హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు / ఒత్తిడిని ఎదుర్కొనేదెలా
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఒత్తిడిని ఎదుర్కొనేదెలా

ఒత్తిడిని ఎదుర్కొనేదెలా

పరిచయం

ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కడికి ఒత్తిడి ఒక పెద్ద శత్రువుగా తయారవుతోంది. ఇలా అవటానికి కారణం ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకు పరుగులే కారణం. అన్ని వైపుల నుంచి పోటీ ఒకటి తోడవటంతో తెలియని ఆందోళన. అయితే కొందరు తమ జీవితంలో అనుకోని దెబ్బలు ... దెబ్బలు ఆంటీ ఎదో కాదు. అనుకోని సంఘటనలు, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా నిబ్బరంగా ఉండగలరు.  కార్యాయాలకు వెళ్ళేటప్పుడు దారిలో వాహనాల రాకపోకలతో చిక్కుకు పోతే ఆలస్యం అవుతుందేమోననే గాభరా.

దీనిని ఎదుర్కోవటం ఎలా

ఒత్తిడిని ఎదుర్కోవటం, దాని వాళ్ళ కలిగే చేదు ప్రభావాల నుంచి బయట పడటం సాధ్యమే. ఇందుకు దృఢమైన సంకల్పం, సానుకూల వైఖరి చాల అవసరం. చాల మంది ఒత్తిడినుంచి మాములు ప్రపంచంలోకి రావటం కోసం మధ్య పానానికి బానిసగా మారటం , ఎక్కువగా తిన్నాము, టి వి ల ముందు గంటల తరబడి కూర్చోవటం, నిద్ర మాత్రలు వేసుకోవటం వేరొకరి మీద ఆధార పడటం చేస్తుంటారు. ఈ రకమైన దానితో మేలు కలగటం కన్నా చేదు బాగా ఎక్కువగానే వీలుంటుందని చెప్పచ్చు. కనుక తగ్గించే పదుతులు తెలుసుకుని ఆచరించడం అవసరం.

ఆహ్లాదకరమైన పనులు

కదలిక, శబ్దం, చూపు, రుచి, వాసనా వంటి వన్నీ మన మెదడు పని తీరు మీద ప్రభావం చూపిస్తాయి. ఆహ్లాదకర దృశ్యాలను వీక్షించడం, చక్కటి సంగీతాన్ని చెవులతో వినటం, మన ఇళ్లల్లో పెంచుకునే  పెంపుడు జంతువులను ఆప్యాయంగా నిమరటం, చక్కటి సువాసనలను ఆస్వాదించటం  వంటివి చేస్తుంటే ఒత్తిడి నుంచి బయటికొచ్చేలా చేస్తాయి. క్రిడాలంటే ఇష్టపడే వారు అడ్డుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. కునుకు ఇష్టమైన దాన్ని చేసుకుంటూ పోవటం ఉత్తమం.

వ్యాయామం

ఒత్తిడినుంచి తేరుకోవడానికి వ్యాయామం అసలైన మార్గం. ముఖ్యంగా  కా ళు, చేతులు కదిలే విధంగా చేసేవే ఒత్తిడిని తగ్గిస్తాయని అధ్యయనాల్లో గుర్తించారు. ఈత, నృత్యం, పరుగెత్తడం, నడవటం వంటివి చేస్తే బాగుంటుంది. ఇటువంటివి అవలంబించడంతో మనసు కూడా ప్రశాంతంగా ఉండేందుకు సహకరిస్తుంది. వ్యాయాయం చేసేటప్పుడు మన మనసుకి వుతేజాన్ని కలిగించే డోపామైన్ అనే ద్రవం మెదడులో విడుదల అవుతుంది. దింతో చురుకుగా, చలాకీగా, మరింత ఉత్సాహంగా ఉండగలం.

నలుగురితో మాటా మంతి తోడైతే...

ఒక రకమైన చికాకు, తెలియని ఆందోళనగ మనకి అనిపిస్తే స్నేహితులతోనో, ఇరుగుపొరుగు వారితోనో కలుసుకుని కాసేపు ప్రశాంతంగా సంభాషించటం వాళ్ళ ఏంతో హాయిగా అనిపిస్తుంది. కాగా దింతో ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు ఉత్పత్తి అవటానికి తోడవుతుంది. ఇతరులు మనతో కాసేపు ఆప్యాయంగా పలికిస్తూ చుసిన కూడా నాడీ పనితీరు కూడా సక్రమంగా  ఉండే వీలుంది. దీనితో సామజిక సంబంధాలు కుడా మెరుగవుతాయి.

మంచి ఆహరం

ఒత్తిడిలో వున్నప్పుడు ఎక్కువ మంది అందులోనుంచి బయటి రావటానికి ధూమపానం, మద్యం సేవించడం, స్వీట్లు, జంక్ ఫుడ్ వంటివి తీసుకుంటారు. దీనితో మేలు కాదు కదా ఎక్కువ బరువు ఇతర రకాలైన చేదు సమస్యలు ఎదురయ్యే అవకాశం వుంది. కనుక తాజా పండ్లు, ఆకు కూరలు కాయగూరలు, గింజలున్న పప్పులు , పొట్టుతో వున్నా ధాన్యాలు, పెరుగు లాంటివి తీసుకుంటే కొంత మేర ఒత్తిడి తగ్గే ఆస్కారముంది.

మంచి నిద్ర కూడా

ఒత్తిడి తగ్గించేందుకు నిద్ర ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. నిద్ర గనక సరిగ్గా పట్టక పోతే ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఇది కూడా ఒత్తిడికి కారణమే. ఎక్కువ కలం ఒత్తిడి గనక ఉంటే నిద్ర తక్కువ పట్టేందుకు దోహద పడుతుంది.కనుక రాత్రి వేళల్లో కనీసం ఆరు గంటల పటు అయినా  నిద్ర పోవాలి. ఎక్కువ సేపు టి వి , కంప్యూటర్ల ముందు, సెల్ ఫోన్లలో సంభాషణ తగ్గించుకోవాలి. అదే సమయంలో సాయంత్రం సమయంలో ఎక్కువగా టి, కాఫీ తగకూండా చూసుకోవాలి.

యోగా, ధ్యానం కుడా అవసరమే..

గాఢంగా, నెమ్మదిగా ఎక్కువ శ్వాస తీసుకోవటం, ధ్యానం, యోగ వంటివి  మానవుడి  శరీరం, మనసు కుదురుగా ఉండేందుకు సహకరిస్తాయి. ఏగరత పెరగటానికి, ఆత్మ విశ్వాసం కలగటానికి కూడా సహకరిస్తాయి. ఒత్తిడి, ఆందోళన, తగ్గు ముఖం పెట్టె విధంగా పని చేస్తాయి. కనుక ఎంత  బిజీగా వున్నా రోజులో కొంత సమయం విధిగా వీటికి కేటాయించుకుంటే ఒత్తిడి తగ్గటటంతో పటు పనిలో మనకు తెలియాలి చురుకుదనం బాగా కనపడుతుంది.

వ్యాసం ... అనూరాధ


2.88888888889
chandrakala Mar 23, 2017 02:59 PM

హెల్త్య్ టిప్స్ ఆరోగ్యం అండ్ ఫుడ్ ఏమియు తీసుకుంటి saripothuid

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు