హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు / స్కిన్ అలర్జీ మరియు చర్మ సమస్యలకు ఇంట్లో ఉండే ఔషదాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

స్కిన్ అలర్జీ మరియు చర్మ సమస్యలకు ఇంట్లో ఉండే ఔషదాలు

చర్మ సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది తాత్కాలిక చర్మం సమస్యలు రెందోసి దీర్ఘకాలిక చర్మ సమస్యలు, ఇక్కడ తాత్కాలిక చర్మ సమస్యలకు చికిత్సగా ఇంట్లో ఉండే ఔషదాలు తెలుపబడ్డాయి.

చర్మ సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది తాత్కాలిక చర్మం సమస్యలు రెందోసి దీర్ఘకాలిక చర్మ సమస్యలు, ఇక్కడ తాత్కాలిక చర్మ సమస్యలకు చికిత్సగా ఇంట్లో ఉండే ఔషదాలు తెలుపబడ్డాయి.

కొబ్బరి నూనె

సూక్ష్మ జీవులను చంపే సహజ సిద్దమైన గుణాలను కలిగు ఉండే కొబ్బరి నూనె చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ మీరు దురదలను కలిగి ఉన్నట్లయిటే, ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను పూసి గట్టిగా రాయటం వలన దురదల నుండి ఉపశమనం పొందుతారు.

ఆలివ్ ఆయిల్

మీరు చర్మ సమస్యలను కలిగి ఉన్నపుడు, పడుకోటానికి ముందుగా ప్రభావిత ప్రాంతాలలో ఆలివ్ ఆయిల్'తో మసాజ్ చేయండి. అంతేకాకుండా, ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె రెండింటిని కలిపి వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా చేసిన తరువాత ప్రభావిత ప్రాంతాన్ని వేడి గుడ్డతో చుట్టాలి, చర్మం నూనెను గ్రహించుకున్న తరువాత గుడ్డను తొలగించాలి.

వేప

వేప చెట్టు ఉత్పత్తులు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ గుణాలను కలిగి ఉండటం వలన చర్మానికి కలిగే వివిధ రకాల సమస్యలకు, మొటిమలకు, గజ్జి, తామర వ్యాధులను తగ్గించటానికి వేపను వాడుతుంటారు

నల్ల మిరియాలు

నల్ల మిరియాలను సహజసిద్ద 'డి-టాక్సీఫయర్'గా చెప్పవచ్చు, కానీ చర్మ సమస్యలకు చాలా అరుదుగా వాడుతుంటారు. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటం వలన చర్మాన్ని అందంగా కనపడటానికి మరియు స్వస్థతలకు గురైన చర్మానికి చికిత్సలుగా ఈ నల్ల మిరియాలను వాడుతుంటారు .

తేనే

తేనే చాలా రకాలుగా చర్మానికి ఉపయోగపడుతుంది మరియు ఈ సహజ సిద్దమైన ఇంట్లో ఉండే ఔషదం వలన చర్మం స్వస్థతకు గురైనపుడు, ఇతర అన్ని చర్మ సమస్యలకు ఔషదంగా వాడవచ్చు. ముఖ్యంగా మొటిమలు పగిలినపుడు, తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు. మీ చర్మ సమస్యలను తగ్గించటానికి తేనే మరియు దాల్చిన చెక్క పొడిని కలిపిన మిశ్రమాలను చర్మానికి వాడండి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉండటం వలన వివిధ రకాల చర్మ సమస్యలను సులభంగా తగ్గిస్తాయి. చర్మం దురదగా అనిపించినపుడు, చిన్న కాటన్ ముక్క లేదా పత్తి ముక్కను తీసుకొని ఆపిల్ సైడర్ వెనిగర్'లో ముంచి దురదలుగా అనిపించిన ప్రాంతాలలో రాయటం వలన దురదల నుండి విముక్తి పొందుతారు

నిమ్మకాయ

నిమ్మకాయ విటమిన్ 'C'లను ఎక్కువగా కలిగి ఉండటం వలన శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటుంది, చర్మ సమస్యలకు ఇది శక్తి వంతంగా పని చేస్తుంది. మీరు చర్మ సమస్యలను కలిగి ఉన్నారా? అయితే నిమ్మకాయ నుండి చిన్న ముక్కను కత్తిరించి, ప్రభావిత ప్రాంతంలో రాయటం వలన మీరు చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు

కలబంద

కలబందను చర్మ సమస్యలు మరియు సౌందర్య ఉత్పత్తులలో సాధారణంగా వాడుతుంటారు. ఈ అద్బుతమైన కలబంద వృక్షం చర్మం పైన కలిగే చిరాకులు మరియు కలిగే దురదల నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది. కలబందను చర్మం పైన కలిగే అన్ని రకాల చర్మ సమస్యలను తొలగించే ఒక గొప్ప ఔషదంగా చెప్పవచ్చు.

పొప్పడి పండు

పొప్పడి పండు పుష్కలంగా విటమిన్ 'A' మరియు 'పపాయిన్'లను కలిగి ఉండి, చర్మంలో నిర్జీవ కణాలను తోలగించటమే కాకుండా చైతన్య రహిత ప్రోటీన్'లను విచ్చిన్నం చేస్తుంది. పచ్చి పొప్పడి పండు గుజ్జును చర్మానికి వాడటం వలన చర్మం పైన ఉండే నల్లటి వలయాలు మరియు మొటిమలు తగ్గుతాయి.

నీరు

సరైన మొత్తంలో నీటిని తాగటం వలన, రక్త ప్రసరణలో ఉండే హానికర పదార్థాలను మరియు విష పదార్థాలను తోలగిస్తుంది. ఈ విష పదార్థాల వలన చర్మాన్ని పగిలేల చేస్తాయి. చర్మాన్ని హైడ్రేటేడ్'గా ఉంచుకోవటం వలన మీ చర్మం నుండి ఆయిల్ వేరు చేయబడుతుంది. అంతేకాకుండా, నీరు మీ చర్మాన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది.

ఆధారము: మై హెల్త్

3.02272727273
రవి నాయక్ Sep 09, 2017 10:39 PM

అలర్జి . ఎ మందు ని . వాడటం వలన . పోతుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు