హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు / సోరియాసిస్... బరువు తగ్గాలి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సోరియాసిస్... బరువు తగ్గాలి

సోరియాసిస్... బరువు తగ్గాలి

పరిచయం

సోరియాసిస్ అనీ చర్మ వ్యాధి అంత త్వరగా సమసి పోయేది కాదు. ఇది ఎలా ఉంటుందంటే చర్మం పై తెలుపు రంగుతో కూడిన పొలుసులు, దురద మొదలైన సమస్యలతో ఎక్కువ రోజులు ఇబ్బంది కలిగిస్తుంటుంది. కనుక సాధ్య మైన వరకు సోరియాసిస్ లక్షణాలు పెరగకుండా జాగ్రత్త పడటం ఎంతో అవసరం. బరువు తగ్గటం కూడా బాగా మేలు చేస్తుంది. ఫలితంగా సోరియాసిస్ లక్షణాలు తగ్గుతున్నట్టు , నిత్యా కృత్యం మనం చేసుకునే పనులు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసుకోవటానికి ఉపయోగ కారిగా ఉన్నట్టు డెన్మార్క్ అధ్యయనం తాజాగా పేర్కొంటోంది. ఇది చూడటానికి చర్మ సమస్య లాగానే కనబడుతుంది కానీ సోరియాసిస్ శరీరం లో వాపుతో కూడుకున్నది. కనుక ఇది అన్ని అవయవాలను ప్రాభాతితం చేస్తుంటుంది. ఎక్కువ బరువుతో గుండె, మిగిలిన అవయవాలపై ఒత్తిడి పడుతుంది. దీనితో సోరియాసిస్ ఎక్కువ కావటానికి ఉపయోగకారిగా తయారవుతుంది. బరువు ఎక్కువ అయ్యేట్టు చేసే ఆహార పదార్ధాలు సైతం వంటిలో వాపు ప్రక్రియను ఉసి గొల్పుతాయి. వత్తిడి ఎక్కువైనప్పుడు కాస్త ఎక్కువగా తినే వాళ్లుంటారు. దీనితో సోరియాసిస్ మరింత ఎక్కువయ్యే అవకాశం లేక పోలేదు. ఎక్కువ బరువు కూడా తోడైతే హై బిపి, మధుమేహం, గుండె జబ్బుల వంటి వ్యాధుల ప్రబలే వీలుంది. మిగిలిన వారితో పోలిస్తే సోరియాసిస్ బాధితులు సగటున 7 శాతం ఎక్కువ బరువు ఉంటారు కూడా. కనుక ఆహారం తీసుకోవటంలో నియమాలు, వ్యాయామం వంటివి చేయటం ద్వారా సోరియాసిస్ వున్నా లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు. మిగిలిన వ్యాధులని కూడా దరిదాపుల్లోకి చేరకుండా చూసుకోవచ్చు.

జాగ్రత్తలు విధిగా తీసుకోవాలి

వ్యాయామం చేయాలనీ తెలిసినప్పటికీ ఎక్కువమంది దీని బారిన పడిన వారు కాస్త వెనుకడుగు వేస్తుంటారు. చర్మంపై పొలుసులు ఇతరులకు కనబడతాయేమోనని బిడియంగా కనిపిస్తారు. ఆడుకునేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడో చర్మంపై తెలియకుండా గీసుకు పొతే పొలుసులు బాధ ఎక్కువైయ్యే వీలుంది. అదే విధంగా చెమట, చర్మం ముడతల రాపిడితో కూడా చిక్కులు కలిగే వీలుంది. వ్యాయామం, శరీర శ్రమ ఎక్కువగా అయినట్లయితే కీళ్ల నొప్పులు కూడా సోకె వీలుంది. అయితే వ్యాయామానికి ముందరగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులను తొలగించుకునే అవకాశం వున్నది.

  • ఎక్సర్సైజు చేస్తున్నప్పుడు లూజుగా ఉన్న వస్త్రాలను వేసుకోవటం మంచిది. దీంతో చర్మంపై ఒరిపిడి లేకుండా చూసుకోవచ్చును. చర్మాన్ని రుద్దటం, నలపడం వంటివి కూడా చేయకుండా చూసుకుంటే మంచిది.
  • చెమటను పిల్చుకునే పవుడరు జల్లుకుంటే మరీ మంచిది.
  • రొమ్ముల కింద, చంకలు, గజ్జలు వంటి చోట్ల చర్మం ముడతలు అంటుకునుని, రాసుకోకుండా ఉండేందుకు పెట్రోలియం జెల్లీ వంటివి వాడితే బాగుంటుంది.
  • ఎక్సర్సైజుతో సోరియాసిస్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిస్తే తక్షణమే వైద్యులు సూసించిన పై పూత మందు రాసుకుంటే మంచిది.
వ్యాసం: భాస్కర్ 

 


 


 


 


2.98630136986
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు