హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / చలికాలంలో జాగ్రత్త
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చలికాలంలో జాగ్రత్త

గర్భిణీలు చలికాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అందులోనూ దక్షిణ భారతంలో కూడా ఇటీవల చలి పులి బాగా భయపెడుతోంది. చిన్నా పెద్దలతో పాటు గర్భిణీలు కూడా ఈ కాలంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. .....

గర్భిణీలు చలికాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అందులోనూ దక్షిణ భారతంలో కూడా ఇటీవల చలి పులి బాగా భయపెడుతోంది. చిన్నా పెద్దలతో పాటు గర్భిణీలు కూడా ఈ కాలంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఎండను భరించలేనట్లే చలిని కూడా భరించలేరు. అందుకే చలికాలంలో గర్భిణీలు కొన్ని టిప్స్‌ను పాటిస్తే కడుపులోని బిడ్డ క్షేమంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇన్ఫెక్షన్లు, డ్రైనెస్‌, దురద వంటి వాటి బారిన పడరు. ఆ టిప్స్‌....
ఠి వేసవి కాలంలోనే కాదు చలికాలంలో కూడా నీళ్లు బాగా తాగాలి. అలా తాగకపోతే గర్భిణీలు డీహైడ్రేషన్‌ బారిన పడతారు. చలి గాలి వీరి శరీరాన్ని పొడారిపోయేట్టు చేస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
ఫ్లూయిడ్స్‌ను శరీరం వేగంగా కోల్పోయేకొద్దీ డీహైడ్రేషన్‌ సమస్య ఎదురవుతుంది. గర్భిణిగా ఉన్నప్పుడు డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తకూడదు. అలా తలెత్తితే రిస్కే. ఇది కడుపులోని బిడ్డపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గర్భిణి శరీరంలోని నీరు ప్లెసెంటా ఏర్పడడానికి సహకరిస్తుంది. ఆ నీటి నుంచే కడుపులోని బిడ్డకు కావాల్సిన పోషకాలు అందుతాయి. అందుకే నీళ్లు బాగా తాగాలి.
ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే చలికాలంలో ఫ్లూ, జలుబు, ముక్కుకార డం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని నిరోధించడానికి సాధారణ పేషంట్లకు మల్లే గర్భిణీలు యాంటి ఎలర్జీ పిల్స్‌ వాడకూడదు. జలుబు, ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండాలంటే గర్భిణీల చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు అపరిశుభ్రంగా ఉంటే నోట్లోకి, ముక్కుల్లోకి సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. దాంతో జ్వరం, జలుబు వస్తాయి. అందుకే ఇన్‌ఫ్లుయెంజా బారిన పడకుండా గర్భిణీలు వాక్సినేషన్‌ చేయించుకుంటే మంచిది.

గర్భిణీలు చలికాలంలో ఎక్కువ పొరలుండే వసా్త్రలు ధరించడం మంచిది.

చలికాలమనే కాదు ఏ సీజన్‌లోనైనా సరే గర్భిణీలు ఆరోగ్యవంతమైన డైట్‌ను తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీగా ఉన్నప్పుడు రోజూ ఏం తింటున్నారన్న దానిపై ఎక్స్‌ట్రా అటెన్షన్‌ పెట్టాలి. సహజంగా శీతాకాలంలో ఎన్నో రకాల పండ్లు వస్తుంటాయి. పండ్లను బాగా తింటే మంచిది. వాటిని జ్యూసులా తాగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు. సి-విటమిన్‌ బాగా ఉండే ఉసిరిని తినాలి. ఇది ఇన్ఫెక్షన్లు సోకకుండా పనిచేయడమే కాదు స్వయంగా యాంటాక్సిడెంట్‌ కూడా. డ్రైనెస్‌ నుంచి చర్మాన్ని పరిరక్షిస్తుంది. పాలు తాగేటప్పుడు అందులో కుంకుమపువ్వు వేసుకుని తాగాలి.

ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రోజూ గుప్పెడు నట్స్‌ను తినాలి. వీటిల్లో ఎన్నో విటమిన్స్‌, నేచురల్‌ ఆయిల్స్‌ ఉండి శరీరానికి కావాల్సినంత బలమిస్తాయి. నట్స్‌ రుచిగా కూడా ఉంటాయి కాబట్టి వాటిని తినడం ద్వారా నూనె పదార్థాలకు మెల్లగా స్వస్తి చెప్పొచ్చు. స్వీట్స్‌ అంటే పల్లీ పట్టి, నువ్వుల లడ్డు వంటివి బాగా తినాలి. బెల్లం తినడం వల్ల శరీరానికి కావాల్సినంత జింకు అందుతుంది. అంతేకాదు చక్కెర కన్నా కూడా బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

గర్భిణీలు నిత్యం వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే చలికాలంలో వ్యాయామాలు చేయాలంటే ఎవరికైనా బద్ధకంగా అనిపిస్తుంది. కానీ గర్భిణీలు మాత్రం తప్పనిసరిగా వ్యాయామాలు చేయాలి. చలి కారణంగా పొద్దున్న వాకింగ్‌ చేయలేకపోతే కనీసం సాయంత్రాలు 4-5 గంటల టైములో బ్రిస్క్‌ వాక్‌ చేస్తే ఎంతో మంచిది. ప్రీనేటల్‌ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌లో చేరితే కూడా మంచిది. ఇవి చేయడం వల్ల ప్రెగ్నెన్సీ టైములో ఎలాంటి అనారోగ్యాలు తలెత్తవు.
ఆధారము: ఆంధ్రజ్యోతి
2.97
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు