పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రక్త రుగ్మతలు

రక్త రుగ్మతలు

రక్తహీనత (ANEMIA)

రక్తహీనత అనగా నేమి

రక్తములో హిమోగ్లోబిన్ (HGB) మోతాదు తగ్గిపోవుటను రక్తహీనత అంటారు. ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటిన్ హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుండి ఆక్సీజన్ వాయువును శరీర భాగాలకు ఇది మోసుకపోతుంది. రక్తహీనతవలన అలసట, తల తిరుగుట, శ్వాసించుకోలేకపోవుట లాంటవి ఏర్పడుతాయి. సాధారణ హిమోగ్లోబిన్ మోతాదు ఉన్న వారితో పోలిస్తే రక్త హీనతతో బాదపడేవారు. సౌక్యంగా ఉండలేరు. పనిచేయుటకు ఎక్కువ కష్టపడాల్సివస్తుంది. అనగా నాణ్యమైన జీవితాన్ని గడపలేరు.

కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC)

పరీక్షలో భాగంగా హిమోగ్లోబిన్ మోతాదును కొలుస్తారు. ప్రయోగశాల పరీక్షల కొరకు ఫ్యాక్ట్ షీట్ 121 చదవండి. రక్త నమూనాలో ఉన్న హిమోగ్లోబిన్ను గ్రామ్స్ పర్ డెస్సీ లీటర్ (gm/dL) ప్రమాణాలలో కొలుస్తారు.

హెచ్.జి.బి. మోతాదుతో రక్తహీనతను నిర్వచిస్తారు. హెచ్.జి.బి. మోతాదు 6.5 gm/dL కన్నా తక్కువ ఉంటే ప్రాణాంతకమైన స్థితి అని చాలా మంది వైద్య నిపుణులు అంగీకరిస్తారు. పురుషులలో 14 యూనిటు ఉండుట స్త్రీలలో 12 యూనిటు సాదారణంగా భావించవచ్చు.

సూలంగా పరిశీలిస్తే స్త్రీలలో హెచ్.బి.జి మోతాదులు తక్కువగా ఉంటాయి. అదే విధంగా ముసలి  వారిలో చిన్నపిల్లలలో హెచ్.బి.జి. మోతాదు తక్కువగా ఉంటుంది. ఇతర మానవ తెగలతో పోలిస్తే చాలా మంది అప్రో అమెరికన్ తెగలో ని ప్రజలలో రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

రక్తహీనతకు కారణాలు ఏమిటి

ఎముకల ఉన్న మూలగలో ఎర్ర రక్త కణాల సృష్టి జరుగుతుంది. దీని కొరకు ఐరన్, విటమిన్ బి12 మరియు పోలిక్ ఆవుము (లేదా ఫోలేట్) అవసరమవుతాయి. ఎరిత్రోపాయిటిన్ (EPO) హార్మోన్ ఎర్ర రక్త కణాల సృష్టిని ప్రేరేపిస్తుంది. ఎరిత్రోపాయిటెన్ హార్మోన్ను, మూత్రపిండాలు త్పత్తి చేస్తాయి.

అవసరమైన సంఖ్యలో ఎర్ర రక్త కణాలను శరీరం ఉత్పత్తి చేయలేకపోవుట వలన రక్త హీనత ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో ఎర్ర రక్త కణాలలో నాషనం వలన గాని, కోల్పోవుట వలన గాని రక్తహీనత ఏర్పడవచ్చు. అనేక అంశాలు రక్త హీనతకు కారణమవుతాయి.

 • ఐరన్, విటమిన్ బి12, లేదా ఫోలేట్ లోపం వల మెగాలోబ్లాస్టిక్ అనీమియా ఏర్పడుతుంది. దీనిలో ఎర్ర రక్తకణాలు పెద్ద సైజ్లో యుండి పాలిపోయినట్లు ఉంటాయి. (ఫ్యాక్ట్ షీట్ 121 చూడండి).
 • ఎముకలలోని మూలుగ గాని, మూత్రపిండాలుగాని దెబ్బతినుట.
 • అంతర్భాగాలలో రక్త ప్రావం గాని, స్త్రీలలో ఋతుస్రావం రూపంలోగాని రక్తం కోల్పోవట.
 • ఎర్ర రక్త కణాలు నషించుట (హీమోలైటిక్ అనీమియా ) వలన రక్తహీనత ఏర్పడుతుంది.

హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్ వలన, అదే విధంగా హెచ్.ఐ.వి. సంబంధిత అనేక అవకాశవాద వ్యాధుల వలన కూడా రక్తహీనత ఏర్పడుతుంది (ఫ్యాక్ట్ షీట్ 500 చూడండి)

హెచ్.ఐ.వి. మరియు హెచ్.ఐ.వి. సంబంధింత  కు వాడే మందుల వలన కూడా రక్త హీనత కలుగుతుంది.

హెచ్.ఐ.వి. మరియు రక్తహీనత

తీవ్రమైన రక్తహీనత చాలా సాదారణమైన స్థితి, ఎయిడ్స్ దశను చేరిన 80% మందిలో ఎంతో కొంత రక్తహీనత యున్నట్లు గుర్తించబడినది. ఎయిడ్స్ దశను చేరిన వారిలో లేదా సిడి4 కణాల తక్కువయున్న వారిలో రక్తహీనత అధికంగా ఉంటుంది. కాంబినేషన్ యాంటి రిట్రోవైరల్ మందుల వాడకను ప్రారంభించిన వారిలో రక్తహీనత తగ్గింది. తీవ్రమైన రక్తహీనత పరిస్థితి చాలా అరుదుగా కనిపిస్తుంది. అయినప్పటికి ఎ.ఆర్.టి. సంపూర్ణంగా రక్తహీనతను నిర్మూలించ లేక పోయింది. ఒక సంవత్సరము ఎ.ఆర్.టి. వాడిన వారిపై నిర్వహించిన అధ్యయనంలో 46%  నుండి మ్యాధ్యమిక రక్త హీనతతో బాదపడుతున్నట్లు గుర్తించబడింది.

హెచ్.ఐ.వి. తో జీవిస్తున్న వ్యక్తులలో రక్తహీనత అధికంగా ఉండుటకు అనేక కారణాలు ఉన్నవి.

 • సి.డి 4 కణాల ನಿ೦ಖ್ಯ? తక్కువగా యుండుట (ఫ్యాక్ట్ షీట్ -124 చూడండి)
 • అధిక వైరల్ లోడ్ (ఫ్యాక్ట్ షీట్ 125)
 • జుడోవడైన్ వాడుక
 • స్త్రీ అగుట వలన

రక్తహీనత లేని హెచ్.ఐ.వి. తో జీవిస్తున్న వారితో పోలిస్తే రక్తహీనతతో బాదపడుతున్నవారిలో ఎయిడ్స్ దశ 5 రెట్లు వేగంగా పురోగమిస్తుంది. మరణం సంభవించే ప్రమాదంను కూడా రక్తహీనతకు అపాదించవచ్చు. కావున రక్తహీనతకు చికిత్స చేయుట ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చును.

రక్తహీనతకు ఏ విధంగా చికిత్స చేయవచ్చును

కారణాల ఆధారంగా రక్తహీనతకు చికిత్స చేయవచ్చు.

 • మొదటగా దీర్ఘకాలంగా ఉన్న రక్తస్రావాలకు చికిత్స చేయుట ద్వారా - అంతర్భాగాలలోని రక్తస్రావాన్ని హెమోరాయిడ్స్ లేదా తరుచుగా వచ్చే ముక్కు బెదురుటను నియత్రించుట ద్వారా రక్తహీనతను తగ్గించవచ్చు.
 • తదుపరి చర్యగా ఐరన్, విటమిన్ బి12, లేదా ఫోలేట్ లోపాన్ని క్రమబద్దము చేయాలి.
 • రక్తహీనతను కలుగజేసే మందుల వాడుకను మానివేయాలి లేదా తగ్గించాలి.

ఈ మార్గాలు సత్ఫలితాలను ఇవ్వలేక పోవచ్చు. రక్తహీనతను కలుగచేసే మందులను మానివేసే పరిస్థితి లేక పోవచ్చు. అందుచేత ఎరిత్రోపాయిటిన్ ఇంజెక్షన్ వాడుటగాని, రక్తదానం స్వీకరించుటగాని మనకున్న రెండు అదనపు మార్గాలు.

ఎరిత్రోపాయిటిన్ (EPO) ఎర్ర రక్తకణాలు ఉ త్పత్తిని ప్రేరేపిస్తుంది. ఎరిత్రోపాయిటిన్ ను కృత్రిమంగా తయారుచేయుటను 1985 లో శాస్రజ్ఞలు కనుగొన్నారు. చర్మం క్రింద దీనిని వారానికి ఒకసారి ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాలి. కాని ఇది చాలా ఖరీదైనది.

హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారిపై జరిపిన అధ్యయనం ప్రకారం ఎరిత్రోపాయిటిన్ ఇంజెక్షన్ వలన మరణాల సంఖ్య తగ్గినట్లు తెలుస్తుంది.

తీవ్రమైన రక్తహీనతతో బాదపడే వారిలో రక్తదానమే ఏకైక మార్గము, కాని రక్తదానము వలన వ్యాధుల సంక్రమణ జరిగి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవుటకు అవకాశమున్నది.

ముగింపు సమాచారం

రక్తహీనత వలన అలసట ఏర్పడి వ్యక్తులు అసౌకర్యానికి గురి అవుతారు. దీని వలన వ్యాధి వేగంగా పురోగమించి చనిపోతారు.

హెచ్.ఐ.వి వ్యాధి వలన గాని లేక ఇతర వ్యాధుల వలన గాని రక్తహీనత ఏర్పడుతుంది. హెచ్.ఐ.వి. వ్యాధికి గాని, హెచ్.ఐ.వి. సంబంధింత వ్యాధులకు గాని వాడే మందులవలన కూడా రక్తహీనత ఏర్పడుతుంది.

హెచ్.ఐ.వి. మరియు ఎయిడ్స్ తో జీవిస్తున్న ప్రజలలో రక్తహీనత ఎల్లప్పుడు సమస్యగానే ఉంటుంది. ఎ.ఆర్.టి. మందులు ప్రారంభించిన నుండి తీవ్రమైన

రక్తహీనత సమస్య గణనీయంగా తగ్గింది. అయినప్పటి హెచ్.ఐ.వి. తో జీవిస్తున్నవారిలో దాదాపు సగం మంది సాదారణ లేదా వూధ్యమిక రక్తహీనతతో బాధపడుతున్నారు.

రక్త హీనతకు చికిత్స చేయుట ద్వారా హెచ్.ఐ.వి. తో జీవిస్తున్నవారి ఆరోగ్యము మెరుగుపడి జీవించే రేటు పెరుగుతుంది. రక్తస్రావానికి చికిత్స చేసి ఐరస్, విటమిన్ మరియు పోలేట్ లోపాన్ని సరిచేయుటను రక్తహీనత చికిత్సలో మొదటి అడుగులుగా చెప్పవచ్చు. అవకాశమున్నటైతే రక్తహీనతను కలుగచేసే మందుల వాడుకను మానివేయాలి. అవసరమైతే ఎవిత్రోపాయిటిన్ చికిత్స చేయాలి. చాలా అరుదైన సందర్భాలలో రకాన్ని ఎక్కించాల్సి వస్తుంది.

3.06024096386
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు