హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / రాత్రిపూట తొందరగా నిద్ర పట్టడం లేదా?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రాత్రిపూట తొందరగా నిద్ర పట్టడం లేదా?

రాత్రిళ్లు తొందరగా నిద్రపట్టడం లేదా? అలా అయితే నిద్రపోయే ముందు పాలను తాగమంటున్నారు అధ్యయనకారులు. ఎందుకంటే పాలల్లో అధిక పాళ్లల్లో ట్రైప్టోఫాన్‌, మెలటోనిన్‌లు ఉంటాయి.

 

రాత్రిళ్లు తొందరగా నిద్రపట్టడం లేదా? అలా అయితే నిద్రపోయే ముందు పాలను తాగమంటున్నారు అధ్యయనకారులు. ఎందుకంటే పాలల్లో అధిక పాళ్లల్లో ట్రైప్టోఫాన్‌, మెలటోనిన్‌లు ఉంటాయి. ఇవి నిద్ర పట్టడానికి ఎంతగానో సహ కరిస్తాయి. అంతేకాదు యాంగ్జయిటీని కూడా తగ్గిస్తాయి.
ఇటీవల అధ్యయనకారులు చేసిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది. సహజంగా నిద్రపట్టడానికి పాలు ఎంతో బాగా పనిచేస్తాయని అధ్యయన ఫలితాలు చెప్తున్నాయి. అంతేకాదు నిద్ర సంబంధించిన రకరకాల సమస్యలను కూడా పాలు పరిష్కరిస్తాయట. యాంగ్జయిటీ డిజార్డర్లతో బాధపడేవారికి పాలు ప్రత్యామ్నాయ మెడిసిన్‌లా పనిచేస్తుందిట.
మెలటొనిన్‌ సహజమైన హార్మోన్‌. ఇది మనం టైముకు నిద్రపోయేట్టు చేస్తుంది. అంతేకాదు నిద్రనుంచి లేవడాన్ని కూడా ఇదే క్రమబద్ధీకరిస్తుంది. ఇక ట్రైప్టోఫాన్‌ సెరొటొనిన్‌, మెలటొనిన్‌లుగా మార్పు చెందుతుంది. ఈ స్టడీని సియోల్‌లోని షామ్‌యుక్‌ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకారులు చేశారు. నిద్రపట్టడానికి పాలు తాగడమన్నది ఎప్పటి నుంచో వస్తున్న అలవాటని ఈ సందర్భంగా అధ్యయనకారులు పేర్కొన్నారు.
నిద్ర మాత్రల కన్నా కూడా రాత్రిపూట తాగే పాలు బాగా మత్తును కలిగిస్తాయిట. నిద్ర బాగా వస్తుందిట. అంతేకాదు యాంగ్జయిటీని నివారిస్తుందిట. కాబట్టి నిత్యం పడుకోబోయేముందు పెద్దా చిన్నా అందరూ పాలుతాగి నిద్రపోతే ఎంతో మంచిది.
ఆధారము: ఆంధ్రజ్యోతి

 

 

2.89655172414
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు