పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఇతర వైద్య విధానాలు

ఇతర వైద్య విధానాలు

ఇతర వైద్య విధానాలు

అలోపతి వైద్య విధానం కాకుండా జబ్బును నయం చేయుటకు ఉపయోగించే ఇతర వైద్య విధానాలు చాలా రకాలు వాడుకలో ఉన్నాయి. అవి ఏమనగా
 1. పూర్వపు వైద్య పద్ధతులలో ఆయుర్వేదము అన్నిటి కన్నా ముఖ్యమైనది. (702 పత్రం చూడండి మరియు చైనీస్ వైద్యం పద్దతి మరొక విధానం.
 2. ప్రకృతి వైద్యం, శరీర మాసాజు మరియు యోగా.
 3. హోమియోపతి వైద్యం, మూలికలతో చేసే వైద్యం (704 పత్రం చూడండి)
 4. మానసిక శక్తిని పెంపొందించే వైద్య పద్ధతులలో రేక్కీ మరియు మెడిటేషను (రాజయోగ)
 5. ఆహార పద్ధతులను ఉపయోగించి చేసే పద్ధతిలో పౌష్టిక ఆహారం, మినిరల్స్ మరియు విటమిన్సు ను శరీరానికి అందించి శరీరంను బలపరుస్తారు.
కొంతమంది వైద్యులు అలోపతి వైద్యంతో పాటుగా ఇతర ఆయుర్వేద లేదా మానసిక వైద్య పద్ధతులను ఉపయోగిస్తారు. వారు ఇతర మానసిక వైద్యం పద్ధతుల వలన రోగి యొక్క మానసిక శక్తి బలపడి అనారోగ్యాన్ని ఎదిరించే శక్తి పొందుతారని మరియు ఆంటీరిట్రావైరల్ మందుల వలన శరీరంలో కలిగే ఇతర ప్రభావాలను తగ్గిస్తాయి అని నమ్ముతారు.
కొందరు ఈ ఇతర వైద్య పద్దతులను నమ్మరు. ఎందుకంటే వీటి పనితీరుపైన మరియు ప్రభావాల మీద పెద్దగా పరిశోధనలు నిర్వహించలేదు. కనుక ఆ వైద్యవిధానాల ప్రభావం ఎంతవరకు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందో ఖచ్చితంగా తెలియదు.

ఎంత మంది ప్రజలు ఈ ఇతర వైద్య విధానాలను ఉపయోగిస్తారు

ఈ అనేక ఇతర వైద్య విధానాలు చాలా ప్రాముఖ్యత పొందినవి. దాదాపు 70% హెచ్.ఐ.వి రోగులు ఈ ఇతర వైద్యాలను ఉపయోగిస్తారు. చాలామంది ఈ విధానాలను చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆక్యుపంచర్ వైద్య విధానంను ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వరిస్తాయి.

ఇతర వైద్య పద్ధతులు ఎంతవరకూ మంచివి

ఇతర పద్ధతులు కొన్ని సారు చాలా ప్రాదకరమైన ప్రభావాలు చూపుతాయి. ప్రకృతి వైద్యం వంటి పద్ధతులు ఎంత వరకూ మంచిదో గ్యారెంటీ ఉండదు. వైద్య మార్గదర్శక సూత్రాలు ఈ పద్ధతిలో ఇచ్చే పోషక ఆహార పదార్థాలను ఇతర మందులను అప్రూ చేయదు. ఆహార మరియు మందులను మంచి వాటిగా నిర్ధారించే సంస్థ ఈ ప్రకృతి వైద్యంలో తయారు చేసే మందులను గుర్తించదు కానీ అవి తయారుచేసే వ్యక్తులు తయారీ పద్ధతిలో అవసరమైన జాగ్రత్తలు తప్పక పాటించాలి.
కొన్ని మూలిలు రక్తంలో ఆంటీరిట్రూవైరల్ మందుల తీవ్రతను తగిస్తాయి. ఇతర వైద్య పద్ధతులను అనుసరించేటప్పడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉపయోగిస్తున్న ఇతర వైద్యం గురించి మీ వైద్యుడకు తప్పక తెలియజేయాలి.

ఈ ఇతర వైద్య పద్ధతులు ఎంతవరకూ పనిచేస్తాయి

ఈ ఇతర వైద్య విధానాలకు సంబంధించి ఎక్కువ పరిశోధనలు చేయలేదు కనుక వాటి గురించి అంతగా ఖచ్చితమైన సమాచారం తెలియదు.

కానీ వాటిని ఉపయోగించే ముందు వాటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

 1. వైద్య విధానం ఎప్పడు మరియు ఎలా కనుగొన్నారు.
 2. అది పని చేసే విధానం?
 3. ప్రత్యేక పద్ధతి మీద ఏవైనా పరిశోధనలు వున్నాయా?
 4. ఆ వైద్యం చేసే వైద్యులకు వైద్య పద్ధతి మీద ఉన్న అవగాహణ, ట్రైనింగు, వురియు అందుకు సంబధించిన సర్టిఫికేట్లు ఉన్నవా అని తెలుసుకోవాలి.
 5. ఆ వైద్యం మన ఆరోగ్యం మీద చూపే ఇతర చెడు ప్రభావాలు ఏవైనా ఉన్నాయా అందు వలన ఏదైనా ప్రమాదం ఉన్నదా అని తెలుసుకోవాలి?
కొన్నిసార్లు ఈ పైన సూచించిన సమాచారం మొత్తం దొరకక పోవచ్చును. మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుట ఇష్టపడరు.
అటువంటి సమయంలో ఏదైనా మోసం ఉందేమో చూసుకోవాలి.

ఈ ఇతర వైద్య విధానాల మీద ఎక్కువ పరిశోధనలు ఎందువలన లేవు అంటే?

ఈ వైద్యవిధానాలు ప్రత్యేకించి ఒక జబ్బునకు వైద్యం చేయుటకు రూపొందించలేదు.
ఈ విధానాలు కొన్నిసార్లు శరీరం మొత్తాన్ని బలపరుస్తానికి ఉపయోగిస్తారు. వీటి వలన శరీరంలో జరిగే అనేక క్రియలు సమభావంగా, ఆరోగ్యంగా జరుగుతాయి. శరీర శక్తిని సమగ్రంగా వినియోగించు కుంటాయి. ఉదాహరణకి అక్యుపంచర్లో హెచ్.ఐ.వి రోగి శరీర శక్తిని అనుసరించి వైద్యం చేస్తారు కాని వారి యొక్క హెచ్.ఐ.వి పరిస్థితి ఆధారంగా వైద్యం చేయరు. ఇటువంటి వైద్యం హెచ్.ఐ.వి రోగి యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరుస్తుంది. కానీ వారి రోగాన్ని నయం చేయదు.
ఈ ఇతర వైద్య పద్ధతులకు నిర్దేశించిన పద్ధతులు ఉండవు: అనేక రకాల మూలికలలో రకరకాల వైద్యం గుణాలు ఉంటాయి.
ఆకుపంక్చర్ లాంటి వైద్యంలో నిర్దేశితమైన పద్ధతి లేదు. రోగి యొక్క శరీర లక్షణాలను బట్టి వైద్యం చేస్తారు. రోగికి అవసరమైన పద్ధతిలో వాటిని అమర్చుతారు. ఇటువంటి నిర్దేశించిన పద్ధతి ಪನಿ వైద్యంలో పరిశోధనలు చేయుట చాలా కష్టం. ఇటువంటి వైద్య విధానంలో అతి సాధారణంగా తీసుకోవలసిన జాగ్రత్తల మీద కూడా పరిశోధనలు చెయ్యలేదు.

ఆయుర్వేదము

ఆయుర్వేదం అనగా

ఆయర్-వేద అను రెండు పదముల నుండి వచ్చింది. ఆయుర్వేద అనగా జీవ శాస్రము. ఆయుర్వేదము భారత దేశంలో పుట్టిన వైద్య విధానం శరీరంను, ఆత్మను, పంచేంద్రియాలను, ఆరోగ్యంగా ఉంచుటకు వైద్య పద్ధతులను వివరిస్తుంది. ఈ పద్ధతిలో రోగ నిరోధక శక్తిని బలపరచుటకు అనేక విధానాలను రోగి యొక్క శరీర తీరును అనుసరించి బట్టి ఉపయోగిస్తారు. ఈ విధానంలో చైనా వైద్యంలో ఉపయోగించినట్లుగానే ప్రకృతి సిద్ధంగా లభించే చెటూ, మూలికలను ఉపయోగిస్తారు. ఆయుర్వేద పద్ధతిలో శరీరంకి, బుద్ధికి కలసంబంధాన్ని ఉపయోగించి వాటి యొక్క ఆరోగ్యం పటిష్టపరుచుతూ శరీరంకి ఎటువంటి రోగాలు సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విధానంలో ಜಬ್ಬಲು రాకుండా ఉండటమే కాదు పూర్తి మానసిఖ శారీరక సంతుల్యాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా పరిగణిస్తారు. నిజమైన ఆరోగ్యం అంటే రోగి యొక్క మానసిక శారీరక ప్రక్రియలు సంపూర్ణ శక్తితో పనిచేయుటను ఆరోగ్యం .

HIV రోగులు ఆయుర్వేద వైద్యం ఎందుకు ఉపయోగిస్తారు

HIV రోగులు వారి యొక్క సంపూర్ణ శరీర, మానసిక ఆరోగ్యంను మరియు శక్తిని పెంపొందించుకునేందుకు ఆయుర్వేద వైద్యం తీసుకొనుటకు ఇష్టపడతారు. ఆయుర్వేదంలో HIV వ్యాధి అనగా, శరీరంలోని శక్తి క్షీణించుట, లేదా నశించుట అని భావిస్తారు.
ఆయుర్వేదంలో హెచ్.ఐ.వి వ్యాధి సంక్రమణను నిరోధించదు. చాలా మంది హెచ్.ఐ.వి రోగులు వారి యొక్క సంపూర్ణ శారీర శక్తి పెరిగినట్లుగా రోగ నిరోధక శక్తి శక్తివంతమైనట్లుగా మరియు వారి యొక్క శరీర శక్తి పెరుగుట వలన వేరే ఇతర అంటు వ్యాధులు రాకుండా మరియు శక్తివంతమైన యాంటీ రిట్రావెల్ మందులను తట్టుకోగల శక్తి ఇస్తుందని నమ్ముతారు.

ఆయుర్వేదం ఎలా ఉపయోగిస్తారు

శరీరంలో 3 రకాల దోషాలు లేక శక్తులు ఉన్నాయని నమ్ముతారు.
1. 'వాతం, అనగా కదలికల శక్తి
2. పిత అనగా అరుగుదల లేక జీవ ప్రక్రియల వలన కలుగు శక్తి
3. కప, ద్రవము వలన కలుగు శక్తి,
ఆయుర్వేదంలో మొట్టమొదట రోగులను వారి యొక్క 'దోషాల ప్రభావంను బట్టి 3 రకాలుగా విభజిస్తారు. ఆయుర్వేద వైద్యులు అనేక రకాల ప్రశ్నలు వేసి సూక్ష్మంగా గమనించి రోగి యొక్క నాడిని చూసి వారి నాలుకను గొంతును చూసారు.
తరువాత రోగి యొక్క శరీర పరిస్థితిని బట్టి వారికి తగినట్లుగా ఆహారంను, వ్యాయామమును మరియు ప్రార్థనా పద్ధతులను రోగికి అనుకూలంగా నిర్ణయిస్తారు. ఆయుర్వేదంలో రోగి ప్రతిరోజు అను సరించవలసిన పద్ధతులలో ఉదయం ( మొదలుకొని ఆహారం, చేయవలసిన యోగా మరియు అనేక ఇతర ప్రక్రియలను గురించి వివరిస్తారు.
ఆయుర్వేదంలో వైద్యులు సొంతంగా తయారు చేసిన మందులను ఉపయోగిస్తారు. చవన్ ప్రాస్, రక్తవర్ణక వంటి సొంతంగా తయారు చేసిన మందులను రోగికి ఉపయోగిస్తారు. వీటి వలన రోగ ನಿತ್ಜಿ శక్తి బలపడుతుంది. సూక్ష్మ త్రిఫల మాత్రల వలన అంటు వ్యాధులు ).
ఆయుర్వేదం వలన ఎటువంటి ప్రమాదాలు

ప్రభావాలు ఉంటాయి

చాలా మంది హెచ్.ఐ.వి. రోగులకు ప్రకృతి వైద్యంలో ఉపయోగించే మూలికలు, చెట్ల మందులు
సరిపడవు, హెచ్.ఐ.వి వైద్యంలో ఉపయోగించే
అలోపతి మందులకు ఆయుర్వేదం మందులు ఏమైనా అడ్డం కలిగిస్తాయో తెలియదు. ఆయుర్వేదం మందు వేసుకున్న కొన్ని గంIIల ముందు కాని కొన్ని గం|ల తరువాతకాని ఆలోపతి మందులు వేసుకోమని వైద్యులు చెప్తారు. 2008 లో 20% ఇంటర్ నెట్ ద్వారా కొనబడిన ఆయుర్వేద మందులలో లెడ్, ఆర్శినిక్ లేక పాదరసం ఉన్నదని హెచ్చరించారు.

ఆయుర్వేదం ఎంత వరకూ పనిచేస్తుంది

ఆయుర్వేద వైద్యంకి సంబంధించి ఎక్కువ పరిశోధనలు లేవు. కాని ఆయుర్వేద వైద్యం రోగి యొక్క పూర్తి మానసిక, శారీరక సమతుల్యం తిరిగి పొందేందుకు పనిచేస్తుంది. హెచ్.ఐ.వి వ్యాధిని నయం చేయుటకు ప్రత్యేకించి వైద్యం లేదు.
(మరింత సమాచారం రొకు 700 పత్రం చూడండి)
మరింత సమచారం కొరకు ఆయుర్వేద  http://www.ayurveda.com.

ఆధారం: www.aidsinfonet.org
3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు