హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / థైరాయిడ్- రుగ్మతలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

థైరాయిడ్- రుగ్మతలు

థైరాయిడ్- రుగ్మతలు

 

థైరాయిడ్‌ గ్రంధి మెడ ప్రాంతంలో ఉండే ఒక గ్రంధి. ఇది సీతాకోకచిలుక రూపంలో, శ్వాస నాళానికి ఇరు పక్కలా ఉంటుంది. దీనినుండి విడుదలయ్యే థైరాయిడ్‌ హార్మోన్‌ లో (టి3) ట్రై- ఐడో థైరోనిన్,  టెట్రా - ఐడో థైరోనిన్ (టి4)- అనే రెండు హార్మోన్ లు, కొన్ని ఇతర రసాయన పదార్థాలు ఉంటాయి.
ఈ హార్మోన్ లు మన శరీరంలోని దాదాపుగా కణజాలాలన్నిటిపై  ప్రభావం కలిగివుంటాయి. ప్రతి కణానికి ఇవి ప్రవహించి, వాటిపై ప్రభావం చూపి, జీవక్రియలను నిర్వహించడానికి తోడ్పడతాయి. థైరాయిడ్‌ హార్మోన్ ఏయిర్ కండిషనరులాగా పనిచేస్తూ, శరీరం ఎంతచురుకుగా, వేగంగా పనిచేయలో, శక్తి ఎలా వినియోగించుకోవాలో సూచనలిస్తుంది. శరీరంలో సరిపడా హార్మోన్లుంటే థైరాయిడ్‌ గ్రంధి హార్మోన్లను ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది. లేకపోతే ఉత్పత్తి ప్రారంభిస్తుంది.
పిట్యూటరీ గ్రంధి, హైపోథేలమస్‌ అనే మెదడులోని భాగం శరీరంలోని థైరాయిడ్‌ హార్మోన్‌ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పని చేస్తాయి. ఉదాహరణకు దేహంలో తగినంత థైరాయిడ్‌ హార్మోను లేకపోతే పిట్యూటరీ గ్రంధి ఈ అవసరాన్ని గ్రహించి, థైరాయిడ్‌ని ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (టి.ఎన్‌.హెచ్‌)ని విడుదల చేస్తుంది. అలాంటి టిఎన్‌హెచ్‌ సంకేతంతోనే థైరాయిడ్‌ గ్రంధి హార్మోన్‌ని ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది.  వివిధ కారణాలవలన థైరాయిడ్ హార్మోన్‌ ఉత్పత్తిలో ఎక్కువగా ఉండటం లేదా తక్కువగా ఉండటం జరిగి అనారోగ్యానికి దారితీస్తుంది. వాటినే థైరాయిడ్ రుగ్మతలు అంటాం. ఫ్రస్తుతం మన దేశంలో ఇది ప్రధాన ఆరోగ్య సమస్య..

భారత దేశంలోని 8 నగరాల్లో చేసిన అధ్యయనం ప్రకారం

 • పది మందిలో ఒకరు థైరాయిడ్ రుగ్మతలతో భాదపడుతున్నారు.
 • పదిమందిలో ఎనిమిది మంది మహిళలు థైరాయిడ్ రుగ్మతలకు గురవుతుంటారు
 • 35 సంవత్సరాలు  పైబడినివారిలో థైరాయిడ్ రుగ్మతల ప్రమాదం అధికంగా ఉంటుంది.
 • ఆటోఇమ్యున్ వ్యాధి,  డయాబెటీస్ వున్నవారిలో ప్రమాదం అధికంగా ఉంటుంది.
 • థైరాయిడ్ రుగ్మతలు కుటుంబాల్లో వారసత్వంగా వస్తాయని కూడా గమనించబడింది.

థైరాయిడ్‌ రుగ్మతకు గల కారణం ఏమిటి

 • గ్రంథి సరిగా పని చేయకపోవటం వలన
 • న్ని పుట్టుక సంబందమైన కారణాలవలన
 • డ్రగ్ల ప్రేరణ వలన
 • థైరాయిడ్‌ గ్రంథి ని తీసేయడం వలన
 • పిట్యుటరి గ్రంథి రుగ్మత వలన
 • అయోడైడ్ ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వలన

థైరాయిడ్‌ రుగ్మత  వివరాలు తెలుసుకుందాం

థైరాయిడ్‌ రుగ్మతలను కనిపెట్టడానికి  థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ (టి. ఎస్.హెచ్)  రక్తం పరీక్ష చేస్తారు. దీని ద్వారా టి3, టి4, టీఎస్‌హెచ్ స్థాయిలను తెలుసుకోవచ్చు. థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయడం ద్వారా కూడా రోగనిర్ధారణ చేసుకోవచ్చు.

 

ఆధారం: వివిధ వనరుల ఆధారంగా

 

3.03448275862
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు