హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / దురలవాట్లు - ప్రమాదాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

దురలవాట్లు - ప్రమాదాలు

దురలవాట్లు - ప్రమాదాలు.

"కల్లు మానండోయ్! జనులారా కళ్ళు తెరవండోయ్" అని పాటలు రాసి, పాడి గాంధీ మహాత్ముడు మొదలు పెట్టిన మధ్యసాన నిషేధ ఉద్యమానికి ఉపిరిపోసిన గొంతులు ఇప్పుడు మగబోయాయి.

15-20 సంవత్సరాల కారింది ఎవరయినా త్రాగి బజారున పోతున్న, బస్సుల్లో ప్రయాణం చేస్తున్న చుట్టూ ఉన్నవాళ్ళు ఏహ్య భావంతో చిసేవారు. ఈ రోజు ఎవరైనా నేను డ్రైన్క్స్ తీసుకోను అంటే "త్రాగవా? త్రాగవా? !!" అంటూ ఆశ్చర్యంగా, అసహ్యంగా ఓ వేదవిని చూసినట్లు చూస్తారు. మిమ్మల్ని చదువుకున్నవారు. బరుల్లో విస్కీలు, బ్రండిలు త్రాగితే, గ్రామాల్లో నివసించే జనం ప్రభుత్వ సారా దుకాణాల్లో, కళ్ళు దుకాణాల్లో కాస్త ఖరీదు తక్కువలో దొరికే సారా, కళ్ళు త్రాగువారు, గతంలో బారు షాపుల్లో ఎర్రలైట్లు వేసేవారు. వచ్చేవారు పోయేవారు బయట వారికీ కనపడకూడదని ఇప్పుడు ఆ బెరుకు లేదు కాబట్టి దేదీప్యమానంగా ట్యూబ్ లైట్లు వేస్తున్నారు.

త్రాగితే ఏమవుతుంది

సారా త్రాగితే మనకు శక్తి ఇచ్చే పదార్ధాల్లో ఇది చేరుతుంది. శరీరంలో జీవ రసాయన ప్రక్రియలు ఈ సారాకు అలవాటు పడి, ఆతరువాత అకస్మాత్తుగా సారా త్రాగడం ఆపివేస్తే శరీరం అడ్డం తిరుగుతోంది. ఈరోజు "నేను ఇక త్రాగాను" అని ఒట్టు వేసుకుంటారు. రోజు త్రాగే సమయం సమీపించగానే "ఈ ఒక్క రోజుతో బంద్" అని ఆ రోజు మాత్రం త్రాగువారు. రేపు మరల షరా మాములే.

కాలేయంలో జబ్బు

త్రాగినవారు కేలేయం దెబ్బతిని "సిర్రోసిన్ అప్ లివర్" అనే జబ్బు వస్తుంది. పొట్టనిండా నీరు చేరి బాణా పొట్ట వస్తుంది. కాళ్ళ వాపులు వస్తాయి. శరీరంలో కాలేయం ఉండేది ఒకటే కాబట్టి, అది దెబ్బత్తింటే శ్మశాన మరల ఊరుతుంది. మన అభిమాన సినీ తారలు చాల మంది ఈ సారాయి వలెనే నెల రాలిపోయారు. సావిత్రి, మీనాకుమారి, ఆర్.నాగేశ్వరరావు, రాజనాల, రాజబాబు అందరూ సారాదేవతకు అతిధులుగా పోయారు. ఇంకెంతమందికి ఆలా రాసిపెట్టుతుందో.

గుండె జబ్బులు

సారా తాగితే గుండె కండరం దెబ్బతిని గుండె విశాలంగా మారుతుంది. కవిత్వాల్లో కవులు రాసె "హృదయం వైశాల్యం" కాదిది. నిజంగావ్ వైశాల్యం పెరుగుతుంది. చెప్పా పెట్టకుండానే గుండె ఆగిపోవచ్చు.

జీర్ణమండలంలో జబ్బులు

పొట్టలో క్యాన్యర్ రావచ్చు. ఆకలి మిగిస్తుంది. ఇంకేం బరువు తగ్గాచ్చులే అని పడేవారు! అన్నవాహికలో క్యాన్సర్ వచ్చి ముందు అన్నం ముద్దలు సరిగా పొట్టలోకి దిగవు. ఇంకొంత కలం గడిస్తే నీళ్లు కుదడిగావు. ఆ సమయంలో డాక్టర్ వద్దకు వస్తే అయన మాత్రం ఏంచేయగలడు? పొట్టకోసి ఒక్క రబ్బరు గొట్టం జీర్ణాశయంలోకి ఏర్పాటు చేస్తాడు. చక్కని, కమ్మని ఆహార పదార్ధాలు నామాలవచ్చు. జిహ్వ కోరిక తీర్చవచ్చు. కానీ పాపం! మరింగడానికి లేదా. పట్టకు డాక్టర్ అమర్చిన గొట్టంలో ఉసేసుకోవచ్చు. పొట్టలోకి పోతుంది పర్వాలేదులే! ఇంతాచేసి గొట్టంలో పెట్టించుకొన్న తరువాత బ్రతికేది 6 వేళలు మాత్రమే. ఎప్పుడు చెస్తాయే తెలియకుండా సడన్ గా పోవడం కొంత నయం. ఇంకో 6 నెలలు చినిపోతామని ఏరోజుకారోజు లెక్కపెట్టుకుంటూ "రోజు వచ్చే అదృష్టం" పడుతుంది.

నరాల జబ్బులు

నరాల బలహినమై చేతులు, కాళ్ళ నొప్పులు పుడతాయి. ఏమందువాడిన తగ్గదు. పాపం! నరాలకు కూడా సారాయి అలవారై ఉంటుంది. నరాల నొప్పులు తగ్గాలని "న్యూరోబయాన్" సూదిమందు ఒక్కటో రెండో వేసుకున్న మనం మన నరాలు బాగుపడేది ఏమి ఉండదు. కానీ "న్యూరోబయాన్" తయారుచేసే "మెర్క్ వచ్చే అదృష్టం" పడుతుంది.

మతిమరుపు

సారా త్రాగితే మెదడులో కణాలు దెబ్బతిని "ఆల్కహాలిక్ డిమెన్నియ" (సారా మతిమరుపు) వస్తుంది. జపాకే  శక్తి శినిస్తుంది. దేశం పేరు, రాష్టం పేరు, జిల్లా పేరు, మీ ఊరు పేరు మర్చి పోతారు. మీభార్య పిల్లలు, తల్లిదండ్రుల పేర్లు, చివరకు మీ పేరు మర్చిపోయా "నా పేరు చేప్పందని" వీధిన పడతారు. (ఎఫ్. నపుంసకత్వం) సారా తగిన వారికి క్రమేణా సెక్సు సామర్ధ్యం తగ్గి, నపుంసత్వం వస్తుంది. సారా తాగే స్రిలో ఆరోగ్య సమస్యలు రావటమేకాదు. పుట్టబోయే బిడ్డలకు కూడా రోగాలొస్తాయి. జనం ప్రాణాలు టోకున పోతాయి. అభినందించండి వీరిని జనాభా సమస్యను తాగిస్తున్నారు.

ఇతర సమస్యలు

త్రాగిన జనం ఇంగీతాజనం కోల్పోయి తగాదాలు తెచ్చుకుంటారు. అర్ధరాత్రిదాకా తప్పతాగి ఇంటికెళ్ళి తలుపులు దబదబా బడుతారు. సంపాదించిన డబ్బంతా త్రాగడానికి తగలేసాక థింటానికి ఏమి లేక, పోయ్యేలోని పిల్లిని లేపకుండా కడుపులో కళ్ళుమూచుకుని నిద్ర పోతన్న భార్యను దబాయంచి "చికెన్ బిర్యానీ పట్టుకురా"  అంటూ అరుస్తాడు. "అంటూ ఏంటని" వెర్రి మొహం వేసుకుని చూస్తుండిని భార్య దబదబా వైపు పగలుగొడతాడు తగిన ఆసామి. ఇప్పుడు ఆమె వైపు కుట్లు వేయంచాడానికి ఇంకో ఏభై రూపాయలు ఖర్చు అవుతాయి.

తాగేవానికి తన సంపాదనతో త్రాగని? ఇతరుల సంపాదనతో త్రాగానా అనేది పట్టదు. తన సంపాదనే కాకుండా భార్య సంపాదన కూడా త్రాగడానికి ఖర్చు చేసేవాళ్ళు ఉన్నారు. పిల్లవాడు పరీక్ష పీజుకు ఉంచుకొన్నది కూడా ఊడ్చుకుపోయి త్రాగే వాళ్ళు ఉన్నారు.

మొదట్లో పనులు చేయించాలంటే త్రాగించాలి. ఇళత్రాగి త్రాగి బల్లమీదనుంచి సంపాదించే జీతం ఎములకు చాలక బల్లకింద నుంచి రెండు చేతులు రెండుకళ్ళూ వాడేయడం మెదలి పెడతారు. ఖర్మ కాళీ ఎవరైనా 'ఎ.సి.బి.' వలలో విసిరేస్తే చివరకు త్రాగడానికి కూడా అడుక్కోవలసి వస్తుంది.

త్రాగిన వాళ్ళలో నాకు నచ్చిన వాళ్ళు ఒకరకం ఉన్నారు. వీరు అలవికాకుండా తాగి చక్కగా సారా కొట్టు ముందుండే సైడు కాలువలో పడుకుంటారు. ఉదయం పందులు వచ్చి, "బాబు మద్యుతికి టైం ఆయండి తమరు లేవండి" అనే దాక గాధ నిద్రలో ఉంటారు పాపం! ఈరిని ఇబ్బంది పెట్టారు.

రోడ్డు ప్రమాదాలలో దాదాపు సగం మద్యపానం చేసి బళ్ళు నడపడం వలన జరుగున్నాయి. తప్పతాగి, తగాదాలు తెచ్చుకోవడం. నేరాలు చేయటం, ఇంట్లో భార్యను పిల్లల్ని తన్నటం. ఇంటివన్నీ జరుగుతాయి.

ఇదో విచిత్రం

సారాత్రాగితే రోగాలు వస్తాయని ప్రభుత్వానికి తెలుసు ఆరోగ్యాలను నయం చేయదనాయికి అవసరమైన ఆసుపత్రులు కట్టించింది గవర్నమెంట్, ఆ ఆసుపత్రుల్లో డాక్టర్ జీతాలు, మందులు, ఆపరేషన్ పరికరాలు, పరీక్ష సాధనాలు అని ప్రభుత్వమే తెచ్చిపెట్టింది. కానీ ఆప్రభుత్వమే బ్రంది షాపులకు పర్మిట్లు ఇచ్చింది. ఏకంగా "ప్రభుత్వ సారాయి దుకాణాలు" పెట్టింది. కల్లు దుకాణాలు తెరిచింది. జనంతో ఇంకా ఇంకా త్రాగించే అంటూ సారా వేలం పాటలు విర్వహిస్తుంది. ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది.

ఏస్తజ్ వస్తుంది కాదా! అంటారు. నిజమే ఈ వచ్చే ఏస్తజ్ ఆదాయం సారత్రాగి జనం తెచ్చుకునే రోగాలు నయం చేసే ఆస్పత్రులు నడవడానికి చాలదు. "అవ్వతిసినా గంధం తాత బుడ్డక్కూడా చాలదు" మరి.

మద్యాన్ని విక్రయంచిమని అనుమితిచ్చే ప్రభుత్వమే, "మద్యం వలన నష్టాలను" ప్రజల్లో ప్రచారం చేయడం సబబు. త్రాగడం మానేస్తే ఎంత డబ్బు అదా అవుతుందో లెక్కవేసి చదచ్చు.

సారాత్రాగటం ఎందుకు మానేయాలి

 • జబ్బులొస్తాయి ఒక్క జుబ్బానాయనా నయం చేయలేము.
 • నేరాలు తగ్గాలంటే సారాయి మానేయాలి.
 • రోడ్డు ప్రమాదాలు తగ్గటానికి సారాను మనాలి.
 • కుటంబాలు బిత్రం కాకుండటానికి,
 • ఆర్ధిక నష్టాలూ తగ్గటానికి గాను సారాను మేనేయాలి. ఎంతెంత మానవ సంపద వృద్ధి అవుతుందో గమనించవచ్చు.

సారి మానేస్త ఆర్ధిక పరమైన లాభాలు

రోజుకో 20 రూపాయల ఖరీదైన సారాయి తీసుకుంటున్నాడనుకుంటే ఆ డబ్బు సంవత్సరానికి 7000 రూపాయలు అవుతుంది. ఈ ఒక్కు సంవత్సరం డబ్బును నెలకు నూటికి 3 రూపాయలు వడ్డీకి మదుపు పెడై 60 సం.లలో 320 కోట్ల రూపాయలవుతుంది. 2 రూపాయల వడ్డీకి ఇసై 10 కోట్ల రూపాయలుతుంది. 1 రూపాయి వడ్డీకి యసై 8 లక్షలు అవుతుంది. ఆ డబ్బు యిచ్చే సుఖాలను అనుభవించటానికి "జీవంచి" ఉంటారు. లేదంటే డబ్బు పోయేదే కాక, సారా త్రాగేవ్యక్తి కూడా "ఉండదు". రోగాల బారిన పడి అర్ధంతరంగానే చనిపోతాడు.

 • ఈ లెక్కల్లో ఒక్క సంవత్సరం డబ్బే లెక్కశము.
 • ఈ అరవై ఏళ్ళలో ప్రతి సంవత్సరము మిగితే 7000 రూపాయలు వాటి మీద వడ్డీలు లెక్కయాలేదు.

కొన్ని ప్రశ్నలు

 1. "సారాత్రాగటం" వలన నష్టాలున్నాయని తెలిసే, మానాలనుకున్ని కూడా - మనలేక పోతున్నారెందుకని ?
 2. "సాత్రాగటం" గొప్ప విషయామిని సినిమాలలో కూడా అద్భుతంగా (అతిగా) చుపిస్తారెందుకని?
 3. పాశ్చాత్య దేశాలలో రాత్రికి రోజుకో "పెగ్గు" త్రాగటానికి, మన దేశంలో జనం "త్రాగటానికి" గల తేడాలేంటి?
 4. "త్రాగే" సంసృతి (కల్చర్) పెద్ద ఎత్తన పెరగటానికి కారణాలేంటి?

ఆధారం : ఆరోగ్య వ్యాయమ విద్య

2.86363636364
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు