অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వివిధ సమస్యలను

వివిధ సమస్యలను

బ్లడ్ సుగర్ మరియు ఫ్యాట్స్

కంప్లేట్ బ్లడ్ కౌంట్ పై సమాచారము కొరకు ఫ్యాక్ట్‌షీట్ 121 మరియు జీవరసాయన శాస్త్ర పరీక్షల కొరకు ఫ్యాక్ట్ షీట్ 122 చదవండి. సాధారణ
ప్రయోగ ఫలితాల కొరకు ఫ్యాక్ట్ షీట్ 120 చదవండి.

యాంటి రిట్రోవైరల్ మందుల (ఎ.ఆర్.వి.) వలన కలిగే దుష్పరిణామాలు

సాధారణ పరీక్షల వలన రక్తములోని చక్కర (గూకోజ్) పరిమాణము గణించవచ్చు కాని రక్తములోని కొవ్వు పరిమాణం తెలుసుకోలేము. ఎ.ఆర్.వి. మందుల వాడుక వలన రక్తములో చక్కర మరియు కొవ్వు మోతాదు ఎక్కువ అవుతుంటుంది. అందువలన హెచ్.ఐ.వి. తో జీవిస్తున్న వ్యక్తులు తరచుగా రక్త పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. ప్రత్యేకంగా ఎ.ఆర్.వి. మందులలోని ప్రోటియేజ్ ఇన్షిబిటర్స్ వలన ఈ దుష్పరిణామం కలుగుతుందనేది వాస్తవం. లిపోడిస్తోపి (శరీర ఆకృతిలోని మార్పు) పై సమాచారం కొరకు ఫ్యాక్ట్ షీట్ 553 చదవండి.

బ్లడ్ సుగర్

గూకోజ్ చక్కర అంటారు. జీవకణాలలో గూకోజ్ విఘటన చెందుట వలన శక్తి విడుదల అవుతుంది. మీరేమైన ఆహారపదార్ధాలు భుజించిన
తర్వాత గాని లేక ఇతర పానీయాలు త్రాగుట వలన బ్లడ్ సుగర్ పెరుగుతుంది. రక్తంలో గూకోజ్ అధిక హైపర్గ్రెసేమియా) డయాబెటిస్ మిల్లిటస్ వ్యాధి . రక్తంలో చక్కర అధికమగుట వలన మీ కళ్ళు, నాడులు, మూత్రపిండాలు మరియు గుండె మొదలగు అవయవాలు దెబ్బతింటాయి. ప్రోటియేజ్ ఇన్షిబిటర్స్ వాడుట వలన కూడా ఈ దుష్ఫలితం కలుగవచ్చు. రక్తంలో చక్కర వెూతాదు తగుట (హైపోగైసేమియా) వలన అలసట కలుగుతుంది. కాని హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వ్యక్తులలో అలసటకు అనేక కారణాలు ఉండవచ్చును. ఆరోగ్యవంతుల రక్తములోని చక్కర మోతాదును ఇన్సూలిన్ నియంత్రిస్తుంది. పాంక్రియాస్ అనే విణాళగ్రంధి స్రవించే హార్మోన్ ఈ ఇన్సులిన్ రక్తములోని చక్కర జీవకణాలకు చేరి శక్తి విడుదల జరుగుటకు ఇన్సూలిన్ సహాయపడుతుంది. రక్తంలో చక్కర మోతాదు పెరిగిందంటే మీ పాంక్రియాస్ అవసరమైనంత ఇన్సూలిన్‌ను ఉత్పత్తి చేయుట లేదని అర్థము. కొందరు వ్యక్తులలో ఇన్సూలిన్ అధికంగా ఉత్పత్తి అయినప్పటికి అవయవాలు దానికి సరియైన రీతిలో స్పందించకపోవచ్చు.  ఈ పరిస్థితిని "ఇన్సులిన్ రెసిస్టెన్స్" అంటారు. ఈ రెండు సందర్భాలలో జీవకణాలు శక్తి విడుదలకు అవసరమైనంత గూకోజ్ను ఉపయోగించుకోలేవు. అందువలన శరీరంలో చక్కర నిలిచిపోతుంది. ప్రోటియేజ్ ఇన్షిబిటర్లు వాడుతున్న వారిలో ఇన్సూలిన్ రెసిస్టెన్స్ అభివృద్ధిచెంది రక్తంలో చక్కర మోతాదు పెరుగుతుంది. డయాబెటిస్ వ్యాధికి వాడే మందులతో ఈ పరిస్థితిని నయము చేయవచ్చును. ఇన్సూలిన్ రెసిస్టెన్స్ గుర్తించే కొరకు సాధారణ రక్త పరీక్ష ఏమీలేదు. రక్తంలో గూకోజ్ మోతాదును మూడు రకాలుగా పరీక్ష చేయవచ్చును.
  • రాండమ్ బ్లడ్ గూకోజ్ పరీక్ష- మీ దినచర్యను అనుసరించి భోజనం చేసిన తర్వాత సేకరించిన రక్త నమూనాలో గూకోజ్ మోతాదు లెక్కించుట.
  • ఫాస్టింగ్ గూకోజ్ పరీక్ష:- 8 గంటల నుండి మీరేమి ఆహారాన్ని గాని, పానీయాలను గాని (నీటిని మినహాయించి) తీసుకోకుండా ఉన్నప్పడు సేకరించిన రక్త నమూనాలో గూకోజ్ మోతాదును లెక్కించుట.
  • పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గూకోజ్ పరీక్షరాత్రి అంతయూ ఏమీ తినకుండా ఉండి, 75 గ్రాముల గూకోజ్ను నీటిలో కరిగించి తాగిన 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయుట. గూకోజ్ టాలరెన్స్ పరీక్ష- ఈ పరీక్షలో ముందుగా ఫాస్టింగ్ గూకోజ్ పరీక్ష చేస్తారు.
ఆ తర్వాత గణించిన పరిమాణంలో గూకోజ్ను నీటిలో కరిగించి తాగిస్తారు. నియమిత కాల వ్యవధిలలో రక్త నమూనాలు సేకరించి గూకోజ్ మోతాదును పరీక్షిస్తారు. మీ ఫాస్టింగ్ బ్లడ్ గూకోజ్ మోతాదు 124 మి.గ్రా. కన్నా ఎక్కువ లేదా పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గూకోజ్ 200 మి.గ్రా. కన్నా ఎక్కువ ఉన్నా మీరు డయాబెటిస్తో బాదపడుతున్నట్లు నిర్ధారిస్తారు. మీ బ్లడ్ గూకోజ్ మోతాదు అధికంగా ఉ న్నట్లయితే శరీర బరువు తగ్గించుకోవాలని, నిర్దేషిత ఆహారము మరియు శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తారు. లేదా మందుల ద్వారా లేదా ఇన్సులిన్‌ను సూదుల ద్వారా తీసుకొనుట ద్వారా చికిత్స చేస్తారు.

బ్లడ్ ఫ్యాట్స్

ఫ్యాట్స్ శక్తిని విడుదల చేస్తాయి. దీని చుటూ కొన్ని విటమినులు పేరుకొని ఉంటాయి. హార్మోనులను విటమినులు ఆవరించుకొని ఉంటాయి. హార్మోనులను ఉత్పత్తి చేయుటకు, కణ త్వచం నిర్మాణం కొరకు, అవయవాల రక్షణ కొరకు, మరియు కదిలే కొన్ని శరీర భాగాలలో కందెనగా కొవ్వు వదార్థం ఉ పయోగపడుతుంది. కాని శరీరంలో అధికంగా కొవ్వు చేరుటవలన గుండె జబ్బులు లేదా పాంక్రియాటైటిస్ వ్యాధి వచ్చే ప్రమాదమున్నది.
అవి ప్రోటీన్ అణువులతో కప్పబడి ఉంటాయి. ఈ విధంగా ప్రోటీన్లతో కప్పబడియున్న కొవ్వు కట్టలను లిపోప్రోటీనులు అంటారు. లిపోప్రోటీనులు వివిద సైజ్‌లలో ఉంటాయి. చిన్నసైజ్లో ఉన్న వాటిని తక్కువ సాంధ్రతగల లిపోప్రోటీనులు (ఎల్.డి.ఎల్) లేదా అతి తక్కువ సాంధ్రత గల లిపోప్రోటీనులు (వి.ఎల్.డి.ఎల్.) అని అంటారు. ఇవి కాలేయములోని కొవ్వు అణువులను ఇతర శరీర భాగాలకు మోసుకొని పోతాయి. అధిక ఎల్.డి.ఎల్. మరియు వి.ఎల్.డి.ఎల్. వలన మీ దమనులలో కొవ్వు పేరుకొని పోయే అవకాశమున్నది. దీని వలన హృదయ కండరాలకు అవసరమైనంత ఆక్సీజన్ అందకపోవుట తద్వారా గుండెజబ్బు లేదా గుండెపోటు వచ్చే అవకాశమున్నది.

పెద్దసైజ్ లిపోప్రోటీనులను అధిక సాంద్రత

లిపోప్రోటీనులు (హెచ్.డి.ఎల్.) అంటారు. ఇవి మంచి చేసే లిపోప్రోటీనులు. ఎందుకనగా ఇవి దమనులలో ఉన్న కొవ్వును తొలగించి మరల కాలేయంనకు చేర్చుతాయి. అధికి హెచ్.డి.ఎల్. గుండె జబ్బు రాకుండా కాపాడుతుంది. రక్తంలోని కొవ్వు పదార్ధాల పరిమాణాన్ని డెస్సీలీటర్ రక్తంలో ఎన్ని మిల్లీగ్రాములు యున్నదో లెక్కిస్తారు. లేదా మిగ్రా/డె.లీ.

టైగ్లిసరైడ్లను కొలుచుట

మీరు భోజనం చేసిన వెంటనే రక్తంలో టైగ్లిసరైడ్ల మోతాదు పెరుగుతుంది. అందుచేత కనీసం 12 గంటల ముందు నుండి ఏమీ తినకుండా రక్త పరీక్ష చేయించుకోవాలి. హెచ్.ఐ.వి. తో జీవిస్తున్న చాలా మందిలో టైగ్లిసరైడ్ల మోతాదు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రోటియేజ్ ఇన్షిబ్రిటర్స్ తీసుకుంటున్న వారిలో ఈ పరిస్థితి తప్పని సరిగా చూడవచ్చు. టైగ్లిసరైడ్స్ పరమాణం 150 మిగ్రా/డె.లీ. కన్నా తక్కువ ఉన్నట్లయితే సాధారణ పరిస్థితిగా పరిగణించాలి. కానీ ఈ మోతాదు 1000 మిగ్రా/డె.లీ. మించినట్లయితే పాంక్రియాటైటిస్ వ్యాధి సోకే అవకాశమున్నది.

కొల్లెస్తాల్ మోతాదును కొలుచుట

కీడు చేసే తక్కువ సాంద్రతగల లిపోప్రోటీనులు మరియు మేలు చేసే అధిక సాంద్రత లిపోప్రోటీనులు కలిస్తే మొత్తం కొల్లెస్తాల్ పరిమాణం తెలుస్తుంది. భోజనం చేసిన వెంటనే రక్త పరీక్ష చేయించుకొనుట ద్వారా మొత్తం కొలెస్తాల్ మోతాదులో మార్పు ఉండదు. మొత్తం కొల్లెస్తాల్ మోతాదు 200 కన్నా తక్కువగా ఉ ంటే మంచిది. 240 కన్నా మించితే చెడు పరిణామంగా పరిగణించవచ్చును.

హెచ్.డి.యల్. కొల్లెస్తాల్

ఇది మంచి చేసే కొల్లెస్తాల్, భోజనం చేసిన తర్వాత ఇచ్చే రక్త నమూనాలో దీనిని కొలుస్తారు. అధిక మోతాదులో హెచ్.డి.యల్. కొల్లెస్తాల్ ఉండుట మంచిది. మరియు దీని మోతాదు 40 కన్నా మించి ఉంటే మంచిది.
యల్.డి.యల్. కొలెస్తాల్ కీడు చేస్తుంది. టైగ్లిసరైడ్ల మోతాదు ఆధారంగా ఒక సూత్రం ద్వారా యల్.డి.యల్. మోతాదును నిర్ణయిస్తారు. ఏమి తినకుండా ఇచ్చే రక్త పరీక్ష ద్వారా దీనిని కొలుస్తారు. దీని మోతాదు 100 కన్నా తక్కువ ఉన్నటైతే మంచిది. మరియు 160 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే గుండెజబ్బు వచ్చే ప్రమాదమున్నది. అధిక ప్రమాదమున్న వ్యక్తులపై నిర్వహించిన వైధ్య పరిశోదనల ద్వారా యల్.డి.యల్. మోతాదును 70 కన్నా తగ్గించుట మంచిదని గుర్తించబడినది.
అధిక మోతాదులో కొల్లెస్తాల్ ఉన్న హెచ్.ఐ.వి. వ్యాధి గ్రస్తులకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబములో గుండె జబ్బుల చరిత్ర ఉన్న వారికి చికిత్స చేయబడుతున్నది. మీ కొల్లెస్తాల్ మోతాదు ఎక్కువగా ఉన్నట్లయితే డాక్టర్గారిని సంప్రదించండి. ప్రోటియేజ్ ఇన్షిబిటర్స్, ఎఫావిరెంజ్, స్థావడైన్ లాంటి యాంటి రిట్రోవైరల్ మందులు వాడే వారు ప్రతి 6 నెలలకు ఒకసారి లిపిడ్ ఫ్రాఫెల్ పరీక్ష చేయించుకోవాలి.

ఎముకల సమస్యలు

ఎముక అనగా నేమి

ఎముక ఒక జీవమున్న పెరిగే పదార్గాము దీనిలో ప్రోటిన్‌తో చేయబడిన చట్రము ఉండి దానిపై కాలియం పేరుకొని ఉండుటవలన గట్టితనము వస్తుంది. ఎముకపై నాడీపోగులు మరియు రక్తనాళికలతో కూడిన . నిరంతరము పాత ఎముక తొలగించబడి కొత్త ఎముక దాని స్థానములో చేరిపోతుంది. యుక్త వయస్సులో ఉన్న వారిలో తొలగించబడే ఎముక కన్నా అధికంగా కొత్త ఎముక కలుపబడుతుంది. కావున ఎముకల బరువు పెరుగుటనే కాక గట్టిగా మారుతాయి. 30 సంవత్సరాల తర్వాత ఎముక అధికంగా తొలగించబడుతుంది. కావున ఎముకలు తేలికగా మారుటనే కాక పెలుసుగా మారుతాయి. హెచ్.ఐ.వి.తో జీవిస్తున్నవారిలో  రెండు రకాల లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆస్టియోపోరోసిస్ మరియు ఆస్టియోనెక్రోసిస్. ఇవి హెచ్.ఐ.వి. వ్యాధి వల్ల వచ్చినవా లేక వ్యాధి చికిత్సకు వాడే మందుల వలన వచ్చినవా తెలియదు.

ఆస్టియోఫోరోసిన్ అంటే ఏమిటి

ఎముక చట్రము నుండి తొలగించబడుట వలన దానిలో సన్నని రంద్రాలు అధికంగా కాల్వియం ఏర్పడుతాయి కావున ఎముక పెలుసుగా మారి సులభంగా విరిగిపోతుంది. చాలా సందర్భాలలో తుంటి ఎముక, వెన్నుపూస, మరియు మనికట్టు ఎముకలు విరుగుతాయి  . ఆన్స్టియోఫోరోసిన్తో పోలిసే ఆస్తియోపీనియాలో ఎముక పదార్ధము తక్కువ తొలగించబడుతుంది.

ఆస్టియోఫోరోసిన్కు కారణము ఏమిటి

వయస్సు పెరిగే కొలది ఎముకలు తమలోని కాలియంను కోల్పోతూ ఉంటాయి. మీ వయస్సు 50 సంవత్సరాలు దాటితే తమ ఎముకలు వేగంగా కాల్వియంను కోల్పోతాయి. (స్త్రీలు తమ బుతుచక్రము ఆగిపోయిన (మోనోపాస్) తర్వాత తమ ఎముకలలోని కాలియంను అధికంగా కోల్పోతారు. కాకేసియన్ తెగ లేక ఆసియావాసులు సన్నగా మరియు తక్కువ శరీర బరువు కలిగి ఉంటారు. ఆహారములో కాలియం, విటమిన్ 'డి'. లోపించుట, పొగత్రాగుట, కాఫీ, ఆల్కహాల్ సేవించుట, శరీర వ్యాయామము లేక పోవుటతో కూడా ఆస్టియోఫోరోసిస్కు సంబంధమున్నది. హెచ్.ఐ.వి. తో జీవిస్తున్న వ్యక్తులలో ఎందువలన ఆస్టియోఫోరోసిస్ వ్యాధి ఉంటుందో ఇంతవరకు తెలియదు. ఎముక కోల్పోవుటకు మరియు హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న కాలానికి మధ్య సంబంధమున్నట్లు ఈ మధ్యనే నిర్వహించిన అధ్యయనాలను బట్టి తెలుస్తుంది.

ఆస్టియోఫోరోసిన్ ఉన్నట్లు నేనెట్లా తెలుసుకోగలను

దురదృష్టవశాతూ తమకు ఆస్టియోఫోరోసిస్ ఉన్న విషయూన్ని ఎముక విరిగిన తర్వాతనే తెలుసుకుంటారు. ఎంత వేగంగా మీ ఎముక ఖనిజ పదార్థాలను కోల్పోతుందో తెలుసుకునుటకు పరీక్షలు
**********************************


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate