మధుమేహం లేని వ్యక్తి హానికారక పదార్ధాలు తీసుకుంటే వాటి దుష్ప్రభావం వారిలో కొంత ఆలస్యంగా కనిపిస్తుంది. కాని మధుమేహుల్లో అది వెంటనే కనిపిస్తుంది. క్రింద వివరించిన విషయాలు మధుమేహాన్ని నివారించడానికి మరియు నియంత్రణకి తోడ్పడతాయి. మధుమేహుల కంటూ ప్రత్యేకంగా చెప్పినా ఇవి అందరూ పాటించవచ్చు.
1.భోజనానికీ భోజనానికీ మధ్య ఎక్కువ వ్యవధి ఉండకూడదు. ఎక్కువ గంటలు గడిచే కొద్దీరక్తంలో చక్కెర శాతం పూర్తిగా తగ్గిపోయి భోజనంచేయగానే హఠాత్తుగా పెరిగిపోతుంది. అందుకే భోజనాన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు వేళలకు విభజించడం అవసరం. వీటికి తోడు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అల్పాహారం తీసుకోవడం కూడా అవసరం. దీనివల్ల రక్తంలో ఉండవలసిన చక్కెర శాతంలో హెచ్చు తగ్గులు లేకుండా నియంత్రణలో ఉంటాయి.
బియ్యంలో అన్నిటి కన్నా అతిత్వరగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు పిండిపదార్థాలు ఉంటాయి. మధుమేహులకు ఇవి పూర్తిగా నిషిద్ధమని, విషతుల్యమని చెప్పలేం. కానీ, అపరిమితంగా తీసుకోవడం వల్ల చక్కెర శాతం విపరీతంగా పెరుగుతుంది. గోధుమ, మొక్కజొన్న, మొలకెత్తినధాన్యాలు, కూరగాయలు లేదా పళ్లల్లోనూ కావలసినన్ని కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. అయితే ఇవి జీర్ణమవ్వడానికి సమయం ఎక్కువ పడుతుంది. కనుక రక్తం లో గ్లూకోస్ ను నియంత్రిచుకోవచ్చు.
3.మాంసకృత్తులు(ప్రొటీన్లు)
అందరిలాగే మధుమేహులకు కూడా ప్రొటీన్లు అవసరం. శరీరంలోని ధాతువుల నిర్మాణంలో వీటి అవసరం చాలా ఎక్కువ. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చిక్కుడుధాన్యాలు కొన్నికూరగాయల్లోనూ కావలసినమేరకు ప్రొటీన్లు లభిస్తాయి. వీటితో పాటు పాలు, పెరుగు, సోయాపదార్ధాలు, తక్కువ కొవ్వుపదార్ధాలు ఉండే పన్నీరు తీసుకోవడం అవసరం.
4.కొవ్వులు
తృణధాన్యాలు, కూరగాయలు, పళ్లల్లోనూ కొవ్వుపదార్ధాలు ఉంటాయి. బాదం వంటి నట్స్‌లో కొవ్వుపదార్ధాలు మరీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మితంగా వాడాలి. వంటనూనె ఎక్కువగా వున్న వంటకాలు, వేపుడు కూరలు, మేకమాంసం వంటివి మితంగాతింటే శరీరంలో కొవ్వును నియంత్రణలో ఉంచవచ్చు. నిరంతరం ఒకేనూనె కాకుండా పల్లి, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, సోయా వంటివి రెండు రకాల నూనెలు కలిపి వాడాలి . పచ్చళ్లు, కొబ్బరి, మసాల వంటివి పూర్తిగా మానుకోవడమే మంచిది.
5.విటమిన్లు, ఖనిజలవణాలు
ఆహారంలో తృణధాన్యాలు, కూరగాయలు, పళ్లు, పాలు ఉత్పత్తులు సరిపడా తీసుకుంటే విటమిన్లు, లవణాలన్నీ వాటి ద్వారానే లభిస్తాయి. ఆకుకూరలు, సలాడ్లు తరచూ తీసుకుంటే అన్ని పోషకాలూ లభిస్తాయి. నల్లద్రాక్షపళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇవి అవసరం.
6.పీచుపదార్ధాలు (పైబర్)
ఆహారంలో పీచుపదార్ధాలు ఉంటే రక్తంలో కలిసే చక్కెర, కొవ్వు పదార్ధాల శాతం తగ్గుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. పీచుపదార్ధాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్నా చక్కెర నియంత్రణలోనే ఉంటుంది.
ఆహార జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నామని వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలు ఖర్చు కావడానికి ప్రతిరోజూ అరగంట నుంచి గంట వరకు నడవడం అవసరం.
బాడీ మాస్ ఇండెక్స్ సూచిక
విభజన |
బాడిమాస్ ఇండెక్స్ |
ఆరోగ్యానికి అపాయం |
తక్కువ బరువు |
18.5 కంటే తక్కువ వుంటే |
తక్కువకాని ఇతర వైద్యపరమైన అపాయం పెరుగుతుంది |
మామూలు శ్రేణి |
18.5 నుండి 23 వరకు |
సాధారణం |
అధిక బరువు |
23 నుండి 25 వరకు |
మితంగా పెరిగింది |
స్థూలకాయం |
25 నుండి 29.9వరకు గ్రేడ్-1 30 దాటితే గ్రేడ్-2 |
తీవ్ర ప్రమాదం అధిక తీవ్ర ప్రమాదం |
గ్లైసిమిక్ ఇండెక్స్ పట్టిక
అల్ప గ్లైసిమిక్ ఇండెక్స్ |
< 55 |
పప్పుధాన్యాలు, ముడిధాన్యాలు, కూరగాయలు , పండ్లు, బాసుమతి బియ్యం |
ఒక మోస్తరు గ్లైసిమిక్ ఇండెక్స్ |
< 56-69 |
ఐస్ క్రీమ్, గోధుమ, బ్రెడ్, బియ్యం, జ్యూస్ లు, అరటిపండు |
అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ |
< 70>70 |
వైట్ బ్రెడ్ , బియ్యం , ఆలుగడ్డ |
ఆహార పదార్థాలు - గ్లై సిమిక్ ఇండెక్స్
ధాన్యాలు మొక్కజొన్నఅటుకులు 83 గోధుమ 68 బియ్యం 89 బాసుమతి బియ్యం 58 బార్లీ 25 చిరుధాన్యాలు 71 |
పండ్లు ఆపిల్ 38 అరటి పండు 56 ద్రాక్ష 46 కివి 52 మామిడి పండు 55 ఆరెంజ్ 43 బొప్పాయి 58 పైన్ ఆపిల్ 66 ఖర్జూరం 103 ఎండు ద్రాక్ష 64 పుచ్చ కాయ 72 |
పప్పులు కందిపప్పు 21 శెనగపప్పు 11 బఠానీ 25 అలసందలు 37 |
|
పాలు - పాల పదార్థాలు మీగడ పాలు 30 పెరుగు 14 కస్టర్డ్ 43 సోయాపాలు 31 ఐస్ క్రీమ్ 38 |
|
ఆధారం :
డాక్టర్ ఎన్.నిర్మలమ్మ, పోషకాహార నిపుణులు.
కుమారి ఎన్.సునీత, విద్యార్ధి ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/090.