హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / ప్రాణిక్ హేలింగ్/ ప్రాణచికిత్స
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రాణిక్ హేలింగ్/ ప్రాణచికిత్స

ప్రాణచికిత్స విధానము ఒక ప్రాచీన వైద్యవిధానము. ఈ చికిత్సా విధానములొ ప్రాణశక్తిని ఉపయోగించి చికిత్స జరపబడుతుంది .ఈ విధానములో ముందుకు పోయేముందు ముఖ్యముగా ప్రాణము అనగ ఎమిటి ప్రాణశక్తి అనగ ఎమిటి తెలుసుకొవలసి ఉన్నది.

ప్రాణచికిత్స విధానము ఒక ప్రాచీన వైద్యవిధానము. ఈ చికిత్సా విధానములొ ప్రాణశక్తిని ఉపయోగించి చికిత్స జరపబడుతుంది .ఈ విధానములో ముందుకు పోయేముందు ముఖ్యముగా ప్రాణము అనగ ఎమిటి ప్రాణశక్తి  అనగ ఎమిటి  తెలుసుకొవలసి ఉన్నది.

ప్రాణము-ప్రాణశక్తి

మనకు కావలసిన శక్తి ముఖ్యముగామనము పీల్చుకునే గాలి/వాయువు  వల్ల పొంద  గలుగుతున్నాము.ఈ ముఖ్యతత్త్వ మైన గాలియే(వాయువే)  మనలను(మనశరీరములను) జీవించి యుంచుచున్నది.ఈ వాయువు శ్వాశరూపములో మన ప్రాణమైయున్నది. ప్రాణము మనశరీరమందలి  ప్రతికణమునందునువ్యాపించియున్నది. ఈ ప్రాణశక్తి  ఎప్పుడు నిద్రించదు, విశ్రాంతి తీసుకోదు. ప్రాణశక్తి యెంతవరకునడుచుచుండునో అంతవరకు జీవితములుండునుకనుక,  ప్రాణముయొక్క ఆశ్రయము ననే జీవితములుండును. ఈ ప్రాణముయొక్కశక్తితోనే సంపూర్నవిశ్వముయొక్క సంచాలనము జరుగుచున్నది. ప్ర్రాణముయొక్క ఉర్జాశక్తియే  మన జీవితముయొక్క రోగనిరోధకశక్తికి ఆధారమైయున్నది.

ఊపనిషత్తులలో ప్రాణశక్తిని గురించి వివరణ

ఉపనిషత్తులందుఈప్రాణశక్తిని గురించి చక్కని వివరణ ఉన్నది. ప్రశ్నోపనిషత్తు రెండవ (భాగము) ప్రశ్న లోని 5 నుంచి13 మంత్రములలో ఈప్రాణశక్తినిగురించిచక్కగా బొధపరిచారు. క్లుప్తముగా ఈ ప్రాణశక్తివివరణ యిలాఉన్నది.

సూర్యుడు,మేఘము,ఇంద్రుడు,వాయువు,భూమి,జడపదార్ధములువంటి యావత్తుగా విరాజిల్లేదిప్రాణమే. శారీరకశక్తి,మానసికశక్తిలను పనిచేయించేదిప్రాణమే.కనుకశరీరములోను మనస్సులోను శక్తి ప్రాణమే. పురుషునిలోవీర్యముగాను,స్త్రీ లో పిండముగాను ఉన్నది ప్రాణమే. శరీరములో జీవము గాఉండి లోకాన్ని అనుభవింపచేసేదిప్రాణమే.సకలైంద్రియాలనునడిపించేదిప్రాణమే  .

జీవితానికి ఆధారమైనది ఆహారము, ఆహారానికి ఆధారము వాన. వానగాకురసి జీవుల మనస్సులలో ఆనందానిని కలింగేచే ది ప్రాణము.మనశారీరిక, మానశిక చేతలకు అవసరమైన శక్తినిఅందచేసేది ప్రాణమే. ముల్లోకాలలో ఏ వయితే వున్నవో అవి అన్ని ప్రాణంవశంలోనే వున్నవి. అందుకని ఈ ఉపనిషత్తు భాగము లోని ఆఖరి మత్రములో ప్రాణాన్నిఈవిధముగా ప్రార్ధించారు. “ ఒక తల్లి పిల్లలను ర  క్షిం చేలా మమ్మలనుర క్షిం పు, సరి అయిన బుద్ధి ని, సంపదను, మాకు ప్రసాదించు”. ఈ పై వివరణ వలన ప్రాణము/ ప్రాణ  శక్తి యొక్కప్రాధాన్యత మనకు తెలుయుచు న్నది.

ప్రాణశక్తినిఉపయోగించుకొనుట

ప్రాచీనకాలములో ఈశక్తినిచక్కగా అద్యయ నము చేసి అనేక రీతులలో ఈ ప్రాణశ క్తితొ శారీరక ఆరోగ్యాభివ్రు ద్ధికి, మా నసిక వికాసానికి, రోగనిరోధకశక్తి  పెంచుకొనుటకు, రోగములనుపోగొ ట్టుటకు,అనేకరీతులలొ అనేక విద్యలుగా ఉపయోగించే వారు.  ఈప్రాణశక్తిని ముఖ్యముగా మూడు స్తానాలనుంచి పొందగలుగుతాము.  అవి (1) సౌరప్రాణశక్తి(2)వాయు ప్రాణశక్తి మరియు(3)భూప్రాణశక్తి.

సూర్యరశ్మిలోవుండటం ద్వారా,సూర్యకిరణాలను శరీరానికి వంట పట్టీంచుకొనుట ద్వారా (సన్ బాత్), ఎండలో ఉంచిన నీటిని త్రాగటంద్వారా ఈసౌరశక్తి ని పొందగలము. ఊపిరిపీల్చినపుదు ఊపిరితిత్తులద్వారా వాయు ప్రాణశక్తి శరీరములో నికి ప్రవేసించును. భూమిలో ఉండే ప్రాణశక్తి  అరికాళ్ళ ద్వారా శరీరములోనికి ప్రవేసించును.

మానవశరీరము ముఖ్యముగా రెండు భాగములుగా విభజించబడినది. ఒకటి మనకు కనిపించు శరీరము దీనిని “అన్నమయకోశము”అనియు (ఫిజికల్ బాడి), రెండవది కనిపించని శక్తితో కూడినది దీనిని “ప్రాణమయకోశము”( ఎథికల్ బాడి) అని అందురు. ఈ ప్రాణ మయకోశము పూర్తి శరీరమునుంచి ప్రసరించుచూఅన్నమయకోశముచుట్టూ సుమారు4 నుంచి5 అంగుళముల వరకు వ్యాపించి ఉండును. కంటికి కనిపించని ఈ కాంతివంత మయ శరెరమే శక్తిదేహము.మానవ శరీరములోని అన్ని భాగములలోను తగినంత ప్రాణశక్తిఅవసరము. అవసరముబట్టి కొన్ని భాగములలో ఎక్కువ కొన్ని భాగములలో తక్కువ. ఉదాహరణగా చూడటానికన్నా మాట్లాడటానికి యెక్కువ శక్తిఅవసరం. ఆ ప్రాణ శక్తి ఆభాగములకు కావలసినంత వరకే ప్రసరిస్తూండాలి.  అవి ఏ భాగములో నయినా అవసరానికంటె ఎక్కువ యినా తక్కువ యినా దేహములో సమతౌల్యముచెడుతుంది. అలా చెడటమే అనారోగ్యము.

ఈ ప్రాణశక్తినిఉపయోగించి వ్యాధులను నయముచేసే కళనే ప్రాణచికి త్స లేక ప్రాణిక్ హీలింగ్ అంటారు. ఈప్రాణచికిత్సలో  అనారోగ్యం సోకిన శరీర భాగానికి ప్రాణశక్తిని ప్రసరింపచేసి ఆ రోగిని అనారోగ్యంనుండి కాపాడుతారు. ఈప్రాణచికిత్స ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడి చాలామంది సాధకులు ఈ ప్రాణచికిత్స చే యు చున్నారు. ఈవిద్య సామాన్య మానవునకు చాలా ఉపయొగపడు నది,యెక్కువ వ్యయ ము లేనిది,ఆత్మధైర్యమునుపెంచి మానసిక వికాసమునకుఉపయొగపడునది,కానీ ఇది చాలా మందికి తెలియదు కనుక ఎక్కువ ఉపయోగములో లేదు.  మాస్టర్ చోవాకొక్ సుయ్ అనే ఫిలిప్పిన్ దేశస్తుడు ఈ ప్రాణచికిత్సనిచక్కగాఅధ్యనముచేసి సామాన్యమానవునకుఅర్ధమయ్యేభాషలో సామాన్య మానవునికి ఉపయోగపడె రీతిలో అనేక గ్రంధములు  వ్రాశారు. మనదేశములోపలు ప్రాంతాలలో మాస్టర్ చోవాకో క్ సుయ్  గారి ద్వారా ప్రచలితమయినప్రాణిక్హీలింగ్/ప్రాణచికిత్స సాధనలోఉన్నది. తెలుగురాస్ట్రాలలో తిరుపతి, హైదరాబాద్, రాజమండ్రిమొదలగుచోట్లఈప్రాణచికిత్సాకేన్డ్రములు నడపబడూచున్నవి. ఈకేన్డ్రాల లో  ప్రాణచికిత్స చేయుటకు తగిన ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతూ వున్నది.

ఈ ప్రాణచికిత్సను చాలాసులభముగా కొద్దిసమయములో తక్కువ వ్యయముతో ప్రతిఆరొగ్యవంతుడు, పట్టుదలకలిగి  వున్నవారు, మనస్సును కేన్ద్రీకరించగలిగినవారు,సేవాభావము కలిగినవారు నేర్చుకొని, స్వరోగనివారణకు, తనకుటుంబసభ్యుల అనారోగ్యనివారణకు,సమాజసేవకు ఈ విద్యనుఉపయోగించుకొనగలరు.. వివరములు http://www.pranichealingfoundation.org లో   పొందగలరు.

ఆధారం : http://www.pranichealingfoundation.org

3.0101010101
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు