మీరు కావాలనుకున్నపుడు, మీరు కోరుకున్నంత మంది పిల్లల్ని మాత్రమే కనటాన్ని కుటుంబ నియంత్రణ అంటారు. పిల్లల్ని కనకుండా ఆగాలనుకున్నపుడు గర్భాన్ని నిరోధించటానికి ఎన్నుకొనే పద్ధతుల్నే కుటుంబ నియంత్రణ పద్ధతులు అని అంటారు.
స్త్రీలు తమకు తామే ఎపుడు సెక్స్లో పాల్గొనాలి, ఎపుడు పిల్లల్ని కనాలి అని నిర్ణయించుకోగలిగినపుడు, ఆరోగ్యంగా వుంటారు. ఈ నిర్ణయాలని స్త్రీలకే విడిచి పెట్టాలి. కుటుంబ నియంత్రణ విధానాలను పాటించే స్త్రీలు ఆ నిర్ణయాలు తెలివిగా చేసుకోగలుగుతారు కూడ.
కొన్ని కుటుంబ నియంత్రణ పద్ధతులకు ఇతర ప్రయోజనాలు కూడ వుంటాయి. ఉదాహరణకు
దురదృష్టవశాతూ ప్రపంచవ్యాప్తంగా చాల మంది స్త్రీలు కుటుంబ నియంత్రణ విధానాలు అందుబాటుగా లేక బాధపడుతున్నారు. అనేక కారణాల వల్ల ఇలా జరుగుతుంది. కుటుంబ నియంత్రణ అన్నది ఒక స్త్రీ ఆరోగ్యానికి ప్రమాదకరం అని కొందరు భావిస్తారు. లేదా కుటుంబ నియంత్రణ విధానాలను అవలంభించగలిగిన స్త్రీ తన భర్తకు ద్రోహం చేస్తుందని, పెళ్ళికి ముందే ఆమె సెక్స్ సంబంధాలు కలిగి వుండి వుండవచ్చని భావిస్తారు.
కొన్ని సందర్భాలలో మత సంబంధమైన ఆంక్షల వల్ల కుటుంబ నియంత్రణ ఆచరణకు అడ్డంకులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో స్త్రీలకు ఆ నిర్ణయాధికారం ఇవ్వటానికి ప్రభుత్వం ఇష్టపడదు.
అదే వికలాంగులైన స్త్రీలకు, కుటుంబ నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని పొందటానికి గాని, కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించటానికి గాని, కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించటానికి గాని అవకాశాలు చాల కష్టతరంగా వుంటాయి. ఆరోగ్య కార్యకర్తలతో సహా చాల మందికి ఒక గట్టి నమ్మకం, వికలాంగులైన స్త్రీలు సెక్స్లో పాల్గొనటానికి అనరులనీ, వారికి గర్భం ధరించే అవకాశాలే వుండవని. అందువలన వారికి ఆ సంబంధమైన సలహా గాని, సమాచారం గాని ఇవ్వరువారు.
ఈ అధ్యాయంలో వివిధ రకాల కుటుంబ నియంత్రణ పద్ధతులు సూచింపబడ్డాయి. అందులో మీకు అనుకూలమైన విధానాన్ని ఎన్నుకోవటం కూడ ఎలాగో తెలియపర్చబడింది.
మీరు ఏ రకమైన కుటుంబ నియంత్రణ పద్ధతిని ఉపయోగించాలని నిర్ణయించుకుంటారో, 188వ పేజీలోని ఛార్జ్లో ప్రతి పద్ధతి గురించి, అది ఎంత సమర్థవంతంగా గర్భాన్ని నిరోధిస్తుందో చూసి తెలుసుకోండి. ఈ క్రింది విషయాలను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి వుండవచ్చు మీకు.
కుటుంబ నియంత్రణ పద్ధతులు చాలా రకాలు అందుబాటుగా వున్న చోట స్త్రీలు ఈ క్రింది విషయాలను పరిగణనలోనికి తీసుకొని తమకు అనువైన విధానాన్ని ఎన్నుకోవటం జరుగుతుంది. ఉపయోగించటంలో సులువు, ఖరీదు, వారి శరీర స్థితి, వారు చేసే పని, తను తన భాగస్వామి ఇష్టపడేది. వానిలో కొన్ని రకాల సాధానాలు మీ కమ్యూనిటీలో అందుబాటుగా లేకున్నప్పటికీ, వాని గురించి తెలుసుకొని స్థానిక ఆరోగ్య కార్యకర్తతో వాటిని అందుబాటుగా తేవటానికి ప్రయత్నించటం గురించి మాట్లాడండి. మీరు వారికీ అవగాహనను పెంచగలుగవచ్చు!
ఫ్రీ ప్రతి నెలలోను కొన్ని సమయాలలో గర్భధారణకు అనువైన స్థితిలోను, కొన్ని సమయాలలో గర్భ ధారణకు ప్రతికూల స్థితిలోనూ వుండడం జరుగుతుంది. చాలా మంది స్త్రీలు ఒక్కో నెలలో ఒక్క అండాన్నే విడుదల చేస్తారు. అండం, స్త్రీ యొక్క అండాశయం నుంచి విడుదలవుతుంది. ఆ అండం 24 గంటలు (ఒక పగలు, ఒక రాత్రి) మాత్రం జీవించి వుంటుంది. అండాశయం నుంచి విడుదల అయిన తర్వాత, పురుషుడి వీర్యకణాలు, స్త్రీ శరీరంలో 2 రోజుల వరకు జీవించి వుంటాయి. ఆమె గర్భం ధరించవచ్చు.
కుటుంబ నియంత్రణ పద్ధతులు స్త్రీ యొక్క సాఫల్యస్థితిని మార్చి, విభిన్న మార్గాల ద్వారా గర్భాన్ని నిరోధిస్తాయి.
తర్వాత పేజీలో ఒక ఛార్డు వుంది. అందులో ఒక్కో పద్ధతి గర్భం రాకుండాను ఎంత సమర్థవంతంగా నిరోధిస్తుందో, ఇంకా సుఖవ్యాధుల బారిన పడకుండా ఎలా కాపాడుతుందో చూపబడింది. ఇంకా ఆ ఛార్డులో ఒక్కో పద్ధతి వల్ల సంభవించగల దుప్రభావాలను గురించి, ఇంకా మీ వైకల్యాన్ని ఆ పద్ధతి ఎలా ప్రభావితం చేస్తుందో, ముఖ్యమైన సమాచారం కూడా వుంటుంది. ప్రతి విధానానికి అది గర్భాన్ని ఎంతబాగా నిరోధిస్తుందో తెలియచెయ్యటానికి నక్షత్రాలు ఇవ్వబడ్డాయి. కొన్ని పద్ధతులకు, అవి గర్భనిరోధంలో బాగా పనిచేసేవే అయినా కొన్ని నక్షత్రాలే ఇవ్వబడ్డాయి. ఎందుకంటే అవి తరచు తప్పగానే వినియోగించటం జరుగుతుంది. ఒక స్త్రీ, పురుషుడు తాము సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి వారు ఎంచుకున్న పద్ధతిని సవ్యంగా అవలంభించినటైతే, ఆ పద్ధతి బాగా పనిచేయటం జరుగుతుంది.
బారియర్ పద్ధతులలో పురుషులకు కండోమ్, ఫ్రీలకు కండోమ్, డయాఫ్రమ్, సెర్వికల్ కాప్, స్పాంజ్ మరియు స్పెర్మిసైడ్ (వీర్య కణాలను నాశనం చేసేది)
పురుషుడు సెక్స్ సమయంలో తన అంగానికి తొడుక్కునే పల్చటి రబ్బరు సంచి కండోమ్. పురుషుడి వీర్యం ఈ సంచిలో వుండిపోవడం వలన స్త్రీ శరీరంలోనికి ప్రవేశించదు.
కొందరు పురుషులు దురదృష్ట వశాత్తు సెక్స్ సమయంలో కండోమ్ తొడుక్కోవటానికి ఇష్టపడరు. అది తమ లైంగిక ఆనందాన్ని తగ్గించి వేసే అడుగా భావిస్తారు వారు. ఇది సరైన అభిప్రాయం కాదు. ఎందుకంటే కండోమ్ వల్ల గర్భం రాకుండా నిరోధింపబడటమే కాకుండా, లైంగికపరంగా సంక్రమించే సుఖవ్యాధులను వ్యాప్తి చెందకుండా అడ్డుకోబడుతుంది.
జారుడు ద్రవం (లూబ్రికెంట్) వల్ల స్త్రీ, పురుషులిరువురికి కూడా సెక్స్ బాగా అనిపిస్తుంది. దానివల్ల కండోమ్ కూడా చినిగి పోకుండా వుంటుంది. అందుకోసం ఉమ్మ, స్పెర్మిసైడ్ లేక కె.వై., జెల్లీ వంటి నీటి మూలక జారుడు ద్రవాలను వాడాలి. వంట నూనెను, బేబీ ఆయిల్ను, మినరల్ ఆయిల్, పెట్రోలియం జెల్లీ, స్మిన్లోషన్, వెన్న లాంటి వాటిని వాడకూడదు. అవి కండోమ్ను చినిగిపోయేలా చేస్తాయి.
కండోమ్లోపలి వైపు కొనలో కొంచెం జారుడు ద్రవాన్ని వేయటం వల్ల అది అంగంపై సౌకర్యంగా వుంటుంది. కొంచెం జారుడు ద్రవాన్ని కండోమ్ పైన (బయటవైపు) కూడా రాయవచ్చు. దీనివలన పురుషుడి భాగస్వామి లైంగిక సంపర్కం సౌఖ్యవంతంగా వుంటుంది. చాలా సమర్థవంతమైన కండోమ్స్ లాటెక్స్తో గాని, పోలీయురిథేన్తోగాని తయారు చేయబడతాయి. గొర్రె చర్మంతో మాత్రం కాదు.
ఒక జంట సెక్స్లో పాల్గొనే ప్రతిసారి క్రొత్త కండోమ్నే ఉపయోగించాలి.
కండోమ్ నే కేవలం ఉపయోగించవచ్చు లేదా వేరే ఇతర కుటుంబ నియంత్రణ పద్ధతి అవలంభిసూ కూడ ఉపయోగించవచ్చు, స్త్రీల కండోమ్ తప్ప, కండోమ్లు చాల మందుల దుకాణాలలోను, మార్కెట్లలోను, ఆరోగ్య కేంద్రాలలోను, ఇంకా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ను నిరోధించే కార్యక్రమాలలోను లభిస్తాయి.
మీ చేతులు బాగా కదలగలుగుతుంటే, పురుషుడికి అంగంపై కండోమ్ను తొడగవచ్చు. మీరు సెక్స్లో పాల్గొనే ముందు మీకు ఇది ఎలా చేయాలో తెలుసు కొనేటందుకు సహాయపడుతుంది. ఈ విధంగా చేసి నేర్చుకోవచ్చు.
అంధులైన స్త్రీలకు లేక కంటి చూపు సరిగాలేని స్త్రీలకు గాని, ఒక పురుషుడి అంగంపై కండోమ్ ఎలా తొడగాలో నేర్చుకోవటం అన్నది చాల మంచి ఆలోచన. ఒక భాగస్వామితో సెక్స్లో పాల్గొన్నప్పడు మీ చేతిలో తడిమి చూడటం వలన కండోమ్ సరిగా వుందో లేదో తెలుసుకోవచ్చు. కండోమ్ యొక్క కొన చినిగి వుందేమో కూడా తెలుసుకోవచ్చును.
పురుషుడి కండోమ్ని ఉపయోగించే విధానం క్రొత్త కండోమ్ పొట్లంలో చుట్టి పెట్టి వుంటుంది. పొట్లాన్ని తెరిచే సమయంలో కండోమ్ చిరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. పొట్లం చినిగి వున్నా ఎండిపోయినా లేక కండోమ్ బిరుసుగానో లేక అంటుకుపోయినట్లుగా వుంటే దానిని వాడకూడదు. ఆ కండోమ్ పనికిరాదు. కండోమ్ తొడుగుకోవటానికి ముందుగా దాని మడతను విప్పవద్దు.
స్త్రీలు ఉపయోగించే కండోమ్ కూడ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ను, ఇంకా సుఖవ్యాధులకు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించకుండా అడ్డుకుంటుంది.
మీరు మరొక పద్ధతిని కూడా అవలంభించవచ్చు.
ఫ్రీల యొక్క కండోమ్ యోనిలోనికి సరిగా అమరి, జననాంగాల యొక్క బాహ్య అధరాలను కప్పి వుంచుతుంది. ఇది గర్భం రాకుండా ఆపటమే కాకుండా, సెక్స్ వల్ల వ్యాప్తిచెందే ఇన్ఫెక్షన్లను, మరియు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నుండి కూడ సంక్రమించకుండా కాపాడుతుంది. దురదృష్టవశాతూ, స్త్రీ కండోమ్ పురుష కండోమ్ కన్నా ఖరీదైనదే కాకుండా, అరుదుగా అందుబాటుగా వుంటుంది. స్త్రీ కండోమ్ను, పురుషుడి కండోమ్తో కూడ కలిపి ఉపయోగించకూడదు. ఇది పురుషుడు పైన, స్త్రీ క్రింద వుండే సెక్స్కు బాగా పని చేస్తుంది.
మీకు నిజంగా స్త్రీ కండోమ్ను ఉపయోగించాలని వుంటే, మీ వైకల్యం వల్ల అందుకోసం చాల కష్ట పడవలసి వస్తుంది. కూర్చుని, పడుకొని వేర్వేరు భంగిమలలో ప్రయత్నించండి, లేదా మరెవరినైనా గాని, మీ భాగస్వామిని గాని సహాయం కోసం అడగండి.
మీరు సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి ఒక క్రొత్త స్త్రీకండోమ్ను ఉపయోగించటం ఉత్తమం. ఒక వేళ మీకు క్రొత్తది అందుబాటులో లేనటైతే, పాతదానినే శుభ్రపరచుకొని 7 సార్ల వరకు తిరిగి ఉపయోగించుకోవచ్చు.
సెక్స్లో పాల్గొనే ముందు ఒక పెద్ద బ్లీచ్ని నీటితో కలిపి (క్లోరో, క్లోరాక్స్ మొలైనవి.) (ఒక భాగం పౌడరు లేదా 20 భాగాలు శుభ్రమైన నీటితో ద్రవ పరచాలి). బ్లీచ్ హెచ్.ఐ.విని నాశనం చేస్తుంది.
సెక్స్ పూర్తెన తర్వాత కండోమ్ను మీ యోని నుండి బయటకు తీసేయండి. పురుషుడి వీర్యం ఏ మాత్రం చిందకుండా జాగ్రత్తపడాలి తీసేటపుడు. వెంటనే కలిపిన బీచ్ ద్రవంలో సగం కండోమ్లో పోసేసి, నింపిన కండోమ్ను మిగతా బ్లీచ్ ద్రవంలో ముంచేయండి. కండోమ్ను 5 నిమిషాలపాటు ఆ ద్రవంలో నాననివ్వండి. కండోమ్ను, బ్లీచ్ ద్రవంలో పెట్టటానికి ముందు ఏ విధంగాను శుభ్రపరిచే ప్రయత్నం చేయకూడదు.
మీ చేతులను స్వల్ప స్వభావం గల సబ్బుతో కడుక్కోండి. సబ్బు నురగతో (మీ చేతులకున్న) బ్లీచ్, ఇంకేమైనా శరీరపు ద్రవాలు గాని, జారుడు ద్రవం (లూబ్రికెంట్) గాని వుంటే అదే కండోమ్, లోపల, బయట, లోపలి రింగుతో సహా కడిగేయండి. (కండోమ్ పై నేరుగా సబ్బుతో రుద్దకూడదు. అలా చేస్తే కండోమ్ చినిగి పోతుంది)
కండోమ్ బయట వైపు లోపలి వైపు, రింగుతో సహా సబ్బు నురగను, శుభ్రమైన నీటిని పోసి కడిగేయండి.
ఒక శుభ్రమైన బట్టతో కండోమ్ బయట, లోపల తుడిచేసి పొడిగా, గాలిలో ఆరిపోయేలా వుంచండి.
లైటు వెలుగుకు ఎదురుగా పట్టుకొని, కండోమ్కు రంధ్రాలున్నాయేమో చూడాలి ఎంత సూక్ష్మమైన రంధ్రం వున్నా సరే కండోమ్ను పడేయండి. క్రొత్త కండోమ్ను తెచ్చుకోండి. రంగులో తేడా వుంటే ఫర్వాలేదు. రంధ్రాలులేనటైతే, మళ్ళీ ఉపయోగించే వరకు శుభ్రమైన పొడిచోటులో పెట్టండి.
మళ్ళీ ఉపయోగించే ముందు కండోమ్ను నీటి మూలక జారుడు పదార్థంతో తడపండి. స్త్రీకండోమ్కు వెజెటబుల్ ఆయిల్ను ఉపయోగించవచ్చు. ఫిమేల్ కండోమ్ లాటెక్స్తో తయారు చేయనందువల్ల, కొన్ని ఆయిల్స్ ఉపయోగించవచ్చు. కాని పీనట్ ఆయిల్, వేరుశనగ నూనె, లోషన్లు వాడకూడదు. వాటిలో లెనోలిన్ గాని సెంటు గాని వుంటే ఎలర్జీ వస్తుంది చర్మానికి.
డయాఫ్రమ్, సెర్వికల్ క్యాప్ రెండూ కూడ లోనికి ఖాళీగా వుంటే, మెత్తని రబ్బరుతో చేసిన కప్పల్లాంటి సాధనాలు. వీటిని సెక్సులో పాల్గొనే సమయంలో యోనిలో ధరించే విధంగా అనుకూలంగా వుంటాయి. లైంగిక సంపర్కం తర్వాత అది మీ యోనిలో 6 గంటలు కనీసం వండితీరాలి. 24 గంటలు కూడ వదిలి నొప్పి కలుగుతుంటే. వేయవచ్చు అలా. (కాని అంతకు మించి వుండకూడదు).
డయాఫ్రమ్, కాప్ కూడ, ఇక స్పెర్మిసైడ్ జెల్లీ కాని, క్రీమ్ కాని కలిపి ఉపయోగించినట్లే, అక్కర్లేని గర్భాన్ని నిరోధించటానికి మంచి పద్ధతులే. కాని వీనిని సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి ఉపయోగించాలి. డయాఫ్రమ్లు, సెర్వికల్ కాప్లు వివిధ పరిమాణాలలో వుంటాయి. అనుభవం గల ఆరోగ్య కార్యకర్త మీ శరీరానికి ఏది సరిపోతుందో చూసి చెప్పగలదు. డయాఫ్రమ్, కాప్ కన్నా పెద్దది. కొందరు శరీర పరిమాణం చిన్నదిగా గల స్త్రీలు, తమకు కాప్ సరిగా సరిపోతుంది అంటారు. ప్రసవం తర్వాత గాని, మీ బరువులో ఎక్కువ, తక్కువ మార్పులు కలిగి నప్పడు గాని మీరు మీ డయాప్రమ్ యొక్క సైజును మార్చుకోవలసి వుంటుంది.
డయాఫ్రమ్ గాని, కాప్ గాని ఒక సంవత్సరం వరకు పనికి వస్తాయి. లైటు వెలుగుకు ఎదురుగా పట్టుకొని చూసి తరచు రంధ్రాలున్నాయేమో చూసుకోవాలి. ఎంత సూక్ష్మరంధ్రం వున్నా సరే దానిని పడేసి క్రొత్తది తెచ్చుకోవాలి. ఎందుకంటే పురుష వీర్యకణం ఆ రంధ్రం కన్నా సూక్ష్మంగా వుండి, ఆ రంధ్రం లోంచి బయటకు ప్రవేశించగలదు. ఉపయోగించిన తర్వాత, గోరు వెచ్చని సబ్బు నీటితో కడిగి, ఆరబెట్టాలి. డయాఫ్రమ్ను, కాప్ను ఒక శుభ్రమైన, పొడిగా వుండే చోట వుంచాలి.
ఈ పద్ధతులు ప్రతిచోట అందుబాటుగా లేవు. ఎక్కువ సంఖ్యలో స్త్రీలు గనుక, ఇవి కావాలని కోరినటైతే, కార్యక్రమాల ద్వారా ఈ సాధనాలను అందుబాటులోనికి తేవడం జరుగుతుంది.
మీరు వేరే రకం పద్ధతి అవలంభించవచ్చు
కుటుంబ నియంత్రణ స్పాంజ్, మెత్తని ప్లాస్టిక్తో, తయారు చేయబడి, స్పెర్మ్సైడ్ (నోనాక్సినాల్ -9)తో నింపబడి వుంటుంది. సెక్స్లో పాల్గొనటానికి ముందే ఆ స్పాంజ్ని మీ యోని లోపలికి బాగా తోసి పెట్టాలి. మీరు లైంగిక సంపర్కంలో మీ ఇష్టం వచ్చిన సార్లు పాల్గొనవచ్చును. వేరే స్పెర్మిసైడ్ ఉపయోగించనక్కర్లేకుండా, సెక్స్లో పాల్గొనవచ్చును. సెక్స్లో పాల్గొన్న తర్వాత అది మీ యోనిలో 6 గంటల పాటు వుండి తీరాలి. అంతే కాకుండా మీరు దానిని 24 గంటల వరకు వుంచవచ్చు (అంతకు మించి వంచకూడదు). చాల దేశాలలో ఆ స్పాంజ్ దొరకటం లేదు.
మీరు వేరే రకం పద్ధతిని అవలంభించవచ్చు. ఇలా వున్నటైతే.
మీరు వెనిగార్లో గాని, నిమ్మరసంలో గాని మంచిన స్పాంజ్ను కూడా ఉపయోగించవచ్చు. కాని ఈ పద్ధతి కాంట్రాసెప్టివ్ స్పాంజ్ అంత సమర్థవంతంగా పనిచేయదు. ఇది కూడ కొన్ని గర్భాలను నిరోధించగలదు. మరొక మార్గం ఏదీ అదుబాటుగా లేని సమయంలో ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు.
లేదా కాచిన 1 కపు శుభ్రమైన నీటిలో ఒక్క టేబిల్ స్పూన్ నిమ్మ రసం లేదా 4 స్పూన్ల కాచిన శుభ్రమైన నీటిలోనికి 1 స్పూన్ ఉప్ప కలపాలి.
స్పాంజ్ను బయటకు తీయటం చాల కష్టం కావచ్చు, కాని అది యోనిలోపల విడిచిపెట్టకూడదు. మీరు మరుగుదొడ్లో క్రింద కూర్చున్నట్లు కూర్చొంటే, ముక్కితే బయటకు అందేలా వస్తుంది. అపుడు మీరు యోనిలోనికి అందుకొని తీసి వేయవచ్చు. దానిని బయటకు తీయటంలో సమస్యగా అనిపించినటైతే, అటుపై నుండి ఒక శుభ్రమైన దారం గాని రిబ్బన్ గాని దాని చుటూ కట్టండి.
ఆ స్పాంజ్ని శుభ్రంగా కడిగేసి, ఉడకబెట్టి చాలా సార్లు అదే విధంగా ఉపయోగించవచ్చు. దానిని ఒక పొడిగా వున్న పరిశుభ్రమైన చోటులో వుంచాలి. ద్రవాన్ని కొంచెం ముందుగా తయారు చేసుక్రాని ఒక సీసాలో పోళ్లి వుంచుకోవచ్చు.
రెండు రకాల స్పాంజ్లలోను ఉపయోగించే ద్రవాలు యోని లోపల చర్మాన్ని రేపి మండేలా చేయవచ్చు. దీని వల్ల ఒక స్త్రీలో సుఖవ్యాధి సులభంగా సోకే ప్రమాదం వుంది. ఒక వేళ వానివల్ల మీ యోని పొడిబారి, దురద, మంట వంటివి కలిగితే ఈ పద్ధతులను ఉపయోగించటం మానివేయాలి.
స్పెర్మిసైడ్స్, ఫోమ్, మాత్రలు, క్రీము, జెల్లీరూపంలో వుంటాయి. లైంగిక సంపర్మానికి కొంచెం ముందుగా యోనిలో పెట్టబడతాయి. స్పెర్మిసైడ్, పురుష వీర్య కణాలను అవి గర్భాశయంలోనికి ప్రవేశించక ముందే నశింపచేస్తాయి. స్పెర్మిసైడ్ సుఖవ్యాధుల నుంచి గాని హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నుంచి గాని రక్షించలేదు. సెక్స్లో పాల్గొనటానికి 10 నుంచి 15 నిముషాల ముందు మాత్రలు యోనిలో ప్రవేశ పెట్టాలి. ఫోమ్, జెల్లీ, క్రీము - ఇవి యోనిలో ప్రవేశ పెడితే ఉత్తమంగా పనిచేస్తాయి. మీరు సెక్స్లో పాల్గొనే ప్రతిసారి స్పెర్మిసైడ్ను చేర్చండి. సెక్స్లో పాల్గొన్న తర్వాత కనీసం 6 గంటల వరకు స్పెర్మిసైడ్ను కడిగి వేయకుండా వుంచాలి. కొన్ని స్పెర్మిసైడ్లు యోనిలోపల చర్మాన్ని గాయపరచి దురదను కలుగచేస్తాయి. వీనిలో ఈ విధమైన ప్రభావాన్ని చూపేది ఫోమ్ ఒకటి. మీకు ఫోమ్ వల్ల చికాకు అనిపిస్తే, జెల్లీని గాని, క్రీమను గాని ఉపయోగించవచ్చు, దాని బదులుగా,
ఐ.యూ.డి, ఐ.యూ.సి.డి, కాపర్ టీ, లూప్
ఐయూడి అన్నది, ప్లాస్టిక్, రాగిలతో రెండు చిన్న తీగలు అతికి వున్న చిన్న పరికరం. ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త లేక మంత్రోసాని గర్భాశయంలో పెట్టే చిన్న పరికరం లేదా సాధనం ఇది. దీని దారాలు యోనిలోనికి వ్రేలాడుతూ వుంటాయి. లూప్ (ఐ.యూ.డి) పురుషుడి వీర్యకణాలు వెళ్ళి గ్రుడును ఫలదీకరణం చేయకుండా అడ్డుకుంటుంది. లూప్ను జాగ్రత్తగా వాడుకోవటానికి, మీరు యోనిలోని దారాలను రోజూ చూసుకోవటం మంచిది. మీ నెలసరి ప్రావం ఆగిపోయిన తర్వాత ఈ పని చేస్తే మంచిది. ఒక వేళ ఆ దారాలను మీ అంతట మీరు చూసుకోలేనటైతే చేతిలో, మీ భాగస్వామిని కాని, మరి ఎవరినైనాగాని సహాయం అడగండి.
లూప్ను లోపల 10 సం|రాల వరకు వదిలి వేయవచ్చు. ఇది అమర్పించుకున్న స్త్రీలు, క్రమబద్ధమైన పెల్విక్ పరీక్ష చేయించుకోవాలి. అది సరిగా వుందో లేదో తెలుసుకోవటానికి.
మీరు వేరే రకం పద్ధతి అవలంభించవచ్చు ఇలా వున్నటైతే .
మీరు లూప్ (ఐ.యూ.డి) పెట్టుకున్న మొదటి వారంలో మీకు స్వల్పంగా రక్తస్రావం కావచ్చు. కొందరు స్త్రీలకు అధికంగాను, ఎక్కువ రోజులు నొప్పితో కూడిన స్రావంకావచ్చుకూడ. కాని ఇది మామూలుగా మొదటి 3 నెలలు అవగానే ఆగిపోతుంది. మీకు ఐ.యూ.డి ఉపయోగించాలని అనిపిస్తే, శిక్షణ పొందిన ఒక ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఆ పద్ధతి మీకు సరిపోతుందో లేదో తెలుసుకోవటం కోసం.
ఒకరకం లూప్లో ప్రోజెస్టిన్ హార్మోన్ కూడ వుంటుంది. ఇది కొన్ని దేశాలలోనే దొరుకుతుంది. దీనిని ఉపయోగించటం వలన, రుతుస్రావం సమయంలో జరిగే రక్తస్రావం మొత్తాన్ని తగ్గిస్తుంది. ఇది గర్భం రాకుండా 5 సంవత్సరాల పాటు అడుగా నిలబడుతుంది. దురదృష్టవశాతూ ఇది మిగతా వానికన్నా ఖరీదైనది కావటంతో కొన్ని దేశాలకే పరిమితం అయిది అది. ఒక ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడి అది మీ కమ్యూనిటీలో దొరుకు తుందేమో తెలుసుకోండి.
హెచ్చరిక: మీరు గనుక ఐ.యూ.డి గనుక కలిగి వున్నటైతే, ఈ క్రింద చెప్పిన ప్రమాదకరమైన లక్షణాలలో ఏ ఒక్కటి వున్నా
స్త్రీ శరీరంలో సహజంగా తయారయ్యే రసాయన పదార్థాలే హార్మోను స్త్రీ శరీరంలో నెలవారీ ప్రావం, గర్భం ధరించగల సమర్థతతో పాటుగా చాలా భాగాలను క్రమంగా అదుపులోకి తెస్తాయి హార్మోన్లు. ఈ పద్ధతి అంతా వైకల్యం వున్నా లేకున్నా స్త్రీల అందరిలోను ఒకే విధంగా వుంటుంది. హార్మోన్ల పద్ధతితో పాటించే కుటుంబ నియంత్రణలో, అండాశయం గ్రుడును గర్భాశయంలోనికి విడుదల చేయకుండా ఆపటం ద్వారా గర్భం రాకుండా నిరోధించటం జరుగుతుంది. హార్మోన్ల పద్ధతుల వల్ల హెచ్.ఐ.వి/ఎయిడ్స్, ఇంకా ఇతర సుఖవ్యాధుల నుండి రక్షణ లభించదు.
ఈ క్రింది విధంగా వున్నటైతే మీరు ఏ హార్మోన్ల విధానాన్ని అవలంభించకూడదు.
చాలా వరకు కుటుంబ నియంత్రణ మాత్రలు, ఇంజక్షన్లు, ఒక స్త్రీ శరీరంలో సహజంగానే తయారయ్యే 2 రకాల హార్మోన్లను పోలినవే కలిగి వుంటాయి. ఈ హార్మోన్లను ఈ(స్తోజన్ (ఎథినైల్ ఈ స్తోడియోల్), మరియు ప్రొజెస్టిన్ (లెవెనార్జె సైప్). కొన్ని ఇంప్లాంట్స్, మాత్రలు, ఇంజక్షన్లు వలం ప్రొజెస్టిన్ను మాత్రమే కలిగి వుంటాయి.
క్రొత్త హార్మోన్ల పద్ధతులను ఇంకా కనుగొనే ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. కొన్ని క్రొత్త గర్భ నిరోధకాలలో పాచ్, ఒక రింగు (సెర్విక్స్పై ధరించేది) మరియు హార్మోన్తో కూడిన లూమ్.
హార్మోన్స్ పద్ధతులు స్త్రీకి ఈ రకం ఇబ్బందులను కలుగచేస్తాయి. ఈ రకమైన ప్రభావాలు సాధారణంగా, కొన్ని నెలల తర్వాత తగిపోతూ వుంటాయి. ఒక వేళ అలా తగకుండా వున్నటైతే, ఆ ఫ్రీ వేరే రకం కుటుంబ నియంత్రణ విధానాన్ని అవలంబించాలి.
కొన్ని సందర్భాలలో హార్మోన్ల పద్ధతి వల్ల కొన్ని దుష్పరిణామాలు కలుగుతూ వుంటాయి. ఈ పరిణామాలు ప్రమాదకరం కాకున్నప్పటికీ, తరచు అసౌకర్యాన్ని కలిగిసూ వుంటాయి.
మీరు కుటుంబ నియంత్రణ మాత్రలను గనుక వాడాలని నిర్ణయించుకున్నటైతే, మీరు తక్కువ మోతాదు మాత్రలను వాడాలి. అంటే మాత్రలో 35 మైక్రోగ్రాములు, అంతకన్నా తక్కువ ఈప్రోజెన్, 1 మిల్లీ గ్రాములేక అంతకంటే తక్కువ ప్రొజెస్టిన్ వున్న మాత్రలు. (తక్కువ మోతాదు మాత్రలు వేరు. మినీపిల్స్ వేరు. తక్కువ మోతాదు మాత్రలలో ఈప్రోజెన్, ప్రొజెస్టిన్ రెండు వుంటాయి. మినీపిల్స్లో ప్రొజెస్టిన్ మాత్రమే వుంటుంది) 50 మైక్రోగ్రామలకంటే ఈ(స్టోజెన్ను ఎపుడూ ఎక్కువ వాడకండి. చాల రకాల బ్రాండుల వేర్వేరు కుటుంబ నియంత్రణ మాత్రలున్నాయి.
మీరు ప్రతిరోజు ఒకే సమయంలో కుటుంబ నియంత్రణ మాత్రను వేసుకోవటం అన్నది వివిధ కుటుంబ నియంత్రణ మార్గాలలో ఒకటి. మీరు ఒక్క మాత్ర వేసుకోవటం మరచి పోయినా సరే గర్భం రావటానికి అవకాశం మరింత ఎక్కువ అవుతుంది? కుటుంబ నియంత్రణ మాత్రలు వేసుకుంటున్న స్త్రీలలో నెలవారీ బహిషులో ప్రావం స్వల్పంగా అవుతుందన్నది. ఒక నిబంధనగా వుంది. ప్రతి నెలా రక్తస్రావంతో అవస్తపడే స్త్రీలకు ఇదొక మంచి విషయం. మీకు మాత్రలు బ్రిమింగటంలో సమస్యగా వున్నటైతే పొడుం క్రింద నూరి ఏదో ఒక ద్రవంలో గాని, నీటిలో గాని కలుపుకొని బ్రిమింగేయొచ్చు. సులభంగా ప్ట్రాను కూడా ఉపయోగించవచ్చు.
మాత్రలు ప్యాకెట్లలో 21 లేక 28గా వస్తాయి. మొదటి మాత్రను ఒక ప్యాకెట్లో నుంచి తీసుకొని మీ బహిష్ణు మొదటి రోజు వేసుకోవాలి. ఒకవేళ అది సాధ్యం కానటైతే, మొదటి మాత్రను, మీ బాహిష్ణు ప్రారంభమైన 7 రోజుల లోగా ఏదో ఒకసారి వేసుకోండి. మీరు 21 - రోజుల ప్యాకెట్టయితే మీరు అక్కడ్నుంచి 21 రోజులు, రోజు 1 మాత్ర చొప్పననే వేసుకోండి. మీరు క్రొత్త ప్యాకెట్ను ప్రారంభించటానికి ముందు 7 రోజులు ఆగండి. సాధారణంగా మీ నెల వారీ స్రావం 21 రోజుల తర్వాత ప్రారంభం అవుతుంది. ఒకవేళ అలా బహిష్ణు రాకున్నా 7 రోజుల తర్వాత కొత్త ప్యాకెట్ను ప్రారంభించండి. మీరు 28 - రోజుల ప్యాకెట్టు వాడుతున్నటైతే, రోజు ఒక మాత్ర చొప్పన ప్రతిరోజు వేసుకోండి. మీరు ఒక ప్యాకెట్టు పూర్తి కాగానే కొత్త ప్యాకెట్టు ప్రారంభించండి.
మీరు మాత్ర తీసుకున్న 3 గంటలలోగా వాంతి చేసుకున్నటైతే, లేదా తీవ్రమైన విరేచనాలు మొదలైనా, మీరు తీసుకొన్న కుటుంబ నియంత్రణ మాత్ర బాగా పనిచేయటానికి, మీ శరీరంలో ఎక్కువ సేపు మిగిలి వుండదు. కండోమ్స్ను ఉపయోగించండి. లేదా సెక్స్లో పాల్గొనకండి, మీరు కుదుట పడి రోజుకు 1 చొప్పన 7 రోజులు మాత్రలు వేసుకొనే వరకు,
ఈ(స్తోజెన్, ప్రొజెస్టరాన్ రెండూ వున్న మాత్రలు 2 వారాల తర్వాత పనిచేసి గర్భాన్ని నిరోధిస్తాయి. మీరు బహిష్ణు మొదటి రోజున కనుక వాటిని తీసుకోవటం ప్రారంభించినటైతే, ప్రొజెస్టిన్ మాత్రమే గల మాత్రలు మొదటి నాలుగు వారాల వరకు గర్భాన్ని నిరోధించవు. అందువలన మీరు మరొక కుటుంబ నియంత్రణ విధానాన్ని అవలంభించాలి. లేకుంటే మీరు గర్భవతి అవుతారు.
హెచ్చరిక: మీరు మాత్రలు వాడుతూ, ఈ క్రింది లక్షణాలలో ఏ ఒకటి కనిపించినా వెంటనే వైద్య సలహా తీసుకోండి.
మీకు శరీరంలో గడ్డకట్టిన రక్తం వుండటం వలన, అది రకాన్ని మీ ఊపిరి తిత్తులకు, ఛాతికీ, మెదడుకు లేదా చేతికి లేదా కాలుకు ప్రసరించకుండా ఆపుతుంది.
ఈ పద్ధతి ద్వారా, ఆరోగ్య కార్యకర్త ఒక ఫ్రీకి గర్భం రాకుండా నిరోధించేటందుకు హార్మోన్ ఇంజక్షన్ ఇవ్వవచ్చు. ఒక ఇంజక్షన్ 1 నుంచి 8 నెలల వరకు పని చేస్తుంది. చాలా వరకు ఇంజక్షన్లలో కేవలం ప్రొజెస్టిన్ మాత్రమే వుంటుంది. డిపోప్రావెలా మరియు నోరిస్టెరాట్లు సాధారణమైన బ్రాండ్లు. ఈ ఇంజెక్షన్లు పిల్లలకు పాలిచ్చే తల్లలకు క్షేమంగా వుంటాయి. ఇంకా ఈ స్తోజెన్ ఉపయోగించకూడని స్త్రీలకు కూడా ఇవి మంచిది.
ఈ ఇంజెక్షన్లు చాల సమర్థవంతంగా పనిచేస్తాయి. అతి తక్కువ మంది స్త్రీలు గర్భం దాల్చటం జరిగింది. మరొక ప్రయోజనం ఏమిటంటే ఈ ఇంజెక్షన్ల వల్ల, సెక్స్లో పాల్గొనే ముందు ఏ విధమైనదీ చెయ్యనక్కర్లేదు. మీ ఆరోగ్య కార్యకర్తకు తప్ప మరెవరికీ మీరు కుటుంబ నియంత్రణ పాటిస్తున్న విషయం తెలియదు. ఈ పద్ధతిని అవలంబించినటైతే ప్రతి 1 నుండి 3 నెలలకు ఒకసారి మీ ఆరోగ్య కార్యకర్తను కలుస్తూ వుండాలి. మరొక ఇంజెక్షన్ తీసుకోవటం కోసం.
మీరు మొదటి ఇంజెక్షన్ తీసుకొన్న తర్వాత, మీరు క్రమబద్ధం SORO బహిష్ణును కలిగి వుంటారు. మధ్య మధ్యగా ఎక్కువగా బట్ట అవుతూ వుంటుంది. అపుడు మీకిక అసలు బహిష్టి రాకపోవచ్చు. ఇదేం ప్రమాదకరం కాదు. ఇంజెక్షన్లు తీసుకోవటం మానిన తర్వాత మామూలు కంటె ఎక్కువే (ఒక సంవత్సరం లేక అంతకన్నా ఎక్కువ) సమయం పడుతుంది గర్భధారణకు. అందువల్ల మీరు మరుసటి సంవత్సరం లేక ఇంకా ఎక్కువ SodO గర్భం వద్దనుకుంటే గనుక ఈ ఇంజెక్షన్డే ఉత్తమం. మూర్ఛ రోగం వున్న స్త్రీలు ఈ ఇంజెక్షన్లు తీసుకోవటం వల్ల కొంచెం మూర్చలు కలుగవచ్చు. మీరు ఇంజెక్షన్లను 6 నెలలకన్నా ఎక్కువ వాడితే కాలియం గల ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఎముకలు బలంగా వుండటానికి గర్భ నిరోధక ఇంజెక్షన్లు ఎక్కువ కాలం తీసుకుంటే ఎముకలు బలహీనమవుతాయి.
స్త్రీ దండకు లోపలి వైపు చర్మం క్రింద వుంచే 6 చిన్న మెత్తని ట్యూబుల్ని ఇంప్లాంట్స్ అంటారు. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త ఈ ఇంప్లాంట్స్ను స్త్రీ చేతి దండలోపల అమర్చగలడు. మనం అమర్చుకునే ఇంప్లాంట్స్ రకాన్నిబట్టి 3 నుంచి 5 సంవత్సరాలు గర్భం రాకుండా ఇవి ప్రభావితం చేస్తాయి. తర్వాత ఆ ఇంప్లాంట్ను తొలగించి, అవసరమనుకొంటే మరో క్రొత్త ఇంప్లాంట్ను అమర్పించుకోవాలి. లేదా మరో కుటుంబ నియంత్రణ విధానాన్ని అవలంబించాలి గర్భం వద్దనుకుంటే అంతకన్నా ముందే మీరు గర్భం కావాలనుకొంటే ఆరోగ్య కార్యకర్తచేత ఇంప్లాంట్ను తొలగించుకోవాలి.
ఇంప్లాంట్లను మీకు మీరు తొలగించలేరు. ఒక శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త మాత్రమే చేయాలి ఆపని. మీరు ఇంప్లాంట్లను ఉపయోగించాలని నిర్ణయించుకొన్నపుడు, ఇంప్లాంట్లను తొలగించటం కూడ వచ్చిన ఆరోగ్య కార్యకర్త దగ్గరకు మాత్రమే వెళ్ళండి.
ఇంప్లాంట్స్ వున్న స్త్రీ, సెక్స్లో పాల్గొనే ముందు, గర్భనిరోధన కోసం ఏమి చేయనక్కర్లేదు. ఇంప్లాంట్లలో కేవలం ప్రొజెస్టిన్ మాత్రమే వుంటుంది. అందువల్ల ఈప్రోజెన్ తీసుకోకూడని స్త్రీలకు అది క్షేమంగా వుంటుంది కూడా. పిల్లలకు పాలిచ్చే స్త్రీలు కూడా ఇంప్లాంట్లను వాడవచ్చు.
ఇంప్లాంట్ల వల్ల మొదటి నెలలో క్రమబద్ధం కాని బహిష్ణ (నెల మధ్యలోనే) రావటం లేదా రక్తస్రావం ఎక్కువ రోజులు కావటం కావచ్చు లేదా అసలు స్రావమే లేకుండా వుండవచ్చు. అందువల్ల మీకు గర్భం వచ్చిందని కాని, ఏదో తేడాగా వుందని కాని భయపడనక్కర్లేదు. మీ శరీరం అధిక ప్రొజెస్టిన్కు అలవాటు పడటం మొదలు పెట్టేక ఇవన్నీ వాటంతట అవే పోతాయి. క్రమబద్ధం కాని రక్తస్రావం మీకు సమస్యగా వుంటే, ఆరోగ్య కార్యకర్త మీకు తక్కువ మోతాదు గల కంబైండ్ (ఈప్రోజెన్, ప్రొజెస్టిన్ రెండూ గల) కుటుంబ నియంత్రణ మాత్రలను, కొన్ని నెలలు వాడటం కోసం ఇవ్వవచ్చు.
హెచ్చరిక: మీకు ఇంప్లాంట్ వున్నటైతే, వీటిలో ఏ క్షణం కనిపించినా వెంటనే వైద్య సహాయం పొందండి.
ప్రసవం తర్వాత మొదటి ఆరునెలలో, పిల్లలకు పాలిచ్చే చాల మంది స్త్రీలు అండకోశం నుండి అండం విడుదల చేయరు. అందువలన వారికి గర్భం ధరించే ప్రమాదం వుండదు, సెక్స్లో పాల్గొన్నాసరే.
స్త్రీలు సాధారణంగా పిల్లలకు పాలిచ్చేటపుడు గర్భవతులు కారు, ఇంకా
మీరు ఈ రకమైన కుటుంబ నియంత్రణను పాటించదల్చుకుంటే కనుక మీరు గుర్తు పెట్టుకోవాలి. మీ బిడ్డకు డబ్బాపాలు, నీళ్ళు, ఇతర ద్రవాలు ఇవ్వటం గాని, లేక మీ పాలను మీరే ఒక కప్పలోనికి తీసి చేతితో, మీ బిడ్డకు పట్టాలనుకున్నా సులభంగా మీకు గర్భం వస్తుంది. ఇంకా బిడ్డ పాలు తాగే సమయాల మధ్య 6 గంటల కన్నా ఎక్కువ సమయం వున్నా కూడ మీకు గర్భం వచ్చే అవకాశం వుంటుంది. 6 నెలల తర్వాత మీరు ముందు లాగే పాలిస్తున్నా కూడ మీకు గర్భం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా వుంటుంది. మీ రుతుస్రావం తిరిగి ప్రారంభం కావటానికి 2 వారాల ముందే మీరు గర్భవతి కావచ్చు. అందువల్ల ఏదైనా కుటుంబ నియంత్రణ విధానాన్ని అవలంబించటం కోసం, నెలసరి బహిష్ణు రావాలి అని ఎదురు చూడకండి. బిడ్డకు పాలిచ్చే పద్ధతి వల్ల హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గాని, ఇతర సుఖవ్యాధులు గాని రాకుండా నిరోధించబడవు.
ఇంకా బిడ్డకు పాలిచ్చే సమయంలో హెచ్.ఐ.వి సోకినటైతే, అది తల్లి నుండి బిడ్డకు వ్యాప్తి చెందే ప్రమాదం వుంది. మీ భాగస్వామికి హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వుంటే అవకాశం ఏ మాత్రం వున్నా ప్రతిసారి సెక్స్లో పాల్గొనేటనపుడు కండోమ్ను ఉపయోగించాలి.
సహజమైన కుటుంబ నియంత్రణ వల్ల ఏ మాత్రం ఖర్చుగాని, దుష్ఫలితాలు గాని వుండవు. కాని ఈ పద్ధతిని అనుసరించటం చాల కష్టం. స్త్రీలకు ఎల్లపుడూ తాము సాఫల్యత పొందే పరిస్థితిలో ఎపుడుంటారో తెలుసుకోవటం కష్టం కావచ్చు. వారు క్రమబద్ధం కాని ఒక్కరుతు చక్రంతోనైనా గర్భం పొందే అవకాశం వుంది సులభంగా, ఇవి క్రమబద్ధంగా వున్నటైతే ఈ పద్ధతులు మంచి ఫలితాలను ఇస్తాయి. అంటే మీ నెలసరి బహిష్ణు మొదటి రోజు నుండి తర్వాత నెల బహిష్ణు మొదటి రోజు వరకు వుండే సమయం, ప్రతి నెలా కూడ ఒకటే. అది కూడ కనీసం 26 రోజులు, మరియు 32 రోజుల కన్నా ఎక్కువ కాదు ఎట్టి పరిస్థితిలోను.
ఒక ఫ్రీకి తన అండాశయం నుండి విడుదలైన గ్రుడు, అండవాహికల ద్వారా గర్భాశయంలోకి చేరే సమయంలోనే గర్భం దాల్చే అవకాశం సుమారుగా నెలకు ఒకసారి వుంటుంది. సహజ కుటుంబ నియంత్రణను పాటించదల్చుకొంటే, మీ శరీర లక్షణాలను గమనించుకొని మీరు గర్భధారణకు ఎపుడు సిద్ధంగా వుంటారో తెలుసుకోవాలి. ఆ సమయంలో మీరు, మీ పద్ధతిని పాటించకుండా సెక్సులో పాల్గొనకూడదు. ఆ సమయాలలో, మీరు ఇతర రకాల సెక్స్లలో పాల్గొనవచ్చు, ఉదాహరణకు నోటిద్వారా సెక్స్ గాని, లైంగిక స్పర్శ లేదా మీరు కండోమ్స్ లేక డయాఫ్రమ్ ఉపయోగించి, ఆ సమయంలో గర్భాన్ని రాకుండా నిరోధించుకోవచ్చు.
సెక్స్లో పాల్గొనటంపై అదుపు లేని స్త్రీలకు సహజకుటుంబ నియంత్రణ ఉపయోగపడదు. మీరు గర్భం ధరించే అవకాశం వున్న సమయంలో, మీ భాగస్వామి కండోమ్లను లేదా డయాఫ్రమ్ ఉపయోగించి తీరాలి లేదా అసలు ఆ సమయంలో లైంగిక సంపర్కమే మానుకొని తీరాలి. జంటలు ఈ పద్ధతిని అవలంభించటానికి ముందు శిక్షణ తీసుకున్నపుడు మంచి ఫలితాలు కన్పిస్తాయి.
ఈ మధ్య కాలంలోనే ప్రసవం అయినా, గర్భస్రావం అయి వున్నా మీరు ఈ పద్ధతిని అవలంభించకండి. మీ రుతు చక్రాలు క్రమబద్ధం అయ్యేవరకు కొన్ని నెలలు ఈ పద్ధతికి దూరంగా వుండాలి. సహజ కుటుంబ నియంత్రణకు చాలా మార్గాలు వున్నాయి. ఈ పుస్తకంలో మనం మ్యూకస్ పద్ధతి గురించి, రోజులు లెక్కపెట్టడం గురించి చర్చించుకుందాం. ఈ పద్ధతుల రెండింటిని కలిపి ఉపయోగించినపుడు ఇవి బాగానే పని చేస్తాయి. అసలు లేకపోయేకంటె ఒక పద్ధతి అయినా మెరుగుగానే వుంటుంది. సహజ కుటుంబ నియంత్రణ వలన హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లేదా ఇతర రకాల సుఖవ్యాధుల నుండి రక్షణ దొరకదు.
మ్యూకస్ పద్దతిని ఉపయోగించటానికి, మీ యోనిలోని జిగురు లేక మ్యూకస్ను జాగ్రత్తగా గమనించాలి. గర్భధారణ దశలో వీర్యకణాలు గర్భాశయంలో ప్రవేశించటానికి సహాయపడేటందుకు, మీ శరీరం మ్యూకస్ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల మీరు రోజూ ఈ మ్యూకస్ని పరీక్షిస్తే మీకు గర్భధారణకు అనువుగా వున్న దశను గుర్తించగలుగుతారు. ఆ సమయంలో సెక్స్లో పాల్గొన కూడదు.
మ్యూకస్ను పరీక్షించటానికి మీ యోని బయట మీ శుభ్రమైన వ్రేలితో లేదా చిన్నపేపరు లేక గుడ్డముక్కతో తుడవండి. అపుడు మ్యూకస్ను చూడటం గాని, తాకి తెలుసుకోవటం కాని చేయండి.
రోజులను లెక్కించుకొనే పద్ధతిలో, ఆమె గర్భధారణకు అనుకూలంగా వుండే సమయం లెక్కించి చూసుకొని, ఆ సమయంలో సెక్స్లో పాల్గొనకుండా వుంటుంది ఆమె. ఈ పద్ధతి, రుతుచక్రం ప్రతి నెలా క్రమబద్ధంగా వుండే స్త్రీలకు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఒక నెల రుతుచక్రంలో మొదటి రోజు నుండి, తర్వాత నెలలో రుతుచక్రం మొదటి రోజు వరకు, రోజుల సంఖ్య సుమారుగా ఒకేవిధంగా వుంటుంది. అనగా ప్రతి రుతుచక్రంలో 26 రోజులు, ఇంకా 32 రోజులకు ఎక్కువ వుండవు.
మీకు గనుక, ఒక నెలలో రోజులు ఎక్కువగా వున్నటైతే మీరు సులభంగా గర్భం ధరించటం జరుగుతుంది. అనారోగ్యంగా వున్న స్త్రీకిగాని, ఎక్కువ ఒత్తిడికి గురయ్యే ఫ్రీలకు గాని రుతుచక్రాలలో రోజుల సంఖ్య భిన్నంగా వుంటుంది. అటువంటి సమయాలలో మీరు వేరే పద్ధతిని ఉపయోగించటం మంచింది. మీరు తిరిగి ఆరోగ్యం పొంది, రుతుచక్రం సరిఅయ్యే వరకు వేరే పద్ధతే మంచిది.
ఈ పద్ధతిలో ఫలితం బాగా వుండాలంటే, మీ రుతుచక్రంలో 8వ రోజు నుంచి 19వ రోజు వరకు సెక్స్లో పాల్గొనకుండా వండాలి. ఒక వేళ ఆ సమయంలో లైంగిక సంపర్కం కావాలనుకుంటే మీరు వేరే విధమైన కుటుంబ నియంత్రణ సాధనాన్ని ఉపయోగించి తీరాలి.
మీరు గర్భం ధరించటానికి అవకాశం గల రోజులను గుర్తించటానికి పూసలను లేదా ఒక ఛార్ట్ను లేక మరేదైనా సాధనాన్ని ఉపయోగించవచ్చు. మూడు రంగుల పూసలను 32 తీసుకొని ఒక తీగకు నెక్లేస్లా గుచ్చండి. అందులో ఒక్కో రంగు పూస, మీ రుతుచక్రంలో ఒక భాగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
మీ నెలసరి రక్తస్రావం మొదటి రోజున, ఒక రింగు కాని లేదా ఒక తీగ కాని ఎర్ర పూస చుటూ పెట్టండి. ఆ రింగును ప్రతి రోజు ఒక్కొక్క పూస మీదకు జరపాలి. ఆ రింగు తెల్లని పూసలలో దేని మీదకు వచ్చినా ఆ రోజులలో లైంగిక సంపర్కం జరిగినటైతే మీరు గర్భం ధరించవచ్చు అని అర్థం. మీ, తర్వాత నెల రుతుచక్రం ప్రారంభం కాగానే మళ్ళీ ఆ రింగును మొదటి ఎర్రపూస మీదకు జరిపివేయాలి.
పూసలు గల చక్రం (నెక్లేస్) కొనుక్కోవచ్చు మీరు.
రోజులు లెక్కపెట్టుకొనే పద్ధతిలో 32 భాగాలు గల ఛార్ట్ను తయారు చేసుకోవచ్చు. ఛార్ట్ను 32 భాగాలుండేలా తయారు చేసుకోవాలి. ఒక్కో భాగం ఒక్కోరోజును తయారు చేసుకోవాలి. ఛార్డులో ప్రతి రోజును గుర్తించాలి. అది చూసుకుంటే మీకు మీరు ఎపుడు గర్భధారణ చేయటానికి అరులో తెలుసూ వుంటుంది గుర్తుగా
గర్భధారణ జరుగకుండా వుండేలా అనేక మార్గాలున్నాయి సెక్స్లో, నోటి ద్వారా సెక్స్ (జననాంగాలపై నోరు), లైంగిక స్పర్శ (జననాంగాలను గాని శరీరంలో ఇతర భాగాలను గాని స్పర్శించటం) గాని శరీరంలో ఇతర భాగాలను గాని స్పర్శించటం. ఇవి రెండు లైంగిక కార్యకలాపాలతో అనేకమంది జంటలు ఆనందం పొందుతూ వుంటారు. ఎందుకంటే, అందువల్ల హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గాని ఇతర సుఖవ్యాధులు గాని వ్యాపించవు. అంతే కాకుండా గర్భధారణ జరిగే అవకాశమే వుండదు. మలద్వారం ద్వారా సెక్స్ వల్ల కూడ గర్భధారణ అయితే జరుగదు, కాని ఈ పద్ధతి ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్, ఇతర సుఖవ్యాధులు అతి సులభంగా వ్యాపిస్తాయి.
లైంగిక సంపర్కాన్ని ఏ విధంగాను కూడ వద్దనుకుని మానేస్తే, గర్భధారణ భయం వుండదు, ఆ పైన హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకుతాయేమోనన్న భయం కూడా వుండదు. కాని లైంగిక సంపర్కం లేకుండా ఎక్కువ కాలం వుండటం జంటలకు కష్టం కావచ్చు.
ఈ పద్ధతిలో వీర్య స్థలనం అయ్యేలాగా పురుషుడు తన అంగాన్ని స్త్రీ యోనిలో నుండి, ఆమె జననాంగా లకు దూరంగా తీసేస్తాడు. ఇందువల్ల వీర్యకణాలు యోనిలోపలికి ప్రవేశించకుండా వుంటాయి.
ఈ పద్ధతి, ఇంచు మించుగా బారియర్ (అడ్డు) పద్ధతులలాగానే పని చేస్తుంది బాగా, కాని ఇది అన్నిసారూ పనిచెయ్యదు, కొన్నిసార్లు వీర్యస్థలనం జరిగేలోగా పురుషుడు అంగాన్ని బయటకు తీయలేడు. సరైన సమయంలోనే అంగాన్ని బయటికి తీసినప్పటికీ కొంత వీర్యం వీర్యస్థలనానికి ముందే జూరి, ఆమెకు గర్భం రావచ్చు. సెక్స్కు ముందు మూత్ర విసర్జన చేయటం వలన ఈ పద్ధతి అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. స్పెర్మిసైడ్ లేక డయాఫ్రమ్తో కలిపి ఉపయోగించినట్లే ఫలితాన్నిస్తుంది అది.
ఒక పురుషుడు లేక ఫ్రీకి ఇంక పిల్లలు పుట్టటం దాదాపు అసాధ్యం చేసేందుకు కొన్ని ఆపరేషన్లు వున్నాయి. ఇక ఖచ్చితంగా తమకు పిల్లలు వద్దని నిర్ణయించుకున్న స్త్రీ పురుషులకు శాశ్వత ప్రాతిపదిక మీద చేసే ఆపరేషన్లవి. ఇవి వారికే తగినవి, మంచివి కూడా. ఈ ఆపరేషన్లకోసం ఆసుపత్రికి గాని, ఆరోగ్య కేంద్రానికి గాని వెళ్తే డాక్టరు లేక శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త కాని చెయ్యగలుగుతారు.
ఇందులో స్త్రీలకు చేసే ఆపరేషను, పురుషులకు చేసే ఆపరేషను కన్నా చాలా కష్టమైనది. ఈ ఆపరేషను వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి పురుషుడు ఎక్కువ తొందరగా కోలుకోగలుగుతాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు పురుషుడే ఆపరేషన్ చేయించుకుంటే మంచిది.
ఆరోగ్య కార్యకర్తగాని, డాక్టరు గాని పొత్తికడుపు మీద చిన్నగా కోసి, గర్భాశయానికి ఇక్క ఇక్కడ ఇరువైపుల వున్న ట్యూబులు లేక అండవాహికలలో చిన్న భాగాన్ని కత్తిరించటం చేస్తారు. అండాశయం నుండి గ్రుడును గర్భాశయానికి చేర్చే ఈ వాహికలను కత్తిరించటం వల్ల {R* వీర్య కణాలు, గ్రుడు అసలు కలిసె అవకాశం వుండదు. ఈ ఆపరేషన్ చేయటానికి సుమారు 30 నిముషాలు పడుతుంది. ఈ ఆపరేషన్ వల్ల స్త్రీ లైంగిక సామర్థ్యంలో గాని, ఆమె రుతుస్రావంలో గాని, ఆమె లైంగికంగా పొందే ఆనందంలో గాని ఏం మార్పూ వుండదు.
ఈ ఆపరేషను అయిన తరువాత కూడ గర్భధారణ జరిగే చిన్న అవకాశం వుంటుంది. అందువలన మీరు గర్భధారణకు సంబంధించిన లక్షణాలు ఏమైనా కనిపించినటైతే, ఆరోగ్య కార్యకర్తను కలవండి. మీకు గర్భధారణ వాహికల్లో అయినటైతే చాలా ప్రమాదం. అండవాహికల్లో గర్భధారణకు
అర్థం చేసుకోవటం, నేర్చుకోవటంలో సమస్యలు గల చాలా మంది స్త్రీలు, మంచి తల్లలుగా తమ పిల్లల సంరక్షణను చూసుకోవటం జరుగుతుంది. క్రొత్తగా తల్లలుగా మారిన మిగతా అందరి స్త్రీలలాగే వారికి కూడా తమ కుటుంబం యొక్క సహాయం అవసరం. కొన్ని సందర్భాలలో, అర్థం చేసుకోవటం లేదా తెలుసుకోవటం (నేర్చుకోవటం)లలో సమస్యలు గల స్త్రీలకు గర్భధారణ కలి అవకాశమే వుండకూడదని వారి కుటుంబాలు, ఆరోగ్య కార్యకర్తలు కూడా భావిస్తూ వుంటారు. ఇది చాల దురదృష్టకరం. ఆమెకు తెలియకుండానే, ఆ ఆపరేషన్ ఏమిటో, ఎందుకో కూడ చెప్పకుండానే, ఆమె అనుమతి లేకుండానే ఆమెకు స్టెరిలైజేషన్ చేయించాలని కూడ అనుకోవచ్చు. వారు, అది ఆమె ఆరోగ్యం గురించి, మంచి గురించే అలా చేసినా, అది ఆమె మానవ హక్కులను కాలరాసి ఉల్లంఘించటం, ఇంకా అది చాల తప్ప కూడా అలా చేయటం.
మీరు తెలుసుకోవటం లేదా అవగాహన చేసుకోవటంలో కష్టమైన సమస్య గల వారైతే, మీరు నిర్ణయించుకో వచ్చు స్టెరిలైజేషన్ చేయించుకోవాలని.
సెక్సులో పాల్గొనటం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలరా మీరు? కొన్ని సందర్భాలలో, ఒక పురుషుడు తనను ఎపుడు కేవలం లైంగిక అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడు, ఎపుడు తన సంరక్షణ చూస్తున్నాడు అన్న విషయాలు అర్థం చేసుకోలేని సమస్యను కలిగివుండవచ్చు ఒక స్త్రీ స్టెరిలైజేషన్ కేవలం గర్భధారణను నిరోధించగలదు. కాని అది శారీరకం గాను, భావోద్వేగంతోను మీరు లైంగిక వేధింపు వలన పడే బాధను అడ్డుకోలేదు. లైంగిక వేధింపు కారణంగా స్టెరిలైజేషన్ చేసుకోవాలన్నది మంచి నిర్ణయం కాదు. లైంగిక వేధింపుల గురించి మీరు ఏమి చేయగలరన్న విషయం గురించిన సమాచారం కోసం 14వ అధ్యాయం చూడండి.
మీరు కుటుంబ నియంత్రణను అవలంభించటం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలరా? కొన్ని సందర్భాలలో ఒక్కో స్త్రీ ఆమె రుతుచక్రంలో ఏ సమయంలో వున్నదీ గుర్తు తెచ్చుకోవటానికి కష్టపడు తుంది. లేదా కుటుంబ నియంత్రణ మాత్రలను వేసుకోవటం గాని డయాఫ్రమ్ను ఉపయోగించటం గాని మరచి పోతుంది. మీరు స్టెరిలైజేషన్ చేయించుకొన్నటైతే, అటువంటి వాటి గురించి విచారించనవసరం లేదు. కాని మీకు తర్వాత అంటే కొంతకాలం అయ్యేక పిల్లలు కావాలి అనుకున్నటైతే, దీర్ఘకాలిక కుటుంబ నియంత్రణ విధానాలు, ఉదాహరణకు ఇంప్లాంట్స్, ఇంజెక్షన్సు, లేదా లూప్ (ఐ.యూ.డి) వంటివి మంచి పద్ధతులు మీకు.
గర్భవతిగా వున్న సమయంలో మీ ఆరోగ్య సంరక్షణ బాగా చేసుకో గలుగుతారా? ఒక్కో స్త్రీ గర్భవతిగా వున్న సమయంలో ఆమె తీసుకొనే ఆహారం, ద్రవ పదార్థాలు కూడ కడుపులో వున్న శిశువుపై తమ ప్రభావం చూపుతాయని మర్చిపోవటం జరుగుతుంది. మంచి ఆహారం తీసుకోవటం, పొగత్రాగటానికి, మద్యపానం వంటివి సేవించటానికీ దూరంగా వుండడం, ఇతర మందులను వాడకపోవడం - వీటి వలన పుట్టుకతో వచ్చేలోపాలతో పాటు అనేక సమస్యలను నిరోధించవచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోవటం చాలా ముఖ్యం.
మీరు ఒక శిశువు లేక బిడ్డ యొక్క సంరక్షణ చేయగలరా? మీరు అలిసిపోయినా, అనారోగ్యంగా వున్నా ఎంత పని చేసుకోవలసి వున్నా తల్లిగా బిడ్డకోసం ఎంతో ఓర్పుతో, శ్రమతో కనిపెట్టుకు చూసుకోవలసి వుంటుందన్న విషయం కొన్ని సార్లు గుర్తుంచుకోవటం కూడా కష్టం.
మీరు రక్షిత సెక్స్ గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలరా? స్టెరిలైజేషన్ మిమ్మల్ని హెచ్.ఐ.వి / ఎయిడ్స్ నుండి కాని, ఇతర లైంగిక పరమైన సుఖవ్యాధుల నుంచి కాని కాపాడదు. మీరు స్టెరిలైజ్ చేయించుకున్నప్పటికీ మీరు రక్షిత సెక్స్లో పాల్గొనటం ముఖ్యం. ఎవరికైనా సరే చాల క్లిష్టమైన ప్రశ్నలను ఎదుర్కోవలసి వస్తుంది. సరైన సమాధానం ఇవ్వడానికి చాలా చర్చ అవసరం అవుతుంది మీకు.
స్టెరిలైజేషన్ ఆపరేషన్ అంటే ఏమిటన్నది మీరు మొదట అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం, అవసరం కూడ.
బీర్జాల నుండి అంగం వరకు వీర్యాన్ని తీసుకుపోయే నాళాలలో (ట్యూబుల్లో) కొంత పురుషుడి భాగాన్ని కత్తిరించే సామాన్యమైన ఆపరేషన్ను వేసెక్టమీ ఆపరేషన్ అంటారు. ఈ ఆపరేషన్ లో పురుషుడి బీర్గాలను కత్తిరించరు. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త వున్న ఏ కేంద్రంలోనైనా ఈ ఆపరేషన్ను చెయ్యవచ్చు. ఈ ఆపరేషన్ను చెయ్యటానికి కొద్ది నిముషాలు చాలు.
ఈ ఆపరేషన్ వల్ల పురుషుడి లైంగిక సామర్థ్యంలో గాని, అతడు పొందే లైంగిక ఆనందంలోగాని మార్పు వుండదు. అతనికి వీర్యస్థలనం వుంటుంది కాని, అందులో వీర్యకణాలు వుండవు. ఆపరేషను తర్వాత సుమారు 20 సార్లు వీర్యస్థలనం జరిగితే గాని పూర్తిగా వీర్య కణాలు పోవు. ఈ సమయంలో ఇంతకు ముందు మామూలుగా మీరు వాడుతున్న కుటుంబ నియంత్రణ పద్ధతినే ఉపయోగించండి.
అరక్షిత సెక్స్ లో పాల్గొన్న స్త్రీలు గర్భాన్ని నిరోధించటానికి ఉపయోగించే మార్గాలే అత్యవసర కుటుంబ నియంత్రణ పద్ధతులు. కొంత మంది స్త్రీలు ప్రతిరోజు గర్భనిరోధానికి వాడే మాత్రలే, అత్యవసర గర్భ నిరోధానికి కూడ వాడేవి. కాని అత్యవసర పరిస్థితిలో చాలా ఎక్కువ మోతాదును తక్కువ కాలం తీసుకోవలిసి వుంటుంది. ప్రస్తుతం కూడ ప్రత్యేకమైన అత్యవసర మాత్రలు లభిస్తున్నాయి. వీనిలో 1 లేక 2 మాత్రలలోనే ఎక్కువ మోతాదు గలవి వుంటాయి. ఈ అధిక మోతాదు మాత్రలు ఎలా పని చేస్తాయి అన్నది, ఆ సమయంలో మీరు మీ రుతుచక్రంలో వున్న స్థానాన్ని బట్టి వుంటుంది. దానిని అనుసరించే గర్భ నిరోధం జరుగుతుంది. ఈ మాత్రలు మిమ్మల్ని అండాశయం నుంచి గ్రుడును విడుదల చేయకుండా కూడ నిరోధించవచ్చు.
వీలైనంత త్వరగా తీసుకున్నటైతే ఈ మాత్రలు సమర్థవంతంగా పని చేస్తాయి. అంటే అరక్షిత సెక్స్లో పాల్గొన్న 5 రోజులలోగా ఈ మాత్రలను వేసుకోవాలి. అరక్షిత సెక్స్లో పాల్గొన్న తర్వాత ఎంత త్వరగా మీరు మాత్రలను వేసుకుంటే అంత త్వరగా అవి మిమ్మల్ని గర్భం రాకుండా కాపాడుతాయి.
అత్యవసర కుటుంబ నియంత్రణ అన్నది, గర్భస్రావం వంటిది మాత్రం కాదు. మీరు ఈ మాత్రలు వేసుకున్న సమయానికి ముందే మీరు గర్భం ధరించి వున్నటైతే, మీ గర్భం ఆగదు. గర్భస్థ శిశువుకు ఎటువంటి హాని కలుగదు కూడ. ఈ అత్యవసర కుటుంబ నియంత్రణ పద్ధతుల్ని ఇతర పద్ధతులకి బదులుగా ఉపయోగించకూడదు. మీరు సెక్స్ లో పాల్గొంటూ వుండి, గర్భం వద్దనుకుంటున్నటైతే 188వ పేజీ చూడండి.
మీకు మాత్రలు మింగటంలో సమస్యగ వున్నటైతే, మీకు వికారం, వాంతులు వంటి సమస్యలున్నా మాత్రలను యోనిలోపల పెట్టుకోండి. అవి శరీరం లోపలికి ఇంకి (పీల్చుకోబడి) పొతాయి.
గర్భాశయం లోపల అమర్చే లూప్ (ఐ.యూ.డి), అరక్షిత సెక్స్లో పాల్గొన్న అయిదు రోజులలోపు అమర్చినటైతే గర్భధారణ జరుగకుండా ఆపుతుంది. ఈ పద్ధతి మాత్రల కంటె సమర్థవంతంగా పనిచేస్తుంది. కాని ఈ పద్ధతిని ఫ్రీ తను క్రమపద్ధతిలో. రోజూ ఉపయోగించే పద్ధతిగా ఎన్నుకుంటేనే ఉపయోగించాలి.
స్థానిక ఆరోగ్య కార్యకర్తను కలిసి, అత్యవసర కుటుంబ నియంత్రణ అందుబాటుగా వుండటం స్త్రీలకు ఎంత ಮಿಖ್ಯಮ್ తెలియచేయాలి. వారితోను, స్థానికంగా వున్న మందుల దుకాణదారులతోను కలిసి కృషి చేసి, మీ కమ్యూనిటీలో కావాలనుకున్న ప్రతి స్త్రీకి కూడ అత్యవసర కుటుంబ నియంత్రణ విధానాలను (సాధనాలను) అందుబాటుగా వుండేలా చేయండి.
మీరు శరీరం క్రింది భాగం ఏ అనుభూతి లేకుండా మొదుబారి పోయి వున్న (వెన్నెముక గాయం వల్ల లేక పోలియో వల్ల కలిగిన పక్షవాతం) స్త్రీ అయి వుండి, గర్భం దాల్చటం ఇష్టం ಹೆನಿ వారైనటైతే ఇక్కడ కొన్ని మార్గదర్శకాలున్నాయి. మీరు వీనిలో నుండి మీకు ఇష్టమైన కుటుంబ నియంత్రణ పద్ధతిని ఎన్నుకోవచ్చు. (వీనిలో కొన్ని పద్ధతులు అన్ని కమ్యూనిటీలలోను అందుబాటుగా వుండకపోవచ్చు).
బారియర్ పద్ధతులు (పురుషుల కోసం కండోమ్, స్త్రీల కోసం కండోమ్, డయాఫ్రమ్, కాప్, స్పాంజ్ స్పెర్మిసైడ్). యోనిలోనికి అమర్చవలసిన పద్ధతుల సాధనాలకు మీకు సహాయం అవసరం కావచ్చు.
హార్మోన్ల పద్ధతులు (మాత్రలు, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్స్, లూపులు (ఐ.యూ.డి) హార్మోన్లతో కుడినవి) ఈ స్ట్రోజెన్ గల హార్మోన్ పద్ధతిని, మీరు " రోజూ చలాకీగా కదిలి తిరిగే వారైతే ఉపయోగించవచ్చు (మీ చక్రాల కుర్చీని మీరే తోసుకొనేవారు, మీ బండిని మీరే నడిపించుకొనేవారు, వ్యాయామం చేసేవారు, ఇల్లు తుడుచుకోవటం, తోటలో తవ్వటం వంటి ఇంటి పనులు చేసుకొనేవారు) అయినటైతే ఈ స్తోజెన్ను ఉపయోగించవచ్చు.
మీరు ఈ స్తోజెన్ గల హార్మోన్ పద్ధతిని వుపయోగించకూడదు. ఒకవేళ .
ఒకవేళ మీరు ఏదైనా గాయం వల్ల పెద్దయ్యాకనే పక్షవాతం వచ్చినటైతే, గాయం అయిన ఆరు నెలలు దాటే వరకు హార్మోన్ల పద్ధతులను ఉపయోగించకూడదు.
గర్భాశయంలో అమర్చే పరికరం (ఐ.యు.డి) ఐ.యూ.డి. వల్ల సాధారణంగా కలిగే సమస్యలు, అమర్చిన పరికరం బయటకు వచ్చేయటం, ఇన్ఫెక్షన్ కలగటం, నొప్పిని కలిగించటం వల్ల ఒక స్త్రీ తెలుసుకోగలుగుతుంది. ఏదో సమస్య ఏర్పడినట్లు, మీరు నొప్పి అనుభూతిని తెలుసుకోలేని వారైతే ఈ పద్ధతిని ఉపయోగించక పోవటం మంచిది. అయినప్పటికీ మీరు ఈ పద్ధతినే ఉపయోగించాలనుకుంటే, మీరు శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త చేత క్రమబద్ధంగా పరీక్షను చేయించుకోవటం చాలా అవసరం.
గర్భాన్ని తొలగించటం కోసం ఏమిచేసినా అదే గర్భస్రావం చేయటం అంటారు. అనుకోకుండా దానంతట అదే పోయే గర్భాన్ని గర్భస్రావం అయింది అంటారు.
గర్భస్రావం చేయించుకోవాలన్న నిర్ణయం ఎపుడూ కష్టమే. కొన్ని మతాలు గర్భస్రావాన్ని తప్పగా వ్యతిరేకిస్తాయి. కొన్ని దేశాలలో అది క్షేమమూ కాదు, చట్టబద్ధమూ కాదు. కాని ఒక ఫ్రీ గర్భస్రావం చేయించుకోవాలనుకోవటానికి అనేక కారణాలుంటాయి. ఒక స్త్రీ గర్భస్రావం చేయించుకోవటానికి కారణాలు
తమకు సహాయం, తోడ్పాటు వున్నా లేకున్నా బిడ్డ కావాలని అనుకుంటారు కొందరు స్త్రీలు. పుట్టబోయే బిడ్డకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వున్నా అంగవైకల్యం వున్నదని తెలిసినా కూడా వారు ఆ బిడ్డ కావాలని కోరుకుంటారు. చాలా మంది గర్భిణీ స్త్రీలు "నాకు ఈ బిడ్డ కావాలి' అంటారు. తర్వాత ఎదుర్కోవలసిన కష్టాలు ఏమైనా సరే సిద్ధపడతారు (39 సమస్యలకు మార్గాలు వెతకటానికి. కొందరు స్త్రీలు వారి జీవిత పరిస్థితుల్ని బట్టి, ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి, బిడ్డ కావాలని కోరుకోవటం తప్ప నిర్ణయంగా భావించి, గర్భస్రావం చేయించుకోవటానికి సిద్ధపడతారు. వారికి తమ బిడ్డ సంరక్షణలో తమకు సహాయంగాని, తోడ్పాటు గాని లభించదని తెలియటం వలన ఆ నిర్ణయం తీసుకొని వుండవచ్చు. లేదా వారికి శిశువుకు తీవ్రమైన ఆరోగ్య సమస్య లేక అంగవైకల్యం కలిగి వుంటుందని తెలియటం వల్ల కావచ్చు. లేదా వైకల్యం వున్నా లేకున్నా ఒక బిడ్డను కనిపెంచటం చాలా కష్టంగా భావించటం వల్ల కావచ్చు.
ఒక బిడ్డ కావాలని నిర్ణయించుకోవటం అన్నది వారి స్వవిషయంగా అందరు స్త్రీలు నిర్ణయించుకోవచ్చు. ఒక స్త్రీ, మీరు ఇష్టపడని పని ఏదైనా చేసినంత మాత్రాన, మీ నమ్మకాలను అనుసరించి మీరనుకున్నదే ఆమెపట్ల న్యాయంగా భావించకూడదు. మీరు, మిమ్మల్ని లేక మీ బిడ్డను ఇతరులు ఎలా ఆదరించాలని కోరుకుంటారో, అదే భావంతో ఆమెను ఆదరించండి.
ఒక ఫ్రీకి గర్భం అవసరం లేని పరిస్థితులు గనుక ఏర్పడితే, ఆమె సురక్షితమైన గర్భస్రావం ఏ ఆరోగ్య కేంద్రంలోనో, హాస్పిటల్లోనో చేయించుకొనే అవకాశం వండాలి. అలా వండాలి అంటే అది చట్టబద్ధమై వుండాలి. ఒక శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తచే పరిశుభ్రమైన వాతావరణంలో ఉడకబెట్టిన పరికరాలతో జరిగే గర్భస్రావం వల్ల ఆమెకు భవిష్యత్తులో గర్భాలకు హానికరం కాకుండా వుంటుంది. గర్భం తొలిదశలోనే గర్భస్రావం చేయటం క్షేమదాయకం. సురక్షిత్రమైన 3 రకాల గర్భస్రావాలు వున్నాయి. వాక్యూమమ్ ఏస్టిరేషన్ ఒక ఆరోగ్య కార్యకర్త ఒక మెషీన్ లేదా మాన్యువల్ వాక్యూమ్ ఏస్టిరేషన్ (ఎమ్.వి.ఎ) సిరంజ్ను ఉపయోగించి గర్భాశయాన్ని ఖాళి చేయటం ద్వారా గర్భాన్ని తొలగించటం జరుగుతుంది. వాక్యూమ్ ఏస్పిరేషన్ సవ్యంగా చేసినటైతే అది సాధారణంగా సురక్షిత్రంగానే జరుగుతుంది.
గీకటం ద్వారా గర్భస్రావం (డైలటేషన్ అండ్ క్యూరటైజ్, లేక డి అండ్ సి) ఒక ఆరోగ్య కార్యకర్త ఉడికించిన (స్టెరైల్) ఒక పరికరంతో గర్భాశయాన్నిగీకటం (చెక్కటం) ద్వారా గర్భస్రావం చేయటం జరుగుతుంది. ఒక స్త్రీ 3 కన్నా ఎక్కువ డి అండ్ సి గర్భస్రావాలను చేయించుకున్నటైతే ఆమెకు గర్భకోశంపై మాడిన పొర (స్మార్ టిష్యూ) ఏర్పడుతుంది. దీని వలన ఆమెకు తర్వాత గర్భం కష్టం అవుతుంది.
మండులతో గర్భస్రావం (మెడికల్ అబార్షన్) ఫ్రీ తన గర్భాశయం ఖాళీ మందులు తీసుకోవటం వల్ల గర్భస్రావం అవుతుంది. ఒక అనుభవం గల ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడి గర్భస్రావం కోసం ఏ మందులు తీసుకోవటం వల్ల గర్భస్రావం అవుతుంది. ఒక అనుభవం గల ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడి గర్భస్రావం కోసం ఏ మందులు సమర్థవంతమైనవో, సురక్షితమైనవో తెలుసుకొని అవే ఉపయోగించాలి.
గర్భస్రావం చట్టబద్ధం కాని చోట్ల ఒక స్త్రీ అకర్లేని గర్భాన్ని వదిలించు కోవటానికి తనకుతాను హానిచేసుకుంటుంది. లేదా అరక్షిత్ర వాలు చేసే శక్తిని కోల్పోవటం వంటివే కాకుండా మరణానికి ప్రధాన కారణం కూడా అవుతుంది తరచు,
అంగవైకల్యం గల స్త్రీలు, మిగిలిన స్త్రీలతోను, పురుషులతోను కలిసి కృషి చేసినటైతే, గర్భస్రావాలను సురక్షిత్రం, వ్యక్టు అయ్యేలా చేసి, మీ కమ్యూనిటీలలో స్త్రిలందరికి అందుబాటుగా తేవాలి. తద్వారా తరచు అరక్షిత గర్భస్రావం వలన కలిగే మరణాలను నివారించవచ్చు.
అంగవైకల్యం గల స్త్రీలు మిగిలిన స్త్రిలతోను పురుషులతోను కలిసి కృషి చేసినట్లైతే గర్భస్రావాలను సురక్షితం, చట్టబద్ధం అయ్యేలా చేసి మీ కమ్యూనిటిలలో వలన కలగే మరణాలను నివారించవచ్చు.
మీకు సురక్షిత లేక అరక్షిత గర్భస్రావం అయివున్నటైతే గతంలో, ఇంకా మీరు అటు తర్వాత ఇన్ఫెక్షన్తో గాని, అధిక రక్తస్రావంతో గాని అనారోగ్యం పాలై వుంటే గనుక, మీ గర్భాశయంలో మాడిన (కాలిన లాంటి) నల్లని పొరలు వుండి వుంటాయి. వాని వల్ల మరొక గర్భానికి గ్రాని.ప్రసవానికి గాని హాని కలుగవచ్చు. మీరు ఇపడు గర్భిణీగా వున్నటైతే మీరు హాస్పిటల్ దగ్గర కాని ఆరోగ్య కేంద్రం దగ్గర కాని బిడ్డకు జన్మనిచ్చినటైతే మీకు బహుశా అది రక్షణ కావచ్చు. ఒక ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడండి ఈ విషయం గురించి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020