హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / వ్యవసాయ మహిళలు - ఒత్తిడిని తగ్గించే పరిజ్ఞానం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయ మహిళలు - ఒత్తిడిని తగ్గించే పరిజ్ఞానం

వ్యవసాయ మహిళలు - ఒత్తిడిని తగ్గించే పరిజ్ఞానం

పరిచయం

మనదేశంలో 90 మిలియన్లకు పైగా స్త్రీలు వ్యవసాయ పనులలో పాల్గొంటున్నారు. వీటిలో భూమి సిద్ధం చేయడం, విత్తనాలు చల్లటం, కలుపు తీయటం, కోత కోయటం, పంటను మోపుగ కట్టటం, మోపులు మోయడం, నుర్చడం, ఒలవడం, తూర్పూర పట్టడం, రుబ్బడం, విసరడం మొదలగు పనులు చేస్తారు.

ఈ పనులన్నీ ఎక్కువ సేపు నడుమును సుమారు 60 డిగ్రీల వరకు వంచి పని చేయవలసి వస్తుంది. దీని వలన గుండె ఒత్తిడికి గురై నిమిషానికి సుమారు 148 సార్లు వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. అదే విశ్రాంతిగా ఉన్నట్లయితే నిమిషానికి 78 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. కలుపుతీసేటప్పడు అయితే మోకాలు మడిచికూర్చుని, పాదాల పై బరువు ఆన్చి రోజంతా పని చేయవలసి వస్తుంది. ఈ పని వల్ల గుండె నిమిషానికి 113 సార్లు కొట్టుకుంటుంది. పంట నూర్చేటప్పుడు కూడా బరువైన చెట్లను చేతి పై ఎత్త వలసి వస్తుంది. వీటి వల్ల కూడా శరీర శ్రమ పెరిగి , గుండె నిమిషానికి 142 సార్లు కొట్టుకోవడం జరుగుతుంది .

నిరంతరం పని చేయటం వలన అలసటకు, వత్తిడికి గురవుతారు

అలసట అoటే

మనిషి శరీరం ఒక అద్బుతమైన యాంత్రిక వ్యవస్థ కీళ్ళు, కండరాలు, కదలికతోనే మనిషి పని చేయగలుగుతాడు. కండరాలు, కీళ్ళు అధికంగా ఉపయోగించడం వల్ల మనిషి శారీరకంగా అలసట చెందుతాడు.

ఇంటి పనులలో అలసిపోవడం సహజం. అలసిపోగానే నీరసం వస్తుంది.ఏ పని చేయకూడదు అనిపిస్తుంది.ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది. ఇలాంటి సాధారణ అలసట నుండి సులభoగా బయటపడే మార్గం కడుపు నిండా తిండి, కంటి నిండి నిద్ర .

వేళకు భోజనం చేయకపోవడం వలన శక్తి లభించక నీరసం వస్తుంది. పోషకపదార్దాలు అందక పోవడం వలన కూడా చురుకుదనం తగ్గుతుంది, అలసట వస్తుంది.

ఒత్తిడి అoటే

శరీరంలోని హార్మోనులు సాధారణమైన వేగంతో కాకుండా మరింత వేగంగా పని చేయడం వల్ల ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడి నిరంతర ప్రక్రియ అయితే ఆహార్మోనులు శరీరానికి, మానసిక సామర్థ్యానికి కూడా హాని కలిగిస్తాయి.

కండరాల ఫై అధిక బరువు వేయడం వలన, కండరాల పై అధిక ఒత్తిడి కలుగుతుoది. కండరాలు నొప్పికి గురి అవుతాయి, కండరాలు దెబ్బతినడమే కాక పని చేయడం కష్టతరమౌతుంది. పనులలో సాంకేతిక పరికరాలు విని యోగిస్తే యాంత్రిక సామర్ద్యం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. శరీరాన్ని సమర్దవంతంగా వాడట మంటే తక్కువ శారీరక శక్తి వినియోగంతో ఎక్కువ పనిని ఎక్కువ సేపు చేయగలగడం. కొన్ని సూచనలు పాటిస్తే వ్యవసాయ పనులలో ఒత్తిడిని సునాయాసంగా తగ్గించుకోవచ్చు.

ఒత్తిడిని తగ్గించే పరిజ్ఞానం

1 విత్తనo, ఎరువు ఒకేసారి నాటే వీలుగల గొర్రు : మెట్ట పంటలలో నాగలి వెనుక స్త్రీలు, విత్తనo, ఎరువుల మందును నడుము వంచి సాళ్ళులో చల్లుకుంటూపోతారు. నడుము వంచకుండా అదే పనిని మరింత సమర్దవంతంగా చేయడానికి గొర్రు ఉపయోగపడుతుoది. దీనిని, నాగలికి వెనుకగా అమరుస్తారు. గొర్రు ఫై ఉన్న శంఖాకరపు దొప్పల ద్వారా విత్తనo, మందు జారవిడి స్తే అది సాళ్ళలో వేర్వేరు లోతులకు చేరి, సరైన రీతిలో భూమిలో పడుతుoది.
2 మొక్కజొన్న గింజలు వలిచే సాధనాలు : : ఎoడిన మొక్కజొన్న కండెల గింజలను వేరు చేయడానికి స్థూపాకారపు ట్యూబును ఉపయోగించవచ్చు. ఇందులో అమర్చబడిన బ్లేడు వల్ల , కండెలను అటూ, ఇటూ త్రిప్పుతూ గింజలను వలువవచ్చు.
3 కలుపు తీసే పరికరాలు: పరికరాలు: సాళ్ళలో నాటిన పంటలలో సులువుగా కలుపు తీసేందుకు చిన్న కొడవళ్ళు, కుర్ఫీలను వాడుతుంటారు. స్త్రీలు, నిలుబడి కలుపు తీసేందుకు చక్రాలతో నడిచే కలుపు తీసే పరికరాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా 25 మి.మీ-30 మి. మీ లోతు వరకు కలుపుతీయవచ్చు.
4 మేలు రకం కొడవళ్ళు : పంట కోయడానికి ఉపయోగించే సాధారణ కొడవళ్ళలో పళ్ళు అరిగిపోతూ మొండుబారుతాయి. మేలు రకం కొడవళ్ళు తేలికైన ఉక్కుతో తయారు చేయబడి, పళ్ళు అరగకుండా వుంటాయి. కొడవలి వంపు వలన మొక్కలను ఒత్తి పట్టుకొని వుండి, పంట కోత త్వరితంగా పూర్తవుతుంది.
5 గింజలను వలిచే యంత్రాలు : : ఇది ఒక అర్ధచంద్రాకారపు పాత్ర కలిగిన సాధనం. దీనిలో ముందుకు, వెనుకకు జరిగే హేండిల కలిగిన ఇనుప పాదం అమర్చ బడి వుంటుంది. ఇందులో వేసిన వేరుశనగ కాయలు పాత్రకు, ఇనుప పాదాలకు మధ్య నలిగి గింజలు తొక్కలతో సహా క్రిందకు రాలుతాయి.
6 మెట్ట పంటలలో నాగలి వెనుక విత్తనం, ఎరువుల మందును నడుము వంచి సాళ్లలో చల్లుకుంటూ పోతారు. నడుo వంచకుండా అదే పనిని మరింత సమర్దవంతంగా చేయడానికి విత్తనం, ఎరువు ఒకేసారి నాటే చక్రo గల గొర్రుని ఉపయోగించండి. నడుము పై శ్రమ, ఒత్తిడి తగ్గుతుంది.
7 పువ్వులను, కూరగాయలను మొక్కల నుండి కోసేటప్పుడు చేతివేళ్ళను కాపాడే పరికరము ఫింగర్ గార్డ్ ను ఉపయోగించండి. మీ గోళ్ళకి రక్షణగా నిలుస్తుంది. త్వరగా పని పూర్తీ చేయవచ్చు.
8 కోసిన పంటను ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి తీసుకెళ్ళాలంటే తల పై కాకుండా హెడ్ లోడ్ మేనేజర్ ను వాడండి, మెడ పై ఒత్తిడి మరియు శారీరక శ్రమ తగ్గుతుంది.
9 ధాన్యలను శుభ్ర్రపరిచే పరికరము ను ( గ్రెయిన్ క్లీనర్ ను ) వాడండి. అతి తక్కువ సమయంలో ధాన్యాలను సులువుగా శుభ్ర్రపరుచు కోవచ్చు పని ఒత్తిడిని తగ్గిస్తుంది, పని వేగం పెంచుతుంది.
10 మొక్కజొన్న కండెల నుండి గింజలను వేరు చేయడానికి గింజలను ఒలిచే యంత్రం వాడండి. చేతి వేళ్ళ పై ఒత్తిడి తగ్గుతుంది, గింజలను సులువుగా వేరు చేయవచ్చు. సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
11 మొక్కజొన్న కండెల నుండి గింజలను వేరుచేయడానికి చేతులతో మొక్కజొన్న గింజలను వేరుచేసే పరికరము ను-హ్యాండ్ ఆపరేటేడ్ మైజ్ షల్లర్ వాడితే వేళ్ళ పై ఒత్తిడి ఉండదు . సమయం ఆదా అవుతుంది.
12 మేలు రకం కొడవలి వాడండి . చేతుల మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా, తక్కువ సమయంలో ఎక్కువ పంటను సులువుగా కోయవచ్చు. అలాగే ఈ కొడవలిని తరచూ పదును చేయ వలసిన అవసరం లేదు
13 పైరు లో కలుపును సులువుగా తీయడానికి సరళ కురిపిని వాడండి. అర చేతి పై ఒత్తిడి పడకుండా త్వరగా పని పూర్తి చేసుకోండి.
14 వేరుశనగ కాయలను చేతితో నేల పై కొట్టితీయడంలో శ్రమ, ఒత్తిడి ఉన్నాయి. డికార్డకేటర్ అనే పరికరంతో పనిని సౌకర్యవంతంగా, నిలుచుని లేదా కూర్చుని పూర్తి చేయవచ్చు, కండరాల పై కూడా ఒత్తిడిని తగ్గించవచ్చు.
15 ప్రత్తి ఏరిన తరువాత, ఎండిన ప్రత్తి మొదళ్ళను చేతులతో తీసివేసే కంటే మొదళ్ళను పీకే యంత్రము- కాటన్ స్టాక్ పుల్లర్ ఉపయోగించి ఒత్తిడి లేకుండ సులువైన పద్దతిలో పని చేసుకోవచ్చు.
16 నిలుచుని పని చేసేటప్పటి కంటే వంగి పని చేసేటప్పుడు గుండె, ఊపిరితిత్తుల పై ఎక్కువ వత్తిడి వుంటుoది. పొలాన్ని శుభ్ర్రపరిచే సమయంలో నడుము వంచి పని చేయడం వలన శారీరకంగా అలసట కూడా ఎక్కువ. దానితో కండరాలు నొప్పికి గురై , క్రమంగా దెబ్బ తింటాయి. కాబట్టి హ్యాండ్ రేక్ వాడి, పని సులువుగా పూర్తి చేసుకోండి.
17 కాటన్ పిక్కింగ్ అప్రాన్ మరియు స్కార్ఫ్ను వాడడం శ్రేయస్కరం ! ఎందుకంటే అప్రాన్ వలన బరువు వీపు పై సమాంతరంగా మోయవచ్చు. అలాగే కండరాల పై ఒత్తిడిని తగ్గిస్తుంది, పని వేగాన్ని పెంచుతుంది. స్కార్ఫ్ ఎండ బారి నుండి ముఖం పై గల సున్నితమైన చర్మాన్ని కాపాడుతుంది.
18 సాధారణంగా పాలు పితికేప్పుడు, కాలి మునివేళ్ళ పై లేదా పాదాల పై గొంతు కూర్చొని పితుకుతుంటారు. ఇది నడుము, మోకాళ్ళ పై చాల ఒత్తిడి కలిగిస్తుంది . అలా కాకుండా రివాల్వింగ్ మిల్కింగ్ స్టూలు పై కూర్చుని, స్టాండ్ పై పాత్రను అమర్చి పాలు తీయడం వలన మోకాళ్ళు నడుము పై శ్రమ తగ్గించవచ్చు.
19
నేల , పేడ శుభ్ర్రపరిచే పొడవైన చీపురు- లాంగ్ హ్యాండ్ బ్రూమ్ అండ్ డంగ్ - క్లీనర్ ని ఉపయోగించి పశువుల పాకని అనుకూలంగా శుభ్ర్రo చేసుకోండి. మరియు మోకాళ్ళు, నడుము పై శ్రమ ఒత్తిడిని తగ్గించుకోండి.
20 పొలoలో మందులను ఒక స్థలం నుండి ఇంకో స్థలం తీసుకెళ్ళాలoటే తలపై నో , భుజాల పై నో మోసుకెళ్తారు . ఫెర్టిలైజెర్ ట్రాలీని వాడడo వల్ల కండరాల పై ఒత్తిడి తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది . క్రిమి సంహారక మందులు చల్లేటప్పుడు ముఖము నుండి పాదాల వరకు రక్షణ దుస్తులు ధరిస్తే విషతుల్య పదార్దాల నుండి శరీరాన్ని సంరక్షిoచుకోవచ్చు. మందు పిచికారి చేసే సమయంలో ముఖానికి మాస్క్ ధరించాలి . దాని వలన ముఖానికి హాని కలగ కుండ జాగ్రత్త పడవచ్చు.
21 క్రిమిసంహారకాలను కలిపేటప్పుడు పరగడుపున చేయకూడదు, దాని వలన కళ్ళు తిరగడo, వాంతులు కావడం లాoటివి జరగవచ్చు. క్రిమిసంహారకాలను చల్లేటప్పుడు గాలికి ఎదురుగా చల్లవద్దు. పొలం లో ఉదయం లేదా సాయంకాలం మందులు చల్లడం శ్రేయస్కరం.
22 పురుగు మందులు పిల్లలకు అందకుండా అలమరలో పెట్టి తాళం వేయాలి. ఎందుకంటే పిల్లలు అవి చూసి తాగేవో, తినేవో అని పొరపాటు పడతారు.
23 మొక్కలకు చీడ పీడలు కలిగినప్పుడు పైరు పై అవగాహన కలిగిన వారి సలహాలు , సూచనలు తీసుకోవాలి.
24 క్రిమిసంహారకాలను పొలoలో చల్లడం అయిపోయిన తరువాత చేతులను, ముఖoను శుభ్ర్రoగా కడుగుకోవాలి.క్రిమిసంహారకాలను నేరుగా స్ప్రేయర్ లో కలపకూడదు. ముందుగా డ్రమ్ములో కలిపి స్ప్రేయర్ లో కి పోయడం వలన సమాన పరిమాణాలలో మందు కలిసి ఆశిoచిన ప్రయోజనానికి ఉపయోగ పడుతుoది.
25 మందు డబ్బాల పై ఉన్న వివరాలను జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోవాలి. నకిలీ మందుల గురించి జాగ్రత్త పడండి. కీటకనాశన మందులు స్ప్రేయర్ లో పోసేటపుడు బయట చిందకుండా ఉండడానికి గరాటు ఉపయోగించాలి.
26 స్ప్రేయర్ లోని నాజిల్‌ను శుభ్రపరచడానికి నోటితో గాలిని ఊదకoడి. దీని వలన ఊపిరితిత్తులు దెబ్బ తినే అవకాశం ఉంది. పురుగు మందులు చల్లుతూ, పొగత్రాగటం కానీ, తినడం కానీ చేయకూడదు. దానితో ప్రాణాపాయం కలుగుతుంది. మందు చల్లిన పొలoలో హెచ్చరిక బోర్డుని పెట్టండి.

ఆధారం: డాక్టర్. ఎ.మృణాళిని,సీనియర్ సైంటిస్ట్,ఎ.ఐ.సి.ఆర్.పి.,గృహ విజ్ఞాన విభాగంకుమారి బి.బేబి రూడ, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2010/012.

3.01136363636
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు