హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు / గొంతులో ఏర్పడే రద్దీ వంటి సమస్యలను తగ్గించే గృహనివారణలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గొంతులో ఏర్పడే రద్దీ వంటి సమస్యలను తగ్గించే గృహనివారణలు

గొంతులో సమస్యలు లేదా రద్దీగా అనిపించటం లేదా గడ్డకట్టినట్టుగా అనిపించే సమస్యలు అన్ని రకాల వయస్కుల వారిలో కలగటం చాలా సాధారణం.

గొంతులో సమస్యలు లేదా రద్దీగా అనిపించటం లేదా గడ్డకట్టినట్టుగా అనిపించే సమస్యలు అన్ని రకాల వయస్కుల వారిలో కలగటం చాలా సాధారణం. ఇలాంటి సమస్యలకు ముఖ్య కారణం-జలుబు మరియు ఫ్లూ. తలనొప్పి, సైనసైటీస్ నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఈ సమస్యలు కలిగినపుడు బహిర్గతమయ్యే లక్షణాలుగా పేర్కోనవచ్చు. ఈ రకం సమస్యలు చాలా ఇబ్బందులకు గురిచేస్తుంటాయి, ముఖ్యంగా, ఆహర పదార్థాలను లేదా ద్రావణాలను మింగే సమయంలో గొంతు భాగంలో నొప్పిగా అనిపించేలా చేస్తాయి. ఇలాంటి సమస్యలను సహజ ఔషదాల ద్వారా త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ సహజ ఔషదాలు కూడా మన ఇంట్లోనే లభిస్తాయి.

గొంతు భాగంలో రద్దీ సమస్యలను తగ్గించే ఔషదాలు

ఉప్పునీటితో పుకిలించటం

అల్లం మరియు ఉప్పు కలిపిన వేడి నీటతో నోటిలో పుకిలించటం అనేది, గొంతులో ఏర్పడే, రద్దీగా అనిపించే సమస్యలను తగ్గించే అత్యుత్తమ గృహ నివారణిగా పేర్కొనవచ్చు. నీటిని తీసుకొని కొద్దిగా వేడి చేయండి (ఎక్కువగా వేడి చేయకండి, ఎందుకంటే ఈ నీటిని మీరు నోట్లో పోసుకోవాలి). దీనికి కొద్దిగా ఉప్పు కలపండి. తరువాత నీటిని నోట్లోకి తీసుకొని, రెండు లేదా మూడు సార్లు పుకిలించండి. కొన్ని సెకన్ల పాటు ఇలా చేసిన తరువాత నీటిని భయటకి ఉంచండి. గొంతులో కలిగే సమస్యల నుండి ఉపశమనం పొందేవరకు ఇలా పునరావృతం చేయండి

వేడినీటి ఆవిరులు

గొంతులో ఇలాంటి సమస్యలు ప్రారంభమవగానే, చల్లటి ద్రావణాలను తాగటం ఆపేసి, గోరు వెచ్చగా ఉండే నీటిని తాగటం ప్రారంభించండి. సూప్స్, రసాలను తాగటం వలన గొంతులో ఎలాంటి సమస్యలను ఏర్పరచకుండా శరీరంలోకి ప్రవేశిస్తాయి మరియు గొంతు భాగాన్ని శాంతపరుస్తాయి.

వేడి ఆవిరులు

గొంతులో సమస్యలను మరియు గొంతులో కలిగే కలిగే అసౌకర్యాలను తగ్గించే మరొక ఇంట్లో ఉండే ఔషదంగా వేడి ఆవిరులను పీల్చటం అని చెప్పవచ్చు. దీనిలో మొదటగా నీటిని బాగా వేడి చేసి, ఒక పెద్ద గిన్నెలో పోయాలి. వేడి నీటి గిన్నెకు కొద్ది దూరంలో తలను పెట్టి, పై నుండి శుభ్రమైన టవల్ ను కప్పుకోవాలి. ఈ సమయంలో భయట గాలి లోపలి రాకుండా, లోపలి ఆవిరులు భయటకు రాకుండా చుట్టూ టవల్ తో కప్పుకోవాలి. తరువాత, వేడి ఆవిరులను ముక్కు ద్వారా పీల్చాలి. వేడి ఆవిరులను పీల్చటం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండవచ్చు. కానీ, ఈ పద్దతి వలన ఈ రకమైన సమస్యల నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు. ఇలా 5 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకుంటూ, ఈ పద్దతిని అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

తేనె మరియు నిమ్మరసం మిశ్రమం

గొంతులో కలిగే చికాకులు, సమస్యలను తగ్గించే, రుచికర ఔషదంగా ఈ మిశ్రమాని పేర్కొనవచ్చు. తేనె, నిమ్మరసం మరియు వేడి నీటిని కలిపిన మిశ్రమాన్ని తాగండి. ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. తేనె, తేనె మరియు నిమ్మల మిశ్రమం దగ్గు మరియు ఫ్లూ వంటి వాటిని కూడా తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శుభ్రమైన గ్లాసున తీసుకొని, నిమ్మరసంను పిండి, తేనెను కలపండి. ఒక గిన్నెలో నీటిని వేడి చేసి, ఈ నీటిని తేనె మరియు నిమ్మరసం ఉన్న గ్లాసులో కొద్దిగా కలుపుతూ బాగా కలపండి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని తాగటం వలన గొంతు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

అంతేకాకుండా, ఇలాంటి సమస్యలతో ఉన్నపుడు కండిషనర్ ఉన్న గదులలో పడుకోకూడదు, పడుకునే సమయంలో గొంతు చుట్టూ శుభ్రమైన ఉన్ని దుస్తువును చుట్టి పడుకోండి.ఈ పద్దతి వలన కలిగే లాభాలను ఉదయం మీరే గమనిస్తారు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01041666667
షరీఫ్ Sep 10, 2018 02:17 PM

గొంతులో గర గర ప్రతిసారి ఉమ్ముట

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు