హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు / వేసవికాలంలో హాయిగా నిద్రపోవటానికి కొన్ని చిట్కాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వేసవికాలంలో హాయిగా నిద్రపోవటానికి కొన్ని చిట్కాలు

వేసవికాలంలో హాయిగా నిద్రపోవటానికి కొన్ని చిట్కాలు

వేసవి కాలంలో ఇంట్లో వేడితో పాటు ఒంట్లోనూ అధిక ఉష్ణం ఉండటం వల్ల నిద్రపట్టడం చాలా కష్టం. అందుకే మనకి అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగపర్చుకోవాలి. అలా చేస్తే ఎండాకాలంలో హాయిగా సేదతీరవచ్చు.

సిల్కు వసా్త్రలు, షీట్లు కేవలం అందంగా కనిపిస్తాయి. ప్రదర్శనలకి బావుంటాయి. అయితే ఈ సమ్మర్‌లో ఇవి ఏమాత్రం ఉపయోగకరం కావు. అందుకే ఇంట్లో కాటన్‌ వసా్త్రలు, షీట్లు విరివిగా వాడాలి. లైట్‌ కలర్‌ కాటన్‌ షీట్స్‌ని ఎంపిక చేసుకోవటం ఉత్తమం.

నైట్‌డ్రస్సుల విషయానికొస్తే టీ షర్టులు, పాంట్స్‌, షార్ట్స్‌.. ఇలా కాటన్‌ డ్రెస్సులైతే బావుంటుంది. శరీరానికి ఉపశమనం లభిస్తుంది. చక్కని నిద్ర పడుతుంది.

  • - ఇంట్లోనే అనుకూలమైన ఏసీని చేసుకోవచ్చు. అదెలాగంటే టేబుల్‌ ఫ్యాన్‌ ఎదురుగా ఒక బౌల్‌లో కూల్‌ వాటర్‌ లేదా ఐస్‌ ముక్కల్ని ఉంచితే గది అంతా చల్లబడుతుంది. కాస్త ఎ.సి. ఎఫెక్ట్‌ వస్తుంది. హాయిగా నిద్రపోవచ్చు.
  • - శరీరంలోకి ద్రవపదార్థాల్ని తీసుకోవటం ఉత్తమం. వీలైనంతగా పగటిపూట పండ్లరసాలు, మజ్జిగ లాంటివి తాగాలి. రాత్రి సమయంలో మెలకువ వచ్చినపుడు చల్లని నీటిని తాగాలి. నిద్ర ఇట్టే పట్టేస్తుంది.
  • - కాంతిని ప్రసరించే లైట్స్‌ హీట్‌ని కూడా ఉత్పత్తి చేస్తాయి. అందుకే నిద్రకి ఉపక్రమించే గంట ముందు లైట్స్‌ని ఆఫ్‌ చేయాలి.
  • - ఉదయం పూట త్వరగా నిద్ర లేసి ఎక్సర్‌సైజ్‌ చేయాలి. దీని వల్ల శరీరం ఫిట్‌నెస్‌ వస్తుంది, దీంతో పాటు అలసిపోయామనే భావన వస్తుంది. దీని వల్ల త్వరగా నిద్రపోవచ్చు కూడా.

 

ఆధారము: ఆంధ్రజ్యోతి

 

2.97959183673
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు