హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / సొరియాసిస్‌కు పక్కా వైద్యం
పంచుకోండి

సొరియాసిస్‌కు పక్కా వైద్యం

 

సొరియాసిస్‌ చర్మ సంబంధిత మైన ఒక దీర్ఘకాలిక వ్యాధి. చర్మంలో సహజంగా ఎపిడర్మిస్‌, డర్మిస్‌, హైపోడర్మిస్‌ అనే మూడు పొరలు ఉంటాయి. ఈ పొరల్లోని చ ర్మకణాలు ప్రతి 28 రోజులకు ఒకసారి చనిపోయి మళ్లీ కొత్త కణాలు పుడుతుంటాయి. ఈ చర్మకణాలు పై పొర అంటే ఎపిడర్మిస్‌ ద్వారా బయటికి వచ్చి రాలిపోతుంటాయి. ఇలా రాలిపోవడాన్ని మనం గుర్తించలేం కూడా. అయితే సొరియాసిస్‌ వ్యాధి సోకిన వారిలో ఈ 28 రోజుల పాటు జరగాల్సిన ప్రక్రియ ఐదారు రోజుల్లోనే పూర్తవుతుంది. ప్రక్రి య అంత వేగంగా, ఐదారు రోజుల్లోనే పూర్తి కావడం వల్ల చనిపోయిన కణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా అతిగా ఉత్పన్నమయ్యే కణాలు అంతే వేగంగా చనిపోవడం వల్ల ఆ కణాలన్నీ చర్మం పై పొరమీద అట్టకట్టి పొలుసులుగా రాలిపోతుంటాయి. ఈ చనిపోయిన చర్మకణాలు శరీరంలోని ఏ భాగం నుంచైనా బయటకు వెళుతుంటాయి. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లు, వీపు, ఛాతి, తల బాగాల్లోంచి ఎక్కువగా బయటపడుతుంటాయి. ఈ వ్యాధి ఎక్కువగా చలికాలంలో కనిపిస్తుంది. మిగతా వేసవి, వర్షాకాలాల్లో ఈ లక్షణాలు కొందరిలో అసలే కనపడకుండా పోతాయి. ఈ పరిణామాన్ని చూసిన కొందరు ఈ వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని పొరబడుతుంటారు. 
వ్యాధి కారకాలు: వంశపారంపర్యత, మానసిక ఒత్తిడి, ఆంధోళన, పొడి చర్మం కలిగి ఉండడం ఈ వ్యాధి రావడానికి కారణం కావచ్చు. దీర్ఘకాలికంగా నాన్‌ స్టీరాయిడల్‌, యాంటీ ఇన్ఫర్మేటివ్‌ డ్రగ్స్‌, అతిగా పొగ తాగే అలవాటు ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు. స్థూలకాయులు, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. హఠాత్తుగా వచ్చే వాతావరణ మార్పులు కూడా ఈ వ్యాధికి దారి తీయవచ్చు.

 

సొరియాసిస్‌ లక్షణాలు

చర్మం మీద చిన్నగా ఎర్రని మచ్చలు మొదలై, చర్మం బూడిద రంగులోకి మారిపోతుంది. ఆ తర్వాత పొలుసుల్లా రాలిపోతుంది.
ఈ మచ్చలు మి. మీ నుంచి మొదలై, కొన్ని సెంటీ మీటర్ల దాకా విస్తరిస్తాయి. విపరీతమైన దురద వేస్తాయి.
తలలో అయితే చుండ్రులా కొందరిలో పెద్ద పెద్ద పొలుసుల రూపంలో రాలిపోతుంటాయి.
గోర్లమీద గుండు సూది మొనలు దిగినట్లు గుంతలు పడతాయి. ఒక దశలో గోరు పసుపు రంగులోకి మారి చర్మం నుంచి వేరుపడుతుంది కూడా.
చర్మం మీదున్న పొలుసులను బలంగా లాగినప్పుడు చర్మం మీద చిన్న చుక్కల్లా రక్తం వస్తుంది.

సొరియాసిస్‌ వ్యాధి రకాలు

సొరియాసిస్‌ వల్గారిస్‌: దీన్నే ప్లేక్‌ సొరియాసిస్‌ అని కూడా అంటారు. సొరియాసిస్‌ వ్యాధిగ్రస్తుల్లో 80 శాతం మందిలో కనిపించే వ్యాధి ఇదే. ఇది చర్మం మీద ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా, మోచేతులు, మోకాళ్లు, తల, ఛాతీ, ఉదర భాగం, వీపు పైన ఎక్కువగా కనపడుతుంది. ఈ వ్యాధితో చర్మం పొడిబారి, పగులు బారి, పొలుసుల రూపంలో రాలిపోతుంటాయి.

గట్టేట్‌ సొరియాసిస్‌: ఇది చర్మం మీద ఎర్రని చుక్కల్లా వస్తుంది. ఇవి విస్తరించి, పరస్పరం కలిసిపోకుండా, ఎప్పటికీ చుక్కల్లాగే చర్మం మీదంతా వస్తాయి. ఆ భాగంలో చర్మం ఎర్ర గా మారి బూడిద రంగులోకి మారి పొలుసులుగా మారిపోతుంటాయి.

ఇన్వర్స్‌ సొరియాసిస్‌: దీన్నే ఫ్లెక్సూరల్‌ సొరియాసిస్‌ అంటారు. ఇది ఎక్కువగా చర్మం మడతల్లోనే కనిపిస్తుంది. ముఖ్చంగా చంకల్లో, గజ్జల్లో, పిరుదల భాగంలో, వక్షోజాల కింది భాగంలో కనపడుతుంది. ఈ వ్యాధి సోకిన చోట ఎర్రగా నిగనిగలాడుతుంది. ఇందులో చర్మం పొడిబారి పొలుసులుగా రాలడం ఉండదు. ఇది అధిక బరువు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
పస్ట్యులార్‌ సొరియాసిస్‌: ఇది చర్మం పగుళ్ల వద్ద బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. చీము పొక్కులు వచ్చి నొప్పిగా ఉండడం, విపరీతమైన జ్వరం వచ్చి, ఒకే రోజులో శరీరం మొత్తం వ్యాపించి అత్యవసరంగా హాస్పిటల్‌లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పామా ప్లాంటార్‌ సొరియాసిస్‌:ఈ వ్యాధి వల్ల అరచేతులు, అరిపాదాలు పగుళ్లు బారి వాటి మధ్యలోంచి సొనలు కారుతుంటాయి. ఈ అరచేతులు, అరిపాదాలు తప్ప శరీరంలోని మిగతా భాగాలన్నీ మామూలుగానే ఉంటాయి.
సొరియాసిస్‌ చికిత్స: హోమియో వైద్య విధానంలో చికిత్స అనేది రోగి శరీర తత్వం, మానసిక స్థితి, వ్యాధి లక్షణాల ఆధారపడి సాగుతుంది. దీన్నే కాన్స్‌టిట్యూషనల్‌ థెరపీ అంటారు. ఈ చికిత్స ద్వారా వ్చాధి ఏ స్థాయిలో ఉన్నా పూర్తిగా తగ్గించే
అవకాశం ఉంది.
డాక్టర్‌ ఎ.ఎం.రెడ్డి, పాజిటివ్‌ హోమియోపతి, 
ఫోన్‌: 92461 99922
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు
డాక్టర్‌తో మాట్లాడాలంటే
ఫోన్‌: 92461 66333

ఆధారము: ఆంధ్రజ్యోతి

 

 

2.96666666667
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు