অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మలేరియా

మలేరియా

మలేరియా గురించిన సమాచారాన్ని తెలుసుకొని, పాటించటం ఎందుకు ముఖ్యం అంటే: దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి చాలా తీవ్రమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 30 కోట్లు నుంచి 50 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. వీరిలో పది లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. మలేరియా అనేది సామాన్యమైన ప్రాంతాల్లో అక్కడ సంభవించే మరణాల్లో అత్యధిక వాటికి మూల కారణం ఈ వ్యాధే కావటం గమనార్హం. అంతేగాక, చిన్న పిల్లల పెరుగుదలను కూడా ఈ వ్యాధి దెబ్బతీస్తుంది. మలేరియా ముఖ్యంగా గర్భణీ మహిళలకు చాలా ప్రమాదకరం. ఇది రక్తహీనత, గర్భస్రావం, మృత శిశు జననం, పుట్టుకతో శిశువు బరువు లోపం, మాతృ మరణాలకు దారి తీస్తుంది. మలేరియాను నివారించటం మరియు సకాలంలో చికిత్స చేయటం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చు.

ముఖ్య సందేశాలు :

మలేరియా గురించి ప్రతి కుటుంబం, సమాజం ఏమేం తెలుసుకొనే హక్కు కలిగి ఉన్నాయి.

  1. దోమకాటు ద్వారా మలేరియా ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది. కీటక సంహారిణి మందు రుద్దిన, దోమ తెర కింద నిద్రించడం ద్వారా దోమ కాట్లను నివారించవచ్చు.
  2. మలేరియా సాధారణంగా మారిన ప్రాంతాల్లో, పిల్లలకు చాలా అపాయం ఉంటుంది. జ్వరంతో ఉన్న పిల్లలను శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త చేత పరీక్షింప జేసి వెంటనే యాంటీ- మలేరియా చికిత్సను ప్రారంభించాలి.
  3. గర్భిణీ స్త్రీలకు మలేరియా చాలా ప్రమాదకరం. మలేరియా సాధారణంగా మారిపోయిన ప్రాంతాల్లో గర్భిణీ మహిళలు ఆరోగ్య కార్యకర్త సూచన మేరకు యాంటీ- మలేరియల్ మాత్రలు మింగాలి.
  4. మలేరియాతో బాధపడుతున్న లేదా ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న పిల్లలకు పుష్కలమైన ద్రవ పదార్ధాలు, ఆహారం ఇవ్వటం అవసరం.
  5. కుటుంబాలు, ఊరు - వాడ అంతా కలిసి దోమలు గుడ్లు పెట్టకుండా తగిన చర్యలు తీసుకుంటే మలేరియాను నివారించవచ్చు.

ముఖ్య సందేశం - 1

దోమకాటు ద్వారా మలేరియా ఒకరి నుండి ఒకరికి పాకుతుంది. సిఫార్సు చేసిన కీటక సంహారక మందులో రుద్దిన దోమతెర క్రింద నిద్రించడం ద్వారా దోమకాట్లను నివారించడం చక్కని మార్గం. ఊరు / వాడలోని ప్రతి ఒక్కరూ కూడా దోమకాట్ల నుంచి రక్షణ పొందాలి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు దోమలు చురుకుగా ఉండే సూర్యాస్తమయం నుంచి మర్నాడు సూర్యోదయం మధ్య కాలంలో రక్షణ పొందాలి. కీటక సంహారక మందులో ట్రీట్ చేసిన (ముంచి తీసిన) దోమల తెరలు, కర్టెన్లు, డోర్ మ్యాట్ లపైన దోమలు వాలితే వెంటనే చనిపోతాయి. శాశ్వతంగా ప్రాభావం చూపే కీటక సంహారక మందులో ముంచి తీసిన (ట్రీట్ చేసిన) మ్యాట్లు , వలలు, కర్టెన్లు ఉపయోగించాలి. వలలను ప్రతి ఏడాది వర్షా కాలం ప్రారంభానికి ముందు రీ-ట్రీట్ (కీటక సంహారక మందు నుంచి తీయటం) చేయాలి. కనీసం ఆరునెలల కొకసారి లేదా ప్రతి మూడో ఉతుకుకు ఒకసారి ఇలా ట్రీట్ చేయాలి. సురక్షితమైన కీటక సంహారక మందులు, రీ-ట్రీట్ మెంట్ కాల వ్యవధి గురించి ఆరోగ్య కార్యకర్త మార్గదర్శకం చేస్తారు. శిశువులు, చిన్న పిల్లలు పైన పేర్కొన్న విధంగా ట్రీట్ చేసిన దోమతెరల కింద నిద్రించాలి. ఒకవేళ, దోమతెరలు చాలా ఖర్చుతో కూడుకున్నవైతే, కుటుంబంలోని పిల్లలందరికీ కలిపి ఒకే పెద్ద దోమ తెర కొనాలి. రొమ్ముపాలు తాగే శిశువులు తల్లితో పాటు దోమతెర క్రింద నిద్రించాలి. ట్రీట్ చేసిన దోమ తెరలను ఏడాది పొడవునా ఉపయోగించాలి. దోమలు తక్కువ సంఖ్యలో ఉన్న సమయాల్లో సైతం వీటి క్రిందే నిద్రించాలి.

దోమ తెరలను ఉపయోగించలేకపోతే, సహాయపడే ఇతర చర్యలు :

  • కర్టెన్లు బట్టలు లేదా మ్యాట్ లను సిఫార్సు చేసిన కీటక సంహారక మందులో ముంచి తీసి తలుపులు, కిటకీల పైన వేలాడదీయాలి.
  • తలుపులు, కిటికీలకు తెరలు వేయాలి.
  • మస్కిటో కాయిల్స్ లేదా ఇతర పొగ వెదజల్లే పరికరాలను ఉపయోగించాలి.
  • సాయంత్రం చీకటి ముసురుతూనే చేతులు, కాళ్లను పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను తొడుక్కోవాలి. ఉదాహరణకు - పొడవు చేతుల గౌను, ప్యాంటు లేదా స్కర్టు - ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్య సందేశం - 2

మలేరియా సాధారణంగా మారిన ప్రాంతాల్లో పిల్లలకు చాలా అపాయం ఉంటుంది. జ్వరంతో ఉన్న పిల్లలను ఆరోగ్య కార్యకర్త చేత పరీక్షింపజేసి, వెంటనే యాంటీ - మలేరియల్ చికిత్సను ప్రారంభించాలి. కుటుంబంలో ఎవరైనా తినడానికి నిరాకరిస్తే లేదా వాంతులు చేసుకుంటే, తూలినట్లు లేదా సొమ్మసిల్లినట్లు అయితే (ఫిట్స్ వస్తే) మలేరియా అని అనుమానించాలి. పిల్లలకు మలేరియా కారణంగా జ్వరం వచ్చిందని నమ్మితే, వెంటనే వారికి ఆరోగ్య కార్యకర్త సిఫార్సు చేసిన యాంటీ - మలేరియ చికిత్స జరిపించాలి. మలేరియా జ్వరం తో వున్న పిల్లలకు ఒకరోజు లోపలే చికిత్స జరపక పోతే, వారు మరణించవచ్చు. మలేరియాకు ఎలాంటి చికిత్స బాగుంటుంది. దాన్ని ఎన్ని రోజుల పాటు కొనసాగించాలి. అనే దానిపై ఆరోగ్య కార్యకర్త సలహా ఇస్తారు. మలేరియాకు గురైన పిల్లలకు చికిత్స ప్రారంభించాక, జ్వరం వేగంగా తగ్గినప్పటికీ, నిర్దేశించిన కాలం పాటు (పూర్తి కోర్సు) చికిత్స తీసుకోవాలి. ఒకవేళ చికిత్స పూర్తిగా తీసుకోకపోతే, మలేరియా మరింత తీవ్రంగా మారి, నయం కావటం కష్టమవుతుంది. చికిత్స తర్వాత కూడా మలేరియా లక్షణాలు కనిపిస్తే, పిల్లలను, వైద్య కేంద్రానికి గానీ, ఆసుపత్రికి గానీ తీసుకెళ్లి సహాయం పొందాలి. ఇలా జరగటానికి కారణమేమిటంటే

  • పిల్లలకు సరిపడా ఔషధాలు అందకపోవటం
  • మలేరియాతో పాటు పిల్లలకు ఇంకా ఇతర అనారోగ్యం ఉండవచ్చు.
  • తీసుకుంటున్న మందులను మలేరియా ప్రతిఘటిస్తుంది. కనుక, ఇతర ఔషధాల అవసరం ఉండవచ్చు.

జ్వరంతో ఉన్నంత కాలం పిల్లలను చల్లగా ఉంచాలి. ఇందుకోసం :

  • చల్లగా ఉన్న నీటిని స్పాంజితో అద్ది పిల్లల ఒంటిని తుడవాలి లేదా స్నానం చేయించాలి. అయితే ఇందుకు అతి చల్లని (శీతల) నీటిని వాడరాదు. మామూలు చల్లని నీరే ఉపయోగించాలి.
  • పిల్లల ఒంటిని కప్పటానికి తక్కువ వస్త్రాలు వాడాలి. లేదా ఒకే ఒక దుప్పటితో చుట్టాలి.

ముఖ్య సందేశం - 3

గర్భిణీ మహిళలకు మలేరియా చాలా ప్రమాదకం. మలేరియా అనేది సాధారణంగా మారిన ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య కార్యకర్త సూచన మేరకు యాంటీ-మలేరియల్ మాత్రలు మింగాలి. ఇతర మహిళతో పోలిస్తే గర్భిణులు మలేరియా కారణంగా ఎక్కువ బాధలు అనుభవిస్తారు. గర్భిణీగా ఉన్నప్పుడు, ముఖ్యంగా మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఈ వ్యాధి చాలా ప్రమాదకం. ఇది రక్తహీనత, గర్భస్రావాన్ని కలుగజేస్తుంది. నెలలు నిండని శిశువు లేదా మృత శిశువు జననానికి దారి తీస్తుంది. మలేరియాతో ఉన్న మహిళలకు పుట్టిన శిశువులు బరువు లోపంతో ఉంటారు. కనుక, వీరు మొదటి ఏడాదిలో అంటువ్యాధులకు గానీ మరణానికి గానీ గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ మహిళలు యాంటీ-మలేరియిల్ మాత్రలు మింగాలి. అన్నిరకాల యాంటీ-మలేరియిల్ మాత్రలు గర్భిణీ స్త్రీలకు శ్రేయస్కరం కాదు. ఏయే రకాల యాంటీ-మలేరియిల్ మాత్రలు ఎంత వరకు సురక్షిత మనేది ఆరోగ్య కార్యకర్తకు తెలిసి ఉంటుంది. దోమ కాట్లను నివారించటానికి గర్భిణీ మహిళ దోమతెర క్రిందనే నిద్రించాలి. ఈ దోమతెర కీటక సంహారక మందుతో రుద్దినదై ఉండాలి. మలేరియా తో ఆరోగ్యం దెబ్బతిన్న గర్భిణీ స్త్రీలు ఐరన్ (ఇనుము), విటమిన్ - ఎ మాత్రలను ఆరోగ్య కార్యకర్త దగ్గర అడిగి తీసుకోవాలి.

ముఖ్య సందేశం - 4

మలేరియాతో బాధపడుతున్న లేదా ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న పిల్లలకు ఆహారం, ద్రవ పదార్థాలను పుష్కలంగా ఇవ్వటం అవసరం. మలేరియా కారణంగా పిల్లల ఒంట్లోని శక్తి హరించుకుపోతుంది. చెమట ద్వారా పిల్లలు తమ శరీరంలోని ద్రవాలను కోల్పోతారు. కనుక, పిల్లలకు పదేపదే ఆహారం, పానీయాలు, ఇస్తుండాలి. తద్వారా వారు శరీరంలోని నీటిని కోల్పోకుండా (అంటే డీ-హైడ్రైషన్ కాకుండా) మరియు లోప పోషణకు గురికాకుండా నివారించవచ్చు. తరచూ రొమ్ముపాలు ఇవ్వటం ద్వారా శిశువు డీ-హైడ్రైషన్ కు గురికాకుండా చూడవచ్చు. అంతేగాక, ఇది శిశువు మలేరియాతో సహా ఇతర ఇన్ ఫెక్షన్ల పై పోరాడటానికి సహాయపడుతుంది. మలేరియా తో ఉన్న పిల్లలకు వీలైనంత తరచుగా రొమ్ముపాలు ఇస్తుండాలి. మలేరియా తరచూ వస్తే పిల్లల ఎదుగుదల, వారి మెదడు వికాసం నెమ్మదిస్తుంది. ఇది రక్తహీనతను కూడా కలుగజేస్తుంది. పలుసార్లు మలేరియాకు గురైన పిల్లలకు రక్తహీనత (అనీమియా) పరీక్ష చేయించాలి.

ముఖ్య సందేశం - 5

కుటుంబాలు, ఊరు - వాడ అంతా కలిసి దోమలు గుడ్లు పెట్టకుండా తగిన చర్యలు తీసుకుంటే మలేరియాను నివారించవచ్చు. ఎక్కడెక్కడైతే నీరు నిలిచి ఉంటుందో అక్కడ దోమలు గుడ్లు పెడతాయి. ఉదాహరణకు నీటి మడుగులు, బురదనీరు, చిత్తడి నేల, నీటి గుంతలు, మురుగు నీటి గుంతలు, గడ్డి, పొదలలో చేరిన నీటిలో ఇవి నివాసమేర్పరుచుకొని గుడ్లు పొదుగుతాయి. నీటి ప్రవాహానికి ఇరువైపులా, నీటి డబ్బాలు, ట్యాంకులు, వరి పంట నేలలపై కూడా ఇవి గుడ్లు పెట్టి వ్యాప్తి చెందుతాయి. ఈ క్రింద పేర్కొన్న చర్యల ద్వారా దోమల సంఖ్యను తగ్గించవచ్చు.

  • నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రదేశాన్ని భర్తీ చేయాలి లేదా ఆ నీటిని తోడి వేయాలి.
  • నీటి డబ్బాలు, ట్యాంకులను మూసి ఉంచాలి.
  • ఇంటి చుట్టూ ఉండే పొదలను తొలగించాలి.

మలేరియా వ్యాధి మొత్తం ఊరు, వాడ పైన ప్రభావం చూపుతుంది. దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలను తగ్గించటానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలి. దోమల తెరలను కీటక సంహారక మందులతో క్రమం తప్పకుండా పూసి సిద్ధం చేయటానికి ఏర్పాట్లు చేయాలి. మలేరియా వ్యాధిని నివారించి, నియంత్రించడానికి ఊరు / వాడ ప్రజలంతా కలిసి ఆరోగ్య కార్యకర్తల నుంచి స్థానిక రాజకీయ నాయకుల నుంచి సహాయం తీసుకోవాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate