অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సమస్యల్నికలగజేసే అలవాట్లు

సమస్యల్నికలగజేసే అలవాట్లు

  1. విపరీతంగా మద్యాన్ని తాగే వ్యక్తి
    1. ఎంత ఎక్కువ తాగితే మరీ ఎక్కువ'
    2. కొంతమంది మరీ ఎక్కువ ఎందుకు తాగుతారు
    3. మరీ ఎక్కువ తాగడం వల్ల అతని మీద, అతని కుటుంబం మీద పడే ప్రభావ మేమిటి
    4. ఒక వ్యక్తికి తాగుడు సమస్య వుందని ఎప్పుడు అనుమానించాలి
    5. జెండర్, తాగడం
    6. ఈ సమస్యలు ఎదుర్కోవడమెలా
    7. తాగుడు సమస్య వున్న వ్యక్తితో కలిసి జీవించడం
  2. మందులు దుర్వినియోగం చేసే వ్యక్తి
    1. మందుని తీసుకుంటున్న ఎవరికైనా సమస్య వచ్చిందా
    2. ఏ మందుల్ని దుర్వినియోగపరుస్తారు
    3. మందుల్ని ఎలా వాడతారు
    4. మందుల దుర్వినియోగం వ్యక్తిపై చూపే ప్రభావమేమిటి
    5. మనుషులు అసలు మందుల్ని ఎందుకు వాడతారు
    6. మందును తీసుకునేవారు మీసహాయాన్ని ఎందుకు కోరతారు
    7. మందును ఉపయోగించడాన్ని ఎప్పుడు అనుమానించవచ్చు
    8. ఈ సమస్యను ఎలా సంబాళించడం
  3. నిద్ర మాత్రల అలవాటు వున్న వ్యక్తి
    1. వ్యక్తులు నిద్రమాత్రల మీద ఎందుకు ఆధారపడతారు
    2. నిద్ర మాత్రల అలవాటును ఎప్పుడు అనుమానించవచ్చు
    3. ఈ సమస్యనెలా సంబాళించడం
  4. పొగాకు వ్యసనం ఉన్నవ్యక్తి
    1. పొగాకును ఉపయోగించడం ఎందుకు ప్రమాదకరం
    2. పొగాకును ఉపయోగించడం గురించి ఎప్పుడు అడగడం
    3. ఈసమస్యనెలా సంబాళించడం
  5. జూదమాడే అలవాటు వున్న వ్యక్తి
    1. జూదం ఒక అలవాటుగా ఎప్పుడవుతుంది
    2. జూదవ్యాధి, ఆరోగ్యం జూదం
    3. జూదం ఒక సమస్య అయిందని ఎప్పుడు అనుమానించాలి
    4. ఈ సమస్యను సంబాళించడమెలా

విపరీతంగా మద్యాన్ని తాగే వ్యక్తి

ప్రపంచమంతటా చాలా సంస్కృతుల్లో మద్యాన్ని ఉపయోగిస్తారు. బీరు, విస్కీలు లాంటి కొన్ని రకాలు అంతర్జాతీయమైనవి. ఇతర ఆల్కహాల్ పానీయాలు జింబాబ్వేలో చిబుకు, గోవాలో (భారతదేశం) ఫెని, ప్రాంతీయ సంస్కృతులకు ప్రత్యేకమైనవి. కొన్ని ప్రదేశాల్లో ఇంటి దగ్గర సారాని కాస్తారు. చట్టవ్యతిరేకంగా కాసే సారాల్లో ప్రమాదకరమైన, ఒకోసారి ప్రాణాపాయ కరమైన రసాయనాలు ఉంటాయి. తాగే వారిలో చాలామంది ఎప్పుడో ఒకసారి, స్నేహితులతో కలిసి సరదాగా తాగుతారు. కొంతమంది దాదాపుగా ప్రతిరోజు తాగుతారు, కాని కొంత పరిమితి లోపు తాగుతారు. కాని కొంతమంది చాలా విపరీతంగా తాగుతారు. ఇలాంటి సందర్భాలు కలవరపెడతాయి

ఎంత ఎక్కువ తాగితే మరీ ఎక్కువ'

తాగుడు కారణంగా ఆరోగ్యపరమైన, సాంఘిక సమస్యలు వస్తే ఎక్కువ తాగుతున్నట్లే లెక్క కొంతమంది మరీ ఎక్కువ తాగుతారు, కాని మామూలుగానే ఉండగలుగుతారు. అలాంటివారి గురించికూడా వ్యాకులపడాలి, ఎందుకంటే త్వరగానో, ఆలస్యంగానో తాగుడుసమస్య ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొంతమంది తమ డ్రింక్ని నియంత్రించుకోగలమని, అంటే, తమకేమీ సమస్యలేదన్నట్లుగా అంటారు, నిజానికి శరీరం సారా ప్రభావానికి అలవాటు పడిపోయినప్పుడు ఆ పరిస్థితిని ఓర్వడం అంటారు, ఆవ్యక్తి మరీ విపరీతంగా తాగుతున్నాడనడానికి ఓర్వడం ఒక నిదర్శనం. అతని ఆరోగ్యం దెబ్బతినే సమయానికి సమస్యలు చాలా తీవ్రంగా వుంటాయి. ఆవిధంగా తాగుడు సమస్యను తొలిదశలోనే గుర్తించడం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో, వ్యాధిని నిరోధించడంలో ముఖ్యమైన భాగం.

ఆల్కహాల్ని విపరీతంగా తాగేవాళ్ళు ప్రతి రోజూ తాగుతారు. మరొక ప్రమాదకరమైన తాగే పద్దతి వుంది. ఇది ఒకేసారి వరసగా కొన్ని రోజులు విడవకుండా తాగడం. ఉదాహరణకు కొంతమంది వారాంతంలో మాత్రమే తాగుతారు, కాని చాలా ఎక్కువ ఆల్కహాల్ని తాగుతారు. దీనిని బింజ్ డ్రింకింగ్ అంటారు. పెట్టె 6. 2.లో ఆల్కహాల్ను అనుమతించగూడని సందర్భాలు, లేక జాగ్రత్తలు తీసుకుంటూ మాత్రమే అనుమతించవలసిన సందర్భాలు వివరించబడినాయి.

ఎక్కడ, ఎప్పుడు ఆల్కహాల్ను అనుమతించగూడని లేక జాగ్రత్తతీసుకుంటూ మాత్రమే అనుమతించవలసిన సందర్భాలు

ఆల్కహాల్ని పూర్తిగా అనుమతించగూడని సందర్భాలు

  • వాహనాన్ని నడుపుతున్నప్పుడు
  • యంత్రాలు, పరికరాలతో పనిచేస్తున్నప్పుడు
  • ఆవ్యక్తికి ఫిట్స్ వస్తున్నప్పుడు (మందులతో తగ్గనప్పుడు)
  • వ్యాయామానికి ముందు
ఆల్కహాల్ని ఉపయోగించ గలిగిన, కాని జాగ్రత్త తీసుకుంటూ మత్రమే, సందర్భాలు
  • స్థానిక సంస్కృతులు అనుమతించిన లేక పెద్దవారి పర్యవేక్షణవున్న ప్రత్యేక సందర్భాలలో తప్ప చిన్న పిల్లలు ఆల్కహాల్ని తాగగూడదు
  • ఒక గర్భిణి లేక బిడ్డకు పాలిస్తున్న తల్లి
  • మానసిక వ్యాధులకు లేక డయాబెటిస్ లేక మూర్ఛవ్యాధికి మందుల్ని తీసుకుంటున్నప్పుడు
  • కాలేయం, మూత్రపిండాల వ్యాధి, లేక డయాబెటిస్ ఉన్నప్పుడు
ఆల్కహాల్ వ్యసనం ఏర్పడే విధానం
(అ). చాలామంది ವಿತ್ತಿುಲು సాంఘికంగా, స్నేహితులతో కలిసి తాగుతారు. (ఆ). కాని కొన్నిసార్లు తాగవలసిన అవసరం బలంగా మారుతుంది, ఆవ్యక్తి ఒంటరిగా కూర్చుని ఎక్కువ, మరింత ఎక్కువ తాగుతాడు. (ఇ) క్రమేపీ అతను ఉదయం లేచీ లేవగానే తాగనిదే ఉండలేడు.

కొంతమంది మరీ ఎక్కువ ఎందుకు తాగుతారు

చాలామంది కౌమార దశలో తాగడానికి చేసే ప్రయత్నంతో వారి తాగుడు అలవాటు మొదలవుతుంది . ఆల్కహాల్ సులభంగా దొరకడం, స్నేహితుల ఒత్తిడి వారు తాగడం మొదలు పెట్టడానికి కారణాలు. కొంతమంది కేవలం ప్రయోగం కోసం తాగుతారు, కొంతమంది రోజూ క్రమం తప్పకుండా తాగుతారు. కొంతమంది కొంత తెలివిగా, తమ ఆరోగ్యానికి లేక కుటుంబ జీవితానికి భంగం కలగనంత వరకు మాత్రమే తాగుతారు. కొంతమంది కొంత వయసు పెరిగాక, మధ్యవయసులో, ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, తాగడం ప్రారంభిస్తారు. వ్యక్తి తన కష్టాల్ని తట్టుకునేందుకు సహాయపడడానికి ఆల్కహాల్ని ఉపయోగిస్తే, తాగుడు సమస్యలు మొదలవొచ్చు. కొంతమందికి, ముఖ్యంగా, ప్రతిరోజూ తాగేవారికి డ్రింక్ శారీరక, మానసిక అవసరంగా మారుతుంది. అప్పుడు దానిని ఆధారపడడం లేక వ్యసనం అని అంటారు. ఆల్కహాల్ వ్యసనం వున్న వ్యక్తికి డ్రింక్ దొరకకపోతే, అతను శారీరక అనారోగ్యం ఉన్నట్లు భావించడం ప్రారంభిస్తాడు, దీనినే “విత్డ్రాయల్ సిండ్రోమ్” అంటారు. ఈ విత్డ్రాయల్ ఎక్కువ ఆల్కహాల్ని తాగడంతో తాత్కాలికంగా తగ్గుతుంది, కాని ఇది వ్యసనాన్ని కొనసాగేలాగా చేస్తుంది.

మరీ ఎక్కువ తాగడం వల్ల అతని మీద, అతని కుటుంబం మీద పడే ప్రభావ మేమిటి

మొట్టమొదట అది అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తాగుడు సమస్య వల్ల వచ్చే కొన్ని సమస్యలు ఇవిః

  • బ్లాకవుట్స్- ఆ వ్యక్తికి తాగినాక జరిగినదేదీ గుర్తుండదు;
  • ఒత్తిడి, తూలుడు లాంటి విత్డ్రాయల్ స్పందనలు, మరీ తీవ్రమైన కేసుల్లో గందరగోళం, ఫిట్స్లాంటివి వస్తాయి;.
  • మానసిక వైద్యుడు లేనిచోట
  • వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదాలు;
  • కడుపులో రక్తస్రావం;
  • పచ్చకామెర్లు, కాలేయ వ్యాధి;
  • లైంగిక నపుంసకత్వం
  • డిప్రెషన్, అత్మహత్య
  • నిద్ర సమస్యలు
  • డిల్యూజన్స్, హాలుసినేషన్స్ లేక భ్రమలు, భ్రాంతులు
  • మెదడు దెబ్బతినడం; అరక్షిత లైంగిక ప్రవర్తన కారణంగా అనేక సార్లు లైంగిక వ్యాధులు సోకటం హెచ్. ఐ. వి. రావడం తల్లి ఎక్కువ ఉన్నది. గర్భస్థ శిశువుకు నష్టం జరగడం. తాగుడు సమస్య వలన పైన ఉదహరించిన శారీరక ప్రభావాలే కాకుండా సాంఘిక ప్రభావాలు కూడా వుంటాయి
  • ఏ నిపసి సామర్థ్యం తగ్గడం వలన, డబ్బును ఆల్కహాల్ కోసం వెచ్చించడం వలన పేదరికం పెరగడం; ఇంట్లోనూ, సమాజంలోనూ హింస పెరగడం
  • ఉద్యోగం పోగొట్టుకోవడం;
  • కుటుంబాన్ని నిర్లక్ష్యం చెయ్యడం, అది కుటుంబ విచ్ఛిన్నానికి తియ్యడం;
  • చట్టపరమైన సమస్యలు

ఒక వ్యక్తికి తాగుడు సమస్య వుందని ఎప్పుడు అనుమానించాలి

తాగుడు సమస్య ఉన్న చాలామంది ఆరోగ్యం బాగా చెడినాక గాని సహాయాన్ని కోరరు.అప్పుడు కూడా తాగుడు సమస్యను గుర్తించరు, చికిత్సచెయ్యరు. చాలా ఆరోగ్య సమస్యలు తాగుడు మూలంగా వస్తాయనే అవగాహన ఉండడం ముఖ్యం. ఎవరైనా మీదగ్గరకు ఆరోగ్య సమస్యతో వస్తే అతని తాగుడు ప్రవర్తన గురించి వాకబు చెయ్యాలి, కాని ఈ క్రింది వాటితో వచ్చేవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి:

  • వివరించలేని ప్రమాదాలు, గాయాలు;
  • కడుపులో మంట, రక్తం వాంతులు;
  • కుటుంబసభ్యులు, స్నేహితులతో సంబంధాలలో సమస్యలు;
  • పదే పదే అనారోగ్యంపాలవడం, పనిని ఎగొట్టడం;
  • డిప్రెషన్, ఏంగ్టయిటీ లాంటి మానసిక ఆరోగ్య సమస్యలు;
  • నిద్ర సమస్యలు;
  • నపుంసకత్వం లాంటి లైంగిక సమస్యలు

జెండర్, తాగడం

తాగుడు కేవలం పురుషులసమస్యగా పరిగణింపబడుతుంది. ఒక సమస్యగా తాగేవారిలో అత్యధికులు పురుషులవడం వాస్తవమే .

6.1.5a

కా ని స్త్రీలకు కూడా ఈప్రమాదం వుంటుంది. చాలా సమాజాల్లో స్త్రీలలో ఈ వ్యసనం సర్వసామాన్య మయింది. తే, తాగుడు వ్యసనం పురుషుల మీదకంటే స్త్రీలమీద భిన్నంగా వుంటుంది.

 

  • ఆల్కహాల్ విషపభావాలు సీలపె ఎక్కువగా ఉంటాయి. అందువలస అందువలన తాగుదు సుంక్షిత స్థాయి స్త్రీలకు తక్కువగా ఉంటుంది.
  • గర్భవతి తాగితే గర్భంలో వున్న బిడ్డకు బుద్ధిమాంద్యం, పుట్టుకతో అంగవైకల్యాలు లాంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ.
  • తాగుడుని సిగ్గుపడవలసిన విషయంగా భావిస్తారు కనుక స్త్రీలు ఇంటి దగ్గరే తాగుతారు. వారీ విషయాన్ని ఆరోగ్య కార్యకర్తతో చర్చించే అవకాశం తక్కువ కనుక వారు సహాయాన్ని పొందే అవకాశం తక్కువ.
  • జెండర్కి సంబంధించిన ఒత్తిడిని ఎదుర్కొంటారు కనుక, స్త్రీలు దానిని తట్టుకోవడానికి మార్గంగా తాగుడును ఎంచుకుంటారు.
  • భర్త విపరీతంగా తాగుతున్నప్పుడు స్త్రీలు అతని వలన శారీరక, భావోద్వేగ హింసను అనుభవిస్తారు.

ఈ సమస్యలు ఎదుర్కోవడమెలా

కుటుంబాన్ని స్నేహితుల్ని అడిగే ప్రశ్నలు

  • ఈ వ్యక్తి ఇటీవలే తాగడం మొదలుపెట్టాడా?
  • అతని తాగుడు గురించి మీరు విచారపడుతున్నారా? ఎందుకు?
  • అతను ఉదయమే తాగుతున్నాడా?
ఈ ప్రశ్నల్లో దేనికైనా సమాధానం అవును ఐతే ఆవ్యక్తికి తాగుడు సమస్య ఉన్నట్లు లెక్క
విపరీతంగా తాగుతున్న వ్యక్తిని అడగవలసిన ప్రశ్నలు
  • మీరు తాగే పద్ధతి గురించి చెప్పండి.
  • ఈమధ్య మామూలుగా కంటే ఎక్కువ తాగుతున్నారా?
ఒకవేళ తాగుతూ వుంటే ఈమూడు ప్రశ్నల్ని అడగండిః
  • గత సంవత్సర కాలంలో ఎంత తరచుగా మీరు ఒకసారి తాగడం మొదలు పెట్టాక ఇంక ఆపలేకపోయారు?
  • గత సంవత్సర కాలంలో ఎంత తరచుగా మీకు ఉదయమే డ్రింక్ కావలసివచ్చింది?
  • గత సంవత్సర కాలంలో ఎంత తరచుగా తాగుడు వలన మీరు చెయ్యవలసిన పనుల్ని చెయ్యలేకపోయారు?
ఈ ప్రశ్నల్లో దేనికైనా కనీసం నెలకొకసారి అని జవాబు వస్తే, అప్పుడు తాగుడు సమస్య వుందని అనుమానించవచ్చు, అప్పుడు మరింత విపులంగా అతను ਲੁੋਨੇ పద్ధతి గురించి ఇలాంటి ప్రశ్నల్ని అడగండిః
  • ఏరకం ఆల్కహాల్ని మీరు తాగుతున్నారు (ఉదా. విస్కీ బీరు)?
  • ప్రతిరోజు ఎంత తాగుతారు? ఒకవేళ ఆ వ్యక్తి వారంలో కొన్ని రోజులు మాత్రమే తాగుతూంటే, వారంలో ఎన్ని రోజులు తాగుతున్నాడు, ఆ రోజుల్లో ఎంత తాగుతున్నాడు?
  • తాగుడు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతూందా? ఇది తాగుడు తన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తోందో అతను గుర్తించడానికి సహాయపడుతుంది.
  • మీరు తాగడం మానేయడానికి ప్రయత్నించారా? ఏమయింది?
  • తాగడం మానడానికి మీకు సహాయం కావాలా? ఆఖరి రెండు ప్రశ్నలు అతనికి ఆపాలనే కోరిక ఎంతవుందో తెలుపుతాయి.
ఇంటర్వ్యూలో గమనించవలసిన అంశాలు
  • ఆ వ్యక్తి ఒత్తిడితోవున్నట్లు, నెర్వస్గా లేక చంచలంగా వున్నట్లు కనిపిస్తున్నాడా? ఇవి ఆల్కహాల్ని మానడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కనిపించే చిహ్నాలు.
  • ఆల్కహాల్ వాసన వస్తూందేమో చూడండి.
  • దెబ్బలు, గాయపు మచ్చలు, లేక గాయాల తాలూకు ఇతర చిహ్నాలు ఉన్నాయేమో చూడండి.
  • పచ్చకామెర్లు లాంటి కాలేయ వ్యాధి చిహ్నాలు ఉన్నాయేమో చూడండి.
  • మెదడు వ్యాధిని సూచించే చిహ్నాలు, మోటుగా లేక సమతౌల్యం లేకుండా వున్నాడా?
ప్రత్యేక ఇంటర్వ్యూ సూచనలు
  • అతనితో ఏకాంతంగా మాట్లాడండి. అతను ఇబ్బంది పడకుండా మీతో మాట్లాడడానికి కొంత సమయాన్నివ్వండి, అతను మీకు చెప్పే సమాచారం రహస్యంగా ఉంటుందని వివరించండి. మిమ్మల్ని ఒకసారి నమ్మితే తమ తాగుడు సమస్య గురించి మీతో చర్చించాక అతను తేలిక పడతాడు.
  • అతనికి తాగుడు గురించి నైతిక కోణంలో చెప్పకండి. మీరు తాగుడు చెడు అని భావించినప్పటికీ మీ ప్రస్తుత లక్ష్యం అతనికి సహాయ పడడం.
తాగుడు సమస్య ఉన్నవ్యక్తికి ఏమి చెయ్యాలి?
చాలా తరచుగా ఆరోగ్య కార్యకర్తలు తాగుడు సంబంధమైన శారీరక వ్యాధులకే చికిత్స చేస్తారు. మీరు తాగుడుకు చికిత్స చేస్తే తప్ప ఇతను ఎప్పటికీ పూర్తిగా కోలుకోలేడు. తాగుడు నుంచి బయట పడడానికి మూడు స్టేజిలు లేక స్థాయిలు ఉన్నాయిః
  • సమస్య ఉందని అంగీకరించడం
  • తాగుడును ఆపడం లేక తగ్గించడం
  • మత్తులో లేకుండా వుండడం
తాగుడు సమస్య ఉందని అంగీకరించడం అవసరమైన మొదటి అడుగు. తరచుగా కుటుంబపు ఒత్తిడి వలన ఆవ్యక్తి క్లినిక్కి వస్తాడు. అతను తనకు సమస్యలేదని అనొచ్చు. అతని మీద కోపగించుకోకుండా వుండడం ಮಿ೩ುಂ. దానికి బదులు అతనితో ఇతర విషయాల్ని (పని, ఆరోగ్యం లాంటివి) మాట్లాడండి, తాగుడుకి, అతని జీవితంపై దాని ప్రభావాలకు మధ్యవున్న సంబంధాన్ని అతను గుర్తించడానికి ప్రయత్నించండి. తనకు సమస్య వుందని గుర్తించని వ్యక్తికి బలవంతంగా చికిత్స చేసినందువల్ల అతను తన అలవాటును మానే అవకాశం తక్కువ. అతనిని ప్రోద్బల పరచడానికి మార్గం అతను తన సమస్యలకు కారణాల జాబితాను, ఆరోగ్యంగా వుండడానికి', 'ఇతర వస్తువులమీద ఖర్చు పెట్టుకోవడానికి ఎక్కువ డబ్బు మిగలడం, నాభార్యతో సంబంధాల్ని మెరుగుపరచుకోవడానికి, రాయమని అడగడం ద్వారా అతను తన సమస్యను ఎదుర్కోవడానికి సహాయపడడం.
ఒకసారి సమస్యవుందని అంగీకరించాక ఇప్పుడు ప్రశ్న తాగుడును పూర్తిగా మానడమా లేక ఆరోగ్య పరిమితికి తగ్గించడమా దీనికి సరళమైన జవాబు లేదు. మీరు, అతను ఒక లక్ష్యాన్ని అంగీకరించే ముందు ఆరోగ్యం, సాంఘిక స్థాయి, తాగుడు పద్ధతిని పరిగణనలోకి తీసుకోవాలి. ఈక్రింది పరిస్థితుల్లో పూర్తిగా తాగడం మానేయడం మంచిదిః
  • తాగడం అనేక సార్లు పచ్చకామెర్లు రావడంలాంటి ఆరోగ్య సమస్యల్ని కలగజేస్తున్నప్పుడు;
  • తాగుడు పనిచేస్తున్న చోట, ఇంటిదగ్గర హింస లాంటి తీవ్రమైన సమస్యల్ని కలగజేస్తున్నప్పుడు;
  • ఆ వ్యక్తి ఇంతకు ముందు తాగుడు మానడానికి ప్రయత్నించాడు, కాని విజయం సాధించలేదు. పర్యవేక్షణ సులభం కనుక, మళ్ళీ తిరగబెట్టడం అరుదు కనుక పూర్తిగా మానేయడమే అదర్శవంతమైన లక్ష్యం. ఎంపిక చేసుకున్న లక్ష్యం ఏదైనప్పటికి అతను అంగీకరిస్తే కనుక అది అతని స్వీయ ఎంపిక అవుతుంది. రాబోయే నెలల్లో క్రమబద్ధమైన పర్యవేక్షణ అవసరం.
ఆవ్యక్తి మరీ ఎక్కువ తాగుతూంటే (రోజుకు పురుషుడికి ఆరు డ్రింకులు, స్త్రీలకు నాలుగు డ్రింకులు), అకస్మాత్తుగా తాగడాన్ని ఆపడం కారణంగా తాగుడుని మానేయడం (విత్డ్రాయల్) వలన కలిగే లక్షణాలు కనపడతాయి. వాటిని విలా తట్టుకోవాలో సలహానివ్వండి . అతను రోజుకు పది డ్రింకులకంటే ఎక్కువ తాగుతూంటే, విత్డ్రాయల్ లక్షణాల్ని మరింత సన్నిహితంగా పర్యవేక్షించడానికి అనువైన హాస్పటల్కి పంపండి.


నియంత్రణతో తాగడం

ఒక వ్యక్తి నియంత్రణతో తాగదలచుకుంటే, రోజుకు ఎంతతాగాలో నియంత్రించుకునేందుకు సూచించడానికి కొన్ని కిటుకులు వున్నాయిః

  • ప్రతిరోజు ఎంత తాగుతున్నారో తెలుసుకోవాలి (ఒక డైరీలో సమోదు చేసుకుంటే మంచిది)
  • వారంలో కనీసం మూడు లేక రెండు రోజులు అసలు తాగకుండా వుండాలి.
  • ఒకసారి ఆల్కహాల్ డ్రింక్ తీసుకుంటే రెండవసారి ఆల్కహాల్ కాని డ్రింక్ తీసుకోవాలి.
  • ఆల్కహాల్ని ఏమీ కలపకుండా తాగొద్దు, నీరు లేక సోడాను కలిపి తాగితే ఆడ్రింక్ చాలాసేపు వస్తుంది.
  • ప్రతి డ్రింక్లో తక్కువ ఆల్కహాల్ని కలపండి (ఉదాహరణకు ఒక చిన్న పెగ్గుని మాత్రమే తాగండి)
  • పగటిపూట ఎప్పుడూ తాగకండి.
  • ఒకో డ్రింకు తాగడానికి చాలసేపు (ఉదా. ఒక గంట) తీసుకోండి.
  • మొదటి డ్రింకును తీసుకునేముందు ఏదైనా తినండి.
  • మీదాహాన్ని తీర్చుకోవడానికి ఆల్కహాల్ని ఎప్పుడూ తాగకండి, నీటిని లేక ఆల్కహాల్కాని డ్రింకుని తాగండి.
  • బారుల్లోనూ, తెగ తాగే స్నేహితుల్లోనూ గడిపే సమయాన్ని తగ్గించండి.

(అ)

తాగుడు వలన అనేక సారు పచ్చకామెరు రావడంలాంటి ఆరోగ్య సమస్యలు వస్తే

(ఆ)

తాగుడు పనిచేస్తున్న చోట, ఇంటిదగ్గర హింస లాంటి తీవ్రమైన సమస్యల్ని కలగజేస్తున్నప్పుడు

(ఇ)

(ఆవ్యక్తి ఇంతకుముందు తాగుడు మానడానికి ప్రయత్నించాడు, కాని విఫలమయాడు

ఆల్కహాల్ విత్డ్రాయల్, చికిత్స

ఆల్కహాల్ వ్యసనం వున్న వ్యక్తి అకస్మాత్తుగా తాగడం ఆపేస్తే, ఆల్కహాల్ విత్డ్రాయల్ వస్తుంది. తాగుడు ఆపిన 24 గంటల్లో దలయి నాలుగు నుంచి పది రోజులదాకా వుంటుంది. మొదటి రెండు లేక మూడు రోజులు మరీ కష్టమైన రోజులు. అతనెంత ఎక్కువగా తాగుతూ వుండుంటే అంత తీవ్రంగా లక్షణాలు వుంటాయి. విత్డ్రాయల్ రియాక్షన్ వలన వచ్చే సాధారణ లక్షణాలుః

  • వణుకులు
  • తూలడం
  • నిద్ర పట్టకపోవడం వికారం
  • ఆందోళన
  • చిరాకు
  • జ్వరం
  • చంచలత్వం
  • లక్షణాలు, ఆల్కహాల్ విత్డ్రాయల్కు మధ్యవున్న సంబంధం గురించి బోధన
  • పూర్తి శారీరక పరీక్ష (వ్యక్తికి జ్వరం, ఫిట్స్ వచ్చివుంటే, ద్రవాల్ని స్థితిలో వుంటే లేక డీహైడ్రేషన్ లేక జలనష్టంతో వుంటే, లేక శారీరక వ్యాధి ఏదైనా వుంటే, భ్రమలు లేక గందరగోళం వుంటే, హస్పటల్కి పంపండి)
  • ధయమిన్ (ఒకరకం విటమిన్)- 100 మి.గ్రా.ల్ని కండరంలోకి ఇంజక్షన్ని ఇవ్వండి, తరవాత వారానికి సరిపడా ధయమిన్ మాత్రల్ని (రోజుకు 50 మి.గ్రా.), మల్దీవిటమిన్ మాత్రల్ని ఫోలిక్ఏసిడ్ మాత్రల్ని (రోజుకు 1 మి.గ్రా.) ఇవ్వండి
  • క్లోర్డయాజిపాక్సైడ్ని నాలుగు నుంచి ఆరు రోజులపాటు ఇలా ఇవ్వాలి:
    • జు 1, 25 మి.గ్రా. రోజుకు నాలుగు సార్లు
    • రోజు 2, 25 మి.గ్రా. రోజుకు మూడు సార్లు
    • రోజు 3, 25 మి.గ్రా. రోజుకు రెండు సార్లు
    • రోజు 4, 5, 25 మి.గ్రా. రాత్రి
    • రోజు 6,7 12.5. మి.గ్రా. రాత్రి
    • ప్రత్యామ్నాయంగా డయాజిపామ్ని రోజుకు 5 మి.గ్రా. నాలుగు సార్లు చొప్పున ప్రారంభించి పైనసూచించిన విధంగా వాడొచ్చు.


మత్తులో లేకుండా కష్టాల్ని ఎదుర్కోవడం
  • మత్తులో లేకుండా వుండడం కష్టమయే సందర్భాలు ఉంటాయి. అలాంటివాటిని నిబ్బరంగా ఎదుర్కొనేందుకు ఆవ్యక్తికి సహాయపడే ఈక్రింది వ్యూహాలను సూచించండి.
  • మీరు ప్రధానంగా రాత్రిపూట తాగుతూ వుంటే, ఏదో ఒకపనిలో నిమగ్నమయివుండండి, మీరు తాగలేని చోటకు, ఉదా. గుడికి, వెళ్ళండి.
  • మీకు రోజూ పనయిపోయాక తోటి శ్రామికులతో కలిసి తాగే అలవాటు వుంటే, భిన్నమైన కార్యక్రమాన్ని సినిమాకు వెళ్ళడం, ఏదైనా ఆటను ఆడడం లాంటి సాంఘిక కార్యక్రమాన్ని రూపొందించుకోండి.
  • మీకు ప్రత్యేకంగా కొంతమంది స్నేహితులతో ఉన్నప్పుడు మాత్రమే విపరీతంగా తాగే అలవాటు వుంటే, వారిని కలవకండి. మీకు ఒంటరిగా కూర్చుని తాగే అలవాటు ఉంటే, మీరు ఒంటరిగా గడిపే కాలాన్ని తగ్గించుకోండి, ఒక ఆసరా బృందంలో බීජටයී ඒජු కుటుంబంతో గడపడానికి ఆ సమయాన్ని వెచ్చించండి
  • మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు తాగుతూ వుంటే, ఆల్కహాల్తో దానిని మరవడానికి బదులు ఒత్తిడిని తట్టుకునేందుకు, పరిష్కరించు కునేం దుకు మార్గాలను నేర్చుకోండి.
మత్తులో లేకుండా వుండడం, అది జీవితాంతం వుంటుంది కనుక, చికిత్సలో చాలా కష్టమైన దశ. మత్తులో లేకుండా వుండేందుకు ఆ వ్యక్తికి సహాయపడడానికి మీరు చాలా సూచనలు చెయ్యొచ్చు:

  • ఆల్కహాల్ అనానిమస్ (ఎ ఎ), తాగడం మానేసి, తాగకుండా వుండడానికి పరస్పరం సహాయం చేసుకునే వ్యక్తుల బృందం. తాగడం మానాలని కోరుకునే ఎవరైనా ఈ సంస్థలో చేరొచ్చు. క్రమబద్ధంగా, నిర్ణీత సమయాల్లో జరిగే సమావేశాల్లో ఎ ఎ సభ్యులు తమ అనుభవాల్ని పంచుకుని, ఒకరికొకరు ఆసరానిచ్చుకుంటారు. ఒక ఆరోగ్య కార్యకర్తగా మీరు స్థానికంగా ఉన్న ఎ ఎ లేక ఇతర ఆల్కహాల్ సపోర్ట్ గ్రూపుల సమాచారాన్ని తెలుసుకుని వండాలి.
  • తాగుడు సమస్య వున్నవారు ఆల్కహాల్ని జీవితంలో కష్టాల్ని మరవడానికి తాగుతారు. కష్టాల్ని తట్టుకోవడానికి ఆరోగ్యకరమైన పద్ధతిగా వారికి సమస్యా పరిష్కార వ్యూహాల్ని బోధించండి  సాంఘిక పరిధిని విస్తరించుకోవడం ద్వారా, ఉదా. మతవిశ్వాస బృందాలు, సహోద్యోగులు, ఇరుగు పొరుగువారు కష్టాలు వచ్చినప్పుడు ఆసరానివ్వగలరు. బాంధవ్య సంబంధిత సమస్యల్ని తాగుడుతో ముడిపెట్టడం జరుగుతుంది. బాంధవ్యాలను మెరుగు పరచుకోవడానికి సలహానివ్వండి అ తీరిక సమయాల్లో ప్రశాంతంగా వుండడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించటానికి ఆ వ్యక్తికి సలహానివ్వండి. తాగాలని కోరుకునే కష్ట సమయాల్ని ఎలా సంబాళించుకోవాలో సలహానివ్వండి .
ఎప్పుడు మందుల్ని వాడాలి?
రెండు సందర్భాల్లో తాగుడు సమస్యకు చికిత్సకోసం మందును వాడాల్సి వుంటుంది. మొదటిది, విత్డ్రాయల్ లక్షణాలను నియంత్రించడానికి క్లోర్డయాజిపాక్సైడ్ లేక డయాజిపామ్ . రెండవది, తాగుడు మానాలనుకున్నప్పుడుః డైసల్ఫిరామ్ లాంటి మందులు ఆ వ్యక్తి తాగితే చాలా తీవ్రమైన రియాక్షన్ని కలగజేస్తాయి గనుక ఆభయం అతన్ని తాగకుండా ఆపుతుంది. ఈ మందును మానసిక వ్యాధి నిపుణుడి పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి.
ఎప్పుడు వేరే చోటకు పంపాలి?
ఈక్రింది సందర్భాలలో వ్యక్తిని వేరే చోటకు పంపాలి:
  • పచ్చకామెర్లు, రక్తం వాంతులు లాంటి తీవ్రమైన మెడికల్ సమస్యలు, తీవ్రమైన ఏక్సిడెంట్స్;
  • తాగుడు మానాక వచ్చే తీవ్రమైన లక్షణాలు;
  • సైకోసిస్లాంటి మానసిక వ్యాధి ఉన్నప్పుడు.

తాగుడు సమస్య వున్న వ్యక్తితో కలిసి జీవించడం

6.7

తాగుడు సమస్య కుటుంబ సభ్యులందరినీ ప్రభావితం చేస్తుంది. కొంతమంది బంధువులు అతని సమస్యకు తామే కారణమని తమను తాము నిందించుకుంటారు, తాగుడు సమస్యకు వారు కారణం కాదని విశ్వాసం కలిగించండి. ఆర్థిక కష్టాలు, నపుంసకత్వం, మానభంగం లాంటి లైంగిక సమస్యలు బాంధవ్యంలో ఒత్తిడిని కలిగిస్తాయి. తాగుడు వలన వచ్చే బాంధవ్య సమస్యలకు హింసతో సంబంధం వుటుంది. తాగేవారి బంధువులు తరచుగా తామే మానసిక సమస్యలతో, ముఖ్యంగా డిప్రెషన్, ఆందోళనతో బాధపడతారు. కొన్నిచోట్ల వారికి సపోరు బృందాలు వుంటాయి.  ప్రత్యామ్నాయంగా కుటుంబమంతటినీ ఈకారణానికి ఏకంచేసి, సహాయాన్ని కోరడానికి వారు అతన్ని ప్రోత్సహించేలా చెయ్యాలి. తాగుడు సమస్యకు పరిష్కారం ఆవ్యక్తి సహాయాన్ని కోరడంలో వుంది.

6.6. తాగుడు సమస్య వున్నవారితో వ్యవహరించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
  • శారీరక, మానసిక, సాంఘిక సమస్యల్ని కలిగించేంత ఎక్కువగా ఆ వ్యక్తి తాగుతున్నప్పుడు అది సమస్యాత్మక  డ్రింకింగ్
  • గాయాలు, కడుపులో రక్తస్రావం, పచ్చకామెర్లు, అనేక సార్లు వచ్చే లైంగిక వ్యాధులు, గృహహింస, మానసిక వ్యాధులు లాంటివి వున్నప్పుడు అది సమస్యాత్మక డ్రింకింగ్ .
  • తాగేవారిలో చాలామంది తాగుడు సమస్యతో కాక శారీరక సమస్యలతో (కడుపులో రక్తస్రావం లాంటివి) ఆరోగ్య కార్యకర్త దగ్గరకు వస్తారు.
  • మీదగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఆల్కహాల్తో వుండే ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని, వారి డ్రింకింగ్ అలవాట్ల గురించి అడగండి
  • తాగుడు అలవాటును ఆపడం లేక నియంత్రించడం గురించి కౌన్సిలింగ్, తాగడం ఆపాక వచ్చే లక్షణాలకు చికిత్స, ఆల్కహాల్ అనానిమస్ బృందాల దగ్గరకు పంపడం, కుటుంబ ఆసరా ప్రధాన చికిత్సలు.

మందులు దుర్వినియోగం చేసే వ్యక్తి

ఒక వ్యక్తి మెడికల్ కారణం లేకుండా అనేక సార్లు మందును ఉపయోగించడం వలన ఆమె ఆరోగ్యంపై దుప్రభావం కలిగితే దానిని మందుల దుర్వినియోగం అనొచ్చు. ఆల్కహాల్కి లాగానే మందుల్ని విచక్షణారహితంగా పదే పదే ఉపయోగిస్తే అది అలవాటుగా మారి, ఆమెకు హాని కలుగుతున్నప్పటికి మళ్ళీ మళ్ళీ ఆ మందును తీసుకోవాలనిపిస్తుంది, ఈవ్యసనం వున్న వ్యక్తి మందును ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమెకు జబ్బు ఉన్నట్లనిపిస్తుంది (మందును ఆపాక వచ్చే లక్షణాలు). దుర్వినియోగమవుతున్న మందులు చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ఆల్కహాల్, పొగాకు, నిద్రమాత్రల గురించి ఈఅధ్యాయంలో వేరే చోట వివరింపబడింది. ఈమూడు పదార్థాల్ని ఉపయోగించడాన్ని అనేక సమాజాలు సాంఘికంగా, చట్టరీత్య ఆమోదించడం కారణంగా ఇవి ప్రత్యేకమైనవి. ఈవిభాగంలో చట్ట వ్యతిరేక మందుల గురించి వివరించబడింది

మందుని తీసుకుంటున్న ఎవరికైనా సమస్య వచ్చిందా

లేదు. ఒక వ్యక్తి మందుల్ని వాడడానికి భిన్నమైన పద్ధతులు ఉన్నాయి.

  • ఒకసారో, రెండుసార్లో మందును వాడడం సాధారణం. చిన్నవయసు వారిలో ఎక్కువ ఉంటుంది.
  • తరువాత యథాలాపంగా మందును వాడడం కూడా సాధారణమే. కన్నబిస్ లాంటి మందుల విషయంలో ఇది మరీ వాస్తవం. దీనిని ఉపయోగించే చాలామంది అరుదుగా మాత్రమే దీనిని ఉపయోగిస్తారు, వారి జీవితాలమీద, ఆరోగ్యం మీద ప్రభావమేమీ ఉండదు.
  • సంప్రదాయకంగా స్థానిక సంస్కృతులు ఆమోదించిన ప్రత్యేకమైన మందుల్ని ప్రత్యేక సందర్భాలలో ఉపయోగిస్తారు.
  • మందులు అలవాటుగా మారడం అరుదుగా జరుగుతుంది, కాని చాలా కలవరపరచే సమస్య
కన్నబిస్ః మందు దుర్వినియోగం లేక వినోదానికి మందు

ప్రపంచవ్యాప్తంగా కన్నబిస్ లేక మార్జువానాని పీలుస్తారు లేక తింటారు. మీరుండే స్థలాన్ని బట్టి దీనికి చాలా పేర్లు ఉన్నాయి, ఉదా. జింబాబ్వేలో దీనిని మ్బన్లై, యు.ఎస్.ఎ.లో గడ్డి, భారతదేశంలో చరస్ అని అంటారు. ప్రస్తుతం ఇది అతి సాధారణంగా ఉపయోగిస్తున్న మందుల్లో ఒకటి. కన్నబిస్ని ఉపయోగిస్తున్న చాలామంది దీనిని దుర్వినియోగం చేస్తున్నట్లు పరిగణించగూడదు, ఎందుకంటే దానిని చాలా యథాలాపంగా, నియంత్రణతో ఉపయోగిస్తారు. కాని కొంతమంది తమ ఆరోగ్యం దెబ్బ తినేంతగా దానిని వినియోగిస్తారు. ఇది రెండు విధాలుగా జరుగుతుందిః

  • కన్నబిస్ని సామాన్యంగా పీలుస్తారు కనుక శ్వాసమార్గాలు, ఊపిరితిత్తులు దెబ్బతినొచ్చు.
  • తీవ్రమైన మానసిక వ్యాధులు (సైకోసిస్) ఉన్నవారు కన్నబిస్ని ఉపయోగిస్తే వారి వ్యాధి మరింత తీవ్రమాతుంది. జనం కన్నబిస్ని పీల్చదాన్ని ముఖ్యంగా వారికి మానసిక వ్యాధి ఉంటే, నిరోధించడానికి (సిగరెట్స్ని పీల్చడంలో వల్) ప్రయత్నించండి, కాని, ఆ వ్యక్తి శ్రేయస్సును కొర్ స్నేహితుడు లేక బంధువుకి కన్నబిస్కి మిగతా, ఇంకా తీవ్రమైన మత్తుమందులకు గల తేడాను తప్పకుండా వివరించండి.

 

సంప్రదాయక మందులు
చాలా సమాజాల్లో కొన్ని సందర్భాల్లో మత్తుమందుల్ని ఉపయోగించడాన్ని అనుమతిస్తారు. ఉదాహరణలు, భారతదేశంలో, ఆఫ్రికాలో కొన్ని పండుగలలో కన్నబిస్, లాటిన్ అమెరికాలో మెసలిన్, పియోటె. కొన్ని మత్తు మందులు, తూర్పుఆఫ్రికాలో ప్రజలు నమిలే ఖత్ ఆకుని నిత్యజీవితంలో సాంఘిక వ్యక్తీకరణలో భాగంగా ఉపయోగిస్తారు. వీటన్నిటికి ఉన్న సాధారణ గుణం అన్నీ మొక్కల నుంచి లభించేవే. చాలా వాటిని ఖచ్చితంగా సంప్రదాయక ఉత్సవాలకు లేక క్రతువులకు ఉపయోగిస్తారు. ఈ విధంగా మందుల్ని వాడే చాలామందికి ఏమీ చెడు ప్రభావాలు ఉండవు, కాని వీటిని కూడా కొంతమంది దుర్వినియోగపరుస్తారు.

ఏ మందుల్ని దుర్వినియోగపరుస్తారు

  • మెదడును అణచే లేక కుంగదీసే మందులు. వీటిలో ఓపియమ్, హీరాయిన్ వుంటాయి. తక్కువ మోతాదులో ఈమందులు మనిషిని ప్రశాంతపరుస్తాయి. ఎక్కువ మోతాదుల్లో ఇవి నిద్రమత్తును కలిగిస్తాయి, స్పృహ తప్పేలా చేస్తాయి. మందును మానాలనుకున్నప్పుడు విత్డ్రాయల్ రియాక్షన్స్ చాలా తీవ్రంగా వుంటాయి, ఆ వ్యక్తికి మళ్ళీ మందును తీసుకోవాలనే బలమైన కోరిక, జ్వరం, చంచలత్వం, గందరగోళం, వికారం, విరేచనాలు, ఆందోళన, ఫిట్స్ వుంటాయి.
  • మెదడును ప్రేరేపించే మందులు. వీటిలో కొకెయిన్, ఖత్, ఎక్టసీ, స్పీడ్ లాంటి మాత్రలు (ఏంఫిటమిన్స్). తక్కువ మోతాదుల్లో మనిషిని చురుగ్గా, మెలకువగా ఉంచుతాయి. ఎక్కువ మోతాదులో ఇవి మనిషికి ఒత్తిడిని, భయాన్ని అస్థిరత్వాన్ని కలిగిస్తాయి. మందుల్ని ఉపయోగించేవారికి తమ ఆలోచనలను నియంత్రించుకోవడం కష్టమవుతుంది, భ్రమలు, అనుమానాలు, గందరగోళం ఉంటాయి.
  • మందును మానాలనుకున్నప్పుడు ఆకలి, నిస్తాణ ఉంటాయి. సామాస్యంగా స్వల్పంగా ఉంటాయి. మనిషికి భ్రమల్ని కలిగించే మందులు. మెదడును అణిచే, లేక ప్రేరేపించే చాలా మందులు భ్రమల్ని కలిగిస్తాయి. ఎల్.ఎస్.డి. (లేక ఏసిడ్) లాంటి మందుల్ని ఈఅనుభవంకోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఎల్.ఎస్.డి. ప్రభావం 12 గంటలకంటే ఎక్కువసేపు కొనసాగవచ్చు. ఈ మందుల్ని తీసుకుంటున్నప్పుడు కొంతమంది ఉత్తేజితులవవచ్చు, అనుమానం, గందరగోళం వుండొచ్చు. విత్ డ్రాయల్స్థితి వుండదు. కొంతమంది ఒకే సమయంలో అనేక మందుల్ని వాడతారు, ఉదా. పై మందుల్లో కొన్నిటితోపాటు పొగాకు, ఆల్కహాల్, నిద్రమాత్రల్ని వాడతారు.

మందుల్ని ఎలా వాడతారు

మందుల్ని అనేక రకాలుగా వాడతారు. సాధారణ రకాలుః
  • పొగ  పీల్చడం- కన్నబిస్, ఓపియమ్, కొకెయిన్, సంప్రదాయ మందులు;
  • తాగడం, నమలడం లేక తినడం-మాత్రలు, కన్నబిస్, సంప్రదాయ మందులు;
  • ముక్కుతో గట్టిగా మందును పీల్చడం-కొకైన్, గ్లు: ఇంజక్షన్లు- హిరాయిన్, కొకైన్, ఇంజక్షన్ల రూపంలో తీసుకుంటే ఇన్ఫెక్షన్స్, హెచ్ ఐ వి, ఎయిడ్స్ వచ్చే ప్రమాదం వుంటుంది కనుక డ్రగ్స్ తీసుకోవడానికి ఇది హానికరమైన మార్గం.

మందుల దుర్వినియోగం వ్యక్తిపై చూపే ప్రభావమేమిటి

మందుల దుర్వినియోగం వ్యక్తికి, అతని కుటుంబానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది.

  • మానసిక ఆరోగ్య సమస్యలు. మందులు మెదడు మీద పనిచేస్తాయి కనుక ఈమందుల్ని తీసుకునేవారికి డిప్రెషన్, ఒత్తిడి వుంటాయి. కొన్ని మందులు వ్యక్తికి అనుమానం, గందరగోళాన్ని కలగజేస్తాయి.
  • శారీరక ఆరోగ్య సమస్యలు. మందుల్ని తీసుకునే పద్ధతిని బట్టి సమస్యలు రావచ్చు. అలా పొగాకును పీల్చడం వలన శ్వాసమార్గాలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, మందును ఇంజక్షన్ చెయ్యడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి.
  • కుటుంబ సమస్యలు. మందుల్ని తీసుకోవడం కొట్లాటలకు, కుటుంబంలో సమస్యలకు దారి తీస్తుంది.
  • ప్రమాదాలు. మందుల్ని తీసుకునేవారు మందుల మత్తులో ఏక్సిడెంట్స్ని చేసే ప్రమాదం ఉంది.
  • సాంఘిక సమస్యలు. మందుల దుర్వినియోగం చేసేవారు వాటిని తీసుకోవడానికి ఎంత సమయం తీసుకుంటారంటే వారు చదువుకోలేరు, పనిచేయలేరు లేక నిత్యజీవితంలో భాగస్వామ్యం తీసుకోలేరు.
  • ఆర్థిక సమస్యలు. మందులకు డబ్బు కావాలి. మందుల్ని తీసుకునేవారికి తక్కువ ఆదాయం వుంటుంది కనుక, మందుల దుర్వినియోగం పేదరికాన్ని కలగజేస్తుంది.
  • చట్టపరమైన సమస్యలు. మందుల్ని తీసుకునే వారిలో కొంతమంది మందును సంపాదించే క్రమంలో నేరకార్యకలాపాల్లో భాగం పంచుకుంటారు. కొన్నిసమాజాల్లో మందును తీసుకోవడమే నేరం, మందుల్ని తీసుకుంటూ పట్టుబడితే జైల్లో పెట్టొచ్చు.
  • మరణం. అధిక మోతాదు, ఇన్ఫెక్షన్లు, ఏక్సిడెంట్స్ కారణంగా ఆవ్యక్తి మృతిచెందే ప్రమాదం వుంది.
మందుల దుర్వినియోగం, ప్రాణాపాయ ఇన్ఫెక్షన్లు

హిరాయిన్ లాంటి మత్తుమందును కొన్నిసార్లు శరీరంలోకి ఇంజక్షన్ల రూపంలో తీసుకుంటారు. ఒకే సిరంజి, ఒకే సూదితో స్టెరిలైజ్ చెయ్యకుండా అనేకమంది ఈఇంజక్షన్లను తీసుకోవడం వల్ల, అరక్షిత లైంగిక సంపర్కంకారణంగా, హెచ్ ఐ వి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం వారికి ఎక్కువగా వుంటుంది. ఈ కారణంగా మరో వ్యాధి హెపటైటిస్-బి కూడా రావొచ్చు.

ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్ల గురించి వారికి మీరు అవగాహన కలిగించాలి. ఒకే సిరంజిని, సూదిని అందరూ వాడగూడదని తెలిసేలా చెప్పండి. ఒకసారి వాడి పారేసే డిస్పోజబుల్ సిరంజిల్ని సూదుల్ని మాత్రమే వాడమనండి. ఇది శుభ్రంగాలేని సూదులవలన వచ్చే చర్మం, శరీర ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది, సురక్షిత సెక్స్ గురించి సలహానివ్వండి. కౌన్సిలింగ్ తరువాత హెచ్ ఐ వి, హెపటైటిస్ బి పరీక్షల్ని చేయించుకోమని సూచించండి. ఒక వేళ ఆవ్యక్తికి హెచ్ ఐ వి పాజిటివ్గా వస్తే సురక్షిత సెక్స్ గురించి, ఇతర అంశాల గురించి సలహా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ( వైద్యుడు లేని చోట, మనకు డాక్టరు లేనిచోట). ఈ రెండు వ్యాధుల్లో ఏదీ లేకపోతే, హెపటైటిస్ బి టీకాను వేయించుకోమనండి. ఇంజక్షన్కి బదులు మరొక విధంగా మందును తీసుకోవడానికి ప్రోత్సహించండి. మొదట్లో సాధ్యం కానప్పటికి చివరి లక్ష్యం మందును ఆపడం కావాలి.

మనుషులు అసలు మందుల్ని ఎందుకు వాడతారు

తరచుగా మందుల అలవాటు యవ్వనంలో మొదలవుతుంది.మందుల్ని వాడడానికి ప్రధాన కారణాల్లో ఒకటి స్నేహితుల ఒత్తిడి (డ్రగ్స్ని తీసుకునే స్నేహితులు అతన్నికూడా తీసుకోమని ప్రోత్సహిస్తారు). ఉత్సుకత, సులభంగా మందులు లభించడంకూడా చాలా ముఖ్యమైనవి. బాంధవ్యాలలో సంఘర్షణలు, నిరుద్యోగం లాంటి ఒత్తిడిని తట్టుకునేందుకు ఆవ్యక్తి డ్రగ్స్ని తీసుకోవచ్చు. మందును వాడడం మొదలయాక శారీరకంగా అలవాటుగా మారి మళ్ళీ ఇంకా మందును తీసుకోవడం కొనసాగించడానికి కారణమవుతుంది.

మందును తీసుకునే విషచక్రం:

అ). ఒక వ్యక్తికి మందును వాడే స్నేహితులు వున్నప్పుడు మందు వాడడం ప్రారంభిస్తాడు

ఆ). ముందుగా ఒక ప్రయోగంగా మందును ప్రారంభిస్తాడు, ఇది అతన్ని ఆకాశంలో విహరిస్తున్నట్లు భావించేలా చేస్తుంది.

ఇ). అతను దాన్ని ఆనందిస్తాడు, మందును మానినప్పుడల్లా జబ్బు పడినట్లు భావించే స్థితి వచ్చేవరకు ఇంకా ఇంకా తీసుకుంటాడు.

ఈ). జబ్బు పడినట్లు లేకుండా వుండడానికి అతను క్రమబద్ధంగా మందును తీసుకోవాలి.

మందును తీసుకునేవారు మీసహాయాన్ని ఎందుకు కోరతారు

  • మందును వాడడం వలన వచ్చిన ఆరోగ్య సమస్యలు
  • మందులు అయిపోవడం వలన విత్ డ్రాయల్ లక్షణాలతో బాధపడుతూ ఉండడంవలన
  • తమ అలవాటు గురించి అతను విసిగిపోయి మందును మానడానికి సహాయం కోరడానికి
  • తమ కుటుంబ సభ్యులు లేక పోలీస్ మీసహాయాన్ని కోరమని చెప్పినప్పుడు

మందును ఉపయోగించడాన్ని ఎప్పుడు అనుమానించవచ్చు

  • ఇంతకుముందు సమస్యలేవీ లేకుండా ఇప్పుడు స్కూల్లో, కాలేజీల్లో సమస్యలు వస్తున్నప్పుడు,
  • ఒక వ్యక్తి తన రోజువారీ పనుల్ని బాధ్యతల్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు
  • తన పాత స్నేహితులకు అతను దూరమయినప్పుడు
  • ఆ వ్యక్తి తరచుగా పోలీసులతో గొడవ పడుతూంటే
  • ఆ వ్యక్తి ఇంటర్వ్యూలో గందరగోళంగా కనిపిస్తే
  • పదే పదే ఏక్సిడెంట్స్ లేక మందు ఇంజక్షన్ల వల్ల చేతుల చర్మం మీద ఇన్ఫెక్షన్లు లాంటి శారీరక వ్యాధులు లేక మానసిక వ్యాధులు వచ్చినప్పుడు
  • అతని ప్రవర్తనపట్ల అతని కుటుంబ సభ్యులెవరైనా విచారం వెల్లడిస్తే

ఈ సమస్యను ఎలా సంబాళించడం

కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని అడగవలసిన ప్రశ్నలు
  • అతని ప్రవర్తనలో, స్నేహితుల్లో ఏమైనా మార్పును గమనించారా? ఎప్పటినుండి?
  • అతను మందుల్ని వాడుతున్నాడని మీకు అనుమానంగా ఉందా? ఎందుకు?
  • మీరు దీని గురించి ఎలా భావిస్తున్నారు? సానుభూతితో వ్యవహరించడం ఆమె అలవాటును మానడానికి సహాయ పడుతుంది.
మందును వాడుతున్న వ్యక్తిని అడగవలసిన ప్రశ్నలు
  • మీరు వాడుతున్న మందు ఏది? మీరు ఎంత తరచుగా మందును తీసుకుంటారు? ఇది అతను ఏరకం మందును తీసుకుంటున్నాడో, ఎంత తరచుగా తీసుకుంటున్నాడో తెలుపుతుంది.
  • మీరెలా మందును తీసుకుంటారు? ఇంజక్షన్ ద్వారా ఐతే, ఈప్రశ్నల్ని అడగండి: మీరు ఇంజక్షన్ని ఇతరులు వాడిన సూదితోనే తీసుకుంటున్నారా? అలా ఐతే, హెచ్.ఐ.వి లేక హెపటైటిస్ బి పరీక్షలు చేయించుకున్నారా?
  • మీ అంతట మీరు మందును ఆపుజేసుకోవటానికి ప్రయత్నించారా? ఏమయింది? తమంతట తాము ఆపడానికి ప్రయత్నించిన వారు మీ సహాయాన్ని తీసుకునే అవకాశం ఎక్కువ వుంటుంది. e మీ అలవాటు మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? మీకుటుంబ జీవితం పైన? మీ పనిపైన?
  • మీరు మందుల్ని ఆపాలనుకుంటున్నారా? ఇప్పుడు ఎందుకు? మానడానికి ప్రోద్బలపరచబడి వుండడం అలవాటును ವಿದಿುಲ್ಕ) కోవడంలో విజయం సాధించడానికి ముఖ్యమైన చిహ్నం.
  • మీరు నమ్మే వ్యక్తులు ఎవరు? ఇప్పుడు మీకు ఆసరానిచ్చేది ఎవరు? వారు ఆవ్యక్తి మందుల్ని మానడానికి సహాయపడడంలో ప్రముఖపాత్రను పోషించగలరు.
ఇంటర్వ్యూలో గమనించవలసిన విషయాలు
ఈక్రింది వాటిని చూడండిః
  • స్వీయ సంరక్షణ లోపం చిహ్నాలు
  • చేతుల మీద మచ్చలు, చీముపొక్కులలాంటి ఇంజక్షన్ని ఉపయోగిస్తున్న చిహ్నాలు
  • తూలడం, ముద్ద మాటలులాంటి వ్యక్తి మత్తులో ఉన్నట్లు సూచించే చిహ్నాలు
  • పచ్చకామెర్లు హెపటైటిస్ బి చిహ్నం కావచ్చు
ప్రత్యేక ఇంటర్వ్యూ సూచనలు
  • ఆవ్యక్తిని ఏకాంతంలో ఇంటర్వ్యూ చెయ్యండి. మందును తీసుకునే చాలామంది మందును రహస్యంగా తీసుకుంటారు, తమ కుటుంబానికి అది తెలియడాన్ని ఇష్టపడరు.
  • మందును తీసుకోవడానికి వ్యతిరేకంగా మీకు బలమైన అభిప్రాయాలు ఉన్నప్పటికి, ఆరోగ్య కార్యకర్తగా మీ పాత్రను నిర్వహించడంలో అది అడ్డురాకూడదు.
వెంటనే ఏమి చెయ్యాలి?
వెంటనే శ్రద్ధ చూపవలసినది వ్యక్తి శారీరక ఆరోగ్యం. మత్తు మందుల్ని తీసుకుంటున్న వ్యక్తికి తక్షణం మెడికల్
సహాయం అవసరమైన సందర్భాలు మూడు ఉన్నాయి.
  • నిషా: వ్యక్తి తక్కువ సమయంలో మితిమీరిన మోతాదులో మత్తుమందును తీసుకున్నప్పుడు నిషా వచ్చి గందరగోళంలో పడతాడు, స్పృహను కోల్పోతాడు. ఇది హీరాయిన్, లేక ఓపియమ్ని తీసుకునేవారికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఎందుకంటే అవి శ్వాసను అణుస్తాయి.
  • తీవ్రమైన విత్డ్రాయల్ రియాక్షన్లు, ఫిట్స్, గందరగోళం లాంటివి: మందును మానడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చే ప్రతిస్పందనలు చాలావరకు అంత తీవ్రంగా వుండవు. సాధారణ మందులు, నయమవుతుందనే నమ్మకాన్నివ్వడంతో తగ్గిపోతాయి.
  • తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేక గాయాలు : ఆ వ్యక్తికి తక్షణ చికిత్స అవసరం లేకపోతే, చికిత్స లక్ష్యం ఆమె మిమ్మల్ని నమ్మేందుకు సామరస్యాన్ని ఏర్పరచుకోవడం కావాలి. శారీరకంగా ఆధారపడడం కారణంగా ఆమె పదే పదే మత్తుమందుల్ని తీసుకుంటూందని ఆమెకు వివరించాలి. మందును తీసుకునే వ్యక్తి అనుమతితో కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేసి వారిని కూడా చికిత్సలో భాగస్వాముల్ని చెయ్యాలి. తగిన సమయంలో హెచ్.ఐ.వి, ఇతర ఇన్ఫెక్షన్స్ గురించి కౌన్సిలింగ్ చెయ్యాలి.
    మందును ఇప్పుడు ఆపాలని కోరుకుంటున్న వారికిః
  • ఆపడానికి ఖచ్చితమైన తేదీని నిర్ణయించండి.
  • ఆవ్యక్తి విత్డ్రాయల్ రియాక్షన్లనుండి కోలుకోవడానికి తనకు తాను కనీసం ఒక వారం సమయాన్ని ఇవ్వాలి.
  • విత్డ్రాయల్ దశలో సహాయపడగల అతని ఆత్మీయ కుటుంబ సభ్యులకు లేక స్నేహితులకు ఈవిషయం చెప్పాలి.
  • విత్డ్రాయల్ రియాక్షన్స్ వచ్చేప్రమాదం వున్నప్పుడు, అతనికి వాటి లక్షణాల గురించి, వాటిని నియంత్రించుకునే విధంగురించి సలహానివ్వండి. నిద్ర సమస్యలకు డయాజిపామ్ని, విరేచనాలకు ఏంటీస్పాస్మాడిక్ మందుల్ని పీకులు, నెప్పులకు నెప్పులను తగ్గించే మందుల్ని ఇవ్వండి, ఎలాంటి విత్డ్రాయల్ రియాక్షన్స్ వస్తాయో మీకు ఖచ్చితంగా తెలవనప్పుడు అతన్ని హాస్పటల్కి పంపడానికి ఏర్పాటు చెయ్యండి.
  • కొన్ని దేశాలలో కొన్ని మందులకు వచ్చే విత్డ్రాయల్ రియాక్షన్స్ తీవ్రతను తగ్గించడానికి కొన్ని ప్రత్యేకమైన మందుల్ని వాడతారు. ఓపియమ్, హిరాయిన్ దుర్వినియోగానికి వాడే మందులకు ఉదాహరణలు మిథడాన్, డెక్రోప్రొపాక్సిఫిన్ ఈమందులు ప్రత్యేక క్లినిక్స్లోనే లభించడం వలన వారిని ఆక్లినిక్స్కి పంపడం మంచిది.
  • మళ్ళీ తిరగబెట్టడం సాధారణం, తరచుగా జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకోలేక అతను మందులను తీసుకోవడం మొదలు పెడతాడు. ఒకసారి మందుల్ని ఆపాక జీవితంలో వచ్చేకష్టాల్ని తట్టుకోవడానికి మార్గాల గురించి చర్చించాలి. మళ్ళీ మందుల్ని మొదలు పెట్టే ప్రమాదాన్ని తగ్గించగల ఈ వివిధ అంశాలను గుర్తించాలి:
  • మందును తీసుకునే వ్యక్తి స్నేహాన్ని విడిచి పెట్టాలి.
  • పనికి లేక పాఠశాలకు తిరిగి వెళ్ళాలి.
  • ప్రశాంతతకు, సమస్యా పరిష్కారానికి అవసరమైనది నేర్చుకోవాలి.
  • ఇతర వినోద కార్యక్రమాలలో సమయాన్ని గడపాలి.
  • మందును మానడం కారణంగా తనకు మిగిలిన డబ్బును చూచి అతను ఆనందించాలి.
  • మత్తుమందుల్ని వాడేవారికి సహాయం చేసే బృందాలలో చేరడంగురించి ఆలోచించాలి. మందుల్ని ఇప్పుడు ఆపాలని కోరుకోనివారికి:
  • వారిని మత్తుమందుల్ని వాడేవారికి సహాయం చేసే బృందాల దగ్గరకు పంపాలి.
  • మందుల దుర్వినియోగాన్ని తగ్గించడానికి గల మార్గాలను పరిగణన లోకి తీసుకోండి. ఉదాహరణకు, రోజుకు అరగ్రాము హిరాయిన్కి బదులు పావు గ్రాము హిరాయిన్ని తీసుకోవాలి.
  • మందుల్ని తీసుకునే మార్గాల్ని ఎక్కువ ప్రమాదకరమైన వాటినుండి తక్కువ ప్రమాదకరమైన వాటికి మార్చుకోవాలి, ఉదాహరణకు, మందుల్ని ఇంజక్షన్ల రూపంలో తీసుకోవడం నుండి పీల్చడానికి మార్చడం.
  • ఇంజక్షన్ల వలన వచ్చే ఇన్ఫెక్షన్ల గురించి సలహానివ్వండి.
  • మందు వలన కలుగుతున్న నష్టాల్ని ఎత్తిచూపండి.
  • ఆ వ్యక్తితో అవసరమైతే మళ్ళీ వచ్చి మీతో మాట్లాడ వచ్చని చెప్పండి.

మళ్ళీ తిరగబెట్టేవారికి
  • ఇదెలా సాధారణమో వివరించండి. ఈవ్యసనం ఎందుకు తిరగబెట్టిందో కనుక్కుని భవిష్యత్తులో అలా జరగకుండా ఎలా నిరోధించవచ్చో తెలపండి.
  • ఎంతకాలం మందు తీసుకోకుండా మానారో తెలుసుకుని అంతకాలం మందు తీసుకోకుండా వుండగలిగినందుకు మెచ్చుకోండి.
  • మొదటిసారి సహాయం కోసం మీదగ్గరకు వచ్చినప్పుడు ఎలా ప్రారంభించేవారో అలాగే మొదలు పెట్టండి.

వేరే చోటకు ఎప్పుడు పంపాలి?
ఈ క్రింది సందర్భాలలో వారిని స్పెషలిస్టుల దగ్గరకు పంపాలి:
  • చాలా ఎక్కువ మోతాదులో మందును తీసుకుంటూంటే, ఉదా. హిరాయిన్ ఒక గ్రాము కంటే ఎక్కువగా తీసుకుంటూంటే
  • మీరు మార్గదర్శనాన్ని ఇస్తున్నప్పటికీ ఆవ్యక్తి మందును మానలేకపోతే
  • మందుల దుర్వినియోగం కారణంగా వారికి శారీరక, మానసిక బాధలు కలిగినప్పుడు;
  • మందుల ఇంజక్షన్లను తీసుకుంటూ వాటిని మానలేకపోయినప్పుడు;
  • మెధడోన్ లభ్యమైతే, దానితో చికిత్సకోసం వారిని పంపాలి.

తరువాత ఏమి చెయ్యాలి?
మందుల్ని మానడం చాలా కష్టం కనుక, మానాలని అనుకున్నప్పటికీ మళ్ళీ మొదలు పెట్టడం సాధారణం కనుక, ఆ వ్యక్తితో క్రమ సమయాల్లో మాట్లాడుతూ ఉండండి. ఒత్తిడిని తట్టుకోవడానికి ఆమె కొత్త మార్గాల్ని కనుక్కున్నప్పుడు, కాత్త కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు మళ్ళీ మందును మొదలు పెట్టే అవకాశం తగ్గుతుంది. సామాన్యంగా ఆరు నెలల దాకా ఆమెను కలుస్తూ వుండండి. కొన్ని దేశాల్లో ఆరోగ్య కార్యకర్త మత్తుమందుల్ని వాడుతున్న వ్యక్తులకు చికిత్స చేస్తున్నప్పుడు వారి గురించి లీగల్ అధికారులకు తెలియజేయవలసి వుంటుంది. మీరు చట్టపరమైన నిబంధనల గురించి తెలుసుకుని తగిన విధంగా ఆచరించవలసిన అవసరం వుంది.
మత్తుమందుల సమస్య వున్నవారితో వ్యవహరించే సమయంలో గుర్తుంచుకోవలసిన విషయాలు
  • సాధారణంగా వాడే మత్తుమందులు కొన్ని దేశాల్లో చట్టబద్ధమైనవి : పొగాకు, ఆల్కహాల్
  • మత్తుమందుల వ్యసనం సాంఘిక, ఆరోగ్యపరమైన సమస్య. ఇది కొంతమందికి, ముఖ్యంగా మందును ఇంజక్షన్ల రూపంలో తీసుకునే వారికి హెచ్. ఐ. వి. /ఎయిడ్స్ లాంటి ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది.
  • మందును పూర్తిగా మానేయడమే పరిష్కారం
  • మత్తుమందుల వ్యసనం ఉన్నవారితో బోధన, సలహా రెండూ కలిసిన ఇంటర్వ్యూ చాలా మంచి ఫలితాన్నిస్తుంది, ఇది వారు పూర్తిగా తమ ప్రవర్తనను మార్చుకునేందుకు దోహదపడొచ్చు.
  • ఎలా మందును మానేయవచ్చో చెప్పే సలహా, మందును మానే ప్రయత్నంలో వచ్చే బాధలకు చికిత్స, కుటుంబానికి కౌన్సిలింగ్, క్రమంగా తరువాత ఆవ్యక్తిని కలిసి మాట్లాడడం, సామాజిక బృందాల దగ్గరకు పంపడం ప్రధాన చికిత్సలు.

నిద్ర మాత్రల అలవాటు వున్న వ్యక్తి

ఒక వ్యక్తి నిద్ర పోయేందుకు సహాయపడడానికి వాడే మందులు నిద్ర మాత్రలు. అన్నిటికంటే సాధారణమైనవి డయాజిపామ్, నైట్రజి పామ్, లోరజిపామ్, క్లోర్డయాజిపాక్సైడ్, ఆల్పజోలమ్  ఈ విభాగం నిద్ర మాత్రల అలవాటు ఉన్న వ్యక్తుల గురించి.

ఒక వ్యక్తి నిద్ర మాత్రలకు ఎలా అలవాటు పడతాడు

అ) నిద్రపట్టని ఒక వ్యక్తి

ఆ). నిద్ర పోవడానికి నిద్ర మాత్రల్ని తీసుకోవచ్చు

ఇ). కొన్ని రోజులు ఆమె బాగా నిద్ర పోవచ్చు, కాని ఆమె మాత్రల్ని తీసుకుంటూనే వున్నప్పుడు

ఈ). ఆమె నిద్ర మీద ఆమాత్రల ప్రభావం తగ్గుతుంది, మళ్లీ ఆమెకు నిద్రపోవడం కష్టమవుతుంది

ఉ). ఇప్పుడామెకు నిద్రపోవడానికి ఎక్కువ మాత్రలు అవసరమవుతాయి

ఊ). ఆమె మాత్రల్ని తీసుకుంటేనే నిద్రపోగలుగుతుంది.

వ్యక్తులు నిద్రమాత్రల మీద ఎందుకు ఆధారపడతారు

ప్రపంచంలో వాడుతున్న మందుల్లో అతిసాధారణంగా వాడుతున్న మందు నిద్రమాత్రలు. నిజానికి అన్ని రకాల మానసిక వ్యాధులకు, ముఖ్యంగా డిప్రెషన్కి, ఏంగ్డయిటీకి, వాటిని వాడుతున్నారు. కాని, ఆల్కహాల్కి లాగానే నిద్ర మాత్రలకు కూడా వ్యక్తులు అలవాటు పడడం జరుగుతుంది. ఒకసారి ఇది జరిగాక ఆ వ్యక్తి రోజూ నిద్రమాత్ర లేనిదే నిద్రపోలేడు, ప్రశాంతంగా వుండలేడు. మాత్రను ఆపితే, విత్డ్రాయల్ లక్షణాలుగా నిద్రసమస్యలు వస్తాయి, ఇది మళ్ళీ అతను రోజూ మాత్రల్ని తీసుకునేలాగా చేస్తుంది.

నిద్ర మాత్రల అలవాటును ఎప్పుడు అనుమానించవచ్చు

ఈ క్రింది సందర్భాల్లో అనుమానించవచ్చుః

  • ఎవరైనా మూడు నెలల కంటే ఎక్కువ కాలంగా నిద్ర మాత్రల్ని వేసుకుంటూంటే;
  • ఎవరైనా మిమ్మల్ని నిద్రమాత్రల్ని రాయమని పదే పదే అడుగుతూంటే
  • నిద్ర సమస్యలలాంటి ఒత్తిడి కారణంగా ఎవరికైనా ఎక్కువ మాత్రల అవసరం పడితే,

ఈ సమస్యనెలా సంబాళించడం

నిద్ర మాత్రల అలవాటు వున్న వ్యక్తిని అడగవలసిన ప్రశ్నలు

  • ఈ మందుల్ని ఎంతకాలంగా వేసుకుంటున్నారు? ఎక్కువ కాలమయిన కొద్దీ అలవాటుగా మారే అవకాశం ఎక్కువ.
  • ఎంత తరచుగా వాటిని మీరు తీసుకుంటారు? మాత్రల్ని పగటి పూట కూడా తీసుకుంటూంటే బహుశా అతనికి అది అలవాటుగా మారి వుండొచ్చు.
  • ఒక రోజులో మీరు ఎన్ని మాత్రల్ని తీసుకుంటారు? ఇది మీకు ఆ వ్యక్తి రోజుకు మొత్తం ఎంత మందును తీసుకుంటున్నాడో అంచనా వెయ్యడానికి ఉపయోగపడుతుంది.
  • మీరు ఆల్కహాల్ని తీసుకుంటారా? నిద్రమాత్రల అలవాటు వున్న కొంతమందికి తాగే సమస్య కూడా వుంటుంది.

వెంటనే ఏమి చెయ్యాలి?

  • ఎక్కువ కాలంపాటు నిద్ర మాత్రల్ని వాడితే ఆల్కహాల్కి లాగానే అది అలవాటుగా మారే ప్రమాదం వుందని తెలియజెప్పండి.
  • ఆవ్యక్తి బాధల్లో చాలా వరకు అతనికి ఎక్కువ మాత్రల అవసరాన్ని సూచించే చిహ్నంకాక, అది ఒక అలవాటుగా మారిన ఫలితమని తెలియజెప్పండి.
  • ఆ వ్యక్తికి అవగాహన కలిగాక, ఆమెకు క్రమంగా మందును మానే కార్యక్రమాన్ని ప్రారంభించండి. దీని అర్ధం విత్డ్రాయల్ లక్షణాలను తగ్గించడానికి ఒక నిర్ణీత కాల వ్యవధిలో క్రమక్రమంగా మందు మోతాదును తగ్గించడం. సామాన్యంగా వచ్చే విత్డ్రాయల్ లక్షణాలు ఒత్తిడి, విచారం, నిద్ర సమస్యలు. ఎప్పుడూ కూడా విత్డ్రాయల్ లక్షణాల గురించి హెచ్చరిక చెయ్యండి, దానితో వారు వాటిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా వుంటారు. పెట్టె 6.11 లో నిద్రమాత్రల్ని మానడానికి ఒక కార్యక్రమాన్ని వర్ణించడం జరిగింది.
  • కొంతమంది మీరు రాసివ్వకపోతే ఇతర ఆరోగ్య కార్యకర్తల నుండి పొందే అవకాశం వుంది. అందుచేత మీరు మీ ప్రదేశంలోని ఇతర ఆరోగ్య కార్యకర్తలతో ఇలాంటి వ్యక్తులకు నిద్రమాత్రల్ని రాసివ్వగూడని అవసరం గురించి చెప్పండి.
నిద్రమాత్రల్ని మానడానికి ఒక కార్యక్రమం
  • ప్రతిరోజు ఆమందును ఎంత మోతాదులో తీసుకుంటున్నాడో తెలుసుకోండి. ఆమోతాదు ఒక రోజుకీ మరొక రోజుకీ రోజుల మారుతూంటే గత మూడు రోజుల  సగటును తీసుకోండి.
  • వెంటనే ఆమోతాదులో పావు వంతును తగ్గించండి. ఉదాహరణకు, ఆవ్యక్తి రోజుకు నాలుగు డయాజిపామ్ మాత్రల్ని తీసుకుంటూంటే మూడుకు తగ్గించండి.
  • ఆ వ్యక్తి ఈ తగ్గించిన మోతాదును తరువాత మూడు, నాలుగు రోజుల పాటు తీసుకోవాలి. ఆ తరువాత మళ్ళీ ఒక పావును లేక ఆచరణలో సులభంగా వుండడానికి, (ఉదా. ఒక మాత్రను) తగ్గించండి.
  • ఈవిధంగా కొనసాగించి రెండు వారాల్లో పూర్తిగా మానేసేలాగా మాత్రల్ని క్రమేపీ తగ్గించండి.
  • ఒకవేళ ఆ వ్యక్తికి తీవ్రమైన విత్డ్రాయల్ లక్షణాలు కనిపిస్తే ఇంతకు ముందటి మోతాదును ఇవ్వండి, ఒక వారం ఆగి మళ్ళీ తగ్గించడం మొదలుపెట్టండి.

ఎప్పుడు వేరే చోటకు పంపాలి?

ఎక్కువ మోతాదులో నిద్రమాత్రల్ని తీసుకునే వాళ్ళందరినీ నిపుణుల వద్దకు పంపాలి. చాలా రకాల మందుల్ని తీసుకుంటున్న వ్యక్తిని కూడా వేరే  దగ్గరకు పంపాలి

నిద్రమాత్రల అలవాటు ఉన్న వారితో వ్యవహరించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
  • సైకియాట్రిక్ మందులతో వుండే సాధారణ సమస్యలలో నిద్ర మాత్రల అలవాటు ఒకటి.
  • నిద్ర మాత్రలు మెదడు మీద ఆల్కహాల్ లాగానే పని చేస్తాయి. రెండిటినీ కలిపి తీసుకున్నప్పుడు ప్రభావం మరింత ఎక్కువగా వుంటుంది.
  • నిద్రమాత్రల మీద ఆధారపడే స్థితికి వచ్చాక నిద్రమాత్రలు మొదలుపెట్టక ముందు ఉన్న నిద్ర సమస్యలు, ఒత్తిడి లాంటి బాధలకు దారి తీసాయి.
  • ఎప్పడూకూడా నాలుగు వారాల కంటే ఎక్కువ కాలానికి నిద్ర మాత్రల్ని ఇవ్వకండి.
  • బోధన, ఆ వ్యక్తి తీసుకుంటున్న నిద్రమాత్రల మోతాదును క్రమేపీ తగ్గించడం చికిత్సలో ప్రధానం.

పొగాకు వ్యసనం ఉన్నవ్యక్తి

పొగాకును శతాబ్దాల కాలంగా మత్తుకోసం వాడుతున్నారు. దానిని నమలొచ్చు (భారతదేశంలో గుట్కా లాంటివి), లేక పీల్చవచ్చు (సిగరెట్లు రూపంలో)

తాగుడును ఏకారణాలతో మొదలు పెడతారో అదే కారణాలతో పొగాకును మొదలు పెడతారు. స్కూల్లో స్నేహితుల ఒత్తిడి, సిగరెట్ కంపెనీలు చేసే ప్రచారాలకు ప్రభావితులవడం, స్మోకింగ్ చెయ్యడం గొప్ప అనుకోవడం పొగాకును ఉపయోగించడం మొదలు పెట్టడానికి సాధారణ కారణాలు. ఒకసారి స్మోకింగ్ని మొదలు పెట్టాక, పొగాకులో చాలా తీవ్రమైన అలవాటుగా మారే నికొటిన్ అనే మత్తు పదార్థం వుటుంది కనుక ఆవ్యక్తి పొగాకుకు అలవాటు పడతాడు. అయినా ప్రయోగం చేస్తున్న చాలా మంది కౌమారులు పొగాకు వ్యసనాన్ని కొనసాగించరు.

పొగాకును ఉపయోగించడం ఎందుకు ప్రమాదకరం

అకాల మరణానికి పొగాకు ముఖ్యమైన కారణం. మనిషి ఆరోగ్యాన్ని విపరీతంగా దెబ్బ తీస్తున్నప్పటికీ, పొగాకు కంపెనీలు అతి దూకుడుగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో, పొగాకు ఉత్పత్తుల్ని మార్కెట్ చేస్తున్నాయి. స్త్రీలు, యువతను లక్ష్యంగా చేస్తున్నాయి; చాలా సమాజాల్లో, ఈ గ్రూపుల్లో చాలా వేగంగా పొగాకు ఉపయోగం పెరగడం ఆశ్చర్యకరంకాదు.

పొగాకుని ఉపయోగించడం వలన వచ్చే సాధారణ వ్యాధులు:

  • శ్వాసమార్గంలోనూ, ఊపిరితిత్తుల్లోనూ వచ్చే కేన్సర్లు
  • హార్ట్ ఎటాక్స్, పక్షవాతం, అధిక రక్తపోటు;
  • క్రానిక్ బ్రాంఖైటిస్, ఎంఫిసీమా లాంటి ప్రమాదకరమైన ఊపిరి తిత్తుల వ్యాధులు

స్మోకింగ్ చెయ్యని ఇతరులకు పొగాకు స్మోకింగ్ ఈ విధంగా హాని చేస్తుందిః

  • గర్భవతి స్మోకింగ్ చేస్తే గర్భంలోవున్న శిశువుకు హాని కలుగుతుంది
  • పాసివ్ స్మోకింగ్ స్మోక్ చేసేవారు వదిలిన పొగను స్మోక్ చెయ్యని వారు పీలిస్తే స్మోక్ చేసే వారికి వచ్చే వ్యాధులన్నీ వారికి వస్తాయి.
  • స్మోకింగ్ చేసేవారుండే ఇంట్లో వుండే పిల్లలకు ఉబ్బసం లాంటి శ్వాససంబంధమైన సమస్యలు వస్తాయి.

పొగాకును ఉపయోగించడం గురించి ఎప్పుడు అడగడం

మీదగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని పొగాకు ఉపయోగించడం గురించి అడగాలి. దీనికి కారణం చాలా పొగాకు సంబంధిత వ్యాధులు చాలా కాలం తరువాత వస్తాయి. ఆ విధంగా కౌమార దశలో స్మోకింగ్ని ప్రారంభిస్తే ౪౦ - 50 సంవత్సరాలకు మాత్రమే వ్యాధి చిహ్నాలు కనిపిస్తాయి. అప్పటికి వ్యాధిని నిరోధించడానికి చాలా ఆలస్యమవుతుంది. పొగాకును ఉపయోగించడాన్ని ఈ క్రింది సందర్భాలలో అనుమానించండి:

  • అతను ఊపిరి తీసుకుంటున్నప్పుడు పొగాకు వాసన వేస్తూంటే
  • పళ్ళు, వేళ్ళు పసుపుపచ్చగా ఉన్నాయని గుర్తిస్తే;
  • పుచ్చిపోయిన పళ్ళు, రంగు మారిన నాలుక ఉన్నాయని మీరు గుర్తిస్తే;
  • ఆ వ్యక్తి దుస్తుల్లో సిగరెట్స్ పేకెట్ ఉందని మీరు గమనిస్తే;
  • ఆ వ్యక్తికి శ్వాస, ఛాతీ సంబంధమైనబాధలు వచ్చినప్పుడు.

ఈసమస్యనెలా సంబాళించడం

పొగాకును ఉపయోగించే వ్యక్తిని అడగవలసిన ప్రశ్నలు

  • ఎంత తరచుగా మీరు పొగాకును నములుతారు లేక స్మోక్చేస్తారు? ఇది ఆ దురలవాటు తీవ్రత అంచనాను ఇస్తుంది.
  • పొగాకును ఉపయోగించడం వలన మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం కలిగింది? ప్రత్యేకంగా ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, తరచుగా దగ్గు రావడం గురించి అడగండి.
  • మీరు ఆల్కహాల్ని తాగుతున్నారా? ఈ సమస్యలు ఒకదానితో ఒకటి ముడిపడి వుంటాయి, స్మోక్ చేసే వ్యక్తి ఆల్కహాల్ని కూడా తాగుతాడు.
  • *మీరు పొగతాగడాన్ని ఆపాలనుకుంటున్నారా? పొగాకును పీల్చే చాలామంది మానాలని అనుకుంటారు, ఆపడానికి ఏ సహాయమైనా లేక సలహానైనా ఆహ్వానిస్తారు.
  • కుటుంబంలో ఇంకా ఎవరు స్మోక్ చేస్తున్నారు? ఇంట్లో ఇతరులు స్మోక్ చేస్తున్నప్పుడు ఎవరికైనా స్మోకింగ్ని ఆపడం సామాన్యంగా కష్టమవుతుంది. ఇంట్లో అందరితోనూ ఒకేసారి స్మోకింగ్ని ఆపించడం సహాయకారిగా వుంటుంది.
వెంటనే ఏమి చెయ్యాలి?
  • పొగాకును పీల్చడం లేక నమలడం వలన కలిగే హానిగురించి ఆవ్యక్తికి అవగాహనకలిగించండి.
  • ఇప్పుడు ఆపాలని కోరుకునేవారికి:
  • విడిచిపెట్టడానికి ఒక తేదీని నిర్ణయించండి; ఇది సమీప భవిష్యత్తులోనే వుండాలి.
  • స్నేహితులతో ఉన్నప్పుడు, బారులో ఉన్నప్పుడు, భోజనం చేసాక లాంటి ఆ వ్యక్తి స్మోక్చేసే సమయాలు లేక సందర్భాలను గుర్తించండి. ఆ సమయాల్లో చెయ్యగల ప్రత్యామ్నాయ పనులను, పొగతాగే స్నేహితులను కలవక పోవడం, బారుకు వెళ్ళకుండా తప్పించుకోవడం, భోజనం తరువాత స్వీట్ని తినడం లాంటివి చెయ్యడానికి ప్రోత్సహించండి.
  • పొగాకును ఉపయోగించే వారందరికీ ఆదురలవాటును మానడం కష్టమే అయినా మానాలనుకునే వారిలో దాదాపు అందరూ మానగలుగుతారనే నమ్మకాన్నివ్వండి.
  • వారిని తిరస్కరించవద్దు.
  • వారి ఆరోగ్యాన్నిపర్యవేక్షించడానికి క్లినిక్ దగ్గర అతన్నికలుస్తూ వుండండి. ప్రతిసారి కలిసినప్పుడు స్మోకింగ్ దురలవాటుగురించి చర్చించండి.
  • అతను పొగాకు వాడకాన్ని తగ్గించేలా చూడండి, ఉదాహరణకు రోజుకు రెండు పేకెట్లనుండి ఒకటికి. దీనివలన అతని ఆరోగ్యంపై కలిగే సానుకూల ప్రభావం అతను పూర్తిగా స్మోకింగ్ని ఆపుచెయ్యడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.
  • ఆ వ్యక్తి తగ్గించడానికి అంగీకరిస్తే అతను ఎలా, ఎప్పుడు స్మోక్ చెయ్యాలో అతను పథకం వేసుకోవడానికి సహాయపడండి అతను తగ్గించగలిగితే, ఆత్మ విశ్వాసం పెరిగి తరువాత పూర్తిగా మానేయ గలుగుతాడు.

ఎప్పుడు వేరే చోటకు పంపాలి?

కేన్సర్స్ లేక గుండె జబ్బు వుందని అనుమానిస్తే వాటికి చికిత్స జరిగే చోటకు పంపాలి. దీర్ఘకాలంగా స్మోక్ చేస్తున్నవారికి నాలుక లేక నోటి రంగు మారితే, నెలకంటే ఎక్కువ కాలం పాటు దగ్గు ఉంటే, ఛాతీలో నెప్పి, ఊపిరి తీసుకోవడం కష్టమవడం ఉంటే వైద్య పరీక్షలు, చికిత్సకోసం పంపాలి.

స్మోకింగ్ని తగ్గించడానికి మార్గాలు

ఒక వ్యక్తి స్మోకింగ్ని తగ్గించడానికి కొన్ని సూచనలు ఇక్కడ వున్నాయి:

  • గంటకొకసారి మాత్రమే స్మోక్ చెయ్యడానికి నిర్ణయించుకోండి. తరువాత ప్రతిసారి అరగంట చొప్పున పెంచండి.
  • సిగరెట్ ని పొందడం కష్టమయేలా చెయ్యండి. ఎప్పుడైనా ఇంట్లో రెండు పేకెట్లకంటే ఎక్కువ వుండనివ్వకండి.
  • ఎప్పుడూ ఒకసారి ఒక పేకెట్ కంటే ఎక్కువ కొనకండి.
  • టీ, కాఫీలతో సిగరెట్ తాగే అలవాటు వుంటే, వేరే పానీయాన్ని తాగడానికి ప్రయత్నించండి.
  • సిగరెట్స్ తాగకపోవడం వలన ఆదా అయిన డబ్బును ఇదివరకు మీరు కొనాలని అనుకుని డబ్బులేక కొనలేక పోయిన వాటిని కొనడానికి వెచ్చించండి.
  • ఆచరించి, అప్పుడు స్మోకింగ్ని ఆపడం వల్ల మీరెంత బావున్నారో చూడండి.
  • ఒకవేళ నియమం తప్పి సిగరెట్ తాగితే, ఫరవాలేదు, మీరు మానడానికి ప్రయత్నించారు, అది ఒక ముందడుగే, మీరు మళ్ళీ ప్రయత్నించవచ్చు.
  • మీస్నేహితులతో మీరు స్మోకింగ్ని ఆపుతున్నట్లు చెప్పండి.
పొగాకు దురలవాటును తప్పించడానికి ప్రయత్నించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
  • పొగాకు చాలా హానికరమైనది. స్మోకింగ్ దురలవాటును ఎప్పుడూ ఉపేక్షించవద్దు.
  • పొగాకును ఉపయోగించేవారు తమ అలవాటును ఆరోగ్య సమస్యగా అరుదుగా మాత్రమే చెప్తారు.
  • ప్రజలకు స్మోకింగ్ వలన కలిగే ప్రమాదాల గురించి అవగాహన కలిగిస్తే అది వారి అలవాటును మానడంపై బలమైన ప్రభావం చూపుతుంది.

జూదమాడే అలవాటు వున్న వ్యక్తి

అదృష్టం మీద గెలుపు ఆధారపడే ఆటలపైన డబ్బు పందెం కాయడాన్ని జూదం అని అంటారు. కొన్ని సమాజాలలో ఇది చట్ట వ్యతిరేకం అయినప్పటికి జూదం ప్రపంచమంతటా కనపడుతుంది. జూదానికి సాధారణ ఉదాహరణలు గుర్రపు పందాలు, పేకాట, క్రీడలు, లాటరీలు, గేంబ్లింగ్ మిషన్లు.

జూదం ఒక అలవాటుగా ఎప్పుడవుతుంది

మత్తు మందులకు విరుద్ధంగా, ఒక వ్యక్తి జూదానికి ఎందుకు అలవాటు పడతాడు అనేది వివరించడానికి బాహ్య రసాయనం ఏదీ ఉండదు. జూదం ఉత్తేజితం చేస్తుంది, ఒళ్ళుపలకరింతతో రుల్లుమనేలాగా చేస్తుంది. గెలుస్తాననే అశ జూదం అలవాటుగా మారడానికి ప్రధాన కారణం. చాలామంది జూదరులు గెలిచేదానికంటే ఎక్కువగా పోగొట్టు కుంటారు, పోగొట్టుకున్నదాన్ని మళ్ళీ సంపాదించుకోవాలనే బలమైన ధ్యాస వుంటుంది. వారు జూదమాడడానికి డబ్బును అప్పుతీసుకుంటారు, దొంగతనం చేస్తారు. ఆ వ్యక్తి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడేదాకా జూదమాడడం, ఓడిపోవడం ఈ వలయం కొనసాగుతూ ఉంటుంది. ఒకవ్యక్తి ఈవలయంలో చిక్కుకున్నప్పుడు దీనిని వ్యాధిగా మారిన జూదం అనొచ్చు.

జూదవ్యాధి, ఆరోగ్యం జూదం

  • జూదవ్యాధి ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
  • రాత్రి చాలా ఆలస్యమయేదాకా జూదం కొనసాగుతుంది కనుక, అతను క్రమరహితమైన సమయాలలో, తక్కువ నిద్రపోతాడు, అతని పనిపై దాని దుప్రభావం పడుతుంది.
  • జూదరి జూదాన్నితప్ప మరి దేనిగురించి ఆలోచంచలేదు కనుక, ఆమెకు చికాగావుంటుంది, దేనిమీదా ఏకాగ్రత నిలపలేదు, డిపెషన్ కి గురవుతుంది.
  • జూదరులు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు, అనేక మంది దగ్గర అప్పు తీసుకుంటారు.
  • కొంతమంది జూదరులు డబ్బుకోసం దొంగతనాలు చేస్తారు, డబ్బుకోసమే ఇతర నేరాల్లో చిక్కుకుంటారు.
  • కుటుంబంతో సరిగ్గా, తగినంత సమయం గడపక పోవడంవలన, కుటుంబ బాధ్యతలపై శ్రద్ధ చూపకపోవడం వలన బంధువులతో సంఘర్షణ వస్తుంది.
  • జూదం, ఆల్కహాల్ని తాగడం, స్మోకింగ్ కలిసి సాగుతాయి, ఉదాహరణకు, జూదకార్యక్రమాలు బూర్లో నడుస్తాయి.

పొగతాగడం, తాగుడు లాంటి ఇతర అలవాట్లతో కలిసి వుంటుంది

జూదం ఒక సమస్య అయిందని ఎప్పుడు అనుమానించాలి

ఈక్రింది సందర్భాలలో జూదం సమస్యగా మారిందని అనుమానించాలి:

  • ఆవ్యక్తికి పోలీస్తో పదే పదే సమస్యలు వస్తున్నట్లయితే;
  • మీకు తెలిసిన వ్యక్తి నానాటికీ పేదరికంలోకి జారిపోతున్న చిహ్నాలు కనపడుతుంటే;
  • ఒకవ్యక్తి స్నేహితులకు దూరంగా జరుగుతుంటే.

ఈ సమస్యను సంబాళించడమెలా

జూదం సమస్య ఉన్న వ్యక్తిని అడగవలసిన ప్రశ్నలు

  • మీరీమధ్యనే జూదమాడడం ప్రారంభించారా? ఏరకం జూదాన్ని ఆడతారు?
  • జూదం కారణంగా మీరు పనిని మానుకున్నారా?
  • జూదం మీకుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తూంది?
  • జూదం ఆడడం గురించి మీరేమనుకుంటున్నారు? మీకు న్యూనత కలుగుతూందా?
  • మీకు జూదమాడడానికి డబ్బు ఎక్కడినుండి వస్తూంది? ఇతరులకు మీరు ఎంత అప్పు ఉన్నారు?
  • మీరు ఆల్కహాల్ని తాగుతారా? తాగితే, దానివలన వచ్చే సమస్యలగురించి అడగండి.
  • జూదమాడడాన్ని ఆపడం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మానాలని అనుకుంటున్నారా?

వెంటనే ఏమి చెయ్యాలి?

  • ఈ అలవాటు స్వభావం గురించి చర్చించండి. చాలామంది జూదరులకు ఇది మిగతా దురలవాట్ల లాగానే ఒక సమస్యగా అవగలదనే తెలియదు. ఈ అవగాహనే అతను జూదం మానడానికి ఒక ప్రోత్సాహకం కాగలదు.
  • ఆవ్యక్తి జీవితంపై జూదం దుప్రభావాల గురించి చర్చించండి. మరే ఇతర దురలవాట్లయినా ఉన్నట్లయితే, వాటికనుగుణంగా చికిత్స చెయ్యండి. ఆ వ్యక్తి ఇప్పుడు జూదాన్ని మానాలని అనుకుంటే ఈక్రిందివి చెయ్యండిః
  • జూదం కాక ఆ వ్యక్తి చెయ్యగలిగిన ఇతర పనుల్ని గుర్తించండి. ఇవి ఆ వ్యక్తికి వినోదదాయకమైతే, అతను జూదమాడాలనే కోరికను నిగ్రహించుకోగలుగుతాడు.
  • అతను జూదమాడాలని కోరుకునే సందర్భాలను గుర్తించండి. ఉదాహరణకు, బార్లో మద్యాన్ని తాగుతూ జూదమాడాలని అనిపిస్తూంటే, అతను బార్కి వెళ్ళడం మానేయాలి. అలాగే తనతోపాటు జూదమాడే వ్యక్తుల్ని కూడా కలవడం మానేయాలి.
  • తన సమస్యను అర్థం చేసుకుని, ఈ క్షీష్ట సమయంలో తనకు ఆసరానివ్వగల ముఖ్యమైన వ్యక్తుల్ని గుర్తించాలి.
  • ఈ సమస్యనెలా పరిష్కరించుకోవాలో ఆ వ్యక్తికి నేర్పండి.  ఉదాహరణకు, అతను ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య అతను తీపుకున్న అప్పు అవొచ్చు. ఎవరెవరు అప్ప ఇచ్చారో తెలుసుకోండి, ఆ అప్పుల్ని తీర్చడానికి ఒక పథకాన్ని రూపొందించడానికి అతనికి సహాయపడండి. ఇది అతనికి తన కష్టాల్ని తీర్చుకోగలననే ఆత్మ విశ్వాసాన్ని పొందడానికి సహాయ పడుతుంది, - అప్పుల్ని తీర్చడానికి అతను జూదమాడడాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది.
  • అతని జీతంలో ఎక్కువ భాగాన్ని అతని భార్యకు ఇవ్వడం,  ఉదాహరణకు, జీతాలిచ్చేరోజున, సహయకారిగా వుంటుంది, అతను తన నెల జీతాన్నంతటినీ జూదంలో పణం పెట్టకుండా ఆపుతుంది.
  • కొన్ని ప్రదేశాలలో జూదం సమస్యలు ఉన్నవారికి సహాయపడేందుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయి (గేంబ్లర్స్ ఎనానిమస్). ఈ వ్యక్తిని వారి దగ్గరకు పంపండి.
ఒకవేళ ఆవ్యక్తి మళ్ళీ జూదాన్ని మొదలు పెడితే, లేక జూదాన్ని ఆపాలనుకోకపోతేః
  • ఆవ్యక్తిని తిరస్కరించకండి.
  • అతన్ని మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలవమనండి.

  • మిమ్మల్ని కలిసిన ప్రతిసారి జూదాన్ని ఆపుజేసే అవకాశం గురించి చర్చించండి.
  • జూదమాడడానికి గడిపే సమయాన్ని తగ్గించడానికి లేక వారానికి అతను జూదానికి ఖర్చుపెట్టే డబ్బును తగ్గించడానికి ప్రయత్నించండి. కొంతమంది జూదరులు డిప్రెషన్కి, ఏంగ్డయిటీకి గురవుతారు. వారికి ఏంటీ డిప్రెసెంట్స్ని ఇచ్చి చూడండి.
జూదమాడడానికి అలవాటు పడిన వారిని సంబాళించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
  • జూదమాడడం ఒక వ్యసనంగా మారొచ్చు, అతని మానసిక, సాంఘిక ఆరోగ్యాన్ని దెబ్బతియ్యొచ్చు.
  • జూదరులు తమంతట తాము చికిత్సకోసం అరుదుగా వచ్చినప్పటికీ తమకు సమస్య వుందని వారిలో చాలా మందికి తెలుసు.
  • కొంతమంది జూదరులు డిప్రెషన్కి గురవుతారు.
  • సమస్య స్వభావం గురించి బోధన, వివిధ వినోద కార్యక్రమాల్ని సమస్యా పరిష్కార మార్గాల్ని గుర్తించడం శ్రేష్టమైన చికిత్స.

 

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate