অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అంగవైకల్యంతో వృదార్ధాప్యంలోనికి

అంగవైకల్యంతో వృదార్ధాప్యంలోనికి

 1. వృద్దాప్యం వలన కలిగే ఆరోగ్య సమస్యలు
 2. బలహీనమైన కండరాలు - కీళ్లు - లేక కీళ్లనొప్పలు, కండరాల నొప్పలు
 3. చక్రాల కుర్చీలను వాడే స్త్రీల కోసం
 4. పోలియో వచ్చిన తర్వాత దుష్ఫలితాలు
 5. నడత మరియు సమతూకం (బ్యాలస్సు)
 6. కీళ్ల జబ్బులు
 7. చర్మ సమస్యలు
 8. దృష్టి మరియు వినికిడి శక్తి
 9. బలహీనపు ఎముకలు
 10. మానసిక ఆందోళన
 11. పనులు చేయటానికి క్రొత్త పద్ధతులను కనుగొనటం
 12. సహాయాన్ని అపేక్షించటం
 13. విచారము (నిరాశ, నిస్పృహ)
 14. విచారం (డిప్రెషన్) నుంచి తప్పించుకోవటం ఎలాగ (నిరాశ)
 15. మీ నెలసరి బహిష్టులు ఆగినపుడు (మెనోపాజ్)
 16. లక్షణాలు
 17. ఋతుస్రావం ఆగిపోయినపుడు మీకు అసౌకర్యంగా వుంటే (మోనోపాజ్)
 18. బుతుస్రావం ఆగిన తర్వాత లైంగిక సంబంధాలు
 19. ముఖ్యమైన విషయాలు
 20. గర్భం రాకుండాను మరియు సెక్సు కారణంగా కలిగే ఇన్ఫెక్షన్స్ (ఎస్.టి.ఐ) నుంచి మిమ్మల్ని కాపాడుకోవటం
 21. హుషారైన జీవితాన్ని గడపండి
 22. క్రొత్త విషయాలను నేర్చుకునే సమయం
 23. మార్పు కోసం కృషి
 24. వృద్ధులైన వికలాంగ స్త్రీలు చేయగల పనులు

av1.jpgమీ కుటుంబ సభ్యుల నుంచీ, సమాజం నుంచీ మన్నన, మర్యాదలను పొందగలిగిన వయసు మీ వద్దాప్యం. అయినప్పటికీ, లేమి, నిరాదరణ, ఆరోగ్య సమస్యలకు గురి అయ్యే వయసు కూడా అదే - మీకు అంగవైకల్యం వున్నా లేకున్నా మీ వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో మార్పులు మీ అనుభవంలోకి వస్తాయి.

వయసు పెరిగిన కొద్దీ శరీరంపై అదుపు తగ్గుతుంది కనుక, మీరు చేసే చాలా పనులను మీకు అనువుగా మార్చుకోవాలి. మీరు వయసులో వున్నపుడు మీకు లేనటువంటి ఆరోగ్య సమస్యలు, అంగవైకల్యాలు మీ వృద్దాప్యంలో మీకు కలగవచ్చు. కొన్ని కార్యక్రమాలను యిక మీరు చేయలేరు కనుక వాటిని మీరు చేయటం ఆపివేయాలి. కొందరు స్త్రీలు, వారు నడవలేరు కనుక చేతికర్రనో, చక్రాల కుర్చీనో వాడటం మొదలు పెడతారు. కొందరు కళ్ల అద్దాలను, వినికిడి శక్తికి సహాయపడే యంత్రాలను వాడటం మొదలు పెట్టవలసిన అవసరం కలుగుతుంది.

మీరు చిన్నపుడే వికలాంగులయినా, లేదా జీవిత కాలంలో తర్వాత వికలాంగులయినా, యీ అధ్యాయంలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన సమాచారం యివ్వబడింది. మీ వయసు పెరుగుతున్న కొద్దీ మీలోని వైకల్యాలు ఎలా పెరుగుతాయో, ఎలా మారతాయో, వాటి గురించి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించబడ్డాయి.

వృద్దాప్యం వలన కలిగే ఆరోగ్య సమస్యలు

av2.jpgస్త్రీలు తరచుగా తమ బిడ్డలు పెరిగి పెద్దయ్యేవరకూ, లేదా తమ శరీరాలలో మార్పులు వచ్చే వరకు తాము ముసలివాళ్లయినట్లుగా అనుకోరు. మీరు యిదివరకటిమాదిరిగా బలంగా లేనటూ, తేలికగా తిరగలేక పోతున్నటూ, తరచూ మీ శరీరం ఎక్కువగా అలసి పోతున్నటూ గ్రహిస్తారు.

స్త్రీలలో వయసు పెరిగే కొలదీ కలిగే మార్పులను మీరు అర్థం చేసుకుంటే, మీ శరీరంలో కలుగుతూ వున్న మార్పులు పెరిగే వయసు కారణంగానో, లేదా మీ అంగవైకల్యం కారణంగానో తెలుసుకోవటం మీకు సులభమవుతుంది. వికలాంగ స్త్రీల వయసు పెరిగే కొలదీ వారికి కలిగే సమస్యలు ఇక్కడ యివ్వబడ్డాయి.

బలహీనమైన కండరాలు - కీళ్లు - లేక కీళ్లనొప్పలు, కండరాల నొప్పలు

మీ శరీరంలోని ఒక భాగం రెండవ భాగంలా పని చేయలేకపోవటమే మీకు గల అంగవైకల్యమయితే, ఆ రెండ మంచి భాగాన్ని బహుశ మీరు ఎక్కువగా, ఎక్కువ కాలం వాడవలసి వస్తుంది. ఉదాహరణకు:

మీ శరీరంలోని ఒక భాగం రెండవ భాగంలా పని చేయలేకపోవటమే మీకు గల అంగవైకల్యమయితే, ఆ రెండ మంచి భాగాన్ని బహుశ మీరు ఎక్కువగా, ఎక్కువ కాలం వాడవలసి వస్తుంది. ఉదాహరణకు

 • మీ రెండు కాళ్లలో ఒక కాలు పక్షవాతానికి గురి అయినపుడు మీరు మీ రెండవ మంచిదైన కాలును ఎక్కువగా వాడతారు. ఎంత ఎక్కువగా అంటే, ఇతరులు తమ రెండు కాళ్లను వాడిన దానికన్నా ఎక్కువగా. అందువలన మీ కీళ్లు బలహీన పడవచ్చు.
 • మీరు చక్రాల కుర్చీనిగాని (క్రెచెస్) చేతికర్రలనుగాని చాలా కాలం వాడినటైతే, మీ చేతులలోని ముంజేతుల, భుజాలలోని కీళ్లకు నొప్పలు రావచ్చు. అరిగి పోతూ వుండవచ్చు.
 • మీ సైజు చాలా చిన్నగా వుండి వుంటే అంటే మురుగుజ్జు అయితే - చాలా సంవత్సరాల తరబడి మీరు మీ అవసరాలకై పైకి ఎక్కటం, అందుకోవటం వంటి పనులు చేయడం వలన మీ భుజాలు, మోకాళ్లు, పిరుదులలో నొప్పలు మొదలు కావచ్చు. మీరు చక్రాల కుర్చీని వాడుతూ వున్నా ఎక్కువ కాలం బెడ్ (మంచం)పైనే గడుపుతూ వున్నా - ఒత్తిడి వలన కలిగే పండ్లను నివారించటం కోసం, మీరు లేచి తిరుగుతూ, మీ భంగిమలను మార్చుకొంటూ వుండటం చాలా ముఖ్యం.

చక్రాల కుర్చీలను వాడే స్త్రీల కోసం

av3.jpgచక్రాల కుర్చీలను వాడే స్త్రీలకు వారి వయసుకు తగిన వ్యాయామం వుండదు. మీరు లేచి నిలబడటానికి యితరుల సహాయం తీసుకోండి. లేదా నిలబడటానికి సహాయపడే ప్రేమను వాడినటైతే మీ కాళ్లలోని ఎముకల మీద మీ బరువును మోపగలరు. వస్తువులను పైకెత్తటం వలన, మీ ముంజేతులలోని ఎముకలు కూడా బలపడతాయి. ఇతర వ్యాయామాల కోసం 88 నుంచి 95 వరకూ పేజీలను చూడండి.

పోలియో వచ్చిన తర్వాత దుష్ఫలితాలు

మీ జీవితంలో మీకు ముందుగానే పోలియో వచ్చి వున్నటైతే, ఆ వైరస్ (క్రిములు) పోయిన చాలా సమస్య కలగవచ్చు. అందువలన వ్యాయామం చేసేటపుడు మీరు చాలా జాగ్రత్తగా వుండాలి. మీ కండరాలను ఎక్కువగా వాడటం వలన, వాటికి మరింత నష్టం వాటిల్లి, మీకు నీరసం ఎక్కువ అవుతుంది. అందుచేత వ్యాయామానికి బదులుగా మీ శరీరం బిగిసిపోకుండా వుండటం కోసం మెల్లగా చాపుతూ కదుపుతూ వుండండి.

నడత మరియు సమతూకం (బ్యాలస్సు)

మీరు కృత్రిమంగా తయారు చేయబడిన కాలును వాడుతూ వున్నటైతే, అది చక్కగా అమరి, మీరు దానికి అలవాటు పడటం చాలా అవసరం. మీరు తగినంత వ్యాయామం, నడవటం చేయకపోవటం, మరియు మీ కండరాలు మొత్తబడిపోయి నీరసపడిపోవటం వలన కృత్రిమ కాలుతో నడవటానికి మీరు కష్టపడవచ్చు. అపుడు మీరు చేతికర్రను గాని, చంకలోని కర్రలు (క్రెచస్)గాని లేదా చక్రాల కుర్చీని గానీ వాడటం మొదలు పెట్టటం అవసరం కావచ్చు. తమ నడక లేదా కదలికలకు అవసరమైన సహాయక వస్తువులను (ఎయిడ్స్) ఎంచుకోవటం కోసం చాలా మంది స్త్రీలు చాలా కాలం తీసుకుంటారు. కాని చేతికర్రను గాని, చక్రాల కుర్చీని గాని ఆలస్యం చేయకుండా ముందుగానే వాడటం మొదలు పెట్టడం వలన పడిపోవటం, దెబ్బలు తగిలించుకోవటం వంటి ప్రమాదాలనుంచి మీరు కాపాడబడతారు. మీ చుటూ మీరు మంచిగా తిరిగి తమ సమాజ జీవితంలో మీరు ఎక్కువ పాల్గొనగలుగుతారు.

కీళ్ల జబ్బులు

నొప్పితో కూడిన వాపులు, బిగిసిపోయిన కీళ్లు దీనినే ఆర్థరైటిస్ (కీళ్ల జబ్బు) అంటారు. ఈ జబ్బు చాలా మందికి వస్తుంది. దినచర్య కార్యక్రమాలను బాధాకరంగానూ, అతి కష్టంతోనూ జరుపుకొనేలా చేయగలదు. ఈ జబ్బు చేతులకు వచ్చినటైతే, కొందరు వికలాంగులకు యింకా ప్రత్యేకమైనటువంటి సమస్యలను కలగజేస్తుంది. ఉదాహరణకు

 • మీరు అంధులై వుండి, మీ చేతి స్పర్శను సహాయాన్ని చూడటానికి, చదవటానికీ వాడుకొంటూన్నట్లయితే, మీరు ఆ పనులను చేయలేరు.
 • మీరు బధిరులైతే (చెముడు కలవారు) సౌంజ్ఞ భాషను వాడగలశక్తి మీకు వుండదు.
 • మీరు మూత్ర విసర్జన కొరకు థెటర్నుగాని, మలవిసర్జన కొరకు బౌలునుగాని వాడుతూ వుంటే, మీ చేతులతో ఆ పనులను చేసుకోవటం చాలా కష్టం.
 • మీ చేతులు కుష్టి వ్యాధికి గురి అయి వుంటే, యీ కీళ్ల జబ్బు మీ చేతుల వాడకాన్ని యింకా కష్టతరం చేస్తుంది.

చర్మ సమస్యలు

వయస్సు పెరుగుతున్న కొద్దీ మీ చర్మం పలుచగా తయారై తేలికపాటి ఒత్తిడికే నలిగి పోయి గాయం కావటం మీరు గుర్తిస్తారు. ఇది ఎక్కువగా స్త్రీలకే సంభవిస్తుంది.

 • మీరు రోజులో ఎక్కువ భాగం కూర్చునే లేక పదుకొనే వుండేటట్లయితే, మీ శరీరానికి ఒత్తిడికి రాసుకొనే పండ్లు తేలికగా వస్తాయి.
 • మీరు కృత్రిమ కాళ్లనుగానీ, చేతులను గానీ వాడుతూ వుంటే, అవి మీ శరీరాన్ని ఎక్కువగా తాకే ప్రదేశాన్ని ఎర్రగా కమిలి బాధ కలిగించుతున్నదేమో తరచూ పరిశీలన చేసుకొంటూ వుండాలి.
 • మీకు కుపువ్యాధి వుంటే, మీ చర్మాన్ని ప్రతిరోజూ పరిశీలించి చూచుకోండి. పలుచని చర్మానికి పండు, ఇన్ఫెక్షన్లూ తేలికగా సోకుతాయి.
 • మీకు వెన్నుకు గాయం కావటం లేదా పక్షవాతం వుండే, లేక మీకు స్పర్శజ్ఞానం లేకపోయినట్లయితే యూ ఒరిపిడి కారణంగా ఏర్పడే పుండ్లను నివారించటం కోసం ముఖ్యంగా మీరు చూడలేని మీ వెనుక (వీపు) భాగాన్ని వేరే ఎవరితోనైనా రోజూ చెక్ చేయించుకోండి.

దృష్టి మరియు వినికిడి శక్తి

చాలామంది వృద్దులు వారి యావ్వనంలో చూసినంత బాగా చూడలేకపోతారు. అంటే దృష్టి మందగించు తుంది. మీరు బధిరులు (వినికిడి లోపం కలవారు) కూడా అయితే యితరులు మాట్లాడే సౌంజ్ఞా భాషను చూడలేరు. మీరు పెదిమల కదలికలను చదవటానికి అలవాటు పడిన వారైతే అది చూడటానికి కూడా మీరు అశక్తులవుతారు.

మీకు కుపువ్యాధి వుండే, వయసుతో వచ్చే కంటి వాపు, కండ్లకలక వంటివాటికి చికిత్స చేయించుకోక పోతే అంధత్వాన్ని పొందే పరిస్థితి కలుగుతుంది.

చూడటం, వినటం, చుటూ తిరగగలగటం తేలికగా చేయటానికి సహాయపడే మార్పులను చేయమని మీ కుటుంబ సభ్యులను అడగండి. ఉదాహరణకు మీరు బాగా చూడలేరనుకోండి. ఇంటి లోపలి భాగంలో ఎక్కువ కాంతి ప్రసరించేలాగా గోడలకు సున్నం వేయటం లేదా కాంతిని ఎక్కువగా యిచ్చే వేరొక బల్పును పెట్టటం చేయాలి. మెట్లను, గుమ్మాల ముందు ప్రదేశాన్ని వివిధ రంగులతో గుర్తించేలా మార్కు చేయాలి. అపుడు మీరు తడబడకుండా, తూలి దెబ్బ తగిలించుకోకుండా వుండగలరు.

మీ వినికిడి శక్తి బాగా తగ్గి పోయినపుడు మీతో మాట్లాడే వ్యక్తులను మీకు అభిముఖంగా కూర్చుని వివరంగా మాట్లాడమనీ, గట్టిగా అరిచి చెప్పవద్దనీ అడగండి. మాట్లాడేటపుడు, రేడియో, టి.వీల శబ్దాన్ని తగ్గించితే మీరు మంచిగా వినగలుగుతారు.

బలహీనపు ఎముకలు

మీ నెలసరి బహిష్టటలు ఆగిపోయినపుడు, మీ శరీరం ఈ(స్తోజన్ అనే హార్మోనును తక్కువగా తయారు చేయటం మొదలు పెడుతుంది. అందువలన మీలోని ఎముకలు బలహీన పడతాయి. బలహీనపు ఎముకలు చాలా తేలికగా విరిగిపోతాయి. మరియు చాలా నెమ్మదిగా అతుకుబడతాయి. వయసు పెరిగిన కారణంగా మీ నడకలో మార్పు అంటే సమతూకం తగ్గినా, మీకు మూర్చరోగం వున్నా మీరు పడిపోవటం, మీ బలహీనంగా వున్న ఎముకలు విరిగి పోవటం వంటి ప్రమాదాలు ఎక్కువగా వుంటాయి, ఎముకలు బలహీనపడకుండా వుండటం కోసం.

 • కాలియం ఎక్కువగా వుండే పదార్థాలను, విటమిన్ సి ఎక్కువగా వుండే పండ్లనూ, పసుపు పచ్చని రంగుగల కూరగాయలను తినటం
 • క్రమబద్ధమైన వ్యాయామం (మీ బరువును ఎముకలపై ఆనేలా) చేయటం.

మానసిక ఆందోళన

కొందరు వృద్దులు విషయాలను గుర్తుపెట్టుకొనే విషయంలో, మనసును లగ్నం చేయటంలో కష్టపడుతూ వుంటారు. ఎక్కువ మందికి యిది పెద్ద తీవ్రమైన సమస్య ఏమీ కాదు. కాని కొందరైతే జ్ఞాపకశక్తి, ఆలోచనల సంబంధమైన తీవ్రమైన సమస్యలను పెంపొందించుకుంటారు (ఆల్జైమెర్స్ డిసీజ్) ఆఖరికి తాము స్నేహితులనూ, కుటుంబ సభ్యులనూ కూడా గుర్తించలేకపోతున్నామన్న ఆందోళనకు గురి అవుతారు. రోజూ తనకు తెల్చిన, తనకు అలవాటున్న విషయాల గురించే భయపడటం, ఆందోళన చెందటం మొదలు పెడతారు.

డాన్స్ సిండ్రోము (మానసికంగానూ, శారీరకంగానూ వైకల్యం కలిగించే వ్యాధి) గల వృద్ధులు తరచూ అధికమైన అనారోగ్యానికి గురై, వారికి మూర్చలు రావడం కూడా ప్రారంభమవుతుంది.

పనులు చేయటానికి క్రొత్త పద్ధతులను కనుగొనటం

వయస్సు పెరుగుతూ వున్న కొద్దీ మీలో వస్తున్న మార్పులకనుగుణమైన క్రొత్త పద్ధతులను అన్వేషించటం, యితరుల సహాయాన్ని తీసుకోవటం చేయాలి. మరియు మీరు యింకా ఎక్కువ సహాయకారక వస్తువులను అంటే వినికిడి శక్తిని పెంచే యంత్రం, చేతికర్రలు, చక్రాల కుర్చీలు మొదలైనవి వాడటం అవసరం.

మీ శరీరంలో మార్పులు కలగటం మొదలైన విషయాన్ని మీరు తెలుసుకోగానే, పనులను చేసుకోవటానికి వత్తమమైన పద్ధతులను మీరు కనుక్కోవాలి. ఏమి కావాలని అనుకొంటున్నారో తెలుసుకోవటం, మీ శరీరం గురించిన ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవటానికి సహాయపడుతుంది మరియు మీ వయస్సు పెరుగుతూ వున్న కొద్దీ మీరు వీలైనంత ఆరోగ్యంగా వుండగలుగుతారు.

సహాయాన్ని అపేక్షించటం

మీ పనులు అంటే తినటం, స్నానం చేయటం, ಬಟ್ಟಲು ధరించటం, పడుకొని లేవటం, మొదలైన పనులను చేసుకోవటం మీకు కష్టంగా అనిపించినపుడు, మీరు మీ స్నేహితులనో, కుటుంబ సభ్యులనో, మీ గురించి శ్రద్ద తీసుకొనేవారికో లేదా మీకు నమ్మకం గల యితరులెవరికైనా ఆ పనులను చేసుకోవటంలో మీకెలా సహాయ పడగలరో చూపించండి, వివరించండి. ఎవరైనా బంధువును గాని, స్నేహితురాలిని గాని మీతో వుండేలా మీరు ఏర్పాటు చేసుకోవచ్చును కూడా ఆమె వుండటానికి ఒక చోటు ఏర్పరచాలి.

మీరు కొన్ని పనులను మరిచి పోతున్నట్లు మీకు అనిపిస్తే ప్రతిరోజూ మీరు చేయాలనుకొనే విషయాలను ఒక పట్టీలా తయారు చేసుకొని, చేసిన పనులను అయిపోయినట్లుగా మార్కు చేసుకొంటే, చేయవలసిన పనులను మీరు మరచి పోకుండా వుండటానికి వీలు అవుతుంది. లేకుంటే ఆ రోజు మీరు చేయాలనుకొంటున్న పనుల గురించి మీ కుటుంబ సభ్యులకు చెబితే, వారు మీకు గుర్తు చేయగలరు.

విచారము (నిరాశ, నిస్పృహ)

కొందరు వ్యక్తులు వయస్సు పెరుగుతూ వున్న కొద్దీ సంతోషాన్ని కోల్పోయి విచారగ్రస్తులై వుంటారు. ఇందుకు కారణం - వారి ఒంటరితనం, ఆరోగ్య విషయంలో వచ్చిన మార్పులు లేక అంతకు ముందులా శక్తి లేకపోవడం వలన గాని కావచ్చు. ఆత్మన్యూనతా భావంతో బాధపడే కొందరు వికలాంగ స్త్రీలు యింకా ఎక్కువ ఒంటరితనాన్ని అనుభవిసూ, వయస్సు పెరిగిన ಆ°ಲದಿ విచారగ్రస్తులై వుంటారు.

డిప్రెషన్ (విచారం, నిస్పృహలు)ను గుర్తించటానికి కనిపించే కొన్ని లక్షణాలు

 • ఎక్కువ సమయం విచారంగా వుండటం
 • నిద్రపోవటానికి కష్టపడటం లేదా విపరీతంగా నిద్రించటం
 • సంతోషకరమైన కార్యాలలో, తినటంలో, సెక్సు విషయంలో శ్రద్ధ లేకపోవటం
 • వివరంగా ఆలోచించటానికి కష్టపడటం
 • శారీరక సంబంధమైన సమస్యలు - తలనొప్పి, ప్రేగుల సమస్యలు వంటివి కాని వాటికి కారణం జబ్పేమీ కాదు.
 • నెమ్మదిగా మాట్లాడటం, కదలటం
 • దిన చర్య కార్యక్రమాలు చేసుకోవటానికి శక్తి లేకపోవటం
 • చనిపోవటం, ఆత్మహత్య గురించి ఆలోచించటం

విచారం (డిప్రెషన్) నుంచి తప్పించుకోవటం ఎలాగ (నిరాశ)

వీలైనంత హుషారుగా వుండేలా, వ్యాయామం చేసేలా, బాగా తినేలా ప్రయత్నించండి. అన్నిటికన్నా ఎక్కువగా ఒంటరిగా వుండకుండా వుండేలా ప్రయత్నించండి. మీ సమాజంలో వున్న చిన్న పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవటంలో సహాయం చేయండి.

ఇతర వృద్ధ వికలాంగ స్త్రీలతో కలిసి మాట్లాడుతూ, మీ సమయాన్ని గడపండి. మీరు తరచుగా విచారంగా వుంటూ వున్నా నిద్రలేమితో బాధపడుతూ వున్నా మీకు నమ్మకం గల మీ కుటుంబ సభ్యులెవరితోనైనా, లేదా ఆరోగ్య కార్యకర్త ఎవరితోనైనా మాట్లాడండి (మానసిక ఆరోగ్య సంబంధమైన యింకా ఎక్కువ సమాచారం తెలుసుకోవటం కోసం 3వ అధ్యాయం చూడండి)

మీ నెలసరి బహిష్టులు ఆగినపుడు (మెనోపాజ్)

మామూలుగా నెలసరి ఋతుస్రావం నెమ్మది నెమ్మదిగా ఆగటానికి ఒకటి, రెండు సంవత్సరాలు పడుతుంది ఎక్కువగా 45-55 సం.ల మధ్య గల వయస్సులో బహిష్టులు ఆగుతాయి. మీ అండాశయాలు అండాలను తయారు చేయటం ఆపటం వలనా, మరియు మీ శరీరం ఈస్ట్రోజన్, ప్రాజెస్టరోన్ అనే హార్మోనులను తక్కువగా తయారు చేయటం వలనా బహిషులు ఆగిపోతాయి. బలహీనంగా వుండే స్త్రీలలో ఋతుస్రావం యితర స్త్రీలకన్నా కొంచెం ముందుగానే ఆగిపోతుంది.

లక్షణాలు

 • మీ నెలసరి ఋతుస్రావంలో మార్పు వచ్చి తరచూ వసూండవచ్చు లేదా కొన్ని నెలల పాటు ఆగిపోయి, తిరిగి రావచ్చు.
 • ఒక్కొక్కపుడు మీకు చాలా వేడిగా అనిపించి చెమటలు పట్టవచ్చు.
 • మీ యోనిలో తడి తగ్గి దాని పరిమాణము చిన్నగా కావచ్చు.
 • మీ ఆలోచనలు తేలికగా మారిపోతాయి.

మీ శరీరంలో తగ్గిన ఈస్ట్రోజన్ హార్మోను వుత్పత్తికి అలవాటు పడటం మొదలుకాగానే ఈ లక్షణాలు కూడా తగ్గి పోవటం మొదలవుతుంది.

ఋతుస్రావం ఆగిపోయినపుడు మీకు అసౌకర్యంగా వుంటే (మోనోపాజ్)

ఈ క్రింది విధంగా ప్రయత్నించండి

 • వదులుగా, సౌకర్యవంతంగా వున్న నూలుతో తయారు చేయబడ్డ దుస్తులను ధరించండి. మీకు చెమటలు పట్టడం మొదలు కాగానే తేలికగా విప్పేయగలిగిన బట్టలను ధరించండి వీలైతే
 • ఎక్కువ వేడిగా వున్న మరియు మసాలా దినుసులతో వున్న ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అందువలన కడుపులో అసౌకర్యం కలుగుతుంది.
 • క్రమబద్ధమైన వ్యాయామం చేయండి ఎక్కువగా కాఫీ, టీలను త్రాగకండి.
 • పాప్, సోడా, కోలా వంటి తీపి, శీతల పానీయాలను కూడా త్రాగకండి. వాటిలో వున్న కెఫీన్ అనే పదార్ధం వలన మీకు నరముల బలహీనత, నిద్ర లేమి కలుగుతుంది.
 • ధూమ పానం, ముక్కుపొడి పీల్చటం, పొగాకు నమలటం ఆపండి. వాటి వలన అసాధారణమైన రక్తస్రావం కలిగి, బలహీన పడిన మీ ఎముకలకు సమస్యలను కలిగించి, వాటి పరిస్ధితిని మరింత దిగజార్చవచ్చు.
 • మీ కుటుంబ సభ్యులతో మీ అభిప్రాయాలు తరచూ మారుతున్న విషయాన్ని తెలపండి. మీ లాగ మెనోపాజ్ (ఋతుస్రావం ఆగిపోయినటువంటి)లో వున్న స్త్రీలతో చర్చించటం కూడా మీకు వుపయోగపడుతుంది.
 • మీ సమాజంలో గల సాంప్రదాయబద్ధమైన పరిహారాల గురించి అడిగి తెలుసుకోండి. మీరు యింకా సౌకర్యవంతంగా వుండేటందుకు, అంతకుముందే ఋతుస్రావం ఆగిపోయినటువంటి స్త్రీలు సూచనలను, సలహాలను మీకు చెప్పగలరు.

మోనోపాజ్ సమయంలో వచ్చే మార్పులు, అసౌకర్యాలను తగ్గించటం కోసం, ఇది వరకు డాక్టర్లు నష్టపడిన హార్మోన్ల పునరుత్పత్తిని జరిపే వైద్య విధానాన్ని (హెచ్.ఆర్.టి) సిఫార్సు చేసేవారు. అయితే దురదృష్టవశాత్తు ఆ విధానం వలన స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, హృద్రోగం, రక్తం గడ్డలు కట్టటం వగైరా ప్రమాదాలు සට්ඨි అవకాశాలున్నట్లుగా వెల్లడి అయింది. అందు చేత ఆమందులు వాడటం ఆపి వేయటం మంచిది.

బుతుస్రావం ఆగిన తర్వాత లైంగిక సంబంధాలు

av4.jpgకొందరు స్త్రీలు ఋతుస్రావం ఆగిపోవటం అంటే లైంగిక సంబంధమైన కోరికల బెడద నుండి విముక్తి పొందినట్లు భావిస్తారు. ఇంకొందరు స్త్రీలు సెక్సులో పాల్గొనటానికి ఎక్కువ వత్సాహంగా వుంటారు. ఎందుకంటే వద్దు అనుకున్న గర్భం వస్తుందేమోనన్న భయం యికలేదు కనుక. ఏమైనప్పటికీ స్త్రీలందరికీ ప్రేమ అనురాగాలను కొనసాగించటం అవసరం.

మీ వయస్సు పెరుగుతూ వున్న ಆದ್ಧಿ మీ శరీరంలో కలిగే మార్పులు మీ లైంగిక సంబంధాలపై ప్రభావం చూపించవచ్చు. సెక్సు సమయంలో మీరు వుద్రేకపూరితులు కావడానికి చాలా సమయం పట్టవచ్చును (ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది). ఎందుకంటే మీ శరీరం యింతకు ముందులా తగినంత ఈప్రోజన్ హార్మోనును తయారు చేయదు కనుక, మరియు మీ యోని పొడిగా అయిపోవటం వలన కూడా - ఇందువలననే పురుషునితో సెక్సు సంబంధం అసౌకర్యమవుతుంది. లేదా మీ యోని, మూత్ర వ్యవస్ధ తేలికగా ఇన్ఫెక్షన్ కు గురికావచ్చు.

మీ యోనిలోపలి చర్మం యింకా పలుచగా తయారవుతుంది కూడా. అందుచేత సెక్సు చేసే ముందు ఎక్కువ టైము తీసుకోవటం వలన మీ యోని తన సహజమైన తడిని తయారు చేసుకోగలదు. యోనిని తడిగా చేసుకోవటం కోసం వమ్మిని గాని, కార్న్ ఆయిలు, ఆలివ్ ఆయిలును గాని, నీటితో తయారుకాబడిన జారుడు పదార్ధాన్ని గాని వాడవచ్చు.

మీరు ఒక పురుషునితో సెక్సు కార్యం జరుపుతూ వుండి, అతని పురుషాంగం గట్టిపడకపోతే, అతనికేది యిష్టమో తెలుసుకొని అలా ప్రయత్నించండి. అతనిని స్పర్శించటం ద్వారా అతనిని వద్రేకపరచవచ్చు.

ముఖ్యమైన విషయాలు

 • మీరు గర్భనిరోధక తొడుగులను (కండోమ్స్) వాడుతూ వుంటే జారుడు పదార్థాలను (నూనెలు) వాడవదు. నూనెలు తొడుగులను బలహీనపరచవచ్చు. అవి పగిలిపోవచ్చును.
 • పెట్రోలియమ్ జెల్లీ (వాజలైన్నుగాని) సెంట్లు కలిసిన నూనెలను గాని మీ యోని యొక్క తడిని పెంచటానికి వాడవద్దు. ఇవి మీకు చికాకును కలిగించవచ్చు.
 • మీ యోనిని పొడిగా చేసుకోవటానికి ఏమీ వాడవదు. ఇవి కూడా మీకు చికాకును కలిగించి మీకు హెచ్.ఐ.వి లేక ఇతర ఇన్ఫెక్షన్లు రావటానికి కారణం అవుతాయి.
 • మూత్ర సంబంధమైన సమస్యలను నిరోధించటానికి, సంభోగానికి ముందుగా నీటినిగాని, పండ్లరసాన్ని గానిత్రాగితే, సంభోగం జరిగిన తర్వాత వీలైనంత తొందరగా మూత్ర విసర్జన జరపగలుగుతారు. ఇందువలన మూత్ర నాళం ద్వారా మూత్రాశయంలోనికి ప్రవేశించబడిన క్రిములు ఏమైనా వుంటే అవి బయటకి నెట్టబడతాయి. ఇన్ఫెక్షన్ రాకుండా సహాయపడుతుంది.

గర్భం రాకుండాను మరియు సెక్సు కారణంగా కలిగే ఇన్ఫెక్షన్స్ (ఎస్.టి.ఐ) నుంచి మిమ్మల్ని కాపాడుకోవటం

ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఒక పూర్తి సంవత్సర కాలం వరకూ కూడా మీరు గర్భం దాల్చగలరు. వద్దు అనుకొన్న గర్భాన్ని నిరోధించటం కొరకు మీ ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఒక సంవత్సర కాలం వరకూ, మీరు కుటుంబ నియంత్రణ పథకాన్ని ఆచరించాలి. మీరు కుటుంబ నియంత్రణ కోసం హార్మోనుల పథకాన్ని (టాబ్లెట్లు, ఇంజక్షన్ల లోపల పెట్టబడే సాధనాలు) ఆచరిసూ వుంటే మీకు 50 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వాటిని ఆపేయండి. హార్మోనుల సంబంధం లేని వేరొక కుటుంబ నియంత్రణ పద్ధతిని అవలంబించండి - మీ ఋతుస్రావం ఆగిన తర్వాత 12 నెలల వరకూ.

మీకుగాని మీ భాగస్వామికిగాని హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వంటి సెక్సు కారణంగా వచ్చే యిన్ఫెక్షన్లు (ఎస్.టి.ఐ) లేవన్న విషయం మీకు కరెక్టుగా తెలిసే వరకూ ప్రతి ఒకసారి సెక్సులో పాల్గొనేటపుడు కండోమ్ ను వాడండి - మీరు గర్భం దాల్చరన్న విషయం తెలిసినాసరే.

హుషారైన జీవితాన్ని గడపండి

av5.jpgమీరు వుండగలిగినంత హుషారుగా చురుకుగా మీ జీవితాన్ని గడిపేలా ప్రయత్నించండి. ఒక వ్యక్తి లేక మీకు సహాయపడే వస్తువు (ఎయిడ్) సాయంతో మీరు మీ కుటుంబంలోను మరియూ సమాజంలో కూడా చాలా చురుకైన పాత్రను వహించి మీకు యిష్టమైన పనులనెన్నింటినో సంతోషంగా చేయగలుగుతారు. మీ సమాజంలో తిరుగుతూ మిమ్మల్ని మీరు మానసికంగా, శారీరకంగా చురుకుగా వుండేలా చూసుకోండి.

పుస్తకాలు చదువుతునో, యితరులతో ఆటలాడుతున్నో మి మనసు వుల్లాసంగా వుండేలా చూసుకోండి. పేక, రాళ్లఅట, మాటలు తయారు చేయటం, చెస్ లేక మి కమ్యునిటిలో అందరికి తెలిసినటువంటి అటలూ ఆడటం వలన మీరు ఆనందపడే అవకాశంతోబాటు, యితరులతో గడపగల, మాట్లాడగల అవకాశం మీకు లభిస్తుంది. చిన్న పిల్లలకు చదవటానికి, స్కూలు పని హోమ్ వర్క్ చేసుకొనే విషయంలోను, మరియూ వారి కమ్యూనిటి యొక్క చరిత్ర తెలుసుకోవటానికి సహాయపడండి.

మీ జీవితానికి సరిపడినంత తెలివీ, అనుభవం మీకున్నాయి. కుటుంబాలతో, సంరక్షకులతో, మరియూ యితర పెద్దలతో కలిసి పని చేయడం వలన వృద్ధ వికలాంగ స్త్రీలు చాలా శక్తివంతులు కాగలుగుతారు.

క్రొత్త విషయాలను నేర్చుకునే సమయం

ఉగాండాలోని పల్లిసా జిల్లాకు చెందిన 'ఇమెల్లాకు 67 సం.ల వయసుంటుంది. ఈ మధ్యనే ఆమె ఒక ప్రపంచ ప్రాథమిక విద్యా ప్రోగ్రాములో చేరి, స్కూలుకు తిరిగి వెళ్లింది. ఇపుడు ఆమె ఇంగ్లీషులో చదవగలదు, రాయగలదు. స్కూలులోని విద్యార్థులు ఆమెను యిష్టపడతారు. ఆమెను గ్రాండ్ మామ్ అని పిలుస్తారు.

మార్పు కోసం కృషి

మీ వయసు పెరుగుదలతో బాటు, మీ అంగవైకల్యం కూడా ఎక్కువ అవుతూవున్నప్పటికీ, మీరు కొనసాగించగల కార్యకలాపాలను కనుగొని మీ సమాజంలో చాలా చురుకైన పాత్రను వహించాలి. మీ అనుభవమనే ధనంతో వికలాంగ స్త్రీల పరిస్థితులను మెరుగుపరచే ఎన్నో పనులను మీరు చేయగలుగుతారు.

వృద్ధులైన వికలాంగ స్త్రీలు చేయగల పనులు

 • వృద్ధ వికలాంగ వ్యక్తుల కోసం చాలా ప్రభుత్వాలు నెలసరి ఆదాయము, యిల్లు, ఆరోగ్య సంరక్షణ మొదలైన వసతులను కల్పిస్తున్నాయి. అలా మన ప్రభుత్వం చేయక పాయినట్లైతే, న్యాయ సూత్రాలను మార్చటం కోసం మనం యితర వికలాంగ స్త్రీలతో, మన తల్లులతో, అక్క చెల్లెళ్లతో, కూతుళ్లతో మరియు మన యిరుగు పొరుగు వారితో కలిసి కృషి చేయాలి. ఇటువంటి మార్పు రావటానికి చాలా సమయం పడుతుంది.
 • తక్కువ ఖర్చుతో జీవించే వికలాంగ స్త్రీల గ్రూప్లను నెలకొల్పి ఒకరి కొకరు సహాయం చేసుకొనేలా ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు: ఒక అంధ స్త్రీ ఒక బధిరురాలికి చెవులుగాను, ఒక బధిర స్త్రీకి ఒక అంధురాలికి కళ్లగానూ పనిచేయగలరు.
 • మనకు చాలా విలువైన జీవితానుభవాలున్నాయి. ఈ విలువైన సమాచారాన్ని మనం వికలాంగ యువతులూ, బాలికలతో పాలు పంచుకోగలం. బహుశః వారికి గల సమస్యలను పరిష్కరించటానికి మనం సహాయం చేయగలం. ఎందుకంటే మన యావన దశలో అవే సమస్యలు మనకి కూడా కలిగాయి కనుక.


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate