పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ

తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ

తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ

తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ అనగా నేమి

హెచ్.ఐ.వి. సంక్రమణ జరిగిన కొన్ని రోజులలోనే (లేదా వారాలలోనే) రక్తంలో అధిక (Óဝဖ္ရစ္ဆéာ်° హెచ్.ఐ.వి. వృద్ధి చెందుతుంది. కొందరి వ్యక్తులలో ఫూలాంటి బుగ్మత కలుగుతుంది. హెచ్.ఐ.వి. వ్యాధిలోని ఈ ప్రారంభ దశనే తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ లేదా ప్రాథమిక హెచ్.ఐ.వి. సంక్రమణ అంటారు.
హెచ్.ఐ.వి. సోకిన వారినందు 50% మందిలో ఈ లక్షణాలు గుర్తించలేము. సాధారణంగా 2 నుండి 4 వారాలలో వ్యాధి లక్షణాలు కన్పిసాంు. సర్వసాధారణంగా జ్వరం, అలసట మరియు చర్మం కందిపోవుట లాంటి లక్షణాలు కన్పిస్తాయి. మరియు తలనొప్పి, లింఫ్ గ్రంధుల వాపు, గొంతు బొంగురు పోవుట, కండరాల నొప్పి, వికారం, వాంతులు మరియు రాత్రి పూట చెమటలు పట్టుట లాంటి ఇతర లక్షణాలు ఉండవచ్చు.
తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ లక్షణాలు గుర్తించలేక పోవచ్చును. అనేక ఇతర బుగ్మతలలో పై లక్షణాలు కన్పిస్తుంటాయి. మీలో ఇటువంటి లక్షణాలు కన్పిస్తే మరియు ఈ మధ్యనే హెచ్.ఐ.వి.సోకే అవకాశానికి మీరు గురి అయినట్లేతే హెచ్.ఐ.వి. పరీక్ష చేంుంటుకొనుటకు మీ ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. లేదా మీ సమీపంలో ఉన్న స్వచ్ఛంద కౌన్సిలింగ్ మరియు పరీక్ష కేంద్రమునకు (వి.సి.టి.సి) వెళ్ళండి

తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ పరీక్ష

ఈ మధ్యనే హెచ్.ఐ.వి.సోకిన వ్యక్తిలో సాధారణ హెచ్.ఐ.వి. రక్త పరీక్షా (హెచ్.ఐ.వి.ప్రతిదేహాల గుర్తింపు) ఫలితం నెగెటివ్గా వస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసిన ప్రతిదేహాలు పరీక్షలో గుర్తించబడే స్థాయికి ఉత్పత్తి అగుటకు రెండు లేదా ఎక్కువ నెలలు సమయం పట్టుతుంది. లేకపోతే పరీక్షలో గుర్తించ లేనంత తక్కువ ప్రమాణంలో ప్రతి దేహాలు ఉత్పత్తి అవుతాయి. (మరింత సమచారాం కొరకు వాస్తవ సమాచార పత్రం 102 ను చూడండి)
వైరల్ లోడ్ పరీక్షలో వైరస్ యొక్క (öဝသ္မန္တလိ గణించవచ్చు (వాస్తవ సమాచార పత్రం 125 చదవండి) వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రదిదేహాలను ఉత్పత్తి చేయక ముందే హెచ్.ఐ.వి. అతివేగంగా వృద్ధి చెందుతుంది. కావున తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ దశలో అధిక వైరల్ కోవె ప్రదర్శించబడుతుంది.
హెచ్.ఐ.వి. ప్రతి దేహాల పరీక్షలో నెగేటివ్ ఫలితం మరియు అధిక వైరల్లోడ్ వలన ఈ మధ్యనే హెచ్.ఐ.వి. సోకినట్లు తెలుస్తుంది. గత రెండు నెలల కాలంలోనే హెచ్.ఐ.వి. సోకియుండుటకు అధిక అవకాశమున్నది. పాజిటివ్ ఫలితం వచ్చినటైతే పరీక్ష చేయక ముందు కొన్ని నెలల క్రితమే హెచ్.ఐ.వి. సంక్రమణ జరిగి యుండవచ్చును. ప్రత్యేకమైన “డిట్యూన్స్" హెచ్.ఐ.వి. ప్రతి దేహాల పరీక్ష తక్కువ సెన్సిటివిటీ గలది. దీని ద్వారా నాలుగు నెలల నుండి ఆరు నెలల క్రితం హెచ్.ఐ.వి. సంక్రమించిన విషయం తెలుస్తుంది. తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ దశలోనే.
హెచ్.ఐ.వి. సంక్రమించిన వారిని ఈ పరీక్ష ద్వారా గుర్తించవచ్చును. కాని భారతదేశంలో ఈ పరీక్ష ఎక్కువ .

వ్యాధి నిరోధక వ్యవస్థకు కలిగే నష్టము -

హెచ్.ఐ.వి. మొదటి దశలో వ్యాధి నిరోధక వ్యవస్థకు అధిక నష్టము జరగదని కొందరు భావిస్తారు. మరియు వ్యాధి నిరోధక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని యూంటి రిట్రో వైరల్ థెరఫీ తీసుకుంటే నయమవుతుందని నమ్ముతారు. కాని ఇది వాస్తవం Sočóo.
తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ దశలో వ్యాధులను నివారించే మెమొరి సిడి-4 కణాలలో 60% వరకు హెచ్.ఐ.వి. సంక్రమణకు గురి అవుతాయి. హెచ్.ఐ.వి. సోక్రిన 14 రోజులలోనే మెమొరి సిడి -4 కణాలలో సగం వరకు నషిస్తాయి. అంతేకాక కోల్పోయిన కణాల స్థానంలో కొత్తకణాలను ఉత్పత్తి చేసే ధైమస్ గ్రంధి సామర్థ్యంను కూడా హెచ్.ఐ.వి. తగ్గిస్తుంది. చిన్న ప్రేగులో ఉన్న త్వచానికి కూడా అతి త్వరలో  జరుగుతుంది. ఈ మార్పులన్నియు వ్యక్తిలో ఫలితం రాకముందే జరుగుతాయి. అయినప్పటికి హెచ్.ఐ.వి. సోకిన వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ అనగా తన కిల్లర్ టి - కణాల (సిడి-8 కణాలు) మరియు బి-కణాలు ప్రతిదేహాలను ఉత్పత్తి హెచ్.ఐ.వి.కి. వ్యతిరేకంగా పోరాడుతుంది. హెచ్.ఐ.వి. సోకిన వ్యక్తి యొక్క సిడి -4 కణాలు మరియు టి - కణాల సంఖ్య ప్రారంభ కణాల  80-90% వరకు ఉత్పత్తి చేయబడుతాయి. కావు తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ దశనందు వ్యక్తిలోని లింఫ్ గ్రంధులలో చేరిన వైరస్ తొలగించబడుతుంది.

ఇతరులకు హెచ్.ఐ.వి. సోకే ప్రమాదం

తదుపరి దశలో ఉన్నవారిలో కన్న తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ దశలో ఉన్న వ్యక్తుల రక్తంలో అధిక సంఖ్యలో హెచ్.ఐ.వి. సోకిన కణాలు ఉంటాయి. చాలా కాలము క్రింద పెూచ్.ఐ.వి. సంక్రమించిన వ్యక్తుల రక్తం సోకుట కన్న తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ దశలో వ్యక్తుల రక్తం సోకుట వలన హెచ్.ఐ.వి. సంక్రమించే అవకాశము ఎక్కువ. ఈ అవకాశం దాదాపు 20 రెట్లు ఉంటుందని ఒక  అధ్యయనంలో అంచనావేయబడింది.
తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణకు చికిత్స మొదటిగా హెచ్.ఐ.వి. సోకిన కణాలను గుర్తించి వాటిని చంపేందుకు అవసరమైన తెల్లరక్తకణాలను వ్యాధి నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేస్తుంది. దీనిని హెచ్.ఐ.వి. నిర్ణీత ప్రతిస్పందన (హెచ్.ఐ.వి.స్పెసిఫిక్ రెస్సాన్స్) అంటారు. కొంత కాలము తర్వాత చాలా మంది వ్యక్తులలో యాంటి రిట్రోవైరల్ మందులు వాడనట్లయితే ఈప్రతి స్పందన ఆగిపోతుంది. మరియు హెచ్.ఐ.వి. దశ నుండి ఎయిడ్స్ దశకు పరిణితి చెందుతుంది. వ్యాధినిరోధక వ్యవస్థకు చాలా నష్టము కలిగే వరకు యాంటీ రిట్రోవైరల్ మందులు వాడకుండా వేచియుండాలని మార్గదర్శక సూత్రాలు తెలుపుతున్నవి. అయినప్పటికి తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ దశలో యాంటీ రిట్రోవైరల్ మందులు వాడుట వలన హెచ్.ఐ.వి. నిర్ణీత నిరోధక ప్రతి చర్య రక్షింపబడుతుంది. తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ దశలో యాంటీ రిట్రోవైరల్ మందులు వాడి ఆ తర్వాత వాటిని మానివేసిన వ్యక్తులపై పరిశోధకులు శాస్త్రీయ అధ్యయనం నిర్వహించారు. ఈ చికిత్సా విధానం వలన యాంటి రిట్రోవైరల్ మందులు వాడే దశను చేరుటకు ఎక్కువ సమయం పడుతుందని అధ్యయనాల వలన తెలిసింది. పరిశోధకులు మరిన్ని అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.

తీవ్ర హెచ్.ఐ.వి. నంక్రమణ దశలో చికిత్స అనుకూల మరియు ప్రతికూల అంశాలు

యాంటి రిట్రోవైరల్ థెరఫీ ప్రారంభించుట ఒక ముఖ్యమైన నిర్ణయం. కావున దీనిని ప్రారంభించాలనుకున్న వారు లాభనష్టాలను జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. యాంటి రిట్రోవైరల్ థెరఫీ మీ రోజు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మందులను క్రమంగా వాడుటను మరిచి పోయినట్లయితే వైరస్ ప్రతిఘటన శక్తి పెరిగి మందులు పనిచేయకుండా పోతాయి. మరియు భవిష్యత్తు చికిత్సావకాశాలు కూడా తగ్గిపోతాయి. యాంటి రిట్రోవైరల్ మందులు క్రమం తప్పకుండా వాడుట యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొనుటకు వాస్తవ సమాచార పత్రం 405 చదవండి. యూంటి రిట్రోవైరల్ మందులు చాలా శక్తివంతమైనవి. చాలా దుష్ఫలితాలు ఉండుట వలన చాలా కాలము వాటిని వాడుట కష్టము మరియు ఈ మందులు చాలా ఖరీదైనవి కావున అధిక ఖర్చుతో కూడికొని ఉంటుంది. ముందుగానే మందులు వాడినటైతే హెచ్.ఐ.వి. వలన వ్యాధి నిరోధక వ్యవస్థకు සටහී నష్టము తగ్గుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థకు జరిగే నష్టాన్ని సిడి 4 కణాల సంఖ్య తగ్గుదల మరియు వైరల్ లోడ్ పెరుగుదలతో అంచనా వేయవచ్చును. వ్యాధి తీవ్రత పెరిగే కొలది ఈమార్పులు సహచరితంగా సంభవిస్తుంటాయి. 40 సంవత్సరాల పైబడిన వా6లో
వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుచేత యాంటి రిట్రోవైరల్ మందుల ప్రభావం యువకులపై ఉన్నంత ఎక్కువగా వీరిపై ఉండదు.
ఏదేమైనప్పటికి హెచ్.ఐ.వి. సోకిన వారంతా వెంటనే వ్యాధుల బారిన పడతారని భావించకూడదు. సిడి 4 కణాల సంఖ్య 350 కన్నా ఎక్కువ ఉండి. వైరల్ లోడ్ 20,000 కన్నా తక్కువ ఉన్న వారిలో యాంటి రిట్రోవైరల్ థెరఫీ వాడుకున్నప్పటికి 6–9 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండే అవకాశం 50% మందిలో ఉంటుంది. (సిడి4 కణాల పరీక్షపై అధిక సమాచారం పత్రం 124 మరియు వైరల్ లోడ్ పరీక్షపై సమాచారం కొరకు వాస్తవ సమాచార పత్రం 125 ను చూడండి.) ప్రాథమిక దశలో మందులు వాడి హెచ్.ఐ.వి. నియంత్రణ జరిగిన తర్వాత వాటిని మానివేయవచ్చునని పరిశోధకులు మొదట్లో భావించారు. కాని ఇది వాస్తవం కాదనే విషయం తదనంతర పరిశోధనల వలన తెలుస్తుంది.

ముగింపు సమాచారం

తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ దశలో ఉన్న ప్రజలను గుర్తించుట సులభమైన విషయం కాదు. కొందరిలో ఎటువంటి లక్షణాలు కన్పించవు. కొందరిలో లక్షణాలు ఉన్నప్పటికి పూలాంటి అనేక ఇతర వ్యాధులలో కూడా ఇటువంటి లక్షణాలు గమనించబడతాయి.
కావున మీరు తీవ్ర హెచ్.ఐ.వి. దశలో ఉన్నట్లు భావిస్తే మీ ఆరోగ్య కార్యకర్తకు పరీక్ష చేయించుకోండి. ఈ దశలో యాంటి రిట్రోవైరల్ వాడుట వలన కలిగే లాభనషాల గూర్చి ఆరోగ్య కార్యకర్తతో చర్చించండి.
యూంటి రిట్రో వైరల్ వాడాలనుకొనుట ఒక ప్రధానమైన మరియు నిబద్ధత నిర్ణయం. అనుకూల మరియు ప్రతికూల అంశాలను మీ ఆరోగ్య కార్యకర్తతో కూలంకషంగా చర్చించిన తర్వాతనే సరియైన నిర్ణయం తీసుకొండి.
వుOదులు, సమీక్షించిన తేది - సెప్టెంబర్ 28, ౨౦౦౭.

ఎయిడ్స్ వాస్టింగ్ (బరువు కోల్పోవుట)

ఎయిడ్స్ వాస్టింగు (బరువు కోల్పోవుట) కోల్పోవట) అనగా ఏమి

వాస్టింగ్ అనగా అనుకోకుండా శరీర బరువు 10% కన్నా ఎక్కువ బరువు తగ్గిపోవుట. మరియు 30 రోజులకన్నా ఎక్కువ విరోచనాలతో లేదా నీరసం మరియు జ్వరంతో బాధపడుట. జబ్బు తొందరగా తీవ్రదశకు చేరుకొని మరణంకు దారితీసే సమయంలో వాస్టింగ్ (అనగా అనవసరంగా, ఏ కారణం శరీర బరువు తగ్గిపోవుట జరుగుతుంది. హెచ్.ఐ.విని మందులతో తగ్గించిన తరువాత కూడా ఆ రోగులలో వాస్టింగు కనిపిస్తుంది మరియు అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది.
వాస్టింగ్ సమయంలో తగ్గే బరువులో చాలా వరకు క్రొవ్వు కరిగిపోతుంది. కానీ కండరాలు కరుగుట మొదలు అయినప్పడు అసలు సమస్య మొదలౌతుంది. పూర్తి శరీర బరువులో కండరాల బరువు చాలా ముఖ్యమైనది.
కండరాలు కరుగుట మొదలు అయితే శరీరం చాలా బలహీనం అయిపోతుంది. ఈ కండరాల సముదాయ బరువును అసలు శరీర బరువు అంటారు. దీనిని కొలచుటకు రెండు పద్ధతులు ఉన్నవి. ఈ పద్ధతులలో శరీరంకు ఎటువంటి నొప్పి కలగకుండా
వాస్టింగ్ మరియు క్రొవ్వుకరిగిపోవుట
వలన శరీర ఆకృతిలో మార్పులు వస్తాయి. క్రొవ్వు కరుగుటను "లిపిడోస్టోపీ" అంటారు. (538 పత్రం చూడండి) వాస్టింగ్లో కండరాలు కరిగి బరువు తగిపోతాయి. 'లిపిడోసోపీ" లో చర్మం క్రింద పేరుకున్న క్రొవ్వుకరిగిపోతుంది. అపిడోస్టోపీ మరియు వాస్టింగ్ ఒకటి కాదు. కానీ స్త్రీలలో వాస్త్రింగ్ కొవ్వు కరుగుటంతో మొదలు అవుతుంది.

ఎయిడ్స్ వాస్టింగ్ కారణాలు

ఎయిడ్స్ వలన కలుగు వాస్టింగ్కు అనేక కారణాలు ఉన్నాయి.
1. ఆహరంతొ  కొవ్వు పదార్గాలు తక్కువగా తీసుకొనుట.
ఎయిడ్స్ రోగులలో ఆకలి మరియు అరుగుదల తక్కువగా ఉంటుంది. కొన్ని రకాల ఎయిడ్స్ మందలు కాల్లీ పొట్టతో తీసుకోవాలి లేదా భోజనం తరువాత తీసుకోవాలి. కొంత మంది ఎయిడ్స్ రోగులు ఆకలిగా ఉన్నప్పడు ఆహారం తినకూడదు. వారికి మందుల ప్రభావం వలన వికారంగా ఉండుట, నోటికి రుచి తెలియక పోవుట వంటి సమస్యల వలన ఆకలి తగ్గి పోతుంది. నోటిలోను మరియు గొంతులోను ఇతర అవకాశ వ్యాధులు వలన పండ్లు ఏర్పడి తినుట చాలా కష్టం అవుతుంది మరియు నొప్పిగా ఉంటుంది. ప్రేగులలో పుండు మరియు ఇన్ పెక్షనుల వలన కొంచెం ఆహారం తినగానే కడుపు నిండిపోయినట్లు ఉంటుంది. డబ్బు లేక కూడా సరైన ఆహారం తీసుకోలేరు. ఒపిక లేక నిసత్తువ వలన కూడా వంట చేసుకోలేక తినరు.

ఆహారం లోని పోషకాలను శరీరం గ్రహించుకోలేదు

ఆరోగ్యంగా ఉండే వ్యక్తులలో చిన్న ప్రేగు ద్వారా ఆహారంలోని పోషకాలను శరీరం తీసుకుంటుంది. హెచ్.ఐ.వి. రోగులలో అనేక వ్యాధులు ఉండటం వలన శరీరం మరియు (పేగులు పోషకాలను గ్రహించుకోలేవు. ఏయిడ్స్ వలన ప్రేగులలోని పై పొర దెబ్బతిని ఆహారంలోని పోషకాలని తీసుకోలేదు. విరోచనాలు వలన శరీరంలో ఉండే కొద్ది పాటి పోషకాలు బయటకు వెళ్ళిపోతాయి.

అరుగుదల దెబ్బతినుట వలన

హెచ్.ఐ.వి వలన ఆహారం అరుగుదల సరిగ్గా జరగదు అందువలన శరీరానికి అవసరమైన పోషకాలు కావలసినంతగా అందవు. హెచ్.ఐ.వి రోగ లక్షణాలు బయట పడక ముందు నుంచే శరీరంకు చాలా శక్తి అవసరం అవుతుంది. రోగ నిరోధక శక్తి యొక్క పని పెరిగి పోవుట వలన శరీరానాకి ఎక్కువ శక్తి కావల్సివస్తుంది. హెచ్.ఐ.వి రోగులకు పోషకాలు కావల్సి ఉంటుంది. శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా లేకపోవుట వలన అరుగుదల దెబ్బతింటుంది. హెచ్.ఐ.వి వ్యాధి వలన హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తాయి. సైటోక్సిస్ అనేవి ఒక రకమైన ప్రోటీను. ఇవి శరీరం రోగాలలో పోరాడుటకు ఉపయోగపడతాయి. హెచ్.ఐ.వి రోగులలో సైటోక్రీస్ ఎక్కువగా ఉంటాయి. సైటోక్రీస్ వలన శరీరం చెక్కర మరియు క్రొవ్వు పదార్థాలను
అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది. కాని ప్రోటీన్లను తక్కువ ఉత్పత్తి చేస్తుంది.
ఈ పైన విశ్లేషించిన లక్షణాలు అన్నీ కలిసి శరీం మీద ప్రభావం చూపుట వలన బరువు కోల్పోవుటకు తోడ్పడతాయి. ఉదాహరణకు వ్యాధి సంక్రమణ వలన శరీరం యొక్క శక్తి వినియోగం పెరుగుతుంది. అదే సమయంలో వ్యాధి ప్రభావం వలన శరీరం, ఆహారంలోని పోషకాలను పూర్తిగా వినియోగించుకోలేదు. మరియు ఆకలి, అరుగుదల తగ్గిపోయిన కారణంగా సరైన ఆహారం , అందువలన బలహీనంగా అవుతారు ఓపిక ఉండని కారణంగా వంట ఒండుకోవటం, కావల్సిన పదార్ధాలు కొనుక్కోవటం కష్టం అవుతుంది కనుక తక్కువగా తింటూరు మరియు బరువుతగ్గిపోతూ ఉంటారు.

వాస్టింగ్కు వైద్యం

ఎయిడ్స్ వలన కలుగు వాస్టింగ్  కోల్పోవట  ప్రత్యేకించి  ఏమీ లేదు. కాని శక్తివంతమైన యాంటీ రిట్రావైరల్ వైద్యం తీసుకొనుట వలన ఆరోగ్యం కుదుటపడి బరువు పెరుగుతారు. బరువు తగ్గిపోవుటకు వైద్యం చేయ్యాలి అంటే పైన చెప్పిన బరువు తగ్గుటకు కారణమైన  లక్షణాలకు విడి విడిగా వైద్యం చెయ్యాలి. ఎలాగ .
వికారము మరియు వాంతులను తగ్గించుట వలన ఎక్కువ వీలుపడుతుంది. మెగాస్ లేదా మారినాల్ (Megace & Marinol) వంటి ఆకలిని పెంచే ముందు ఆహారం తీసుకొనుటకు ఉపయోగించవచ్చు. దురదృష్టవశాతు మెగాస్ శరీరంలోని కొవ్వును పెంచుతుంది వికారమును తగ్గించుటకు మందులు వాడవచ్చు మారినాల్ వికారంను తగ్గించి ఆకలిని పెంచుతుంది.
1. విరోచనాలు మరియు రోగులలో సంక్రమించే ఇతర అవకాశ వ్యాధులకు వైద్యం చేయించుకొనుట వలన ఆహారంలోని పోషకాలను సంపూర్ణంగా శరీరంలోనికి పీల్చుకుంటాయి. ఇందుకు ఉపయోగించే వైద్యం ఈ మధ్యకాలంలో బాగా మెరుగుపడింది. కానీ ప్రేగులలో సంక్రమించే రెండు పరాన్నజీవులు క్రిప్లోస్పోరిడియాస్ మరియు మైక్రోస్పోరిడియాసిస్ ఇంకా ప్రమాదకరమైన వ్యాధులను కలుగ చేస్తున్నవి. వాటికి సరైన వైద్యం కూడా లేదు.
శరీరానికి అవసరమైన పోషకాలను మందు లేదా మాత్ర రూపంలో అందించుట మరో పద్ధతి.
శరీరానికి కావలసిన పోకాలను మాత్రల రూపంలో అందించుటకు ఎన్ స్యూర్ (Ensure) మరియు అడ్వెరా అను మాత్రలను రూపొందించారు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను చాలా సులువుగా శరీరం పీల్చుకునే రూపంలో అందిస్తాయి. మందుల మీద ఎక్కువ పరిశోధన లేదు మరియు వాటిలో చెక్కెర శాతం ఎక్కువ ఉంది. మాత్ర రూపంలో పోషకాలను తీసుకునే ముందు వైద్యుని సలహా అవసరం పోషకాల మాత్రలు సమతుల్య ఆహారంతోపాటుగా కలిపి తీసుకోవాలి.
అరుగుదలలో వచ్చే మార్పులకు వైద్యం చేయ్యాలి. శరీరంలోని హార్మోన్సులో ఏర్పడే హెచ్చు తగ్గుల వలన అరుగుదలలో మార్పులు వస్తాయి. శరీర పెరుగుదలకు కారకం అయిన సెరోప్టెం అను హార్మోన్ బరువు పెంచుటకు దోహద పడుతుంది మరియు కొవ్వును తగ్గిస్తుంది. ఇది కృత్రిమంగా శరీరానికి అందించవచ్చును. కాని అది చాలా ఖర్చుతో కూడిన మరియు అందువలన ఇతర ప్రమాకరమైన ప్రభావాలు వుంటాయి.
బాగా బరువు తగుతున్న సమయంలో కొద్దిపాటి వ్యాయామం బరువును పెంచుటకు ఉపయోగపడుతుంది. కనుక కొంచెం కొంచెంగా వ్యాయామ చేసూ బరువులను ఎత్తుతు శరీరానికి వ్యాయామం అలవాటు చెయ్యాలి. వ్యాయామం వలన శరీ కదలిక పెరిగి బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం పరిశోధనలలో తెలిసింది. ఇతర స్టెరాయిడ్స్ వాడే కంటే వ్యాయామం చాలా మంచిది. (802 పత్రం చూడండి)

ముగింపు సమాచారం

ఎయిడ్స్ వలన బరువు ఎందుకు తగుతారు అన్న విషయం పూర్తిగా విశదీకరించలేదు. కానీ ఎయిడ్స్ రోగులు బరువు కోల్పోవట చాలా ప్రమాదకరం. ఈ విషయం మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. రోగులు వారి బరువును ఎప్పటికి అప్పడు గమనించుకుంటూ ఉండాలి. వారికి ఆకలి తక్కువగా ఉన్నప్పటికి మంచి బలమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. విరోచనాలకు లేదా ఇతర ప్రేగులకు సంక్రమించే వ్యాధులకు వెంటనే వైద్యం చేయించుకోవాలి. లేదా ఆ వ్యాధుల వలన ఆకలి తగ్గిపోతుంది. ఆహారంలోని పోషకాలను గ్రహించుట తగ్గిపోతుంది.
2.96551724138
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు