హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / రన్నింగ్ చేస్తే మరో మూడేళ్లు మీ సొంతం!
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రన్నింగ్ చేస్తే మరో మూడేళ్లు మీ సొంతం!

రన్నింగ్ చేస్తే మరో మూడేళ్లు మీ సొంతం!

ఆయుష్మాన్ భవ.. పెద్దలు అందించే దీవెన ఇది. అంటే కలకాలం (వందేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ) జీవించు అని. పెద్దల దీవెనల వల్లే మనం ఎక్కువ కాలం జీవిస్తామనుకోవడం అతిశయోక్తే అవుతుంది. మీరు కలకాలం జీవించాలంటే పెద్దల దీవెనలతో పాటు ప్రతిరోజు రన్నింగ్ కూడా చేయాలంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రిషి గుప్త.

రోజూ పరుగు తీయడం వల్ల మీ జీవితకాలం మరో మూడు సంవత్సరాలు పెరుగుతుందట. పరుగు ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుందని మనకు తెలుసు. అలాగే మానవ జీవితకాలంపై కూడా రన్నింగ్ ప్రభావం చూపిస్తుందని.. 44 ఏళ్ల వయసు పైబడిన 55,137 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. 15 ఏళ్ల పాటు చేసిన ఈ స్టడీలో 3,413 మంది వివిధ కారణాల వల్ల మరణిస్తే.. 1,217 మంది గుండె, రక్త నాళాల సంబంధిత వ్యాధుల వల్ల మరణించినట్లు తెలిసింది.

 

వ్యాయామం చేసే వారు గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధులను 45 శాతం అధిమించారని, రన్నింగ్ చేయని వారు కేవలం 30 శాతం మాత్రమే జబ్బులను అధిగమించారని స్టడీలో తెలిసింది. ప్రతిరోజు రన్నింగ్ చేసిన వారు... చేయని వారి కంటే 3 సంవత్సరాలు ఎక్కువగా బతికారు.

 

అసలు పరుగుతీయని వాళ్లతో పోలిస్తే.. వారంలో కనీసం 51 నిమిషాల కంటే తక్కువ సమయాన్ని పరుగుకి కేటాయించినా లేదా 9.6 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం పరుగుతీసినా 29 శాతం గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవట. అంతకంటే ఎక్కువ సమయం కేటాయించి, ఎక్కవ దూరం పరుగుతీసిన వారికి 50 శాతం ఈ రిస్క్ తగ్గుతుందట.

 

గంటకు 9.6 కిలోమీటర్ల అత్యల్ప వేగంతో రోజుకు ఐదు నుంచి పది నిమిషాలు జాగింగ్ చేస్తే గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చని ఈ స్టడీలో తేలింది. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే నిశ్చల జీవితాన్ని వీడి ప్రతి రోజు కొంత సమయం పరుగుకు కేటాయించాలని స్టడీ నిర్వాహకులు చెబుతున్నారు.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి
2.94949494949
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు