హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / లావు తగ్గాలంటే...
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

లావు తగ్గాలంటే...

బరువు తగ్గాలనుకునేవాళ్లు ఆహారంలో రాగులు తప్పక చేర్చాలి. రాగుల్లో అధిక మొత్తంలో పీచుపదార్థం ఉంటుంది.

బరువు తగ్గాలనుకునేవాళ్లు ఆహారంలో రాగులు తప్పక చేర్చాలి. రాగుల్లో అధిక మొత్తంలో పీచుపదార్థం ఉంటుంది. తక్కువస్థాయిలో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ (అసంతృప్త కొవ్వులు) ఉంటాయి. పోషకాలు మెండుగా కలిగి ఉన్న రాగుల్ని మీకు నచ్చినట్టు వండుకోవచ్చు. మీ కోసం బరువు తగ్గించే కొన్ని రాగి వంటకాలు...

రాగి సూప్‌

కావలసినవి : రాగి పిండి - ముప్పావు కప్పు, టొమాటో - ఒకటి (తరిగి), ఉల్లిపాయ - ఒకటి (తరిగి), కాలీఫ్లవర్‌ - అరకప్పు (తరిగి), పచ్చిబఠాణీలు - పావు కప్పు, క్యారెట్‌ ముక్కలు - పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు (తరిగి), నీళ్లు - ఒక లీటర్‌, పాలు - రెండు కప్పులు, పంచదార - ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు, కారం - రుచికి సరిపడా.

తాలింపుకు: కొబ్బరినూనె - ఒక టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర - ఒక టేబుల్‌ స్పూన్‌, బిర్యానీ ఆకులు - కొన్ని.

తయారీ : లోతైన గిన్నెలో నీళ్లు పోసి వేడిచేయాలి. నీళ్లు ఉడుకుపట్టగానే ఉల్లి, వెల్లుల్లి, క్యారెట్‌, కాలీఫ్లవర్‌, టొమాటో ముక్కలు, పచ్చిబఠాణీలు వరసగా వేయాలి. తరువాత ఉప్పు, పంచదార, కారం వేసి పది నిమిషాలు ఉడికించాలి. పాన్‌లో కొబ్బరినూనె వేడిచేసి తాలింపు పదార్థాలు వేయాలి. అవి చిటపటమనగానే సూప్‌లో వేసేయాలి. పాలు, నీళ్లలో కలిపిన రాగి పిండిని ఈ సూప్‌లో పోసి పది నిమిషాల పాటు సన్నటి మంట మీద ఉడికించాలి. కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడిగా తాగితే సమతులాహారం తీసుకున్నట్టే.
రాగి ఉప్మా

కావలసినవి : రాగి పిండి - ఒక కప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశెనగపప్పు, మినపప్పు - ఒక్కోటి అర టీస్పూన్‌ చొప్పున, నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, పసుపు - చిటికెడు, పచ్చిమిర్చి - రెండు (తరిగి), ఉల్లిపాయ, టొమాటో - ఒక్కోటి (తరిగి), కరివేపాకులు - కొన్ని, కొత్తిమీర - ఒక టేబుల్‌స్పూన్‌(తరిగి), ఉప్పు - రుచికి సరిపడా, నీళ్లు - రెండు కప్పులు, నిమ్మరసం - ఒకటేబుల్‌ స్పూన్‌.

తయారీ : ఒక టీస్పూన్‌ నూనెని పాన్‌లో వేడిచేయాలి. ఇందులో రాగిపిండి వేసి కాసేపు వేగించి పక్కన పెట్టాలి. మిగతా నూనెని కూడా వేడిచేసి జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటమంటుండగా పప్పులు వేయాలి. అవి బంగారు రంగు వచ్చాక కరివేపాకులు, ఉల్లి, టొమాటో ముక్కలు వేసి మరికాసేపు వేగించాలి. తరువాత ఉప్పు వేసి, నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. ఆ తరువాత రాగిపిండిని వేసి ఉండలు కట్టకుండా గరిటెతో కలియబెట్టాలి. పిండి బాగా కలిశాక పాన్‌ మీద మూతపెట్టి ఐదునిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. తరువాత నిమ్మరసం చిలకరించి, కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడిగా తినాలి
ఆధారము: ఆంధ్రజ్యోతి
3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు