హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు / బలమైన శిరోజాల కోసం..!
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బలమైన శిరోజాల కోసం..!

జుట్టు కొంచెం పొడవు ఉన్న ప్రతి ఒక్కరికీ వారికి నచ్చిన హెయిర్‌ స్టైల్‌ ట్రై చేయాలని ఉంటుంది. కానీ అలా చేయడానికి ముందు జుట్టు బలంగా ఉందా?

జుట్టు కొంచెం పొడవు ఉన్న ప్రతి ఒక్కరికీ వారికి నచ్చిన హెయిర్‌ స్టైల్‌ ట్రై చేయాలని ఉంటుంది. కానీ అలా చేయడానికి ముందు జుట్టు బలంగా ఉందా? అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే హెయిర్‌ స్టైల్స్‌ మెయుంటేన్‌లో హీట్‌ థెరపీ, కెమికల్స్‌ వాడడం వంటివి తప్పవు. జుట్టు బలంగా, నిగనిగలాడేలా అవ్వాలంటే ఈ చిట్కాలను పాటించాలి.

తలస్నానం చేసేటప్పుడుగానీ, నూనె పట్టించేటప్పుడుగానీ మాడును గట్టిగా రుద్దకూడదు. అలాగే ప్రతిరోజూ తలస్నానం చేయడం కూడా అంత మంచిది కాదు. అలా చేయడంవల్ల చర్మం నుంచి సహజంగా విడుదలయ్యే ఉపయోగకరమైన తైలాలు పూర్తిగా తొలగిపోతాయి. దానివల్ల జుట్టు పొడిబారుతుంది.

అంతేకాకుండా వెంట్రుకలమూలాలు దెబ్బతిని జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వారంలో రెండుసార్లకు మించి తలస్నానం చేయకూడదు. అలాగే హెయిర్‌ డ్రయర్‌, స్టైలింగ్‌ టూల్స్‌ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించకూడదు. వాటిని పదేపదే వాడడం వల్ల జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. పోషకవిలువలతో కూడిన ఆహారం జుట్టు సంరక్షణలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కురుల ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్స్‌, మినరల్స్‌, ప్రొటీన్స్‌, ఒమేగా ఫాటీ యాసిడ్స్‌తో కూడిన పదార్థాలను ఎక్కువ తీసుకోవాలి.

గుడ్డు, తేనె మిశ్రమాన్ని వారానికొకసారి మాస్క్‌లా వేసుకోవడం వల్ల జుట్టు పొడిబారకుండా, చిట్లిపోకుండా జాగ్రత్తపడొచ్చు. అలాగే నిమ్మరసం, ఆపిల్‌ సీడర్‌ వెనిగర్‌, నీళ్లు మిశ్రమాన్ని తలస్నానానికి ఓ గంట ముందు జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడంవల్ల జుట్టుకు నల్లని మెరుపు వస్తుంది. పెరుగులో కొద్దిగా మిరియాలపొడి కలిపి తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తే డాండ్రఫ్‌ వదులుతుంది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు