హోమ్ / ఆరోగ్యం / జీవన వాస్తవాలు / కిడ్నీలో సి రాళ్లు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కిడ్నీలో సి రాళ్లు

కిడ్నీలో సి రాళ్లు

దేనికైనా  అతి అంత మంచిది కాదు అని మన పెద్దలు చాల విషయాల్లో చెబుతుంటారు. వారు చెప్పేది  సి  విటమినుకి బాగా సరిపోతుందని అనుకోవచ్చును. మనకి కావలసిన మోతాదులో వాడితే సి మేలే చేస్తుందిట. అనవసరంగా ఎక్కువగా మనం తీసుకుంటే మాత్రం మానవుడికి కిడ్నీలో రాళ్లు ప్రబలే అవకాశం పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  అయితే దీన్ని మగ వారు బాగా గురుతుంచుకోవాలని ఎక్కువ భాగం ముప్పు వారికీ ఉంటుందనేది గమనార్హం.

మానవుడి శరీరంలో వున్న పలు వేరు భాగాలకు, ఇతర అవయవాలకు బాగా దన్నుగా నిలిచే కణజాలం ఏర్పడటానికి, దాని మరమ్మతులకు విటమిన్ సి  ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంటుంది.

చర్మం, ఎముకలు ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది కూడా. శరీరం ఇనుమును ఆకర్షించు కోవటానికి కూడా సాయ పడుతుంది. సాధారణంగా మెగా వారికీ సగటున ప్రతి రోజుకి తొంభై మిల్లి గ్రాములు, స్త్రీలకి అయితే డెబ్బయి అయిదు మిల్లి గ్రాముల విటమిన్ సి  కావాలి.

అయితే ఈ విషయంలో కొందరు కాసంత ఎక్కువగా తీసుకుంటే మాత్రం జలుబు రాకుండా కాపాడుతుందని, వ్యాధి నిరోధక వ్యవస్థను బాగా బలోపేతం చేస్తుందని, శరీరంలోంచి విష తుల్యాలను బయటకు పాముతుందని, ఇంకా గుండెను కూడా కాపాడుతుందని క్యాన్సరుతో కూడా పోరాడుతుందని అనుకుంటారు. అవరం వున్నా లేకపోయినా విటమిన్ సి మాత్రలు మాత్రం తరచూ  వాడుతుంటారు కూడా.

కానీ విటమిన్ సి అదనంగా వాడటం వాళ్ళ ఉపయోగం ఉంటుందని సస్త్ర పరంగా మాత్రం రుజువు కాలేదు మరి. పైగా ముప్పులు మాత్రం పొంచి ఉన్నట్టు అధ్యయనాలు బాగా స్పష్టం చేస్తున్నాయి. విటమిన్  సి  ఎక్కువగా వాడే పురుషులకి కిడ్నీలో రాళ్ళూ ప్రబలే ముప్పు బాగా పెరుగుతున్నట్టు  తాజాగా  స్వీడన్ దేశ పరిశోధకులు అధ్యయనంలో తేలటం దీనికి మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

కిడ్నీ రాళ్ళలో బాగా ప్రస్ఫూటంగా మనకి కలబడేవి ఏమంటే క్యాల్షియం, ఆక్సలేట్ మిశ్రమంతో కూడుకున్న రాళ్లే. విటమిన్ సి  కొందరి శరీరం లో ఆక్సలేటుగా మారుతుంటుంది. విటమిన్  సి  టూ కిడ్నీ రాళ్ళ ముప్పు కూడా బాగా పెరగటానికి ఇదొక కారణంగా  భావిస్తున్నారు కూడా. కనుక అనవసరంగా  విటమిన్  సి  మాత్రలు  వాడటం  అంత మంచిది కాదు అనేది పరిశోధకుల అభిప్రాయం.

వ్యాసం... అనూరాధ

3.05194805195
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు