు, చిలగడదుంపలు, కంద, బీట్‌రూట్‌, ముల్లంగి వీటన్నింటిలో పీచు ఎక్కువే ఉంటుంది. చాలామంది చిలకడ దుంపల్లో పిండిపదార్దమే ఎక్కువ అను కుంటారుగానీ దాంతోపాటు పీచు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

చిరుదాన్యాలలో ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇవి రక్త శాతాన్ని పెంచి, రక్త పీడనాన్ని అదుపులో ఉంచుతాయి.

ఆధారం:
డాక్టర్.కె.అపర్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆహారం & పోషణ విభాగం
కుమారి కె.యోగిత, విద్యార్ధి ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/107.


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate