పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వడదెబ్బ

వడదెబ్బ

పరిచయం

వేసవిలో మనం సాదారణంగా చూసే సమస్య వడదెబ్బ. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తిని  కొల్పోయినపుడు వడదెబ్బ సంభవిస్తుంది. దీనికి గురైతే వెంటనే వైద్యుని సంప్రదించాలి, చికిత్స చేయించుకోవాలి .

కారణాలు

వడదెబ్బకు ముఖ్యమైన కారణం నీరు తాగకుండా ఎండలో ఎక్కువసేపు ఉండి పని. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఊష్ణోగ్రత ఎక్కువ అవుతుంది, అప్పుడు శరీరంలో కణాలు చచ్చిపోతాయి. దాంతో శరీరంలో మార్పులు జరుగుతాయి.

ఎక్కువ వడదెబ్బకు గురయ్యేవారు

 • గర్భిణీ స్త్రీలు
 • చిన్నపిల్లలు
 • ఊబకాయలు
 • మద్యం తాగేవారు
 • వృధ్దులు
 • గుండె జబ్బుగలవారు

లక్షణాలు

ఊష్ణోగ్రత శాతం – 102 ఫారన్ హీట్ ఉంటే

 • కండరాల బలహీనత
 • తలనొప్పి
 • వికారం
 • బలహీనత
 • కళ్ళు తిరిగి పడిపొవడం

ఊష్ణోగ్రత శాతం – 106 ఫారన్ హీట్ ఉంటే

 • చర్మం ఎర్రగా కందిపోవడం
 • గుండె వేగంగా కొట్టుకోవడం
 • అధిక ఆయాసం
 • తలనొప్పి
 • సతమతమవడం, వింతగా  ప్రవర్తించడం,
 • తక్కువ రక్తపోటు
 • ఒక వేళ ఊష్ణోగ్రత 105 ఫారన్ హీట్  మించితే మెదడు పనితీరు మందగిస్తుంది.
 • ఊష్ణోగ్రత శాతం – 106 ఫారన్ హీట్ ఉంటేచర్మం ఎర్రగా కందిపోవడంగుండె వేగంగా కొట్టుకోవడంఅధిక ఆయాసంతలనొప్పిసతమతమవడం, వింతగా  ప్రవర్తించడం,తక్కువ రక్తపోటుఒక వేళ ఊష్ణోగ్రత 105 ఫారన్ హీట్  మించితే మెదడు పనితీరు మందగిస్తుంది.

చికిత్స

 • వడదెబ్బకు గురైనవారిని ముందుగా నీడ ఉన్న ప్రదేశానికి  తీసుకువెళ్ళాలి.
 • వారి శరీరాన్ని చల్లటి నీళ్లతో తుడవాలి.
 • ఎదైనా గుడ్డను తడిపి దానిపై వారిని పడుకోబెట్టడం వల్ల వేడిని నివారించవచ్చు.
 • ఒక వేళ శ్వాస అందనట్లైతే ఇతరుల నోటి ద్వారా శ్వాసను అందజేయాలి.
 • శరీరాన్ని పావుగంటకు ఒకసారి తడిగుడ్డతో తుడవాలి.
 • శరీరం నుండి కోల్పోయిన నీటిని సమతుల్యం చేయాలంటే వారికి మజ్జిగ, నిమ్మరసం, పండ్లరసాలు, కొబ్బరి నీళ్ళు, వేడి తగ్గించి ఒంటిని చల్లబరిచే పుదీన రసం , లస్సీ, కొత్తిమీర వేసిన మజ్జిగ మొదలైనవాటిని తాగించాలి. ఇలా చేయడం ద్వార వారిని తిరిగి సాదారణ స్దితికి తీసుకురావచ్చు.

వడదెబ్బకు గురికాకుండ తీసుకోవలసిన జాగ్రత్తలు

 • ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు  బయటికి వెళ్ళకూడదు.
 • ఒకవేళ వెళ్ళవలసి వస్తే వెంట గొడుగున తీసుకువెళ్ళాలి.
 • శరీరాన్ని ఎండబారి నుండి కాపాడుకోవడానికి లేతరంగుల, నిండైన, కాటన్ వస్త్రాలు, దుస్తులను ధరించాలి.
 • ఎక్కువగా నీరు తాగాలి, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, ఎక్కువగా తీసుకోవాలి.
 • రోజుకు రెండుపూటల ఆహారంలో మజ్జిగను చేర్చుకోవడం శ్రేయస్కరం.
 • శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లను, కూరగాయలను, దోసకాయలు, కొబ్బరిబొండాలు, ఆకు కూరలు, ఖర్బూజ, రాగి అంబలి, జొన్న జావ వంటివి తీసుకోవాలి.

ఆధారం: కుమారి. ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/10.

3.06493506494
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు