హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు / న్యూట్రిషన్‌ కోసం నువ్వుల నూనె
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

న్యూట్రిషన్‌ కోసం నువ్వుల నూనె

కాల్షియం సమృద్ధిగా ఉండే నువ్వుల నూనెను వంటనూనెగా ఉపయోగించి ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పొందవచ్చు. విటమిన్లు, మినరల్స్‌తోపాటు ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ కలిగి ఉండే నువ్వుల నూనెను వంటకాల్లో వాడటం వల్ల అదనపు పోషకాలు అందుతాయి

కాల్షియం సమృద్ధిగా ఉండే నువ్వుల నూనెను వంటనూనెగా ఉపయోగించి ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పొందవచ్చు. విటమిన్లు, మినరల్స్‌తోపాటు ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ కలిగి ఉండే నువ్వుల నూనెను వంటకాల్లో వాడటం వల్ల అదనపు పోషకాలు అందుతాయి.


పోషకాల వివరాలు
100గ్రా నువ్వుల నూనెలో... 
శక్తి - 884 కిలో కేలరీలు 
కొవ్వులు - 100గ్రా 
వీటిలో... 
శాచురేటెడ్‌ - 14.200గ్రా 
మోనో శాచురేటెడ్‌ - 39.700గ్రా 
పాలీ శాచురేటెడ్‌ - 41.700గ్రా 
విటమిన్‌ ఇ - 1.40మి.గ్రా
విటమిన్‌ కె - 13.6మి.గ్రా

 

నువ్వుల నూనె రకాలు
దక్షిణ భారతదేశంలో వంటనూనెగా వాడే నువ్వుల నూనెను కొరియా, చైనా, జపాన్‌, మధ్య ప్రాచ్య దేశాల్లో ఫ్లేవర్‌ ఎన్‌హాన్సర్‌గా ఉపయోగిస్తారు. ఈ నూనెలో రకాలు కూడా ఉన్నాయి. అవేంటంటే...

కోల్డ్‌ ప్రెస్‌డ్‌: పచ్చి నువ్వుల నుంచి ఈ నూనెను తీస్తారు. ఇది లేత పసుపు రంగులో ఉంటుంది. 
జింజెల్లీ ఆయిల్‌: ఈ రకం నూనె బంగారు రంగులో ఉంటుంది. మన దేశంలో ఈ నూనెనే విరివిగా వాడతారు. 
ఈస్ట్‌ ఏసియన్‌ ఆయిల్‌: ఈ నూనె ముదురు గోధుమ రంగులో ఉంటుంది. వేయించిన నువ్వుల నుంచి ఈ నూనెను తీస్తారు కాబట్టి రుచి కూడా ఘాటుగా ఉంటుంది.

 

వంటకాల్లో ఇలా!

 • లేత పసుపు రంగు నువ్వుల నూనెకు హై స్మోకింగ్‌ పాయింట్‌ ఉంటుంది. కాబట్టి ఈ నూనెను డీప్‌ ఫ్రైలకు ఉపయోగించవచ్చు.
 • ముదురు రంగు నువ్వుల నూనెను కూరగాయలు, మాంసం, గుడ్లను స్టిర్‌ ఫ్రై చేయటానికి వాడొచ్చు.
 • పచ్చళ్ల తయారీకి నువ్వుల నూనే శ్రేష్టం.
 • వేడిగా ఉండే అన్నం, పప్పుల పొడి, మసాలాలు కలిపేటప్పుడు ఈ నూనెను జోడిస్తే రుచులు సమంగా కలుస్తాయి.
 • నువ్వుల నూనెను మితంగా వాడి కూరగాయలతో కూరలు, పచ్చళ్లు చేసుకోవచ్చు.
 • ఆరోగ్యపరమైన ప్రయోజనాలు
 • దీన్లోని సీసమాల్‌, సీసమిన్‌ అనే పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ రక్తంలో కొలెస్టరాల్‌ లెవెల్స్‌ను అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
 • ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే రాగి, జింక్‌, కాల్షియం నువ్వుల నూనెలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వుల నూనెను వాడాలి.
 • మెదడులో విడుదలయ్యే సెరటోనిన్‌ అనే హార్మోన్‌ సంతోషకరమైన భావనలను కలిగిస్తుంది. ఈ హార్మోన్‌ను ప్రేరేపించే టైరోసిన్‌ అనే అమీనో యాసిడ్‌ నువ్వుల నూనెలో ఉంటుంది. కాబట్టి నువ్వుల నూనెను ఆహారంలో చేర్చుకుంటే డిప్రెషన్‌ దరి చేరదు.
 • దీన్లోని ఫైటేట్‌ అనే ఆర్గానిక్‌ కాంపౌండ్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది. దీన్లోని కాల్షియం పెద్దపేగులను క్యాన్సర్‌కు గురికాకుండా రక్షిస్తుంది

 

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.98888888889
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు