অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ముఖ్య ఆరోగ్య విషయాలు

ముఖ్య ఆరోగ్య విషయాలు

 1. అత్యంత ఆరోగ్యకరమైన తులసి
  1. తులసితో...
  2. ఆకులు
 2. సర్వరోగ నివారిని ప్రాణాయామం
  1. ప్రాణాయామ విశేషాలు
  2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు
  3. తీసుకోవలసిన జాగ్రత్తలు
 3. శాకాహారమే ఆరోగ్యానికి అత్యుత్తమం
  1. ఎన్నెన్నో కారణాలు
  2. ఆరోగ్యానికి ఎంతో మేలు
  3. ఎన్నో రకాలు
  4. శాకాహారమే ఎందుకు తినాలి?
  5. శాకాహారంతో లోటేమిటి? శాకాహారంలో లభించే పోషకాలు.....
  6. మొలకెత్తిన పెసర్లు, శనగలు
  7. నానబెట్టిన వేరుశనగలు
  8. సలాడ్
  9. పప్పు, ఆకుకూరలు
  10. జాగ్రత్తలు
  11. నీళ్లెప్పుడు తాగాలి?
 4. ఉచితంగా ఆరోగ్యంను పెంపొందించుకోవడం
  1. ఉదాహరణకు
  2. నిద్ర బాగా పట్టాలంటే...
 5. ధ్యానం - ఉపయోగాలు
  1. యోగా ప్రయోజనాలు ఇవీ...
  2. విదేశాల్లోనే ఎక్కువ ఆదరణ...
  3. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షణ...
 6. ఆకలి... ఆరోగ్యం...
 7. ఆత్మజ్ఞానం.. క్రియాయోగం
  1. యోగ ప్రార్థన క్రియ...
  2. భస్ర్తిక క్రియ...
  3. శిరస్సుకు...
  4. టెన్షన్‌ తగ్గించే క్రియలు...
  5. నేత్రశక్తి క్రియలు...
  6. కళ్లకు శాంతిని కలిగించే క్రియలు...
 8. ప్రాథమిక వ్యాయామాలు
  1. ఎక్సర్‌సైజ్‌ నెం.1: ఉన్నచోటే పరుగెట్టడం...
  2. ఎక్సర్‌సైజ్‌ నెం.2: గెంతడం...
  3. ఎక్సర్‌సైజ్‌ నెం.3: గొంతుక్కూ చోండి...
  4. ఎక్సర్‌సైజ్‌ నెం.4: తొడలను పట్టండి...
  5. ఎక్సర్‌సైజ్‌ నెం.5: పాక్షికంగా గుంజిళ్ళు...
  6. ఎక్సర్‌సైజ్‌ నెం.6: ముందుకీ, వెనక్కి వంగోండి...
 9. కపాలభాతి యోగ స్నానం
  1. కపాలభాతి ప్రయోజనాలు:
  2. వీళ్లు చేయకూడదు!
  3. ఎప్పుడు చేయాలంటే!
  4. అంతర వ్యాయామం: ఆయుర్వేదం
  5. యోగశాస్త్రం ప్రకారం
 10. ఒక పౌష్టికాలోచన!
  1. సత్తిపిండితో మొదలై...
  2. శ్రీదత్తా న్యూట్రిషన్స్...
  3. వ్యాపార మెళకువలు...
  4. ఎన్ని రకాలు...
  5. రాష్ట్రం దాటిన పాఠాలు...
  6. పేదలకు శిక్షణ...
  7. ఇవి కాకుండా...
  8. ఎన్ఐఎఫ్ గుర్తింపు...
 11. కాఫీ ఆరోగ్యకరమే!
  1. ఇందులో నిజానిజాలు పరిశీలిద్దాం...
  2. కాఫీయా? పళ్ళ రసమా?
  3. కాఫీ ఎంపికలో జాగ్రత్తలు...
 12. ఆరోగ్యానికి ఆహారం
  1. అక్రూట్లు...
  2. కప్పు గ్రీన్‌ టీ...
  3. పాప్‌కార్న్‌...
  4. డార్క్‌ చాకొలేట్‌...
 13. వేసవిలో ఆహారం
  1. పెద్దలకు...
  2. వృద్ధులకు
  3. పిల్లలకు...
 14. వెజిటేరియన్ మాంసం
  1. ప్రొటీన్ల వల్ల ఉపయోగాలు...
  2. వెజ్‌లో ప్రొటీన్లు...
  3. గుడ్డులో...
  4. అల్పాహారంలో...
  5. 100 గ్రా.ల పదార్థాలలో ప్రొటీన్ల శాతం...
  6. వయసుల వారీగా ఒక రోజుకు కావలసిన ప్రొటీన్లు
 15. బరువు తగ్గటానికి సూచనలు
  1. వెయిట్ తగ్గించే అద్భుతాలు
  2. అసలైన మంత్రం
 16. చురుకుగా ఉండాలంటే
  1. బ్రేక్‌ఫాస్ట్‌లో...
  2. మధ్యాహ్న భోజనం....
  3. చేపతో లాభాలెన్నో...
 17. జీవన శైలి సమస్యలకు చికిత్స
  1. నాడీ వ్యవస్థే పునాది
  2. జీర్ణాశయం చిక్కులు
  3. కఫం మాటేమిటి?
 18. వివిధ ఆహార పదార్థాల కలయిక, అపోహలు-వాస్తవాలు
  1. టొమాటో + పాలకూర
  2. పొట్లకాయ + గుడ్డు
  3. చేపలు + పెరుగుచేపలు
  4. భోజనం + పండ్లు
  5. నూనెలు + నూనెలు
  6. ఆకుకూరలు + కూరగాయలు + పప్పు దినుసులు
  7. పడని పదార్థాలు
  8. విషాహారానికి విరుగుడు...
 19. జుట్టు రాలడాన్ని నిరోధించేదెలా?
  1. కారణాలు
  2. హోమియో చికిత్స
 20. పేనుకొరుకుడు
  1. తక్షణ జాగ్రత్తలు తీసుకుంటే పేనుకొరుకుడు నయమౌతుంది!
  2. కారణం :
  3. ఎక్కడెక్కడ వస్తుంది :
  4. ఎవరిలో వస్తుంది :
  5. చికిత్స : దీనికి రకరకాలైన చికిత్సా విధానాలు కలవు.
   1. చికిత్స ఫలితాలు :
  6. ఆయుర్వేద చికిత్స :
 21. చలికాలం - ఆహార జాగ్రత్తలు!
 22. సిజేరియన్ - వాస్తవాలు
  1. పోషకలోపం... పెనుశాపం
  2. డాక్టర్ల కష్టాలూ ఓ కారణం
  3. నార్మల్ డెలివరీ కావాలంటే...
 23. ఎలక్ట్రో థెరపీ
  1. ఎలక్ట్రోథెరపీ చరిత్ర...
  2. ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ ప్రాముఖ్యం
  3. ట్రాక్యుటేనియస్‌ ఎలక్ట్రికల్‌ నెర్వ్‌ స్టిమ్యులేషన్‌ (టెన్స్‌)...
  4. గాల్వినిక్‌ స్టిమ్యులేషన్‌ (జిఎస్‌)...
  5. ఇంటర్‌ఫెరెన్షియల్‌ కరెంట్‌ (ఐఎఫ్‌సి)...
  6. అల్ట్రాసౌండ్‌...
  7. చెడు ప్రభావాలు, ముందు జాగ్రత్తలు...
 24. 4 నిమిషాల వ్యాయామం
 25. శీతాకాలంలోనే కాదు.... ఏ కాలమైనా కోమలమే..
  1. పాదాలు సంరక్షణకు:
  2. చేతుల సంరక్షణకు:
  3. కాలంతో పనిలేదు...
  4. స్మూత్‌గా తయారవుతుంది...
  5. అపుడే అందం వస్తుంది...
  6. యునానితో... అన్ని వ్యాధులు నయం
  7. ప్రత్యేక వన మూలికలతో వైద్యం...
 26. ఆస్తమా - ఉబ్బసం ప్రమాదం కాదు
  1. ఆస్తమా ఎందుకు వస్తుంది?
  2. ఆస్తమా వేటి వలన వస్తుంది?
  3. ఆస్తమా- చిన్నపిల్లలు
  4. ఆస్తమా- ఆహారం...
  5. ఆస్తమా- చికిత్స...
 27. మర్దన చికిత్స (మసాజ్‌ధెరపీ)
  1. మర్దన చికిత్స వల్ల ఎన్నో లాభాలు...
  2. మర్దన చికిత్స వల్ల ఒనగూరే భావోద్రేకపరమైన లాభాలు...
 28. సంగీతంతో వైద్యం.... మ్యూజిక్‌ థెరపీ
  1. మ్యూజిక్‌ థెరపీ - రకాలు...
  2. పిల్లలకు మ్యూజిక్‌ థెరపీ...
  3. భారత్‌లో మ్యూజిక్‌ థెరపీ...
 29. పసుపుతో ఆరోగ్యం
 30. వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు
 31. చర్మవాధ్యులకు''నాన్‌వెజ్''తైలాలు
  1. ఈము తైలం
  2. ఉపయోగాలు:
  3. చేపనూనె:
  4. ఉపయోగాలు
  5. గుడ్డు సొన నూనె
  6. ఉపయోగాలు:
 32. డాన్స్‌ థెరపీ
  1. భారత్‌-అమెరికాల్లో డ్యాన్స్‌ థెరపీ వైవిధ్యం...
 33. కండర పుష్టికి తైలాలు
  1. ఉపయోగాలు
  2. మహా మాష తైలం
  3. ఉపయోగాలు
  4. సూచనలు:
 34. ఇవి తింటే హృదయం పదిలం
 35. సరికొత్త డైట్ డ్రింక్‌
 36. బలాన్ని ఇచ్చే బాదం
 37. అడవిలో ఆసుపత్రి..... మూలికలే మందులు!
 38. అమెరికన్ల ఆహారం - విశ్లేషణ
  1. వాళ్లది'బ్రెడ్డూ కాదు ఫుడ్డూ కాదు'
  2. మిగిలేది పదిశాతమే...
  3. విడగొట్టి...కలుపుతారు
  4. ఆరుసార్లు తింటారు
  5. కార్న్ అండ్ కార్ కంట్రీ
  6. రసాయనాలు మింగితే పోలా!
  7. పోషకాలే విషపదార్ధాలైతే...
  8. ఆ పాలవల్ల గుండెజబ్బులొస్తున్నాయట
  9. చికెన్‌లో కూడా అంతే...
  10. ... అందుకే సేంద్రీయమే గతి
 39. విటమిన్‌'బి'తో నిరాశ దరిచేరదు
 40. యోగాతో నిగనిగ
 41. ఆల్కహాల్ - దుష్ప్రభావాలు
  1. అకస్మాత్తుగా మానేస్తే అనేక భ్రాంతులు...
  2. గుండె ఆరోగ్యం - మద్యం
  3. జలుబు, దగ్గు - మద్యం
  4. మానసిక జబ్బులలో..
  5. గర్భవతులు - మద్యం
  6. యుక్తవయసులో...
  7. బయటపడటానికి...
 42. ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి
  1. ఉసిరితో ఎంతో మేలు:
 43. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా...
  1. వృద్ధాప్య సమస్యలు:
  2. వృద్ధాప్య సంరక్షణలో ఉపయోగపడే మొక్కలు:
 44. ఆరోగ్యానికి అవసరమైన ఉత్తమ ప్రయోజనాలు టీలో దండిగా
  1. చాయ్... సాటిలేదురా భాయ్
 45. మద్యం అనే ద్రవం కడుపును ముంచేయడం ఖాయం!!!
  1. పాంక్రియాస్‌పై కూడా ప్రభావం.
  2. 1-దశ: మైల్డ్ ఫ్యాటీ లివర్
  3. 2-దశ: ఆల్కహాలిక్ హెపటైటిస్
  4. 3-దశ: ఆల్కహాలిక్ సిర్రోసిస్
  5. కాలేయంపై దుష్ర్పభావం ఎందుకు..?
  6. చికిత్స...
 46. ఆహారం మానేయకుండానే శరీరాన్ని నాజూగ్గా ఉంచుకోవచ్చు
  1. చిక్కిన అందం
  2. చిరుతిళ్లు:
  3. ఎంత తినాలి:
  4. కాస్త నడక మంచిది:
  5. ఎక్కువ ఆకలి వేస్తే:
  6. కొద్ది పాటి వ్యాయామం:
 47. ఆధునిక జీవితంలో.. ఒత్తిడి - నివారణ
  1. ప్రమాద సంకేతాలు:
  2. చికిత్స:
  3. ఆయుర్వేదం ప్రకారం ఒత్తిడి నిర్వహణకు...
  4. ఒత్తిడి నివారణకు ఔషధాలు
  5. మానసిక ఉద్దీపకాలు:
  6. శరీరం పై ఒత్తిడి ప్రభావం
 48. పైల్స్‌ వ్యాధి - చికిత్స
  1. పైల్స్‌:
  2. ఫిషర్‌:
  3. ఫిస్టులా:
  4. పరీక్షలు:
  5. వైద్యం:
  6. జాగ్రత్తలు:
 49. యాంప్యుటేషన్-ఏదేని కారణంగా కాలు, చేయి వంటి శరీరంలోని ఒక అవయవాన్ని తొలగించడాన్ని యాంప్యుటేషన్‌ అంటారు.
  1. యాంప్యుటేషన్‌కు కారణాలు:
 50. దంత వైద్యానికి లేజర్‌ - చికిత్స

అత్యంత ఆరోగ్యకరమైన తులసి

తులసిని అత్యంత పవిత్రంగా కొలిచే వాళ్లు మన పూర్వీకులు. ఉదయం లేవగానే తులసి పూజ చేయకుండా పనులు మొదలు పెట్టేవాళ్లు కాదు. పురాణాలలో కూడా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అత్యంత ఆరోగ్యకరమైన అంశాలు తులసిలో ఉన్నాయి. ఇంతటి పవిత్రత గల తులసి గురించి......

ఎన్నో ఏళ్ల తరబడి హిందువులు భగవంతుడికి కానుకలు, పువ్వులు సమర్పించడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఎంతో పవిత్రతను, ప్రాధా న్యతను సంతరించుకున్న తులసి నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు దీనిలో ఉన్న ఔషధ గుణాలను సౌందర్య పోషణకు వాడుకుంటున్నారు. ఎందుకంటే తులసి కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలే కాదు మొక్క కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్ర మైనదని, ఔషధాలతో కూడుకున్నదని పద్మ పురాణంలో పేర్కొ న్నారు.'‘తులసి మొక్కను చూసినా లేదా తాకినా అన్ని రకాల ఒత్తిడులు, జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి మొక్కపై నీళ్ళు పోస్తే భయాలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా తులసి మొక్కను నాటినా, నీళ్లు పోసినా వారు కృష్ణుడికి ప్రీతి పాత్రమవుతారని''స్కందపురాణం చెబుతోంది. అయితే కేవలం దైవాత్వా నికే కాకుండా తులసిలో కొన్ని రకాల ఔషధ గుణాలున్నాయని వైద్య నిపుణులు చెబతున్నారు.

తులసితో...
 • ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభా లెన్కో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.
 • కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 • తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు.
 • అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి.
 • జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
 • బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయి.
ఆకులు
 • జ్వరాన్ని తగ్గిస్తుంది.
 • అల్సర్‌ల నుంచి రక్షిస్తుంది.
 • రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా నియంత్రిస్తుంది.
 • కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి
 • దోహద పడుతుంది.
 • నోటినుంచి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది.
 • అలర్జీలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 • ఎండవల్ల సోకే అలర్జీలు, పొగ, దుమ్ము నుంచి
 • శరీరానికి కలిగే హానిని అరికడుతుంది.
 • ఒత్తిడిని దూరం చేస్తుంది.

దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా పెరట్లో తులసి మొక్క ఉంటుంది. ఎందు కంటే తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంతా పరుచుకొని మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని విశ్వసిస్తారు. తులసి ఆకులను చప్పరించడం వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి ఆకులో ఉండే రసం ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అందుకే చాలా దేవాలయాలలో తీర్ధంలో తులిసీ దళాలను వేసిస్తారు.

సర్వరోగ నివారిని ప్రాణాయామం

తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించితెలుసుకుందాం.

ప్రాణాయామ విశేషాలు

ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది.

ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే''ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌''అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.

ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు.

వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.

ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు
 • ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
 • శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
 • రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా
 • బయటికి వెళ్లి పోతుంది.
 • గుండెకు సత్తువ లభిస్తుంది.
 • మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
 • ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
 • జఠరాగ్ని పెరుగుతుంది.
 • శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
 • ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.
తీసుకోవలసిన జాగ్రత్తలు
 • మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,
 • కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
 • గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
 • మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
 • సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
 • పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
 • ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.
 • అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
 • ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
 • పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.
 • నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
 • నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.
 • ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు
 • రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
 • ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
 • ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

శాకాహారమే ఆరోగ్యానికి అత్యుత్తమం

ప్రపంచంలో దుస్తులు, ఆహారం, ఆచార వ్యవహారాలు లాంటివాటిలో ఎవరి శైలి వారిదే. అందులో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కాలం గడిచే కొద్దీ వీటిల్లోనూ మార్పులు చోటు చేసుకుంటూ వచ్చారు. ఆహారం విషయంలోనూ అలాగే జరిగింది. ఒకప్పుడు మాంసాహారంపై ఆధారపడిన మనిషి వ్యవసాయం నేర్చుకొని శాకాహారంపై దృష్టిసారించాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా కూడా శాకాహారానికి డిమాండ్గ పెరిగిపోతోంది. పలువురు వైద్యనిపుణులు సైతం శాకాహారమే ఆరోగ్యానికి అత్యుత్తమమని సూచిస్తున్నారు. పెటా లాంటి సంస్థలు శాకాహారంపై ప్రచారాన్ని ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు.

మహాత్మాగాంధీ, ఏపీజే అబ్దుల్‌ కలామ్‌, అమితాబ్‌ బచన్‌, రుక్మిణిదేవి అరుండాళ్‌, మోరార్జీ దేశాయి, అనిల్‌ కుంబ్లే, షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌, మల్లయోధుడు సుశీల్‌కుమార్‌, ఆర్‌ మాధవన్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సచిన్‌ టెండూల్కర్‌....వీరందరి మధ్య కూడా ఓ సామ్యం ఉంది. వారంతా శాకాహారులే!

ఎన్నెన్నో కారణాలు

ప్రజానీకం శాకాహారాన్ని ఇష్టపడేందుకు ఎన్నో కారణాలున్నాయి. జీవహింస ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మతపరమైన విశ్వాసాలు, జంతువుల హక్కులను గౌరవించడం, ఆరోగ్యం, రాజకీయపరమైన కారణాలు, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఇందులో ముఖ్యమైనవి.

వీటికి కూడా దూరం
ఎంతో మంది శాకాహారులు ప్యాకేజ్డ్‌ లేదా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కు కూడా దూరంగా ఉంటారు. వీరు కేక్‌లు, కుకీలు, చాక్‌లెట్స్‌, పుట్టగొడుగులతో తయారైనవి లాంటి వాటికి కూడా దూరంగా ఉంటారు. వాటి షెల్ఫ్‌లైఫ్‌ పెంచే ప్రక్రియలో, తయారీ ప్రక్రియలో జంతుసంబంధాలను ఉపయోగించి ఉంటారేమోనన్న భయం ఇందుకు కారణం. చీజ్‌ లాంటి వాటి తయారీలో చాలా దేశాల్లో జంతు సంబంధాలను కూడా ఉపయోగిస్తుంటారు. ఆ విషయం తెలియని వారు వాటిని ఆహారంగా వినియోగిస్తూ ఉంటారు. ఒరిస్సాలో శాకాహారులు సైతం జలపుష్పాల (చేపలు)ను ఆహారంగా స్వీకరిస్తుంటారు.

ఆరోగ్యానికి ఎంతో మేలు

అమెరికా ప్రభుత్వ విభాగాలు విడుదల చేసిన డయటరీ గైడ్‌లైన్స్‌ ఫర్‌ అమెరికన్స్‌ (2010) నివేదిక ప్రకారం మాంసాహారుల కంటే కూడా శాకాహారులే మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. శాకాహారుల్లో స్థూలకాయం తక్కువ. గుండెవ్యాధులు కలిగే అవకాశాలు కూడా తక్కువే. శాకాహారం బీపీని పెంచకుండా చూస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బాడీ మాస్‌ ఇండెక్స్‌ కూడా తక్కువే.

ఎన్నో రకాలు

నిజానికి శాకాహారంలోనూ మరెన్నో ఉపతెగలు ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే...

ఓవో వెజిటేరియనిజం: వీరు గుడ్లు తింటారు కానీ పాలు తాగరు. పాల ఉత్పాదనలు తినరు. ఇందులో కొందరు నాటుకోడిగుడ్లు తినరు. కేవలం ఫామ్‌ గుడ్లు (ఫలదీకరణ ప్రక్రియ ఉండనివి) మాత్రమే తింటారు.

లాక్టో వెజిటేరియనిజం:వీరు పాలు, పాల ఉత్పాదనలు స్వీకరించినా, గుడ్డుకు మాత్రం దూరంగా ఉంటారు.

ఓవో-లోక్టో వెజిటేరియనిజం: వీరు, పాలు, గుడ్లు కూడా స్వీకరిస్తారు.
ప్యూర్‌ వెజ్‌: పాలు, తేనె, గుడ్లు తినరు. జంతువులపై పరీక్షించిన ఉత్పాదనలను వాడరు. జంతువుల చర్మం తదితరాలతో తయారైన దుస్తులు, పాదరక్షలు, అలంకరణ వస్తువులు తదితరాలను ఉపయోగించరు.

రా వెజ్‌: తాజా పండ్లు, విత్తనాలు, కూరగాయలు మాత్రమే స్వీకరిస్తారు. మరీ అవసరమైతే తప్ప వాటిని ఉడికించేందుకు కూడా ఇష్టపడరు.

ఫ్రూటరియానిజమ్‌: వీరు పండ్లు, విత్తనాలు, చెట్లకు హాని కలిగించకుండా సేకరించే వాటిని మాత్రమే తింటారు.

బుద్దిస్ట్‌ వెజిటేరియనిజం: శాకాహారంలోనూ ఉల్లిగడ్డ, అల్లం లాంటి వాటికి దూరంగా ఉంటారు.

జైన్‌ వెజిటేరియనిజం: పాలు ఆహారంగా తీసుకున్నప్పటికీ గుడ్లు, తేనె, దుంపలకు దూరంగా ఉంటారు.

శాకాహారమే ఎందుకు తినాలి?

కూరగాయలు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మాంసాహారం తీసుకుంటేనే బలంగా ఉంటాం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ మాంసాహారం కంటే వెజిటే రియన్ డైట్‌తోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో చదవండి.
డీటాక్సిఫై:వెజిటబుల్ డైట్‌లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే పీచుపదార్థాలు. పాలకూర, క్యాబేజీ, సొరకాయ, గుమ్మడి వంటి కూరగాయలలో పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. పీచుపదార్థాలు శరీరానికి చాలా అవసరం. మలబద్ధకం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందే. శరీరంలో నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది. నాన్‌వెజ్‌లో ఫైబర్ లభించదు.
ధృడమైన ఎముకలు:మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. శాకాహారుల్లో ఇలాంటి సమస్యలు తక్కువే.

కార్బోహైడ్రేట్స్ లోపం: నాన్-వెజిటేరియన్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి. శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ లభించనపుడు అది కెటొసిస్‌కు దారితీస్తుంది. అంటే శరీరం తనకు అవసరమైన ఎనర్జీ కోసం కొవ్వును కరిగించుకొంటుంది. అంతేకాకుండా వెజిటేరియన్ ఫుడ్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను మెల్లగా అందిస్తాయి. అయితే నాన్‌వెజ్‌లో ఫ్యాట్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఆరోగ్యకరమైన చర్మం: బీట్‌రూట్, టమోట, గుమ్మడి, కాకరకాయ వంటి కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆపిల్స్, పియర్స్, జామకాయ లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు.

బరువు నియంత్రణ: కొవ్వును తగ్గించుకోవాలంటే సులభమైన మార్గం నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటమే. మాంసాహారం తీసుకునే వారు బరువును తగ్గించుకోలేరు. అయితే నాన్‌వెజ్‌కు బదులుగా తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్ తీసుకొంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. వెజిటేరియన్ డైట్ వల్ల అధిక రక్తపోటు, అధిక బరువు నియంత్రణలో ఉంటాయి.

ఫైటో న్యూట్రియెంట్స్: డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్, బోన్ లాస్ వంటి వ్యాధులను ఫైట్రోన్యూట్రియెంట్స్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఇవి వెజిటేరియన్ డైట్‌లో మాత్రమే లభిస్తాయి. నాన్‌వెజ్ తీసుకునే వారిలో వీటికి కొరతేఉంటుంది.
సులభంగా నమలడం:మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం లాలాజలంతో మొదలవుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే ఈ ప్రక్రియ మరింత బాగా జరుగుతుంది. అంతే కాకుండా కూరగాయలతో తీసుకునే ఆహారాన్ని సులభంగా నమలవచ్చు.

శాకాహారంతో లోటేమిటి? శాకాహారంలో లభించే పోషకాలు.....

శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి.

ఏమిటిలా చిక్కిపోతున్నావ్? అని ఎవరైనా ప్రశ్నిస్తే, గుడ్లా? మాంసమా? చిక్కిపోక ఏం చేస్తాం? అంటూ ఎదురుప్రశ్న వేస్తుంటారు. చిక్కిపోవడానికి గల అసలు కారణాల గురించి ఏ మాత్రం ఆలోచన ఉండదు. ఆకుకూరలు, కాయగూరలు తినడమే అసలు లోపం అన్నట్లుగా వారి ధోరణి ఉంటుంది. నిజానికి మనిషికి అవసరమైన అన్ని పోషకాలు, ప్రొటీన్లు శాకాహారంలోనూ సంపూర్ణంగా లభిస్తాయంటున్నారు నిపుణులు.

సిసలైన పౌష్టికాహారం అంటే మాంసాహారమేనన్న అభిప్రాయం ఉంది. అందుకే మాంసాహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అంతిమంగా ఈ ఆహారపు అలవాట్లు జీర్ణకోశ సమస్యలకు దారి తీస్తాయి. శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి. మాంసాహారం మీద ప్రీతితో అంతే మోతాదులో తీసుకుంటూ పోతే అవి జీర్ణం కావు. ఆకలి మందగించడంతో పాటు కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

పౌష్టికాహారం పేరిట అదేపనిగా మాంసాహారం, గుడ్లు తీసుకుంటే వాటిని అరిగించుకోవడానికి జీర్ణకోశంపైన అనవసరపు భారం పడుతుంది. శరీరంలోని జీవశక్తి అదనంగా ఖర్చవుతుంది. శరీరతత్వంలో కొన్ని చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకలి మందగించడం, కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి. మాంసాహారం, గుడ్లు పూర్తిగా మానకోవాలని కాదు. ఒక పరిమితిలో వాటిని తీసుకోవచ్చు. అయితే, మాంసాహారం నుంచి మాత్రమే కావలసిన పోషకాలు లభిస్తాయనుకోవడం సరికాదు. శాకాహారం నుంచి కూడా అవసరమైన ప్రొటీన్లతో పాటు పోషకపదార్థాలన్నీ లభిస్తాయి. పెద్దవారికి ఇవి అవసరానికంటే ఎక్కువే.

మొలకెత్తిన పెసర్లు, శనగలు

వీటి నుంచి ప్రొటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తరుచూ వీటిని ఉపాహారంగా (బ్రేక్‌ఫాస్ట్) తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తాయి. మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్లతో పాటు లవణాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.పైగా వీటిని జీర్ణించుకోవడంలో శరీరానికి ఎక్కువ శక్తి కూడా ఖర్చు కాదు. మొలకెత్తించే విధానం గింజలను నీటిలో నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని తడిగుడ్డలో మూట కట్టి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. కొంచెం గాలి తగిలేలా మూత కాస్త తెరిచి పెట్టాలి. సాధారణంగా 12 నుంచి 16 గంటల వ్యవధిలో ఇవి మొలకెత్తుతాయి. చలికాలంలో అయితే 24 గంటల దాకా పట్టవచ్చు.

నానబెట్టిన వేరుశనగలు

శరీరానికి కావలసిన ఎన్నో పౌష్టిక విలువలు, ప్రొటీన్లను వీటి ద్వారా పొందవచ్చు. వేరుశనగ గింజలను పన్నెండు గంటలపాటు నానబెట్టాలి. ఆ తరువాత నీరు తీసివేయాలి. ఇలా చేయడం వల్ల అందులోని హానికారక అంశాలన్నీ తొలగిపోతాయి. ఈ వేరుశనగలను బెల్లంతో కలిపి తీసుకుంటే ఎంతో శక్తి లభిస్తుంది.

సలాడ్

క్యారెట్, కీర, బీట్‌రూట్, ఉల్లి, క్యాబేజీ, క్యాప్సికమ్‌లను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. అప్పుడప్పుడు పచ్చి బఠాణి, రుచి కోసం కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవచ్చు. టమాటకు బదులుగా నిమ్మరసం కలుపుకోవచ్చు. సలాడ్ తినడానికి చాలా ముందు ఉప్పు కలిపి పెడితే నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తరువాత ఒకరకమైన వాసన వస్తుంది. కాబట్టి తినే సమయంలో మాత్రమే ఉప్పు కలుపుకోవాలి. రాత్రిపూట ఆహారంతో పాటు తీసుకుంటే చాలా మంచిది.

పప్పు, ఆకుకూరలు

పప్పులో ప్రొటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆకుకూరలో, ఇనుము, లవణాలు అధికంగా ఉంటాయి. రక్తహీనతను ఆకుకూరలు బాగా అరికడతాయి. నీరసం, అలసట తగ్గుతుంది. రక్తహీనత తగ్గడంతో పాటు రక్తస్రావ సమస్యలు కూడా నయమవుతాయి. వీటితో పాటు నానబెట్టిన ఎండు ద్రాక్ష, అత్తిపండు, నానబెట్టిన బాదం, నల్లరకం ఎండు ఖర్జూరం తీసుకోవడం శ్రేయస్కరం.

జాగ్రత్తలు
 • తరచు వేపుడు పదార్థాలు, మైదా వంటలు, ఊరగాయలు తినడం మానేయాలి.
 • ఉప్పు సగం టీ స్పూన్‌కు మించకుండా ఉండాలి.
 • అవసరం ఉన్న వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి రెండు లేక మూడు స్పూన్‌ల నెయ్యి వాడవచ్చు.
 • సమయానికి భోజనం చేయాలి. రాత్రి భోజనం ఎనిమిది గంటల కంటే ముందే ముగించాలి.
 • నిద్రా సమయానికి, రాత్రి భోజనానికి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండాలి.
 • రాత్రి ఆహారంలో 50 శాతం పచ్చి కూరగాయలు, పళ్లు తీసుకోవాలి.
 • అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు రాత్రి ఆహారంలో అన్నం కాకుండా గోధుమ పుల్కాలు, జొన్న రొట్టె తినడం మంచిది.
 • 35 ఏళ్లు దాటిన వారు వారానికి ఒక రోజు ఉపవాసం చేయడం ఆరోగ్యకరం. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు. వండని పదార్థాలు తీసుకోవడం, పళ్లు, పళ్ల రసాలు, మొలకెత్తిన గింజలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తప్పనిసరిగా తీసుకోవాలి.
నీళ్లెప్పుడు తాగాలి?

ప్రతిరోజు మూడు లీటర్ల నీళ్లు తాగాలి. అజీర్తి, మలబద్ధకం, అర్షమొలలు, గాల్‌బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు అధికంగా నీరు తీసుకోవడం వల్ల తొలగిపోతాయి. భోజనానికి అరగంట ముందు, అరగంట తరువాత మాత్రమే నీరు తాగాలి. భోజన సమయంలో జీర్ణప్రక్రియ కోసం కేవలం ఒకటి రెండు గ్లాసుల నీరు తీసుకోవచ్చు. భోజనం చేస్తున్నప్పుడే అమితంగా నీరు తాగడం వల్ల ఎంతో నష్టం ఉంటుంది. ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి కొన్ని జీర్ణరసాలు తయారవుతుంటాయి.

భోజనసమయంలో లేక భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబారతాయి. దీనివల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కాకుండా పోతాయి. కొంత మంది రోజుకు 5 నుంచి 6 లీటర్ల నీరు తాగుతుంటారు. దీనివల్ల నీటిని తిరిగి బయటకు పంపడంలో కిడ్నీలపై అనవసరపు భారం పడుతుంది. శరీరానికి అవసరమయ్యే నీరు మూడు లీటర్లే. ఆ పరిమితిని పాటించడమే ఆరోగ్యకరం.

ఉచితంగా ఆరోగ్యంను పెంపొందించుకోవడం

ఖర్చు పెట్టి మందులను మాత్రమే కొనగలం. ఆరోగ్యాన్ని కొనలేం'అన్నది ఒక నానుడి. కానీ ఆరోగ్యాన్ని ఉచితంగానే పొందవచ్చు. మనం రోజూ చేసే పనులతోనే ఒక్క పైసా ఖర్చు కాకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు. కాకపోతే కొద్దిపాటి వ్యాయామం, మంచి బ్రేక్‌ఫాస్ట్, క్రమం తప్పకుండా వేళకు నిద్రపోవడం వంటి కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుందంతే. ఇవన్నీ ఫ్రీగా లభించేవే. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచితంగానే ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తెలిపేదే ఈ కథనం.

మనం పనిచేస్తే ఆరోగ్యకరమైన రీతిలో శక్తి ఖర్చవుతుంది. కానీ మనం పనిచేయకపోయినా మన కండరాలు దెబ్బతింటాయని మీకు తెలుసా? మనం ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే రోజుకు ఎనిమిది గ్రాముల చొప్పున కండరాల్లోని ప్రోటీన్ ఖర్చవుతుంది. శారీరక శ్రమ లేనివారిలో ప్రతి వారం 1.54 గ్రాముల మేరకు ఎముకను కోల్పోతాం. కొన్ని రోజుల పాటు అదేపనిగా రెస్ట్ తీసుకుంటే 10-15 శాతం రక్తంలోని ప్లాస్మాను కోల్పోతాం. దీన్ని అధిగమించాలంటే ఖర్చు చేయాల్సింది డబ్బు కాదు... కేవలం కాస్త శారీరక శక్తినే. రోజుకు 40 నిమిషాలు కేటాయించి రోజూ నడకలాంటి వ్యాయామం చేస్తే మనం కోల్పోయే కండరాలను, ఎముకలను (మజిల్ లాస్ అండ్ బోన్ లాస్)ను అరికట్టవచ్చు. మనం రోజూ ఉపయోగించే లిఫ్ట్‌కు బదులు మెట్లపై నడవడం, కాస్తంత సమీపంలోనే ఉన్న ప్రదేశాలకు వాహనాలు వాడకపోవడం వంటివి చేస్తే చాలు. దీనితో పాటు సరైన నిద్ర, తప్పనిసరిగా వేళకు బ్రేక్‌ఫాస్ట్, వేళకు మంచి ఆహారం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆరోగ్యం కోసం శారీరక శ్రమ అవసరం. దానికోసం గుర్తుపెట్టుకుని పాటించాల్సిన అంశాలివి...
వాకింగ్ అన్నిటికంటే ముఖ్యమైన వ్యాయామం.

జాగింగ్, రన్నింగ్ వంటివి మొదలుపెట్టే ముందర వాకింగ్ తప్పనిసరిగా చేయాలి.

పతిరోజూ 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ అలా వారంలో కనీసం ఐదుసార్లు పాటించాలి.

వాకింగ్‌లో వేగం ప్రతి గంటకు మూడు కిలోమీటర్ల నుంచి ఏడు కిలోమీటర్ల వరకు ఉండవచ్చు.

వాకింగ్ ఏ వేళలో చేసినా పరవాలేదు. ఉదయం వేళల్లో అయితే మంచిది.

వాకింగ్ చేస్తే తప్పనిసరిగా చెమట పట్టాలనే నియమం లేదు.

జబ్బుతో ఉన్నప్పుడు వాకింగ్ చేయడం మంచిది కాదు.
నడక మొదలుపెట్టాక ఆపడం మంచిది కాదు. ప్రతిరోజూ చేయాలి. ఎందుకంటే ఒకసారి నడక మొదలు పెట్టాక అడపాదడపా మానేస్తుంటే శరీరం దానికి అడ్జస్ట్ కావడం అన్నది కష్టమై శరీరంమీద చాలా ఒత్తిడి పడుతుంది.

పరగడపున వాకింగ్ కంటే ఏదైనా తేలికపాటి శ్నాక్ తీసుకుని వాకింగ్ చేయడమే మంచిది.

స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అవి కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఆరోగ్యాన్ని పెంచుకుంటున్న స్పృహ మిమ్మల్ని ఆ అలవాట్లకు దూరంగా ఉంచుతుంది.

మంచి బ్రేక్ ఫాస్ట్: మనం ఒక రోజులో ఖర్చు పెట్టే శక్తిలో మూడింట ఒకవంతు మనం ఉదయం తీసుకునే ఆహారం (బ్రేక్ ఫాస్ట్) తోనే వస్తుంది. రోజూ బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల కేవలం శక్తిని పొందడం మాత్రమే కాదు... మన ప్రవర్తనలోనే మార్పు వస్తుంది.

ఉదాహరణకు

మనలో చిరాకుపడే తత్వం తగ్గుతుంది.

దేనిమీదనైనా దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి పెరుగుతుంది.

అవసరాన్ని బట్టి తదేకంగా పనిచేయగలిగే శక్తి మెరుగవుతుంది.

దానితో పాటు మన బరువుకు తగినట్లుగా వేళకు మంచి ఆహారం తీసుకోవాలి.

దీనితో పాటు మన ఆహార అవసరాలకు తగినట్లుగా అవసరమైనన్ని క్యాలరీల ఆహారమే తీసుకోవాలి.

నిద్ర బాగా పట్టాలంటే...

బెడ్‌రూమ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ వేడిగానూ, ఎక్కువ చల్లగానూ ఉండకూడదు. నిద్ర వేళ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.

సాయుంత్రం వేళల్లో కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.

రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి.

ప్రతి రోజూ నిర్ణీత వేళకే నిద్రకు ఉపక్రమించాలి.

నిద్రకు ముందు టీవీలో ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలూ, సీరియుళ్లు చూడొద్దు.

రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు.

నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి.

గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.

నిద్రకు ముందు పుస్తకాలు చదవడం వంటివి చేయువద్దు. పుస్తకం చదువుతూ ఉంటే అలా మనకు తెలికుండానే నిద్రపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ... నిజానికి అలా దృష్టి పూర్తిగా చదవడంలో నిమగ్నమైపోతే నిద్రకు దూరమయ్యే సందర్భాలే చాలా ఎక్కువ.

పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోండి.

నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. అందుకే మద్యం తాగి నిద్రలోకి జారుకున్న తర్వాత నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.

నిద్ర... ఎప్పుడూ మనలను ఆరోగ్యకరంగా ఉంచే మన మెదడుకు తగినంత విశ్రాంతి కావాలంటే మంచి నిద్ర అవసరం. మంచి నిద్రవల్ల వయసుతో వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు.

ధ్యానం - ఉపయోగాలు

నిత్యం పని ఒత్తిడి..శారీరకంగా..మానసికంగా ఎంతో అలసిపోతున్నాం..పెరుగుతున్న పోటీతత్వం కారణంగా ఎప్పటికప్పుడు సామర్ధ్యం పెంచుకుంటూ పోటీ పడాల్సి వస్తోంది. ఇంటి బాధ్యతలు..బంధుత్వాలు.. స్నేహాలు ఇలా ప్రతిక్షణం మనిషిని చుట్టే ఆలోచనలు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నారుు. మనసులు మానసిక సంఘర్షణలకు లోనవుతున్నారుు. ఈ బాధ్యతలన్నీ సరైన ప్రణాళిక లేకుంటే ఏ పనీ సరిగా చేయలేం. అనుకున్నవన్నీ సాధించలేం. దీని నుంచి ఎలా బయటపడాలి? జీవితంలో విజయం ఎలా సాధించాలి? ఆనందంగా ఎలా ఉండాలి? సమాజ నిర్మాణంలో మన బాధ్యత ఏంటి? ఇలా ఎప్పుడైనా ఆలోచించామా? అనేక శారీరక రుగ్మతలకు మానసిక దుర్బలత్వమే కారణం. మరి మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండా లంటే తగిన వ్యాయామం చేయాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన మెదడుకు పదును పెట్టాలి. అంటే మనసును ప్రక్షాళన చేసుకోవాలి. ఇందుకు ధ్యానం చక్కటి మార్గం. ప్రస్తుతమున్న జీవన విధానం కన్నా ఉన్నతంగా ధ్యానం ద్వారా జీవితాన్ని గడపవచ్చని ధ్యానేకంద్రాల నిర్వాహ కులు చెబుతున్నారు.

ఏదైనా పవిత్ర లక్ష్యాన్ని నిర్థారించుకుని దానిపైనే దృష్టి నిలపడం ధ్యానం. ఇది ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి. ధ్యానం యోగాలో ఒక భాగం. మన పూర్వీకులు అనేక సంవత్సరాలు పరిశో ధన చేసి మానవ శరీరం యోగా రూపంలో గొప్ప ఆద్యాత్మిక శక్తిని సాధించే ప్రక్రియను ప్రపంచానికి అందించారు. యోగాకు ఆద్యుడు పతంజలి సూచించిన ప్రకారం ఎనిమిది నియమాలతో కూడుకుంది. భౌతిక శాస్తప్రరంగా, సాంకేతిక విజ్ఞానపరంగా ఎంతో వృద్ధి సాధించినప్పటికీ సంతోషంగా మనం జీవించలేకపోతున్నాం. ఈ దిశగా ఆలోచిస్తే యోగా అవసరమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగా, ధ్యానం సాధనచేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని సాధకులు చెబుతున్నారు.

యోగా ప్రయోజనాలు ఇవీ...

మనం సాధన చేసే తీరును బట్టి ఫలితాలు ఉంటాయి. మనం ప్రతి రోజూ భౌతిక విధులు నిర్వర్తిస్తున్నట్లుగానే ధ్యానాన్ని కూడా నిత్యకృతగా మార్చుకుంటే మంచి ఫలితాలు బోధపడతాయని యోగా నిపుణులు చెబుతున్నారు. కేవలం శారీరక, మానసిక ఆరోగ్యా లకే ఈ ధ్యానం పరిమితం కాదు. మనం ప్రశాంతంగా జీవిస్తూ, మన చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడమే ధ్యానం. నిర్మాణాత్మక సమాజం దిశగా మనం పయనించేందుకు ధ్యానం గొప్ప వరం. సాంప్రదాయ యోగా క్రమేణా అనేక పద్ధతుల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎన్నో సంస్థలు పలు రకాలుగా యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తూ వాటి కేంద్రాలను విస్తరిస్తున్నాయి.

విదేశాల్లోనే ఎక్కువ ఆదరణ...

యోగా మన దేశంలో పుట్టినప్పటికీ విదేశా ల్లోనే ఎక్కువ ఆదరణకు నోచుకుంటోందని యోగా గురువు ఎ.ఎల్వీ కుమార్‌ చెబుతున్నారు. అన్నారు. అమెరికా, స్వీడన్‌, కెనడా, యుకె, పోలెండ్‌ దేశాలకు చెందిన 20 మంది పాశ్చాత్యులు యోగా నేర్చుకోవడానికి ఇటీవల భాగ్యనగరానికి విచ్చేశారు. యోగా హీలింగ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్చంద సంస్థ సాంప్రదాయయోగా (ట్రెడిషనల్‌ యోగా) లో టీచర్లకు గత కొద్ది కాలంగా శిక్షణను అందిస్తోంది. శిక్షణలో భాగంగా ఆసనాలు, ప్రాణాయామ, శ్వాస పద్ధతులు, మెడిటేషన్‌ తదితర అంశాలపైన క్లాసులు ఇస్తున్నారు. ఇవే కాకుండా యోగా పరిచయం, ఎక్‌స్టర్నల్‌ (బహిర్గత), ఇంటర్నల్‌ (అంతర్గత) యోగా, ఇతర ప్రత్యామ్నాయ శాస్తల్రను బోధిస్తున్నారు.

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షణ...

ప్రధానంగా ధ్యానం పైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. రిథమిక్‌ టైప్‌ ఆఫ్‌ బ్రీథింగ్‌లో ఆరు రోజులపాటు ఈ శిక్షణ ఉంటుంది. ప్రతి రోజు మూడు గంటలపాటు ప్రాణా యామం బస్ర్తిక, సుదర్శన్‌ క్రియల్లో శిక్షణ ఇస్తారు. ఈ ధ్యానం వల్ల శరీరానికి 72 నుంచి 80 శాతం వరకు గాలి అదనంగా అందుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసి ఇతరత్రా సమస్యలను ఎదుర్కొనేందుకు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దీనిని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అందిస్తోంది. కోర్సు పూర్తయిన తరువాత ప్రతి రోజూ 20 నిముషాల పాటు దీనిని కొనసాగిస్తే సరిపోతుంది.

-ఇస్కా రాజేష్‌బాబు

ఆకలి... ఆరోగ్యం...

ఉపవాసం పేరిట లంఖణాలు చేయడం అంత మంచిది కాదు. అలా కడుపును చాలా సేపు ఖాళీగా ఉంచడం సరైనది కాదు. కడుపును ఖాళీగా ఉంచడం, పూర్తిగా భర్తీ చేసేయడం... ఈ రెండూ మంచిది కాదు.

మీకు వేళకు ఆకలవుతుందా? మంచి జీర్ణశక్తి ఉందా? అది మంచి ఆరోగ్య సూచన. ఆ ఆరోగ్యాన్ని అలా కొనసాగించాలి. మనం పనులతో దాన్ని నిర్లక్ష్యం చేసి ఆకలిని పట్టించుకోకుండా ఉండటం, వేళకు తినకపోవడం, వేళ మించాక తినడం వంటివి చేస్తే చేజేతులారా సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ఆకలి విషయంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలివి...

కరకరలాడిపోతున్నట్లుగా మరీ ఆకలి పెరిగిపోయేవరకూ ఆగకండి. అలాగని ఆకలి వేయకుండానే తినేయకండి. వేళకు తింటూ ఉంటే అదే సమయానికి ఆకలి అనిపిస్తుంది. క్రమం తప్పకుండా ఒకే సమయంలో తినడం అన్ని విధాలా మంచిది.
రెస్టారెంట్‌లాంటి చోట్లకు వెళ్లినప్పుడు వండి వడ్డించాల్సిన భోజనం వచ్చేలోపు రెడీమేడ్‌గా దొరికేవాటినే చాలా మంది తినేస్తుంటారు. అలాంటి సమయంలో అందుబాటులో ఉన్న బెకరీ ఐటమ్స్‌తో కడుపును నింపేయకండి. కాస్త ఆలస్యం అయినా... పోషకాలను అందించే ఉడికించిన భోజన పదార్థాలనే తినండి.

బ్రేక్‌ఫాస్ట్ రాజుగారి భోజనంలా భారీగా ఉండవచ్చు. మధ్యాహ్న భోజనం ధనికులు తినే భోజనంలా ఉండవచ్చు. కానీ... రాత్రి తినేది మాత్రం సామాన్యులు తినేలా ఉండాలి. అంటే... రాత్రుళ్లు పరిమితంగా తినాలని గుర్తుపెట్టుకోండి.
మీరు భోజనంతో పాటు సాఫ్ట్ డ్రింక్స్‌గాని, జ్యూస్‌గానీ కలిపి తీసుకోకండి. భోజనం సమయంలో వీలైనంతగా నీళ్లు కూడా తాగకండి. భోజనం పూర్తయ్యాకే నీళ్లు తాగండి.

మీరు మటన్, చికెన్ వంటి మాంసాహారం తీసుకుంటూ ఉంటే... దానితో పాటు వీలైనంతగా ఉడికించిన కూరగాయలు, పండ్లు తినండి.
ఆకలి తీరినట్లు అనిపించగానే తినడం ఆపేయండి. భోజనం రుచిగా ఉంది కదా అని మరీ ఎక్కువగా తినేయకండి. దాని వల్ల వచ్చే అనర్థాలు ఎన్నో!
పాప్‌కార్న్స్, శ్నాక్స్, సాఫ్ట్‌డ్రింక్స్ లాంటి చిరుతిండ్లకు దూరంగా ఉండండి.
వృత్తిపరంగా ఎన్ని ఒత్తిడులు ఉన్నా భోజనం వేళను పాటించండి. రాత్రుళ్లు చాలాసేపు ఆగాల్సి వస్తే రాత్రి భోజనం స్కిప్ చేయకండి. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి పదార్థాల స్థానంలో దోసముక్కలు, క్యారట్ ముక్కలు, టొమాటో ముక్కలు వంటి సలాడ్స్ తీసుకోండి.

ఎవరైనా ఏదైనా ఆఫర్ చేసినప్పుడు అన్ని వేళలా అన్ని పదార్థాలూ తినకండి. స్నేహపూర్వకమైన ఒత్తిడితో అన్నీ తినేయకండి. ఆరోగ్యకరం కాని వాటిని వద్దనడమూ నేర్చుకోండి.

ఉపవాసం పేరిట లంఖణాలు చేయడం అంత మంచిది కాదు. అలా కడుపును చాలా సేపు ఖాళీగా ఉంచడం సరైనది కాదు. కడుపును ఖాళీగా ఉంచడం, పూర్తిగా భర్తీ చేసేయడం... ఈ రెండూ మంచిది కాదు. ఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయండి.

ఆత్మజ్ఞానం.. క్రియాయోగం

మనిషి ఆత్మజ్ఞాన సాధన కోసం చేసేదే క్రియాయోగం. పతంజలి మహ ర్షి తన యోగ శాస్త్రంలో చెప్పిన క్రియా యోగం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మయోగం సంధానం చేసి క్రియాయోగంగా ప్రపంచానికి అందించారు శ్యామాచరణ లాహిరి. ఆయన శిష్యులలో అతి ముఖ్యులు, క్రియాయోగాన్ని విశ్వవ్యాపితం చేయడానికి కృషి చేస్తున్న డాక్టర్ అశోక్ కుమార్ చటర్జీ.

ఆరోగ్య సంరక్షణకు సూక్ష్మ క్రియలు అధికంగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని మాలిన్యాన్ని తొలగించి, ఆయా అవయవాలకు వ్యాయామం కలుగజేసి, వాటి సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ సూక్ష్మ యోగ క్రియలను క్రింద కూర్చుని చేయాల్సి ఉంటుంది. క్రింద కూర్చోలేని వారు కుర్చీ మీద గాని లేక మంచం మీదగాని కూర్చొని చేయవచ్చు. కూర్చోలేకపోతే పడుకుని కూడా చేయవచ్చు. ఈ క్రియలు ఉదరం మీద ప్రభావాన్ని చూపుతాయి. కనుక భోజనం చేసిన తర్వాత వెంటనే చేయకూడదు. సూక్ష్మయోగ క్రియా ఏ అవయవానికి సంబంధించిందో ఆ అవయవం మీద మనస్సును కేంద్రీకరించడం అవసరం. ప్రతి క్రియ 30 నుంచి 60 సెకన్లు వరకు శక్తిని బట్టి చేయాల్సి ఉంటుంది.

యోగ ప్రార్థన క్రియ...

కూర్చొని రెండు చేతులు జోడించి, నమస్కారం చేస్తూ యోగ ప్రార్థన చేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు శ్వాస వదలాలి.
ప్రార్థన క్రియ వలన మనస్సుకు చంచలత్వం పోయి, స్థిరత్వం వస్తుంది. మనస్సులో ఏకాగ్రత కుదురుతుంది. హృదయ శుద్ధి కలుగుతుంది.

భస్ర్తిక క్రియ...

భస్ర్తిక క్రియలు నాలుగు రకాలు. ఇవి శ్వాస, ప్రశ్వాసల ద్వారా శరీర అవయవాలకు శుద్ధి కలిగించే క్రియలు. రెండు ముక్కుల ద్వారా వేగంగా శ్వాస వదలాలి, పీల్చాలి. ఇది భస్త్రిక క్రియ. కుడి ముక్కు రంధ్రం మూసి, ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని త్వర త్వరగా వదలాలి, పీల్చాలి.ఇది చంద్రాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం మూసి, కుడి ముక్కురంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలి, పీల్చాలి. ఇది సూర్యాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలి, పీల్చాలి. వెంటనే కుడి ముక్కు రంధ్రం ద్వారా వేగంగా వదలాలి, పీల్చాలి. ఇది సుషుమ్నా భస్ర్తిక. పై క్రియల వల్ల శరీరంలోని మాలిన్యం పోతుంది. వివిధ అవయవాలకు శుద్ధి కలిగి, వాటికి చైతన్యం కలుగుతుంది.

శిరస్సుకు...

ప్రతి క్రియ 30 సెకన్‌లతో ప్రారంభించి, 60 సెకన్ల వరకు చేయాల్సి ఉంటుంది. ఈ క్రియలు చేస్తున్నప్పుడు గాలిని కంఠం దాటి, లోనికి పోనీయకూడదు. ఇందులో పలు క్రియలున్నాయి.

ఎ. కంఠశుద్ధి: కంఠశుద్ధి కోసం శిరస్సును తిన్నగా ఉంచి, ఎదురుగా చూస్తూ, శ్వాసను వేగంగా వదలాలి, పీల్చాలి.
బి. ఆత్మశుద్ధి వృద్ధి: ఆత్మశక్తిని పెంచేందుకు, భయం పోయేదానికి, శిరస్సును ఎత్తి, శిరస్సు వెనకుక వైపున గల శిఖాభాగం మీద మనస్సును కేంద్రీకరించి, వేగంగా శ్వాస పీల్చాలి, వదలాలి.
సి. జ్ఞాపక శక్తి వికాసం: జ్ఞాపకం లేదా స్మరణ శక్తిని పెంచేందుకు శిరస్సును సగం వంచి, వేగంగా శ్వాస వదలాలి. మనస్సును మాడు మీద కేంద్రీకరించాలి.
డి. మేధాశక్తి వికాసం: వెన్నెముకపై, మెడ కింద, భృకుటిపై మేధాశక్తిని పెంచడానికి శిరస్సును పూర్తిగా వంచి, కళ్లు మూసుకుని వేగంగా శ్వాస వదలాలి, పీల్చాలి.

టెన్షన్‌ తగ్గించే క్రియలు...

టెన్షన్‌ తగ్గాలంటే, కనుబొమలు పైకెత్తి, నుదురుపై ముడుతలు పడేట్లు చేసి, ఐదు సెకన్లు అలాగే ఉండాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి. శ్వాస సాధారణంగా ఉండాలి.

నేత్రశక్తి క్రియలు...

ఇవి మూడు రకాలు. అవి: 1. నేత్ర శాంతి కోసం చేసే క్రియలు, 2. నేత్ర శక్తి కోసం చేసే క్రియలు, 3. నేత్ర చంచలత్వాన్ని తగ్గించేందుకు చేసే క్రియలు. ఈ క్రియల్లో తలను కదపకూడదు. కళ్లను మాత్రమే తిప్పాలి. మనస్సును ఏకాగ్రత చేయడం అవసరం.

కళ్లకు శాంతిని కలిగించే క్రియలు...

ఇవి కనుగుడ్లను వేగంగా తిప్పే క్రియలు. రెండు చేతులు తిన్నగా ముం దుకు చాచి, పిడికిలి బిగించి, బొటనవేళ్లను నిలిపి రెండు ళ్లతో ఎడమ బొటనవేలిని, కుడి బొటనవేలిని వేగంగా చూడాలి. తర్వాత కుడి చేయి కుడివైపు ఉంచి, ఎడమ చేతిని, ఎడమవైపు కిందికి దింపి, పైబొటన వేలిని, కింది బొటన వేలిని వేగంగా చూడాలి. తర్వాత ఎడమ చేయి పైకి ఎడమవైపు ఉంచి, కుడి చేయి కిందికి కుడివైపుకు దింపి, రెండు బొటన వేళ్లను పైకి, కిందకు వేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని పైకి, మరో బొటన వేలిని కిందికి ఉంచి, వేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని భ్రుకుటికి ఎదురుగా ముక్కుకొసకు దగ్గరగా ఉంచి, మరో బొటనవేలిని ముందుకు చాచి, రెండింటిని ఒక దాని తర్వాత మరొక దాన్ని త్వరత్వరగా చూడాలి.

అనంతరం కుడిచేతిని తిన్నగా పక్కకు చాచి, బొటనవేలిని చూస్తూ, చేతిని గుం డ్రంగా పెద్ద సర్కిల్‌లో వేగంగా తిప్పాలి. మోచేతిని వంచకూడదు. ఎడమచేతిని కూడా తిన్నగా పక్కకు చాచి పైవిధంగా చేయాలి. రెండు రెప్పలను వేగంగా మూయాలి, తెరవాలి. పై క్రియలు పూర్తయిన వెంటనే రెండు అరచేతులు కలిపి బాగా రుద్దాలి. కొద్దిసేపుటికి వేడి కలుగుతుంది. రెండు కళ్లమీద రెండు అరచేతులను ఉంచాలి.

ప్రాథమిక వ్యాయామాలు

మీరు చేయబోయే ఈ వ్యాయామాలకు ముందుగా మీ శరీరాన్ని, కండరాలను సిద్ధం చేయాల్సివుంటుంది. ఇవి మీ కండరాలలో ఉన్న స్తబ్ధతను పొగొట్టి, మీ కండరాలలో మార్పును, మృదుత్వాన్ని సులభంగా వంగగల గుణాన్ని కల్గిస్తాయి. సంకోచ వ్యాకోచాలను, రిలాక్స్‌ అవ్వడం, బిగపట్టడం వంటి చర్యలకు మీ కండరాలు సిద్ధం అవుతాయి. ఈ వ్యాయామాలు మీ శ్వాసక్రియను పెంచుతాయి. రక్తప్రసరణ చైతన్యవంతమవుతుంది. ఎక్కువ ఆక్సిజన్‌ మీ కణధాతువులకు అందుతుంది. మీరు సెక్సర్‌సైజులు చేసేముందు మీ వీలును బట్టి ఈ ప్రాథమిక వ్యాయామాలను రెండు మూడు తక్కువ కాకుండా చేయాలి. ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తే.. మరీ మంచిది. ఈ వ్యాయామాలు గాఢంగా, లోతుగా శ్వాసించడానికి మీ రక్త ప్రరణను పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి.

ఎక్సర్‌సైజ్‌ నెం.1: ఉన్నచోటే పరుగెట్టడం...

నిటారుగా నిలుచోండి. చేతులు ఫొటోలో చూపిన విధంగా పెట్టండి. మొ దట్లో కాలుని చాలా తేలికగా పైకి ఎత్తుతూ ఉన్నచోటే పరు గుపెట్టండి. క్రమంగా.. వేగాన్ని పెంచండి. చేతులను, భుజాల దాకా చాపి, క్రిందికి దింపుతూ, ముందుకు వెనక్కి కదిలించాలి. మీ శ్వాసక్రియ ఊపందుకొని, రొప్పే దశకు చేరుకున్నప్పుడు తిరిగి వేగాన్ని తగ్గిస్తూ.. పరుగు ఆపండి.

ఎక్సర్‌సైజ్‌ నెం.2: గెంతడం...

ముందు నిటారుగా నిలబడండి. కాళ్ళు బాగా విడదీయండి. చేతుల్ని చెరోవైపు సాగదీసీ చాపి గెంతండి. కాళ్ళను మళ్లీ దగ్గర చేర్చండి. చేతుల్ని మీ తొడలమీదకు చేర్చండి. మళ్లీ గెంతండి. కాళ్ళు ఎడంగా పెట్టి చేతులు చాపండి. క్రమంగా వేగం పెంచండి. కాళ్ళు, చేతులు గట్టిగా సాగదీయడం బట్టి మీ గెంతులో ఊపు ఉంటుంది. ఊపిరి తీసుకోవడం రొప్పేదాకా చేసి ఆపండి.

ఎక్సర్‌సైజ్‌ నెం.3: గొంతుక్కూ చోండి...

(ఎ) నిటారుగా నిలబడండి. పాదాలను విడిగా వుంచండి. చేతుల్ని ఫొటోల్లో చూపిన విధంగా పెట్టండి. (బి) క్రిందికి మోకాళ్ళు పైకూర్చోండి. పిరుదులు మడమలకు తగలాలి. (సి) తరువాత చేతుల్ని ముందుపెట్టి పాదాల్ని వెనక్కి తీసుకు వెళ్లి ముని వేళ్లపై ఆన్చండి. తిరిగి లేచి నిలుచోండి. ఇలా నెమ్మదిగా మొదలుపెట్టి వేగం పెంచండి. రొప్పే దాకా చేసి ఆపండి.

ఎక్సర్‌సైజ్‌ నెం.4: తొడలను పట్టండి...

నిటారుగా నిలుచోండి. (ఎ) చేతుల్ని నడుము మీద ఉంచుకోండి. (బి) అడుగు ముందుకువేసి కుడికాలుని కర్ణదిశగా పెట్టి ఫొటోలో చూపిన విధంగా రెండు చేతులతో తొడను బంధించండి. ఇలాగే కుడి కాలితో కూడా చేయండి. ఈ వ్యాయామాన్ని పదిసార్లు రిపీట్‌ చేయండి. రొప్పేదాకా ఇలా చేసి ఆపండి.

ఎక్సర్‌సైజ్‌ నెం.5: పాక్షికంగా గుంజిళ్ళు...

కుడికాలికి, ముందర ఎడం కాలు పెట్టి నిటారుగా నిలబడండి. చేతుల్ని ఇలా తల వెనుక మీ శరీరాన్ని మోకాళ్ళు వంచడం ద్వారా ఆరు అంగుళాలు క్రిందికి వంచండి. మీ మోకాళ్ళను తిన్నగా చేస్తూ... చేతుల్ని ఇలా తలవెనుక మీ శరీరాన్ని మొకాళ్ళు వంచడం ద్వారా ఆరు అంగుళాలు క్రిందికి వంచండి. మీ మోకాళ్ళను తిన్నగా చేస్తూ.. ఒక్కసారి స్ప్రింగులా గెంతి మీ పాదాలతో నేలను తన్నండి. కాళ్ళు పెట్టే దిశను మార్చి రిపీట్‌ చేయండి. ఇలా పదిసార్లు చేయండి. ఊపరి వేగం పుంజుకున్నాక ఆపండి.

ఎక్సర్‌సైజ్‌ నెం.6: ముందుకీ, వెనక్కి వంగోండి...

నిటారుగా నిలబడండి. మీ మొండాన్ని ముందుకు వంచి చేతులిలా పెట్టండి (ఎ) మీ చేతుల వేళ్ళతో నేలను తాకే ప్రయత్నం చేయండి. మోకాళ్ళు వంగకూడదు. తరువాత నిటారుగా నిలబడి భుజాలను వాల్చండి. తరువాత వెనక్కి వంగం డి. ప్రతీసారీ వీలైనంత ఎక్కువగా వెనక్కి, క్రిందికి వంగటానికి ప్రయత్నించండి (బి). అయిదుసార్లు ఇలా చేయండి. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ అయిదుసార్లు చేయండి.

కపాలభాతి యోగ స్నానం

స్నానం చేస్తాం. శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తాం. తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తాం. బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తాం. మసాజ్‌లా ఉంటుంది.అయితే - ఇవన్నీ పైపై స్నానాలు. కాకిస్నానాలు. లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది. ఈవారం కపాలభాతి ఆసనం నేర్పిస్తున్నాం. సాధన చెయ్యండి. మెదడుకు, శ్వాసకోశాలకు, జీవక్రియలకు లాలపొయ్యండి. గాల్లో తేలినట్లు లేకపోతే అడగండి.

కపాలభాతి ప్రయోజనాలు:
 • మెదడు శుభ్రపడడంతోపాటు, ఆలోచనశక్తి, స్మరణశక్తి పెరుగుతాయి
 • శ్వాసకోశనాళాల్లో కఫం పోతుంది కాబట్టి ఆస్థ్మా బాధితులకు మంచి ఫలితాన్నిస్తుంది
 • ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి, రక్తశుద్ధి జరుగుతుంది, గుండెపనితీరు మెరుగవుతుంది
 • జీర్ణక్రియ మెరుగవుతుంది, మల బద్దకం, నిద్రమత్తు, బద్దకంపోతాయి
 • సైనస్, కిడ్నీ సమస్యలు పోతాయి
 • కపాలభాతిని రోజూ సాధన చేస్తుంటే మధుమేహం సాధారణస్థితికి వస్తుంది
వీళ్లు చేయకూడదు!

హైబీపీ, కడుపులో ట్యూమర్లు, హెర్నియా, గుండెజబ్బుల వాళ్లు, గర్భిణులు, పీరియడ్స్ సమయంలోనూ చేయకూడదు.

ఎప్పుడు చేయాలంటే!

ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు, కానీ పొట్ట ఖాళీగా ఉండడం ముఖ్యం. మొదలు పెట్టిన రోజే ఎక్కువ సేపు చేయకుండా క్రమంగా నిడివి పెంచుకోవాలి. సాధన మధ్యలో విశ్రాంతి తప్పనిసరి. ప్రారంభంలో వీపు కిందిభాగం, కడుపులో నొప్పి అనిపించవచ్చు. అది సాధన చేసే కొద్దీ తగ్గిపోతుంది.

జాలంధర బంధం అంటే గడ్డాన్ని ఛాతీకి బంధించి ఉంచడం, మూలబంధం అంటే మలద్వారాన్ని పైకి లేపి ఉంచడం, ఉడ్యానబంధం అంటే పొట్టను బిగించడం.

బాహ్య కుంభకం అంటే శ్వాస వదిలిన తరవాత కొద్దిసేపు తీసుకోకపోవడం (ఊపిరి బిగపట్టడం). ఇలా ఉండగలిగినంత సేపు మాత్రమే ఉండాలి.

అంతర వ్యాయామం: ఆయుర్వేదం

కపాలభాతి బాహ్య వ్యాయామం మాత్రమే కాదు అంతర వ్యాయామం కూడ. సాధారణ వ్యాయామాలతో దేహంలో అన్ని భాగాల మీద ఒత్తిడి పడుతుంది, కాని కడుపు భాగం మీద ఒత్తిడి కలగదు. కపాలభాతి ద్వారా ఉదరం, ఛాతీ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. వీటితోపాటు జీర్ణాశయం, క్లోమం, కాలేయం, ప్లీహం, మూత్రాశయం వంటి భాగాల కండరాలు కూడా ఉత్తేజితమవుతాయి. కాబట్టి ఆయా భాగాల నుంచి ఉత్పత్తి కావల్సిన ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి, పనితీరు మెరుగవుతుంది. ఉదాహరణకు క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. చర్మానికి దేహభాగాలకు మధ్య నున్న కొవ్వు కాని, అంతర భాగాలు, కండరాల మధ్య నున్న కొవ్వు కరగాలన్నా ఇది మంచి వ్యాయామం. భోజనం చేసిన తర్వాత, ఉదర, ప్లీహ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు కపాలభాతి సాధన చేయరాదు.- డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యులు

యోగశాస్త్రం ప్రకారం

‘కపాలం'అంటే మస్తిష్కం లేదా మెదడు.'భాతి'అంటే ప్రకాశం. శిరస్సును ప్రకాశింపచేసే క్రియ కాబట్టి దీనిని కపాలభాతి అంటారు. ఇది షట్‌క్రియల్లో ఒకటి అయినప్పటికీ ప్రాణాయామంలో భాగంగానూ సాధన చేయవచ్చు. దీనిని నాలుగు దశల్లో చేయాలి. గతవారం భస్త్రిక ప్రాణాయామాన్ని ఐదు దశల్లో సాధన చేశాం. భస్త్రికలో గాలిని తీసుకోవడం, వదలడం రెండూ ఉంటాయి, కపాలభాతితో గాలిని వదలడమే ప్రధానం. శ్వాస తీసుకోవడం అప్రయత్నంగా జరగాలి తప్ప, ప్రయత్నపూరకంగా గాఢంగా, దీర్ఘంగా తీసుకోవడం అనేది ఉండదు.
సాధన ఇలా!పద్మాసన స్థితిలో వెన్ను, మెడ నిటారుగా ఉంచి, చేతులను వాయుముద్రలో మోకాళ్ల మీద ఉంచాలి. కళ్లుమూసుకోవాలి, ముఖంలో ప్రశాంతత ఉండాలి.

మొదటి దశలో...

కుడి చేతి పిడికిలిని బిగించి, బొటనవేలితో ముక్కు కుడిరంధ్రాన్ని మూసి, ఎడమరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి. శ్వాసను వదిలినప్పుడు కడుపు భాగం లోపలికి ముడుచుకోవాలి. ఇలా 10-20 సార్లు చేయాలి. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ చేయాలి.

రెండవ దశలో...

కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి వాటి మీద బొటనవేలిని ఉంచాలి. ఉంగరపువేలు, చిటికెన వేళ్లతో ముక్కు ఎడమయంధ్రాన్ని మూయాలి. ముక్కు కుడిరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి.

మూడవ దశలో...

కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి, బొటన వేలితో ముక్కు కుడి రంధ్రాన్ని, చివరి రెండు వేళ్లతో ఎడమ రంధ్రాన్ని మూయాలి. ఇప్పుడు ఎడమరంధ్రం మీద ఉన్న వేళ్లను తీసి శ్వాసను వదలాలి. శ్వాసను పూర్తిగా వదిలిన వెంటనే చివరివేళ్లతో ఎడమరంధ్రాన్ని మూయాలి. తర్వాత ముక్కు కుడిరంధ్రం మీద ఉన్న బొటనవేలిని తీసి శ్వాసను పూర్తిగా వదలాలి.

నాలుగవ దశలో...

చేతులను వాయుముద్రలో ఉంచి శ్వాసను బలంగా వదలాలి. 10 -20 సార్లు చేయడం, మధ్యలో విశ్రాంతి, అప్రయత్నంగా శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలినప్పుడు కడుపులోపలికి పోవడం వంటి నియమాలు అన్ని దశల్లోనూ యథాతథం. కపాలభాతిలో 90శాతం నిశ్వాస, పదిశాతం ఉచ్వాశ జరగాలి.

నాలుగు దశలూ పూర్తయిన తర్వాత శ్వాసను వదిలి మూలబంధం, ఉడ్యానబంధం, జాలంధర బంధం వేయాలి. ఈ బంధాలన్నింటినీ బాహ్య కుంభకంలోనే వేయాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత బంధాలను విడవాలి. ముందుగా ఉడ్యానబంధం, తర్వాత జాలంధర బంధం, మూలబంధాలను విడవాలి. బంధాలను వేయడం, విడవడంలో క్రమం మారుతుంది. చివరగా విశ్రాంతి తీసుకోవాలి.

కొవ్వు శక్తిగా మారే ప్రక్రియ

మన శరీరంలోని కొవ్వును ఎల్ కార్నిటైన్ అనే పోషకం శక్తిగా మారుస్తుంది. ఎల్ కార్నిటైన్ తగ్గినా, దాని పనితీరు మందగించినా కొవ్వు శక్తిగా మారకుండా నిల్వ ఉండిపోతుంది. ఇది బాగా పనిచేయాలంటే దేహానికి తగినంత ఆక్సిజన్ అవసరం. కపాలభాతి సాధన చేసేవాళ్లు సమతుల ఆహారం తీసుకోవడం, మద్యపానం, ధూమపానం, జంక్‌ఫుడ్, స్వీట్లు, పాలు, పాల ఉత్పత్తులను మానేయడం. కార్బోహైడ్రేట్లను తగ్గించడం వంటి జాగ్రత్తలను పాటిస్తే నెలకు నాలుగు నుంచి ఐదు కిలోల బరువు తగ్గుతారు.
- డాక్టర్ సుజాతాస్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్

ఒక పౌష్టికాలోచన!

కొత్త పౌష్టికాహారం వచ్చిందనగానే... చూడ్డానికి వెయ్యి కళ్లొస్తాయి. కొనడానికి పది చేతులు వస్తాయి. అది రెడీమేడ్ ఫుడ్ అయితే మరీ మంచిది. ఎందుకంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల మనిషి రోజురోజుకీ నీరసించిపోతున్నాడు. రకరకాల కారణాల వల్ల ప్రకృతి ఇచ్చే పౌష్టికాహారాన్ని పొందలేకపోతున్నాడు. దీంతో బోలెడన్ని అంతర్జాతీయ వ్యాపారసంస్థలు పొడులరూపంలో రకరకాల ఆహారపదార్థాలను తయారుచేసి మార్కెట్‌లో పెడుతున్నాయి. వీటికి బోలెడు గిరాకి. కాని డబ్బున్నవారికే ఇవి అందుబాటులో ఉంటాయి. మరి పేదల సంగతేంటి? వీరి గురించి ఎవరూ ఆలోచించకపోయినా... నిజామాబాద్‌లో ఉండే ఒక గృహిణి ఆలోచించింది. అన్ని వర్గాలవారికీ అందుబాటులో ఉండే పౌష్టికాహారం తయారుచేసింది. అంతేనా... పేద ప్రజల ముంగిట్లో నిలబడి వాటినెలా తయారుచేసుకోవాలో కూడా వివరిస్తోంది. ఆ వివరాలు...

రోజూ మనం తినే తిండిలో ప్రకృతి నుంచి వచ్చే అన్ని రకాల ఆహారపదార్థాలు ఉండటం లేదు. అందుబాటులో లేక, ఒక వేళ ఉన్నా...ఉపయోగించుకునే విధానం తెలియక పౌష్టికాహారానికి దూరమవుతున్నాం. పేదలే కాదు మధ్యతరగతివారు సైతం ఏదో ఒకటి తిని...వారికున్నదానితో సరిపెట్టుకుంటున్నారు. మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చక్కని పౌష్టికాహారం తయారుచేసుకుంటే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన శ్రీదేవికి మొదట్లో ఇన్ని విషయాలు తెలియవు. ఎందుకంటే ఆమె చదివింది పదో తరగతే. పుట్టి పెరిగింది పల్లెటూర్లో. అయినా అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులకు ధీటుగా పౌష్టికాహారం తయారుచేస్తోంది.

సత్తిపిండితో మొదలై...

జొన్నలు, శెనగపప్పుతో చేసే జావని నిజామాబాద్ వాసులు సత్తిపిండి అంటారు. తన చిన్నప్పుడు అమ్మపెట్టిన సత్తిపిండిని గుర్తుచేసుకుని ఆ పదార్థాలతో కొత్తరకం న్యూట్రిషన్ పౌడర్ తయారుచేసింది శ్రీదేవి. ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే"మా వారు చంద్రమౌళి శర్మ, జ్యోతిష్యం చెబుతారు. మాకు ఇద్దరు పిల్లలు. 2004లో ఒకసారి ఆయన ఏదో పనిమీద నెలరోజులు టూర్ వెళ్లారు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను.

ఆ సమయంలో నాకు వచ్చిన ఆలోచన ఈ న్యూట్రిషన్ ఫుడ్. చిన్నప్పుడు అమ్మ పెట్టిన సత్తిపిండిలో రెండే పదార్థాలు ఉండేవి. కాని నేను పది రకాలు వేసి దాన్ని మరింత బలవర్ధకంగా చేయాలనుకున్నాను. రాగులు, జొన్నలు, మినుములు, పెసలు, బెల్లం, ఐదు రకాల డ్రైఫ్రూట్స్ కలిపి పొడి తయారుచేశాను. నిజామాబాద్‌లో మేముండే వినాయక్‌నగర్‌లో ఒక సూపర్‌మార్కెట్‌కి తీసుకెళ్లి చూపించాను. వారికి బాగా నచ్చింది. రకరకాల సైజుల్లో ప్యాకింగ్ చేసి ఇమ్మన్నారు. నా పొడికి గిరాకి బాగా ఉందని చెప్పడంతో నాకు ధైర్యం వచ్చింది. చిన్నస్థాయి కుటీర పరిశ్రమ నెలకొల్పాలనుకున్నాను''అని చెప్పారు శ్రీదేవి.

శ్రీదత్తా న్యూట్రిషన్స్...

ఏదైనా వస్తువు తయారుచేయడం ఒక ఎత్తు, దాన్ని మార్కెట్‌లో అమ్మి లాభాలను గడించడం మరో ఎత్తు, రెండు విషయాల్లో నూ శ్రీదేవి కొత్త పద్ధతిని అనుసరించింది."నేను తయారుచేసిన సత్తిపిండికి గిరాకీ పెరగడంతో 2005లో ఇంట్లోనే'శ్రీదత్తా న్యూట్రిషన్స్'అనే సంస్థని పెట్టి పెద్ద మొత్తంలో పౌష్టికాహారాన్ని తయారుచేయడం మొదలుపెట్టాను. చిన్న చిన్న ప్యాకెట్లు తయారుచేసి రోడ్డు పక్కన ఉండే పండ్ల దుకాణాల్లో పెట్టాను. ప్రతీ ప్యాకెట్టుకీ ఒక చిన్న కరపత్రం జోడించాను. అందులో ప్రాడక్ట్ వివరాలు, ప్రయోజనాలు, నా అడ్రసు ఇచ్చి ఏవైనా సలహాలు ఇమ్మని రాశాను. పండ్లు కొనడానికి వచ్చిన వారికి ఒక్కో ప్యాకెట్టు ఉచితంగా ఇచ్చేవారు. అలా పంచినందుకు ఆ పండ్లదుకాణాలవారికి కొంత డబ్బు ఇచ్చేదాన్ని.

వ్యాపార మెళకువలు...

ఒకరోజు ఇంటికి లెటర్ వచ్చింది. ఎవరో లెక్చరర్ రాశారు.'నేను మీ న్యూట్రిషన్ పొడిని కొనుక్కున్నాను. చాలా బాగుంది. మార్కెటింగ్ చేసే విధానం మెరుగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రొడెక్టవిటీ కౌన్సిల్‌లో శిక్షణ తీసుకుంటే బాగుంటుంది'అని రాశారు.

వెంటనే నేను అక్కడికి వెళ్లాను. అక్కడ శ్రీనివాస్ రఘు అనే ఆఫీసర్ని కలిసాను. వ్యాపార మెళకువలలో ఓ పది రోజులు శిక్షణ తీసుకున్నాను. అక్కడ వారు చెప్పిన పాఠాలు నా సంస్థ అభివృద్దికి చాలా ఉపయోగపడ్డాయి. ఆ తరువాత శ్రీనివాస్‌గారి సలహాతో జాతీయ పోషకాహార సంస్థ వారి పుస్తకాలు చదివాను. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. వయసుని బట్టి, అవసరాన్ని బట్టి పౌష్టికాహారం తయారుచేయాలని అర్థమైంది''అని చెప్పారు శ్రీదేవి.

ఎన్ని రకాలు...

ప్రస్తుతం శ్రీదేవి దగ్గర పద్దెనిమిది రకాల పౌష్టికాహారాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు పట్టే ఉగ్గు దగ్గర నుంచి పండు ముసలివారికి ఇవ్వాల్సిన ఆహారం వరకూ రకరకాల పొడులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని లడ్డూల రూపంలో కూడా ఉంటాయి.

నెలల వయసున్న పిల్లలకు, మూడేళ్ల వయసువారికి, పదిహేనేళ్ల వయసువారికి, పాతికేళ్ల వారికి, నలభైఏళ్లవారికి, యాభై దాటిన వారికి, డెబ్బైదాటిన వారికి, శారీరక వికలాంగులకి, మానసిక వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకు...ఇలా ఒక్కో వయసువారికి ఒకో రకం పొడి తయారుచేస్తారు. జిమ్‌లకు వెళ్లేవారికి, బిపీ, షుగర్‌లతో ఇబ్బందిపడేవారికి కూడా ప్రత్యేకంగా పొడులు తయారుచేస్తున్నారు. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ఆహార సంస్థ పరీక్షించింది. ల్యాబ్ టెస్ట్ చేసి అందులో ఉన్న పౌష్టిక విలువల గురించి అధ్యయనం చేసి గుర్తింపునిచ్చింది. దాంతో శ్రీదేవి పనిని పెద్ద పెద్ద సంస్థలు సైతం గుర్తించాయి.

రాష్ట్రం దాటిన పాఠాలు...

'శ్రీ దత్తా న్యూట్రిషన్స్'గురించి తెలుసుకున్న'స్వదేశీ జాగరణ్‌మంచ్'అనే సంస్థ శ్రీదేవిని కేరళ తీసుకెళ్లింది. అక్కడ జరిగిన ఒక వర్క్‌షాప్‌లో పౌష్టికాహారం గురించి శ్రీదేవి ఇచ్చిన ప్రసంగాన్ని విని కేరళ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే... మన రాష్ట్రంలో తాను చేస్తున్న పని గురించి చెప్పకుండా కేరళలో ఉండే ఆహార పదార్థాలతో పౌష్టికాహారం ఎలా తయారుచేసుకోవాలో వివరంగా చెప్పిందామె...

"కేరళకు వెళ్లే ముందే అక్కడి ఆహారం గురించి కొంత స్టడీ చేశాను. ఆహారం విషయంలో మనకీ, వారికీ చాలా తేడాలుంటాయి. అందువల్ల వారికి అందుబాటులో ఉండే ఆహార పదార్థాలతోనే పౌష్టికాహారం ఎలా తయారుచేసుకోవచ్చో కొన్ని ఉదాహరణలతో చెప్పాను. ప్రయోజనాలు కూడా వివరించాను. వాళ్లు చాలా సంతోషించారు. నిజానికి నేను చదువుకున్నది పదోతరగతే. ఇంగ్లీషు గొప్పగా రాదు. కాని నేను హాజరయిన వేదికలే నాకు ఆంగ్లం నేర్పించాయి. ఒకటి రెండు కాదు...హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఫ్యాప్సీ...లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో అడుగుపెట్టే అవకాశం వచ్చింది నాకు. నాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను''అని గతం గుర్తుచేసుకున్నారామె.

పేదలకు శిక్షణ...

శ్రీ దత్తా న్యూట్రిషన్‌లో ఇప్పుడు ఎనిమిది మంది ఆడవాళ్లు పనిచేస్తున్నారు. అందులో ఇద్దరు వికలాంగులు. ఏటా ఎనిమిదిలక్షల రూపాయల వ్యాపారం జరుగుతోంది. నిజామాబాద్‌లో ఉన్న ఐదు'శుభోదయ'పాఠశాలల్లోని పిల్లలకు పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వం శ్రీదేవికే అప్పగించింది. ఈ ఫుడ్‌ని కొనుక్కునే స్థోమత లేని పేదవారికి శ్రీదేవి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో చెబుతున్నారు.

నిజామాబాద్‌లోని ప్రతీ మండలంలోని రైతులందరికీ పౌష్టికాహారం తయారీ గురించి, ప్రయోజనాల గురించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. మొన్నటివరకూ మాటలతో వివరించిన ఆమె ప్రస్తుతం పవర్‌పాయింట్ ప్రజంటేషన్లు కూడా ఇస్తోంది. తయారి నుంచి మార్కెటింగ్ వరకూ అన్నింటా రాణిస్తున్న శ్రీదేవిని పలు సంస్థలు ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్తగా గుర్తించి సన్మానాలు చేశాయి."నేను తయారుచేసిన పౌష్టికాహారం ప్రజలందరికీ అందాలి. మరీ ముఖ్యంగా వందల రూపాయలు ఖర్చుపెట్టి పౌష్టికాహారం కొనుక్కోలేని పేదప్రజలకి అందాలి. దానికన్నా ముందు వారికి ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల అవగాహన రావాలి. పదేళ్లుగా నిర్విరామంగా పనిచేస్తుంటే ఇప్పటికి మా జిల్లాలో కొందరికి పౌష్టికాహారం పట్ల కొంత అవగాహన వచ్చింది. ప్రతి ఒక్కరికి తెలియాలంటే నేను ఇంకా చాలా కష్టపడాలి. దీనికి కావాల్సిన సులభమార్గాలు వెతుక్కునే పనిలో ఉన్నాను''అని చెప్పారు శ్రీదేవి.

ఇవి కాకుండా...

తాను తయారుచేసిన ఆహారం అమ్ముకుని నాలుగు రూపాయలు వెనకేసుకునే పనిలో ఉండకుండా.. శ్రీదేవి మరిన్ని కొత్త ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతున్నారు. స్థూలకాయంతో బాధపడుతున్నవారికి నెల రోజుల కోర్సు ఒకటి ప్రారంభించారు. వారికి ప్రత్యేకమైన పొడులు తయారుచేసి ఇస్తున్నారు. అలాగే వారు రోజూ చేయాల్సిన వ్యాయామాలు, వారి దినచర్య గురించి శిక్షణ ఇస్తున్నారు. గర్భిణిస్త్రీలకు పౌష్టికాహారంతో పాటు మామూలు కాన్పు అవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇంట్లోనే పాఠాలు చెబుతున్నారామె.

ఎన్ఐఎఫ్ గుర్తింపు...

జిల్లాకే పరిమితమైన తన పౌష్టికాహారానికి జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు శ్రీదేవి."నాకు తెలిసిన ఒక వ్యక్తి హనీబీ సంస్థ గురించి చెప్పారు. వెంటనే ఆ సంస్థ కోర్డినేటర్ బ్రిగేడియర్ గణేశంగారిని కలిశాను. నేను చెప్పిన వివరాలన్నీ విని శ్రీ దత్తా న్యూట్రిషిన్‌కి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. నేషనల్ ఇన్నోవేషనల్ ఫౌండేషన్‌లో స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 25న కలవమని ఎన్ఐఎఫ్ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది''అని ఎంతో సంతోషంగా చెప్పారామె.

"ప్రస్తుతం శ్రీదేవి దగ్గర పద్దెనిమిది రకాల పౌష్టికాహారాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు పట్టే ఉగ్గు దగ్గర నుంచి పండు ముసలివారికి ఇవ్వాల్సిన ఆహారం వరకూ రకరకాల పొడులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని లడ్డూల రూపంలో కూడా ఉంటాయి. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ఆహార సంస్థ పరీక్షించింది. ల్యాబ్ టెస్ట్ చేసి అందులో ఉన్న పౌష్టిక విలువల గురించి అధ్యయనం చేసి గుర్తింపునిచ్చింది.''
-భువనేశ్వరి

కాఫీ ఆరోగ్యకరమే!

ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ తాగితే కానీ ఉల్లాసంగా అనిపించదు చాలా మందికి. ఉదయమేనా? బద్ధకంగా అనిపించినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు.. ఇలా పలు
సందర్భాలలో కాఫీ తాగి వెంటనే ఉల్లాసాన్ని పొందుతుంటారు. అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని అంతకన్నా పళ్ళ రసాలు తాగడం మంచిదనే భావన కూడా ఉన్నది.

ఇందులో నిజానిజాలు పరిశీలిద్దాం...

చాలామంది కాఫీ అనగానే దానిలో ఉండే కెఫైన్‌ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ కాఫీ అనేది వందలాది కాం పౌండ్లు ఉన్న ఒక పానియం అంటున్నారు పౌష్టికాహార నిపుణు లు కొందరు. కొద్ది మాత్రపు కెఫైన్‌ (400-500 మి.గ్రా.) తాగ డం అనేది మన మానసిక కార్యకలాపాలను, పనితీరు, ప్రతిస్పం దించే సమయం. అప్రమత్తత, దృష్టితో పాటుగా మన మూడ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.కొన్ని సందర్భాలలో కాఫీ తాగడమనేది ఆరోగ్యకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. అయితే మ నం తాగే కాఫీ ఏది అనేది కూడా ముఖ్యమేనంటున్నారు. ఏ రకం కాఫీ తాగుతున్నారు, ఎలా తాగుతున్నారు అనే దానిని బట్టే పరిణామాలు కూడా ఉంటాయిట.

కాఫీయా? పళ్ళ రసమా?

కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ధాతువులకు ఇన్సులిన్‌ సరఫరాలో సాయపడతాయి.అంతేనా గ్లూకోజ్‌ ప్రతి స్పందనను డికాఫినేటెడ్‌ కాఫీ తగ్గిస్తుందని కూడా పరిశోధనలలో రుజువైంది. మరోవైపు పళ్ళ రసాలలో చక్కెర పదార్ధం అధికంగా ఉంటుంది. ఒకవేళ అందులో చక్కెర పదార్ధం ఎక్కువ లేకపోయినప్పటికీ పళ్ళ రసాలు తేలికగా జీర్ణమైపోతాయి. అందులో ఫైబర్‌ కూడా తక్కువే ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. అందు కే చక్కెర వ్యాధి ఉన్న వారిని పళ్ళ రసాలు తాగవద్దని అంటారు.పాకేజ్డ్‌ పళ్ళ రసాలలో రంగులు, ప్రిజర్వేటివ్లు, రసాయనాలు ఉంటాయి. ఇవి మోతాదును మించి ఉంటే కాన్సర్‌కు దారి తీసే ప్రమాదం కూడా ఉన్నది. పళ్ళ రసం కన్నా అందులోనూ తియ్య గా చేసుకున్న పళ్ళ రసంకన్నా మొత్తంగా పండును తినడం ఎం తైనా మేలు. మరోవైపు ఒక కప్పు కాఫీ తాగడం ఎంతైనా మంచిదిట. ఎందుకంటే అందులో ఉండే చురుకైన కాంపౌండ్‌ మెథిల్‌పైరిడీనయం అనే పదార్ధం కొలోన్‌ కాన్సర్‌ను నివారించే ఎంజైమ్‌లను ఉత్తేజితం చేస్తుందిట.

ఆరెంజ్‌ జ్యూస్‌ కన్నా కాఫీలో అధికంగా కరిగిపోయి కలిసిపోయే ఫైబర్‌ ఉన్నందున ఆరోగ్యానికి కాఫీనే మంచిదిట! ఆధునిక కాలంలో అనేకమంది ఒక గ్లాసు ఆరెంజ్‌ జ్యూస్‌ తాగి రోజును ఆరోగ్యంగా ప్రారంభిస్తున్నామనుకుంటారు. కానీ వారికి తెలియంది ఏంటంటే ఒక గ్లాసు కోకాకోలాలో ఉండేంత చక్కెర పదార్ధమే అందులోనూ ఉంటుందని. కరిగి, కలిసిపోయే ఫైబర్‌ ఎం దుకు లాభదాయకమంటే అది కొలెస్ట్రాల్‌ ఏర్పడకుండా నివారించడమే కాకుండా ధమనులను వెడల్పు చేయడం ద్వారా హై బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గిస్తుంది.

కాఫీ ఎంపికలో జాగ్రత్తలు...

కాఫీలో ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిని ఉత్తేజితం చేసే కెఫెస్టాల్‌ అనే పదార్ధం ఉంటుంది. కాఫీలో ఉండే నూనె పదార్దంలో ఈ కెఫెస్టాల్‌ ఉంటుంది. కాఫీని పేపర్‌ ఫిల్టర్‌ ద్వారా వడపోసినప్పుడు కెఫెస్టాల్‌ అందులోకి దిగదు. బాయిల్డ్‌ కాఫీ, ఫ్రెంచ్‌ ప్రెస్‌ కాఫీ, టర్కిష్‌ కాఫీలలో కెఫెస్టాల్‌ అధికంగా ఉంటుంది. ఎస్పెసో కాఫీ మధ్యస్థంగా చెప్పుకోవచ్చు. ఎల్‌డిఎల్‌ పెరగడాన్ని నివారించాలంటే ఇన్‌స్టాంట్‌ కాఫీని వాడకపోవడమే మంచిది.

పాలు, పంచదార, మీగడ, ఇతర ఫ్లేవర్లు వేసి కలిపిన కాఫీ ఆరోగ్యకరం కాదు. ఉదాహరణకు 500 మి.లీ. చాకొలెట్‌ విప్డ్‌ క్రీమ్‌ కలిపిన మోచా చిప్‌ ఫ్రాపుచినోలో 470 కేలరీలు ఉంటాయి. దానితో పాటుగా ఒకరోజుకు సరిపోయే 12 గ్రా.ల శాచ్యురేటెడ్‌ కొవ్వు, 71 గ్రా. పంచదార ఉంటాయి. అంటే 17 స్పూన్ల చక్కెరతో సమానమన్నమాట. కనుక ఆరోగ్యం కావాలంటే ఒక కప్పు బ్లాక్‌ కాఫీ తాగడం మంచిది. ఏది ఏమైనా అతి సర్వత్ర వర్జయేత్‌ అన్న విషయాన్ని మనసులో పెట్టుకుంటే మంచిది.

ఆరోగ్యానికి ఆహారం

ఆధునిక కాలంలో ఉద్యోగాలు మెదడుకు తప్ప శరీరానికి శ్రమ ఇచ్చేవిగా ఉండడం లేదు. రోజుకు పది పన్నెండు గంటల పాటు కదలకుండా డెస్క్‌ ముందు కూచొని పని చేసి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చి తినీ తినక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కద్దు. దాదాపుగా ఏ రంగాన్ని తీసుకున్నా పని విధానమిలాగే ఉంటోంది. కనుక ఉద్యోగం మానడమనేది కుదరని పని. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలా అంటే అందుకూ మార్గం ఉన్నది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రోజంతా రోబోలా కూర్చుని పని చేయడం వల్ల వచ్చే ప్రతికూల పరిణామాలను తగ్గించుకోవచ్చు.

ఆఫీసులో కూర్చుని ఏం తింటాం అనుకోనవసరం లేకుండా తేలికగా మోసుకు వెళ్ళగల ఆహారమిది. అవి మీ గుండెకు, బిపికి, మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఆహారమిది. అందులో ఐదింటి గురించి తెలుసుకుందాం...

అక్రూట్లు...

బాదం పప్పు, బఠాణీలు, పిస్తాలు, మరే ఇతర నట్స్‌ కన్నా కూడా అక్రూట్లలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని కొత్త పరిశోధనలు తెలిపుతున్నాయి. డ్రైఫ్రూట్స్‌ అన్నీ గుండెకు సంబంధించే వ్యాధులను తగ్గించే లిపిడ్స్‌ను మెరుగుపరుస్తాయి. కానీ అక్రూట్లు అంతకు మించి సాయపడతాయని పరిశోధనలలో తేలింది. అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న జంతువులకు వీటిని తినిపించగా వాటి జ్ఞాపకశక్తి మెరుగుపడినట్టు తేలింది. రోజుకు ఏడు అక్రూట్‌ పప్పులు తింటే చాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.

కప్పు గ్రీన్‌ టీ...

గ్రీన్‌ టీలో అధిక శాతం ఉండే పాలిఫెనాల్స్‌ ధ్వంసమైన డిఎన్‌ఎను మరమ్మత్తు చేయడమే కాక ఇమ్యూన్‌ వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తాయి. అంతేకాదు గ్రీన్‌ టీలు కాన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది. చర్మం, ప్రోస్ట్రేట్‌ కాన్సర్లు రాకుండా కూడా ఇది నిరోధించగలదు.

పాప్‌కార్న్‌...

ఆరోగ్యకరమైన స్నాక్స్‌ చిట్టా ఏదైనా మీ వద్ద ఉంటే అందు లో తప్పనిసరిగా ఉండే పేరు దీనిదే.మనకందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో పాప్‌కార్న్‌ ఒకటని చాలా మంది చెప్తుంటారు.ఇందులో ఫైబరే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికశాతంలో ఉంటాయి. అయితే ఉప్పు తగ్గించుకొని వేసుకుంటే దాన్ని మించిన ఆహారం లేదని నిపుణులు చెబుతున్నారు. మీ ఆఫీసులో మైక్రోవేవ్‌ అందుబాటులో ఉంటే తక్కువ ఉప్పు గల పాప్‌కార్న్‌ తెచ్చి రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.

డార్క్‌ చాకొలేట్‌...

ఇందులో కూడా పాలిఫెనాల్స్‌ వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులను నిరోధించడమే కాదు రక్తం గడ్డకట్టిపోవడాన్ని కూడా నిరోధిస్తుందిట. రోజూ చిన్న డార్క్‌ చాకొలెట్‌ బార్‌ను తింటే రక్తపోటు తగ్గుతుందిట. డార్క్‌ చాకొలేట్‌లో ఉండే కెఫైన్‌ మానసికంగాఉత్తేజితం చేయడమే కాదు ఏకాగ్రత పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది.

పళ్ళు...
ఆకలి వేస్తున్న భావనను జయించేందుకు అత్యుత్తమ ఆయుధం పళ్ళే. అంతేకాదు అందులో ఉండే పౌష్టికత మనం నీరసపడకుండా రోజంతా పని చేసేందుకు సాయపడుతుంది. ఆపిల్స్‌, అరటి పళ్ళు, మామిడిపళ్ళు, బొప్పాయ వంటి పళ్ళను రోజు వారీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.ఆరోగ్యాన్ని కాపాడుకోవడా నికి ఆ మాత్రం చేయాలి మరి!

వేసవిలో ఆహారం

 • కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సీజన్‌లో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
 • పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటె ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
 • గ్రిల్డ్ వెజిటబుల్స్: ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి వాటిని... ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎండతో వచ్చే చర్మవ్యాధులనుంచి రక్షిస్తాయి.
 • సలాడ్స్: వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్ తయారుచేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు.
 • వెజిటబుల్, చిల్డ్ సూప్స్:దోసకాయ వంటివాటితో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది.
 • హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్నలు, మొలకెత్తిన పెసలు, శనగలు (స్ప్రౌట్స్), కూరముక్కలు... వంటివాటిని కలిపి తింటే మంచిది.
 • బీన్ అండ్ స్ప్రౌట్ సలాడ్: కొన్ని బీన్స్‌ను కాని స్ప్రౌట్స్‌ను గాని తరిగిన కూరముక్కలు, పండ్ల ముక్కలతో పాటు కలిపి తీసుకుంటే క్యాల్షియం, ప్రొటీన్లు ఎక్కువశాతంలో అందుతాయి.
 • వెజిటబుల్ చీజ్ సలాడ్స్: తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.
 • కొవ్వు తక్కువగా ఉండే పానీయాలు: వేసవి లో తియ్యగా, చిక్కగా ఉండే కాఫీ, టీ, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకోవటం చూస్తాం. వీటిలో క్యాలరీలు ఎక్కువ. ఎటువంటి ద్రవపదార్థాన్ని తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే. అందువల్ల - మజ్జిగ, లస్సీలో ఫ్యాట్ లేని పాలు వాడాలి.
 • పండ్లతో తయారైన డెజర్ట్స్: చిక్కగా, మందంగా ఉండే డెజర్ట్స్‌కు బదులుగా పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
 • టొమాటో సాస్, బొప్పాయి, రెడ్ క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ లభిస్తుంది.
 • వేసవిలో ఆకలి వేసినప్పుడు రకరకాల పండ్లు, బెర్రీలు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవాలి. ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవటం వల్ల పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి.
 • చల్లని కుకుంబర్: చల్లని దోసకాయ ముక్కలను సలాడ్స్‌లోను, కూరలలోనూ వాడవచ్చు.
 • మామిడి: ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి.
 • బెర్రీలు (స్ట్రాబెర్రీలు): ఈ పళ్లను పెరుగులోనూ, ఐస్‌క్రీంలాంటి వాటిలోనూ వాడవచ్చు.
 • పనీర్: ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువ.
 • వాల్‌నట్స్: ఆక్రోట్లు (వాల్‌నట్), చేపలలోని ఒమేగా - 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. వేయించిన చేపల కంటె ఉడకబెట్టినవి మంచిది.
 • ఓట్స్: ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువ.
  తృణధాన్యాలు: పొట్టుతీయని పప్పుధాన్యాలు, గింజల ఉత్పత్తులు తీసుకోవాలి.
 • నూనె పదార్థాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల వేసవిలో జంక్‌ఫుడ్‌ని, వేయించిన పదార్థాలను వాడటం మానాలి.
 • ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్‌పెపర్... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
 • నీరు:దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే చాలు, శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్‌కు దూరంగా ఉండవచ్చు.
పెద్దలకు...
 • బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి వేసవి మంచి సమయం. పద్ధతి ప్రకారం సమతుల ఆహారం తీసుకుంటే, బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. నేరుగా ఎండలోకి వెళ్లి వ్యాయామం చేయటం ఈ కాలంలో మంచిది కాదు.
 • తాజా పండ్లు, కూరలు తీసుకోవాలి.తర్బూజా, పుచ్చకాయ వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి
 • మజ్జిగను ఎక్కువగా తాగుతుండాలి
 • క్యారట్లు, బీట్‌రూట్లను రసం రూపంలో తీసుకుంటే మంచిది.ఈ కాలంలో దొరికే తాజాగా ఉండే ఆకుపచ్చ రంగు కూరల వాడకం చాలా మంచిది
 • మధ్యాహ్నం, రాత్రి వేళలో తీసుకునే భోజనంలో తప్పనిసరిగా తాజా పచ్చికూరలు, మొలకెత్తిన ధాన్యం ఉండేలా చూసుకోవాలి
 • తాజాగా ఉండే పండ్లరసాలు తీసుకోవటం మంచిది
 • ఆల్కహాల్ మానేయాలి. ఇక కెఫిన్ ఉంటే కాఫీలవంటి వాటిని కూడా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే అవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి.
వృద్ధులకు
 • వీరు తీసుకునే ఆహారంలోకార్బోహైడ్రేట్లు అంటే గోధుమ, బ్రౌన్ రైస్, బంగాళదుంపలు, తృణధాన్యాలు
 • ప్రొటీన్లు, కొవ్వుతక్కువగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు
 • ఆహారంలో ఐదువంతుల భాగం పండ్లు, కూరలు లేదా పండ్లరసాలు
 • ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్లలో (వీటిలో శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది)
 • తగినంత ఉప్పు రోజుకి ఆరు గ్రాముల ఉప్పు కంటె ఎక్కువ తీసుకోకూడదు)
 • పీచుపదార్థాలు (ఫైబర్)
 • పేగు సంబంధిత సమస్యలు వయసుపెరిగే కొద్దీ ఎక్కువవుతుంటాయి. ముఖ్యంగా మలబద్దకం అధికమవుతుంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటానికి తగినంత పీచుపదార్థాలు తీసుకోవటం అవసరం. ఇందుకోసం...
 • పొద్దున్నే అల్పాహారంగా తృణధాన్యాలు లేదా ఓట్స్
 • హోల్‌గ్రెయిన్‌తో చేసిన బ్రెడ్ గోధుమ పాస్తా లేదా బ్రౌన్ రైస్
 • బీన్స్ లేదా ఆ జాతికి చెందిన గింజలు తాజా పండ్లు, కూరగాయలు
పిల్లలకు...
 • వేసవి అంటే పిల్లలు ఇంటిదగ్గర గడిపే రోజులు, ప్రయాణాలు చేసేరోజులు, లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉండే రోజులు. విపరీతంగా ఆడుతూండటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంటుంది. అందువల్ల పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి.
 • పాల ఉత్పత్తులు -లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్‌లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రొటీన్లను, క్యాల్షియమ్‌ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి.
 • తాజా పండ్లు, చల్లగా ఉండే పండ్ల రసాలు వంటివి కూడా పిల్లల శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా కాపాడతాయి.
 • పిజ్జాలు, శాండ్‌విచ్ వంటివి పనీర్, తాజాకూరగాయలతో తీసుకుంటే పరవాలేదు కాని, ఎక్కువగా చీజ్ ఉపయోగించినవి మాత్రం మంచిది కాదు.
 • వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు.
 • ఇంట్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు.

వెజిటేరియన్ మాంసం

పిల్లల ఎదుగుదల బాగుండాలన్నా, కండరాలు దృఢంగా తయారు కావాలన్నా, మెదడు చురుగ్గా ఉండాలన్నా ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అని చెబుతుంటారు వైద్యులు. శరీరానికి అత్యంత అవసరమైనవి సూక్ష్మ పోషకాలు, పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు. వీటన్నింటిలో నీటి తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్నవి ప్రొటీన్లే. వీటినే తెలుగులో మాంసకృత్తులు అంటారు. కొన్ని ప్రోటీన్లు మాంసాహారంతో శరీరానికి నేరుగా అందుతాయి కాబట్టే వాటికి ఆ పేరు. మరి శాకాహారులైతే ఈ మాంసకృత్తులు ఎలా...? మాంసం, చేపలు తినని వారికి ఏ ఆహారంతో ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ప్రొటీన్లు పుష్కలంగా అందేలా'ముందుజాగ్రత్త'తీసుకోండి.

మాంసకృత్తులు మన శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్థాలు. కండరాల బలానికి ఇవి చాలా అవసరం. అలాగే కణజాలల పనితీరు, అంతర్గత అవయవాల ఆరోగ్యానికి ప్రొటీన్లు ఎంతగానో అవసరం అవుతాయి. మాంసకృత్తులని ప్రాణ్యములు అనీ, ప్రొటీన్లు అని వీటిని పిలుస్తారు. గ్రీకు భాషలో'ప్రోటోస్'అంటే ముఖ్యమైనది అని అర్థం.
అమినో యాసిడ్స్...

ఇరవెరైండు రకాల అమినో యాసిడ్స్ వేరు వేరు తరహాల్లో ఒక దానికి ఒకటి అనుసంధానితమై మన శరీరంలో ఎన్నో రకాల ప్రొటీన్లుగా తయారవుతాయి. ఉదాహరణకు... శిరోజాలకు, గోళ్లకు, ఎముకలకు, హార్మోన్లకు, కండరాలకు... ఇలా ప్రతీ దానికీ వేరు వేరు మోతాదుల్లో ప్రొటీన్ అవసరం అవుతుంది. ఈ ప్రోటీన్ సమకూర్చడం అన్నది ఇరవై రెండు రకాల అమినో యాసిడ్స్ ద్వారా సాధ్యమౌతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆర్.ఎన్.ఎ, డి.ఎన్.ఎ పర్యవేక్షణలో జరుగుతుంది. (ఆర్.ఎన్.ఎ, డి.ఎన్.ఎ ప్రత్యేకమైన ప్రొటీన్లు. వీటిలో మన జీవన విధానాన్ని నిర్దేశించే జన్యువులు ఉంటాయి). అయితే వీటిలో ఎనిమిది రకాల అమినో యాసిడ్స్‌ని శరీరం స్వయంగా తయారుచేసుకోలేదు. అందుకని వీటిని తప్పనిసరిగా ఆహారం ద్వారానే తీసుకోవాలి. వీటినే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు.

శరీరంలో ప్రొటీన్లు అమినో యాసిడ్స్‌తో తయారవుతాయి. అన్ని రకాల ప్రొటీన్లు జీర్ణం అయ్యాక అమినో యాసిడ్స్‌గా మారి రక్తంలోకి వెళ్తాయి. అక్కడ నుంచి ఈ అమినో యాసిడ్స్ మళ్లీ మన శరీరానికి అవసరమైన కొత్త ప్రొటీన్‌గా రూపొందుతాయి. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, మొదలైన జంతు సంబంధమైన వనరుల నుండి లభించే ప్రొటీన్లు తీసుకునేవారికి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అయితే పప్పులు, కాయగూరలు తీసుకునే శాకాహారులు కూడా ప్రొటీన్లు ఉండే సమతుల ఆహారం తమ భోజనంలో ఉండేలా చూసుకుంటే వారి ఆరోగ్యం బాగుంటుంది.

ప్రొటీన్ల వల్ల ఉపయోగాలు...
 • శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు, ఎముకల బలానికే కాకుండా హార్మోన్ల పనితీరుకు, రోగనిరోధక కణాల కోసం, జీర్ణకోశ రసాయనాల విడుదలకు, ఎర్ర రక్త కణాల పునరుజ్జీవానికి ప్రొటీన్ల అవసరం ఎంతైనా ఉంది. పెరిగే వయసులో సరైన ఎదుగుదలకే కాదు, ఒకసారి ఎదిగిన తర్వాత శరీరాన్ని సరిగ్గా మెయింటనెన్స్ చేయడానికి కూడా ప్రొటీన్ల సహాయం తప్పనిసరి. అంతేకాదు ప్రొటీన్లు శక్తినీ, శరీరానికి తగినంత వేడిని అందిస్తాయి.
 • ప్రొటీన్లు శరీరానికి తగినంతగా అందకపోతే...
 • జుట్టు రాలిపోవడం, గోళ్లు విరిగిపోవడం, చర్మం పొడిబారడం, రక్తహీనత, నీరసంగా ఉండటం, కండరాలు క్షీణత, లైంగికంగా బలహీనంగా అనిపించడం, చురుకుదనం లోపించడం... వంటివి జరుగుతాయి.
 • వీటిలో ప్రొటీన్లు ఎక్కువ...
 • పాలు, మాంసం, గుడ్లలో ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి.
 • తల్లిపాలలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే మొదటి ఏడాది ఇవి బిడ్డకు కావల్సిన బలాన్ని ఇస్తాయి. అందుకే తప్పనిసరిగా
 • తల్లిపాలు శిశువుకి ఇవ్వాలని, అవి శిశువు భవిష్యత్తు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటారు.

గింజధాన్యాలను నేరుగా కంటే, కొద్దిగా ఉడికించి తీసుకుంటే, త్వరగా జీర్ణమై ఇందులోని ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. అలా అని గింజ ధాన్యాలను ఎక్కువ ఉడికించడం, ఉడికించిన నీరు పారబోయడం వంటివి చేస్తే ప్రొటీన్లను కోల్పోయే అవకాశం ఉంటుంది.

మిగతా చిక్కుడు జాతి గింజలతో పోల్చితే సోయాలో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి.

వెజ్‌లో ప్రొటీన్లు...

బాదం, జీడిపప్పు, శనగలు, వేరుశనగలు, చిక్కుళ్లు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వులు, వాల్‌నట్స్, కందిపప్పు, బీన్స్, సోయా బీన్స్, బఠాణీ, బార్లీ, దంపుడు బియ్యం, ఓట్‌మిల్, గోధుమ...

గుడ్డులో...

రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంటారు. కోడిగుడ్డులో 13 శాతం అన్ని రకాల అమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే ప్రొటీన్లు తెల్ల సొనలో ఉంటాయి. పచ్చసొనలో విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఉంటాయి. మన శరీరానికి, కణజాలానికి తెల్లసొనలో ఉండే ప్రొటీన్లు 99.9% సరిగ్గా సరిపోలుతాయి. రోజూ ఒక గుడ్డును తినడం వల్ల వీటిలోని పోషకాలు అంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

అల్పాహారంలో...

తొమ్మిది నుంచి పదకొండు సంవత్సరాల వయసు గల విద్యార్థులలో పౌష్టికాహార నిపుణులు జరిపిన పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే... ఉదయాన్నే అల్పాహారంలో ప్రోటీన్లు ఎక్కువ శాతం ఉన్న ఆహారం తీసుకున్న వారిలో మెదడు పనితీరు చురుకుగా ఉన్నట్టు వెల్లడైంది. అయితే శరీరానికి కావలసిన ప్రొటీన్లను అందించకుండా టీ, కాఫీల ద్వారా నేరుగా చక్కెరను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందవు. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి.

100 గ్రా.ల పదార్థాలలో ప్రొటీన్ల శాతం...

మాంసాహారం, గుడ్డు, సోయా, కాయ గింజలు, పప్పు దినుసులు, నట్స్, పాలలో ఎక్కువ శాతం, కొద్ది మోతాదులో బియ్యం, గోధుమలలోనూ ప్రొటీన్లు ఉంటాయి.

 • సోయా - 40 %
 • కోడిగుడ్డు - 13%
 • మాంసం - 20 %
 • తృణధాన్యాలు - 10%
 • బియ్యం - 7%
 • ఆకుకూరలు, పండ్లు, దుంపలు - 2%
 • కొవ్వు తీసేసిన నూనె గింజలు - 50- 60%
 • (తెలగపిండి)
వయసుల వారీగా ఒక రోజుకు కావలసిన ప్రొటీన్లు
 • పురుషులకు - 60 గ్రా.; స్ర్తీలకు - 50 గ్రా.
 • గర్భవతికి - 50+15 గ్రా.; పాలిచ్చే తల్లులకు - 50+25 గ్రా. (12 నెలల వరకు)

బరువు తగ్గటానికి సూచనలు

పక్క వీధిలోని పాలబూత్‌కి వెళ్లాలంటే బండి స్టార్ట్ చేయాల్సిందే... కిలోమీటర్ దూరం వెళ్లి కూరగాయలు కొనుక్కు రావాలంటే బండి కావాల్సిందే... బట్టలుతకడానికి వాషింగ్ మెషీన్... అంట్లు కడగడానికి ఓ పనిమనిషి... పచ్చళ్లు దంచిపెట్టడానికి మిక్సీ.... ఇదీ మారిన మన లైఫ్‌స్టైల్. చివరకు మనకు మిగిలిందేమిటి.... వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లకై వెదుకులాట.

పది కిలోమీటర్లు నడిచివెళ్లి చిన్న చిన్న వస్తువులు కొనితెచ్చుకోవడం.., చదువుకోవడానికి నాలుగైదు కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లడం.... చేతులరిగిపోయేలా తిరగలి తిప్పడం..... ఇలాంటి కష్టాలన్నీ పోయాయి. చేతిలో డబ్బుంటే చాలు... అన్నీ మన ముందుకే వస్తాయి. అయితే ఆధునిక సౌకర్యాలతో పాటు ఎక్కడబడితే అక్కడ బరువుతగ్గించే సెంటర్లు కూడా పెరిగిపోయాయి. కారణం... ఊబకాయులు పెరిగిపోతుండటమే. దీనికి ఆడామగా, చిన్నా పెద్దా తేడా లేదు. బరువు పెరగడానికి వయసుతో పనిలేదు.

వెయిట్ తగ్గించే అద్భుతాలు

స్లిమ్మింగ్ క్యాప్సుల్స్, ఆయిల్స్, క్రీములు, పౌడర్లు, టీలు (డాక్టర్ టీ), డైట్ సప్లిమెంట్లు... ఇలా చెప్పుకొంటూ పోతే బరువు తగ్గించేవని చెప్పేవి మార్కెట్లో సవాలక్ష ఉన్నాయి. కొన్ని ఫిట్‌నెస్ సెంటర్లయితే వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్ల పేరుతో మనీ బ్యాక్ పాలసీ లాంటి రకరకాల ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. అల్ట్రాసౌండ్ చికిత్సలు, మసాజ్‌లు, రేడియేషన్ల వంటి వాటితో కొవ్వు కరిగిస్తామంటున్నాయి. కొన్ని జేబుకు చిల్లు పడటమే తప్ప వీటివల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు బాధితులు.'స్లిమ్మింగ్ మెషీన్ సహాయంతో మీ శరీరంలో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా తగ్గించేస్తామన్న మాటలు నమ్మి లక్షన్నర రూపాయలు చెల్లించాను.

స్లిమ్మింగ్ పరికరం ఉత్పత్తి చేసే వేడి కొవ్వును కరిగిస్తుందని నమ్మబలికారు. కానీ ఒక ఇంచు కూడా బరువు తగ్గలేదని వాపోయారు హైదరాబాద్‌కు చెందిన ఓ యాంకర్. మొత్తం బాడీ మసాజ్ చేయడం వల్ల కొవ్వు కరిగిపోతుందని వెళ్లిన కాల్‌సెంటర్ ఉద్యోగిని అయిన ప్రమీల వాళ్లు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయింది. రోజూ అరగంట సేపు వాకింగ్, తరువాత మరో అరగంట ఎక్సర్‌సైజ్ చేయడం వారానికి మూడుసార్లు తమ సెంటర్‌లో ఓ గంటసేపు మసాజ్...

నెలరోజుల్లో అయిదు కిలోల బరువు తగ్గుతారని చెప్పడంతో ఇక తను తీసుకునే ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టింది ప్రమీల. ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా అలా బయటకు వెళితే చాలు.. ఏ బేకరీకో, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కో వెళ్లడం రుచిగా ఉన్నదల్లా లాగించెయ్యడం... తరువాత బరువు పెరిగిపోతున్నామని బాధపడటం... ఇటీవలి కాలంలో ఈ తరహా ధోరణి ఎక్కువయింది. ఎక్కువ కష్టపడకుండా వెంటనే బరువు తగ్గిపోవాలన్న కోరికతో స్లిమ్‌బెల్టులు, స్లిమ్ మెషీన్లు కొని తెచ్చిపెట్టుకోవడం, స్లిమ్ క్యాప్సుల్స్, యాంటి ఒబేసిటీ మందుల్లాంటివి వాడటం వల్ల అనుకున్న ఫలితం పొందడం మాట అటుంచి ఇతరత్రా సైడ్ ఎఫెక్టులు కలిగే అవకాశం ఉంది.

అసలైన మంత్రం

అందుకే బరువు తగ్గడానికి రాచబాట లాంటి వ్యాయామాన్ని వదిలేసి యంత్రాలపై ఆధారపడటం సరికాదు. వ్యాయామం చేసేందుకు సమయం సరిపోవట్లేదంటారు చాలామంది. కానీ ఆరోగ్యాన్ని మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు. ఎంత అర్జెంట్ పనులున్నా వ్యాయామం కోసం కనీసం ఓ అరగంట సమయాన్ని కేటాయించాలి. మన రోజువారీ పనుల్లో కూడా కాస్త బద్దకాన్ని వదిలితే బరువు తగ్గించుకోవడం మన చేతుల్లో పనే. ఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లడానిక్కూడా లిఫ్ట్ వాడేబదులు నాలుగు అంతస్థులున్నా మెట్లు ఎక్కండి. పక్కనున్న షాప్‌కి నడిచే వెళ్లండి. మీ బాబును స్కూల్లో దింపడానికి బండి తీయకండి.

సాధ్యమైనంతవరకూ కాళ్లకు పనిచెప్పండి.'హాస్పిటల్‌లో ఏ ఫ్లోర్‌కి, ఎన్నిసార్లు వెళ్లాల్సి వచ్చినా లిఫ్ట్ అసలే వాడను. బరువు పెరగకుండా, ఆరోగ్యంగా ఉండటంలో నా రహస్యం అదే'అంటారు హైదరాబాద్‌లోని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సోమరాజు. అండుకే మీరూ బద్దకాన్ని వదిలి కొవ్వును కరిగించే వ్యాయామంపై దృష్టిపెట్టమంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఎన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామం లేకపోతే మాత్రం ఎక్కడి కొవ్వు అక్కడే ఉంటుంది. అందుకే ఒకరిని చూసి ఒకరు వెయిట్ లాస్ సెంటర్ల వైపు పరుగులెత్తకుండా మంచి తిండి తినండి, బాడీకి పని పెట్టండి, ఆరోగ్యంగా ఉండండని సూచిస్తున్నారు.

-కె.రచన

చురుకుగా ఉండాలంటే

నేటి మహిళకు చురుకుదనం చాలా అవసరం. ఇంటి పనులు, పిల్లలను బడికి పంపించడం వంటి పనులతో కొన్నిసార్లు ఆహారాన్ని అసంపూర్తిగా తీసుకుంటారు కొంతమంది గృహిణులు. ఇలా చేయడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోవడమే కాకుండా పనులలో వేగం తగ్గుతుంది. అందుకే ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చిన్న మార్పులు చేస్తే మేథాశక్తిని పెంచుకుని మరింత చురుకుగా ఉండొచ్చు. మెదడు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. కండరాలు దృఢంగా తయారు కావాలంటే ప్రోటీన్లు ఉన్న ఆహారం ఏ విధంగా అవసరమో, అలాగే మెదడు చురుకుగా పనిచేయటానికి కూడా తగిన ఆహారం తీసుకోవాలి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం లోనే చిన్న చిన్న మార్పులు చేస్తే మేథాశక్తిని పెంచుకోవచ్చు. మరింత చురుకుగా ఆలోచించవచ్చు. నభై ఏళ్ళు దాటిన వారికి జ్ఞాపకశక్తి తగ్గటమే కానీ పెరగటం ఉండదు. అయితే తగిన ఆహారం తీసుకుంటే ఈ తగ్గుదలను పూర్తిగా అరికట్టవచ్చు.

ఉదయం పూట తినే టిఫిన్‌ని చిన్న చూపు చూడవద్దని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు చురుకుగా పనిచేయటానికి అవసరమైన శక్తిని గ్లూకోజ్‌ ఇస్తుంది. మనం తీసుకునే బ్రేెక్‌ఫాస్ట్‌, ఈ గ్లూకోజ్‌ను అందిస్తుంది. బ్రేెక్‌ఫాస్ట్‌ మానేస్తే చురుకుదనం తగ్గుతుంది.

బ్రేక్‌ఫాస్ట్‌లో...

ఉదయమే బిస్కట్స్‌, పిజ్జా, కేక్స్‌, బర్గర్‌ వంటి పదార్థాలను తినే పిల్లలు కానీ పెద్దవారు కానీ అంత చురుకుగా వ్యవహరించలేకపోతారు. వాటికి బదులు బీన్స్‌, మొలకెత్తిన గింజలు వంటివి తీసుకునేవారు చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటారు. వీటికితోడు పాలు తప్పనిసరి. పీచు (ఫైబర్‌) ఉన్న ఆహారపదార్థాలు ప్రధానంగా ఆకుకూరలు వంటివి అత్యధికంగా మేలు చేస్తాయి. బేకరీలలో తయారైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఇవి ట్రాన్స్‌ ఫాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయకపోగా క్యాన్సర్‌ కారకాలుగా పనిచేస్తాయి.

మధ్యాహ్న భోజనం....

ఇక మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే కోడిగుడ్లు తప్పనిసరి. కోడిగుడ్డు నుంచి మన శరీరం అవసరమైన శక్తిని తయారు చేసుకోగలుగుతుంది. ఎసెటిల్కోలైస్‌ దీనికి ఒక ఉదాహరణ. ఇది తక్కువైతే ఆల్జిమర్స్‌ వ్యాధి వస్తుంది. న్యూరో ట్రాన్స్‌ మీటర్స్‌ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడును ఉత్తేజపూరితం చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పళ్ళు, పచ్చని కూరలే శరీరానికి మిత్రులు అనేది గుర్తుంచుకోండి. వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉండటమే కాక ఫైబర్‌ అత్యధిక స్థాయిలో ఉంటుంది. పెరుగును ఎక్కువగా తీసుకోవటం మరిచిపోవద్దు. పెరుగు'అమినో యాసిడ్‌ టైరోసిన్‌'లను కలిగిఉంది. ఇది వత్తిడిని తట్టుకునేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా న్యూరో ట్రాన్స్‌ మీటర్లను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది. పెరుగు మెదడుకే కాక, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జీర్ణ కోశాన్ని చక్కగా పనిచేసేలా చేస్తుంది.

చేపతో లాభాలెన్నో...

చేప సంబంధ ఆహారపదార్థాల గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇవి గుండెపోటు రాకుండా నివారిస్తాయి. నేత్ర సంబంధ వ్యాధులను రాకుండా అరికడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో కొవ్వు శాతం బాగా తక్కువ. అందువల్ల ఇవి ఇతర మాంస సంబంధ ఆహార పదార్థాల మాదిరిగా శరీరానికి ఎంత మాత్రమూ హాని చేయవు. మేధస్సును అపరిమితంగా శక్తివంతం చేస్తాయి. వీటిలో ఉండే ఓమేగా-3 ఫాటీ యాసిడ్స్‌ మెదడులోని కణాలను ఉత్తేజితం చేస్తాయి. ఏ ఇతర ఆహారం పదార్థాంలోనూ ఈ స్థాయిలో ఒమేగా3 ఫాటీ యాసిడ్స్‌ ఉండవు.

జీవన శైలి సమస్యలకు చికిత్స

ఆధునిక జీవన శైలి శరీర వ్యవస్థను నడిపించే వాత, పిత్త, కఫాల సమతుల్యతను దెబ్బ తీస్తోంది. ఫలితంగా పిన్న వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు మొదలవుతున్నాయి. వీటికి తోడు నానాటికి పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్ల కారణంగా వాత దోషం పెరిగి నాడీ సంబంధమైన వ్యాధులు అధికమవుతున్నాయి. అందుకే నాడీ సంబంధిత వ్యాధుల మీద దృష్టి సారిస్తున్నారు ఆధునిక ఆయుర్వేద వైద్యులు.
ఈ కాలంలో చాలా ఎక్కువ మంది జబ్బుచేయగానే వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. కానీ, చాలా వ్యాధులు ఎన్ని మందులు వాడినా తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తున్నాయి. కారణం వ్యాధి మూలాలను తొలగించే వైద్యచికిత్సలు అందకపోవడమే. ఈ నిజాన్ని గ్రహించిన వారంతా వ్యాధిమూలాలను తొలగించే ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. శరీరం వ్యాధిగ్రస్థం కావడానికి మౌలికంగా వాత,పిత్త, కఫాలనే మూడుగుణాలు అస్తవ్యస్తం కావడమే ప్రధాన కార ణం.

ఈ మూడింటినీ తిరిగి సమతుల్య స్థితికి తేవడం ఒక్కటే సిసలైన చికిత్స అవుతుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి మిగతా ఎన్ని వైద్య చికిత్సలు చేసినా వృథాయే. గత కాలంలో వైద్యులు ఈ వివరాలను మరీ అంత లోతుగా రోగికి చెప్పేవారు కాదు. కేవలం వైద్యుని మీద ఉండే నమ్మకం మీదే వారు చికిత్స తీసుకునే వారు. ఇప్పుడు అలా కాదు. వ్యాధి మూలాలను వాటిని తొలగించే ఆయుర్వేద చికిత్సా విధాలను పూర్తిగా వివరించనిదే ఎవరూ నమ్మడం లేదు. అందుకే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడాన్ని తమ విధిగా భావిస్తున్నారు.

నాడీ వ్యవస్థే పునాది

ఏ పనిచేయాలన్నా నాడీ వ్యవస్థలో ప్రాథమికంగా అందుకు అవసరమైన శక్తి (యాక్షన్ పొటెన్షియల్) ఉండాలి. ఆ శక్తికి శరీరంలోని ఏడు «ధాతువులూ సక్రమంగా పనిచేయాలి. ఏదైనా ధాతువులోకి శక్తి వచ్చి చేరడానికి ధాతువుకు బయట ఉన్న సోడియం లోనికి వచ్చేస్తుంది. ధాతువులోపల ఉన్న పొటాషియం బయటికి వెళ్లిపోతుంది. ఈ మార్పిడితో మనిషి తన చర్యల్ని సక్రమంగా నిర్వహించగలుగుతాడు. శరీరంలో నిరంతరంగా జరిగే ఈ ప్రక్రియనే వాతం అంటారు.

ఈ వాతంలో దోషం ఏర్పడినప్పుడు నాడీ వ్యవస్థ అంతా కుంటుపడుతుంది. నిద్రలేమి, మూర్ఛ, పక్షవాతం, పంచేంద్రియాలు సరిగా పనిచేయకపోవడం వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. పైకి కనిపించే ఈ లక్షణాలనైతే ఇతర వైద్యవిధానాలు గుర్తిస్తున్నాయి. కానీ, అందుకు కారణమైన మూలాల్లోకి వెళ్లడం లేదు.

రక్తనాళాల్లో కొవ్వు, లేదా కొలెస్ట్రాల్ అడ్డుపడిందీ అని తెలియగానే దాన్ని శస్త్ర చికిత్సతో తీసివేయాలంటున్నారే తప్ప ఆ సమస్య రావడానికి గల అసలు కారణాలను గమనించడం లేదు. ఆయుర్వేదం మాత్రం ఆ అంశం మీదే ఎక్కువగా దృష్టిపెడుతుంది. ప్రత్యేకించి మానసిక ఒత్తిళ్ల కారణంగా నాడీ సంబంధ వ్యాధులు పెరిగిపోతున్నాయి. నాడీ వ్యవస్థ చక్కబడనిదే శరీరంలోని ఏ వ్యా«ధీ పూర్తిగా పోదు. అందుకే ఆధునిక ఆయుర్వేద వైద్యులు వాత గుణదోషాన్ని తొలగించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

జీర్ణాశయం చిక్కులు

జీర్ణక్రియకు తోడ్పడే అంశ మే పిత్తం. పిత్తం అగ్నిలాంటిది. ఈ అగ్ని రక్తంలో ఉంటుంది. సహజంగా శరీరంలోని ప్రతి ధాతువుకూ, ప్రతికణానికీ రక్తం, రక్తం ద్వారా వచ్చే ఆక్సిజన్ కావాలి. అయితే, రక్తంలో పిత్తం ఉంటూ ఆప్రక్రియ సజావుగా జరిగేలా చేస్తుంది. శరీరంలోని ప్రతి ధాతువునూ, ప్రతి కణాన్నీ ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పిత్తమే తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియకే కాకుండా జీర్ణమైనవి శ్రోతస్సుల్లోకి వెళ్లడానికి, ప్రతిధాతువుకూ శక్తి అందడానికీ, వ్యర్థ పదార్థాల విసర్జనకూ తోడ్పడుతుంది.

నిజానికి శరీరాన్ని ఒక పరిపూర్ణ స్థితిలో ఉంచడంలో పిత్తం ఒక కీలక భూమికను నిర్వహిస్తుంది. కాకపోతే, ఆధునికుల్లో శరీర శ్రమ లేకపోవడం వల్ల ఈ అగ్ని అవసరమైన స్థాయిలో ఉండడం లేదు. ఆ అగ్నిని పెంచే మందులు ఇస్తూనే రోగి జీవన శైలి మార్పు కోసం నొక్కి చెప్పడం ఆయుర్వేదంలో ఒక ప్రధాన అంశం.

కఫం మాటేమిటి?

శరీరంలో రరరకాల ద్రవాలు ఉంటాయి. అలాగే శరీరంలోని ప్రతికణంలోనూ ద్రవం ఉంటుంది. శరీరానికి కావలసిన ఈ ద్రవాలన్నింటిని సమతుల్యంగా ఉంచడం కఫమే చేస్తుంది. ద్రవాలు కొరవడితే శరీరం పొడిబారిపోతుంది. జీవక్రియలన్నీ మందగిస్తాయి. అందుకే క ఫాన్ని సమతుల్యంగా ఉంచడాన్ని ఆయుర్వేదం ఒక ముఖ్య అంశంగా పరిగణిస్తుంది. వ్యాధి నుంచి విముక్తున్ని చేయడం ఒక్కటే కాదు. ఆరోగ్యవంతుడు జీవితాంతం ఆరోగ్యంగా ఎలా ఉండాలో కూడా ఆయుర్వేదం చెబుతుంది.

డాక్టర్ ఎన్ సత్యప్రసాద్
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల
ఎర్రగడ్డ, హైదరాబాద్
మొబైల్: 9848683848

వివిధ ఆహార పదార్థాల కలయిక, అపోహలు-వాస్తవాలు

పాలకూర- టొమాటో, చేపలు - పెరుగు, పొట్లకాయ - కోడిగుడ్డు... ఇవన్నీ రాంగ్ కాంబినేషన్సా!? కానే కాదు. రోజూ మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఏవేవి, ఎందుకు కలిపి తినకూడదు? తప్పకుండా తినవచ్చు. తినకూడదనుకోవడం అపోహే. పప్పు తింటే కడుపు ఉబ్బరం, పండ్లు తింటే అజీర్తి, పాలు తాగితే అలెర్జీ... వంటి సమస్యలు ఎందుకు తలెత్తుతాయి? ఫుడ్‌కాంబినేషన్స్‌లో తలెత్తే అనుమానాలు, అపోహలు నివృత్తి చేసి, శరీరానికి కొన్ని పడనప్పుడు ఏం చేయాలో తెలిపే కథనమే ఈ ముందు జాగ్రత్త.

టొమాటో + పాలకూర

టొమాటోలో ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి. పాలకూరలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ రెండింటి కలయిక వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని చాలామందిలో అపోహ. కాని వంశపారంపర్యం, నీళ్లు తక్కువ తాగడం.. వంటి కారణాల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అంతే తప్ప టొమాటో-పాలకూర కలిపి తినడం వల్ల కాదు.

పొట్లకాయ + గుడ్డు

పొట్లకాయలో నీటి శాతం ఎక్కువ. అలాగే పీచుపదార్థాలు, బి-విటమిన్లు ఉంటాయి. దీని నుంచి వచ్చే శక్తి కూడా తక్కువే. గుడ్డు తెల్లసొనలో అత్యధికంగా ప్రొటీన్లు, పచ్చసొనలో పిండిపదార్థాలు, ఎసెన్షియల్ ఫ్యాటీయాసిడ్స్, ఐరన్, లెసిథిన్ ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి వండి తినడం వల్ల ఎలాంటి హాని జరగదు.

చేపలు + పెరుగుచేపలు

తిన్న తర్వాత పెరుగు తింటే రుచిగా ఉండదు అనే తప్ప ఇది రాంగ్‌కాంబినేషన్ ఎంత మాత్రం కాదు. చేపల్లో ఉండే ప్రొటీన్లు చర్మం, గుండె, శిరోజాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెరుగులో క్యాల్షియం, పిండిపదార్థాలు, విటమిన్'సి'... ఉంటాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.

భోజనం + పండ్లు

అన్నంతో పాటుగా పండ్లు తీసుకుంటే అజీర్తి చేస్తుందని చాలా మంది అపోహపడుతుంటారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. అన్నం, కూరలు, స్వీట్లు, పండ్లు ఒకేసారి మోతాదుకు మించి తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణం కాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆ విషయం తెలియక భోజనంలో పండ్లు తీసుకోకూడదు అనుకుంటారు.

నూనెలు + నూనెలు

వెజిటబుల్ ఆయిల్స్‌ను ఇతర ఆయిల్స్‌లో కలిపి వంటలో ఉపయోగిస్తే మంచిది అనుకుంటారు. కాని అది నిజం కాదు. నూనెలను విడివిడిగా ఉపయోగించాలి. అలాగే ఒకసారి వాడిన నూనెనె తిరిగి 72 గంటలలోగా మళ్లీ ఉపయోగించవచ్చు. లేదంటే అలా వాడిన నూనెకు ఆక్సిడేషన్ జరుగుతుంది. దానిని పదార్థాల రూపంలో మనం తీసుకున్నప్పుడు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఆకుకూరలు + కూరగాయలు + పప్పు దినుసులు

ఆకుకూరల వేర్లలో మట్టితో పాటు ఉండిపోయిన బ్యాక్టీరియా స్పోర్‌లా తయారవుతుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత హాని చేస్తుంటుంది. సరిగ్గా శుభ్రపరచకుండా వేరే పదార్థంతో వండితీసుకున్నప్పుడు ఇబ్బంది తలెత్తుతుంది. ఈ విషయం తెలియక ఫలనా ఆకుకూరను కూరగాయలను కలిపి వండడం వల్లే ఇలా జరిగిందని అనుకుంటారు. అందుకని ఆకుకూరలను కట్‌చేయడానికి ముందు పదినిమిషాల సేపు ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టాలి. పప్పులతో పాటు ఆకుకూరలను ఉడకబెడితే వాటిలో ఉండే పోషకాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని ఆకుకూరలను విడిగా తగినంత ఉష్ణోగ్రతలోనే మగ్గించి, పప్పు ఇతర కూరగాయల్లో కలుపుకోవాలి.

పడని పదార్థాలు

కొందరికి పాలు, పాల ఉత్పత్తులు పడవు. ఇంకొందరికి గుడ్డు తింటే అలెర్జీ. ఇలా ఏదైనా ఆహారం పడకపోవడం అనే సమస్య పుట్టుకతోనే వస్తుంది. లేదంటే ఏదైనా శస్తచ్రికిత్స అయిన తర్వాత ఇలాంటి సమస్యలు గమనిస్తుంటాం. ఏవైనా పదార్థాలు పడటం లేదు అని పూర్తిగా మానేస్తే అందులోని పోషకాలు మనం కోల్పోయినట్టే. ఫలితంగా పోషకాహార లోపం తలెత్తుతుంది. అందుకని ప్రత్యామ్నాయ ఆహారాన్ని తీసుకోవాలి. అదెలాగంటే.. పాలు పడని వారు మజ్జిగ ఉపయోగించడం వంటివి.

ఆహారం తినగానే వాంతులు అవడం, కడుపునొప్పి, తలనొప్పి, ఒళ్లంతా దద్దుర్లు వస్తే ఫుడ్ ఫాయిజనింగ్‌కి ఇవి సాధారణ లక్షణాలని గమనించాలి. పడని పదార్థాలు ప్రభావం 48 గం.ల వరకు ఉంటుంది. కొన్ని జాగ్రత్తలతో సమస్యను నివారించుకోవచ్చు. దద్దుర్లు వచ్చి ముఖం వాచడం, విరేచనాలుతీవ్రంగా గొంతునొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తితే విషాహార ప్రభావం చాలా తీవ్రంగా ఉందని గమనించి వైద్యుల సలహా తీసుకోవాలి.

విషాహారానికి విరుగుడు...

మితంగా పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యం పట్ల తీసుకునే ముందు జాగ్రత్త. ఫుడ్ పాయిజనింగ్‌కి వందల రకాల బాక్టీరియా కారణం అవుతుంటుంది. తిన్న ఆహారం పడకపోవడం జరిగితే లక్షణాల బట్టి వెంటనే ప్రథమ చికిత్స చేయాలి.

గ్లాస్ నీటిలో టీ స్పూన్ ఉప్పు కలిపి తాగితే తిన్న ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది.
నీళ్లు ఎక్కువగా తాగాలి. దీని వల్ల ఆహారంలో చేరిన రసాయనాలు నీళ్లలో కలిసిపోయి బయటకు వస్తాయి.
పల్చని మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు కలుపుకొని తాగాలి. లేదా పెరుగు తినాలి. పెరగులో ఉండే లాక్టోబాసిలై బ్యాక్టీరియా అజీర్తిని నివారిస్తుంది.
అజీర్తిగా అనిపిస్తే అరటిపండు తినడం మంచిది.
ఆహారం తిన్న తర్వాత గుండె దడగా అనిపించినా, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా, కళ్లు తిరిగి పడిపోయినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

జుట్టు రాలడాన్ని నిరోధించేదెలా?

మా అమ్మకి అరవై ఏళ్లు వచ్చినా ఇప్పటికీ జుట్టు నల్లగా నిగనిగలాడుతోంది. ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేదు. నాకేమో ఉన్న జుట్టుకు రంగు వేయాల్సి వస్తోంది. మా అమ్మాయికి అప్పుడే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతోంది. నా సంగతి సరే! మా అమ్మాయికి జుట్టు ఊడకుండా, తెల్లజుట్టు రాకుండా ఉండటానికి ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వండి.
- బృంద, వైజాగ్
ఈ మధ్యకాలంలో మీరు చెబుతున్న సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ, బ్యూటీ క్లినిక్‌ల చుట్టూ తిరిగే వారి సంఖ్య చాలా పెరిగింది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనిపించే జుట్టురాలే సమస్య ఇప్పుడు యుక్త వయస్కుల్లోనూ కనిపిస్తోంది. ఇరవై ఏళ్లకే జుట్టు తెల్లబడుతోందని, తలస్నానం చేస్తే జుట్టంతా ఊడిపోతోందంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

బట్టతల వంశపారపర్యంగా సంక్రమించేదే అయినా జుట్టు రాలడానికి పోషకాహారలోపం, మానసిక ఆందోళన, నిద్రలేమి, కాలుష్యం, హార్మోన్ల సమస్య వంటివి కారణమవుతున్నాయి. చర్మం కిందిపొరను ఎపిడెర్మిస్ అంటారు. ఎపిడెర్మిస్‌లో రక్తనాళాలు ఉండవు.

స్వేదగ్రంథుల నాళాలు, రోమాలు ఎపిడెర్మిస్ పొరను చీల్చుకుని చర్మం పైకి వస్తాయి. రోమాల మూలంలో ఒక గ్రంథి ఉంటుంది. దీన్ని కేశమూలము లేదా హెయిర్ ఫాలికల్ అంటారు. కేశము ఒక సన్నని ప్లాస్టిక్ నాళం వంటి నిర్మాణము. దీని నాళికలో ఉండే రంగుపదార్థాన్ని మెలనిన్ అంటారు. దీని కారణంగానే జట్టుకు రంగు వస్తుంది.

కారణాలు
 • వయస్సు: వయసు పైబడుతున్న కొద్దీ కేశమూలాలు కుంచించుకుపోతాయి. కొత్త వెంట్రుకల ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది వంశపారంపర్యంగా ఒక్కో కుటుంబంలో ఒక్కో రకంగా ఉంటుంది.
 • ఆహారం: వెంట్రుకలు రాలిపోవడానికి పోషకాహార లోపం ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఎక్కువ శాతం మందిలో శిరోజాలు రాలడానికి పోషకాహార లోపమే కారణం.
 • హార్మోన్ సమస్యలు: థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు అధికంగా లేక తక్కువగా విడుదలకావడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.
 • స్త్రీలలో..: గర్భిణిలు డెలివరీ అయ్యాక మూడు నెలలకు జుట్టు రాలే సమస్య కనిపిస్తుంది. గర్భం దాల్చినపుడు అధికంగా విడుదలయిన హార్మోన్ల మూలంగా ఈ సమస్య వస్తుంది.
 • మందుల ప్రభావం: గౌట్, అధిక రక్తపోటు, గుండె, నాడీ సమస్యలకు వాడే మందుల ప్రభావం జుట్టుపై ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో ఎ-విటమిన్ తీసుకోవడం వల్ల, గర్భనిరోధక మాత్రలు, యాంటీడిప్రెషన్ మందుల కారణంగా కూడా జుట్టు రాలవచ్చు.
 • ఇన్‌ఫెక్షన్లు: తలలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా శిరోజాలు రాలిపోయే అవకాశం ఉంది.
 • మానసిక ఒత్తిడి: శారీరక, మానసిక ఒత్తిడి, ఐరన్ లోపం వంటి అంశాలు కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమవుతాయి.
 • కాలుష్యం: వాహన కాలుష్యం వల్ల శిరోజాలు బలహీనపడి రాలిపోవడం జరుగుతుంది.
 • దీర్ఘకాలిక వ్యాధులు: క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న వారిలో జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.
 • డయాబెటిస్‌ను నిర్ధారించేందుకు చేసే పరీక్షలు, సి.బి.పి(కంప్లీట్ బ్లడ్ పిక్చర్), థైరాయిడ్ హార్మోన్ల శాతాన్ని నిర్ధారించే పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ వంటి టెస్టులు జుట్టు రాలిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి.
హోమియో చికిత్స

ముందుగా వ్యక్తి శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించి, తద్వారా శరీరతత్వానికి సరిపోయే మందులను ఇస్తారు. జన్యులోపాలను, హార్మోన్ల సమస్యలను తగ్గించడంలో హోమియో మందులు చక్కగా ఉపకరిస్తాయి. ఈ సమస్యను నివారించడానికి చక్కని మార్గాలున్నాయి.

 • హెయిర్ డైలను, కృత్రిమ రంగులను జుట్టుకు ఉపయోగించకూడదు. కృత్రిమ రంగులు వాడటం వల్ల అందులో ఉండే రసాయనాలు శిరోజాలను బలహీనపరుస్తాయి.
 • వారంలో ఒకటి, రెండు సార్లు షాంపూతో తలస్నానం చేయాలి. తరువాత తడిలేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. షాంపూలు తరుచుగా మార్చడం మంచిది కాదు. ఎప్పుడూ ఒకే బ్రాండ్ షాంపూ ఉపయోగించాలి.
 • పోషకాహారం తీసుకోవాలి. రోజువారీ మెనూలో ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. జుత్తు బలంగా ఉండాలంటే కాల్షియం, ఐరన్ ప్రొటీన్లు సమంగా అందాలి.
 • తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడమూ అవసరమే. మానసిక ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి.
 • తలలో ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లయితే వెంటనే చికిత్స తీసుకోవాలి.
 • శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం ఉంటేనే శిరోజాలు బాగుంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

పేనుకొరుకుడు

పేనుకొరుకుడు అంటే, తలమీద వున్నట్టుండి వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో పూర్తిగా రాలిపోయి చర్మం కనిపిస్తూవుంటుంది. ఇది అలర్జీ కారణంగా జరుగుతుందని వైద్యులు తెలిపారు.అలర్జీ తగ్గగానే తిరిగి వెంట్రుకలు మళ్ళీ వస్తాయి. బట్టతలమాదిరిగా అవుతుందేమోనని అపోహ పడవలసిన అవసరంలేదు . దీనినే పేనుకొరుకుడు అంటారు.

తక్షణ జాగ్రత్తలు తీసుకుంటే పేనుకొరుకుడు నయమౌతుంది!

గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నగా ఉండటాన్ని 'పేనుకొరుకుట' అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకడం వలనరాదు. అలా 'నానుడి'గా సాధారణజనానికి అర్ధమయ్యే పరిభాషలో అంటారు. దీన్ని వైద్యశాస్త్రంలో 'అలోపీ షియా ఏరియేటా(Alopecia areata)' అని అంటారు. దీన్ని సుమారు 2000 సంవత్స రాల క్రిందటే గుర్తించారు. చర్మవ్యాధుల ఆసుపత్రులకు హాజరయ్యే రోగులలో ఇది 2శాతం మందికి ఉంటుంది.

కారణం :

ఇది ఒక 'ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌'. అనగా వెంట్రుకలకు వ్యతిరేకంగా తనలోనే ' ఆంటీబాడీలు' తయారై వెంట్రుకలను అలా అక్కడక్కడా లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన, థైరాయిడ్‌, డయాబెటిస్‌, బి.పి. మొదలగు సమస్యలున్న వాళ్ళలో అధికంగా కన్పిస్తుంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకు 20శాతం మందికి గోళ్ళ మీద గీతలు, గుంటలు కలిగి వుండటం గమనార్హం.

ఎక్కడెక్కడ వస్తుంది :

వెంట్రుకలు మొలచు ఏ భాగంలోనైనా ఇది రావచ్చు. తలలో ఎక్కువగా కన్పిస్తుంది. గడ్డంమీద, మీసాల దగ్గర వస్తుంది. కనుబొమ్మల మీద కూడా రావచ్చు. కాళ్ళు, చేతులు, ఛాతీమీద కూడా వెంట్రుకలు లేని గుండ్రని ప్రదేశాలు కన్పిస్తాయి. కానీ, ముఖ్యంగా - తలమీద, గడ్డం, మీసాలు, కనుబొమ్మలు- మీద వస్తే చాలా ఆందోళనకు గురై - వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తారు. ఇది సౌందర్యలోపానికి చిహ్నం కూడా. ఇది మరే ఇతర ఇబ్బంది కలిగించదు కూడా! కొందరిలో తలమీద ఒకచోట మొదలై - మొత్తం తలంతా కూడా వెంట్రుకలు రాలిపోతాయి. తల గుండు జేయించినట్లు ఉంటుంది. దీన్ని' అలోపీషియా' టోటాలిస్‌(Alopecia Totalis)' అని అంటారు. అలాగే, జబ్బు శరీరం అంతా ప్రాకి- తలమీద, కనుబొమ్మలు, గడ్డం, మీసాలు, చేతులు, కాళ్ళు, ఛాతి మీద- మరెక్కడా వెంట్రుకలు లేకుండా చేస్తుంది. దీన్ని ' అలోపీషియా యూనివర్శాలిస్‌(Alopecia Universalis)' అని అంటారు.

ఎవరిలో వస్తుంది :

ఇది ఆడా,మగా తేడా లేకుండా ఎవరిలోనైనా వస్తుంది. పిల్లల్లో కూడా వస్తుంది. కానీ, 20-40 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఎక్కువగా కన్పిస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి ఉంటే, మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ. కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వస్తుంది. కానీ, ఇది అంటువ్యాధి కాదు. 60 సం. దాటిన తర్వాత సాధారణంగా రాదు.

చికిత్స : దీనికి రకరకాలైన చికిత్సా విధానాలు కలవు.

 • స్టిరాయిడ్‌ పూతమందులు.,
 • అక్కడే కొంచెం మంట పుట్టించే పూతమందులు.,
 • ఇమ్యునోమాడ్యులేటర్‌ పూతమందులు
 • అక్కడే స్టిరాయిడ్‌ ఇంజక్షన్‌ ఇచ్చే విధానం.,
 • లేజర్‌ చికిత్స.
 • జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండి వేరే చోట్లకు ప్రాకుతుంటే స్టిరాయిడ్‌ మందు బిళ్ళలు లేదా సైక్లోస్పోరిన్‌ మొదలగు ఇమ్యునోసప్రసివ్‌(Immuno suppresive) మందు బిళ్ళలు వాడుతారు.

ఏ చికిత్సా విధానమైనా - చాలా ఓర్పుతో దీర్ఘ కాలంగా వాడాలి. చికిత్స పూర్తికాలం డాక్టరు పర్యవేక్షణలో సాగాలి. తన ఇష్టానుసారం మందులువాడటంవల్ల జబ్బు తగ్గకపోగా సైడ్‌ఎఫెక్ట్స్‌కు గురౌతారు. మందులతో పూర్తి ఫలితం పొందకపోతే, కొన్ని కొన్ని చిన్న చిన్న నిర్ణీత ప్రదేశాలలో టాటూయింగ్‌ పద్ధతి ద్వారా లోపాన్ని కప్పివేయవచ్చు.

చికిత్స ఫలితాలు :

ప్రతి డాక్టరు రోగికి పూర్తి న్యాయం చేయాలనే సంకల్పంతోనే మంచి ట్రీట్‌మెంట్‌ రోగిని అనుసరించి ప్రారంభిస్తారు. అయినప్పటికి అందరి రోగులకు ఫలితాలు ఒకేరకంగా ఉండవు. కొందరికేమో అతి కొద్దికాలంలోనే అనూహ్య మార్పు వచ్చి ఆనందాన్నిస్తుంది. మరికొందరికి దీర్ఘకాలం తర్వాత మార్పు వస్తుంది. మరికొద్దిశాతం మందిలో ఎన్నిరోజులు వాడినా ఫలితం కన్పించదు. వంశపారంపర్యంగా ఉన్నా....కనుబొమ్మలు, కనురెప్పలు, తల, గడ్డం, మీసాలు - అన్నిచోట్ల వెంట్రుకలు రాలిపోవడం, చిన్నరోగం మాదిరిగానే జబ్బు మొదలై ప్రాకుతుంటే -మొదలగు సందర్భాలలో ఆశించినంత ఫలితాలు అందవు. కానీ, ఏది ఏమైనా 'పాజిటివ్‌ మైండ్‌'తో ఉండి ఫలితాలు సాధించుకునేందుకు ప్రయత్నం చేయాలి!!

 • మూలము : విశాలాంధ్ర దినపత్రిక -డా|| మామిళ్ళ బాలనరసింహులు,--చర్మ, సుఖవ్యాధుల నిపుణులు

ఆయుర్వేద చికిత్స :

బెట్నిసాల్ వంటి స్టిరాయిడ్స్‌తో తయారయిన చుక్కల మందుని పేనుకొరుకుడు పైన రాయమని వైద్యులు సూచిస్తుంటారు. ఒక్కొక్కసారి వీటికి ఫలితం రాకపోతే గురివింద గింజని బాగా అరగదీసి గంధం తీసి పేనుకొరికిన చోట రాయండి. ఇలా నాలుగైదురోజులు రాస్తే వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తాయి. మందారంపూలనుకూడా దీనినివారణకు మందుగా వాడుతారు, కాని గురివిందతోనే చాలా త్వరగా నయమౌతుందని వైద్యులు తెలిపారు.

ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.

డా. శ్రీకాంత్. యం
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
ఆంధ్రప్రదేశ్-కర్ణాటక,
ఫోన్: 9550001144, 9550001188

చలికాలం - ఆహార జాగ్రత్తలు!

చలి కాలంలో ఆకలి ఎక్కువ వేస్తుంది. తరచు ఏదో ఒకటి తినాలని నాలుక లాగుతూ ఉంటుంది. జీర్ణశక్తి ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. నిజానికి చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. ఎక్కువగా తింటాం. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడతాయి. కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు, బద్దకంగా, నిస్తేజంగా ఉండడం, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చలికాలంలో ఇందుకే వస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో వివరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. వారి మాటలు విందాం రండి.

 • చలికాలంలో బాదం పప్పు, జీడిపప్పు, అంజీర, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలను పరిమితంగా అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలు, చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దాంతో పాటు మన శరీరానికి అవసరమైన వేడికూడా ఈ పదార్థాల వల్ల లభిస్తుంది.
 • మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అవాలు, ఉల్లిపాయలు ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకోవాలి. వీటి వాడకం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉండడంతో పాటు పొట్టలో గ్యాస్ సమస్య ఉండదు.
 • ఆహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. పైగా తగిన శ్రమ ఉండదు కాబట్టి మునగ, కాకర, అరటి వంటి కూరగాయలు, మెంతి, పుదీనా వంటి ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. వీటి వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
 • మొలకెత్తిన గింజలు ఈ సీజన్‌లో బెస్ట్. వాటిని తీసుకోవడం వల్ల శక్తి ఎక్కువగా వస్తుంది. పైగా పొట్ట బరువుగా అనిపించదు.
 • ఓ గ్లాసు వేడి పాలలో కాస్త పసుపు, మిరియాలు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
 • నిల్వ ఉంచిన, చల్లారిపోయిన ఆహారం ఈ సీజన్‌లో అసలే తీసుకోకూడదు. వేడి వేడి, తాజా ఆహారం ఎంజైమ్స్‌ను వృద్ధి చేస్తాయి.
 • శారీరక శ్రమ తగ్గిపోతుంది కాబట్టి మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవు. అందుకోసం ఆరంజ్, నిమ్మ వంటి విటమిన్- సి ఉన్న పండ్లు తీసుకోవాలి.
 • వారంలో ఒకపూట నిరాహారంగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయి. శరీరానికి నవ చైతన్యం సమకూరుతుంది.
 • వయోధికులు చన్నీటి స్నానాలు వదిలేయాలి. ఒకవేళ చేయాల్సి వస్తే కాస్త ఎండ వచ్చిన తరువాత స్నానం చేయడం మంచిది.
 • పొద్దుకుంగిన వెంటనే ఇంటి కిటికీలన్నీ మూసేయాలి. కర్టెన్లు కూడా వేసేయడం ద్వారా ఇల్లు లేదా నిద్రించే గది వేడిగా ఉండేలా చూసుకోవాలి.
 • వృద్ధులు, చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఈ జాగ్రత్తలు తప్పని సరి. లేకుంటే చలి కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
 • పడుకొనే ముందు గోరువెచ్చని నీటితో చేతులు, కాళ్లు, ముఖం శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ వంటివి రాసుకొని పడుకోవడం వల్ల చర్మం పాడు కాకుండా ఉంటుంది.
 • తెల్లవారుజామున లేవాల్సిన అవసరం ఉన్న వారు చెవులకు తప్పని సరిగా మఫ్లర్ లేదా మంకీ క్యాప్ వంటివి తప్పని సరిగా వేసుకొనే బయటకు వెళ్లాలి.

సిజేరియన్ - వాస్తవాలు

కారణం ఏదైనా కావచ్చు. తప్పా ఒప్పా అన్నది పక్కన పెడితే మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య పెరిగిపోతుండటం మాత్రం వాస్తవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం సిజేరియన్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15 శాతానికి మించకూడదు. కానీ మనదేశంలో 20 నుంచి 30 శాతానికి సిజేరియన్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడున్నన్ని వైద్య పరికరాలు గతంలో లేవు. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఆరోగ్యపరిస్థితి పూర్తి స్థాయిలో తెలిసేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది.

అందుకే ఏమాత్రం రిస్కు ఉందన్నా వెంటనే సిజేరియన్ చేసి తల్లీబిడ్డల్ని రక్షిస్తున్నారు. ఆరోగ్య సమస్యల్ని పక్కన పెడితే పేషెంట్ల కోరిక మేరకో, తమకు టైమ్ లేదనో కూడా చాలామంది డాక్టర్లు సిజేరియన్ చేసేస్తున్నారు. ఫలానా ముహూర్తంలో పుడితే అద్భుతమైన జాతకం ఉంటుందనో, వర్జ్యంలో పుడితే ప్రమాదమనో.. ఇలా రకరకాల నమ్మకాల వల్ల కొంత, ప్రసవ వేదన పడలేక మరికొంత చాలామంది సిజేరియన్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒకసారి సిజేరియన్ అయితే ఇక తరువాత కాన్పు తప్పనిసరిగా సిజేరియనే చేస్తారని అంటారు. గర్భసంచికి రిస్కు ఉన్నప్పుడు ఇది కరెక్టే. కానీ సాధారణంగా 40 నుంచి 50 శాతం డెలివరీలు నార్మల్‌గానే అవుతాయి.

పోషకలోపం... పెనుశాపం

సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తక్కువ. కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కువ డబ్బులు లాగడానికే సిజేరియన్లు చేస్తున్నారన్న అపోహ చాలామందిలో ఉంది. నిజానికి నొప్పులు వచ్చి ప్రసవం అయ్యేవరకు తల్లీబిడ్డల్ని కనిపెట్టుకుని ఉండటం దీని వెనుక ఉన్న అసలు సమస్య. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలు తల్లీ, బిడ్డల్ని గమనిస్తూ ఉండటానికి ఎవరో ఒకరు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కాబట్టి మానిటరింగ్ సమస్యలు ఉండవు.

కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్లు డెలివరీ వరకూ ఒకే డాక్టర్ కావాలని కోరతారు. ఒకే డాక్టర్ ఒక పేషెంటునే అంటిపెట్టుకుని ఉండటం సాధ్యం కాదు. అంతేగాక పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి, లేటు వయసులో పెళ్లి చేసుకోవడం, ఆధునిక జీవనవిధానం గర్భిణులపై కూడా ప్రభావం చూపుతోంది. టైమ్‌కి తినకపోవడం వల్ల సరైన పోషకాలు అందడం లేదు. తద్వారా కడుపులో ఉన్న బిడ్డకు, తల్లికి రకరకాల సమస్యలు కలిగే అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటప్పుడు తల్లీ బిడ్డల్ని సేవ్ చేయడం కోసం ఆపరేషన్ చేయక తప్పడం లేదంటున్నారు ఉస్మానియా మెడికల్ కాలేజి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిరాదేవి.

నార్మల్‌కే కష్టమెక్కువ సిజేరియన్ చేయడం నిమిషాల్లో పని. కానీ నార్మల్ డెలివరీ అంటే తల్లితో పాటు డాక్టర్ కూడా చాలా కష్టపడాలి. రిస్కు ఎక్కువ. అందువల్ల నిజానికి నార్మల్ డెలివరీకే ఎక్కువ ఖర్చు అవ్వాలి. కాబట్టి డబ్బుల కోసం సిజేరియన్ చేస్తారనడం హాస్యాస్పదం అంటారు ఇమేజ్ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ కృష్ణకుమారి. సమయమూ, కష్టమూ రెండూ మిగులుతాయని సిజేరియన్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

డాక్టర్‌కీ, పేషెంటుకీ ఇద్దరికీ ఇది చాలా సౌకర్యవంతమైన పద్ధతి. అలాగని అనవసరంగా సిజేరియన్లు చేయడం కూడా మంచిది కాదు. ఒకసారి సిజేరియన్ అయిన తరువాత రెండోసారి గర్భం దాల్చినప్పుడు గర్భాశయం చిరిగిపోయే అవకాశాలుంటాయి. ప్లజెంటా సమస్యలు రావచ్చు. అందుకని ఎంతో అవసరం అనుకుంటే తప్ప సిజేరియన్ జోలికి పోకపోవడమే మంచిదంటున్నారు ఢిల్లీలోని ఎయిమ్స్‌కి చెందిన డాక్టర్ అల్కా కృపలానీ.

మిడ్‌వైఫ్ సిస్టమ్ బెస్ట్ మన దగ్గర డాక్టర్లు పేషెంట్ల సంఖ్యకు సరిపడినంత లేరు. పాశ్చాత్యదేశాల్లో మిడ్‌వైఫ్ సిస్టమ్ ఉంది. యుకె, యుఎస్‌లలో 60 నుంచి 70 శాతం డెలివరీలు మిడ్‌వైఫ్‌లే చేస్తారు. అక్కడి మిడ్‌వైఫ్‌లు సర్జరీలు తప్ప అన్నీ చేయగలరు. నార్మల్ డెలివరీలకు డాక్టర్ల అవసరం లేదు. అన్నీమిడ్‌వైఫ్స్‌లే చూసుకుంటారు. కాబట్టి డాక్టర్‌పై కూడా అంత ఒత్తిడి ఉండదు. ఇక్కడ అలాకాదు. మన దగ్గర సాధారణ నర్సులు తప్ప మిడ్‌వైఫ్ సిస్టమ్ అంటూ లేదు. కాబట్టి పని ఒత్తిడి, సమయం లేకపోవడం, 24 గంటల పాటు మానిటరింగ్‌లో తల్లిబిడ్డలకు ఉండే ప్రమాదాన్ని నివారించేందుకు చాలామంది డాక్టర్లు సిజేరియన్లు చేయడానికి మక్కువ చూపిస్తున్నమాట వాస్తవం.

అయితే పేషెంట్లు కూడా సిజేరియన్లనే కోరుకుంటున్నారు. లేబర్ నొప్పులను తట్టుకోలేకపోవడం, మన దగ్గర కొన్ని ఆసుపత్రుల్లో సరైన అనెస్తీషియా అందుబాటులో లేకపోవడం, పెయిన్ రిలీఫ్ మందులు సరైనవి లేకపోవడం వల్ల తల్లులు కూడా ఆపరేషనే బెస్ట్ అంటున్నారు. మన వాళ్లకి ప్రసూతి పట్ల ఏమాత్రం అవగాహన ఉండటం లేదు. సిజేరియన్ ఎందుకు చేయాల్సి వస్తోందని కూడా అడగరు. డాక్టర్ మాటే వేదం. కానీ ఏ కారణం వల్ల సిజేరియన్ చేస్తున్నారు, చేయకపోతే కుదరదా? రిస్కు ఎంత? తదితర వివరాల గురించి డాక్టర్‌ని అడిగి సమాచారం తెలుసుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇతర దేశాల్లో ఇవేవీ కనుక్కోకుండా ఎవరూ సిజేరియన్‌కి ఒప్పుకోరు. ఈ పరిస్థితి మారాలంటున్నారు ఫెర్నాండెజ్ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ గీత. మనవాళ్లలో చాలామందికి ముహూర్తాలపై నమ్మకాలు ఎక్కువ. కాబట్టి ఫలానా ముహూర్తంలోనే కనాలన్న ఆలోచనతో కూడా సిజేరియన్లకు ఓటేస్తున్నారంటున్నారామె.

డాక్టర్ల కష్టాలూ ఓ కారణం

- ప్రొఫెసర్ లిసిలొట్టి మెట్లర్, జర్మనీ తల్లీబిడ్డల రిస్కును ముందుగానే గుర్తించగల వైద్యపరికరాలు అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా సిజేరియన్లు పెరుగుతున్నాయి. అయితే ఇండియాలో మరీ ఎక్కువ. దాదాపు 50 శాతం ప్రసవాల్లో సిజేరియన్లే జరుగుతున్నాయి. జర్మనీలో సిజేరియన్ల సంఖ్య 30 శాతమే. పాశ్చాత్య దేశాలంతటా చూస్తే 20 నుంచి 30 శాతం ప్రసవాలకు సిజేరియన్లు అవసరం అవుతున్నాయి. జర్మనీలో ఎక్కువ శాతం పేషెంట్ల కోరిక మేరనే సిజేరియన్లు చేస్తాం. డెలివరీ సమయంలో ఉండే రిస్కును అవాయిడ్ చేయడానికి చాలామంది సిజేరియన్లు బెస్ట్ అనుకుంటారు.

ఇంతకు ముందులాగా ఎక్కువమంది పిల్లల్ని కనడం లేదు కాబట్టి ఉన్న ఒక్కరూ ఆరోగ్యంగా పుట్టాలనే కోరుకుంటారు. అందుకే ఏ చిన్న రిస్కును కూడా ఎదుర్కొనేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అయితే పదే పదే సిజేరియన్లు చేయడం మాత్రం సమంజసం కాదు. ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్లకు దీనివల్ల చాలారకాల సమస్యలు కలుగుతాయి. అంతకుముందే ఫైబ్రాయిడ్స్ వల్ల సర్జరీ అయినవాళ్లకు మరింత రిస్కు. సాధారణంగా బిడ్డ అడ్డం తిరిగి కాళ్లు కిందివైపుకి రావడం, తల్లి ఆరోగ్య సమస్యలు, హెచ్ఐవి, ఉమ్మనీరు ఎక్కువ తక్కువ కావడం, లేబర్ బ్లీడింగ్, బిపి, ఫిట్స్ లాంటి సమస్యలున్నప్పుడు సిజేరియన్ చేయడం తప్పనిసరి అవుతుంది. కానీ టైమ్ ఎక్కువ వెచ్చించలేక కూడా చాలామంది డాక్టర్లు సిజేరియన్ చేసేస్తున్నారు.

పేషెంట్లు కూడా 24 గంటలు నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేసే సమయం లేక సిజేరియన్ చేసేయమంటున్నారు. ఇండియాలో సిజేరియన్లు ఎక్కువ కావడానికి ఇదీ ఒక కారణమే. భారతీయులు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఇంటి బాధ్యతలు నెరవేర్చడం తప్పనిసరి. ముఖ్యంగా మహిళలు రాత్రి సమయాన్ని ఎక్కువగా వెచ్చించలేరు. మా దగ్గర పరిస్థితి వేరు. వ్యక్తిగత బాధ్యతల ఒత్తిడి తక్కువ. డాక్టర్లు ఏ అర్ధరాత్రి నొప్పులు వచ్చినా వెంటనే కేసు అటెండ్ అయి డెలివరీ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఇండియన్ డాక్టర్లు వృత్తి పట్ల ఎంత నిబద్ధత ఉన్నా కుటుంబ బాధ్యతలు, సామాజిక పరిస్థితుల వల్ల ఎప్పుడంటే అప్పుడు కేసు అటెండ్ కాలేరు. సిజేరియన్లు ఎక్కువ కావడానికి ఇదీ ఒక కారణమే అనుకుంటున్నాను. ఏది ఏమైనా భారతదేశంలో తల్లుల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది.

నార్మల్ డెలివరీ కావాలంటే...
 • సిజేరియన్‌లకి ముఖ్య కారణం ప్రసవ సమయంలో తల్లీ బిడ్డలకు సమస్యలు రావడమే. ఇవి నివారించగలిగితే ఆపరేషన్ చేయాల్సిన అవకాశాన్ని సగానికి సగం తగ్గించవచ్చు. ఇందుకు ఏం చేయాలో నిపుణుల సూచనలివి.
 • గర్భిణులు ఎటూ కదలవద్దు. రెస్ట్‌లోనే ఉండాలనడం సబబు కాదు. ఏ పనీ చేయకుండా కూర్చుంటే కూడా ప్రసవంలో ఇబ్బంది రావచ్చు. అందుకే ప్రతిరోజూ కాసేపు వాకింగ్ చేయాలి. వాకింగ్ వల్ల పెల్విక్ కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. ప్రసవ సమయంలో కండరాల సంకోచవ్యాకోచాలు బావుంటాయి.
 • గర్భంతో ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోకపోతే బిడ్డకు సరైన పోషకాలందక రిస్కు పెరుగుతుంది. అందువల్ల ఇనుము, కాల్షియం, విటమిన్లు, మినరల్స్.. ఇలా అన్ని రకాల పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవాలి. నోటికి రుచించకపోయినా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే అన్ని రకాల కూరగాయలు, పండ్లు తినక తప్పదు.
 • బిపి, మధుమేహం లాంటి జబ్బులుంటే సాధారణ ప్రసవం కష్టం అవుతుంది. కాబట్టి గర్భిణులు బిపి, షుగర్‌లను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
 • సాధారణంగా చిన్నగా, పొట్టిగా ఉండేవారిలో సిజేరియన్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెల్విక్ నాళం చిన్నదిగా ఉండటం వల్ల బిడ్డ మామూలు బరువే ఉన్నప్పటికీ నార్మల్ డెలివరీ కష్టమై సిజేరియన్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇలాంటివాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.
 • నెలనెలా డాక్టర్ చెకప్‌లు తప్పనిసరి. నార్మల్ డెలివరీ వల్ల ప్రమాదం ఉండదని డాక్టర్లు తల్లిలో నమ్మకం కలిగించాలి. ప్రసవానికి సంబంధించిన అన్ని విషయాల్లో కౌన్సెలింగ్ ఇవ్వాలి.

- రచన.కె

ఎలక్ట్రో థెరపీ

విద్యుత్‌ పరికరాల వినియోగం, డెల్టాయిడ్‌ కండరాలను పునరుజ్జీవింపచేయడానికి వాడే గాల్వినిజం... వైద్యంలో విద్యుత్‌శక్తిని వాడడమే ఎలెక్ట్రోథెరపీ. వివిధ జబ్బులను నయం చేసేందుకు ఎలెక్ట్రోథెరపీ వినియోగి స్తారు. న్యూరోలాజికల్‌ వ్యాధులకు వాడే డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేటర్‌స వంటి విద్యుత్‌ పరిక రాలు వీటిలో ఉన్నాయి. గాయాలు త్వరగా మానడం కోసం విద్యుత్‌ వాడడానికి కూడా ప్రత్యేకించి ఈ పదాన్ని వినియోగించారు. ప్ర త్యామ్నాయ వైద్య పద్ధతులు, చికిత్సలకు కూ డా ఎలెక్ట్రోథెరపీ లేక ఎలెక్ట్రోమాగ్నెటిక్‌ థెరపీ ని వినియోగించారు. అయితే ఎముకల చికి త్సలో ఈ చికిత్స అనుకున్నంతగా ఉపయో గపడడంలేదని తెలుస్తోంది. కానీ, మిగతా చికిత్సల్లో ఇది పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తుంది.

ఎలక్ట్రోథెరపీ చరిత్ర...

కండరాల సమస్యల నివారణకు వాడే ఎలక్ట్రోథెరప్యూటిక్‌ ట్రిగ్గరింగుకు ప్రత్యక్షంగా వి ద్యుత్తు నివ్వడంకంటే ఆల్టర్నేటింగ్‌ నాణ్యమైన పద్ధతని ఎలెక్ట్రో థెరపీని రూపొందించిన గిలా మ్‌ డుషెన్‌ ప్రకటించాడు. డైరెక్టు కరెంట్ల'‘వార్మింగ్‌ ఎఫెక్ట్‌''చర్మానికి హాని కలిగిస్తుందం టాడాయన. బిగుసుకుపో యిన కండరాలకు హెచ్చు స్థాయి వోల్టేజీలో విద్యుత్తు ఇచ్చి నందువల్ల చర్మం పై పొక్కులు ఏర్పడతాయి. ఇంకా డిసి వల్ల ప్రతి బిగుసుకుపోయిన కండ రానికి కరెంటు ఇచ్చి నిలిపేసి మళ్ళీ ప్రారం భించాలి. కండరం పరిస్థితి ఎలావున్నా ఏసీ కరెంట్‌ వల్ల కండరాలు గట్టిగా పట్టేయడానికి దారితీయవచ్చు. గాయాలు త్వరగా మాన్ప డానికి ఎలక్ట్రోథెరపీ ఉపయోగపడవచ్చని 1999లో జరిపిన మెటా-ఎనాలిసిస్‌ నిర్థారించింది.

ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ ప్రాముఖ్యం

చురుకైన ఫిజియోథెరపీ చికిత్సా విధానంలో భాగంగా విద్యుత్తును వినియోగించడమే ఎలక్ట్రోథెరపీ. రోమ్‌ కాలం నాటినుంచి ఎలక్ట్రోథెరపీ వివిధ రూపాల్లో కొనసాగుతూవస్తోంది. ఫిజియోథెరపీ వైద్యవిధానంలో ప్రతిష్టాత్మక పాత్ర పోషిస్తోంది. మర్దన, కదలికలతో కూడుకున్న వ్యాయామాలు, వేడి ఐస్‌ప్యాక్‌లను వినియోగించడం వంటి ఫిజియోథెరపీ వైద్య పద్ధతులతో పాటు ఎలక్ట్రోథెరపీ విధానాలను వినియోగిస్తారు. ఫిజియోథెరపీకి కీలకమైన అనుబంధ వైద్యంగా ఎలక్ట్రోథెరపీ వినియోగించినట్లయితే రోగికి ఫలప్రదమైన ఫలితాలు చేకూరుతాయి.

ట్రాక్యుటేనియస్‌ ఎలక్ట్రికల్‌ నెర్వ్‌ స్టిమ్యులేషన్‌ (టెన్స్‌)...

జేబులో పట్టేంత సైజులో ఉండే ఈ పరికరం రోగి సులువుగా వినియోగించవచ్చు. చర్మం ద్వారా నరాలను కండరాలను ఉత్తేజపరిచి నొప్పినుంచి ఉపశమనం పొందడానికి ఇది తోడ్పడుతుంది. మెదడులో ఉండే సహజసిద్ధమైన నొప్పినివారకాల (పెయిన్‌ రిలీవర్స్‌-ఎండోర్ఫిన్స్‌) ఉత్పత్తికి దోహదపడుతుంది. ఎక్కడ శక్తిమంతంగా పనిచేస్తాయో అక్కడ ఎలెక్ట్రోడ్స్‌ను ఉంచవచ్చు. నొప్పిగా ఉన్న ప్రాంతంలో లేక అక్కడ ఉండే నరం మీద లేక శరీరానికి వ్యతిరేక దిక్కున ఉంచవచ్చు. ఉత్తేజం సరఫరా తీవ్రతను (ఇంటెన్సిటీ) పేషంటు అవసరాన్ని బట్టి మార్చవచ్చు. తక్కువ స్థాయిలో ఇచ్చే విద్యుత్‌ ఉత్తేజం అసౌకర్యంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక ఉపశమనం ఇస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

గాల్వినిక్‌ స్టిమ్యులేషన్‌ (జిఎస్‌)...

కండరాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కండరానికి ఏసీ సరఫరా చేసినప్పుడు కండరంలో బలమలై మెలికలు పుడతాయని ఎలక్ట్రో థెరపీ విధానాన్ని కనిపెట్టిన గులావుమ్‌ డుషనే తెలుసుకున్నాడు. ఈ చికిత్స కండరాలు క్షీణించకుండా నివారిస్తుందని గాయాలు, పుండ్లు మానిన తరువాత కండరం పెరగడానికి తోడ్పడుతుందని రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కనుగొన్నారు. హైవోల్టేజి... జిఎస్‌ కండరాలు పట్టుకుపోవడాన్ని, మెత్తటికణజాలం వాపును తగ్గిస్తుంది. కనుక నొప్పి తగ్గుతుంది. ఐస్‌, వేడి, కదలికలు, బలమిచ్చే వ్యాయామాలవంటి ఇతర రూపాల్లో వున్న ఫిజియోథెరపీతో కలిపి చేసినట్లయితే వైద్యం తొలిదశలో ఇది శక్తిమంతమైందని తెలుస్తోంది.

ఇంటర్‌ఫెరెన్షియల్‌ కరెంట్‌ (ఐఎఫ్‌సి)...

ఈ విధమైన ఎలక్ట్రోథెరపీ టెన్స్‌ వంటిది. తక్కువ అసౌకర్యం కలిగిస్తూ చర్మాన్ని మరింత లోతుగా చొచ్చుకుపోతుంది. ఎండార్ఫిన్‌ ఉత్పత్తిని ఉత్తేజపరిచి నరాల ద్వారా నొప్పి సంకేతాల ప్రసారాన్ని నిలువరిస్తుంది. టెన్స్‌ వల్ల ఫలితం దక్కని తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నవారికి ఐఎఫ్‌సి తరచూ ఉపశమనం కలిగిస్తుంది.

అల్ట్రాసౌండ్‌...

ఈ విధమైన ఎలక్ట్రోథెరపీ శక్తిమంతంగా కీళ్ళనొప్పులు, కండరాల కణజాలం నొప్పుల నుంచి ఉపశమనమిస్తుంది. లోతైన వేడి మెత్తబరిచి కణజాలాన్ని విస్తరింపజేస్తుంది. ఫలితంగా కీళ్ళు పూర్తిగా బాగుపడతాయి. దిగువ వీపు నొప్పికి వెన్నెముకకు సంబంధించి అల్ట్రాసౌండ్‌ శక్తిమంతమైన చికిత్స. క్రమంగా కండరాన్ని సడలించడం, వ్యాయామానికి అనుబంధంగా దీన్ని వాడినట్లయితే ఇదెంతో బాగా పనిచేస్తుంది.

చెడు ప్రభావాలు, ముందు జాగ్రత్తలు...

చెడుప్రభావాలు అరుదే కానీ టెన్స్‌ లేక ఐఎఫ్‌సి యూనిట్స్‌ వాడిన తరువాత అప్పుడప్పుడూ తాత్కాలికంగా నొప్పి కలగవచ్చు. యూనిట్లపై వుండే అథెసివ్‌ ప్యాడ్ల వల్ల చర్మం ప్రకోపించవచ్చు. టెన్స్‌ ప్యాడ్లు కానీ ఐఎఫ్‌సి లేక జిఎస్‌ లీడులు కానీ గుండెపై లేదా పేస్‌మేకర్‌పై పెట్టకూడదు. అలా చేసినట్లయితే కార్డియాక్‌ ఎర్థిమియాకు దారితీయవచ్చు. ప్యాడ్లను గొంతుపై అమర్చినట్లయితే రక్తపోటు పడిపోతుంది. గర్భిణీ గర్భసంచీపై ఉంచినట్లయితే గర్భస్థపిండానికి హాని కలుగవచ్చు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఎలక్ట్రోథెరపీ విధానం మంచి సత్ఫలితాలను ఇస్తుంది.

ఆధారము: ఆయురారోగ్యాలు

4 నిమిషాల వ్యాయామం

రోజూ వ్యాయామం చేయాలనే అనుకుంటున్నా కానీ టైమ్ దొరకట్లేదు... అనుకునే కంప్యూటర్ ఉద్యోగులకు నాలుగు నిమిషాల్లో పూర్తిచేయగలిగే చిన్న చిన్న వ్యాయామాలు సూచిస్తున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. వీటిని మీ డెస్క్ ముందే ఆఫీసులోనే చేయవచ్చు కూడా. అలాగని ఈ వ్యాయామాలను తీసిపడేయలేం. ఆఫీసులో ఉన్నప్పుడు గంటకోసారి వీటిని చేస్తే మెడనొప్పి, నడుంనొప్పి, కండరాలు పట్టేయడం లాంటి సమస్యలకు ఇవి దివ్యౌషధాలు. అవేంటో చూద్దాం మరి.

 • రెండు చేతులను ముందుకు చాచి రెండు అరచేతులను కలిపి వుంచండి. అలా 10 నుంచి 20 సెకన్ల పాటు ఉండండి. చేతులు రెండూ స్ట్రెయిట్‌గా ఉండేలా చూడండి.
 • ఇప్పుడు లేచి నిలబడి రెండు చేతులను అదేవిధంగా పైకి తీసుకురండి. మీ తల భాగం నుంచి నిటారుగా పైకి ఎత్తి పట్టుకోండి. ఇలా 10 నుంచి 15 సెకన్ల పాటు ఉండండి.
 • ఇప్పుడు రెండు చేతులను మడిచి అంటే ఒకదాని అరచేతిని మరోదాని మోచేతిపై ఉంచండి. అలా పైకే ఉంచండి. ఇప్పుడు మెడ, భుజం భాగాలను కుడివైపు కొద్దిగా వంచి, 8 నుంచి 10 సెకన్ల పాటు ఉండండి. తిరిగి ఎడమవైపు కూడా ఇలాగే చేయండి.
 • చేతులు కిందకి దించేసి భుజాలను పైకీ, కిందకీ ఎగరేయండి. ఇలా 3 నుంచి 5 సెకన్లు చేయండి. * కిందికి ఉన్న చేతులను వెనకాల ఒకదాన్ని ఒకటి పట్టుకోండి. మెడ, భుజాలను కుడి వైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి వంచి, ఒక్కోవైపు 10 నుంచి 12 సెకన్లు కేటాయించండి.
 • దండం పెడుతున్నట్టుగా రెండు అరచేతులను కలిపి ఉంచండి. ఇలా 10 సెకన్లు ఉన్న తరువాత పైకి కలిపివున్న అరచేతులను కిందివైపు దించండి. ఇలా మరో 10 సెకన్లు ఉండండి.
 • కుర్చీలో కూర్చుని ఒక చేయి నడుము మీదుగా కిందకి వేలాడదీసి, మరో చేతిని పైకి నిలబెట్టి పట్టుకోండి. రెండు చేతులనూ ఇలా చేయండి. ప్రతిసారీ 8 నుంచి 10 సెకన్ల పాటు ఉండండి.
 • కూర్చునే ఉండి నడుం భాగాన్ని మాత్రం పైకి లేపి, తలను ఎత్తి ఉంచండి. దీనికి 10 నుంచి 15 సెకన్లు కేటాయించండి.

శీతాకాలంలోనే కాదు.... ఏ కాలమైనా కోమలమే..

శీతాకాలంలోనే కాదు సంవత్సరం అంతా పాదాలను అందంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించాల్సిందే. మన శరీరంతో పాటు చర్మాన్ని చలికాలంలో చిట్లకుండా చూసుకోవాలంటే కొన్ని రకాలైన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా చేతులు, పాదాల విషయంలో మరీ జాగ్రత్త వహించాలి.పాదాలు, చేతి వేళ్ళ సంరక్షణకోసం మెనిక్యూర్‌, పెడిక్యూర్‌లను ఆశ్రయించడం మనకు తెలిసిందే. దీనికోసం మహిళలు ఎక్కువగా బ్యూటీపార్లర్‌లను ఆశ్రయిస్తుంటారు. దానికోసం ఎంతో ఖర్చుచేస్తారు. అయితే, ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల పాదాలు, చేతులను అందంగా మలచుకోవచ్చు.

పాదాలు సంరక్షణకు:

దుమ్ము, ధూళివల్ల పాదాలు మురికిగా కనుపిస్తాయి. వాటిని శుభ్రం చేసుకోవడానకి గోరువెచ్చని నీటిని ఒక బేసిన్‌లో తీసుకొని, ఎప్సాన్‌ ఉప్పు, బాడీ వాష్‌కు సంబంధించిన సోప్‌ క్రీమ్‌ను మిశ్రమంగా కలుపుకొని అందులో పాదాలను పదినిమిషాలసేపు ఉంచాలి.ఫ్యూమిస్‌ స్టోన్‌ తీసుకొని చర్మాన్ని బాగా రుద్దాలి.ఆరేంజ్‌ స్టిక్‌ను తీసుకొని కాలి గోళ్ళ మధ్య ఉన్న మట్టిని తొలగించాలి. అంతేకాకుండా గోళ్ళను కూడా పాలిష్‌ చేసుకోవాలి. సుతిమెత్తని పాదాలు ఎల్లప్పుడూ అందంగా కనపడాలంటే... నెలకొకసారైనా ఇలాంటి టిప్స్‌ని ఇంట్లో ఉండే చేసుకోవాలి. అప్పుడు ఖర్చు తగ్గడంతో పాటు అందమైన పాదాలు మీ సొంతమవుతాయి.

చేతుల సంరక్షణకు:

మన శరీరంలో ఎక్కువగా పనిచేసేవి చేతులే... అందుకోసం చేతుల విషయంలో... మరీ ముఖ్యంగా గోళ్ళ విషయంలో శ్రద్ధ వహించకపోతే... అంద వికారంగా తయరవుతాయి.పెడిక్యూర్‌లాగానే...మేనిక్యూర్‌ను కూడా ఇంట్లో కొన్ని సింపుల్‌ చిట్కాలు పాటించి అందంగా మలచుకోవచ్చు.గోరువెచ్చని నీటిని తీసుకొని దానిలో చేతులను ఉంచి, ఆరెంజ్‌ వుడ్‌ స్టిక్‌తో గోళ్ళను శుభ్రపరుచుకోవాలి. కాళ్ళ కన్నా చేతులపై మనం ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఫ్యూమస్‌ స్టోన్‌పై చేతులను ఉంచి బాగా రుద్దా లి. అంతేకాకుండా ఎవరికి ఇష్టమైన సోప్‌ క్రీమ్‌ను వాడుకొని మరింతగా రుద్దుకోవడం ద్వారా చేతులను మరింత అందంగా మలచుకోవచ్చు.

కాలంతో పనిలేదు...

పాదాలను ఎండాకాలంలోనే సంరక్షించుకోవాలనే రూలేంలేదు. అన్ని కాలాల్లోనూ శ్రద్ధతీసుకున్నప్పుడే అవి అందంగా తయారవుతాయి. అందుకోసం ఇంట్లోనే తయారుచేసుకునే పదార్ధాలతోపాటు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి ఒక అరగంట సమయం మీ పాదాలకోసం కేటాయిసే ్తచాలు అందమైనా పాదాలు మీసొంతం.

స్మూత్‌గా తయారవుతుంది...

ఒక ప్లాస్టిక్‌ బౌల్‌లో గోరువెచ్చని నీటిలో సాఫ్ట్‌నెస్‌ కోసం కొన్ని చుక్కల'చామోమైల్‌'ఆయిల్‌ వేయాలి.తరువాత పాదాలను అందులో పదినిమిషాల పాటు అందులో ఉంచాలి. తరువాత తీసి టవల్‌తో తుడిచేస్తేచాలు మీ పాదాలు ఎంతో నునుపుగా తయా రవుతాయి.ప్యూమిస్‌ స్టోన్‌ను నీటిలో ఒక నిమిషం పాటు ఉంచి ఆ రాయి తో పాదాల చర్మాన్ని సున్నితంగా రు ద్దాలి. అప్పుడు చర్మంపై ఉండే మృత కణాలు పోయి సాఫ్ట్‌ అండ్‌ స్మూత్‌ గా తయారవుతాయి. మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌గానీ, ఆయిల్‌తో గానీ మీ పాదా లకు మర్దనా చేసుకుంటే మీ పాదాల కు విశ్రాంతి కలుగుతుంది. అంతేకా కుండా తిరిగి ఉత్తేజంగా తయార వుతుంది.

అపుడే అందం వస్తుంది...

మీరు కాలిగోళ్లకు పాలిష్‌ వేయాలను కున్నప్పుడు ముందుగా గోరును శుభ్రపరుచుకోవాలి. ఇందుకోసం నెయిల్‌పాలిష్‌ రియూవర్‌ను ఉప యోగించవచ్చు. రిమూవర్‌ను ఉప యోగించిన తరువాత టవల్‌తో పూర్తిగా శుభ్రపరిచిన తరువాతే పాలి ష్‌ వేసుకోవాలి. అప్పుడే అందం వస్తుంది. పాలిష్‌ను ఎట్టి పరిస్థితు ల్లోనూ చర్మానికి తాకకుండా చూసు కోవాలి.

యునానితో... అన్ని వ్యాధులు నయం

యునాని అనేది ఒక దేశం పేరు. ప్రస్తుతం ఆ దేశాన్ని గ్రీకుగా పిలుస్తు న్నారు. చాలా సంవత్సరాల క్రితం మనిషికి సంబంధించిన వైద్యం, విద్య ఇలా ప్రతి ఒక్కటి గ్రీకు నుంచే మొదలయ్యాయి. వైద్యానికి తండ్రిగా పిలవబడే హెప్సోక్రేట్‌ (బొక్రాత్‌) చాలా రకాల రోగాల గురించి కనుక్కొన్నారు. అవి క్లినికల్‌ పిక్చర్స్‌, సిమ్‌టమ్స్‌,వీటికి సంబంధించిన సైంటిఫిక్‌ యునాని వైద్యం. ఈ ఆధునిక కాలంలో వైద్య రంగంలో అన్ని రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆధునిక వైద్యంలో 50 శాతం రోగాలకు పూర్తిగా వైద్యం లేదు.

మనం జీవితాంతం ఆ మందులు వాడినా వ్యాధులు తగ్గకుండా కొంతకాలానికి ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ మందులని మనం వాడకుండా ఉండలేకపోతున్నాము. దీనికి కారణం ఈ కాలపు బిజీ జీవితాలలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం, ఇంకా మనకు ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి శ్రేష్ఠమో తెలీదు. ఒకవేళ తెలిసినా ఇప్పుడు వస్తున్న ఆహార పదార్థాలు మనకు రసాయనాలు కలపి రావటం వల్ల మనకు చాలా విటమిన్ల లోపాలు కలుగుతున్నాయి.

ప్రత్యేక వన మూలికలతో వైద్యం...

కొన్ని రోగాలకు ఇంగ్లీష్‌ వైద్యంలో పూర్తిగా వైద్యం లేదు. కానీ అన్ని రకాల వ్యాధులకు యునాని మందులు ఉన్నాయి. ఈ మందులతో ఏ సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవు.

యునాని వైద్యంతో ఈ క్రింది వ్యాధులను నయం చేయవచ్చు.

 • రకరకాల గుండె జబ్బులు.
 • రక్తంలో క్రొవ్వు పదార్థాలు పెరగటం.
 • అన్ని రకాల పక్షవాతములు.
 • దమ్ము రోగం(ఎలర్జీ).
 • డయాబెటిస్‌.
 • 12 రకాల కీళ్ల వ్యాధులు.
 • క్యాల్షియం తగ్గడం వల్ల ఎముకలు బలహీ నపడటం.
 • లైంగిక వ్యాధులు.
 • పిల్లలు పుట్టకపోవడం.
 • హెచ్‌ఐవి.
 • సౌందర్యం కొరకు- కలర్‌ ఫెయిర్‌నెస్‌, బ్యూటీ కేర్‌.
 • చర్మానికి సంబంధించిన వ్యాధులు: మొటిమలు రావటం, స్కిన్‌ఎలర్జీ, జటు ్టరాల టం, చుండ్రు, చర్మ వ్యాధులు.
 • మూత్ర పిండాల లో రాళ్లకు ఆపరేషన్‌ లేకుండా వైద్యం.
 • కాలేయానికి సంబంధించిన వ్యాధు లుః హెపటైటిస్‌, పచ్చ కామర్లు, హై బ్లడ్‌ ప్రెషర్‌.
 • అర్షమొలలు.

- డాక్టర్‌ ఎ.యం.ఖాన్‌
బి.యం.యం.ఎస్‌, ఎం.డి(ఉస్మానియా)
ఫోన్‌నెం: 9849077149, 9391015878

ఆస్తమా - ఉబ్బసం ప్రమాదం కాదు

ఆస్తమా వ్యాధి శ్వాసకోశ వ్యాధుల్లో ఒక ముఖ్యమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు.వివిధ దేశాల్లో ఈ వ్యాధికి గురవుతున్నవారికి సంఖ్య 5 శాతం నుండి 10శాతం వరకు ఉంటుంది. చెస్ట్‌ క్లినిక్‌లలో ఈ వ్యాధితో వచ్చే వారి సంఖ్య కనీసం 50 వరకు ఉంటుంది. భారతదేశంలో ఆస్తమా వ్యాధితో బాధపడేవారి సంఖ్యను గురించి కొన్ని అధ్యయనాలు జరిగారుు. ఈ అధ్యయనాలల్లో 3 నుంచి 4 శాతం జనాభాలో ఆస్తమా ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ప్రస్తుతం మన జనాభాలో 3 నుంచి 4 కోట్ల ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఉన్నారని అర్థం.

పెరుగుతున్న పారిశ్రామీకరణ, ఆహారపుటలవాట్లు, వాయుకాలుష్యం వల్ల ఆస్తమాతో బాధపడేవారి సంఖ్య మున్ముందు 10 కోట్లకు చేరవచ్చని అంచనా. కొన్ని అధ్యయనాల్లో ఎవరు ఆస్తమా వ్యాధితో బాధపడే అవకాశాలు ఉన్నాయో పరిశీలించడం జరిగింది. వీటి ప్రకారం పట్టణప్రాంత వాసులకు, మహిళలకు, పెద్ద వయస్సు వారికి ఎలర్జీ లక్షణం ఉన్నవారికి, ధుమపానం చేసేవారికి, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి, వంశలో ఆస్తమా ఉన్నవారికి ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది.

దీర్ఘకాలంగా ఇబ్బందులకు గురిచేసే ఈ వ్యాధిని అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్సతతో అదుపులో పెట్టుకొని వీలైనంతా సాధారణ జీవనాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి గురించిన, నూతన చికిత్సా పద్ధతులగురించి అవగాహన మనకు ఎంతైనా అవసరం. గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆన్‌ ఆస్త మా సంస్థ ప్రతి ఏటా మే నెల మొదటి మంగళవారాన్ని ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా జరుపుతుంది. ఆస్తమా గురించిన పూర్తి సమాచారాన్ని సైతం అందరికి అందుబాటులో ఉంచుతుంది.'ఆస్తమా'జబ్బు అనగానే చాలా మంది దిగులు పడిపోతారు.

జీవితాంతం ఈ జబ్బుతో బాధపడుతూ ఉండాలి. ప్రాణం ఏ క్షణాన్న పోతుందో ఏమో అన్నంత ఆందోళన వీరికి ఉంటుంది. ఈ జబ్బుతో జీవించడం చాలా కష్టం అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఈ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచడమే కాకుండా వ్యాధి రాకుండా నివారించేందుకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. గత30 సంవత్సరాలుగా ఈ వ్యాధిని గురించి సరియైన అవగాహన ఉండడమే దీనికి కారణం.అతి తక్కువ మందును నేరుగా శ్వాసనాళాలలోకి పంపించే నూతన పద్ధతుల ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది.

ఆస్తమా ఎందుకు వస్తుంది?

ఆస్తమా వ్యాధి ఎలర్జీకి సంబంధించినది. ఇలాంటి వారిలో వ్యాధి నిరోధక శక్తిని కలిగించే......యాంటిబాడీ ఎక్కువగా ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా సంక్రమించవచ్చు. దీనినే ఎటోపి అంటారు. అయితే ఎటోపి లక్షణం ఉండే అందరిలో ఎలర్జీకానీ, ఆస్తమా కానీ రావాలని లేదు. అలాగే ఎటోపి లక్షణం లేని కొంతమందిలో కూడా ఈ జబ్బు రావచ్చు. శరీరానికి సరిపడని యాంటిజెన్‌లు శరీరంలోకి ప్రవేశించినపుడు ఈ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండే యాంటిబాడి వెలువడి శరీరాన్ని రక్షించే యత్నం చేస్తాయి.

ఈప్రక్రియలో కణాలనుండి ఉత్పత్తి అయ్యే వివిధ రసాయనాల వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం జమ అవటం, తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీని వల్ల దగ్గు, ఆయాసం, పిల్లికూత, ఛాతీపట్టేసినట్టు ఉండటం జరుగుతుంది. ఈ లక్షణాలతో పాటు కొంత మందిలో తరచుగా తుమ్ములు, ముక్కు దిబ్బడేయడం, నీరు కారటం, కంట్లో దురద, చర్మంపై దద్దుర్లు ఎలర్జిక్‌ డెర్మటైటిస్‌, ఎక్జి మా, లాంటి చర్మవ్యాధులు వస్తాయి. అయితే ఎలర్జీ వల్ల వచ్చే ఈ వ్యాధులన్నీ ఒకరిలోనే కనిపించవచ్చు. లేదా ఒకటి, రెండు లక్షణాలు మాత్రమే ఉండవచ్చు.

ఆస్తమా వేటి వలన వస్తుంది?

సాధారణంగా దుమ్ము, ధూళి, డస్ట్‌మైట్‌, పుప్పొడి, పొగ, చలిగాలి, వైరస్‌, వ్యాయామం, ఉద్వేగం మొదలైనటువంటి వాటి వలన ఆస్తమా వస్తుం ది. శ్వాస నాళాల్లోకి నేరుగా వెళ్ళే ఏరో ఎలర్జెన్స్‌ ఆస్తమా వ్యా ధిని కలిగించడంలో ప్రధాన పాత్ర కలిగి ఉండడం గమనించదగ్గ విషయం. ఆహారం వల్ల ఆస్తమా రావడం బహుకొద్దిమందిలోనే జరుగుతుంది.చాలా మందిలో ఆస్తమా జలుబుతో మొదలయ్యి తరువాత గొంతునొప్పి, గొంతులో నసగా ఉండడం, స్వరం మారడం జరుగుతుంది. దాని తరువాత దగ్గు, ఆయాసం, పిల్లి కూతగా మారుతుంది.

వీరిలో సాధారణం్ఠగా యాంటీబయాటిక్స్‌ గాని, యాంటి హిస్టమిన్స్‌ కాని పని చేయవు. చలిగాలి పీల్చినప్పుడు గాని, పొగ, గాఢమైన వాసనవల్ల కాని వీరిలో దగ్గు ఎక్కువ అవుతుంది. రాత్రిళ్ళు దగ్గు ఆయాసం ఎక్కువగా ఉండటం మూలాన వీరికి సరిగా నిద్ర పట్టదు. శ్వాస సరిగా అందక గాలికోసం నిద్ర నుండి లేచి కూర్చోవటం, ఫాన్‌ ఎక్కువగా వేసుకోవటం, కిటికీ దగ్గర కూర్చోవడం చేస్తుంటారు.కొంతమందిలో నిద్రకు వెళ్ళే ముందు ఈ లక్షణాలన్నీ లేకున్నా ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య దగ్గు, ఆయాసం ఎక్కువై నిద్ర నుండి లేవాల్సి వస్తుంది. 24 గంటల్లో ఉదయం 3 నుండి 6 గంటల వరకు చలి అధికంగా ఉండడమే దీనికి కారణం. ఇలా రాత్రి ళ్ళు మాత్రమే ఆస్తమా ఉంటే దాన్ని నాక్టర్నల్‌ ఆస్తమా అంటారు.

వ్యాయామం చేస్తున్నపుడు లేదా ఆటలు ఆడుతున్నప్పుడు మాత్రమే కొంతమందిలో ఆస్తమా వస్తుంది.దీనిని ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూస్డ్‌ ఆస్తమా అంటారు. మరికొద్ది మందిలో దగ్గు తప్పించి ఇక ఏ ఇతర లక్షణాలు కనిపించవు.పల్మొనరీ ఫంక్షన్‌ టెస్ట్‌ (పి.యఫ్‌.టి.) వల్లనే వీరిలో ఆస్తమా వ్యాధిని నిర్ధారించవచ్చు.వీరికి కాఫ్‌ వేరియంట్‌ ఆస్తమా ఉన్నట్లుగా భావించాలి.అసిడిటీ, గ్యాస్‌ ప్రాబ్లమ్‌ ఉన్నవారిలో కూడా ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో మామూలు కంటే ఎక్కువ యాసిడ్‌ కడుపు నుండి గొంతులోకి వచ్చి శ్వాసనాళాల్లోకి ప్రవేశించటం మూలాన ఉబ్బసం వస్తుంది. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి లేదా మానసిక ఆందోళన, ఒత్తిడిలాంటి మానసిక సమస్యలు ఉన్నవారికి కూడా ఆస్తమా వస్తుంది. ఇలాంటి వారికి కేవలం ఆస్తమా మందులు సరిపోవు. ఆస్తమా మందులతో పాటు సైకియాట్రి జబ్బులకు ఇచ్చే మందులు వాడితేనే వీరికి ఉపశమనం కలుగుతుంది.

ఆస్తమా- చిన్నపిల్లలు

పుట్టిన వయస్సు నుండి ఏ వయస్సు వారికైనా ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసి ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి పిల్లల్లో తరచు జలుబు, దగ్గు, ఆయాసం వస్తుంటాయి. తోటి పిల్లల వలె పరుగెత్తలేకపోవటం లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు కాని ఆడుతున్నప్పుడు కానీ ఆయాసం వస్తుంటుంది. ఇలా తరచుగా తమ పిల్లలకు దగ్గు, ఆయాసం వస్తున్నప్పుడు వీరిలో టిబి వ్యాధి సోకిందేమోనన్న ఆనుమానం కూడా రాకమానదు. కాకపోతే టిబి వ్యాధి ఉన్నవారిలో దగ్గుతో పాటు జ్వరం రావటం, ఆకలి మందగించడం, సన్నబడటం, నీరసం, ఆటల్లో ఆసక్తి కనపరచకపోవటం కూడా ఉంటుంది.

ఇవే కాక ఎక్స్‌రేలో ప్రైమరీ కాంప్లెక్స్‌ అంటే లింఫ్‌ గ్రంథులు, న్యుమోనియా కనపడతాయి. ఆస్తమా ఉన్నవారిలో సా ధారణంగా ఎక్స్‌రే నార్మల్‌గా ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లల్లో పాసి వ్‌ స్మొకింగ్‌ మూలాన కూడా ఆస్తమా తరచు వస్తూ ఉంటుంది. ఇంట్లోనే పొగతాగే వారి వల్ల చిన్నపిల్లలు ఇలాంటి వ్యాధులకు గురవుతారు. కొద్దిమంది తల్లిదండ్రులు తమకున్న ఆస్తమా తమ పిల్లలకు కూడా వస్తుందేమోనని ఆందోళన పడుతుంటారు. అయితే ఆస్తమా ఖచ్చితంగా పిల్లలకు వస్తుందని చెప్పలేం. వీరికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎన్ని ఉన్నాయో, రాకపోయే అవకాశాలు కూడా అన్నే ఉన్నాయి. కాబట్టి ఈ విషయం గు రించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నూటికి 90మంది పిల్లల్లో ఈ వ్యాధి 10 నుండి 12 సంవత్సరాలు వచ్చేసరికి దానంతట అదే తగ్గిపోతుంది. వ్యాధి పూర్తిగా తగ్గిపోయే వరకు మాత్రమే దానిని మందుతో అదుపులో ఉంచుకోవాలి.

ఆస్తమా- ఆహారం...

ఉబ్బస వ్యాధి ఉన్నవారు పాటించే ఆహార నియమాలు మరే ఇతర వ్యాధులున్న వారు కూడా పాటించకపోవచ్చు. దీనికి మనందరిలో ఉండే అపోహలే కారణం. ఆహారమే ప్రధానంగా ఉబ్బసం కలిగించడం చాలా అరుదు. 5 శాతం కంటే తక్కువమందిలో ఇది చూస్తాం.కొన్ని రకాల సిట్రస్‌ జాతికి చెందిన బత్తాయి, నిమ్మ వంటి పండ్లు, చేప లు, గుడ్డు తెల్లసొన, పాలు, చాక్లెట్లు, వేరుశనగలు కొందరికి పడవు. అ యితేచాలా మంది చాలా రకాల ఆహార పదార్ధాలను పథ్యం పాటిస్తా రు. ముఖ్యంగా తీపి, నూనె, పండ్లు, పులుపు, పెరుగు, టమాట తగ్గించట మో, మానేయడమో చేస్తుంటారు. అయితే వీరు ఇలా మానేసిన ఆహార పదార్ధాల వల్ల ఆస్తమా వస్తుందో లేదో అని పరీక్షించుకోవటం అవసరం.

పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి పదార్ధాలు తీసుకొని ఆస్తమా లక్షణాలు వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఒకటికి రెండుసార్లు అలాగ చూసుకొని వ్యాధి లక్షణాలు వస్తున్నాయి అనిపించినప్పుడు ఆ ఆహార పదార్ధాలు మానేస్తే మంచిది. సాధ్యమైనంత వరకు భయపడి ఆహార నియమాలు పాటించడం తగ్గించుకోవాలి. ముఖ్యంగా అన్ని రకాల పోష క పదార్ధాలు అవసరమయ్యే చిన్నపిల్లల్లో ఖచ్చితంగా రుజువయితే తప్పించి ఆయా ఆహార పదార్ధాలు మానేయాల్సిన అవసరం లేదు.

ఆస్తమా- చికిత్స...

గత ముపె్పై సంవత్సరాల్లో ఆస్తమాకి కొత్త కొత్త మందులు కనిపెట్టడమే కాకుండా, వీటిని శరీరంలోకి, నేరుగా శ్వాస నాళాల్లోకి పంపించటం ఉబ్బస వ్యాధి చికిత్సలో జరిగిన పరిణామాల్లో చెప్పుకోతగ్గవి. ఇలాంటి మందులను ఎయిరోసాల్స్‌ అంటారు. వీటి ద్వారా తక్కువ మందును వాడటమే కాకుండా వ్యాధి లక్షణాల నుండి త్వరితంగా ఉపశమనం కలిగేట్లు చేయవచ్చు. ఈ ఎయిరోసాల్స్‌లో వాడే మందు మోతాదు చాలా తక్కువ కాబట్టి మందుల వల్ల వచ్చే దుష్ర్పభావాలు కూడా అరుదు.ఈ మందులు రెండు రకాలు. ఇవి వ్యాధిని నివారించే మందులు- ప్రివెంటర్స్‌, ఉపశమనం ఇచ్చే మందులు - రిలీవర్స్‌.
బెక్లమెథసోన్‌, బ్యుడెసోనైడ్‌, ఫ్లుటికసోన్‌, సైక్లో సెనైడ్‌, మొమెటజోన్‌ మొదటి రకానికి చెందినవి.సాల్బ్యుటమాల్‌, టెర్బ్యుటలిన్‌, సాల్మెటరాల్‌, ఫార్మెటరాల్‌ రెండవ రకానికి చెందినవి. వ్యాధి లక్షణాలు కొద్దిగా ఉన్నప్పుడు ఉపశమనమిచ్చే మందులు ఎక్కువగా ఉన్నప్పుడు వీటితో పాటు నివారించే మందులను కొన్ని వారాలు వరుసగా వాడాలి. రుతువులలో మార్పు ఉబ్బస వ్యాధికి కారణం అవుతుంది.దీన్ని సీజనల్‌ ఆస్తమా అంటారు. ఆ రుతువు మొదలవటానికన్నా ఒకటి, రెండు వారాలు ముందే ఇవి మొదలుపెట్టి కొన్ని వారాలు క్రమంగా వాడాలి.

వ్యాధి అదుపులోకి వచ్చిన తరువాత మందు పరిమాణము కొద్ది కొద్దిగా తగ్గిస్తూ అతి తక్కువ డోస్‌తో వ్యాధి అదుపులో ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్కోసారి వ్యాధి తీవ్రరూపం దాల్చినవారికి నెబ్యులైజర్‌ ద్వారా ఈ మందులను ఇవ్వవచ్చు. వీటితో తగ్గకపోతే అమెనోఫిల్లిన్‌, డాక్సోపైలిన్‌, డెరిఫిలిన్‌, టెర్బ్యుటలిన్‌, స్టెరాయిడ్స్‌ ఇంజక్షన్‌ రూపంలో వైద్యులు ఇస్తుంటారు. అయితే వీరి శరీరంలో ఉండే ప్రాణవాయువు తగ్గకుండా ఆక్సిజన్‌ కూడా ఇవ్వాలి. నోటి మాత్రలు, ఇంజక్షన్ల కంటే కూడా వ్యాధిని ఇన్‌హేలర్స్‌ వల్ల కంట్రోల్‌ చేసుకుంటే మంచిది. చిన్న పిల్లల్లో కూడా మందులు వాడవచ్చు. ఇన్‌హేలర్స్‌ను సరిగా వాడగలిగిన వారికి డ్రై పౌడర్‌ ఇన్‌హేలర్స్‌ లేదా మీటర్డ్‌ డోస్‌ ఇన్‌హేలర్స్‌ ను స్పేసర్‌ ద్వారా ఇవ్వవచ్చు.అత్యవసర పరిస్థితుల్లో ఈ మందులేవీ పని చేయనప్పుడు ఔషధాలు, మెగ్నీషియం సల్ఫేట్‌, అడినలిన్‌, హీలియాక్స్‌ వంటివి వాడవచ్చు.

మర్దన చికిత్స (మసాజ్‌ధెరపీ)

నొప్పి, అసౌకర్యం, పట్టుకుపోవడం వంటి బాధలను నివారించడం కోసం మెత్తటి కణజాలాన్ని మర్దన చేయడంతో కూడుకున్నదే మసాజ్‌ థెరపీ లేక మర్దన చికిత్స. ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఒత్తిడిని తగ్గించడానికి ఈ చికిత్స ఎంతోదోహదపడుతుంది. ఈ చికిత్సా విధానాన్ని'అమెరికన్‌ మసాజ్‌ థెరపీ అసోసియేషన్‌'... చేతులతో మెత్తటి కణజాలాన్ని మర్దన చేసే ప్రక్రియగా అభివర్ణించింది. ఈ వృత్తిలో ప్రాక్టీషనర్‌ శారీరకమైన, మెళకువలను, సంబంధిత వైద్య విధానాలను ఉపయోగించి ఆరోగ్యాన్ని చేకూ ర్చే ప్రక్రియగా కూడా మర్దన చికిత్సను నిర్వ చించారు. శరీరం మీద థెరపిస్టు చేతులు కదిలిస్లూ వివిధ శరీరపరమైన ప్రభావాలను కలిగించడం మర్దనలో వున్నాయి. కండరాలను, లిగమెంట్లను, టెండన్లను, ఫేషియాను వివిధ కదలికలు భౌతికంగా సాగదీయ గలవు.

కణజాలంలో రక్తప్రసారం మెరుగవుతుంది. కండారాల నొప్పులు తగ్గి నాడీమం డల వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. నిద్రను ప్రసాదిస్తుంది. చికిత్సాపరమైన మర్దన రక్తప్ర సారం, కండరాలు, ఎముకులు, నాడీమండ ల వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. గాయాల నుంచి, జబ్బునుంచి దేహం కోలు కునే క్రమాన్ని వేగవంతం చేస్తుంది. వివిధ రకాల స్ట్రోకులు, తైలాలపై మసాజ్‌ థెరపీ ఆధారపడివుంది. ఇవి ఒత్తిడి పేరుకుపోయిన భాగాలపై పనిచేసి మనసుకు శరీరానికి విశ్రాంతిని ప్రసాదిస్తాయి. వెన్ను మర్దన, మెడ భుజాల మర్దన, ఛాతీ మర్దన, పొట్ట మర్దన, ముఖం, తల మర్దన, చేతుల మర్దన, కాళ్లు, పాదాల మర్దన పిల్లలకు... పసికందులకు మర్దన గర్భిణీల మర్దన... ఇలా మసాజ్‌ థెరపీలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా థెరపిస్టులకు తెలిసిన 200 పైగా మెళకువలను ఉపయో గించి మర్దన చేయవచ్చు. ఇక్కడ మనం కొన్ని రకాల మర్ధనల గురించి తెలుసుకుందాం...

 • క్రీడల మసాజ్‌
 • స్వీడిష్‌ మసాజ్‌
 • థాయ్‌ మసాజ్‌
 • ఇన్ఫెంట్‌ మసాజ్‌
 • రిలాక్సేషన్‌ మసాజ్‌
 • జీరో బ్యాలెన్సింగ్‌

ఇవే కాకుండా... ఆక్యుప్రెషెర్‌, షియాటుస, లోమి లోమి, జిన్‌ షిన్‌ జిట్సు, అమ్మ థెరపీ, చినే ట్సాంగ్‌ వగైరా ప్రాచ్య పద్ధతులు మసాజ్‌లో చికిత్సా విధానాలుగా ఉన్నాయి. అనేక అనుబంధ థెరపీల్లో అనేక మర్దన మెళకువలు కూడా చేర్చారు. అరోమా థెరెపీ, రెఫ్లెక్సాలజీ, రికీ, హెల్లెవర్క్‌, ఆస్టియోపతీ వీటిలో ముఖ్యమైనవి.

మర్దన చికిత్స వల్ల ఎన్నో లాభాలు...

వీటిలో ప్రతి మర్దన చికిత్సకు ఎన్నెన్నో లాభాలున్నాయి. చెప్పాలంటే... సమగ్ర ఆరోగ్యం ఫలితం... మర్దన చికిత్స. ఇది బాడీవర్క్‌ రక్త ప్రసారాన్ని పెంచుతాయి. కను క దేహం అధికంగా ప్రాణవాయువును, పోష కాలను కణాల్లోకి, ప్రధానాంగాల్లోకి పంప్‌ చేస్తుంది. థెరపిస్టు చేసే మాసాజ్‌ వల్ల లింఫ్‌ వ్యవస్థకు ఉత్తేజం లభిస్తుంది. శరీరం సహజ సిద్ధమైన రక్షణ వ్యవస్థ. బలోపేతమై మన ఆరోగ్యంపై దాడిచేసే టాక్సి ఇన్వేడర్సును సమర్థంగా ఎదుర్కోగలుగుతాం. ఉదాహర ణకు, రొమ్ము క్యాన్సర్‌ రోగులకు చేసే మసాజ్‌ వల్ల కాన్సర్‌ను నిరోధించే కణాలు పెరుగుతాయి.

శరీరంలోని సహజసిద్ధమైన నొప్పి నివారణ పదార్థం ఎండోర్ఫిన్స్‌ను విడుదల చేయడానికి దోహదపడుతుంది. ఉదాహరణ కు మసాజ్‌ టెక్నిక్‌ అయిన ఆక్యుపంక్చర్‌ థెరపీ నొప్పి తగ్గించే ఎండోర్ఫిన్స్‌ ఉత్పత్తి చేసేట్టు శరీరాన్ని ఉత్తేజపరచగలదు. ఆక్యు పంక్చర్‌ చికిత్స నొప్పితగ్గంచే ఓపియడ్స్‌ అనే పదార్థాలను కూడా విడుదల చేస్తుందని అధ్య యనాలు వెల్లడిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధు లు, గాయాలు, ఆపరేషన్‌ నుంచి కోలుకో వడం, నొప్పి తగ్గించడం వంటి చికిత్సలో ఆక్యుపంక్చర్‌ను చేర్చినట్లు తెలుస్తోంది. మైగ్రే యిన్‌ తలనొప్పిని తగ్గించి మందులు అంతగా అవసరం లేకుండా సహాయపడు తుంది.

తల్లులు కాబోయేవారికి నొప్పులు తగ్గిస్తుంది. మందుల అవసరాన్ని తగ్గిస్తుంది. డిప్రెషన్‌, ఆందోళనను ఆసుపత్రిలో ఉండవలసిన కాలా న్ని తగ్గిస్తుంది. బిగుసుకుపోయిన ఉద్రిక్త కండరాలకు విశ్రాంతినిస్తుంది. దిగువ వీపు నొప్పి, మెడ నొప్పిని చికిత్సగా మసాజ్‌ థెర పిస్టు తరచూ మసాజ్‌ చేస్తాడు. మొత్తం మాన సిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కో ర్టిసాల్‌ వంటి స్ట్రెస్‌ హార్మోన్ల స్థాయి తగ్గించి శరీరం ఒత్తిడిని ఎదురుకోవ డానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌, టెండి నైటిస్‌ వంటి వాపు పరిస్థిలకు చికిత్సగా కూ డా మర్దన చికిత్సను ఉపయోగించవచ్చు. కండరాల ఉద్రిక్తత, బిగుసుకు పోవడానికి వైద్యంగా తోడ్పడుతుంది.

దెబ్బతిన్న కండరా లకు బెణుకుపట్టిన లిగమెంట్సు సత్వరం మా నడానికి తోడ్పడుతుంది. కండరాలు బిగుసు కుపోవడాన్ని తగ్గిస్తుంది. కీళ్ళకు వెసులుబాటు ను, కదలికలను ప్రసాదిస్తుంది. క్రీడల్లో సామ ర్థ్యాన్ని పెంచుతుంది, క్రీడల్లో, పనిలో అయ్యే గాయాలను మాన్పుతుంది. రక్తపోటు (బిపి) తగ్గిస్తుంది. ఉద్రిక్తతకు సంబంధించిన తల నొప్పులనుంచి, కంటి అలసట నుంచి ఉపశ మనం కలిగిస్తుంది. భంగిమల్ని మెరుగుపరు స్తుంది. శరీరం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.కండరాలు- ఎముకల వ్యాధులను నయం చేస్తుంది. ఆపరేషన్‌, గాయాలయిన తర్వాత కోలుకోవడానికి తోడ్పడుతుంది.

మర్దన చికిత్స వల్ల ఒనగూరే భావోద్రేకపరమైన లాభాలు...
 • మానసిక అప్రమత్తతలో విశ్రాంతిని పెంపొందిస్తుంది.
 • ప్రశాంతంగా ఆలోచించే సామర్థ్యాన్ని సృజనాత్మక శక్తిని పెంచుతుంది.
 • సంరక్షణ అవసరాలను తీరుస్తుంది.
 • ఆరోగ్యంగా ఉన్నామన్న అనుభూతిని పెంపొందిస్తుంది.
 • ఆందోళన స్థాయిని తగ్గిస్తుంది.
 • శరీరం గురించి అవగాహన పెంపొందిస్తుంది.
 • మనసు-శరీరాల మధ్య లింకు గురించి అవగాహన పెంపొందిస్తుంది.

మర్దన తైలం... చరిత్రలో మర్దన తైలం మర్దన చికిత్సలో అంతర్భాగంగా ఉంటూవచ్చింది. తైలం పూసి నొప్పి తగ్గించడానికి రుద్దడం గురించి ప్లాటో, సోక్రటీస్‌ ఆనాడే తమ రచనల్లో పేర్కొన్నారు. ్రపూ 1000 నాడే మర్దన చేయడానికి తైల పదార్థం గురించి హోమర్‌ రాశాడు. మర్దన చేయించుకునే వారి చర్మంపై సున్ని తంగా నాజూకుగా జారడానికి మర్దనలో తైలం వాడుతారు. వివిధ రకాలుగా ఉపయో గపడే ఎన్నో తరహాల తైలాలు ఈనాడు అందుబాటులో ఉన్నాయి. చర్మాన్ని శుద్ధిచేసి పోషణనివ్వడానికి వివిధ రకాల తైలాల్లో పోషకాలున్నాయి. మొక్కలు, చెట్లు, మూలాలు, విత్తనాల నుంచి తీసిన సుగంధ తైలాలు (ఎసెన్షియల్‌ ఆయిల్స్‌) మర్దన చికిత్సలో మెరుగైన ఫలితాలకోసం ఈ తైలాలను వినియోగిస్తారు.

ఇవే అరోమా థెరపీగా ప్రసిద్ధి చెందాయి. మూలికల్లో ఉండే మందుగుణాలు ఎసెన్షియల్‌ తైలాల్లో ఉన్నాయి, వీటికి ఏంటీసెప్టిక్‌ గుణముండి ఒకవ్యక్తి మూడ్‌ను ఆల్ఫాక్టరీ నరాల ద్వారా సరిదిద్దు తాయి. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఎంతో చిక్కనయిన వైనప్పటికీ సరిగా వాడితే ఎలాటి చెడు ప్రభావాలు కలగవు. మర్దనలో వాడే మర్దన తైలాలు, వాటి ముఖ్యమైన గుణాల పట్టిక ఈ కింద ఇచ్చారు. స్వీట్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ తేలికైంది, తియనైంద కాస్త కరుకుగా ఉండే తైలం. ఇది వాపులకు వాడే తైలం. లోపలకు చొచ్చుకుపోయి చర్మానికి పోషణ అందిస్తుంది. ఈ తైలం కారియర్‌ ఆయిల్స్‌ ప్రముఖమైందిగా కూడా ప్రసిద్ది చెందింది. చెమ్మనిచ్చి, పోషించి, పునఃజవసత్వాలను ప్రసాదించే గుణాలు ఆప్రికాట్‌ ఆయిల్‌కు ఉన్నాయి. ఎండిపోయిన, సున్నితమైన చర్మానికి ఎంతో మంచిది. వాపులకు కూడా ఈ తైలం పనిచేస్తుంది. అవొకాడో ఆయిల్‌... పొడి చర్మం, ఎక్జిమా, సోరియాసిస్‌ లేక అలాంటి చర్మ వ్యాధులతో బాధపడేవారు తరచూ ఈ తైలం వాడుతారు. ఎండ వాతావరణం వల్ల దెబ్బతిన్న చర్మం, పగిలిన చర్మానికి, పోషణలేని చర్మానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చర్మానికి జీవంపోసి మెత్తపరుస్తుంది. జొజొబా ఆయిల్‌ అన్ని రకాల చర్మానికి మంచిది. ఎలాటి ఇబ్బందులు లేకుండా మచ్చలు పడ్డ చర్మానికి ఈ తైలాన్ని వాడవచ్చు. ఇది మొటిమల్ని నియంత్రించడానికి తోడ్పడుతుంది. జొజొబాను అరోమా థెరపీలో కారియర్‌ ఆయిల్‌గా కూడా వాడతారు. ఇది సులువుగా చర్మాన్ని చొచ్చుకుపోతుంది. జొజొబా క్రిమిసంహారిణి పూడుకుపోయిన రంధ్రాల్లో సెబమ్‌ను తొలిగంచడానికి సహాయపడుతుంది. వీట్‌ జెర్మ్‌ ఆయిల్‌లో ఎక్కువ మోతాదులో విటమిన్‌-ఇ ఎసెన్షియల్‌ ఫాటీ ఆసిడ్స్‌ ఉన్నాయి. అరోమాథెరపీ మసాజ్‌లు కలిపిచేసే చికిత్సలో దీన్ని విస్తారంగా వినియోగిస్తారు. మెత్తనైన, యవ్వనంతో తొణికిసలాడే చర్మాన్ని పెంపొందిస్తుందని తెలుస్తోంది. గాయం మానిన మచ్చలు, సాగిన మచ్చలు మాన్పడానికి సహాయపడుతుంది. హాజెల్‌నట్‌ ఆయిల్‌ తైలం మెత్తగా ఉంటుంది. చర్మానికి చెమ్మనిచే గుణాలు న్నాయి. చర్మాన్ని టోన్‌ చేసి గట్టిపరచడానికి ఈ తైలం సహాయపడుతుంది. కాపిలరీస్‌ను బలోపేతం చేయడానికి కళాలు పునరుజ్జీవిం పచేయడానికి తోడ్పతుంది. సిసేమ్‌ ఆయిల్‌ అన్ని తరహాల చర్మానికి మంచిది. రింగ్‌వర్మ్‌, స్కాబీస్‌, ఫంగల్‌ చర్మవ్యాధులను నిర్మూలిస్తుంది. దీన్ని ఏంటీసెప్టిక్‌గా భావిస్తారు. చెడకుండా ఎక్కువకాలం మన్నుతుంది.హోలీ ఆయిల్‌ మంచి కారియర్‌ ఆయిల్‌గా పరిగణిస్తారు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను చర్మం లోతుల్లోకి చొచ్చుకుపోయేలా తోడ్పడుతుంది. మంచి సుకుమారమైన, వాసనలేని హైపో ఎలెర్జిక్‌ ఆయిల్‌.

సంగీతంతో వైద్యం.... మ్యూజిక్‌ థెరపీ

మ్యూజిక్‌ థెరపీ అనేది క్లినికల్‌ థెరపీ, బయో మ్యూజికాలజీ, మ్యూజికల్‌ అకౌస్టిక్స్‌, మ్యూజిక్‌ థీరీ, సైకో అకౌస్టిక్స్‌, కంపే రిటివ్‌ మ్యూజికాలజీల మధ్య సంబంధా లను అధ్యయనంచేసే శాస్ర్తీయ పరిశోధన. ఈ చికి త్సా క్రమంలో సుశిక్షితుడైన మ్యూజిక్‌ థెర పిస్టు భౌతిక, భావాత్మక, మానసిక, సామా జిక, సౌందర్య, ఆధ్యాత్మిక కోణాల్లో సంగీతా న్ని ఉపయోగించి వ్యక్తులు ఆరోగ్యాన్ని పొంద డానికి సహాయపడతాడు. వివిధ సంగీత రీతు లను ఉపయోగించి వివిధ రంగాల్లో జీవిత నాణ్యతను, పనిచేసేతీరును మెరుగు పరు చుకోవడానికి మ్యూజిక్‌ థెర పిస్టులు ప్రధానంగా సహాయ పడతారు. ఫలితంగా అంచనా వేయదగ్గ చికి త్సా లక్ష్యాలను సాధిస్తారు. డాక్టరుగానీ, సైకా లజిస్టులు, ఫిజికల్‌ థెరపిస్టులు, వృత్తిపర మైన థెరపిస్టులున్న ఇంటర్‌ డిసిప్లినరీ టీమ్‌ మ్యూజిక్‌ థెరపీ సేవలను సిఫార్సు చేయ వచ్చు. సహాయపడే వృత్తుల్లో దాదాపు ప్రతి అంశంలో మ్యూజిక్‌ థెరపిస్టులు వున్నారు. టర్కో-పెర్షియన్‌ సైకాలజిస్టు, మ్యూజిక్‌ సిద్ధాంతవేత్త అయిన అల్‌-ఫరాబీ (872- 950) యూరోప్‌లో'అల్‌ఫరాబియస్‌'గా సుప్రసిద్ధుడు.

‘మీనింగ్‌ ఆఫ్‌ ఇంటెలెక్ట్‌'అన్న తన పుస్తకంలో మ్యూజిక్‌ థెరపీ గురించి చర్చించాడు. ఈ రచనలో సంగీతం ఆత్మపై కలిగించే చికిత్సాపరమైన ప్రభావాలను వివరించాడు. 17 శతాబ్దపు రాబర్ట్‌ బర్టన్‌ తన రచన'ది అనాటమీ ఆఫ్‌ మెలాంకొలీ'లో మానసిక జబ్బును ముఖ్యంగా మెలొంకొలి యా వ్యాధి చికిత్సకు సంగీతం నాట్యం ఎంతో ఉపయోగకరమైనవని అభిప్రాయపడ్డాడు.

మ్యూజిక్‌ థెరపీ - రకాలు...

మ్యూజిక్‌ థెరపీ ఆధారాల గురించి విభిన్న ఆలోచనా ధోరణులున్నాయి. ఒకటి విద్యపై ఆధారపడినది. రెండు సరాసరి మ్యూజిక్‌ థెర పీ పైనే ఆధారపడినవి. ఇదే కాక సైకాలజీ పై ఆధారపడిన ధోరణులు కూడా వున్నాయి. న్యూరోసైన్స్‌పై ఆధారపడిన చికిత్సా ధోరణి కూడా ఉంది. ప్రవర్తనా పరమైన-భావోద్రేక పరమైన రుగ్మతలకు లోనైన వ్యక్తులకు మ్యూ జిక్‌ థెరపిస్టులు వైద్యం చేయవచ్చు. ఈ తర హా ప్రజానీకం అవసరాలను నెరవేర్చడం కోసం సమకాలీన మనస్తత్వ సిద్ధాంతాలను తీసుకుని మ్యూజిక్‌ థెరపిస్టులు వివిధ తరహా ల మ్యూజిక్‌ థెరపీకి ఆధారంగా వాటిని విని యోగించారు. బిహేవియరల్‌ థెరపీ, కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ, సైకోడైనమిక్‌ థెరపీ వీటిలో వివిధ నమూనాలు. న్యూరోసైన్సు పై ఆధారపడిన థెరపీ నమూనాను న్యూరలాజిక ల్‌ మ్యూజిక్‌ థెరపీ (ఎన్‌ఎంటి) అంటారు. సంగీతం లేనప్పుడు మెదడు ఎలా వున్నదీ, సంగీతం వున్నప్పుడు మెదడు ఎలావున్నదీ, తేడాలను అంచనా వేసి మ్యూజిక్‌ ద్వారా మెద డులో మార్పులు తీసుకురావడానికి ఆ తేడాల ను వినియోగిస్తారు.

చివరికి సంగీతరహితం గా చికిత్సపొందుతున్న వారిని ఎలా ప్రభావి తం చేస్తుందో పరిశీలిస్తుంది.'‘ఈ విధానంలో మెదడును సంగీతంలో లీనం చేసి మార్చుతా రు''అని అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రొఫె సర్‌, పరిశోధకుడు డా థాట్‌ అంటున్నారు.

పిల్లలకు మ్యూజిక్‌ థెరపీ...

పిల్లలకు చేసే మ్యూజిక్‌ థెరపీలో రెండు విధానాలున్నాయి. ఒక గ్రూపు సిట్టింగులో చికిత్స చేయయడం ఒకటి కాగా, ప్రత్యేకిం చి ఒకరికి కూడా ఈ చికిత్స ఇవ్వవచ్చు. భావప్రసార (కమ్యూనికేషన్‌) సమస్యలు న్న బాలలకు, ప్రేరణ, ప్రవర్తనాపరమైన సమస్యలున్న పిల్లలకు మ్యూజిక్‌ థెరపీ సహాయపడగలదు. ఇందులో చికిత్స చేసే గది ఏర్పాటు చాలా ప్రధానమైంది. పిల్లలు సౌకర్యంగా వుంటూ వారు సరైన సంగీతం వినిపించడానికి ఇదెంతో అవసరం. అలాంటి గది పూర్తిగా సంగీతానికే కేటాయించిన గదై వుండాలి. గదిలో దృష్టిని మళ్ళించే ఇతర వస్తువులుండకూడదు. గదిలో వెలుతురు బాగుండాలి, వాతవరణం సమశీతోష్ణంగా వుండాలి. మరీ వేడిగా లేక మరీ చల్లగా ఉండ కూడదు. గదిలోకి సులువుగా రాకపోకలకు వెసులుబాటు వుండాలి. కుర్చీలు మంచివై వుండాలి. జాగిలపడేలా వుండకూడదు. ఇక వాయిద్యాల విషయానికి వస్తే వివిధ ప్రాంతాల కు చెందిన భిన్న వాయిద్యాలుండడం మంచి ది. వివిధ రంగులు, రకాల వాయిద్యాలుండ డం మంచిది. థెరపిస్టు పియానోగానీ గిటార్‌ గానీ వాయించాలి. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మంచి నాణ్యమైన వాయి ద్యాలు వినియోగించాలి. వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి.

కొందరు పిల్లలు వాయిద్యాలను వాయించగలరు, కొందరు వాయించలేరన్న విషయం గుర్తుపెట్టుకోవడం ఎంతో ముఖ్యం. కనుక పిల్లలకు వారికి తగిన వాయిద్యం ఇవ్వాలి. ఈ అంశాలన్నీ మ్యూజిక్‌ థెరపీ సఫలమవడానికి సత్ఫలితాలివ్వడానికి దోహ దపడతాయి. నిజానికి పిల్లల మ్యూజిక్‌ థెరపీ మాతృగర్భంలోనే మొదలవుతుందంటారు డానియెల్‌ లెవిటిన్‌. ఏమ్నియోటిక్‌ ఆసిడ్‌లో చుట్టుకొనివున్న గర్భస్థ శిశువు తల్లి గుండె చప్పుడు వింటుంది. అదే కాక సంభాషణలు, పర్యావరణపనమైన శబ్దాలు వింటుంది. పిండం సంగీతం వింటుందని యుకెలోని కీల్‌ విశ్వవిద్యాలయంకు చెందిన అలెగ్టాండ్రా లమోంట్‌ అంటున్నారు. పుట్టిన ఏడాది తర్వాత పిల్లలు సంగీతాన్ని గుర్తిస్తారని, కోరుకుంటారని కూడా అంటున్నారు. ఆకృతి దాల్చిన తర్వాత 20 నెలలు నిండిన గర్భస్థ శిశువు వినికిడి వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేయనారంభిస్తుందని వారంటున్నారు.

భారత్‌లో మ్యూజిక్‌ థెరపీ...

మన భారతీయ శాస్ర్తీయ సంగీత రాగాలకు చికిత్సాపరమైన గుణాలున్నాయని వేదాలు చెబుతున్నాయి. ప్రాచీనకాలం నుంచే సంగీ తాన్ని చికిత్సాపరమైన సాధనంగా మన పూర్వీ కులు ఉపయోగించారు. భారతదేశంలో సంగీ తం ఒక యోగా పద్ధతి. శ్రావ్యతకు ఆధారం రాగం. భారతీయ సంగీతానికి శ్రావ్యతే మౌ లిక స్వరం. కేంద్ర నాడీ మండలానికి సంబం ధించిన ఎన్నో వ్యాధులు మాన్పడంలో వివిధ రాగాలు ఎంతో ప్రభావవంతమైనవని వెల్లడైం ది. సంగీతాన్ని ఒక చికిత్సగా వినియోగించే ముందు ఏ విధమైన సంగీతం వాడాలో నిర్ధా రించుకోవాలి. సంగీతం మౌలిక గుణగణా లను సరిగా వినియోగించడం, స్వరం సవ్యం గా పలకడంపై సంగీత చికిత్స భావన ఆధారప డివుంది. ఒక్కో రాగం వైవిధ్యం అనూహ్యమైం ది. కను క ఒక నిర్ణీత వ్యాధికి ఒక నిర్దిష్టమైన రాగం పనిచేస్తుందని చెబుతారు. మ్యూజిక్‌ థెరపీ అన్న మాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్ధతికి వర్తిస్తుంది. అలాంటి పరిస్థితిలో భార తీయ శాస్ర్తీయ గాత్ర సంగీతానికి సంబంధిం చిన లిఖిత సాహిత్యం తగినంతగా లేదు.

ఆధారము: ఆయురారోగ్యాలు

పసుపుతో ఆరోగ్యం

 • పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
 • సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
 • పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
 • వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
 • పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
 • వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
 • వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
 • మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
 • నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
 • పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 • పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 • దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
 • పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
 • రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
 • చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.
 • పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.
 • పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.
 • పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.
 • వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
 • చక్కెర కలిపిన పాలను వేడిచేసి, పసుపువేసుకుని సేవిస్తే జలుబుకు ఉపశమనంగా ఉంటుంది.
 • చిన్న పసుపుకొమ్ము పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
 • పసుపుకొమ్ము బెల్లంతో కలిపి నీటిలో నాననిచ్చి ఆ నీటిని తాగడం ద్వారా రొంపతో వచ్చే గొంతునొప్పి తగ్గుతుంది.
 • వేపాకు, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మవ్యాధులు ఉన్నచోట రాస్తే చర్మవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 • టేబుల్ స్పూన్ పసుపును ఉల్లిపాయతో కలిపి వాపులు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
 • గంధం, పసుపును తీసుకుని తలకు పట్టుగా వేసుకుంటే తల నొప్పికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
 • ఇంగువ రెండు టీ స్పూన్లు తీసుకుని, పసుపువేసి రెండిటినీ పేపర్‌లో చుట్టి దాన్ని కాల్చి, వాసన పీల్చినట్లైతే మైగ్రేన్ తల నొప్పి తగ్గుతుంది.
 • పది గ్రాములు పసుపు తీసుకుని దానిలో 50గ్రాములు పెరుగుతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.
 • గోరువెచ్చగా కాచిన నీటిని తీసుకుని దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని రెండుమూడుసార్లు పుక్కిలిస్తే టాన్సిల్స్ తగ్గుతాయి.
 • నీళ్ళతో పసుపుని మరిగించి బట్టలో వడకట్టి, ఈ వడకట్టిన నీటితో కళ్ళను శుభ్రపరచుకుంటే కళ్లల్లో పుసులు తగ్గుతాయి.
 • కొంచెం నిమ్మరసంతో పసుపుని కలిపి కురుపులు ఉన్నచోట రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
 • పసుపు రోజూ వాడడంవల్ల సాధారణ మధుమేహం నుండి కుష్టు వ్యాధి వరకు అనేకానేక సాధారణ అనారోగ్యాలకు చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది.
 • నీళ్ళలో పసుపుని కలిపి తాగితే కడుపులో వుండే నులి పురుగుల్ని హరిస్తుంది.
 • పసుపు, సైంధవ లవణం, శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది.
 • పసుపు వాడడంవల్ల బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. గోరు చుట్టుకు పసుపును మందుగా వాడిచే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
 • నోటి దుర్వాసనలకు, దంతాల వ్యాధులకు పసుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
 • బ్రహ్మజెముడుతో పసుపు కలిపి పుండ్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
 • తుమ్మిపూలను మిరియాలు, బెల్లంతో చూర్ణం చేసి సేవిస్తే దగ్గు తగ్గుతుంది.
 • గ్లాసుడు పాలు వేడిచేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు

 • స్వచ్ఛమైన ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది.
 • బిళ్ళగనే్నరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
 • వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్‌ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది.
 • ముల్లంగిని కూరగా చేసుకుని గానీ, దంచిన రసంగా గానీ తాగాలి. పల్లేరు సమూలంగా కషాయం చేసుకుని తాగితే మూత్ర సంచి సమస్యలు తగ్గుతాయి.
 • మూత్రం కొంచెం కొంచెంగా వస్తే అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్‌ఫెక్షన్స్ తగ్గుతాయి.
 • పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది.
 • గుప్పెడు వేపాకు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు దంచి కురుపుల మీద రుద్ది ఒక గంట తరువాత సున్నిపిండితో స్నానంచేస్తే గజ్జి కురుపులు తగ్గుతాయి.
 • రెండు లేదా మూడు మిరియాలు బుగ్గన పెట్టుకొని మెల్లగా నములుతూ రసం మింగాలి. ఇలా రోజుకు ఐదునుండి ఏడు మిరియాలు నమిలితే దగ్గు తగ్గుతుంది.
 • తెల్ల ఉల్లిపాయ రసం పది మి.లీ., అల్లం రసం పది మి.లీ. నిమ్మ రసం పది మి.లీ. తేనెతో కలిపి 50మి.లీ. తీసుకుంటే కాటరాక్ట్, గ్లూకోమా తగ్గుతుంది.
 • తులసి రసం, అల్లం రసం రెండుమూడు చుక్కలు తీసుకుని కొంచెం తేనె కలిపి పిల్లలకిస్తే జ్వరం, జలుబు తగ్గుతాయి.
 • త్రిఫల చూర్ణం, పసుపు, నీళ్ళు కలిపి పేస్టులా చేసి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మందుపెట్టాలి. పగుళ్ళు తగ్గేంతవరకు ఇలా చేస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
 • అల్లం, జీలకర్ర నెయ్యిలో వేయించి, అందులో పటిక బెల్లం ముక్కలు వేసి కరగబెట్టాలి. పటిక బెల్లం కరిగాక ముక్కలుచేసి రోజూ ప్రొద్దున్న తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.
 • పండు జిల్లేడు ఆకుకు నీరు సున్నం రాసి, వెచ్చచేసి, రసం పిండి చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది.
 • అల్లం రసం, ఇంగువ కలిపి వెచ్చచేసి చెవిలో వేస్తే చీము కారడం తగ్గుతుంది. తాత్కాలికంగా వచ్చే చెవుడు కూడా తగ్గిపోతుంది.
 • పెద్ద ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి దానిని పండ్లకి వేసి రుద్దితే పండ్ల వెంట కారే రక్తం ఆగిపోతుంది.
 • స్వచ్ఛమైన ఇంగువ నిమ్మ రసంతో నూరి కొద్దిగా వేడి చేసి, దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి ఉన్నచోట పెడితే నొప్పి తగ్గుతుంది.
 • గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోక చెక్కల మసి - మూడూ కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళవాపు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
 • నేరేడు చెక్క చూర్ణం, కవిరి చూర్ణం (కాచు) సమానంగా కలిపి, కొద్దిగా ముద్దకర్పూరం కూడా కలిపి రాస్తే దంతాలకి సంబంధించిన సమస్త బాధలు తగ్గుతాయి.
 • జాజికాయ చిన్న పలుకు దవడకి పెట్టుకుని కొంచెం కొంచెంగా నమిలి తినాలి. ఇది శరీరానికి వేడి చేస్తుంది. జాపత్రి చిన్న ముక్క తమలపాకులో వేసుకొని తింటే నోటి దుర్వాసన నివారణ అవుతుంది.
 • లవంగం దవడకి పెట్టుకుని నమలాలి. పచ్చి పోకలు తమలపాకులో వేసుకుని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
 • నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
 • మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది.
 • గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని, వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది. పెరుగుతుంది.
 • వేపాకు రసం అరకప్పు, పెరుగు అరకప్పు, ఒక చెక్క నిమ్మకాయ రసం, మూడూ కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కడిగితే చుండ్రు నివారణ అవుతుంది.
 • వేపనూనె, కర్పూరం కలిపి రాస్తే తలలో పురుగు చచ్చి, కురుపులు మాడిపోతాయి, చుండ్రు తగ్గుతుంది.
 • వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకొని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
 • అల్లం, స్వచ్ఛమైన బెల్లం ఒక్కోటి 5గ్రాములు తీసుకుని రెండూ కలిపి రాత్రి పడుకోబోయేముందు నమిలి తింటే మలబద్ధకం పోతుంది.
 • చందన అత్తరు (శాండల్ ఉడ్ ఆయిల్) పది చుక్కలు పంచదారతో కలిపి తింటే మూత్రపు మంట వెంటనే తగ్గిపోతుంది.
 • ముద్దతామర ఆకుల్ని వేళ్ళతో సహా నూరి కురుపుల మీద కట్టాలి. చీము తగ్గి కురుపులు మానుతాయి.
 • మెంతికూర చిన్నదిగాని, పెద్దదిగాని కూర చేసుకుని రోజూ కనీసం మూడు నెలలు తింటే రక్తహీనత తగ్గుతుంది.
 • అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది.
 • నిమ్మ రసంలో పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొహంమీద మచ్చలు పోతాయి.
 • ఒక చెంచా కస్తూరి పసుపు మెత్తగా చేసి, నువ్వుల నూనెలో గాని, పల్లీనూనెలో గాని కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
 • వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి.
 • ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
 • పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది.
 • అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది.
 • జీవన్‌ధార ఒక చుక్క తమలపాకులో వేసి తినాలి. కరక్కాయ బెరడు దవడకు పెట్టుకొని దాని రసం మింగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
 • రావి చికురుటాకులు తొమ్మిదింటి రసం తీసుకుని, తేనెతో కలిపి తీసుకుంటే రెండుమూడు పూటల్లో జలుబు తగ్గుతుంది.
 • జిల్లేడు పువ్వు ఒక తమలపాకులో పెట్టి నమిలి తినాలి. ఇలా ఉదయం, సాయంత్రం రెండుపూటలా మూడురోజులు తింటే జలి జ్వరం తగ్గుతుంది.
 • తులసి ఆకు రసంతో కొంచెం అల్లం రసం గాని, లేక కొంచెం శొంఠి రసం గాని కలిపి, టీ స్పూన్ తేనె కూడా కలిపి తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
 • దానిమ్మ గింజలు చప్పరించి తింటే ఏ వయసు వారికైనా వాంతులు ఆగిపోతాయి. వేవిళ్ళతో ఉన్న స్ర్తిలకి తక్షణం పనిచేస్తుంది.
 • ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.
 • గుంటగలగరాకు దంచి రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెతో కలిపి నీరు మరిగించి ఉడకబెట్టి, చిటపట శబ్దంపోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచి, సువాసనకి గంధకచ్చూరాలు కలిపి, దీనిని వాడడంవల్ల జుట్టు రాలదు, నల్లబడుతుంది, పెరుగుతుంది.
 • మెంతులు (పచ్చివి) మెత్తగా పొడి చేసి, తలకి సరిపోయే పొడిని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పట్టించి గంటసేపు వుండి, తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది.
 • కలబంద నుండి గుజ్జుతీసి మెత్తగా చేసి, గుజ్జుని తలకి పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
 • బిళ్ళగనే్నరు ఆకులను, జామ ఆకుల్ని సమానంగా తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం మూడురోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
 • చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి.
 • వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకుని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీటిలో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకుని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
 • అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అరకప్పు నీటితో గాని పాలతో గాని కలుపుకుని తాగితే నడుంనొప్పి తగ్గుతుంది.
 • జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది.
 • శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
 • సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది.
 • ఉల్లిబింజర ఆకులు తుంచినప్పుడు వచ్చే రసంలో దూదిని ముంచి చెవిలో పెడితే చెవి పోటు, నొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
 • ఆముదం ఆకులను ముద్దగా నూరి తేనెతోకలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి. పెద్ద ఉసిరికాయ సైజులో రెండు గోళీలు ఉదయం, రెండు గోళీలు సాయంత్రం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.
 • రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి.
 • మంచి ఇంగువను నిమ్మరసంతో నూరి కొద్దిగా వేడి చేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గుతుంది.
 • గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోకచెక్కల మసి- ఈ మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపులు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
 • మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్‌విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
 • నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకరకాయలు, నేలతంగేడు పూత, పొడిపత్రి, తిప్పతీగె, ఉసిరికాయలను చూర్ణం చేసి రెండుపూటలా నోట్లో వేసుకొని నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
 • ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగనే్నరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం.
 • గుప్పెడు యూకలిప్టస్ ఆకుల్ని దంచి గుజ్జుచేసి నుదుటిమీద అంటించుకొని మెత్తటి గుడ్డతో కట్టుకొని, గంటసేపు పడుకుంటే తలనొప్పి పోతుంది.
 • పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
 • తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.

చర్మవాధ్యులకు''నాన్‌వెజ్''తైలాలు

ఔషద మొక్కల మిశ్రమంతో తయారు చేసిన తైలాలే కాకుండా జంతు శరీర భాగాలను కలిపి చేసే తైలాలు కూడా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో కుట్లు వేయకుండానే గాయాలను మాన్పే శక్తివంతమైనవి కూడా ఉన్నాయి. ప్రమాదాలు లేదా శస్త్ర చికిత్సల వల్ల అయిన గాయాలు, డె ర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్, దెబ్బలవల్ల ఏర్పడిన పుండ్లు, వెరికోస్ అల్సర్ల వంటివి ఈ తైలాలతో చాలా త్వరగా మానిపోతాయి.
అలాగే చర్మం ముడతలు, మొటిమల కారణంగా ఏర్పడే సన్నని గుంటలు ఇలా ఎన్నో రకాల సమస్యల నివారణలో ఆయుర్వేద తైలాలు గొప్పగా తోడ్పడతాయి. అలాంటి కొన్ని తైలాల వివరాలు మీకోసం...
తిలల (నువ్వులు) నుండి తీసిన నూనెలను తైలాలు అనడం పరిపాటి. అయితే ఆ తరువాత తిలల వంటి ఇతర నూనె గింజల నుండి తీసిన తైలాలను కూడా తైలాలుగానే పిలవడం మొదలయ్యింది. తైలాలకు ఔషధ మొక్కల కల్కాన్ని కలిపి తైలపాక విధిలో తయారుచేసిన నూనెల్ని కూడా తైలాలుగానే గుర్తిస్తున్నారు. ఇవన్నీ ఆయుర్వేద తైలాలుగా బాగా ప్రసిద్ధి పొందాయి.

అయితే ఔషధ మొక్కలు కాకుండా కొన్ని జంతువుల భాగాలు తీసుకుని నూనెల గింజల నుండి తీసిన నూనెను కలిపిగానీ లేదా కలపకుండా గానీ కొన్ని తైలాలను తయారు చేస్తారు. అందులో భాగంగా ఈము పక్షి కొవ్వు, కాడ్ చేప లివర్ ఇలాంటివి తీసుకుని తైలపాక విధానం లేకుండా తైలాలు తయారు చేస్తారు. ఇందుకు భిన్నంగా అండతైలం (గుడ్డు నూనె), మూషికా తైలాలను మాత్రం తైలపాకవిధిలో తయారు చేస్తారు.

ఈము తైలం

ఈము ఒక ఆస్ట్రేలియన్ పక్షి పేరు. ఈ పక్షి వీపు పైన ఉండే కొవ్వును కరిగించడం ద్వారా ఈ తైలాన్ని తయారు చేస్తారు. ఈ తైలంలో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది.

ఉపయోగాలు:
 • ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే ప్రమాదాలు లేదా శస్త్ర చికిత్సల వల్ల అయిన గాయాలు చాలా త్వరగా మానిపోయే అవకాశం ఉంది. గాయాలతో ఏర్పడిన మచ్చలు, అలాగే కీలాయిడ్స్‌ను నిరోధించడంలోనూ ఈ తైలాలు ఎంతో తోడ్పడతాయి. * క్రిమి, కీటకాలు కుట్టడం వల్ల కలిగే నొప్పి, దురద, మంట వాపులు ఈ తైలం రాస్తే తగ్గుముఖం పడతాయి. * డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్ వ్యాధుల్లో చర్మం పైనున్న తేమ తగ్గి పొలుసులుగా రాలుతూ ఉంటుంది. పైగా వాపు, దురద కూడా ఉంటాయి. ఆ భాగాల్లో ఈ తైలాన్ని రోజూ రాస్తే మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మంలోని తేమ ఇగిరిపోకుండా ఉంటుంది.
 • గాయాలు కండరాల లోతుల్లోకి వె ళ్లినప్పుడు కొందరిలో గాయం పైకి కనిపించకపోవచ్చు. కానీ, కమిలినట్లు నల్లబడుతుంది. అలాంటి వాటి పైన ఈ తైలం రాస్తే వారంలోపే తగ్గిపోతుంది.
 • ఈ తైలంతో మర్ధన చేస్తే చర్మ ముడతలు తగ్గిపోతాయి. ప్రత్యేకించి కొందరిలో వచ్చే అకాల వృద్దాప్య లక్షణాలకు ఈ తైలం సంజీవని లాంటి ది.
 • శరీరం బరువు పెరగడం వల్లగానీ, గర్భధారణ వల్లగానీ ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించడంలోనూ ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.
 • మొటిమలను తగ్గించడంలోనూ, మొటిమల కారణంగా ఏర్పడే పలుచని గుంటలను నివారించడంలోనూ ఈ తైలంతో చేసే ఫేషియల్స్ ఉపయోగపడతాయి.
చేపనూనె:

'కాడ్'అనే చేప లివర్ నుండి తీసిన కాడ్ లివర్ ఆయిలే చేపనూనెగా ప్రసిద్ధి పొందింది. ఈ తైలంలో విటమిన్-ఎ, డిలతో పాటు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

ఉపయోగాలు
 • ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మం పొడిబారే వ్యా«ధులకు ఈ తైలం క్యాప్సూల్స్ బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటే క్రీముగా చర్మంపై పూతగా వాడితే దురదలు తగ్గుతాయి.
 • ఇందులోని విటమిన్లు యాంటిఆక్సిడెంట్స్‌గా పనిచేస్తూ చర్మాన్ని కాపాడ తాయి.
గుడ్డు సొన నూనె

విరివిగా దొరికే అవకాశం ఉన్నందున ఈ తైలం తయారీకి కోడిగుడ్లనే ఉపయోగిస్తారు. ఈ తైలంలోనూ ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఉపయోగాలు:
 • చి కాలిన గాయాలకు, దెబ్బ తగలడం వల్ల ఏర్పడిన పుండ్లకు, వెరికోస్ అల్సర్లకు ఈ తైలంతోవేసే పూత ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. గాయాలు చాలా త్వరగా కూడా మానతాయి.
 • చి ఈ తైలానికి తగు నిష్పత్తిలో కొబ్బెరినూనె లేదా నువ్వుల నూనె కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. మూషికా తైలం ఎలుక మాంసానికి నువ్వుల నూనె చేర్చి తయారు చేసే తైలమిది.
 • ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే కండరాలు తెగి వాలిపోయేటంతటి పెద్ద గాయాలు కూడా చాలా త్వరగా మానతాయి. * ఈ తైలం రాచపుండ్లు మానడంలోనూ బాగా తోడ్పడుతుంది.
 • చర్మం పైన ముడతలు తగ్గడానికి, జారిన అవయవాలు (ప్రొలాప్స్ యుటెరస్/ రెక్టమ్) బిగువు పొందడానికి కూడా ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.

డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్,
ఫోన్: 9848750720.

డాన్స్‌ థెరపీ

అనాదిగా వివిధ సంస్కృతుల్లో కథలు, వివిధ భావోద్రేకాలను ప్రదర్శించడానికి నాట్యం మాధ్యమంగా ఉంటూవస్తోంది. ఈనాడు ఈ సంస్కారవంతమైన కదలికల్ని చికిత్సగా కూడా వినియోగిస్తున్నారు. ఆందో ళన, కీళ్ళనొప్పులు, డిస్లెక్సియా వంటి రుగ్మత లను నయం చేయడానికి వివిధ నాట్య రూపా లను ఉపయోగిస్తున్నారు. ఏకాగ్రతను రెట్టిం చడానికి నాట్యం గొప్ప సాధనంగా రుజువ య్యింది. పార్కిన్సన్‌ వ్యాధిని ఎదుర్కోవడానికి కూడా దోహద పడుతుంది. నాట్య కదలికల చికిత్సకు (డాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ) గ్రూప్‌సెషన్లు, భారతీయ శాస్ర్తీయ, ఆధునిక, సమకాలిక నాట్య రూపాలను వినియోగిస్తున్నారు. వివిధ వ్యాధులను నయం చేయడానికి అన్ని వయసుల వారికి ఈ చికిత్స ఉపయోగపడు తోంది. డ్యాన్స్‌ థెరపీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. దీనిని ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలే ఓ ప్రమాదానికి లోనైన మితాలీ మోహన్‌ గురించి తెలుసు కుందాం... ఆమె చేయించు కునే ఫిజియోథెరపీలో భాగంగా డ్యాన్స్‌ థెరపీలో కూడా చేరమని చెప్పారు డాక్టర్లు. నాట్యం చేస్తున్న కాస్సేపూ మనం మన చింతల్ని మరిచిపోతాం. ఈ కళలో మనసు, శరీరం రెండిటికీ పని చెప్పాల్సివుంటుంది. మనం ఒక విధమైన తన్మయత్వంలోకి జారుకుంటాం. కథక్‌ నాట్యం నేర్పే పంతులమ్మ విజయశ్రీ చౌదరి ఈ అభిప్రా యంతో పూర్తిగా ఏకీభవిస్తోంది.

ఆటగా అనిపించినప్పటికీ నాట్యం ధ్యానంలో ఉచ్చస్థాయిని చేరుకోవడానికి సహాయపడు తుందని ఆమె అంటున్నారు. నృత్యం మంచి వ్యాయామం అంటున్నారామె. ఏ నృత్యం సౌకర్యవంతంగా ఉంటే ఆ నాట్యరూపాన్ని డ్యాన్స్‌ థెరపీకి వినియోగించవచ్చు. సమ కాలీన నాట్య భంగిమల్లో కొన్ని ఏకాగ్రత పెంచడానికి ఎక్కువ అల్లరిచేసే పిల్లలకు, డిస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లలకు ఉపయోగపడతాయని సమకాలీన నాట్య శిక్షకుడు హృషికేష్‌ పవార్‌ అంటున్నారు. పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడు తున్న రోండా చాకో డ్యాన్స్‌ థెరపీ అధ్భుతమైన ఫలితాలివ్వడంతో చాలా సంతోషంగా వున్నారు. అత్యంత సులువైన పని కూడా పార్కిన్సన్‌ వల్ల దెబ్బతింటుంది, ఆత్మవిశ్వాసం కోల్పోతాం, డ్యాన్స్‌ థెరపీ నాలాంటివారెందరో తమ దైనందిన రోజువారీ పనులు చేసుకోగలుగుతారు అంటున్నారు రోండా. ఆమె కదలికలు నిదానంగా ఉండ వచ్చు కానీ ఆత్మవిశ్వాసంతో పనిచేసుకుపో తున్నారు. సంతులనాన్ని, సరైన భంగిమ పొందడానికి భారతీయ శాస్ర్తీయ నాట్య రూపాలు సహాయపడతాయని ఇది మంచి చికిత్సా విధానమని ప్రముఖ ఎముకల డాక్ట రు డా.సత్యశీల్‌ నాయక్‌ అంటున్నారు. మరో ఎముకల డాక్టర్‌ సునీల్‌ కోరే కూడా ఈ అభిప్రా యంతో ఏకీభవిస్తున్నారు.

ఎలాంటి కదలి కైనా శరీరానికి మంచిదని అనారోగ్యం చాలా వరకూ మానసికమైందని ఆయన అంటున్నారు. వారి ఉత్సాహాన్ని రేకెత్తించడానికి కూడా డ్యాన్స్‌ థెరపీ సహాయపడుతుంది. ఒక వ్యక్తి పాదాలు ఆడించడం కూడా ఓ విధమైన ఆక్యుప్రెషర్‌ థెరపీ అంటున్నారు చౌదరి. ఎంతో శక్తినిస్తుం ది మీరు గమనించినట్లయితే నర్తకీమణులు తమ వయసుకంటే చిన్నవారిగా కనిపిస్తారు. కనుక డ్యాన్స్‌ థెరపీ వల్ల శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

భారత్‌-అమెరికాల్లో డ్యాన్స్‌ థెరపీ వైవిధ్యం...

భారతీయ, అమెరికా డ్యాన్స్‌ థెరపీల మధ్య చాలా తేడా ఉంది. అమెరికన్‌ డ్యాన్స్‌ థెరపీ అసోసి యేషన్‌లో వేయమంది సభ్యు లున్నారు. జైళ్ళలో, డి-ఎడిక్షన్‌ కేంద్రాల్లో, హాఫ్‌వేహోంలు (చికిత్సా కేంద్రాలు) ల్లో వీరు పనిచేస్తున్నారు. ఇండియాలో మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. సుశిక్షితులైన థెరపిస్టులు స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత వారికి సరైన జీత భత్యాలు ఇవ్వడంలేదు. వారిసేవలకు సరైన గుర్తింపు రావడంలేదు. వారి సేవలెంతగానో అవసమైనప్పటికీ వారు మన వ్యవస్థతో నిరంతరం పోరాడుతున్నారు. బేజారై విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అమెరికా లో వైద్యం దాదాపు ప్రైవేటు సైకోథెరపీ సెషన్‌లాగా జరుగుతుంది. సందర్శకులు కూడా ఒక దిక్కే కనిపించే అద్దం గుండా చూడవచ్చు. ఇండియాలో స్కూలుకు వచ్చే సందర్శకులు పార్కులోకి వచ్చినట్లు సరాసరి సెషన్‌లోకి నడిచివచ్చేస్తారు పైగా నాట్యం ఒక ప్రదర్శన కళ అన్న విషయం మన మెదళ్ళలో నాటుకుపోయింది. ఇండియాలో ఉన్న ఎన్నో శాస్ర్తీయ, జానపద నాట్య రూపాలు మన జనసముదాయంలో అంతర్భాగాలు.

ఆధారము: ఆయురారోగ్యాలు

కండర పుష్టికి తైలాలు

సౌష్టవమైన ఆకృతిని, దృఢత్వాన్నీ కలిగించేవి కండరాలే. చర్మం లోపల సన్నని దారాల్లా ఉండడంతో మొదలు, శరీరంలోని అన్ని అవయవాల నిర్మాణం దాకా కండరాలే కీలక పాత్ర వహిస్తాయి. సిక్స్ ప్యాక్, ఎయిట్‌ప్యాక్ బాడీ బిల్డింగ్‌లోనూ ముఖ్య భూమిక కండరాలదే. కండరాలు బలహీనపడిన వ్యక్తి బక్కచిక్కిపోతాడు. చర్మం సైతం తన ప్రభను కోల్పోయి ముడుతలు పడుతుంది. పైగా ఏపనీ చేయలేని అశక్తత, నిరుత్సాహం వెంటాడతాయి. ఇదంతా సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు.

లేదా రక్తహీనత, క్షయ, గ్రహణి (ఐబిఎస్), తరుచూ వచ్చే జ్వరాలు, దీర్ఘకాలిక వ్యాధుల వల్లనూ కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు ఏర్పడిన పోషకలోపాల కారణంగా పుట్టిన బలహీన శిశువు మొదలు, వృద్ధుల దాకా అందరూ కండరాల సమస్యను ఎదుర్కొనే వారే. ఇలాంటి వారికి కొన్ని ప్రత్యేక తైలాలతో మర్ధన చికిత్స చేస్తే ఆరోగ్యంతో పాటు కండర పుష్టీ పెరుగుతుంది. రక్తప్రసరణా వ్యవస్థ బలపడి చర్మంతోపాటు శరీర అవయవాలన్నీ తమతమ కార్యకలాపాలను సవ్యంగా జరుపుకోగల్గుతాయి. ఫలితంగా ఆరోగ్యమూ కుదుటపడుతుంది.

చందన బలా లాక్షాది తైలం:
చందనం, బలామూలం, లాక్ష్యానిర్యాసం, ఉశీర అనే నాలుగు వనౌషదుల కషాయం కాచిపెట్టుకుని దీనికి తగినన్ని పాలు కూడా కలుపుతారు. ఈ మొత్తానికి నాలుగో వంతు నువ్వుల నూనె చేరుస్తారు. నూనెలో నాలుగోవంతు చందన చెక్క, వట్టివేర్లు, సోంపు, దేవదారు చెక్క, పసుపు, కోష్టు, మంజిష్టా, అగరు, సుగంధిపాల, అశ్వగంధ, బలామూలాలు, కస్తూరి పసుపు, మూర్వా, తుంగ ముస్తలు, ముల్లంగి, ఏలకులు, దాల్చిన, నాగకేసరాలు, రాస్నా, లాక్షా, అజమోద, చంపక, చోరపుష్టి మొదలగు వాటి చూర్ణాలను ముద్దగా చేసి పైన తెలిపిన కషాయం, పాలు, నూనెలు ఉన్న పాత్రలోకి చే ర్చి'తైలపాక విధి'లో ఆయుర్వేద ఫార్మసిస్టులు తయారు చేస్తారు.

ఉపయోగాలు
 • స్త్రీలలో రక్తస్రావ లక్షణాలు ఉండే గర్భకోశ వ్యాధులు (మెనొరేజియా, మెట్రోరేజియా), రక్తస్కందన లోపాలు ఉండే హీమోఫిలియా, మెటికియల్ హెమరేజ్ వంటి సమస్యలకు ఈ తైలంతో మర్ధన చికిత్స చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
 • దగ్గు, దమ్ము, క్షయ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఛాతిపనైన, ముందూ వెనుక మర్ధన చేస్తే ఛాతీలో కండరరపట్లు పోయి కసమస్యలు తేలిగ్గా ఉపశ మిస్తూ ఔషధ చికిత్సలో సహకరిస్తాయి.
 • ఒంటిపైన పొడిదురదలు లేదా మంటలు ఉన్నప్పుడు ఈ తైలంతో మర్ధన చేస్తే తక్షణమే ఉపవమనం లభిస్తుంది.
 • రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు వచ్చే వాపులు గానీ, రక్తకణాల క్షీణతతో వచ్చే కామెర్ల జబ్బు (హీమోలైటిక్ జాండిస్)లో గానీ, ఈ తైౖలాన్ని వాడుకోవచ్చు.
 • తలపోటు, కళ్ల మంటలు ఉన్నప్పుడు తలకు మర్ధించుకోవచ్చు.
 • కాళ్లు, చేతులు పట్టేస్తున్నప్పుడు ( క్రాంప్స్) ఈ తైలంతో మర్ధనచేస్తే ఉపశమనమే కాకుండా సమస్యలు శాశ్వతంగా తగ్గిపోతాయి.
 • తరుచూ వచ్చే కొన్ని దీర్ఘకాలిక జ్వరాలకు ఈ తైలంతో అభ్యంగనం చేస్తే శరీరం శక్తిని పుంజుకోవడంతో పాటు జ్వర సమస్యలు కూడా పూర్తిగా పోతాయి. ఈ ప్రొటీన్, క్యాల్షియం లోపాలతో చిన్న పిల్లల్లో వచ్చే'ఫక్కా'(రికెట్స్, మరాస్మస్, క్యాషియోర్కర్) వంటి వ్యాధులు, పుట్టుకతోనే వచ్చే మెదడు ఎదగకకుండా పోయే సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మజిల్ డిస్ట్రోఫీ వ్యాధకులకు కూడా ఈ ఈ తైలంతో అభ్యంగనం చేస్తే ప్రయోజనం ఉంటుంది.
మహా మాష తైలం

అశ్వగంధ, శఠీ, దేవదారు, బలా, రాస్నా, ప్రసారణీ, కుష్ఠం, భారంగీ, విదారీకంద, పునర్నవా, శతావరీ, జీరక, హింగు, శతపుష్పీ, గోక్షురా, పిప్పలీ మూల, చిత్రక, సైందవ లవణం, జీవనీయ గణం వంటి వనౌషధుల చూర్ణకల్కం ఒక భాగం తీసుకుని దానికి నాలుగు రెట్లు నూనె, నూనెకు నాలుగు రెట్లు మినుముల (మాష) కషాయం, పాలు కలుపుతారు. ఆ తరువాత అన్నిటినీ ఒక పాత్రలో చేర్చి'తైలపాక విధి'లో నువ్వుల నూనె మిగిలేట్లు కాచి తయారు చేస్తారు. ఆయుర్వేద ఫార్మసిస్టులు కొందరు కల్క భాగంలో కొంత మేక మాంసాన్ని కూడా కలుపుతారు.

ఉపయోగాలు
 • ఈ దీర్ఘకాలిక పక్షవాతాలు లేదా నరాల సంబంధ వ్యాదుల్లో కండరాలు, స్నాయువులు (లిగమెంట్లు) బలహీనపడుతూ ఉంటాయి. వీరికి మహా మాష తైలంతో మర్ధన చేస్తే కండరాలు, స్నాయువులు తిరిగి పుష్టిగా తయారవుతాయి.
 • మాటిమాటికీ మూర్ఛలు వచ్చే వారికి, దవడలు పట్టేసే వారికి ఈ తైల మర్ధన ఎంతో మేలు చేస్తుంది.
 • అపబాహుక, విశ్వాచీ, ఖంజ, పంగుతా, అర్థితం వంటి నరాల జబ్బుల్లో కండరాలు ఎండిపోతుంటాయి. ఆ స్థితి రాకముందే ఈ తైలంతో మర్ధన చే స్తూ ఉంటే కుంటి, గూని, మూతివంకర, చేతివాతం వంటి సమస్యలు తొలగిపోతాయి.
 • పురుషుల్లో ధాతుక్షయం, ప్రత్యేకించి శుక్రక్షయం కారణంగా సంతానం కలగనప్పుడు మహా మాష తైలంతో మర్ధన చేసుకోవడతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే ఫలితం ఉంటుంది.
సూచనలు:

పైన పేర్కొన్న వ్యాధులకు తైల మర్ధన ంతో మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణ లో కడుపులోకి కొన్ని మందులు కూడా తీసుకున్నప్పుడు ఆ ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. ఇక ఈ వ్యాధులకు అల్లోపతి వైద్య చికి త్సలు తీసుకునే వారు కూడా మర్ధన కోసం మహామాష తైలాన్ని నిస్సంకోంచంగా వాడుకోవచ్చు.

డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్,
ఫోన్: 9848750720.

ఆధారము: ఆయురారోగ్యాలు

ఇవి తింటే హృదయం పదిలం

 • జీడిపప్పు: ఇందులో ప్రొటీన్లు, పైబర్ అత్యధికంగా ఉంటాయి. శరీరానికి వెంటనే శక్తినిచ్చే గుణాలున్నాయి ఇందులో. గుండెకు కూడా మంచి శక్తినిస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్, విటమిన్-బి పుష్కలం.
 • కర్జూరం: డ్రైప్రూట్స్‌లో అత్యంత శక్తివంతమైనది కర్జూరం. ఇందులోని గ్లూకోజ్, ప్రక్టోజ్ శరీరాన్ని ఉల్లాసపరుస్తాయి. వారానికి కనీసం రెండుసార్లయినా వీటిని తినాలి. అధిక రక్తపోటు బాధితులు వీటిని రెగ్యులర్‌గా తింటే తగినంత పొటాషియం లభిస్తుంది. బీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది.
 • వాల్‌నట్స్: ప్రొటీన్లను అందించే వాల్‌నట్స్ తింటే అరుదైన ఒమెగా 3 ప్యాటీ ఆసిడ్స్ కూడా దొరుకుతాయి. విటమిన్-ఇ, యాంటీ యాక్సిడెంట్స్, పైబర్.. ఇలా శరీరానికి విలువైన పోషకాలన్నీ ఇందులో ఉన్నాయి. అందుకే రోజూ రెండు మూడు వాల్‌నట్స్ సరదాగా తినండి.
 • కిస్‌మిస్: తినేందుకు మధురంగా, రుచికరంగా ఉండే కిస్‌మిస్‌తో ఎనలేని ప్రయోజనాలున్నాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. జీర్ణప్రక్రియను మెరుగు పరుస్తాయి. మినరల్స్ శక్తినిస్తాయి. రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో కిస్‌మిస్‌ను నానబెట్టి, పొద్దున్నే ఆ నీళ్లను తాగితే కడుపు శుభ్రం అవుతుంది.
 • వేరుసెనగ: వందగ్రాముల విత్తనాల్లో 93 శాతం కాల్షియం, 16 శాతం కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. ఇవే కాదు. పౖౖెబర్, ఐరన్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కొవ్వులు... ఇలా ఎన్నో రకాల పోషకాలు వేరుసెనగ విత్తనాల్లో ఉన్నాయి. సుమారు 13 రకాల పోషకాలను కలిగిన వీటిని తక్కువ మోతాదులో తింటే మంచిది.
 • ఇవే కాదు. బాదాం తింటే కంటిచూపునకు, అంజీర తింటే ఊపిరితిత్తులకు, నల్లద్రాక్ష, కుర్భాణీ తింటే గుండెకు... మంచి చేస్తాయి. అందుకే కాస్త ఖరీదు ఎక్కువైనా.. వీలున్నప్పుడు తక్కువ మోతాదులోనైనా డ్రై ఫ్రూట్స్ తినడం మరువకండి.

సరికొత్త డైట్ డ్రింక్‌

 • బరువు తగ్గాలనిప్రయత్నించేవారు డైట్‌లు, వెయిట్‌లు అంటూ హైరానాపడడం కద్దు. ఇటువంటి వారికి సరికొత్త డైట్‌ డ్రింక్‌ సూచిస్తున్నారు అమెరికా వైద్య కళాశాల శాస్తవ్రేత్తలు. కూరగాయల రసం తాగితే అధిక బరువు వున్న పెద్దవారు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మార్పు కనిపించినట్లు వారు చెబుతున్నారు.
 • సోడియం తక్కువగా వుండే వెజిటెబుల్‌ జ్యూస్‌ ప్రతిరోజూ తాగిన వారు 12 వారాల్లో రెండు కేజీల బరువు తగ్గినట్లు చెబుతున్నారు.
 • జ్యూస్‌ను టమోటాలతో కలిపి అన్ని రకాల కూరగాయలు వేసి చేస్తారు. దీన్ని మామూలు జ్యూసు మాదిరిగా తీసుకోవడం వల్ల కడుపునిండినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఆహార పదార్థాలు తక్కువ తీసుకుంటారు.
 • డిన్నర్‌ తీసుకునే ముందు ఓ గ్లాస్‌ వెజిటేబుల్‌ జ్యూస్‌ సిప్‌ చేస్తే మిగిలిన చిరుతిళ్ళ జోలికి వెళ్ళడం కూడా చాలా వరకు తగ్గుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు కూడా లభిస్తాయి.
 • కూరగాయలలోని సాల్యుబుల్‌ పీచు, తక్కువ సోడియం శాతాలు అధిక బరువును నియంత్రించడంలో ఎంతో సాయపడతాయి.
 • పాలకూర, కీరా, సొరకాయ వంటివి ఈ జ్యూస్‌లో వుపయోగించినట్లైతే మరింత మంచిదని వారు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెజిటేబుల్‌ జ్యూస్‌ తయారీకి సిద్ధపడండి.
 • ఆరోగ్యం... అందం.. రెండూ సొంతం చేసుకోండి... అని కూడా చెబుతున్నారు. మొత్తం మీద శాకాహారమే కాదు కూరగాయల జ్యూస్‌లు కూడా గొప్ప మేలే చేస్తాయన్న మాట!

బలాన్ని ఇచ్చే బాదం

బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం.

ఎలా వాడితే మంచిది?

వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చే యడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది.

బాదంపాలు: బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.

మంచి టానిక్‌: బాదంలో ఉన్న ఖనిజ లవణాల వలన ఇది మంచి టానిక్‌గా పనిచేస్తుంది. కొత్త రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. శరీరంలోని మెదడు, గుండె, కా లేయం, నరాలు, కండరాలు, మనసు అన్నీ సక్రమంగా పని చేయడంలో బా దం చాలా సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు ప్రతి రోజూ పరిమితం గా బాదం తినడం వలన రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ రాత్రి 10-15 బా దం పప్పులు తినడం వలన సాఫీగా విరేచనం అవుతుంది.చర్మవ్యాధుల్లో బాదం నూనెను పైపూతగా వాడవచ్చు. వీర్యవృద్ధికి బాదం సాయపడుతుంది.

కొన్ని సూచనలు: ఇందులో కొవ్వు ఎక్కువ కనుక లావుగా ఉన్న వారు ఎక్కువగా తినకపోవడం మంచిది. తొక్క తీసి తింటే మంచిది. భోజనం చేయగానే తినకూడదు. పిల్లలకు పరిమితంగా బాదం పప్పు ఇచ్చినట్లయితే, ఆరోగ్యంగా ఉంటారు.

డాక్టర్‌ గాయత్రీదేవి
ఆయుర్వేద వైద్యనిపుణులు

ఆధారము: ఆయురారోగ్యాలు


అడవిలో ఆసుపత్రి..... మూలికలే మందులు!

అక్కడ కార్పొరేట్‌ వైద్యానికి సైతం లొంగని వ్యాధులు మటు మాయమవుతాయి. ఆయన హస్తవాసిని చూసి మొండి రోగాలు కూడా తోకముడుస్తాయి. అలా అని ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులున్న ప్రముఖ వైద్యుడేమీకాదు. ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో ఈ సత్కార్యాన్ని చేపట్టారు. ఇప్పటివరకు కొన్ని వేలమంది రోగులకు వైద్యసేవలందించి వారికి స్వాంతన చేకూర్చిన... చేకూర్చుతున్న ఆ వైద్య'నారాయణుడే'జమాల్‌ ఖాన్‌. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని ఓ కుగ్రామం నిమ్మలగూడెంలో... వారసత్వ సంపదగా వచ్చిన వైద్య విధానంతో జమాల్‌ తన ప్రకృతి చికిత్సాలయం ద్వారా ఎంతో మందికి వైద్య సేవ చేస్తున్నాడు. ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితం చెట్లలోని మందు గుణాన్ని క్రోడీకరించింది. ఆయుర్వేదం పరిధిలోకి రాని చెట్టు, మొక్క, తీగ అంటూ ఏదీలేదు. ఆలాంటి అపార వృక్షసముదాయంలోంచి వైద్య సంపదను సృష్టిస్తున్నాడాయన. మన్నెం అటవీ ప్రాంతంలో బీదబిక్కి జనానికి సహజమైన ఓషధులతో తన ప్రకృతి వైద్యశాల ద్వారా సేవ చేస్తున్నాడు. మన రాష్ట్రం నుండే కాక... చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర నుండి వచ్చే రోగులకు కూడా తన వైద్య సేవలు అందిస్తున్న జమాల్‌ఖాన్‌...'వైద్యో నారాయణో హరి'అనే ఆర్యోక్తికి అక్షరాల అర్హుడు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చుచేసినా తగ్గని మొండి వ్యాధులను వనమూలికలతో... అదీ ఉచితంగా అందిస్తూ... తన సేవా తత్పరతను చాటుకుంటున్న ప్రకృతి వైద్య నిపుణుడు జమాల్‌ నిస్వార్థ సేవల కథనం.

- మహత్తర వనమూలికలతో మొండి రోగాలకు వైద్యం
- రెండు దశాబ్దాలకు పైబడిన వంశపారంపర్య ఉచిత వైద్య సేవలు
- మూడు రాష్ట్రాల రోగుల ఆశాజ్యోతి ఎండి.జమాల్‌ఖాన్‌
అనాది నుంచి ప్రకృతిలో మమేకమైన మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో ఆ ప్రకృతికి దూరమయ్యాడు. వైద్యరంగం అభివృద్ధి చెందుతున్న కొద్ది మానవుని ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలు పెట్టింది. అయితే వైద్యరంగంలో అనేక రకాల వైద్య విధానాలతో రకరకాల చికిత్సలు జరుగుతున్నప్పటకీ, అన్నింటికీ మించి, ప్రకృతిలో దొరికే మహత్తర వన మూలికలే మేలైన రోగ వినాశకారులని గుర్తించిన జమాల్‌ఖాన్‌ కుటుంబం వంశ పారంపర్యంగా ఏజెన్సీలో వైద్యం చేస్తూ, ఎందరో రోగులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. అడవి నుండి ఔషద గుణాలు ఉన్న మొక్కలను, వేర్లను, దుంపలను సేకరించి, వాటి ద్వారా చికిత్స నిర్వహిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని చింతూరు మండల కేంద్రానికి సరిగ్గా మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న నిమ్మలగూడెం జమాల్‌ఖాన్‌ మూలికా వైద్య ప్రకృతి కేంద్రం.

చుట్టూ గుట్టలు, పచ్చటి ప్రకృతి, ప్రక్కనే జలజలా పారుతున్న శబరి నది ఒడ్డున తనకున్న కొద్దిపాటి భూమిలోనే అనేక రకాల వన మూలికలను పెంచుతూ, దాన్ని కుటీర పరిశ్రమగా చేసి వనమూలికలతో మందులు తయారు చేస్తున్నారు. సుమారు 20 మంది సహాయకులతో ఈయన వైద్య సేవలు కొనసాగుతున్నాయి. జమాల్‌ఖాన్‌ సేకరించే అరుదైన వన మూలికా ఔషధాలైన తెల్ల మద్ది, ఎర్రచిత్రమూలం, తెలియకండ, బొమ్మల మర్రి, పీడాకుల పాల, అశ్వగంధ, పాతాల గరిడి, అడ్డసార, సత్తావరి తదితర ప్రకృతి నుంచి లభించే చెట్లు, వేళ్లతో ఎన్నో నయం కాని రోగాలను తగ్గించవచ్చని ఆయన రుజువు చేశారు. ఈ వైద్యశాలలో పాము కాటుకు గురై వచ్చే రోగులకు ఉచితంగా చికిత్స నిర్వహించి, అనేక మంది ప్రాణాలు కాపాడారు. ఈయన వద్దకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది రోగులు వస్తుంటారు. క్యాన్సర్‌, అస్త్మా, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, బిపి, షుగర్‌ వంటి రోగాలను సైతం జమాల్‌ఖాన్‌ నయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు అనేక మంది రోగులు తమ రోగాలు పూర్తిగా ముదిరిన తర్వాత చివరి దశలో రావడం, మందులు పనిచేసే వరకు ఓపికగా ఉండలేకపోవడంతో ఈ ప్రకృతి వైద్యం అంతగా గుర్తింపునకు నోచుకోవడం లేదని ఈ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. అందుకనే మానవ అవసరాలకు ఉపయోగపడే ఎన్నో మహత్తర వన మూలికలు నిర్లక్ష్యానికి గురౌతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలగలతో వినూత్న చికిత్స...

శరీరంపై... ఎన్నో యేళ్లుగా మానకుండా, చికాకు కలిగించి, జీవితంపై విరక్తి పుట్టించే దీర్ఘకాలిక గాయాలకు ఈయన చేసే చికిత్స వినూత్నంగా ఉంటుంది. దీర్ఘకాళికంగా ఉన్న పుండ్ల ప్రదేశంలో బురద నీటి నుండి తెచ్చిన జలగలను వదిలి పుండ్లలో పేరుకుపోయి ఉన్న చెడు రక్తాన్ని పీల్పించడం ద్వారా చికిత్స మొదలుపెడతారు. అలా జలగలు చెడు రక్తాన్ని పీల్చివేసిన అనంతరం వైద్యుడు ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి మందుల ద్వారా 10-15 రోజులలో గాయం మానేటట్లు వైద్యం చేస్తారు. ఈ ప్రక్రియలో చికిత్స కోసం జలగలను ఒక రోగికి ఒక్కసారి మాత్రమే వినియోగిస్తారు.

రోగుల క్షేమమే కోట్ల ఆస్తితో సమానం...: మూలికా వైద్యుడు జమాల్‌ఖాన్‌

ఒరిస్సాలోని మల్కా న్‌గిరి జిల్లా మోటు ప్రాంతం, మా నాన్నగారికి నేను 23 వ సంతానం. నా తర్వాత తమ్ముడు ఖాలిక్‌ఖాన్‌తో కలిసి వంశపారంపర్యంగా వస్తున్న ఈ మూలికా వైద్యాన్ని కొనసాగిస్తున్నాం. మా తండ్రి మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ గారు 1920 వ సం లోనే శబరి పరివాహక ప్రాంతాలలో వచ్చిన కలరా, డయేరియా వంటి అంటువ్యాధులను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. దాంతో ఆనాడే మా వైద్య విధానానికి మంచి గుర్తింపు లభించింది. మా తాతల కాలం నుండి నేటివరకు వైద్యసేవలకు గాను ఎప్పుడూ, ఎవరి దగ్గర ఒక నయా పైసా కూడా ఫీజు తీసుకోలేదు. 2002 లో శబరి నది దాటి ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతానికి వచ్చాం. ఇప్పుడు మూలికలు సేకరించి తెచ్చిన గిరిజనులకు... కూలీ రూపేణా ఇవ్వడానికి మాత్రమే నామ మాత్రపు డబ్బు తీసుకుంటున్నాం. నాకు కాంట్రాక్టులు, వ్యవసాయం తదితర ఆదాయ మార్గాలు ఉన్నాయి. వైద్య సేవలకు ఎటువంటి రుసుము అవసరం లేదు. ఎందరో దేవుళ్లకు మొరపెట్టుకొని నా దగ్గరకు వచ్చే రోగులకు నయమై క్షేమంగా ఉంటే చాలు, అదే నాకు కోట్ల ఆస్తితో సమానం.

ఏజెన్సీ ప్రాంతంలో ఆయుర్వేద వైద్య సేవల ద్వారా పక్షవాతం, మధు మేహం, కిడ్నిలో రాళ్లు, కిడ్ని ఫెయిల్యూర్‌, కీళ్లవాతం, కీళ్లనొప్పులు, టి.బి., కాలేయ సంబంధిత వ్యాధులు, రకరకాల కామెర్లు, గర్భసంచి క్యాన్సర్‌, బ్లడ్‌ క్యాన్సర్‌, సైనస్‌, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, తెల్లపొడ, శూలబాధలు, అల్సర్‌, అర్ష మొలలు, మూత్ర సంబంధమైన వ్యాధులు, ఎర్రబట్ట, సెక్స్‌ సంబంధ మైన సమస్యలు, హై, లో బి.పి., కుష్టు, ఇంకా అనేక రకమైన వ్యాధులకు చికిత్స వనమూలికల (గింజలు, బెరడు, వేర్లు, కాయలు, పువ్వు, ఆకులు) ద్వారా నయం చేస్తాం. మాకున్న కొద్దిపాటి ఆవరణలోనే ఎన్నో రకాల ఔషద మొక్కల ను పెంచుతున్నాం. సేకరించిన వాటిల్లో చాలావరకు బట్టీల ద్వారా ఆవిరి రూపంలో కషాయం (లిక్విడ్‌) తీస్తాం. అందులో తెల్లమద్ది, వాకుడు, ఉత్త రేణి, తామెరతీగ, పాషానంబేది, కొండపిండి ఆకు, నేల ఉసిరి, బొమ్మల మర్రి, నల్ల ఉమ్మెత్త, తెల్ల చిత్రమూలం, ఎర్ర ఉల్లి, ముల్ల గోరింక, నిమ్మగడ్డి అంజీరా, జీరా, నేలతాడి, పారీజాత, తిప్పతీగ, అడవినాబి, అడ్డసారా, మామిడి అల్లం, తెల్లగన్నేరు ఇలా వందలాది అడవి వన మూలికలతో పొడులు, లేహ్యాలు, ఔషదగుళికలు తయారు చేసి వ్యాధులను నయం చేస్తుంటాం.ఎందరో మేధావుల సందర్శన...

భద్రాచలం మన్నెంలో ప్రకృతి వైద్యంతో పలు దీర్ఘకాలిక రోగాలను ఎలా నయం చేస్తున్నారో తెలుసుకోవాలని, ఎందరో మేధావులు, విద్యావేత్తలు, విదేశాల నుంచి సైతం ప్రొఫెసర్లు వచ్చి ఇక్కడి వైద్య విధానాన్ని తెలుసుకొని వెళ్లారు. డబ్బు ప్రధానంగా ఈ వృత్తిని ఎంచుకోకుండా, జమాల్‌ఖాన్‌ చేసే వైద్య సేవలు పలువురు కొనియాడారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వనమూలికల సేకరణ చాలా కష్టమైన విషయమని, దానిని ఇంతకాలంగా కొనసాగిస్తూ ఉండటం నిజంగా ప్రశంసనీయమని పలువురు వైద్యులు కొనియాడారు.

ఎన్నో రోజులుగా రాని మార్పు గమనించాను...: కోటగిరి మురళి, ఉద్యోగి, హైదరాబాద్‌

నేను చాలా కాలంగా వెరికోస్‌వెయిన్స్‌ (చీలమండ వద్ద పుండు) అనే వ్యాధితో బాధపడు తున్నా, ఎన్నో రకాల వైద్య చికిత్స ద్వారా రాని మార్పు నాకు ఈ వైద్య విధానం ద్వారా వచ్చింది. గత సెప్టెంబర్‌ 16 న ఒక న్యూస్‌ ఛానల్‌ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. జమాల్‌ఖాన్‌ చేసే వైద్యం, ఆయన రోగులతో మెలిగే తీరు నాకు ఎంతగానో నచ్చింది. అందుకే కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండి వైద్యం చేయించుకోవడానికి వచ్చాను. నాకు పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం వుంది.

జన్మజన్మలకు ఋణపడి ఉంటా...: వాసం నాగేశ్వరరావు, నర్సిపట్నం

నాకు లివర్‌ దెబ్బతిన్నది. గ్యాస్‌ట్రబుల్‌ వల్ల హెచ్‌.బి.ఎస్‌ పాజిటివ్‌ అనే వ్యాధితో ఇక్కడికి వచ్చాను. లివర్‌పై ఉండే పొర పూర్తిగా చెడిపోయిందని, ఇక బ్రతకడం కష్టమని, చాలామంది చెప్పారు. కానీ, ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకున్న తర్వాత, అంతకు ముందు ఉన్న రేచీకటి కూడా పోయింది. ఇప్పుడు నాకు కళ్లు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. జన్మజన్మలకు డాక్టర్‌గారికి రుణపడి ఉంటాను.

మాకు జమాల్‌ ఖానే దేవుడు...: మడివి విజయ్‌, స్థానికుడు

వారం రోజుల కిందట నన్ను కట్లపాము కరి చింది. అదే వేరేచోట అయితే నేను చచ్చిపోయేవాడినే. కానీ మా ప్రాంతం వాళ్లకు పాముకాటు భయం లేదు. ఎందుకంటే మాకు దేవుడు లాంటి జమాల్‌ఖాన్‌ ఉన్నాడు.

జమాల్‌ లేకుంటే అవిటిదాన్న య్యేదాన్ని...: సిద్దోజి పద్మ, చల్లగరిగ గ్రామం, వరంగల్‌ జిల్లా

బోన్‌ క్యాన్సర్‌తో నా కుడికాలి మడమపై పుండు వచ్చింది. హన్మకొండలోని అమృత హాస్పటల్‌కి కూడా వెళ్లి చూపించుకున్నా. నిమ్స్‌ కూడా వెళ్లి చూపిస్తే మోకాలు వరకు తీసేయాలని చెప్పారు. ఇక్కడి రాకుంటే నా కాలు కోల్పోయేదాన్ని. 20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇప్పటివరకు సుమారు 70 శాతం నాకు ఆరోగ్యం కుదుటపడింది. పూర్తిగా నయమవుతుందనే విశ్వాసం ఉంది. ఈ ఆవరణ, మొక్కలతో ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంది.

జమాల్‌గారివద్ద పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం: ముఖ్య సహయకుడు, ఎస్‌కె.సుభానీ

జమాల్‌ఖాన్‌తో నాకు బంధుత్వం ఉంది. బావగా నాకు చుట్టమే అయినా, ఆయన నాకు గురువుతో సమానం. ఆయన తో కలిసి వైద్య సేవల్లో పాలుపంచుకోవడం నా పూర్మజన్మ సుకృతం. ఎంత నేర్చుకున్నా ఇంకా ఆయన దగ్గర మిగిలే ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఆయనకు ఎన్ని రకాల పనులున్నా... వైద్యా న్ని, వైద్యసేవలను ఎంతో గౌరవంగా భావి స్తారు. అది నాకు, మా సహాయకులందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రతి మనిషి ఏదో ఒకరోజు చిరాకు పడటం, అశ్రద్ధగా ఉండడం మనం చూస్తుంటాం... కాని మా జమాల్‌ఖాన్‌ గారిలో అది మేం ఇంతవరకు చూడలేదు.

ఇక్కడికి వచ్చే రోగుల్ని చూస్తే... మనసు చలిస్తుంది...: - రమణ, కాంపౌండర్‌

జమాల్‌ఖాన్‌గారితో 15 సంలుగా ఉంటున్నా. ఎన్నో వేలమంది రోగులకు సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కోసారి... బాగా రోగం ముదిరిన తర్వాత వచ్చే రోగులను, వారు పడే బాధలు చూస్తే మనసు చలిస్తుంది, రోగం ముదరక ముందే ఇక్కడికి వస్తే త్వరగా నయం చేస్తాం. కాబట్టి బాగుపడ్డ రోగులు ఇతరులకు చెప్పి, వారి వంతు సహకారాన్ని అందిస్తే... ఈ వైద్యానికి ఇంకా మంచి గుర్తింపు వస్తుంది.

ఆయన సేవల్లో పాలుపంచుకోవడం మా అదృష్టం: సహాయకులు... సోయం ముత్తమ్మ, సోడే రాములమ్మ, సోడే అచ్చమ్మ, సోడే లక్ష్మి (విద్యార్థిని)

మా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రతి బుధవారం గిరిజనులు సంతకు వచ్చేటప్పుడు, జమాల్‌ఖాన్‌గారు చెప్పినటువంటి వేర్లు, బెరడులు, చెట్లు, ఆకులు తీసుకొస్తారు. వారు తెచ్చిన వాటిని మేం శుభ్రపరుస్తాం. ఎన్నో యేళ్లుగా ఈ పనిలో ఉన్నాం. డాక్టర్‌ గారు చెప్పినట్లు ఆవిరితీయడం, ఔషధ గుళికలు తయారు చేయడం, లేహ్యాలు తయారు చేయడం చేస్తుంటాం. డాక్టర్‌ గారు రోగులకు ఉచితంగా వైద్యం చేస్తున్నప్పటికీ మాకు మాత్రం కూలీ ఇస్తుంటారు. ఆయన చేసే వైద్యంలో మా వంతు సేవ చేస్తూ, ఆయన వెంట ఉండటం పరమానందంగా ఉంటుంది.

వైద్య సదుపాయాలు ఎన్ని ఉన్నా...:మన్నెంలో వనమూలికా వైద్యానికే పెద్దపీట

మన్నెంలో వనమూలికా వైద్యం చేస్తున్న జమాల్‌ఖాన్‌ వైద్యశాలకు 3 కిలోమీటర్ల దూరంలోని చింతూరు మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాల, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా (100 పడకల) హస్పటల్‌ లు అన్నిరకాల అల్లోపతి చికిత్సలు అందిస్తున్నప్పటికీ, నిమ్మలగూడెంలో యం.డి జమాల్‌ఖాన్‌ చేస్తున్న వనమూలికా వైద్యానికే రోగులు, వారి బందువులు పెద్ద పీట వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐటిడిఎ సంస్థద్వారా నిత్యం ఈ పరిసర ప్రాంతాల గిరిజన, గిరిజనేతరులను అనునిత్యం అభివృద్ది పరుస్తూ, అన్ని రకాల వైద్యసేవలను వారి వారి ముంగిటకు తెచ్చినా, వనమూలికా వైద్యమే ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాల వారందరికి శ్రీరామరక్ష. ఈయన చేసే వైద్యంతో పాటు, పలకరింపు, రోగులతో ఈయన ఉండే వ్యవహర శైలి ప్రతిఒక్కరికి హత్తుకునే విధంగా ఉండడమే దీనికి కారణమని స్థానికులంటారు. హస్తవాసి, వంశపారంపర్య వైద్య విధానముతో జమాల్‌ఖాన్‌ చేసే విన్నూతన ప్రయోగాలతో (జలగలతో చికిత్స) చేస్తున్న వైద్యం కూడా మంచి ఫలితాలను ఇవ్వడం, ఇక్కడకి వచ్చే రోగులకు ఎంతో త్వరగా నయం అవ్వడమే జమాల్‌ఖాన్‌ వైద్య రహస్యమని, పలువురు స్వస్థత చేకూరిన వ్యక్తులు చెప్పడం గమనార్హం.

- మల్లేల సత్యనారాయణ, భద్రాచలం


అమెరికన్ల ఆహారం - విశ్లేషణ

వాళ్లది'బ్రెడ్డూ కాదు ఫుడ్డూ కాదు'

అమెరికాలో జనం ఏం తింటారు? ఏం వండుకుంటారు? ఏయే పంటలు పండిస్తారు...?
ఆ విషయాలన్నీ మనకెందుకు అంటా వాటి గురించి నేను ఆలోచించటమే కాక మిమ్మల్ని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి మీ బుర్రలెందుకు చెడగొట్టాలి అంటారా? ఎందుకంటే, రాబోయే పది, ఇరవై సంవత్సరాల్లో మన భారతదేశం కూడా అమెరికాలాగే తయారవ్వబోతోంది కాబట్టి! మనమందరం కూడా అమెరికన్ల ఆహారపు అలవాట్లను అలవర్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి. అందుకే మనం అమెరికా ఆహారం, దాని పూర్వాపరాల గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిదిఅంటున్నారు ఉమాశంకరి. చిత్తూరు జిల్లాలోని వెంకట్రామాపురంలో రైతుమహిళగాను, ఆహార వ్యవసాయ అంశాల మీద కార్యకర్తగానూ పని చేస్తున్నారామె. ఆమె చెప్పిన విశేషాలే....

ఈ రోజుల్లో ఏం వండుకుందాం, ఏం తిందాం అన్నది మన ఇండ్లలో సైతం అంత తేలికైన విషయం కాదు. మనం రోజూ తినే తిండిలో అన్నం, పప్పు, కూర, పెరుగు వంటివి మాత్రమే ఉండకపోవచ్చు. నార్త్ ఇండియన్ తందూరీ రోటీలు ఉండొచ్చు, బర్గర్‌లు, పిజ్జాలు, నూడుల్స్ ఉండొచ్చు. లేదా మనకు నోరు తిరగని మరేవో విదేశీ వంటకాలు కూడా ఉండొచ్చు. వీటన్నిటినీ ఇప్పుడు పట్టణాలలో పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న అనేకానేక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. వెరైటీగా, ఫ్యాషన్‌గా ఉండాలని ఈ రకమైన విదేశీ వంటల్ని పెళ్లిళ్లలో, పార్టీల్లో సైతం వడ్డించడం ఇప్పుడు పరిపాటైంది. మిగతా ప్రపంచంలో ఫాస్ట్‌ఫుడ్ మార్కెట్ ఏటా 5 శాతం వృద్ధి చెందుతుంటే మనదేశంలో అది దాదాపు 40 శాతం పెరుగుతుండడం గమనార్హం.

పాశ్చాత్యుల నుంచి, అమెరికన్ల నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి-వాళ్లు పని పట్ల చూపే శ్రద్ధ, శారీరక శ్రమ పట్ల గౌరవం, సాహసాల పట్ల ఆసక్తి మొదలైనవి. కాని ఒక రైతుగా నేను అనుకునేదేంటంటే ఆహార వ్యవసాయ రంగాల్లో గుడ్డిగా పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే అవుతుంది. అందుకే పాశ్చాత్యుల ఆహార, వ్యవసాయ పద్ధతులను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందు అసలు మనుషులు ఏం తింటారు, వారి ఆహార అవసరాలేంటి అనే విషయాలు చూద్దాం.

మానవపరిణామ సిద్దాంతం ప్రకారం మనషులు శాకాహారులు. తర్వాత తర్వాత ఇటు మొక్కలను అటు జంతువులను కూడా తినడం నేర్చుకున్నాం. అంతే కాదు.. వండడం, ఆ వంటలను రుచిగాను సునాయాసంగానూ అరిగేలా చేసుకోవడం నేర్చుకున్నాం. జంతువుల మాదిరిగా ఆకలి తీర్చుకోవడానికే కాకుండా బుద్ధిపూర్వకంగా, అనుభవ పూర్వకంగా ఏం తినాలి, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోగలిగాము. ఏం తినాలి, ఎలా తయారు చేసుకోవాలనే విషయపరిజ్ఞానమే మనకు పాకశాస్త్రాన్ని అందించింది. అంతే కాదు ఆహార సంబంధిత మరో జ్ఞానం వ్యవసాయ శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది. పాత వ్యవసాయ పద్ధతుల్లో ప్రకృతి నుంచి తీసుకోవటం మళ్లీ ప్రకృతిలో కలిపేయటం అనేది ఒక ముఖ్య అంశం. దీని వల్ల'చెత్త'లేదా'పనికిరాని గడ్డి, గాదం, మిగులు'అనే ప్రశ్నే రాదు. అవన్నీ కూడా వ్యవసాయంలో విలువైన పెట్టుబడి వస్తువులయ్యాయి.

సాంప్రదాయ వ్యవసాయ శాస్త్త్రం శతాబ్దాల అనుభవ ప్రయోగాల ఆధారిత విద్య, జ్ఞానం. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇట్లాంటి విద్యని'అశాస్త్రీయం'అని, వ్యవసాయ పని నైపుణ్యం లేని అసాంకేతిక పని అని భావించడం జరుగుతున్నది. అట్లాగే వంట, ఆహార పద్ధతులు కూడా ఈ రకమైన అనుభవ ప్రయోగాధారిత విద్య, జ్ఞానాలే. దీన్ని చిన్నచిన్న మార్పులతో కుటుంబాల అవసరాన్ని బట్టి, సామాజిక సంప్రదాయాల్ని బట్టి, పండుగల్ని బట్టి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలను బట్టి... తమకు చాలా ఇష్టమైన పనిగా మలుచుకున్నారు. ప్రతి సమాజం తమతమ అవసరాలను బట్టి అందుబాటులో ఉండే తిండిని అనేక రకాలుగా తీసుకుంటోంది. రోజూ తినాల్సినవి, పండగ రోజుల్లో తినాల్సినవి, జబ్బు పడ్డప్పుడు తినాల్సినవి, గర్భవతులు తినాల్సినవి, పిల్లలు తినాల్సినవి, ఉపవాసాలు, ప్రయాణాలప్పుడు తినాల్సినవి... అలాగే ఆకులు, కాయలు, పండ్లు, చివరికి చెట్టు కాండం, వేర్లు కూడా ఉపయోగించడం, వైద్యానికి వాడుకోవడం అంతా కూడా ఒక పారంపర్య జ్ఞాన సముపార్జన. ఎవరూ నేర్పకుండానే కొత్త తరాలు పాత తరాల నుండి వీటిని గ్రహిస్తాయి. భారతదేశంలో ఇప్పుడున్న జ్ఞానం జిల్లా జిల్లాది. గ్రామ గ్రామానిది. అది ఒక అలిఖిత భాండాగారం.

ఈ పరిస్థితి పారిశ్రామికీకరణ అనంతరం మారుతూ వస్తున్నది. సాధారణంగా ప్రజలు స్థానికంగా దొరికే వాటిని వండుకుని తినేవారు. మాంసాన్ని చాలా తక్కువగా తినేవాళ్లు. ఎక్కువ భాగం శాకాహారమే తినేవారు. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఇదే రకమైన ఆహార అలవాట్లు ఉండేవి. కానీ ఈ మధ్య మాంసం, తీపి పదార్ధాలు తినడం పెరిగిపోయింది.

మిగిలేది పదిశాతమే...

మాంసం కోసం మనం పెంచే జంతువులకు ఆహారం రూపంలో మనం ఇస్తున్న పోషకాలలో 90 శాతం ఆయా జంతువుల శారీరక అవసరాలకి, ఎముకలకు, చర్మానికి, ఇతరత్రా మనకు ఉపయోగం లేని వాటికే పోతోంది. మిగిలిన 10 శాతం మాత్రమే మనకు మాంసంగా లభ్యమవుతుంది. కాని మొక్కలు సూర్యుని నుండి, ప్రకృతి నుండి శక్తిని గ్రహించి ఆ శక్తిని పోషకాల రూపంలో మనకి నేరుగా అందిస్తాయి. ప్రధానంగా మాంసం తినడమనేది ఒక హంగు ఆర్భాటం. ధనికులకు మాత్రమే సాధ్యమైనది. సమాజం అభివృద్ధి చెందుతున్నకొద్దీ జనం ఎక్కువగా మాంసాహారం, తీపి పదార్ధాలు తింటున్నారు. పెరుగుతున్న మాంసాహారఅవసరాలకు సరిపడా ఆయా జంతువులను, పక్షులను పెంచడానికి మళ్లీ అంత మొత్తంలో మొక్కలను, పంటలను పెంచాల్సిన అవసరం ఏర్పడుతున్నది. మన శాకాహార, మాంసాహార అవసరాలకు, జంతువుల శాకాహార మాంసాహార అవసరాలకు కలిపి మనం పంటలని పండించాల్సిన, జంతువుల్ని పెంచాల్సిన అదనపు భారం భూమిపై పడుతున్నది.

విడగొట్టి...కలుపుతారు

మైఖెల్ పొలాన్ అనే అమెరికా పరిశీలకుడి మాటల్లో..."మన సమాజాలు ప్రస్తుతం రెండు జబ్బులతో బాధ పడుతున్నాయి. అవే నియోఫోబియా, నియోఫీలియా-మొదటిది కొత్త రకాలపై భయం, రెండోది కొత్తవాటిపై వ్యామోహం. అమెరికాలో ఈ పరిస్థితి మరింత దారుణం. ఎందుకంటే అమెరికాలో ఉన్న రకరకాల దేశస్తులు వారివారి ఆహార వ్యవసాయ పద్ధతులను తీసుకొచ్చి అక్కడి స్థానిక పద్ధతులను తుడిచిపెట్టడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైపోయింది. అందుకే ప్రస్తుతం అమెరికాలో మెక్సికన్, ఐరిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, ఇథియోపియన్, ఆఫ్రికన్, చైనీస్, జపనీస్, థాయ్...కాక ఈ మధ్య కాలంలో వచ్చి చేరిన ఇండియన్ వంటలు, హోటళ్లు కనపడతాయి.''

అమెరికన్ సూపర్ మార్కెట్లలో రకరకాల ఆహార పదార్ధాలే కాదు, వాటితో పాటు పోషక విలువల, క్యాలరీల పట్టికలు కూడా కనబడతాయి. కొవ్వు పదార్ధాలు, ట్రాన్స్ ఫ్యాట్స్, పిండిపదార్ధాలు, ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు, యాంటి-ఆక్సిడెంట్లు, షుగర్ ఫ్రీ, కెఫిన్ ఫ్రీ, ఫ్యాట్ ఫ్రీ... చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టులుంటాయి. ఆ దేశంలో మొదటగా ఆహార పదార్థాలను విడగొట్టి మళ్లీ వాటిని రకరకాల కాంబినేషన్లలో చేర్చి, కూర్చుతారు. వాటికి రంగుల్ని, కృత్రిమ రసాయనాల్ని, విటమిన్లని, పోషకాలని కూడా చేర్చడం జరుగుతుంది. ఇవన్నీ వింటుంటే తల తిరిగిపోవట్లేదూ?"ఈ విడగొట్టడం మళ్లీ కూర్చడం అనే ప్రక్రియలో అమెరికన్లు అసలైన ఆహారాన్ని మర్చిపోతున్నారు, ఆహారం లాంటి వస్తువులను తింటున్నార''ని మైఖెల్ పొలాన్ అంటున్నారు. పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా? ఇంకొంచెం తరచి చూస్తే కాని ప్రస్తుత అమెరికన్ల ఆహార, వ్యవసాయ పద్దతులు అర్థం కావు.

ఆరుసార్లు తింటారు

ఏం తింటారో చూసేముందు ఎలా తింటారో కూడా చూద్దాం. అమెరికన్లు అసలు ఇంట్లో వంట చేయటమనేదే తక్కువ. వాళ్లు తినే ఆహారమంతా కూడా ముందే వండి, తినటానికి సిద్ధంగా ఉండేదే. సూపర్ మార్కెట్ల నుంచి ప్యాకెట్లలో దొరికే ఆహారం తెచ్చుకొని, ఫ్రిజ్‌లో పెట్టుకొని, తినేముందు మైక్రోవేవ్ ఒవెన్లో వేడి చేసుకుని తినటమే వాళ్లు చేసే పని. చాలా సందర్భాల్లో అక్కడి ప్రజలు ఒంటరిగానే తింటారు. అప్పుడప్పుడూ కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసినా ఒకే ఆహారం మాత్రం తీసుకోరు. నాన్న కొవ్వు తక్కువుండే ఒమేగా 3 ఎక్కువ ఉండేవి తింటే అమ్మేమో సలాడ్ తింటుంది. పిల్లల్లో ఒకరు తక్కువ క్యాలరీలున్న చేపలు తింటే ఇంకొకరు ఎక్కువ కొవ్వు ఉన్న చికెన్ ఫ్రై తింటారు. ఇలా ఎవరి ఆహారం వారిదే.

ఈ తినడం కూడా ఎక్కువ భాగం కార్లలోనే జరుగుతుంది. అందుకే కప్పులు, ట్రేలు, బాటిల్స్ పెట్టుకొనడానికి వీలుగా కార్లు తయారు చేస్తారు. కార్లలో ఆహారం నిలవ ఉంచుకోవడానికి చిన్న ఫ్రిజ్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికాలో కారు నడుపుతూ తింటూ తాగుతూ కనబడే వాళ్లెంత మందో! ఒకసారి నేను ఒకాయన కారు నడుపుతూ మామిడిపండు తినడం చూశాను. ఆఫీసుల్లో కూడా ఎప్పుడూ చిరుతిళ్లు తింటుంటారు వాళ్లు. పొలాన్ మాటల్లో అయితే సగటు అమెరికన్లు రోజుకు ఆరు సార్లు తింటారు. మూడు ఫుల్ మీల్స్, రెండు మూడు ఫలహారాలు. సూపర్ మార్కెట్ల నిండా తిండి పొంగి పొర్లుతూ కనిపిస్తుంది. కప్పులు, గ్లాసులు అన్నీ సూపర్ సైజుల్లో కనిసిస్తుంటే స్థూలకాయం మహమ్మారిలా వ్యాపించడంలో ఆశ్చర్యమేముంది?

కార్న్ అండ్ కార్ కంట్రీ

అమెరికాని'కార్న్ అండ్ కార్ కంట్రీ'అంటారు. ఎందుకంటే ఆ దేశంలో కార్లెంత ఎక్కువో మొక్కజొన్న పంట కూడా అంతే ఎక్కువగా పండిస్తారు. వాళ్ల ప్రధాన పంట మొక్కజొన్నే. అందుకే వాళ్లు మొక్కజొన్నను ఎక్కువగా తింటారు. వాళ్ళు తినే బ్రెడ్డులో ఎక్కువ శాతం గోధుమే ఉంటుంది. మరి ఈ మొక్కజొన్నను ఏ రూపంలో తింటున్నారు? మాంసం ద్వారా. ఆశ్చర్యంగా ఉన్నా నిజం అదే.
అమెరికా ఏటా 10 బిలియన్ల మొక్కజొన్న బుషల్స్ ( 25 కేజీ సంచి)ను పండిస్తుంది. ఇందులో 70 శాతం పశువులకి, కోళ్ళకి, చేపలకి ఆహారంగా వాడతారు. మిగతా దాంతో అనేక ఉత్పత్తులు తయారవుతాయి. మొక్కజొన్నల్లోని పసుపు పచ్చని పై పొరతో విటమిన్లు, పోషక మందులు, వంటనూనె, సిట్రిక్ ఆసిడ్, లాక్టిక్ ఆసిడ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, హెచ్ఎఫ్‌సిఎస్ (హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్) తయారు చేస్తారు. 19 శాతం మొక్కజొన్న వీటి తయారీకే వెళ్తుంది. వీటన్నిటినీ చాలారకాల అమెరికన్ వంటల్లో వాడతారు. అందుకే ఒక అమెరికన్ బయాలజిస్టు"ఉత్తర అమెరికా వాళ్ళందరం మొక్కజొన్నకి కాళ్ళు మొలిచినట్టు ఉండే మనుషులం''అని అంటారు. ఈ మధ్య మొక్కజొన్న నుండి కార్లకు ఇంధనం కూడా తయారుచేస్తున్నారు. ఇలా ఇంధనంగా మారుతున్న మొక్కజొన్న 330 మిలియన్ల జనాభాకు ఒక సంవత్సరం పాటు ఆహారంగా ఉపయోగించవచ్చునని ఎర్త్ పాలసీ డైరెక్టర్ లెస్పర్ బ్రౌన్ అన్నారు.

మొక్కజొన్న తరువాత ముఖ్యమైన పంట సోయాబీన్. అక్కడ సంవత్సరానికి 2.8 బిలియన్ బుషల్స్ సోయాబీన్ పండుతుంది. దీన్నుండి వంటనూనె, సోయా పిండితో చేసిన సోయామీల్ తయారవుతాయి. ఆ దేశంలో వాడే వంటనూనెలో 80 శాతం సోయానూనే. ఈ నూనెను పారిశ్రామిక అవసరాలకు వాడతారుకూడా. పశువుల దాణాలో కూడా సోయా పిండిని (మీల్) వాడతారు. అందుకే మొక్కజొన్న, సోయాలను నేరుగా తినకపోయినా మాంసం, నూనె, మిగతా ఆహార పదార్థాల (ప్రాసెస్డ్ ఫుడ్) ద్వారా తింటూ ఉంటారు వాళ్లు.

రసాయనాలు మింగితే పోలా!

ప్రతి దానిపైన పోషక విలువల పట్టిక ఉంటుందని ముందే చెప్పాను కదా! ఉదాహరణకు బ్రెడ్ తీసుకుందాం. మామూలుగా బ్రెడ్ తయారీకి ఏమి కావాలి? పిండి, ఈస్ట్, నీరు, చిటికెడు ఉప్పు. కాని ఇప్పుడు అమెరికాలో దొరికే బ్రెడ్డులో ఏమేమి ఉంటాయో మైఖెల్ పొలాన్ మాటల్లో చూద్దాం...'సారా లీస్'అనే పేరుతో మార్కెట్లో లభ్యమయ్యే'సాఫ్ట్ అండ్ స్మూత్ హోల్‌గ్రెయిన్ వైట్ బ్రెడ్'లో ఉండే పదార్థాల పట్టిక ఈ విధంగా ఉంటుంది.

పోషకాలతో కూర్చిన, బ్లీచ్ చేసిన గోధుమ లేదా బార్లీ పిండి, నియాసిన్, ఇనుము, లియామిన్, మోనో నైట్రేట్, రిబోఫ్లోవిన్, ఫోలిక్ యాసిడ్, నీరు, గోధుమ, వరిపిండి, హెచ్ఎఫ్‌సిఎస్, పాలు విరగ్గొట్టి అందులోంచి తెల్లపదార్థాన్ని తీసేస్తే వచ్చే నీరు, గోధుమ బంక, ఈస్ట్, సెల్యులోజ్-ఇన్ని ఉంటాయి. ఇవేకాక కొంత మోతాదులో తేనె, కాల్షియం సల్ఫేట్, సోయా, పత్తిగింజనూనె, ఉప్పు, వెన్న, మోనో, డై గ్లిసరైడ్స్, ఆస్కార్బిక్ ఆసిడ్, ఎంజైమ్స్, ఆజో డైకార్బినమైడ్, గౌర్‌గమ్, కాల్షియమ్ ప్రొపైనేట్, తొమ్మిది రకాల ప్రిజర్వేటివ్స్, డిస్పిల్డ్ వినెగర్, ఈస్ట్ న్యూట్రియంట్స్ అయిన మోనో కాల్షియమ్ ఫాస్పేట్, కాల్షియమ్ సల్ఫేట్, కార్న్ స్టార్చ్, రంగుకోసం బీటా కారోటిన్, విటమిన్ డి 3, సోయా లెసిథిన్, సోయాపిండి. ఎన్నున్నాయో చూడండి.
అందుకే"సారీ, సారా లీ గారూ. మీరు తయారుచేసేది బ్రెడ్డూ కాదు ఫుడ్డూ కాద''ని పొలీన్ అంటారు.

పోషకాలే విషపదార్ధాలైతే...

ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా తీసుకునే బ్రేక్ ఫాస్ట్'ప్యాకేజ్డ్ సిరీల్స్'తో పాటు పాలు. ఈ మధ్య కాలంలో ఇవి తినడం ఫ్యాషనైపోయింది. అందుకే వాటి గురించి తెలుసుకుందాం.
సిరీల్ పేరుతో డబ్బాల్లో లభ్యమయ్యే ఆహార పదార్థాలను'ఎక్స్‌ట్రూజన్'అనే పద్ధతిలో తయారుచేస్తారు. ఈ పద్ధతిలో ధాన్యాన్ని అత్యధిక వేడికి, ఒత్తిడికి గురిచేస్తారు. తర్వాత వాటిని రకరకాల సైజుల్లో కత్తిరిస్తారు, కొన్ని పేలాల్లా ఉబ్బి ఉంటే కొన్ని నూనె పంచదార అద్దబడి ఉంటాయి. కొన్ని కరకరలాడే అటుకుల్లా ఉంటాయి. పాలల్లో వేసినా మెత్తబడక కరకరలాడడం వీటి ప్రత్యేకత. పాల్ స్పిట్ అనే ప్రఖ్యాతి గాంచిన పోషక శాస్త్రజ్ఞుడు ఈ పద్ధతిని నిశితంగా విమర్శిస్తూ చెప్పేదేమిటంటే... అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడిల మూలాన ధాన్యంలో ఉండే పోషకాలన్నీ నశిస్తాయి. అంతేకాక వాటిలోని ప్రొటీన్లు విషపదార్థంగా మారుతాయి. అయినా ఇట్లాంటి సిరీల్స్‌నే అమెరికన్లు ప్రతి ఉదయం పనిగట్టుకుని తింటారు. హెల్త్‌ఫుడ్ స్టోర్స్‌లో దొరికే సిరీల్స్ కూడా ఇలాంటివే అని న్యూట్రిషన్ జర్నలిస్ట్ శాలీ ఫాలోన్ చెపుతున్నారు.

ఆ పాలవల్ల గుండెజబ్బులొస్తున్నాయట

పాలు మంచి పౌష్టికాహారమే. అయితే ఆ పాలని అనేక రకాలుగా ప్రాసెసింగ్ చేస్తారక్కడ. మొదటగా'సెంట్రిఫ్యూజ్'అనే పద్ధతిలో పాలలోని ప్రొటీన్‌ను, కొవ్వును, నీటిని వేరు చేస్తారు. కొవ్వును ఐస్‌క్రీం కంపెనీలకు అమ్మి, మిగిలిన దాంట్లో పాలపొడిని కలిపి దానిని'పాశ్చురైజేషన్'చేస్తారు. అంటే ఎక్కువ వేడి, వెంటనే బాగా చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా అందులోని, సూక్ష్మజీవులను చంపేయడమనే ప్రక్రియ.

ఇక్కడ మనం'పాలపొడి'ని వాళ్లు ఎలా తయారుచేస్తారో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తాగే పాకెట్ పాలన్నీ కూడా పాలపొడితో కూడినవే. ఎక్కువ వత్తిడితో ఒక చిన్న రంధ్రం లోంచి పాలను గాలిలోకి పిచికారీ చేయడం ద్వారా పాలపొడి తయారవుతుంది. అయితే ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోని నైట్రేట్స్‌ను కలుపుకుని ఆక్సిడైజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ శరీరానికి మంచిదే కాని ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇంకా తొందరగా మూసేస్తుందని, గుండె జబ్బులకి, రక్తనాళాల జబ్బులకు కారణమౌతుందని శాలీ ఫాలోన్ చెప్తున్నారు. తక్కువ కొవ్వుండే పాలు గుండె జబ్బులకు మంచిదని వాటిని వాడుతుంటే నిజానికి వాటివల్లే గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయని పరిశోధనలు చెపుతున్నాయి.

చికెన్‌లో కూడా అంతే...

'మాక్ డొనాల్డ్స్'కంపెనీ నడిపే హోటల్స్‌లో మాక్ నగ్గెట్స్ అనే చికెన్ వడ్డిస్తారు. ఇందులో ఏమేమి ఉంటాయో మైఖెల్ పొలాన్ చెపుతున్నారు..."మాక్ నగ్గెట్‌లో మొక్కజొన్న నుంచి సేకరించిన 13 రకాల పదార్థాలుంటాయి. మొక్కజొన్నని తిన్న కోళుతో సహా మోడిఫైడ్ కార్న్ స్టార్చ్‌ను రుబ్బిన కోడి మాంసాన్ని వాడతారు. మోనో, ట్రై-డై గ్లిసరైడ్ లను కొవ్వును నీటిని కలవకుండా ఉంచడానికి, చికెన్ బ్రాత్ అంటే చికెన్‌ను ఉడకబెట్టిన నీటిని సువాసన కోసం ఉంచుతారు. పసుపురంగు మొక్కజొన్న పిండిని మొక్కజొన్న నూనెతో చేసిన వనస్పతి కూడా కలుపుతారు. మాంసం నిలువ ఉంచడానికి సిట్రిక్ ఆమ్లాన్ని కలుపుతారు. ఇవికాక డెక్స్‌ట్రోస్, లెసిథిన్, మరికొన్ని రసాయనాలు కూడా కలుపుతారు.

కొన్ని రసాయనాలు చికెన్‌ను కొన్ని నెలల పాటు కుళ్ళకుండా, చెడిపోకుండా ఉంచుతాయి. అవి సోడియం అల్యూమినియమ్ ఫాస్ఫేట్, మోనో కాల్షియమ్ ఫాస్ఫేట్, సోడియమ్ యాసిడ్ పైరో ఫాస్పేట్, కాల్షియమ్ లాక్టేట్. చికెన్ ముక్కలపై నురుగు రాకుండా ఉంచడానికి'యాంటి ఫోమింగ్ ఏజెంట్స్'అయిన డి మిథైల్ పాలిసైలాక్సిన్‌ను వంటనూనెలో కలిపి వాడతారు. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని, శరీరంలో ట్యూమర్లకు దారితీస్తుందని, పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుందని గుర్తించారు కూడా. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన టెర్షియరీ బ్యుటైల్ హైడ్రో క్వినైన్ (టిబిహెచ్ఆర్)అనే యాంటీ ఆక్సిడెంట్ ను కూడా వాడతారు దీన్లో. దీన్ని పెట్రోలియం నుంచి ఉత్పత్తి చేస్తారు. దీన్ని నగ్గెట్ పైన చల్లడం వల్ల చికెన్'ఫ్రెష్'గా ఉంటుంది. చాలా తక్కువ మోతాదులో వాడతారు కాని అయినా ఒక గ్రాము టిబిహెచ్ఆర్ తీసుకోవడం వల్ల వాంతులు, చెవుల్లో హోరు, మైకం, గాబరా, కళ్ళు తిరగడం, పడిపోవడం లాంటివి జరుగుతాయి. ఐదు గ్రాముల టిబిహెచ్ఆర్‌తో ఒక మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇదంతా తెలుసుకున్న తరువాత కూడా చికెన్ నగ్గెట్ ఎలా తింటాం?

అమెరికన్ సూపర్ మార్కెట్లలో రకరకాల పండ్ల రసాలు లభిస్తాయి. క్యారెట్, క్యాబేజీ, స్ట్రాబెర్రీ, బత్తాయి, నిమ్మ, కొబ్బరి నీళ్లు వాటిలో కొన్ని. బత్తాయి పండ్ల రసం కూడా స్వచ్ఛమైంది కాదని తేలుతోంది. బత్తాయి పంటపై అధిక మోతాదులో పురుగుమందులను పిచికారి చేస్తారు. రసం తీసేటప్పుడు వాటిని తోలుతో సహా పెద్దపెద్ద మెషీన్లలో పిండుతారు కాబట్టి పురుగు మందుల సారం కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. రసం చెడిపోకుండా ఉండడం కోసం వేడి చేసి అందులో యాసిడ్‌ని కలిపి చిక్కదనం తీసుకురావడానికి సోయా ప్రొటీన్‌ను, విటమిన్లు, మినరల్స్ కూడా చేర్చి... పాకెట్లు లేదా బాటిళ్ళలో నింపుతారు. ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ఇంత ప్రయాస అవసరమా? ఇంట్లోనే ఒకటో, రెండో ఆరెంజ్‌ల రసం తీసుకుంటే పోలా!

... అందుకే సేంద్రీయమే గతి

ఇవన్నీ తెలిశాక-ఈ మధ్య అమెరికాలో ఒక పెద్ద ఉద్యమం మొదలైంది. రసాయన మందుల్లేకుండా పండిన పంటలను, స్థానికంగా లభ్యమయ్యే వాటిని, అతిగా ప్రాసెసింగ్ కాని ఆహార పదార్థాలనే ఎక్కువమంది కోరుకుంటున్నారు. దాంతో సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారానికి డిమాండ్ పెరిగింది. అక్కడ రెండు రకాలుగా ఈ ఉద్యమం జరుగుతోంది. మొదటి గ్రూపు పెద్ద పెద్ద కంపెనీలు. వాళ్ళకి ఉన్న వేలాది ఎకరాల్లో కొంత భాగం మందుల్లేని సేద్యం చేసి, పెద్ద ట్రక్కుల్లో రవాణా చేస్తున్నారు. వీటిని వ్యతిరేకిస్తూ రెండవ గ్రూపు చిన్నచిన్న పొలాల్లో రసాయన మందుల్లేకుండా సేద్యం చేస్తూ దగ్గర్లో ఉన్న మార్కెట్లకు, చిన్నచిన్న అంగళ్లకు, హోటళ్లకు సరఫరా చేస్తోంది.
ఇదే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆశ. ఈ ఉద్యమం విస్తృతమవ్వాలని కోరుకుందాం.

వ్యాసకర్త ఇ-మెయిల్: umanarendranath@yahoo.co.in
మొబైల్: 99897 98493


విటమిన్‌'బి'తో నిరాశ దరిచేరదు

గుండెనొప్పికి గురైన వారు క్రమం తప్పకుండా విటమిన్‌'బి'టాబ్లెట్స్‌ వాడితే నిరాశ(డిప్రెషన్‌) ఛాయలు వారి దరిచేరే అవకాశం చాలా తక్కువుగా ఉంటుంది. అంతేకాకుండా మళ్లీ గుండెనొప్పి వచ్చే అవకాశాలు తక్కువుగా ఉన్నట్లు ఒక నూతన అధ్య యనంలో కనుగొ న్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా నేతృ త్వంలోని అంతర్జా తీయ పరిశోధకుల జట్టు ఈ విషయాన్ని స్పష్టంగా రుజువు చేయగలి గారు. డిప్రెషన్‌ నుంచి నిశ్చి తమైన కొన్ని విటమిన్లు మాత్రమే సంరక్షిస్తా యని గతంలో చేసిన పరి శోధనలు స్పష్టం చేస్తున్నాయి. గుండెపోటు నుంచి బయటపడి, ప్రతిరోజూ ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి 6, విటమి న్‌ బి 12 టాబ్లెట్లను తీసుకునే వారిలో సగం మందికి డిప్రెషన్‌కు గుర య్యే అవకాశము లేకపోలేదు.'గుండెపోటు వచ్చిన వారు డిప్రెషన్‌కు లోనవటం సర్వ సాధారణం.ముగ్గురిలో ఒకరు దీని బారిన పడ తారు.

మళ్లీ గుండెపోటు రాకుండా, డిప్రెషన్‌ దరిచేరకుండా ఉండేం దుకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని'పరిశోధకుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్‌ ఆస్వాల్డ్‌ అల్‌మిదా పేర్కొన్నారు. ఎక్కువ మోతాదులో విటమిన్‌'బి'తీసుకునే గుండె రక్తనాళాల వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిం చారు. ఎందుకంటే అధిక గాఢత గల అమినో యాసిడ్లు వల్ల డిప్రె షన్‌ పెరిగే అవకాశముంది. ఒక్కొక్కసారి విటమిన్‌'బి'ఎక్కువుగా తీసుకుంటే గుండె రక్తనాళాల సం బంధిత సమస్యలు వచ్చే అవకాశము ఉంది. ఈ విటమిన్‌ టాబ్లెట్లు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆరేళ్ల పాటు విటమిన్‌ టాబ్లెట్లు వాడితే రక్తనాళమయ వ్యవస్థలో క్రమేపి మార్పులు సంభవించే అవకాశాలున్నాయి.

యోగాతో నిగనిగ

యోగా గురించి కొత్తగా చెప్పేదేముంది..? ఆ కాలంలో ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో కానీ ఇటీవలి కాలంలో మాత్రం అందరూ యోగా వెంట పడుతున్నారు. ఆధునిక జీవనశైలిలో ఎదురవుతున్న ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగాకంటే పెద్ద ఔషధం లేదని విశ్వసించే వాళ్ల సంఖ్య రాను రాను పెరిగిపోతోంది.

ఇదే అభిప్రాయాన్ని మరింత శాస్త్రీయంగా రుజువుచేశారు ఉత్తరాఖండ్‌లోని ఐ.ఐ.టి. రూర్కీ పరిశోధకులు. యోగా చేస్తున్న వాళ్ల, యోగా చేయని వాళ్ల ఆరోగ్యాన్ని పరిశీలించారు. రెండు బృందాలలోని సభ్యుల గుండె పనితీరును అధ్యయనం చేశారు. పరిశోధనలో పాల్గొన్న వారందరికీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్స్ (ఈసీజీ) తీశారు.

దాన్నించి తెలిసిందేమిటంటే- క్రమం తప్పకుండా యోగా చేస్తున్న వారి హృదయ ప్రకంపనలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. శరీరంలోని రక్తనాళాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. గుండె కవాటాలలో కొవ్వు చేరలేదు. యోగా చేయని వారి గుండె...? దాని పనితీరు అసంబద్ధంగా ఉందని తేల్చారు.'ఆధునిక ఉద్యోగాల పనివేళలు కఠినంగా ఉండటంతో జీవనశైలి మారిపోయింది.

సమయంతో పోటీపడి పనిచేయక తప్పడంలేదు. దీంతో ఒత్తిడి పెరిగి గుండె ఆయుష్షు సన్నగిల్లుతోంది. అందుకే ప్రతి ఒక్కరు యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలిత'అని ఈ పరిశోధన చేసిన ఐ.ఐ.టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పరిశోధకులు రమేష్ కుమార్, వినోద్ కుమార్ చెప్పారు.

ఆధారము: ఆయురారోగ్యాలు

ఆల్కహాల్ - దుష్ప్రభావాలు

‘అంతా భ్రాంతియేనా'... అన్నది దేవదాసులోని పాట. అది దేవదాసులకు అక్షరాలా వర్తించే పాట అన్నది నిజం. మద్యం అలవాటున్న డోసుదాసులకు జీవితంలో వెలుగు ఉండదు. మద్యం తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందన్నది ఒక భ్రమ. పిల్లలకు ఒక స్పూన్ బ్రాందీ తాగిస్తే అజీర్తి ఉండదని, పరిమితంగా తాగితే గుండెకు మంచిదని ఒక అపోహ. వీటితో పాటు మద్యానికి అలవాటు పడి ఒక్కసారిగా మానేయాలనుకున్నా... కొన్ని సమస్యలు. శరీరంపై చీమలు పాకినట్లు, గోడలపై పాములు పాకినట్లు భ్రమలు. ఇలాంటి భ్రాంతులు, భ్రమలు తొలగించి,'జీవితాన వెలుగు ఎంతో ఉంద'ని చెప్పేందుకే ఈ కథనం...

అజయ్‌కి నలభై ఏళ్లు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. భార్య, ఇద్దరు పిల్లలు... ఫ్రెండ్స్‌తో మందు పార్టీలో అర్ధరాత్రి దాకా కూర్చున్నాడు. వాహనంపై ఇంటికి బయల్దేరాడు. తను సవ్యంగానే డ్రైవింగ్ చేస్తున్నట్టుగా అతనికి అనిపిస్తోంది. కాని అప్పటికే రోడ్డు మీద వచ్చీ పోయే వాహనాల వాళ్లు అజయ్‌ని సరిగ్గా డ్రైవ్ చేయమని హెచ్చరిస్తున్నారు. తను ఇంత బాగా డ్రైవ్ చేస్తుంటే వీళ్లు ఎందుకు అలా అంటున్నారో అనుకుంటూనే డ్రైవ్ చేస్తున్నాడు అజయ్. వాహనం కొంతదూరం ప్రయాణించిందో లేదో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో అజయ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

సూర్యారావు వయసు అరవై. తనకు ఇరవై ఏళ్ల వయసప్పటి నుంచి మద్యం తాగే అలవాటు ఉంది. అంటే దాదాపు నలభై ఏళ్లుగా మద్యం తాగుతున్నాడు. కూతురు'ఇక తాగొద్దు'అని తన మీద ఒట్టు వేయించుకోవడంతో సడెన్‌గా తాగుడు మానేశాడు. అన్నాళ్లూ బాగానే ఉన్న సూర్యారావు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనను ఎవరో తరుముతున్నట్టుగా, చంపబోతున్నట్టుగా ఉలిక్కి పడుతున్నాడు. శరీరంపై చీమలు పాకినట్టుగా ఊరికూరికే చేతులు, పాదాలు గీరుకుంటున్నాడు. సూర్యారావు ప్రవర్తన ఇంటిల్లిపాదీని హడలెత్తిస్తోంది.

ఈ రెండు కేసులను పరిశీలిస్తే ఒకతను మద్యం సేవించిన తర్వాత'మత్తులో కూడా తను బాగానే ఉన్నాను కదా!'అనుకున్నాడు. కాని శరీరం అదుపులో లేదు. ఫలితంగా ప్రమాదం సంభవించింది. రెండో కేసులో దాదాపు నలభై ఏళ్లపాటు రోజూ మద్యం తాగిన వ్యక్తి హఠాత్తుగా వ్యసనాన్ని మానుకోవడంతో అతని శరీరం అదుపు కోల్పోయింది.

మద్యంతో అనారోగ్యముమద్యం తాగితే నిద్ర బాగా పడుతుందని చాలామంది భావిస్తుంటారు. అందుకే నిద్రపట్టక సతమతమయ్యే కొందరు పడుకునేముందు మద్యం తాగటాన్నీ అలవాటు చేసుకుంటుంటారు. కానీ ఇది నిద్రా సమయాన్ని తగ్గించటమే కాదు, నిద్రాభంగాన్ని కూడా కలిగిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మద్యం తాగగానే నిద్ర పట్టేమాట నిజమే గానీ.. ఇది కొద్దిగంటలు మాత్రమే. ఆ తర్వాత వెంటనే మెలకువ వచ్చేస్తుంది. అలాగే పడుకున్నా కూడా సరిగా నిద్ర పట్టదు. ఈ దుష్ప్రభావాలు పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే అధికంగా ఉంటున్నట్టూ బయటపడింది. నిద్రపై మద్యం ప్రభావం అనే అంశంపై ఇటీవల మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. 20 ఏళ్ల యువతీ యువకులను ఎంచుకొని ముందురోజు మద్యం కలిపిన చల్లటి పానీయాన్ని తాగించారు. మర్నాడు ఆ పానీయంలో వాసన రావటానికి కేవలం కొన్ని చుక్కల మద్యం కలిపారు. అనంతరం వీరిని పరిశీలించగా.. వాళ్లు మద్యం తాగిన వెంటనే నిద్ర పోయినప్పటికీ ఆ తర్వాత చాలాసార్లు మేల్కొన్నట్టు గుర్తించారు. మగవారి కన్నా స్త్రీలు 19 నిమిషాల సేపు తక్కువ నిద్రపోయారు. కలత నిద్ర సమయం 4 శాతం పెరిగింది కూడా.

అకస్మాత్తుగా మానేస్తే అనేక భ్రాంతులు...

రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకునేవారు అకస్మాత్తుగా మానేస్తే'ఆల్కహాల్ విత్‌డ్రావల్ సింప్టమ్స్'కనిపిస్తాయి. అందులో భ్రాంతులు ప్రధానమైనవి. ఎవరూ మాట్లాడకపోయినా శబ్దాలు వినిపించడాన్ని ఆడిటరీ హ్యాలూసినేషన్స్ అంటారు. శరీరంపై చీమలు పాకినట్లు అనిపించడాన్ని టాక్టైల్ హ్యాలూసినేషన్స్ అంటారు. ఈ భ్రాంతికి గురయ్యే క్రమాన్ని ఫార్మికేషన్ అంటారు. అంతేకాదు గోడ మీద పాములు, జెర్రులు వంటి హానికరమైన జీవులు పాకినట్లు కనిపిస్తుంటాయి.

దీన్ని విజువల్ హ్యాలూసినేషన్స్ అంటారు. మద్యం తాగి వాహనం నడిపేవారు తామ కదలికలు చురుగ్గానే ఉన్నాయని భావిస్తుంటారు. నిజానికి అది వాస్తవం కాదు. మద్యం ప్రభావం వల్ల తాము అనుకుంటున్నంత, తమ అంచనాకు తగినట్లుగా వారి కదలికలు ఉండవు. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం కూడా మామూలే. అలాగే తమను ఎవరో వెంబడిస్తున్నట్లు అనుమానిస్తుంటారు. తమకు హాని చేయడానికి తలపోస్తున్నట్లుగా భ్రమపడుతుంటారు. ఇలాంటివి జరగక పోయినా జరుగుతున్నట్లు భ్రాంతులకు లోనుకావడాన్ని డెల్యూషన్స్ అంటారు.

గుండె ఆరోగ్యం - మద్యం

రోజూ 30 ఎం.ఎల్ వైన్ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కాని అదే అలవాటు పోను పోను మోతాదును పెంచేలా చేస్తుంది. అందుకని ముందుగానే ఇలాంటి వాటిని దరిచేరనీయకపోవడం మంచిది. గుండె ఆరోగ్యానికి రోజూ వ్యాయామం, సమతుల ఆహారం, డాక్టర్ సూచనలు పాటిస్తూ ఉండటం అన్ని విధాల మేలు.

జలుబు, దగ్గు - మద్యం

జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం సహజం. ఇలాంటప్పుడు బ్రాంది తీసుకుంటే రిలీఫ్‌గా ఉంటుందని, అవన్నీ తగ్గుతాయనుకోవడం పొరపాటు. వాతావరణంలో మార్పులు, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు, రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటికి ట్రీట్‌మెంట్ బ్రాంది ఎంత మాత్రమూ కాదు. వైద్యులు ఇచ్చిన మందులు, వారి సూచనలు మాత్రమే పనిచేస్తాయి.

మానసిక జబ్బులలో..

మొదటి రెండు పెగ్గులు తీసుకున్నప్పుడు శరీరం చాలా తేలికగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాని మోతాదు పెరిగిన కొద్దీ మెదడు డల్‌గా అయిపోతుంటుంది. నరాల వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో తనపై తనకు, చుట్టుపక్కల ఏం జరుగుతోందో ధ్యాస ఉండదు. ఆల్కహాల్ ఇన్‌డ్యూస్ డిప్రెషన్, ఇన్‌డ్యూస్ యాంగ్జైటీ డిజార్డర్ వంటి సైకోసిస్ సమస్యలు వస్తాయి.

గర్భవతులు - మద్యం

ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పడు బీర్ తాగితే పిల్లలు ఎరగ్రా, తెల్లగా పుడతారని, నార్మల్ డెలివరీ అవుతుందని అనుకుంటారు. కాని అది తప్పు. పిల్లల రంగు ఎప్పుడైనా జెనిటికల్‌గా వస్తుంది. పైగా గర్భవతులు మద్యం తీసుకోవడం వల్ల పిల్లలు శారీరక, మానసిక లోపాలతో పుట్టే అవకాశాలు ఉంటాయి.

యుక్తవయసులో...

పియర్ ప్రెజర్ కారణంగా అంటే'స్నేహితులు తాగుతున్నారు కాదా! నేను తాగితే తప్పేంటి?'అనో, సరదాకో ఫ్రెండ్స్ కోసమో మొదలుపెడుతుంటారు. ఈ అలవాటు సాధారణంగా 20, 25 ఏళ్ల నుంచి మొదలవుతుంది. కొన్ని రోజులకు మద్యం తీసుకోకపోతే చెమట్లు పట్టడం, చేతులు వణకడం, నోటికి ఏది తోస్తే అది మాట్లాడటం, అయోమయంగా ప్రవర్తించడం వంటివి చేస్తారు. దీంతో ఇన్ని రోజుల పాటు రాత్రివేళలలో తీసుకునే మద్యం పగటివేళకూ మారుతుంది. మొదట్లో ఒకటి, రెండు పెగ్గులతో మొదలైన అలవాటు నెమ్మదిగా పెరుగుతూ అధికమోతాదులో తీసుకుంటారు.

బయటపడటానికి...
 • టీనేజ్ పిల్లలు ఇంటికి లేటుగా రావడం, దొంగతనం చేయడం, వారి నుంచి మద్యం వాసన రావడం వంటివి గమనిస్తే వదిలేయకుండా నిపుణులచే చికిత్స ఇప్పించాలి.
 • ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నష్టాలు, కౌన్సిలింగ్ ద్వారా తెలియజేసి సదరు వ్యక్తిని మోటివేట్ చేయాలి.
 • రెగ్యులర్‌గా మద్యం తీసుకునే వ్యక్తి హఠాత్తుగా మానేస్తే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వీళ్లు ఆల్కహాల్ విత్‌డ్రావల్ స్టేట్‌లోకి వెళతారు. చేతులు, కాళ్లు స్వాధీనం తప్పడం, తను ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అయోమయంగా ఉండిపోతాడు. అతనికి వారం నుంచి పది రోజుల వరకు నిద్రపోయేందుకు సరిపడా మెడిసిన్ డోసును పెంచుతూ, తగ్గిస్తారు. దీనిని డిటాక్సిఫికేషన్ అంటారు.
 • హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి సమాజంలోకి వెళ్లాక, మళ్లీ మద్యం తీసుకోకుండా ఉండటానికి, దానిని అవాయిడ్ చేయడానికి కౌన్సెలింగ్ ఇస్తారు.
 • డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు రావడం, మందులు వాడటం చేస్తుంటే పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు.
 • ఆల్కహాల్ అనేది ఒక్క వ్యాధి మాత్రమే కాదు. ఇదొక సామాజిక దెయ్యం కూడా. కాబట్టి దీనిని గుర్తించినప్పుడు సిగ్గుపడకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం.

మద్యం తాగడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చాలామందిలో ఓ అపోహ. కాని మద్యం వంధ్యత్వానికి దారితీస్తుంది. సంతానోత్పత్తి సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది.

పిల్లలకు ఒక స్పూన్ బ్రాంది తాగిస్తే అజీర్తి సమస్య ఉండదని కొంతమంది భావిస్తుంటారు. కాని దీని కారణంగా పిల్లల్లో చిన్నప్పటి నుంచే మద్యం వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. పైగా అది శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఆధారము: ఆయురారోగ్యాలు

ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి

ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఇంకే పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900 మి.లీ.గ్రాముల'సి'విటమిన్‌, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర పోషకాలున్నాయి.

ఉసిరితో ఎంతో మేలు:
 • ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ
  సమస్యలను తొలిగిస్తుంది.
 • ఉదరంలో రసాయనాలను సమతుల్యపరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది.
 • లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.
 • హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది.
 • మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
 • విటమిన్‌'సి'శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.
 • కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత
 • ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా...

ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో అయినా చలాకీగా ఉండవచ్చు. అక్టోబర్‌ వృద్ధుల మాసం. ప్రతి సంవత్సరం ఈ నెల మొదటి తారీకును ప్రపంచ వయోధికుల లేదా వృద్ధుల దినంగా పాటిస్తున్నారు. ఆయుర్వేదం వృద్ధులు జీవించినంత కాలం ఆరోగ్యవంతం గా, వ్యాధులకు దూరంగా బతికేందుకు తోడ్పడుతుంది. ఈ శాఖను ఆయుర్వేదంలో జర చికిత్స అంటారు. అంటే వృద్ధాప్య థెరపీ. దీనికి రసాయన అనే మరో పర్యాయపదం కూడా ఉన్నది. అంటే వ్యాధి నిరోధక, స్వయం సంరక్షక చర్యలు అని అర్ధం. ఆయుర్వేదం ప్రకారం 70 ఏళ్ళు దాటిన సంవత్సరానికి వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. కానీ నలభై దాటినప్పటి నుంచే వృద్ధాప్య లక్షణాలు ప్రారంభం కావడం నేటి అనుభవం. శక్తి, బలం క్షీణించి, జీవితాన్ని చురుకుగా గడపలేకపోతారు. ఈ దశలో వ్యక్తిని అలసట, నిస్సత్తువ ఆవరిస్తాయి. భౌతిక, మానసిక కార్యకలాపాలు కుంటుపడతాయి. జ్ఞాపకశక్తి, మేధస్సు క్షీణించడం ప్రారంభమై వ్యాధులు త్వరగా ప్రభావితం చేస్తుంటాయి.

ఆయుర్వేదం ప్రకారం రస, రక్త, మాసం, మేధస్‌, అస్థి, మజ్జ, శుక్ర ధాతులతో కూడినది మానవ శరీరం. శరీరంలో చోటు చేసుకునే మార్పుల వల్ల ఈ ధాతువులు క్షీణిస్తాయి. ఈ ధాతువులలో సారంతరగిపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు త్వరగా సంక్రమించే సున్నితమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. వృద్ధాప్యంలో ఈ ధాతువుల సామర్ధ్యాన్ని పెంచలేం కానీ వాటిని సంరక్షించి పునరుజ్జీవింపచేయవ చ్చు. రసాయన చికిత్స లాభాలను ఆయుర్వేద గ్రంథాలు సవివరంగా పే ర్కొంటాయి. జీవితాన్ని పొడిగించడం, జ్ఞాపకశక్తిని పెంచడం, ఇన్ఫెన్లు, వ్యాధులు రాకుండా నిరోధక శక్తిని, మనస్సును యవ్వన స్థితిలో ఉంచేం దుకు సాయపడడం, వ్యక్తి ఛాయతో పాటు గొంతును మెరుగుపరచడం ద్వారా సమాజంలో గౌరవనీయంగా జీవించేందుకు, సంపూర్ణ ఆరోగ్యా న్ని సాధించేందుకు ఈ ప్రత్యేక చికిత్స అభివర్ణిస్తుంది. ఆయుర్వేదం వృద్ధాప్య సమస్యలను గుర్తించడమే కాదు అటువంటివి సంభవించకుండా నిరోధించే చికిత్సలను రూపొందించింది.

వృద్ధాప్య సమస్యలు:

అశక్తత, నిస్సత్తువ, వ్యాధులు, మరణం పట్ల భయం అన్నవి వృద్ధాప్యంలో ప్రధానంగా కనుపించే సమస్యలు. వయోధికులలో కనుపించే ఇతర సమస్యలు-

 • కేంద్ర నరాల వ్యవస్థ, మెదడు: పక్షవాతం, సయాటికా, అల్జీమర్స్‌ వ్యాధి, పార్కిన్సన్స్‌ వ్యాధి, మూర్ఛ, న్యూరోసిస్‌, సైకోసిస్‌, మానసిక సమస్యలు, నిద్రలేమి.
 • గుండె, రక్త నాళాలు: ఆంజినా పెక్టోరిస్‌, హృదయదమని లోపాలు, హైపర్‌టెన్సివ్‌ గుండె జబ్బులు, గుండెపోటు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలే కాకుం డా జన్యుపరమైన, జీవక్రియా సంబంధ సమస్యలైన మైలాయిడ్‌ లుకేమియా.
 • కాలేయం, పిత్తాశయ సమస్యలు: తీవ్రమైన హెపటైటిస్‌, పిత్తాశయంలో రాళ్ళు, సిరోసిస్‌.
 • జీర్ణాశయ సమస్యలు: మలబద్ధకం, ఊబకాయం, చక్కెర వ్యాధి
 • ఊపిరితిత్తులు: బ్రాంకైటిస్‌, ఎంఫిసీమా, ఆయాసం వంటి సమస్యలు
 • కీళ్ళు: రుమెటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఆస్టియో ఆర్థరైటిస్‌, స్పాండిలైటిస్‌, ఆస్టియో పొరాసిస్‌, సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది.
 • మూత్రవాహిక: పురుషులలో ప్రోస్ట్రేట్‌ గ్రంధి పెరగడం, నెఫ్రైటిస్‌, చక్కెర వ్యాధి వల్ల రీనల్‌ సమస్యలు రావడం వంటిపలు సమస్యలు వస్తాయి.
 • చర్మం, కండరాలు: సొరియాసిస్‌, హెర్పిస్‌, డెర్మటోసెస్‌, జుట్టు, గోళ్ళ వ్యాధులు, మోటార్‌ న్యూరాన్‌ వ్యాధివల్ల సంక్రమించే రోగాలు ఉంటాయి.
 • వినాళగ్రంధి (ఎండోక్రైన్‌ గ్లాండ్స్‌): హైపో, హైపర్‌ థైరాయిడిజమ్‌, నపుంశకత్వం, స్ర్తీ, పురుషులలో మెనోపాజ్‌ సిండ్రోమ్‌ తదితర సమస్యలు.
 • ఇంద్రియాలు: చత్వారం, గ్లకోమా, పాక్షిక లేదా పూర్తి చెవుడు, మెనీర్స్‌ సిండ్రోమ్‌, వెర్టిగో వంటివి సంభవిస్తాయి.

సులువైన చర్యల ద్వారా వృద్ధాప్యాన్ని, దానికి సంబంధించిన వ్యాధులను నిరోధిం చడం సాధ్యమని ఆయుర్వేదం చెప్తుంది. సరళమైన, నిరాడంబర జీవనమే దాని రహస్యం. ఆయుర్వేదం ప్రకారం ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యాలే వ్యాధిరహిత జీవితాన్ని గడిపేందుకు మూలమైన స్తంభాలు. మితాహారం శరీర జీవసంబంధ ప్రక్రియను క్రమబద్ధం చేస్తుంది.

మితాహారం, నిరాడంబర జీవనశైలే వ్యాధి రహిత సుదీర్ఘ జీవితానికి మంత్రం. జీవనశైలి విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఆయుర్వేదంలో నిర్దిష్టంగా పేర్కొన్నారు. అది ఒక ప్రత్యేకశాఖగా ఉంది.సంపూర్ణాహారాన్ని తీసుకొని, క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తన మాటలలో, చేతలలో సమతులంగా ఉంటూ, కోరరానివి కోరకుండా, నిజాయితీగా, క్షమాబుద్ధితో పెద్దల ఎడల గౌరవంతో జీవించే వారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవు. పంచకర్మతో పాటుగా జీవన శైలిలో మార్పులతో పాటు అనేక ఆయుర్వేద మందుల తయారీని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తాయి.

వృద్ధాప్య సంరక్షణలో ఉపయోగపడే మొక్కలు:

ఆముదం: ఆముదం విరేచనకారి అని అందరికీ తెలుసు.అయితే వృద్ధాప్య సమస్యలను నిరోధించడం, చికిత్స చేయడంలో ఈ మొక్కకున్న ఉపయోగాలు కొద్ది మందికే తెలుసు.

 1. ఆముదం వేరును నాలుగు భాగాల నీళ్ళలో అది ఒక వంతు వచ్చే వరకు మరిగించి రోజూ తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే వాత సంబంధ వ్యాధులను నిరోధించవచ్చు.
 2. 8-10 ఆముదం గింజలను పొట్టుతీసి 200 మిల్లీలీటర్ల పాలు, 50 గ్రాముల బెల్లం వేసి మరిగించి, ప్రతి రోజూ సాయంత్రం ఈ పాయసాన్ని తీసుకుంటే వృద్ధాప్య సంబంధమైన ఆర్థరైటిస్‌ సమస్యలను నివారించవచ్చు.
 3. గోధుమపిండిలో స్వచ్ఛమైన ఆముదాన్ని కలిపి చపాతీలు చేసుకొని తింటే డయాబెటిస్‌, ఆర్థరైటిస్‌ సమస్యలే కాక మలబద్ధకం కూడా తగ్గుతుంది.
 4. తామరపువ్వు: వృద్ధులకు అత్యంత ఉత్తమమైన టానిక్‌ ఇది. అనేక ప్రాంతాలలో ప్రజలు అందుకే తామర కాడలను కూరలాగా చేసుకుంటారు. తామరాకును విస్తరిగా ఉపయోగిస్తారు. ఇది కణాలను సంరక్షిస్తుందని జపాన్‌లో చేసిన పరిశోధనలలో రుజువైంది. తామర రేకులు కొలస్ట్రాల్‌ను తగ్గించడమే కాక గుండె, మెదడుకు రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.
 5. ఏలక్కాయి: వృద్ధాప్య సమస్యలకు సంబంధించిన అన్ని ఆయుర్వేద మందులలో దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది మంచి ఆంటాసిడే కాక వాయుహరి కూడా. జీర్ణక్రియను పెంచడమే కాక అసిడిటీ, కళ్ళె వంటి వ్యాధులలో ఉపశమనాన్ని ఇస్తుంది.
 6. ఉసిరికాయ: ఆరోగ్యాన్ని పెంపొందించే, వయసును నిరోధించే మూలిక ఇది. కొలెస్ట్రాల్‌ వల్ల వచ్చే గుండె వ్యాధుల, రక్త ప్రసరణ సమస్యల బారి నుంచి కాపాడుతుంది. చలికాలంలో అవసరమైన కేలరీ డైట్‌ సప్లిమెంట్‌ను అందిస్తుంది.
 7. తులసి: రోగనిరోధక శక్తిని పెంచడమే కాక చలికాలంలో వచ్చే జలుబు, దగ్గులను తగ్గిస్తుంది.
 8. కరక్కాయ: ఆయుర్వేదం ప్రకారం వ్యాధులను, వృద్ధాప్యాన్ని నిరోధించడంలో అత్యున్నతమైన మందు ఇది. కరక్కాయపొడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది అన్ని వయసుల వారూ తీసుకోవచ్చు. అలాగే పైల్స్‌ వంటి వ్యాధులను తగ్గించడంలో ఇది గొప్పగా పని చేస్తుంది.
 9. త్రిఫల: ప్రాచీన విజ్ఞానం ప్రకారం ఇది ఉత్తమమైన వయో నిరోధక చికిత్స. అయితే దీనిని వివిధ రుతువుల్లో వివిధ పదార్ధాలతో కలిపి తీసుకోవాలి.
  1. వర్ష రుతువులో - సైంధవ లవణంతో కలిపి
  2. శరత్‌ రుతువు - పంచదారతో కలిపి
  3. హేమంత రుతువు - శొంఠితో కలిపి
  4. శిశిర రుతువులో - పిప్పళ్ళతో కలిపి
  5. వసంత రుతువు - తేనెతో కలిపి
  6. గ్రీష్మ రుతువు - బెల్లంతో కలిపి
 10. తానికాయ: ఇది త్రిఫలాలలో ఒకటి. దీనిని మలబద్ధకం, విపరీతమైన కొలెస్ట్రాల్‌ ఉన్నప్పుడు, లివర్‌, స్ల్పీన్‌ సమస్యల్లోనూ, కంటి వ్యాధులు, బాలనెరుపుకు ఉపయోగిస్తారు.
 11. తిప్ప సత్తు: రోగనిరోధక శక్తిని కాపాడడంలో పెంచడంలో ఇది ప్రముఖమైనది. వాత తత్వం ఉన్నప్పుడు నెయ్యితో కలిపి, పిత్త తత్త్వంలో పటిక బెల్లం, కఫ తత్వం ఉన్నవారు తేనెతో కలిపి తీసుకోవాలి. గౌటీ ఆర్థరైటిస్‌లో ఆముదంతో కలిపి తీసుకోవాలి. మలబద్ధకం ఉన్నప్పుడు బెల్లంతో కలిపి, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నప్పుడు అల్లం పొడితో కలిపి తీసుకోవాలి.
 12. మండూక పర్ణి: దీనిని మందుగా కన్నా కూడా ఆహారంగా మన దేశంలో ఎక్కువగా తీసుకుంటారు. దీనికి ఒత్తిడిని తగ్గించే, జ్ఞాపక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అల్జిమీర్స్‌ వంటి వ్యాధులలో ఉపయుక్తం.
 13. అతిమధురం: పిల్లలలో వచ్చే జలుబు, దగ్గులకు దీనిని చిట్కా వైద్యంగా వాడుతుంటారు. నోటి అల్సర్లకు ఇది మంచి మందు. వృద్ధాప్యంలో శ్వాసకోశ సమస్యలకు మంచి మందని చరకుడు అభిప్రాయపడ్డాడు.
 14. గలిజేరు: ఇది గ్రామాలలో దొరికే మూలిక. దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. దీనివేర్లలో పొటాషియం నైట్రేట్‌ అధికంగా ఉంటుంది. మూత్ర నాళ సంబంధ సమస్య, కొన్ని గుండె సంబంధ వ్యాధు చికిత్సలో ఉపయోగపడుతుంది.
 15. పిప్పళ్ళు: ఇది జీర్ణప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఆర్థ్రైటిస్‌, మలబద్ధకం వంటి వాటిలో ఉపశమనాన్ని ఇస్తుంది.
 16. జీడి గింజలు: ఇది అత్యుత్తమ పునరుజ్జీవనిగా ఉపయోగపడుతుంది. దీనిలో కాన్స ర్‌ నిరోధక శక్తిని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. టిష్యూల నిర్మాణంలో, వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడటం వల్ల దాని గింజలను వృద్ధాప్య సంబంధిత సమస్యలను నివారించేందుకు సూచిస్తారు.
 17. వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులను తగ్గించేందుకు ఇంట్లోనే చేసుకుని వాడదగ్గ కషాయం:
 18. మెంతులు: 100 గ్రా, జీలకర్ర: 50 గ్రా, మిరియాలు - 05 గ్రా
 19. మూడింటిని కొద్ది నేతిలో వేయించి పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఒక చెంచా పొడిని తీసుకొని ఒక గ్లాసు పాలలో వేసి దానిని కొద్ది సేపు మరగించి రోజుకు ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. ఒక వారం రోజులలోనే తేడా కనుపిస్తుంది. ఉపశమనం కలిగే వర కూ ఎన్ని రోజులైనా దీనిని తీసుకోవచ్చు.

ఆరోగ్యానికి అవసరమైన ఉత్తమ ప్రయోజనాలు టీలో దండిగా

చాయ్... సాటిలేదురా భాయ్

టీ వల్ల పెద్దగా ఉపయోగం ఏముంటుంది... అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. అదొక అలవాటని కొందరి అభిప్రాయం. కానీ, ఆరోగ్యానికి అవసరమైన ఉత్తమ ప్రయోజనాలు టీలో దండిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రోజుకో కప్పు చాయ్ తాగితే డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చని పలు సర్వే ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

మిగతా ఆహార పదార్థాల కంటే టీలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడమే ఈ ప్రయోజనాలకు కారణం. సగటున ఒక కప్పుటీలో 130 మిల్లీగ్రాముల ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. రోజులో 415 మి.గ్రా ఫ్లేవనాయిడ్స్‌ను తీసుకోవడం ద్వారా నాడుల సక్రమంగా పనిచేస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

అంతేకాదు రక్తనాళాలు వ్యాకోచించేందుకు ఈ ఫ్లేవనాయిడ్స్ తోడ్పడతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఒత్తిడి, అలసటను తగ్గించడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను టీ ఉత్తేజపరుస్తుంది. శరీరంలో నీటిశాతాన్ని సమతుల్యంగా ఉంచడంలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఇక బ్లాక్, గ్రీన్ టీలలో సాధారణ టీ కంటే ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మరికెందుకు ఆలస్యం ప్రతిరోజూ చాయ్‌ను ఇష్టంగా తాగేయండి.

ఆధారము: ఆయురారోగ్యాలు

మద్యం అనే ద్రవం కడుపును ముంచేయడం ఖాయం!!!

 • కాలేయం పాడయ్యిందంటే... మొదట అడిగే మాట మద్యం అలవాటు
 • ఉందా అని. కడుపులో పుండ్లు పడ్డాయంటే అనుమానించేది... మద్యం
 • తీసుకుంటుంటారా అని. కాలేయాన్ని, కడుపును అంత నేరుగా ప్రభావితం
 • చేస్తుంది మద్యం. ఇతరత్రా అవయవాల మీద పరోక్ష ప్రభావమేమో గాని...
 • నోట్లోంచి కడుపులోకి మద్యం జారగానే అటు ప్రత్యక్ష దుష్ర్పభావాలూ,
 • పరోక్ష ప్రభావాలూ రెండూ కడుపు మీదే. తాగగానే నోట్లోనైనా అది పెద్దగా
 • ఉండకపోవచ్చేమోగాని... కడుపులోకి జారగానే అక్కడ కాసేపు ఉంటుంది
 • కాబట్టి అంతటి బలమైన ప్రభావం! దాంతో పోషకాలు అందకపోవడం,
 • విషపదార్థాలు ఉత్పత్తి అవడం, బరువు తగ్గడం, కాలేయం దెబ్బతినడం,
 • రోగనిరోధకశక్తి తగ్గడం వంటి అనేక దుష్ఫలితాలు!! ఉపద్రవంతో కొంప
 • మునిగినట్టు... మద్యం అనే ద్రవం కడుపును ముంచేయడం ఖాయం!!!

మద్యం అలా కడుపు (అన్నకోశం)లోకి వెళ్లీ వెళ్లగానే దాని దుష్ర్పభావం మొదలవుతుంది. అన్నకోశంలోకి వెళ్లగానే అక్కడ రెండు విధాలుగా దాని ప్రభావం చూపుతుంది. ఒకటి దాని నిర్మాణం మీద. రెండోది దాని విధులపైన. తొలుత అన్నకోశం నుంచి ఆల్కహాల్ రక్తంలో కలవడం ప్రారంభమవుతుంది. చాలా భాగం జీర్ణప్రక్రియకి గురి కాకుండానే రక్తంలో కలుస్తుంది. మద్యం నేరుగా చాలాసేపు అన్నకోశంలో ఉండటం వల్ల అక్కడి మృదువైన పొరలు (మ్యూకోజా) దెబ్బతింటాయి. అక్కడి మ్యూకోజాపై అది దీర్ఘకాలం పాటు ఉండటం వల్ల జీర్ణకోశం పై భాగంలో అనేక మార్పులు వస్తాయి. ఫలితంగా అప్పటికప్పుడు తగిలే దెబ్బతో పాటు దీర్ఘకాలికంగా ఉండే దుష్పరిణామాలు సైతం ఉంటాయి.

అన్నకోశంలోని మ్యూకోజాతో పాటు ఇతరత్రా కణజాలాన్ని మద్యం దెబ్బతీయడం వల్ల జీర్ణప్రక్రియ జరిగే క్రమంలో మార్పు వస్తుంది. జీర్ణక్రియ సమర్థంగా జరగకపోవడం ఫలితంగా శరీరానికి అందాల్సిన అవసరమైన పోషకాలు అందకపోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చు. పైగా నిత్యం ఆల్కహాల్ తీసుకుంటూ ఉండటం వల్ల మ్యూకోజాపై రోజూ ప్రభావం పడి అక్కడ పుండ్లు, కురుపులు పడవచ్చు.

నోట్లోకి నీళ్లు వస్తుండటం, ఆహారం ఛాతీపై అంటుకున్నట్లుగా ఉండటం, నోట్లోకి పుల్లటి తేన్పులు వస్తుండటం వంటి లక్షణాలు ఆల్కహాల్ తీసుకునేవారిలో కనిపించే తొలి లక్షణం. మనం తీసుకునే ఆహారం నోట్లోంచి గొంతులోకి అన్నవాహికలోకి రాగానే అన్నవాహిక చివర ఉన్న స్ఫింక్టర్ కారణంగా అన్నకోశం (స్టమక్)లోనే ఉండిపోతుంది. అయితే మద్యం వల్ల ఆ స్ఫింక్టర్ తాను పట్టి ఉంచే సామర్థ్యాన్ని కోల్పోయి రిలాక్స్ అవుతుంది. ఫలితంగా గుండెల్లో మంట, కడుపులోంచి నోట్లోకి యాసిడ్ వచ్చి పుల్లగా అనిపించడం జరుగుతాయి. దాంతో పాటు చిన్న పేగులు, పెద్ద పేగుల్లోని కదలికలు మందగించవచ్చు. దాంతో తిన్నపదార్థాల కదలిక జరగాల్సినంత వేగంగా జరగక అవసరమైన పోషకాలు అందవు.

పాంక్రియాస్‌పై కూడా ప్రభావం.

పాంక్రియాస్ అన్నది జీర్ణప్రక్రియలో పాలుపంచుకునే మరో కీలక అవయవం. ఇది రక్తంలో గ్లూకోజ్ పాళ్లను నియంత్రణలో ఉంచే ఇన్సులిన్ హార్మోన్‌ను స్రవిస్తుంది. జీర్ణక్రియలో కొవ్వులు, ప్రోటీన్లు, పిండిపదార్థాలు జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. మద్యం వల్ల ఈ అవయవం కూడా దెబ్బతిని తీవ్రమైన పాంక్రియాటైటిస్‌కు దారితీయవచ్చు. దానివల్ల కడుపులో నొప్పి, వాంతులు, ఊపిరి అందకపోవడం, కడుపులో ఇబ్బంది లాంటివి కనిపించవచ్చు. ఎప్పుడో ఒకసారి తాగేవారు మితం లేకుండా సేవించడం వల్ల ఈ సమస్య రావచ్చు. ఇలా పాంక్రియాటైటిస్ వచ్చిన వారిలో 15 శాతం మందిలో అది ప్రాణాంతకం కావచ్చు. ఇలాంటి సమయాల్లో వచ్చే నొప్పి కడుపు నుంచి మొదలై వీపుకు వ్యాపించవచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు కొవ్వులు సరిగా జీర్ణం కాకపోవడంతో మలం జిగటగా అనిపించవచ్చు.

1-దశ: మైల్డ్ ఫ్యాటీ లివర్

కాలేయంలోని కాలేయ కణాల స్థానంలో క్రమంగా కొవ్వు పేరుకోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. మద్యం తీసుకునేవాళ్లకు వచ్చే వ్యాధుల్లో ఇది తరచూ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాలేయం కొద్దిగా ఉబ్బుతుంది (లివర్ ఎన్‌లార్జిమెంట్). దాంతో పొట్ట పైభాగంలో కుడి వైపున కొద్దిగా ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తుంది.

2-దశ: ఆల్కహాలిక్ హెపటైటిస్

కాలేయ కణాలు ఒక్కొక్కటీ మరింతగా దెబ్బతినడం వల్ల లివర్‌లో మంటతో కూడిన వాపు (ఆక్యూట్ ఇన్‌ఫ్లమేషన్) రావచ్చు. దాంతో బయటకు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, కామెర్లు వంటివి బయటికి కనిపించే లక్షణాలు. దీంతో పాటు తెల్లరక్తకణాల పెరుగుదల, కాలేయం ఎరబ్రారడం (టెండర్ లివర్), రక్తనాళాలు సాలీడు కాళ్లలా చర్మం కింద ఉబ్బుగా కనిపించడం వంటివి కనిపిస్తాయి. మన శరీరంలోని మిగతా అవయవాల కంటే కాలేయానికి తనను తాను చక్కబరుచుకునే సామర్థ్యం చాలా ఎక్కువ. అందుకే ఈ దశ వచ్చాకనైనా మద్యం మానేస్తే అన్నీ చక్కబడి క్రమంగా కాలేయం మునుపటి ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది.

3-దశ: ఆల్కహాలిక్ సిర్రోసిస్

కాలేయంలోని సాధారణ లివర్ కణజాలం (టిష్యూ) అంతా దెబ్బతిని కేవలం పని చేయని నిష్ర్పయోజనమైన కణజాలం మిగిలిపోయే దశ ఇది. దీన్ని లివర్ సిర్రోసిస్ అంటారు. ఈ దశలో కాలేయం తన సాధారణ ఆకృతిని కోల్పోతుంది. అంతేకాదు... అది కుంచించుకుపోతుంది. దాంతో పేగుల నుంచి కాలేయానికి వచ్చే రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని పోర్టల్ హైపర్‌టెన్షన్ అంటారు. దీని వల్ల ఆహార నాళంలోని రక్తనాళాలు (సిరలు) సైతం ఉబ్బి ఒక్కోసారి అవి చిట్లే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఒక్కోసారి రక్తపు వాంతులు కావడం లేదా మలంలో రక్తం కనిపించవచ్చు. మలంలో రక్త స్రావం కావడం వల్ల మలం నల్లగా వస్తుంది.

కాలేయంపై దుష్ర్పభావం ఎందుకు..?

శరీరంలోకి ఏవైనా విషపదార్థాలు ప్రవేశించగానే వాటిని విరిచేసి వాటి ప్రభావాన్ని నిర్మూలించే విధులను కాలేయం నిర్వహిస్తుంది. మద్యం ఒక రకమైన విషం (టాక్సిన్) కావడం వల్ల దాన్ని విరిచి వేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పనిలో కాలేయం తాను నిత్యం చేయాల్సిన దానికంటే ఎక్కువగా మరింత ఎక్కువగా పనిచేస్తుంది. ఇక అలవాటుగా మద్యం తాగేవారిలో ఈ విషయాలను విరిచేసే పనిని అదేపనిగా చేస్తుండటం వల్ల కాలేయంపై భారం పడుతుంది. కాలేయంపై పడే దుష్ర్పభావాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.

మద్యం తీసుకునేవారిలో పొట్ట వస్తుండటం సాధారణంగా చూసేదే. మద్యం తీసుకున్న తర్వాత చాలా మందిలో కనిపించే పరిణామం ఇది. మరీ పెరిగినప్పుడు బెలూన్‌లో నీళ్లు నింపి కదిలిస్తే కదిలినట్లుగా పొట్టలో నీరు చేరి కదులుతూ ఉంటుంది. మద్యం అలవాటు పెరిగినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. దీన్నే'అసైటిస్'అంటారు. ఇది కూడా మద్యం వల్ల వచ్చే అనర్థమే.

చికిత్స...

కాలేయ సమస్యలకు మద్యం మానడంతోనే చికిత్స మొదలైనట్లు లెక్క. నిజానికి అదే పెద్ద చికిత్స అన్నమాట.

మొదటిదశ ఫ్యాటీ లివర్‌కు, రెండోదశ ఆల్కహాలిక్ హెపటైటిస్‌కు మద్యం నుంచి దూరంగా ఉండటం ప్రధానం.

కాలేయం దాదాపు 75 శాతం చెడిపోయినా తాను నిర్వహించే విధులలో ఎక్కడా లోపం కనిపించనివ్వదు. తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఇక అది మూడో దశకు వచ్చిందంటే మళ్లీ తిరిగి మునుపటి ఆరోగ్యాన్ని పొందడం చాలా కష్టం.'సిర్రోసిస్'అనే దశకు చేరుకుంటే కేవలం కాలేయ మార్పిడి తప్ప మరో అవకాశం లేదని తెలుసుకోవాలి.

కొంతమందికి ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా చికిత్స అవసరం. మరికొందరికి అవసరాన్ని బట్టి శస్తచ్రికిత్స చేయాల్సి ఉంటుంది.

ఆహారం మానేయకుండానే శరీరాన్ని నాజూగ్గా ఉంచుకోవచ్చు

చిక్కిన అందం

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అధికబరువుతో బాధపడేవారి సంఖ్య అంతకంతకూ ఎక్కువరుుపోతోంది. పాపం కొంతమంది ఆడవారు డైటింగ్‌ పేరిట పోషకాహారం కూడా తీసుకోకుండా ఉన్న కొద్దిపాటి అందానికి కూడా దూరం అరుుపోతున్నారు. వైద్యులను సంప్రదించకుండానే వాళ్లంతట వారే నిర్ణయాలు తీసేసుకుని వారంలో ఒక రోజో లేక రెండు రోజులో ఆహారం తీసుకోకుండా ఉంటే బరువు తగ్గిపోతామనే అపోహలో ఉంటారు కొందరు. ఖాళీ కడుపుతో ఆహారం తీసుకునేటప్పుడు అంతకు ముందు రోజు ఉపవాసం ఉన్నామనే భావనతో కొందరు ఎక్కువగానే తినేస్తుంటారు. దీనితో ఊబకాయం సమస్య తలెత్తుతోంది. అరుుతే ఆహారం మానేయకుండానే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శరీరాన్ని నాజూగ్గా ఉంచుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు.

ఎక్కువ మంది బంధువులు, మిత్రులు ఉన్నవారు వాళ్లింటికి తరచుగా వెళ్లడం వలన వారు పెట్టే అమితాహారాన్ని తీసుకుని మొహమాటంతో కాదనలేక ఏది పడితే అది తినేస్తుంటారు. కొందరు అలా కూడా ఊబకాయం సమస్య పెరిగిపోతోంది.

చిరుతిళ్లు:

కొందరు ఆహారాన్ని పూర్తి స్థాయిలో తగ్గించేసి చిరుతిళ్లకు ప్రాధాన్యం ఇస్తుం టారు. అసలు ఆహారం కన్నా ఈ చిరుతిళ్లే ఎక్కువ చేటు తెస్తాయి. సాధారణంగా ఆడవారు ఇళ్లల్లో టీవీ సీరియల్‌ చూస్తున్నప్పుడు చిరుతిళ్లు ఎక్కువగా తినేస్తుంటారు. వాటిల్లో ఉండే ఆయిల్‌ వలన కొలెస్ట్రాల్‌ శాతం కూడా పెరిగిపోతుంటుంది. అలాగే కొం దరు గురువారాలని, శనివారాలని ఆహారం తినేయడం మానేశాం అను కుంటుంటారు. ఆ మర్నాడు తీసుకునే ఆహారం అంతకు ముందు రోజుకన్నా ఎక్కువ తీసేసుకుంటుంటారు. ఆహారంలో అధిక కేలరీలు, తక్కువ కేలరీలు ఇచ్చేవి ఉంటాయి.

ఎంత తినాలి:

అధిక కేలరీలు ఇచ్చేవాటిని నియమానుసారం, కొద్దిపాటి మోతాదు తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు ఉదయం అల్పాహారం తీసుకునేటప్పుడు ఇడ్లీ తీసుకుంటుంటారు కొందరు. అలా తీసుకునే ఇడ్లీలలో కేలరీలు అధికశాతం ఉండటంతో కేవలం నాలుగు లేక ఐదు ఇడ్లీలతో మళ్లీ నాలుగు లేక ఐదు గంటలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు. హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లకని వారానికి ఒకరోజు ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తుంటారు కొందరు. రోజువారి నియమాలను పక్కన పెట్టేసి కొవ్వు శాతం ఎక్కువ, ఆయిల్‌ పర్సంటేజ్‌ ఎక్కువ ఉన్న ఫుడ్డును తీసుకుని మోయలేని శరీర బరువును స్వయంగా వాళ్లే కొనితెచ్చుకుంటుంటారు కొందరు.

కాస్త నడక మంచిది:

ఎక్కడికి వెళ్లాలన్నా వాహనం లేనిదే బయ టకు కదలలేని పరిస్థితి. అందుకని వీలయితే ఎక్కువగా నడవడానికి ప్రయత్నిస్తుండాలి. లేకపోతే కనీసం సైకిల్‌ తొక్కుకుంటూ దగ్గరలో ఉన్న మార్కెట్‌కు, సెంటర్‌కు వెళ్లివస్తుండాలి. శరీ రకండరాలకు తగిన వ్యాయామం లేకపోవడంతో ఊబకాయం మరింతగా పెరిగిపోయి చూసేవాళ్లకు కూడా అసహ్యంగా కనిపిస్తాము. వెనకటి కాలంలో అయితే ఎంత దూరం అయినా సరే నడుచుకుంటూ వెళ్లి వచ్చే వారు. తగినంత శారీరక వ్యాయామం ఉండేది. పైగా ఇళ్లల్లో కూడా రోటి పచ్చళ్లు చేసుకునేవారు. ఇడ్లీ, దోశల పిండి కూడా స్వయంగా రుబ్బు కునేవారు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్‌ యుగంలో అన్నీ ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌లకు అలవాటుపడిపోయి సులభ మార్గాలు వెతుక్కుంటున్నాము. తగిన శారీరక వ్యాయామం లేక ఊరికే ఊబకాయం పెరిగిపోయి నేడు ప్రపంచస్థాయిలో అనేక మంది బాధపడుతున్నారు.

ఎక్కువ ఆకలి వేస్తే:

సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత కనీసం మూడు లేక నాలుగు గంటలు ఎటువంటి ఆహారం తీసుకోక పోవడం మంచిది. అంతగా మరీ గంటకే ఆకలి అనిపిస్తే ఏదైనా పండ్లు, జ్యూస్‌లు తీసుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మన శరీరం ఎత్తు, బరువును బట్టి మనం తీసుకునే ఆహారం ఉండాలి.

కొద్ది పాటి వ్యాయామం:

శారీరక వ్యాయామం చేసేటప్పుడు, జాగింగ్‌, మార్నింగ్‌ వాకింగ్‌ చేసేటప్పుడు ఎంత శాతం కేలరీలు ఖర్చ వుతాయో తెలుసుకుని వాటిని సరిగ్గా పాటించగలిగితే ఊబకాయాన్ని దూరం చేయవచ్చు. అలాగే తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండి, ఆయి ల్‌, కొవ్వు శాతం తక్కువ ఉండేలా జాగ్రత్త వహించాలి. సాధారణంగా ఆడ వారు పెళ్లి కాకముందు డైటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అదే పెళ్లికాగానే ఏది పడితే అది తినేస్తుంటారు. దీనితో పెళ్లి కాని వారి కన్నా...పెళ్లయిన వారిలోనే అధికశాతం ఊబకాయం సమస్య తలెత్తుతోంది. ఊబకాయంతో అవస్థలు పడేవారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ స్థాయిలో ఉంటుంది. అధిక బరువు ఉన్నవాళ్లు ఆకలి వేసిందనిపిస్తే... నీరు తాగడం మంచిది. నియమబద్ధంగా కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఊబ కాయం సమస్య కాదు.

ఆధునిక జీవితంలో.. ఒత్తిడి - నివారణ

ఆధునిక కాలంలో జీవితం వేగవంతమైపోయింది. గొంతుకోతల పోటీ మధ్య నిత్యం ఉరుకులు పరుగులు, లక్ష్యాలు సాధిచడంలో ఉత్థాన పతనాలు మనను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఉన్నదానితో సంతృప్తి చెందడమంటే వైఫల్యం చెందడమేననే భావన పాతుకుపోయింది. వేగంగా మారుతున్న జీవన విధానాలతో, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధితో సమానంగా పరుగులు తీయడంలో మానవుడు విఫలం చెందుతున్నాడు. ఫలితంగా ఒంటరితనం, తమకు సరైన గుర్తింపు రావడం లేదన్న భావన, కోపం, ఒత్తిడి, ఆందోళన వంటి వాటి తో వ్యక్తులు సతమతమవుతున్నారు.

గత శతాబ్దం పురోగమనానికి చెందినదైతే, ప్రస్తుత శతాబ్దం ఆందోళన, ఒత్తిడి, విచారం, అనుమానాలు, వివాదాలు, అసంపూర్ణ నిర్ణయాలతో కూడిన కార్యకలాపాలకు చెందిన కాలమని జేమ్స్‌ సి. కోలమన్‌ అంటా రు. గతంలో ఒత్తిడి ఎప్పుడైనా బయటపడి సమస్యగా మారుతుండేది కానీ నేడు అది నిత్యసత్యమైపోయింది.ఇంతకీ ఒత్తిడి అంటే ఏమిటి? అందరం నిత్యం దానిని ఎదుర్కొంటున్నా కొందరు మా త్రమే దానిని గుర్తించి సులభంగా వివరించగలరు. అంతర్గతంగా విధ్వంసాన్ని సృష్టించగల బహిర్గత ఉద్దీపనలే ఒత్తిడి. మానసిక అసమతుల్యాన్ని సృష్టించి ప్రమాదకారిగా మారగల శక్తిగలది. ఒత్తిడి మరీ ఎక్కువైనప్పుడు అది మన క్రియాత్మక సమగ్రతను కూడా దెబ్బతీయగలదు. మనం ఆశిస్తున్న దానికి, మన దృ ష్టికోణానికి మధ్య ఉన్న అసమతుల్యత. సులువుగా చెప్పాలంటే, మన మనస్సు అసహనం గా, వ్యాకులంగా, ఆందోళనతో, భారంగా, ఉ ద్రిక్తంగా ఉన్నప్పుడు ఒత్తిడిలో ఉన్నామన్నమాట.

మానసికంగా, భౌతికంగా మనం ప్రమాదాన్ని లేదా సవాలును ఎదుర్కొంటున్నామన్నప్పుడు లోనయ్యే స్థితే ఒత్తిడి అని సాంకేతికంగా చెప్పవచ్చు. ఆధునిక జీవితం ఒత్తిళ్ళమయం కావడంతో నిత్యం ఈ ఒత్తిడికి సం బంధించిన ప్రతిస్పందనలు రేకెత్తేందుకు ఆస్కారం ఇస్తుం టాం. అయితే ఈ రోజువారీ ఒత్తిళ్ళలో కొన్నిం టిని మాత్రమే స్పష్టంగా గుర్తించగలం. భౌతికమైన ఒత్తిళ్ళు మనకు ప్రమాదకరంగా అనిపించడం లేదు. మేధోపరమైన ఒత్తిళ్ళను గు ర్తించడం, వివరించడం సంక్లిష్టం. ఈ లక్షణా లు మెదడులో రసాయనిక మార్పులకు దారి తీస్తుంది. ఉద్వేగాలపరమైన ఒత్తిడి అధికమైనప్పుడు న్యూరోట్రాన్స్‌మిటర్లు పెరుగుతాయి.

సెరొటోనిన్‌, ఆడ్రినాలిన్‌, అసిటైల్కోలైన్‌, డోపమైన్‌, కార్టిసాల్‌ స్థాయిలలో మార్పులు వస్తాయి. ఈ మార్పులు నిత్యం, అసందర్భంగా జరుగుతున్నప్పుడు దీనికి అవసరమైన శక్తిని సమకూర్చేందుకు శరీరంలో ఉన్న శక్తిని పీలుస్తాయి. ఇది సుదీర్ఘకాలం పాటు నిత్యకృత్యం అయితే ఒత్తిడికి సంబంధించిన వ్యాధులైన మైగ్రేన్‌, హైపర్‌టెన్షన్‌, ఆసిడ్‌ పెప్టిక్‌ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఆర్థరైటిస్‌, మలబద్ధకం తదితర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.

ప్రమాద సంకేతాలు:
 1. ఏకాగ్రత కుదరక పోవడం.
 2. విపరీతమైన అలసట
 3. తల నొప్పులు
 4. పొట్టలో గడబిడ
 5. నిద్ర సమస్యలు
 6. లైంగిక జీవి తం పట్ల ఆసక్తి సన్నగిల్లడం
 7. నిరాశ, నమ్మకాన్ని కోల్పవడం
 8. చికాకు పెరగడం.

మద్యం, ధూమపానం అధికం కావడం.వ్యాధి నివారణకు ఆయుర్వేదమెప్పుడూ మనశ్చర్య సంబంధిత మార్గాన్ని ఎంచుకుంటుంది కనుక పాశ్చాత్య వైద్యానికి భిన్నంగా ఉంటుంది. కనుక ఆయుర్వేదంలో ఎప్పుడూ శరీరం, మనస్సు సమగ్రతలకు ప్రాధాన్యతనిచ్చి చికిత్స ఉం టుంది. శారీరక సం బంధమైన వ్యాధులలో కూడా మానసిక అంశాలను నిర్లక్ష్యం చేయదు. అలాగే మానసిక సమస్యలలో శారీరక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

చికిత్స:

ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రధానంగా రిలక్సేషన్‌ టెక్నిక్‌లను సాధన చేయడం ఎంతో తోడ్పడుతుంది. ధ్యానం, వ్యాయామం, ఎయిరోబిక్స్‌, ఆక్యుప్రెషర్‌, హైడ్రోథెరపీ, యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు, హాస్యం, ఆహారం, నాట్యం, ఈత కొట్టడం, సంగీతం అన్నీ కూడా ఒత్తిడి తగ్గించేందుకు తోడ్పడతా యి. ఒత్తిడిని తగ్గించడంలో ఆయుర్వేదం ఎం తో ఉపయుక్తమైన పాత్ర పోషించగలదు. ఆయుర్వేదంలోని దినచర్య, రాత్రి చర్య, రుతు చర్య, ఆ చార రసాయన, స్వస్థివృత్త వంటి వన్నీ కూడా ఒత్తిడిని తగ్గించడంలో విజయం సాధిం చాయి. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరపవలసి ఉన్నది.

ఆయుర్వేదం ప్రకారం ఒత్తిడి నిర్వహణకు...
 1. సత్వగుణాన్ని వృద్ధి చేయడం.
 2. ఒత్తిడి కలిగించే అంశాల నుంచి మనసును మళ్ళించడం
 3. స్వస్థత కలుగచేసే మందులు ఇవ్వడం

మానసిక సమస్యలను తగ్గించేందుకు కొన్ని చర్యలు. వీటిని సాధించేందుకు సాత్వికాహారం తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తుం ది. కూరగాయలు, పాల సంబంధిత ఆహారం తీసుకోవాలని చెప్తుంది. కటువైన, వేడి చేసి ఆహారాలను, గంజ, భంగ్‌, ఛరస్‌, పొగా కు, మద్యాలకు దూరంగా ఉండాలంటుంది.

ఒత్తిడి నివారణకు ఔషధాలు

మూలికలు: బ్రహ్మి, హరీటకి, అమలకి, శతావరి, మండూకపర్ణి, పునర్నవ, పిప్పలి, రస్నా, బ్రహ్మి, శంఖ పుష్పి, వచ కూష్మాండ, పర్సిక్యావని, సర్పగంధ, నాగకేశర్‌, జ్యోతిష్మతి, జటామాంసి వగైరా...

లవణ సంబంధిత: మనశిల, శిలాజిత్‌, అభ్రక, సువర్ణ, మౌటిక, ప్రవల, మాణిక్య గోమేధ పుష్పరాగ...
ఇతర: పాలు, నెయ్యి, నువ్వుల నూనె, ధారజల, గోమూత్ర, యుష్‌

మానసిక ఉద్దీపకాలు:

వచ, బ్రాహ్మ, మండూకపర్ణి జ్యోతిషమతి, శంఖపుష్పి. వీటితో పాటుగా బ్రహ్మి రసాయన, ఆమ్లకి రసాయన, చ్యవన ప్రాస, హరితక్యాది రసాయన, నాగబల అవలేహ వంటి లేహ్యాలు, కళ్యాణ ఘృత, భల్లాతక ఘృత, పంచకావ్య ఘృత, బ్రహ్మి ఘృత, మయూర ఘృత వంటి ఘృతాలను లోపలకి తీసుకోవడానికి, సర్సాప తైల, పరిసేక, చందన తైల, ఘృత, సరస్వతీ తైలం వంటి వాటిని బాహ్యంగా ఉపయోగించడానికి వాడతారు. వీటితోపాటుగా సరస్వతారిష్ఠ, ద్రాక్షారిష్ఠ, అశ్వగంధారిష్ఠ వంటి ద్రవాలను అంతర్గతంగా తీసుకోవడానికి ఇస్తారు. అయితే ఈ మందులను వైద్యుని సలహా లేకుండా తీసుకోరాదు.

శరీరం పై ఒత్తిడి ప్రభావం

గమనిక: ఈ వ్యాసం వ్యాధి పట్ల చైతన్యం కలిగించేందుకు ఉద్దేశించినదే తప్ప స్వయం చికిత్సను ప్రోత్సహించేందుకు కాదు. ఏ మందైనా తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొందరికి ఔషధాల అవసరం లేకుండానే జీవన విధానంలో మార్పుల ద్వారానే అనేక లక్షణాలను తగ్గించవచ్చు.

ఆధారము: ఆయురారోగ్యాలు

పైల్స్‌ వ్యాధి - చికిత్స

కొందరు పైల్స్‌ వంటి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. మల విసర్జన ద్వారం వద్ద వచ్చే ఇటువంటి వ్యాధులు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పైల్స్‌తో పాటు ఫిషర్‌, ఫిస్టులా వంటి వ్యాధులు నేడు సాధారణంగా అందరికీ వస్తున్నాయి. అవసరమైన వైద్యం చేయించుకొని ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహార నియమాలు , తగిన జాగ్రత్తలతో ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

పైల్స్‌:

సాధారణంగా వస్తున్న వ్యాధుల్లో పైల్స్‌ ఒకటి. పైల్స్‌ ఎక్కువగా మధ్య వయస్సులో ఉన్నవారికి వస్తుంది. పీచు పదార్థాలు తక్కువగా తీసుకున్నవారికి, మంచి నీళ్లు తక్కువగా తాగేవారిలో ఈ వ్యాధి కనిపిస్తుంది. సై్పసీ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. పైల్స్‌ వల్ల విరోచనాలకు ముందు లేదా తర్వాత రక్తం రావడం జరుగుతుంది. కొన్ని సార్లు రక్తం గడ్డలు, గడ్డలుగా కూడా వస్తుంది.

మరికొన్నిసార్లు లోపలి మాంసం బయటకు కూడా రావచ్చు. పైల్స్‌ వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. పైల్స్‌ను మూడు గ్రేడులుగా విభజించవచ్చు. మొదటి గ్రేడులో పైల్స్‌ లోపల మాత్రమే కనిపిస్తుంది. రెండవ గ్రేడులో లోపలి నుంచి బయటకు వచ్చి మళ్లీ వాటంతట అవే లోపలికి వెళ్లిపోతాయి. మూడవ గ్రేడులో బయటకు వచ్చి బయటే ఉంటాయి. నాలుగవ గ్రేడులో బయటకు వచ్చిన వాటికి ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. కొన్ని సార్లు పైల్స్‌ ఆపరేషన్‌ తర్వాత కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంది. వీటిని సెకండరీ హెమరాయిడ్స్‌ అని అంటారు.

ఫిషర్‌:

ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. ఇది రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలద్వారం పగిలి ఫిషర్‌ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి విపరీతమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చు. రక్తం ఒకటి, రెండు చుక్కలు మా త్రమే వస్తుంది. విరోచనాలు అయిన తర్వా త నొప్పి ప్రారంభమై మూడు, నాలుగు గం టల వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఫిషర్‌ మలద్వారానికి ముందు వైపు, వెనుకవైపున కూడా ఉంటుంది. మరికొన్నిసార్లు ఫిషర్‌తో పాటు చర్మం కూడా ముందుకు చొచ్చుకు వస్తుంది. దీన్ని సింటినైన్‌పైల్‌ అంటారు.

ఫిస్టులా:

ఈ వ్యాధిని కొందరు లూటి అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వ స్తుంది. పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.

బయటకు చిన్నరంధ్రాలుగా కనపడవచ్చు. కొన్నిసార్లు అవి మూ సుకుపోయినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ వచ్చి చీము పట్టే అవకాశాలు ఉంటాయి. నొప్పి కూడా ఉండవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ వల్ల నొప్పి వస్తుంది. పిస్టులాను లోలెవెల్‌, హైలెవెల్‌ రకాలుగా వర్గీకరిస్తారు. లోలెవెల్‌ రకం దోవ పొడవుగా ఉంటుంది. ఇది రెండు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హైలెవెల్‌లో దోవ పొడవు కొన్నిసార్లు నాలుగు, అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు విరోచనాలు కంట్రోల్‌ కాకపోవచ్చు. చీము, రక్తం కూడా రావచ్చు.

పరీక్షలు:

పైల్స్‌ వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. వీరికి ప్రాక్టోస్కోపిక్‌ పరీక్షను నొప్పి లేనప్పుడు చేస్తారు. ఈ పరీక్షలో పైల్స్‌ బాగా కనిపిస్తాయి. కొలోస్కోపిలో పైల్స్‌, ఫిషరీ, ఫిస్టులా వ్యాధులను తెలుసుకోవచ్చు. పొట్ట స్కానింగ్‌లో వేరే పేగులకు ఏమైనా గడ్డలు ఉన్నాయా తెలుస్తుంది. పిస్టులోగ్రామ్‌ పరీ క్షను పిస్టులా ఉన్నవారికి నిర్వహిస్తారు. దారి పొడవు ఎంతోఉందో తెలుసుకోవడం జరుగుతుంది. బేరియన్‌ ఎనిమా పరీక్ష ద్వారా పెద్ద పేగు ఎలా ఉండో తెలుసుకోవచ్చు.

వైద్యం:

పైల్స్‌ వ్యాధి వచ్చిన వారిలో మొదటి, రెండు గ్రేడులుగా ఉన్నవారికి చాలా వరకు మందులతో నయమవుతుంది. కొన్నిసార్లు స్ల్కీరో థెరపీ ద్వారం పరీక్ష చేస్తూ డాక్టర్‌ పైల్స్‌లోకి ఇంజెక్షన్‌ చేస్తారు. ఆ ఇంజెక్షన్‌ ఇవ్వడం వల్ల వాటిలో రక్త ప్రసరణ తగ్గి కృశించుకుపోతాయి. పైల్స్‌ బాగా ముదిరిన వారికి ఎమరోయెక్టమీ ఆపరేషన్‌ ద్వారా వాటిని తొలగిస్తారు. ఫిషర్‌ వచ్చినవారి ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

విరోచనాలు సాఫీగా సాగేందుకు మందులు వాడాలి. ఈ విధంగా చేసినా ఇబ్బంది మళ్లీ వస్తుంటే విరోచనాలు జరిగే దారి బిగుసుకు పోతుంది. ఆ సమయంలో ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ను స్పింటరాటమి అని అంటారు. పిస్టులా వ్యాధిని హై లెవెల్‌, లో లెవెల్‌ను బట్టి వైద్యం చేస్తారు. కొన్నిసార్లు వీటిని తీసివేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ చేసేటప్పుడు విరో చనాలను ఆపుకునేందుకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా చూసుకోవాలి. ఈ ఆపరేష న్‌ను ఫిస్టురెక్టమీ అని అంటారు.

జాగ్రత్తలు:

ఈ వ్యాధులు వచ్చినవారు సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహారం లో పీచు పదార్థాలు(పండ్లు, కూరగాయలు) ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉప వాసాలు చేయకూడదు. విరోచనాలు అ య్యేందుకు మందులు ఎక్కువగా వాడ కూడదు. మన జీవన విధానంలో కొన్ని మార్పు లు చేసుకోవడం ద్వారా ఇటువంటి వ్యాధులకు చాలావరకూ దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా పీచు పదార్ధాలు అధికంగా ఉం డే ఆహారం తీసుకోవడం వల్ల శరీర క్రి యలు ఆరోగ్యంగా ఉంటాయి.

యాంప్యుటేషన్-ఏదేని కారణంగా కాలు, చేయి వంటి శరీరంలోని ఒక అవయవాన్ని తొలగించడాన్ని యాంప్యుటేషన్‌ అంటారు.

ఏ వయస్సులోని వారికైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడిన ప్పుడు యాంప్యుటేషన్‌ చేయాల్సి రావచ్చు.

యాంప్యుటేషన్‌కు కారణాలు:

వ్యాధులు(diseases) :
శరీరంలోని ఒక భాగాన్ని తొలగించాల్సి రావడమనేది అనేక పరిస్థితుల్లో కలుగుతుంది. కానీ ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మధుమేహం, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు.

ప్రమాదాలు (Accidents):
సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి, పరిశ్రమల్లో పని చేస్తే ప్రమాదాలకు గురైన వారికి యాంప్యుటేషన్‌ తప్పనిసరి అవుతుంటుంది.

పుట్టుకతో వచ్చే లోపాలు(congenital defects) :
పుట్టుకతో వచ్చే లోపాల్లో అవయవం లేకపోవడం కాని, అతి చిన్నగా ఉండటం కాని జరిగితే దానిని యాంప్యుటేషన్‌గానే గుర్తిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రోస్థెటిక్‌ డివైస్‌ను రూపొందించి అమర్చడం జరుగుతుంది.

కంతులు (Tumours):
ఎముకలకు సోకే కంతులకు (ఆస్టియో సార్కోమా) చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని సార్లు ఆ అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోగికి కాలు తొలగించాల్సిన పరిస్థితి వస్తే పాదాల వేళ్ల దగ్గరనుంచి తుంటి కీలు వరకూ వివిధ రకాలుగా తొలగిం చడం జరుగుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

ఫుట్‌ యాంప్యుటేషన్‌(Foot amputation) :
పాదానికి సంబంధించినంత వరకూ అది కేవలం బొటన వేలుకో, కొన్ని వేళ్లకో పరిమితం కావచ్చు. లేదా పాదంలో కొంత భాగం వరకూ తొలగించాల్సి రావచ్చు. లేదా పాదం మొత్తంగా తొలగించాల్సి రావచ్చు.

ట్రాన్సటిబియల్‌ యాంప్యుటేషన్‌(Trans Tibial amputation) :
మోకాలి కింది భాగంనుంచి కాలి మడమ వరకూ ఉండే భాగాన్ని తొలగించాల్సి వస్తే దానిని ట్రాన్స్‌టిబియల్‌ యాంప్యుటేషన్స్‌ అంటారు.

నీ డిసార్టిక్యులేషన్‌(Knee Dearticulation) :మోకాలి కీలు వద్ద చేసే యాంప్యు టేషన్‌ ఇది.

ట్రాన్స్‌ఫిమొరల్‌ యాంప్యుటేషన్‌(Trans femoral amputation) :
మోకాలి కీలు భాగం నుంచి పైన తుంటి కీలు భాగం వరకూ తొలగించే శస్త్ర చికిత్స ఇది.

హిప్‌ డిసార్టిక్యులేషన్‌(Hip disarticulation) :
ఈ రకమైన యాంప్యుటేషన్‌లో తుంటి కీలునుంచి మొత్తం తొడ భాగాన్ని తొలగించడం జరుగుతుంది. చేతికి సంబంధించిన యాంప్యుటేషన్‌ రకాలు ఈ కింది విధంగా ఉంటాయి.

పార్షియల్‌ హ్యాండ్‌ యాంప్యుటేషన్‌(partial Hand amputation) :
దీనిలో చేతి వేలును కాని, బొటన వేలును కాని, లేదా మణికట్టు కింద ఉండే చేతిలో భాగాన్ని తొలగించడం చేస్తారు.

రిస్ట్‌ డిసార్టిక్యులేషన్‌(Wrist dearticulation) : చేతిని మణికట్టు వరకూ తొలగిస్తారు.

ట్రాన్స్‌ రేడియల్‌ యాంప్యుటేషన్‌ : మోచేయి కింది భాగంనుంచి మణికట్టు వరకూ ఉండే భాగాన్ని తొలగించడం జరుగుతుంది.

ట్రాన్స్‌హ్యూమరల్‌ యాంప్యుటేషన్‌(Trans humeral amputation) :మోచేయి పైనుంచి భుజం కింది వరకూ ఉండే భాగం ఇది.

షోల్డర్‌ డిసార్టిక్యులేషన్‌(Shoulder Disarticulation) :
భుజం వరకూ తొలగించే శస్త్ర చికిత్స ఇది. ఇందులో కాలర్‌ బోన్‌ను తొలగించవచ్చు. లేదా తొలగించకపోవచ్చు. షోల్డర్‌ బ్లేడ్‌ను మాత్రం అలాగే ఉంచుతారు.

ఫోర్‌క్వార్టర్‌ యాంప్యుటేషన్‌(Four quarter amputation) :దీనిలో కాలర్‌బోన్‌, షోల్డర్‌ బ్లేడ్‌తో సహా మొత్తాన్ని తీసివేయడం జరుగుతుంది.

దంత వైద్యానికి లేజర్‌ - చికిత్స

దంత అనారోగ్యం కలిగితేనే కాదు-చికిత్స కూడా బాధా కరం అనే అభిప్రాయం మనందరిలో ఉంది. పళ్లు పుచ్చిపోతే లోపలి భాగాల్ని తొలగించడం, దంతాల చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్‌ని తొల గించడం, నోట్లో గడ్డలు ఎక్కుడున్నా తీసివే యడం, హిమాంజి యోమాల వంటి వాటినీ తొలగించడం, నోటిలో అల్సర్స్‌ని తగ్గించ డం, పళ్ల హైపర్‌ సెన్సిటివిటి లాంటి దాన్ని తగ్గించడం వంటి చికి త్సల్ని- కత్తితో సంబంధం లేకుండా కాంతితో, ఏ నొప్పి, రక్తస్రావం లేకుండా రాష్ట్రంలో చేయగలుగుతున్నామంటే దంత వైద్యవిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందింది. లేజర్‌ కిరణాలతో దంత చికిత్స కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. గతంలో కొన్ని మెట్రో నగరాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ నేడు హైదరాబాద్‌లోనూ అందరికీ అందుబాటులోకి వచ్చింది. లేజర్‌ కిరణాల సాయంతో ఈ వినూత్న పరిక రం ద్వారా దంతాలు, చిగుళ్లు, నోటి ఎముకకు సంబంధించిన అనేక చికిత్సల్ని చేస్తున్నారు... ఇంతకు ముందు మెత్తటి కణాలకి చికి త్స చేసే లేజర్స్‌ మనకు అందుబాటులో ఉన్నాయి.

’ఔఅఖిఉ’ పదాన్ని విస్తరిస్తే ‘లైల్‌ యాంప్లికేషన్‌ స్టిమ్యులేటెడ్‌ ఎమిషన్‌ ఆఫ్‌ రేడియేషన్‌’ అని అర్థం. లేజర్‌ యంత్రం నుంచి హార్డ్‌ టిష్యూ, సా ఫ్ట్‌ టిష్యూలకు చికిత్స చేసే పైప్స్‌- వేరు వేరుగా ఉంటాయి. దెబ్బ తిన్న సాఫ్ట్‌ టిష్యూని తొలగించే సన్నటి పైప్‌కి చివర్న గాస్‌టిప్‌ ఉం టుంది. దీనిలోంచి లేజర్‌ కిరణాన్ని అవసరమైన ప్రాంతంలోకి ప్రసరించేట్టు చేస్తారు చికిత్సలో. ఇది ఫైబర్‌ ఆఫ్టిక్‌ట్యూబ్‌. తర్వాత చికిత్సలో అప్పుడు పైనున్న టిప్‌ని తీసివేస్తే, టిప్‌ని పెంచుతారు. ఇలా క్రమంగా ఈ ఫైబ ర్‌ ఆఫ్టిక్‌ ట్యూబ్‌ అయిపోవచ్చు. అప్పుడు కొత్తతీగని వేసుకోవలసి వస్తుంది. ఇదే మెషిన్‌కి -హార్డ్‌ టిష్యూకి చికిత్స చేయడానికి వీలుగా ఎక్కువ లేజర్‌ కిరణాన్ని ప్రసరింపజేసే ట్యూబ్‌ ఉంటుంది. ఇవి రెండూ ఒకే మెషిన్‌కి ఉంటాయి. ఇది విద్యుచ్ఛక్తితో పనిచేస్తుంది.

ఈ లేజర్‌ మెషీన్‌ని ఆపరేట్‌ చేయాలంటే చేతులతో నైపుణ్యమే కాదు, కాళ్లలో నైపుణ్యమూ ఉండాలి. ఎందుకంటే లేజర్‌ కిరణాన్ని ప్రసరింపచేసే పైప్‌ని రోగి నోటిలోని ఆ భాగం వరకూ తీసుకు వచ్చినా కింద పాదంతో పెడల్‌ మీద అవసర మైనంత ఒత్తిడిని కలిగించినప్పుడే లేజర్‌ కిరణాలు బయటకు రావడం ప్రారంభి స్తాయి. ఎప్పుడు పాదాన్ని పైకెత్తితే అప్పుడే లేజర్‌ కిరణాలు బయటికి ప్రసరించడం ఆగిపోతుంది.లేజర్‌ పనిచేసేది ‘ధెర్మకో యాగ్యులేటివ్‌ ఎఫెక్ట్‌’ తో. ఈ లేజర్‌ కిరణాలలో చాలా ఉష్ణముంటుంది.

200 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకూ ఉన్నా, కాలదు. నొప్పి ఉండదు. రక్తస్రావం ఉండదు. చికిత్స పొందే వారికి ఇదంతా ఎం తో ఆశ్చర్యంగా ఉంటుంది. హార్డ్‌, సాఫ్ట్‌ టిష్యూలకు చికిత్స చేసే పైప్స్‌ వేరు వేరుగా ఉండడమే కాదు. ప్రోగ్రామ్‌ మార్చినప్పుడల్లా చికిత్సా విధానం మారుతుంది. చిగుళ్లకి చికిత్స చేయాలంటే ఒక విధమైన ప్రోగ్రామ్‌నివ్వాలి. రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కి మరో ప్రోగ్రామ్‌...ఇలా హార్డ్‌ టిష్యూ చికిత్స కోసం 40 ప్రోగ్రామ్‌లుంటే, సాఫ్ట్‌ టిష్యూకోసం మరో 40 ప్రోగ్రామ్‌లున్నాయి ఈ మెషీన్లో.

- డాక్టర్‌ సుధీర్‌ చౌదరి,
దంత వైద్యనిపుణులు,
డెంటల్‌ స్పెషాలిటీస్‌ అమీర్‌పేట్‌,
హైదరాబాద్‌ ఫోన్‌: 9885012444

ఆధారము: ఆయురారోగ్యాలు

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.