పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ముర్రుపాలు

ముర్రుపాలు

ముర్రుపాలు ఇవ్వడం వలన బిడ్డకి ముఖ్యమైన పోషకాలు అందడమే ప్రసవం వెంటనే తల్లి రొమ్ము నుండి తొలి సారిగా స్రవంచే పసుపు పచ్చని ద్రవాన్నేముర్రుపాలు అంటాము.చాలా తక్కువ పరిమాణంలో స్రవించబడతాయి . ఈ పరిమాణం బిడ్డకు సరిగ్గా సరిపొతుంది ఎందుకంటే అప్పుడే పుట్టిన బిడ్డ పొట్ట 1 లేదా1.1/2 చెంచాల పాలు మాత్రమే ఇముడ్చుకోగలదు అంతకంటె ఎక్కువ ఇస్తే బయటకు వాంతి చెసేస్తుంది.ముర్రుపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే,

  • కాకుండా ఎక్కువ మోతాదులో జీవకణాలు హార్మోన్లు ఉండి బిడ్డలో ప్రమాదకరమైన రోగాలను తట్టుకోగల నిరోధకశక్తిని పెంచుతుంది
  • ముర్రుపాలలో క్రొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,కార్బోహైడ్రేట్లు,కెవిటమిన్లు ఎక్కువగా ఉంటాయి ఇవి బిడ్డకి సులువుగా జీర్ణం అవుతాయి.
  • మామూలు తల్లి పాలతో పోలిస్తే ముర్రుపాల ద్వారా రోగనిరోధకశక్తి ఎక్కువ .ఇందులో ఉండే సెక్రీటరీ ఇమ్మునోగ్లోబిన్ ఎ, ప్రతిరక్షకంగా పనిచేస్తుంది.
  • బిడ్డ జీర్ణవ్యవస్థలో కూడా ప్రముఖ పాత్రవహిస్తుంది. ముర్రుపాలు పేగులలో ఉండే రంధ్రాలను మూసివేసి ఇతర పదార్థాలు లోనికి చొచ్చుకరాకుండా చేస్తాయి.
  • తల్లి తీసుకొనే ఆహారపదార్థాల వలన బిడ్డకు హాని కలుగకుండా బిడ్డ జీర్ణవ్యవస్థను అలవాటు పరుస్తాయి. పుట్టినవెంటనే బిడ్డ పేగులో ఉండే మెకోనియం అనే నల్లని జిగురు వంటి పదార్ధం విరోచనంగా బయటకు రావడానికి వీలుగా, ముర్రుపాలు విరోచనకారిగా పనిచేస్తుంది .
  • ఇన్ని ప్రయోజనాలు మరి ఏ ఇతర మందులు గాని,పోతపాలు గాని అందించలేవు. ప్రకృతి సహజంగా స్రవించబడే ముర్రుపాల నుండి బిడ్డను నిరోధిస్తే, బిడ్డలో నిరోధకశక్తిని ఆపినట్లే.
  • ఇన్ని ప్రయోజనాలు కలిగిన దీనిని ‘ద్రవ బంగారం’ అని పిలుస్తారు.

ఆధారం:

డాక్టర్.ఎస్.శారద, ప్రొఫెసర్, ఉస్మానియా ఆసుపత్రి
కుమారి జె.సుష్మ, విద్యార్ధి ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/093.

3.04301075269
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు