హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / స్థానికంగా లభించే ఔషధ మొక్కలు.
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

స్థానికంగా లభించే ఔషధ మొక్కలు.

మొక్కలలోని ఔషధ గుణాలను అభినందించే వైఖరిని అభివృద్ధి చేయడం.

లక్ష్యం

మొక్కలలోని ఔషధ గుణాలను అభినందించే వైఖరిని అభివృద్ధి చేయడం.

నేపథ్యం

వృక్షావరణం చెట్లు, మొక్కలు, తీగలు, పొదలతో నిండి వుంటుంది. వీటిలో కొన్ని ఔషధ గుణాలు కలిగివుండి వివిధ రకాల రుగ్మతల చికిత్సలలో ఉపయోగపడతాయి. ఇటువంటి మొక్కలను మనం పరిసరాలలోను గుర్తించవచ్చు.

పద్ధతి

  1. మీ కుటుంబంలోని పెద్దలు లేదా చుట్టప్రక్కలవారిని లేదా ఉపాధ్యాయులను కలిసి స్థానికంగా ఉండే ఏ ఏ మొక్కలను ఔషధాలుగా ఉపయోగిస్తారో తెలుసుకోండి.
  2. ఔషధ మొక్కలకు గల ప్రత్యేక లక్షణాలను గుర్తించండి.
  3. ఔషధ మొక్కలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులను కలిసి వాటికి సంబంధించిన సమాచారం సేకరించండి. ఈ సందర్భంలో స్థానికంగా ఉండే ఆయుర్వేధ వైద్యులను కూడా కలవండి.

కింద ఇవ్వబడిన అంశాలపై సమాచారం సేకరించండి.

ఎ) మీ పరిసరాలలో ఎన్ని రకాల ఔషధ మొక్కలను గుర్తించగలరు.

బి) ఏదైనా ఒక రుగ్మత నివారణకు / చికిత్సకై వాడే ఔషధాన్ని ఏ విధంగా తయారుచేస్తారు?

సి) మొక్కలలోని ఏ భాగం ఏ రుగ్మత నివారణ చికిత్సల్లో వాడతారు?

డి) ఔషధ మొక్కలను పెంచుతారా? లేక అడవులలో వాటంతటవే మొలకెత్తుతాయా?

ఇ) ఔషధ మొక్కల భాగాలను వినియోగించుకున్న సందర్భాలలో వాటి మనుగడ, ఎదుగుదలపై ఏమైనా ప్రభావం ఉంటుందా?

ఎఫ్) ఔషధ మొక్కల సంరక్షణ, అభివృద్ధికై ఏవైనా చర్యలు చేపడుతున్నారా?

ముగింపు

మీ పరిశీలనలను నివేదిక రూపంలో రాయండి. అవసరమైన సందర్భంలో వివిధ ఔషధ మొక్కల చిత్రాలు, పటాలను నివేదికలో పొందుపర్చండి. ముఖ్యంగా ఆయా మొక్కలలో ఏఏ భాగాలు వైద్యానికి ఉపయోగపడతాయో వాటిని సేకరించండి. మొక్క శాస్త్రీయ నామంతోపాటు స్థానిక పేర్లు రాయండి.

తదుపరి చర్యలు

  1. నివేదికను మీ తరగతిలో ప్రదర్శించండి.
  2. స్థానికంగా లభించే ఔషధ మొక్కలను అవరమైన మేరకు మాత్రమే వినియోగించటం, మొక్కల పెంపకం మరియు సంరక్షణలపై చైతన్యపరిచే కార్యక్రమం నిర్వహించండి.
  3. మీ పరిసరాలు లేదా పాఠశాల లేదా ఇంట్లో కనీసం ఒక ఔషధ మొక్కను పెంచండి.
  4. ప్రత్యేకమైన సందర్భాలలో (పుట్టినరోజులు, పెళ్ళిరోజులు) మీ స్నేహితులకు, ఉపాధ్యాయులకు కలబంద, ఉసిరి, పుదీనా లాంటి ఔషధ మొక్కలను బహుమతిగా ఇవ్వండి.
  5. వివిధ ఔషధ మొక్కలతో హెర్బేరియం తయారుచేయండి.

ఆధారము: http://apscert.gov.in

3.06818181818
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు