హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు / చర్మం మెరవాలంటే
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చర్మం మెరవాలంటే

ఇక్కడ కొన్ని సూపులు ఇస్తున్నాం. వీటిని తాగితే డీహైడ్రేషన్‌ సమస్య పోతుంది. అంతేకాదు ఇవి రక్తాన్ని పరిశుభ్రం చేస్తాయి. శరీరం లోపల ఉన్న మలిన పదార్థాలను బయటకు పంపించేస్తాయి

పర్యావరణంలో వచ్చే మార్పుల ప్రభావం చర్మం మీద కూడా పడుతుంది. ఫలితంగా చర్మం అసిడిక్‌ అవుతుంది. దాంతో మంట, మొటిమలు వస్తాయి. డీహైడ్రేషన్‌ వల్ల కూడా చర్మం దెబ్బతింటుంది. ఇక్కడ కొన్ని సూపులు ఇస్తున్నాం. వీటిని తాగితే డీహైడ్రేషన్‌ సమస్య పోతుంది. అంతేకాదు ఇవి రక్తాన్ని పరిశుభ్రం చేస్తాయి. శరీరం లోపల ఉన్న మలిన పదార్థాలను బయటకు పంపించేస్తాయి. ఆవి...


కాకరకాయ సూప్‌: ఒక టీస్పూన్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ని తీసుకుని బాగా వేడి చేయాలి. గింజలు తీసేసిన కాకరకాయ

ముక్కల్ని అందులో వేసి పది నిమిషాల పాటు వేగించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా దాంట్లో వేయాలి. అలాగే మెత్తగా దంచిన వెల్లుల్లి పాయల్ని, రుచి కోసం మిరియాల పొడి, కాస్త ఉప్పు అందులో వేయాలి. తర్వాత రెండు కప్పుల నీటిని అందులో పోయాలి. ఐదు నిమిషాల పాటు సూపును మరగనివ్వాలి. తర్వాత స్టవ్‌ ఆపేసి అందులో ఒక టీస్పూన్‌ తేనెను, ఒక టేబుల్‌స్పూన్‌ కొబ్బరిపాలను సూప్‌పైన వేయాలి. ఈ సూప్‌ను తాగితే చర్మానికి చాలా మంచిది.
మిక్స్డ్‌ వెజిటబుల్‌ సూప్‌: కేరట్‌, పాలకూర, సొరకాయ, దోసకాయ, టొమాటో, వెల్లుల్లి, కలబంద, ఆమ్లా వీటన్నింటినీ కలిపి జ్యూసులా చేసుకుని తాగాలి. ఈ జ్యూసులో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి.

కొబ్బరి-నిమ్మ నీళ్లు: కప్పు నీళ్లను తీసుకుని అవి గోరువెచ్చనయ్యేవరకూ వేడిచేయాలి. దానికి కప్పు కొబ్బరినీళ్లను కలపాలి. అందులో ఒక నిమ్మకాయను పిండాలి. డిటాక్స్‌ డ్రింకు రెడీ.

లవంగాలు, పుదీనా ప్యాక్‌: యాక్నే, జిడ్డుకారే చర్మానికి లవంగాలు, పుదీనా ప్యాక్‌ బాగా పనిచేస్తుంది. ఆరేడు పుదీనా ఆకులు, రెండు మూడు లవంగాలు తీసుకుని వాటిని బాగా మెత్తగా చేసి ఒక టీస్పూన్‌ ముల్తానిమట్టిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15-20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత నీటితో బాగా కడిగేసుకోవాలి.

వేప, తులసి ప్యాక్‌: వేప, తులసిలను మెత్తగా చేసి ఆ మిశ్రమాన్ని ఒక టీస్పూన్‌ శాండల్‌వుడ్‌ పౌడర్‌లో కలపాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసి నీళ్లు కొద్దిగా పోసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి పట్టించి 15-20 నిమిషాలు అలాగే ఉంచుకుని తర్వాత బాగా కడిగేసుకోవాలి.

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.96739130435
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు