హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / రక్తం వర్గాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రక్తం వర్గాలు

ఈ పేజి లో వివిధ రక్త వర్గాలు మరియు వాటి వివరాలు అందుబాటులో ఉన్నాయి.

 • 1900 సంవత్సరం లో కారల్ ల్యాండ్ స్టీనర్ అను శాస్త్రవేత రక్త వర్గాలను కనుగొన్నాడు.

రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహిత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు.

రక్త వర్గాలు :

 1. ఎ (A)
 2. బి (B)
 3. ఎబి (AB)
 4. ఓ (O)

ఓ గ్రూప్ వారిని విశ్వదాత అని, ఎ.బి. గ్రూప్ వారిని విశ్వగ్రహీత అని అంటారు.

ఎవరు ఎవరికి రక్తం దానం చేయవచ్చు

ఎబి గ్రూప్ వారు ఎబి గ్రూప్ కి  దానం చేయాలి
ఎ గ్రూప్ వారు ఎ, ఎబి గ్రూప్ కి
బి గ్రూప్ వారు బి, ఎబి గ్రూప్ కి
ఓ గ్రూప్ వారు ఎ, బి, ఎబి, ఓ  గ్రూప్ ల వారందరికి దానం చేయవచ్చు.

ఎవరు ఎవరి నుండి రక్తం తీసుకోవచ్చు

ఎబి గ్రూప్ వారు అన్ని గ్రూప్ ల నుండి రక్తం తీసుకోవచ్చు
బి గ్రూప్ వారు బి, ఓ గ్రూప్ ల నుండి
ఎ గ్రూప్ వారు ఎ, ఓ గ్రూప్ లనుండి
ఓ గ్రూప్ వారు ఓ, గ్రూప్ నుండి మాత్రమే రక్తం తీసుకోవచ్చు.

16 నుండి 60 సంవత్సరాలు గల వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నవారు రక్తాన్ని దానం చేయవచ్చు.

ఒక వ్యక్తి 3-4 నెలలకు ఒక్కసారి రక్తాన్ని దానం చేయవచ్చు. రక్తాన్ని సేకరించిన తర్వాత 35-45 రోజులు నిల్వ చేస్తారు.

రక్త పీడనం (బి.పి.)

 • మానవ గుండెలో ధమనులు, సిరలు అనే రక్త నాళాలు ఉంటాయి.
 • ఈ ధమనుల గోడలలో జరిగే మార్పు వలన రక్త పీడనం పెరుగుతుంది లేదా తగ్గుతుంది.
 • బి.పి. ని స్పిగ్నో మానో మీటర్ తో కొలుస్తారు.
 • సామాన్య రక్త పీడనం 120/80 ఎం.ఎం.హెచ్.జి. ఉంటుంది.
 • 120 ను సిస్టాలిక్ రక్త పీడనం అని, 80 ని డయాస్టాలిక్ రక్తపీడనం అని అంటారు.
 • సిరల కన్నా ధమనులలో రక్తపీడనం ఎక్కువగా ఉంటుంది.
 • గుండె కొట్టుకోవటాన్ని స్టేతస్కోప్ తో పరీక్షిస్తారు, ఈ విధానాన్ని ఆస్కలేటేషణ్ అంటారు.
 • రక్త పోటు వ్యాదిని నిశబ్ద హంతకి లేదా సైలెంట్ కిల్లర్ అంటారు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.97619047619
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు