హోమ్ / ఆరోగ్యం / జీవన వాస్తవాలు / ఇయర్ ఫోన్ల వాడకం అంత మంచిది కాదు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇయర్ ఫోన్ల వాడకం అంత మంచిది కాదు

ఇయర్ ఫోన్ల వాడకం అంత మంచిది కాదు

పరిచయం

ప్రస్తుతం ప్రతి వ్యక్తికీ సెల్ ఫోను వున్న విషయం అందరికి తెలిసిందే. కొందరు అత్యవసరాలకు మాత్రమే ఉపయోగించు కుంటుంటే కొందరు ఒక ఫ్యాషన్ కింద వాడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే మనం ప్రతి రోజు చాల మందిని ముఖ్యంగా యువత ఐటీ సెల్ ఫోన్ల ద్వారా వున్నా కార్డులను చెవుల్లో ఉంచుకుని ఎక్కువ సేపు మాట్లాడటమే, లేకపోతే పాటలు వినటమో చేస్తున్నారు. నిజానికి ఇది అంత మంచి పని కాదు. దీనిపై తల్లి తండ్రులు, ఇతర బంధువు చెప్పినా అంతగా ఎవరు పట్టించుకోవటం లేదు. బస్సులు, కార్లు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు కూడా చెవుల్లో వీటిని ఉంచుకుని మాట్లాడే వారిని గమనిస్తూనే ఉంటాము. గంటల కొద్దీ వింటూ వుంటారు కొందరు. ఆలా చేస్తే వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైదులు కూడా హెచ్చరిస్తున్నారు.  మాటలతోనే లేదా పాటలతోనో లీనమై పోవడంతో దిగాల్సిన స్టాపులో దిగకుండా వుండే వారిని కూడా చేస్తున్నాము.

ఎక్కువ మంది యువతే

వినికిడి సమస్య ఎక్కువ శాతం వయస్సు మళ్ళిన వారికీ వస్తుంటుంది. ఇప్పుడు కొన్ని మెట్రో నాగరాళ్లలో ప్రస్తుతం యువత ఆ సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మితి మించి ఎక్కువ సేపు ఇయర్ ఫోన్లతో శబ్దం వినడంతో వస్తోందని అంటున్నారు. అటువంటి కోవకి చెందిన వారు దాదాపు ముప్పై శాతం వరకు వున్నారని అంటున్నారు. ఎక్కువ సేపు వాడకంతో మానసిక సమస్యలు, జ్ఞాపకం శక్తీ తగ్గటం నిద్ర తక్కువ, తలా నొప్పి తదితరాలు ప్రబలే వీలుంటుందని పేర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియాలు సోకుతాయి. ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని కూడా హెచ్చరిస్తున్నారు.

అధ్యయనాలు

అమెరికాలోని నేషనల్ పార్క్ సర్వీసెస్ సహకారంతో ప్రిస్టేఫ్ బృందం ఇయర్ ఫోన్ల వాడకంపై అధ్యయనం చేపట్టింది.

  • చెవుల్లో ఎప్పుడు ఇయర్ ఫోన్ వాడకంతో దాని పైన శ్రద్ధ ఉంచుతారు. ఇతరులతో కలవటం తగ్గుతుంది.
  • ప్రశాంతత తగ్గిపోతుంది. సదా పాటలు వినటంతో ఆశబ్దాలు ఇయర్ ఫోన్లు చెవులనుంచి తీసిని తరువాత కూడా వినిపిస్తుంటాయి. దింతో ఇబ్బందికి గురయ్యే వీలుంది.
  • సహజ ప్రకృతిని ఆనందించలేము. వినికిడి శక్తీ త్వరగా వచ్చే ప్రమాదముంది.  ప్రపంచం మొత్తం మీద పదకొండు బిలియన్ మంది వికిది సమస్యతో బాధ పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతొంది. 2008 అయ్ మన దేశంలో జరిగిన సర్వ్ లోను ఇదే తేట తెల్లమైంది.

ఇవే సూచికలు

ఆరు బయట ప్రశాంతంగా  ఉన్నప్పటికీ చెవుల్లో మాత్రం ఈల మోతగా అనిపించినప్పుడు, మోతగాను ఉంటే ఇతరత్రా శబ్దాలు వింటున్నారా.  ఇలా ఉంటే వినిది లోపాలు ప్రబలే అవకాశం ఉందని చెప్పడానికి సంకేతాలు రైలు పట్టాల వెంబడి ఇలా మాట్లాడుతూ నడవటంతో  తెలంగాణ పరంగా రెండువేల పదిహేనులో   దాదాపు వెయ్యికి పైగా మరణ వాత పడ్డట్టు జాతీయ నేర రికార్డుల గణాంకాలు పేర్కొంటున్నాయి.

వ్యాసం... అనూరాధ

2.98863636364
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు