హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు / లావు తగ్గించే కుసుమ నూనె
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

లావు తగ్గించే కుసుమ నూనె

లావు తగ్గించే కుసుమ నూనె

విత్తనాల కోసం పండించే ఆ పంటను ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో పండిస్తున్నారు. అనిలిన్‌ డైలకు పూర్వం కుసుమ (శాఫ్‌ ఫ్లవర్‌) విత్తనాలను వంటకాల కలరింగ్‌ కోసం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ విత్తనాల నుంచి తీసిన నూనె వంటనూనెగా విరివిగా వాడుకలో ఉంది.

న్యూట్రిషనల్‌ వాల్యూ 
వంద గ్రాముల కుసుంభ నూనెలో:
కొవ్వులు - 38గ్రా 
దీన్లో:
శాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 3.7గ్రా 
పాలీశాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 28గ్రా 
మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 4.8గ్రా 
సోడియం - 3గ్రా 
పొటాషియం - 687మి.గ్రా 
కార్బొహైడ్రేట్స్‌ - 34గ్రా 
ప్రొటీన్‌ - 16గ్రా 
విటమిన్‌ బి12 - 88శాతం 
వంటకాల్లో ఇలా:

 • కుసుమ నూనెతోపాటు పువ్వుల్ని కూడా వంటకాల్లో వాడతారు. కుంకుమ పువ్వులా వంటకాలకు రంగు తెచ్చే చవక పువ్వు ఇది. కాబట్టి దానికి బదులుగా కుసుమ నూనెను వాడొచ్చు.
 • కుసుమ విత్తనాల నుంచి తీసే మోనోశాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌...ఈ రెండు నూనెలను కూరగాయల వేపుళ్లకు వాడొచ్చు.
 • ఈ నూనెతో తక్కువ వేడిని ఉపయోగించే బేకింగ్‌ కోసం వాడొచ్చు.
 • సాస్‌ తయారీలో వాడొచ్చు.
 • డీప్‌ ఫ్రైలకు ఉపయోగించొచ్చు.
 • సలాడ్‌ డ్రెసింగ్‌కు వాడొచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:

 • ఈ నూనెలో యాంటిఆక్సిడెంట్స్‌ ఉంటాయి. కాబట్టి గుండెకు మేలు చేస్తుంది.
 • ఈ నూనెకు వాడితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది.
 • దీన్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి.
 • ఈ నూనె శరీరంలో కొవ్వులా పేరుకోదు. పైగా శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి లావు తగ్గాలనుకునే వాళ్లు వంటకాల్లో ఈ నూనెను వాడటం మేలు.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి

2.96774193548
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు