హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / విహారంలో ఆహారంతో జాగ్రత్త
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

విహారంలో ఆహారంతో జాగ్రత్త

విహారంలో ఆహారంతో జాగ్రత్త

విహారయాత్రలో ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణానికి ముందే డాక్టర్‌ను కలవాలి.

ప్రయాణ సమయంలో ఎదురయ్యే కొన్ని వ్యాధులకు వ్యాధినిరోధక ఔషధాలు తీసుకోవాలి.

అవసరానికి తగ్గట్టుగా మందులు తీసుకోవాలి. అతి సాధారణంగా వచ్చే అనారోగ్యాల విషయాల్లో ఈ జాగ్రత్తలు పాటించాలి.


డయేరియా

ప్రయాణంలో కలుషిత ఆహార పానీయాల ద్వారా తలెత్తే సమస్యలే ఎక్కువ. కొత్త ప్రదేశాల్లో, కొత్త రకం ఆహార పదార్థాలు, మసాలా పదార్థాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువ. వాంతులు, విరేచనాల వంటి సమస్యలకు ఇవే కారణం. అందుకని ఓఆర్‌ఎస్‌, యాంటీ-డయేరియా వంటి మందులు దగ్గర పెట్టుకోవాలి.
వీటి బారిన పడకుండా ఉండాలంటే శుభ్రమైన నీళ్లనే తాగాలి. తాజాగా వండిన ఆహారమే తీసుకోవాలి. సలాడ్స్‌, పండ్ల రసం వంటివి అప్పటికప్పుడు తయారుచేసినవే అయి ఉండాలి. తక్కువస్థాయి ప్రమాణాలున్న రెస్టారెంట్లలో మాంసాహారం తినొద్దు.

మలేరియా-డెంగ్యూ

ఈ రెండు వ్యాధులూ దోమల ద్వారా వ్యాప్తి చెందేవే. ఇవి నీరు బాగా నిలిచి ఉండే ప్రదేశాల్లో పెరుగుతాయి. మలేరియాను వ్యాప్తి చేసే దోమలు రాత్రివేళల్లో, డెంగ్యూను వ్యాప్తి చేసే దోమలు ఉదయంపూట ఎక్కువగా కుడుతుంటాయి.

మలేరియా, బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి. యాంటీ- మలేరియా మందులు వాడటం ద్వారా నివారించవచ్చు. డెంగ్యూ ఫీవర్‌ రావడానికి వైరస్‌ కారణం. ఇంటికి వచ్చాక చూద్దాంలే అని నిర్లక్ష్యం చేయకుండా ఇబ్బందిగా అనిపించిన వెంటనే సమీపంలో ఉన్న డాక్టర్‌ను సంప్రదించాలి.
ఆధారము: ఆంధ్రజ్యోతి
2.97
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు