హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / రొమ్ము క్యాన్సర్- అవగాహన
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రొమ్ము క్యాన్సర్- అవగాహన

రొమ్ము క్యాన్సర్- అవగాహన

పరిచయం

ప్రపంచ వ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అత్యంత ఆందోళనను కలిగిస్తున్న ఆరోగ్య సమస్య. ప్రధానంగా స్త్రీలు దీని వలన భాదితులు అయినప్పటికి పురుషులలో కూడా ఈ క్యాన్సర్ కనపడుతుంది.

ఆసలు క్యాన్సర్ అంటే

అసాధారాణ రీతిలో  శరీరంలో కణజాలాలు అనియంత్రణ స్థాయిలో వృద్ధి చెందడం వల్ల వచ్చేజబ్బును క్యాన్సర్ అంటారు. కణజాలాలన్నీ ఒక కణితిగా లేదా గడ్డగా ఏర్పడతాయి.

రొమ్ము క్యాన్సర్ అంటే

రొమ్ము క్యాన్సర్ బాహ్యలక్షణాలు

 • రొమ్ములో గడ్డలు
 • ఛంకలో లేదా రొమ్ములో నొప్పి. సాధారణంగా రుతుచక్రంలో వచ్చే నొప్పికాదు ఇది.
 • రొమ్ముపై చర్మం ఎర్రగా మారడం
 • ఛనుమొన మీద లేదా చుట్టు పుండు పడడం
 • రొమ్ముపై చర్మం ఎర్రగా మారడం
 • ఛంకలలో వాపు
 • చన్నులనుండి ద్రవం కారడం
 • రొమ్ము చర్మం కమిలిపోయి ఉండడం
 • ఛనుమొన రూపంలో మార్పు, లోపలికి ముడుచుకుపోవడం
 • రొమ్ము పరిమాణం, ఆకారం మారిపోవడం
 • ఛనుమొనపైన, రొమ్ము చర్మం పైన పొలుసులుగా ఏర్పడడం

 

కేవలం బాహ్యలక్షణాలను బట్టి రొమ్ము క్యాన్సర్ ను నిర్ణయించలేము. వైద్యుల సూచనలు, సంప్రదింపులు, వైద్యపరీక్షలు తప్పనిసరి. ఫ్రపంచంలో జరుగుతున్న క్యాన్సర్ మరణాలలో రొమ్ము క్యాన్సర్ మరణాలు ఎక్కువని, అందునా స్త్రీలలో అధికమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆందుచేత 35  సంవత్సరాలు పైబడ్డ ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణా పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఇతమిద్దంగా ఇవి రొమ్ము క్యాన్సర్ కారణాలని చెప్పలేము. కాని కొన్ని విపత్కర పరిస్థితుల వలన వచ్చే అవకాశాలు ఉండవచ్చు.
పెద్ద వయస్సు: రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో దాదాపు 80%  మంది 50 సంవత్సరాలు పైబడిన మహిళలే. వయస్సు పెరిగే కొద్ది రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
జన్యుపరమైన కారణాలు: స్వంత బంధువులలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్ వచ్చిఉంటే, ఆకుటుంబాలలోని స్త్రీలకు వచ్చే అవకాశం ఎక్కువ. కాని చాలావరకు క్యాన్సర్లు వంశపారంపర్యం కాదని పరిశోధనలు చెబుతున్నాయి.
గతంలో క్యాన్సర్ వచ్చిఉంటే: గతంలో ఇన్వేసివ్ లేదా నాన్ ఇన్వేసివ్ రొమ్ము క్యాన్సర్ వచ్చి చికిత్స పొందిన స్త్రీలలో మరల వచ్చే అవకాశాలు ఎక్కువ.
రొమ్ములో గడ్డలు ఉంటే: క్యాన్సర్ గడ్డలు కానప్పటికి, రొమ్ములో ఎప్పుడైన గడ్డలు ఉండిన సంధర్భాలు ఉంటే వారికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే.
సాంద్రమైన రొమ్ము కణజాలాలు: రొమ్ము కణజాలాల సాంద్రత ఎక్కువగా ఉంటే వారిలో కూడా అవకాశాలు ఎక్కువ.
ఈస్ట్రొజెన్ హార్మోను వలన: రుతుచక్రం చిన్నవయస్సులో మొదలైనా లేదా బహిష్టులు ఆలస్యంగా ఆగిపోయినా (మెనోపాజ్) వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. ఎందుకంటే, వీరు ఎక్కువ కాలం ఈస్ట్రొజెన్ హార్మోనును కలిగి ఉంటారు.
ఊబకాయం: ముఖ్యంగా బహిష్టులు ఆలస్యంగా ఆగిపోయినా తర్వాత కొందరు ఊబకాయులౌతారు. అటువంటి వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు.
ఎక్కువ పొడవు: కారణాలు తెలియనప్పటికి పొట్టి వారిలో కంటే పొడవుగా ఉన్నవారిలో రొమ్ము క్యాన్సర్ రావచ్చని చెబుతున్నారు.
ఆల్కహాల్ తీసుకోవడం: ప్రతిరోజు మితిమీరి త్రాగే వారిలో కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చని చెబుతున్నారు.
రేడియేషన్ వలన: ఎక్స్ రే, CT స్కాన్ వంటి పరీక్షలు ఎక్కువగా తీయుంచుకుంటున్నవారిలో కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చు.
కొన్ని ఉద్యోగాలు:
మానసికంగా, శారిరకంగా వత్తిడి, ఆందోళన తో కూడిన ఉద్యోగాలు చేసే వారిలో రావచ్చు.
ఇవన్ని కొందరిపరిశోధకుల అభిప్రాయాలు. అందరికి ఇవే కారాణాలుగా ఉంటాయని చేప్పలేము. కొంత అవగాహనను కల్గించడానికే ఉపయుక్తమౌతాయి.

రొమ్ము క్యాన్సర్ పరీక్షలు

ఈ పరీక్షలను మూడు రకాలుగా విభజించవచ్చు- 1. స్క్రీనింగు, 2. నిర్దారణ, 3. పర్యవేక్షణ.

స్క్రీనింగు పర్రీక్షలు: రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా అనే తేడా లేకుండా అందరికీ నిర్వహిస్తారు. ఇది మామో  గ్రాము ద్వారా చేస్తారు. ఆందువలన తొలి దశలోనే చికిత్స మొదలు పెట్టవచ్చు.
నిర్దారణ పర్రీక్షలు: మమో గ్రాము ద్వారాగాని లేక బాహ్య లక్షణాల వలన బట్టి గాని రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే అటువంటి వారికి బయాప్సి నిర్వహిస్తారు. దీని ద్వారా రొమ్ము క్యాన్సరేనా, అయితే ఏస్థాయిలో ఉంది నిర్దారించి, చికిత్స ఎలా చేయాలి అని నిర్ణయించడానికి వీలౌతుంది.
పర్యవేక్షణ పరీక్షలు: చికిత్స కొనసాగిస్తున్న సమయంలో వ్యాధి నయమౌతున్న తీరుతెన్నులను తెలుసుకోడానికి, చికిత్స పూర్తి అయిన తర్వాత అనంతర స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చేస్తారు.

 

 

నిపుణుల సూక్తి
స్క్రీనింగు పరీక్షలు  చేయించుకోవడం ద్వారా, జబ్బు లక్షణాలు బయటపడకముందే, జబ్బును గుర్తించడానికి వీలౌతుంది.  రొమ్ము క్యాన్సర్ విషయానికొస్తే, సాధారణ ఆరోగ్య స్థితి బాగుండి, రొమ్ములో ఎటువంటి గడ్డలు లేకపొయినా, కుటుంబానికి  రొమ్ము క్యాన్సర్ చరిత్ర లేకపోయినా, మనకు  రొమ్ము క్యాన్సర్ లేదులే అని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే, రొమ్ము క్యాన్సర్ బారిన పడిన మూడొంతులమంది స్త్రీలలో ఇక్కడ  చెప్పిన ఏ కారణాలు లేని వారే. కనుక అందరికీ స్క్రీనింగు పరీక్షలు ముఖ్యం.           -- Susan Greenstein Orel, M.D.

రొమ్ము క్యాన్సర్- మానసిక సంసిద్దత

నిరంతర పరిశోధనల ఫలితంగా ఈ రోజున ఏ వ్యాధికైనా మంచి చికిత్స అందుబాటులోకి వచ్చింది. కాని సత్వరమే అందుకోవడంలోనే వ్యాధి నివారణ ఆధారపడి ఉంటుంది. నిజానికి ఇది ఒక పెద్ద సవాలు కూడా.  ఆందుకు వైద్యుల స్పందనకంటే, రోగుల మానసిక సంసిద్దత చాలా అవసరం.

 • మహిళలు 35 సంవత్సరాల వయస్సునుండే స్క్రీనింగు పరీక్షలు క్రమం తప్పకుండా చేయుంచుకుంటుంటే తొలి దశలోనే చికిత్స ప్రారంభించవచ్చు.
 • క్రమం తప్పకుండా స్వయం పరీక్షల ద్వారా రొమ్మును పరిశీలించుకోవాలి.

రొమ్ము క్యాన్సర్- పోషకాహారం

 1. పుట్టగొడుగులు: L- ఎర్గోథియోనైన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగాకల పుట్టగొడుగులు తినడం చాలా మంచిది.
 2. బ్రొకోలీ మొలకలు: సల్ఫరోఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కలిగిఉన్న బ్రొకోలీకి ట్యూమర్, క్యాన్సర్ కణాలను నశింపచేసే శక్తి ఉంది.
 3. దానిమ్మ: దానిమ్మలో ఉండే ఇల్లజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లో రొమ్ముక్యాన్సర్ వృద్ధిని అరికట్టే ఎంజైము ఉంటుంది. రోజూ పావు లీటరు జ్యూస్ తాగడం మంచిది.
 4. బీన్సు, చిక్కుడు గింజలు: ఫోలేట్, పీచు అధికంగా ఉన్న ఇవి తీసుకోడం వలన పోషణ సమకూరుతుంది.
 5. వాల్నట్/ అక్రోటు పప్పులు: వీటిలో ఉండే ఒమెగా3, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోస్టిరాల్స్, రొమ్ము క్యాన్సర్ కణాల వృద్దిని నిమ్మళం చేస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి.
 6. నల్ల ద్రాక్ష: వీటిలో లభించే  టెరోస్తిల్బెనె (ప్తెరొస్తిల్బెనె) అనే ఫైటోన్యూట్రియంట్ రొమ్ము క్యాన్సర్ కణాలు వాటంతట అవే నశించిపోయే విధంగా ప్రేరేపించే శక్తి ఉంది. ఈ ప్రక్రియను ఆప్టోసిస్ అంటారు. ఆంతే కాక వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికమే.
 7. బచ్చలి: ఈ ఆకుకూరలో బి విటమిన్లు, ముఖ్యంగా ఫోలేట్ అధికంగా ఉంటుంది. మెనోపాజ్ దశను చేరుకోకముందు ఫోలేట్ అధికంగా తీసుకున్న మహిళలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధనలలో తేలింది. కనుక బాధితులకు బచ్చలి చాలా మేలు చేస్తుంది.
 8. గుడ్లు: కోలిన్ అనే పోషకం చాలా అధికంగా గుడ్లలో లభ్యమౌతుంది. ఇది శరీరం తయారు చేసుకోలేని పోషక పదార్దాల వర్గానికి చెందింది. కోలిన్ ప్రతిరోజు తీసుకుంటే 24% వరకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గి పోతాయని పరిశోధనల ఫలితాలు. పచ్చసొనలో ఉండే ఇది ఒక పెద్దగుడ్డులో 126 మిల్లీగ్రాములు ఉంటుంది. మిగిలినది చేపలు, పంది, కోడి, గొడ్డు మాంసం ద్వారా, బ్రోచోలి మరియు గోధుమ మొలకల ద్వారా పొందవచ్చు.
 9. లొమోన్ చేప: ఈ చేపలో డి విటమిన్, ముఖ్యంగా ఒమెగ 3 అధికంగా ఉంటుంది. ఒమెగ 3  క్యాన్సర్ కణాలను నశింప చేయగలదు, అందువలన ఇతర అవయవాలకు చేరకుండా ఆపుతుంది. కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా అడ్డుకొనే శక్తి కూడా డి విటమిన్ కు ఉంటుంది.
 10. రైతో  చేసిన బ్రెడ్: రై ధాన్యం వర్గానికి చెందిన ఆహారం. దీనిలో పీచు, లిగ్నానులు, విటమిన్లు, ఖనిజలవణాలు, ఫైటో న్యూట్రియంట్లు అదికంగా ఉంటాయి. కనుక రైతో చేసిన బ్రెడ్ రొమ్ము క్యాన్సర్కు చాలా మంచిది. క్యాన్సర్ కణాలను ఎదుర్కొంటుంది.  ఉత్తర భారతీయులు బాగానే వాడుతున్నప్పటికి, దక్షిణాదిలో ఇంకా అవగాహన దశలో ఉంది. బయట బజార్లలో కొనుక్కొనేప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి. ప్యాకెట్ పైన ఉండే ఇంగ్రీడియెంట్లు జాబితాలో మొదటి పేరు రై అని ఉండాలి. అలాంటిదే కొనుక్కోవాలి.
 11. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మకు కొన్ని విలక్షణమైన ఔషధ  గుణాలున్నాయి. మన ప్రమేయం లేకుండా శరీరంలో పెరిగే హానికర కణాలను నశింప చేసే గుణం దీనికుంటుంది. క్యాన్సర్ బారిన పడిని వారికే కాకుండా, నిమ్మరసం ప్రతిరోజూ తీసుకోవడం అందరికి మంచిదే.
 12. ఇనుము ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
 • జబ్బు నిర్దారణ జరిగి చికిత్స మొదలైన తర్వాత, వైద్యుల సలహాలతో పాటు, పోషక నిపుణుల సలహాలను తీసుకొవడం మంచిది. పోషకాహారం తీసుకోవడం వలన శరీరం చికిత్సకు తగిన విధంగా స్పందిస్తుంది. చికిత్స సమయంలో శరీరం చాలా నీరసించి పోతుంది. కాబట్టి బలమైన ఆహారం తీసుకోవాలి.
 • ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమృద్దిగా లభించే ఆహారం చాలా అవసరం. కీమో తెరపీ జరుగుతున్న సమయంలో ద్రవ పదార్థాలు కూడా ఉండేట్లు చూసుకోవడం చాలా మంచిది.  ఆ సమయంలో తీసుకోవలసిన కొన్ని జ్యూస్ ల వివరాలు ఇవ్వబడ్డాయి. ఇది ఒక నమూనా మాత్రమే.
 • కీమో ఇస్తున్న సమయమలో అన్నవాహికలో కొంత మార్పు రావచ్చు. కడుపులో మంట వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దినికోసం ఆంటాసిడ్ లు ఇస్తారు. దానితో పాటు వేయించిన శెనగపప్పు/పుట్నాల పప్పుల పొడిని నీటితో కలిపి తాగడం వలన అన్నవాహికపై ఒక్స్ లేపనం లాగా పనిచేస్తుంది.

నిషేధించవలసినవి

 • అతిగా ఉడికించినవి గాని (మెత్తగా ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలు), పూర్తిగా  పచ్చివికాని(పచ్చి కూరగాయలు, పండ్లు), నిలువ చేసినవికాని (ఊరగాయలు, చిరుతిళ్ళు) తీసుకోకపోవడం చాలా మంచిది.
 • ఏది తీసుకున్న తాజాగా ఉండేట్లుగా చూసుకోవాలి. అలాగే, పంచదార, మైదావంటి పిండి పదార్థాలు, ఉప్పు పూర్తిగా తగ్గిస్తే మంచిది.
 • గొడ్డు మాంసం పూర్తిగా నిషేధించాలి.
 • మజ్జిగ తీసుకోవచ్చు, కాని పెరుగు తీసుకోకూడదు. ఎందుకంటే పెరుగుకు శరీరంలో కఫం పెంచే గుణం ఉంది. అలాగే మ్యూసిన్ ఉన్న అహారాపదార్థలకు శరీరంలో క్యాన్సర్ పెంచే గుణం ఉంటుంది. అవి తీసుకోకపోవడం మంచిది. ఉదాహరణకు పచ్చి బెండకాయ, దొండకాయ, చామగడ్డ మొదలైనవి.
 • మసాలాలు అసలు తీసుకోవద్దు.

కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో మామూలుగా తీసుకునే ఆహారంతోపాటు క్రింద విపులీకరించిన రసాలు తీసుకోవడం వల్ల శరీరానికి వ్యాధి నిరోధక శక్తి లబిస్తుంది.

1,2 వ రోజులు3, 4 వ రోజులు5, 6 వ రోజులు7 వ రోజులు

150 గ్రాముల  లేత         పాలకూర,

150 గ్రాముల  క్యాబేజి,

8 శాలరీ కాడలు ఆకులు లేనివి,

8 నిమ్మకాయలు

 

150 గ్రాముల లేత పాలకూర,

150  గ్రాముల క్యాబేజి,

8 నిమ్మకాయలు,

8 శాలరీ కాడలు ఆకులు లేనివి.

8 క్యారెట్స్,

3 నారింజ పండ్లు,

1.25  సెంటీమీటర్ల  అల్లం,

4 నిమ్మకాయలు

 

ఏ రసాన్ని తీసుకోకూడదు,
పాలకూర, క్యాబేజి, శాలరీకాడలను ఒక లీటరు నీళ్ళతో కలిపి రసాన్ని తయారు చేసుకోవాలి. ఈ రసాన్ని రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి. త్రాగే ముందు మాత్రమే నిమ్మరసాన్ని కలుపుకోవాలి. పాలకూర, క్యాబేజి, శాలరీ కాడలను 2 లీటర్ల నీళ్ళతో కలిపి రసాన్ని తయారు చేసుకోవాలి. ఈ రసాన్ని రోజుకు నాలుగుసార్లు తీసుకోవాలి. త్రాగే ముందు మాత్రమే నిమ్మరసాన్ని కలుపుకోవాలి. క్యారెట్ లను, నారింజ పండ్లను, అల్లం ఒక లీటర్ నీళ్ళతో కలిపి రసాన్ని తయారు చేసుకోవాలి. ఈ రసాన్ని రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి. త్రాగే ముందు మాత్రమే నిమ్మరసాన్ని కలుపుకోవాలి.
8 నుంచి 11 రోజుల వరకు 12, 13 వ రోజులు 14 వ రోజు 15 నుంచి 18 రోజుల వరకు

8 క్యారెట్లు,

4 నారింజలు,

బీట్ రూట్ లో సగభాగం,

1.25  సెంటీమీటర్ల అల్లం,

2 నిమ్మకాయలు

 

8 క్యారెట్లు,

4 నారింజపండ్లు,

బీట్ రూట్ లో సగభాగం,

1.25  సెంటీమీటర్ల  అల్లం,

1 నిమ్మకాయ

 

ఏ రసాన్ని తీసుకోకూడదు

8 క్యారెట్లు,

4 ఆపిల్స్,

1.25  సెంటీమీటర్ల  అల్లం,

2 నిమ్మకాయలు

 

క్యారెట్లు, నారింజ, బీట్ రూట్ మరియు అల్లం ఒక లీటర్ నీళ్ళతో కలిపి రసం తయారు చేసుకోవాలి. రోజుకి నాలుగుసార్లు తీసుకోవాలి. త్రాగేముందు మాత్రమే నిమ్మరసాన్ని కలుపుకోవాలి. క్యారెట్లు, నారింజపండ్లు, బీట్ రూట్ మరియు అల్లం ఒక లీటర్ నీటితో కలిపి రసం తయారు చేసుకోవాలి. రోజుకి నాలుగుసార్లు తీసుకోవాలి. త్రాగేముందు మాత్రమే  నిమ్మరసాన్ని కలుపుకోవాలి. క్యారెట్లు, ఆపిల్స్, అల్లం ఒక లీటర్ నీటితో కలిపి రసం చేసుకోవాలి. రోజుకి నాలుగుసార్లు తీసుకోవాలి. త్రాగేముందు మాత్రమే నిమ్మరసాన్ని కలుపుకోవాలి.
19, 20 వ రోజులు 21వ రోజు
ఏ రసాన్ని తీసుకోకూడదు.

8 క్యారెట్లు,

4 ఆపిల్స్,

1.25  సెంటీమీటర్ల అల్లం,

2 నిమ్మకాయలు.

క్యారెట్లు, ఆపిల్స్, అల్లం ఒక లీటర్ నీటితో కలిపి రసం చేసుకోవాలి. రోజుకి నాలుగుసార్లు తీసుకోవాలి. త్రాగేముందు మాత్రమే నిమ్మరసాన్ని కలుపుకోవాలి.


ఆధారం: డాక్టర్. టి.సుప్రజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆహారం & పోషణ విభాగం.

3.03571428571
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు