హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / చిలగడదుంప కబుర్లు
పంచుకోండి

చిలగడదుంప కబుర్లు

ఈ తియ్యని దుంపలు ఆరోగ్యంతో పాటు చర్మం సౌందర్యాన్ని కూడా ఇస్తాయి.

చిలగడదుంపలు చాలామందికి ఇష్టం. ఈ తియ్యని దుంపలు ఆరోగ్యంతో పాటు చర్మం సౌందర్యాన్ని కూడా ఇస్తాయి. పవర్‌ ప్యాక్డ్‌ సూపర్‌ఫుడ్‌ అని పిలిచే ఈ చిలగడదుంపల ఉపయోగాలేంటో తెల్సుకుందాం.

  • చిలగడ దుంపలను ఇంగ్ల్లీ్‌షలో స్వీట్‌ పొటాటో అని పిలుస్తారు. ఉడకబెట్టి లేదా నిప్పులపై కాల్చి తింటే వాటి టేస్టు ఎంతో బాగుంటుంది. ఈ ఫైబర్‌ ఫుడ్‌లో విటమిన్‌ ఎ, సి, కాల్షియం, పొటాషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి.

ఇందులో 35 శాతం నుంచి 90 శాతం విటమిన్‌ ఎ ఉంటుంది. అందుకే చిలగడ దుంపలు తింటే కళ్లకు మంచిది.

ఈ దుంపల్ని తినటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉండదని ఇటీవలే హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం తేల్చింది.
స్వీట్‌ పొటాటోల వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. గుండెకు మంచిది.
చిలగడ దుంపలు తింటే రోజంతా బాగా ఎనర్జీ ఉంటుంది. అందుకే క్రీడాకారుల్ని వీటిని తినమని చెబుతుంటారు.
చిలగడదుంపలు యాంటీ ఏజింగ్‌గా ఉపయోగపడతాయు. ఎక్స్‌మెన్‌ మూవీ స్టార్‌ ఒలీవియా మన్‌ ఇటీవలే తన బ్యూటీ సీక్రెట్‌ ఏంటో సోషియల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘ప్రతిరోజూ కాల్చిన స్వీట్‌పొటాటో తింటాను. నా చర్మసౌందర్య రహస్యమిదే’ అని సెలవిచ్చింది.
లో బీపి ఉండే వారికి ఈ దుంపలు తింటే మంచిది. బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది
ఆధారము: ఆంధ్రజ్యోతి
2.92
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు