హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / టేస్టీ ఫుడ్‌తోనూ రిస్క్‌ ఉంది
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

టేస్టీ ఫుడ్‌తోనూ రిస్క్‌ ఉంది

అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల లావు అవుతారని అందరికీ తెలుసు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం వల్ల కూడా శరీరానికి రిస్కు ఉంటుందట

అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల లావు అవుతారని అందరికీ తెలుసు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం వల్ల కూడా శరీరానికి రిస్కు ఉంటుందట. ఇటీవల అధ్యయనకారులు చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాల్సిన దాని కన్నా ఎక్కువ పరిమాణంలో తింటే లావు అవుతారుట.

అలాగే ఆరోగ్యకరమైన ఆహారం వల్ల తొందరగా కడుపునిండదనే అభిప్రాయం కొందరిలో ఉంది. హెల్దీ ఫుడ్‌ లేబుల్స్‌ ఉన్న వాటిని తినడం వల్ల ఊబకాయం తగ్గడానికి బదులు ఎక్కువ అవడాన్ని అధ్యయనకారులు గుర్తించారు. ఆరోగ్యకరమైన ఆహారం తక్కువగా కడుపు నింపుతుందన్న కాన్సెప్టులోని నిజానిజాలు తెలుసుకోవడానికి మల్టీ మెథడ్‌ అప్రోచ్‌ను అధ్యయనకారులు ఈ స్టడీలో అనుసరించారు.

ఆస్టిన్‌లోని టెక్సాస్‌ యూనివర్సిటీలో పనిచేస్తున్న రాజ్‌ రఘునాథన్‌ బృందం ఈ పరిశోధన చేసింది. స్టడీలో భాగంగా ప్రథమ స్థాయిలో 50 మందిని పరిశీలించారు. ఇంప్లిసిట్‌ అసోసియేషన్‌ అనే టెస్ట్‌ను వీరిపై నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఫుడ్‌, కడుపు నిండడం రెండు అంశాలపైనా ఈ పరిశోధన సాగింది. రెండవది ఫీల్డ్‌ స్టడీ. ఇందులో 40 మంది డిగ్రీ విద్యార్థులను పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థులు కుక్కీని తినడం వల్ల వారి ఆకలి స్థాయి, వారి ఆరోగ్యం మీద అది చూపిన ప్రభావాన్ని అంచనాగట్టారు. మూడో స్థాయిలో షార్ట్‌ఫిలిం ప్రదర్శించడానికి ముందు 72 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్లు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌, సినిమా చూస్తూ వారు తిన్న ఫుడ్‌ పరిమాణాల్ని

పరిశీలించారు.అనారోగ్యకరమైన ఫుడ్స్‌ కడుపు బాగా నింపినట్టు హెల్దీఫుడ్స్‌ నింపవన్న విషయం ఎంత వరకూ నిజమో పరిశీలించారు.

అయితే అనారోగ్యకరమైన ఫుడ్స్‌ కన్నా ఆరోగ్యకరమైన ఫుడ్స్‌ తక్కువగా కడుపు నింపుతాయనేమీ లేదని ఈ స్టడీలో పాల్గొన్న వినియోగదారులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా లావయ్యే అవకాశాలన్నాయని అధ్యయనకారులు తేల్చారు. సో.. ఆరోగ్యకరమైన ఆహారమే తింటున్నాం కదా అని మితిమీరి తింటే మంచిది కాదు. అలా తినే వారిలో ఊబకాయ ప్రమాదం పొంచి ఉంటుందని మరవకండి.

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.98837209302
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు