హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / వ్యక్తి గత ఆరోగ్యం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యక్తి గత ఆరోగ్యం

పనులు చేసిన వెంటనే చేతులు, కళ్ళు, ముఖం, చర్మం శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకొనే కార్యక్రమాన్ని వ్యక్తిగత ఆరోగ్యం అంటారు.

దుమ్ము, ధూలి మన శరీరం మీద తెలియకుండా చేరుతుంది. శరీరానికి చెమట పడుతుంది. మనం రోజు అనేక క్రీములు, సూక్ష్మ జీవులతో వస్తువుల్ని చేతులతో పట్టుకుంటాము. ఇతరులు మట్టి చేతులతో ముట్టుకున్న వస్తువుల్ని ఒక చోటనుండి మరొక చోటుకు మన చేతులతో తరలిస్తాము. తుడవని, శుబ్రపరచని బెంచీలు, కుర్చీలు, సోఫాలో కూర్చుంటాము. నిద్రనుండి లేచిన మొదలు రాత్రి నిద్ర పోయే వరకు చేసే పనుల్లో మన వివిధ అవయవాలు రోగకారక క్రీములు, సూక్స్మజీవులతో నిలయమౌతాయి.

శరీరం పై వాటికి అలాగే వదిలినట్లయితే కొన్ని రోజులకు శరీరం రోగమయం అవుతుంది. ఆయా పనులు చేసిన వెంటనే చేతులు, కళ్ళు, ముఖం, చర్మం శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకొనే కార్యక్రమాన్ని వ్యక్తిగత ఆరోగ్యం అంటారు.

కంటిచూపు - చూపవలసిన శ్రద్ధ

ఇంద్రియాలలో అతి ముఖ్యమైనది కన్ను. ఆరోగ్యవంతుని నేత్రాలు ఎంతో మిలమిలలాడుతాయి. కంటినిబట్టే వ్యక్తి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు.

ప్రతీ రోజు ఉదయం లేచిన తరువాత ముఖంతో పాటు కళ్ళను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. చల్లని నీటితో కళ్ళను శుభ్రం చేయడం మంచిది. తరువాత మెత్తని శుభ్రమైన బట్టతో తుడవాలి.

పిల్లలు బడిలో కానీ ఇంటిలో కానీ ఆటలు ఆడుతున్నప్పుడు ఒకరి మీద ఒకరు మన్ను గుప్పుకోకూడదు, బుడ్డబుడ్డ  మన్నుపెడ్డలు విసిరేసుకోవద్దు. మొనదేలిన పనిముట్లతో ఆడుకోవద్దు కంట్లో ఇసుక, దుమ్ము పడినపుడు వేళ్ళతో నలపకుండా వెంటనే  డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కళ్ళ కల్కలు, కంటి రోగాలు వచ్చినపుడు రాత్రి పడుకునేటపుడు తల కింద ఒక శుభ్రమైన గుడ్డను పెట్టుకోవాలి.

తట్టు వంటి రోగాలు వచ్చినపుడు కంటి దురదలు, మంట, కంటి నుంచి నీళ్ళు కారుతాయి. అప్పుడు కంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువ వెలుతురు చూడకూడదు.

ఆధారము : పోర్టల్ విషయ రచన భాగస్వాములు, శంకర్

2.96907216495
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు