హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / వాకర్లు ఎలాంటి తప్పులు చేస్తారు?
పంచుకోండి

వాకర్లు ఎలాంటి తప్పులు చేస్తారు?

వాకర్స్‌ అందరూ కొన్ని నియమాల్ని విధిగా పాటించాలి

 

రోజూ ఓ గంట పాటు బ్రిస్క్‌ వాకింగ్‌ చేస్తే శరీరం బరువు తగ్గడానికి అది బాగా ఉపయోగపడుతుంది. కానీ, ఈ వాకింగ్‌ వల్ల పెద్ద ప్రయోజనం ఏదీ లేదంటూ కొందరు మధ్యలోనే మానేస్తారు. ఇందుకు సమాధానంగా ‘‘ వీరికి ఫలితం కనిపించకపోవడానికి వాకింగ్‌ ఉపయోగకరమైంది కాకపోవడం కాదు. బరువు త గ్గడానికి సహకరించే ఆహారం విషయంలో వారు నిర్లక్ష్యంగా ఉండడమే అందుకు కారణం’’ అంటున్నారు నిపుణులు. అందువల్ల వాకర్స్‌ అందరూ కొన్ని నియమాల్ని విధిగా పాటించాలంటున్నారు వారు. ఇవిగో ఇవే ఆ నియమాలు.

కొవ్వు పదార్థాలూ అవసరమే

బరువు తగ్గాలనుకునే వారిలో చాలా మంది కొవ్వు పదార్థాలు తినడం పూర్తిగా మానేస్తారు. దీనివల్ల శరీరానికి అవసరమైన మంచి కొవ్వు కూడా శరీరానికి అందకుండా పోతుంది. ఇంకా వీరు ఒమేగా-3 లభించే, పప్పు ధాన్యాలు, అవొకాడోలకు దూరమవుతారు. నిజానికి, కొబ్బరి, ఆలివ్‌ నూనెలు క్యాలరీలను ఖర్చుచేసే ఇంధనంగా ఉపయోగపడతాయి. ఇవేవీ తీసుకోకపోవడం వల్ల, శరీరం కార్బోహైడ్రేట్ల కోసం తపించిపోతుంది. వాటిని ఎక్కువగా తినడం మొదలెడితే శరీరం బరువెక్కిపోతుంది. అందువల్ల మంచి కొవ్వు సమృద్ధిగా లభించే అవొకాడో లాంటివి భోజనానికి భోజనానికీ మధ్య స్నాక్స్‌లా తీసుకోవాలి. అప్పుడే జీవక్రియలు సజావుగా పనిచేసి వాకింగ్‌ తాలూకు ఫలితాలు శరీరంలో కనిపిస్తాయి.

భోజనం మానుకోవద్దు

చాలా త్వరితంగా బరువు తగ్గాలనుకునే వారిలో చాలా మంది భోజనం మానేస్తుంటారు. బ్రేక్‌ఫా్‌స్టనో, లంచ్‌నో ఇలా మానేయడం వల్ల జీవక్రియలన్నీ కుంటుపడతాయి. దీనినవల్ల ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రకియ ఆగిపోతుంది. ఫలితంగా కొవ్వు పదార్థాలు శరీరంలో నిలువైపోతాయి. అందువల్ల భోజనం మానేయడం అన్నది చాలా హానికరమైన విధానమని గమనించాలి. నిజానికి బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేవారు స్వల్ప మోతాదులోనే అయినా ఆహారాన్ని రోజుకు ఆరు దఫాలుగా తీసుకోవడం అవసరం.
ఎనర్జీ బార్లతో ఇబ్బందే

పలురకాల పోషకాల మిశ్రమంగా మార్కెట్లో లభించే గ్రనోలా లాంటివి కొందరు తరచూ తీసుకుంటూ ఉంటారు. అయుతే వీటిలో షుగర్‌ ఎక్కువగా ఉండడం వల్ల విపరీతంగా తినేసేతత్వం పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. అందుకే ప్రీ-పాక్డ్‌ స్నాక్స్‌ కాకుండా తాజా ఆర్గానిక్‌ ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇవి చాలా నిదానంగా జీర్ణం కావడం వల్ల మళ్లీ మళ్లీ తినేలా ఆకలేమీ కాదు. అందువల్ల ఓ పిడికెడు వాల్నట్స్‌, బాదం, లేదా ఏవైనా పండ్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు.
ఆధారము: ఆంధ్రజ్యోతి

 

 

2.8813559322
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు