ఏ స్త్రీ అయినా నిరాదరణకు గురికావచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది స్త్రీలు తెలిసినవారి వల్ల, తెలియని వారివల్ల కూడా నిరాదరణకు గురి అవుతున్నారు. వారిని కొట్టి శారీరకంగా హింసించటం, మానభంగానికి గురి చేయటం, సిగ్గుపడేలా అవమానించటం, లైంగిక దాడులు చేయటం, గాయపరచటం లేదా ఇతరత్రా వేధింపులకు గురిచేయటం, ఇంకా చంపేయటం కూడా చేస్తున్నారు. చాలా సందర్భాలలో స్త్రీలు వారు పడిన బాధల గురించి కాని, పొందిన అవమానాల గురించి కాని ఎవరికీ పైకి చెప్పకోరు. వారు తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే అవమానంగా భావిస్తారు. భయపడతారు కూడా. తమ గురించి చెప్పకున్నా ఎవరూ పట్టించుకోరనీ, పైపెచ్చు జరిగిన దానికి తమనే నిందిస్తారని భావిస్తారు.
చాలా మంది స్త్రీలు, వారు తమను నిరాదరణకు గురిచేస్తున్న వ్యక్తి కన్నా బలహీనులు కావటం వలన లేక వారు ఒంటరి వారు కావటం వలన, లేదా శక్తి హీనత వల్ల, ఈ అన్యాయానికి గురికావటం జరుగుతుంది. అంగవైకల్యం గల స్త్రీలు, ఇతర స్త్రీలకన్నా ఎక్కువగా నిరాదరణకు గురి అయ్యే అవకాశాలుంటాయి. వారిపై జరిగే లైంగిక దాడులు, శారీరకంగా జరిగే దాడులూ, గాయపరచటం మొదలైనవి అధికంగా జరుగుతూ వుంటాయి. వారిని బలహీనులుగా గుర్తించటమే కాకుండా, ఏ ప్రాముఖ్యం లేని వృధా వ్యక్తులుగా భావిస్తారు కూడా. ఒక ఫ్రీ యొక్క వైకల్యం వల్ల హింస, నిర్లక్ష్యం, నిరాదరణకలుగవు, సరే. కాని వికలాంగులైన స్త్రీలు కూడా, తమ క్షేమం కోరే వారితోను, తమను ఆదరించేవ్యక్తులతోను కలిసి జీవించే అర్హత కలిగి వుంటారు.
ఒక వికలాంగురాలైన స్త్రీ లేక బాలిక, స్త్రీల వల్లగాని, పురుషుల వల్లగాని, లేక తనకుటుంబ సభ్యుల వల్ల గాని, తన భర్త లేక భాగస్వామి వలన గాని, ఇంట్లోని ఇతర వ్యక్తుల వలన గాని, తన సంరక్షకుల వలన గాని నిరాదరణకు గురి కావచ్చు. ఇంకా ఆమె, ఇరుగు పొరుగు వారిని వలన కాని, కుటుంబ మిత్రులవల్లగాని, యజమాని వలన గాని, తోటి పనివారి వలన గాని, లేదా ఒక అపరిచితుడి వలన గాని నిరాదరణకు గురికావచ్చు. ఆమె దినసరి కార్యకలాపాలలో సహాయ పడే వ్యక్తి, తనకు పరిచయం అయిన వ్యక్తి అయితే అతడు/ఆమె వల్ల నిరాదరణ పొందినటైతే, ఆమెకు తన బాధ వ్యక్తం చేసుకోవటానికి మరో దిక్కులేనట్లు బాధ పడవలసి వస్తుంది. కాని ఒక స్త్రీ తనకు జరిగిన అన్యాయం గురించి మౌనంగా వుండిపోయినటైతే, ఆమె మరింత అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఆమె విశ్వసించే వ్యక్తి దగ్గరకు చేరినటైతే ఆమెకు మేలు జరుగుతుంది. ఆమెకు హింసను ప్రతిఘటించే సహాయం, మద్దతు లభిస్తాయి.
ఏ స్త్రీ విషయంలో కూడా నిరాదరణ, హింస హర్షించదగినవి కావు. వికలాంగ స్త్రీలకు సాధారణంగా ఆదరణ కరవు కావటం వలన, వారు రక్షణ పొందగల అర్హత లేని వారిలా చూడబడతారు తరచు. ఈ రకమైన వాతావరణం వలన, వికలాంగ స్త్రీల పట్ల నిరాదరణ కనబరచటం అన్నది ఒక సమస్యలాగే అనిపించదు ఎవరికీ, ఇంకా వారు రక్షణకు అనరులుగా కూడా భావించబడతారు.
యదార్ధం: వికలంగురాలైన ఒక బాలికల వలెనే రక్షణ పాందే హక్కు వుంది. ఎవరికీ కూడ నిరాదరణకు గురికావటం అన్నది ‘అదృష్టం’ కాజాలదు.
యదార్థం: ఒక వికలాంగ స్త్రీని నిరాదరణకు గురిచేయటం అన్నది హర్షించదగిన విషయం కాదు. ఎవ్వరూ కూడా దూషణ, నిరాదరణలకు గురికాకుండదు. ముఖ్యంగా తెలుసుకోవటం, నేర్చుకోవటం రాని వైకల్యం గల ఫ్రీలు నిరాదరింపబడకూడదు. ఏ రూపంగా వున్న నిరాదరణ అయినా సరే ఆపివేయాలి. ఉదాహ రణకు: నిర్లక్ష్యం, భావోద్వేగంతో కూడిన నిరాదరణ, సంరక్షణ చూపకపోవటం, ఆమెను పాఠశాలకు వెళ్ళకుండా చేయటం, ఆమెను సంప్రదించకుండా ఆమె కోసం నిర్ణయాలు తీసుకోవటం, శారీరక హింస, లైంగిక హింస మొదలైనవి.
చాలా మంది నిరాదరణ అనగానే, ఒక వ్యక్తి నిరాదరణకు గురైనట్లు వినగానే, వారు ఎవరో హింసకు గురైనట్లు, కొట్టబడినట్లు భావిస్తారు. గాయపడటం, దెబ్బతినటం, మానభంగానికి గురవ్వటం, లైంగికంగా దాడికి గురికావటం, లేదా చంపివేయబడటం మొదలైనవి. కాని వికలాంగులైన స్త్రీలు ఈ విధమైన హింసలన్నింటికీ, శారీరక హింసే కాకుండా, మిగతా, అన్ని రకాల నిరాదరణ పాలుకావటానికి కూడా ఎక్కువ అవకాశం కలిగి వుంటారు. ఉదాహరణకు, తమ సంరక్షణ చేసే వ్యక్తియొక్క నిరాదరణ వారిపట్ల అవమానకరంగా, సిగ్గుపడేలా చేస్తుంది వికలాంగులైన స్త్రీలను. ఉదాహరణకు ఆహారం, నీరు, మందులు ఇవ్వకపోవటం, తడిసిన దుస్తులను మార్చకుండా ఎక్కువ సమయం వదిలేయటం, మాసిన దుస్తులు మార్చకపోవటం, వారికి అవసరమైన సంరక్షణనివ్వకపోవటం వంటివి. కొందరైతే వారిచే సంరక్షణకు బదులుగా, వికలాంగ స్త్రీలను తమ లైంగిక కోరికలు తీర్చమని బలవంత పెడతారు కూడా. వికలాంగులైన కొందరు స్త్రీలు, బాలికలు ఇల్లుదాటి బయటకు వెళ్ళటానికి కూడా నోచుకోరు. వారిని బయటకు వెళ్ళనివ్వరు. ఇతరులతో మాట్లాడనివ్వరు కూడా. మిగతా వారిని ఒంటరిగా పడేసి వెలేసినట్లు వుండటం లేదా ఇతర విధాలలో నిరాదరించటం చేసూ వుంటారు.
ఒక వికలాంగ స్త్రీ మరొక వికలాంగ వ్యక్తి వల్లే నిరాదరణకు గురై బాధపడవచ్చు. ఒక వికలాంగ వ్యక్తి తన వైకల్యం వలన తనను తక్కువగా భావించుకొని, ఆ బాధ కోపం తన భాగస్వామిని కొట్టటం, హింసించటం ద్వారా తీరుచుకోవటం జరుగుతుంది. శారీరక నిరాదరణ - ఇంకా ఇతర రకాల నిరాదరణ మరియు హింసల వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. తరచు నిరాదరణకు గురయ్యే ఫ్రీలు విచారానికి, భయానికి లోనవుతారు. ఒక్కోసారి నిరాశా నిస్పృహలలో కృంగి పోతారు. ఒక ఫ్రీకి నిరాదరణ వల్ల గాయమైతే ఎలా నయం కావాలో, అలాగే వారి మనసు, ఆత్మ కూడా కోలుకోవాలి పడిన బాధ నుండి.
ఒక వికలాంగ స్త్రీని ఎవరైనా అవమానించినపుడు, బెదిరించినపుడు, ఆమెను భయపెట్టినపుడు, వెలివేసినట్లు నిరాదరించినపుడు, లేదా ఆమెను ఎందుకూ పనికిరాని వ్యక్తిగా ఎవరితో సంబంధం లేకుండా, ఒంటరిని చేసి బాధించినపుడు, ఆమె భావోద్వేగంతో చాలా బాధపడడం జరుగుతుంది. కొందరయితే వికలాంగ స్త్రీలను గురించి చాలా నిర్ణయగా మాట్లాడతారు. వారు ఒక భారంగా తయారయ్యారని, వారికి బ్రతికే అర్హత ఏమాత్రం లేదని, చనిపోతే మంచిదని అంటారు.
ఇలా చేయటం వలన కూడ భావోద్వేగంతో కూడిన వేధింపును అనుభవిస్తారు.
మానసికంగా బాధించే నిరాదరణ, ఒక వికలాంగురాలైన స్త్రీ యొక్క శక్తిని హరించి బలహీనపరుస్తుంది. వెలివేయబడినట్లు చూడబడుతున్న స్త్రీ తన స్థానాన్ని చోటును సమాజంలో కోల్పోయినట్లుగా భావిస్తుంది ఆమె. ఆమెకు దిగులుగా వుండటం, నీరసపడటం సులభం కావచ్చు ఆమెకు.
ఒక స్త్రీని ఎల్లపుడూ తిడుతూ వుండటం వల్ల, అవమానిసూ వుండటం వల్ల, ఆమె తెలివి తక్కువగాను, విచారంగాను వుండటం మొదలవుతుంది. ఇంకా ఎవరైనా ఆమెను, తన స్నేహితుల ఎదుట గాని ఇరుగు పొరుగు ఎదుట గాని ఎగతాళి చేసి అవమానించినటైతే, ఆమె సిగ్గుతో ముడుచుకొని, ఇక బయటకు వెళ్ళటానికి ఆమె ఇష్టపడదు. అటు తర్వాత కూడా ఆమెకు తను పనికి వచ్చే పని ఏదీ చెయ్యలేకపోతున్నానన్న చిన్నతనం చోటు చేసుకుంటుంది ఆమె మనసులో, తరచూ భావోద్వేగంతో బాధపడేలా నిరాదరింపబడే ఫ్రీకి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏర్పడి నిరాశా, నిస్పృహలకు గురికావటం జరుగుతుంది. మరింత సమాచారం కోసం 'మానసిక ఆరోగ్యం' పుస్తకంలో 3వ అధ్యాయం చూడండి.
కొన్ని సందర్భాలలో కొందరు అంగవైకల్యం గల వ్యక్తిని, అతడి బాగోగులు చూడమని తిరస్కరించి నామోషీగా భావించి గాని, లేక ఆ పిల్లవాడికి (బిడ్డకు) తగిన సంరక్షణను ఇవ్వలేమన్న అపనమ్మకంతో గాని ఆ పిల్లవాడిని అనాధను చేయటం జరుగుతుంది. ఒక స్త్రీని, ఆమె శరీరంలోని అసాధారణ మార్పుల కారణంగా అలా అంగీకరించలేక, ఆమె భర్త లేక కుటుంబం ఆమెను వదిలి వేయటం.
చాలా మంది అంగ వైకల్యం గల స్త్రీలు, తమ కుటుంబ సభ్యులచే దూరం చేయబడి, తరచు తమ బంధువుల ఇళ్ళకు చేరుతూ వుంటారు. వేరే దారిలేక, అక్కడ వారి ప్రవర్తన మరీ బాధిస్తుంది. ఆ కుటుంబంలో చాలా పని చేయవలసింది వుండిపోయినా, లేక వారు అప్పటికే పేద వారైవున్నా వికలాంగులైన స్త్రీలు వారికి భారంగా అనిపిస్తారు. తరచు వారు దురదృష్టానికి అంగవైకల్యం గల స్త్రీలనే, (ముఖ్యంగా వారు పిల్లలు గలవారైతే) నిందిసూ వుంటారు.
ఒక అంగవైకల్యం గల స్త్రీని ఒంటరిగా ఒక గదిలో వుంచటం అంతహీనమైన నిరాదరణ మరొకటి లేదు.
సమాజంలో వికలాంగులకు గౌరవం ఇవ్వనంత కాలం, వారిని కుటుంబాల నుంచి వేరు చేస్తున్నంత కాలం, ఒక - వైకల్యం గల స్త్రీని గాని, బాలికను గాని కలిగి వుండటానికి నామోషీగా భావించుకోవటం మానరు. ఇతరులు తమ ఇంట్లోని వికలాంగ స్త్రీల గురించి తెలుసుకోకుండా జాగ్రత్త పడతారు, లేదా అటువంటి వారి ఉనికే వుండకూడదనుకుంటారు.
తరచుగా వికలాంగ స్త్రీలు, బాలికలు చదువుకోవటానికి వీల్లేదు అంటారు. సమాజ కార్యక్రమాలలో పాల్గొననివ్వరు. సంఘ కార్యకలాపాల్లో పాల్గొననివ్వరు. మతపరమైన సేవలలో పాల్గొననివ్వరు.
కొన్ని కమ్యూనిటీలలో వికలాంగ స్త్రీలను వేరే దూరంగా వుంచేస్తారు. ఎందుకంటే వారి దగ్గరగా మసలటం వలన తమకు కూడా, ఆ వైకల్యం అంటుకుంటుందన్న నమ్మకం వారికి. ఎవరైనా గర్భిణీ స్త్రీ ఒక వికలాంగురాలిని తాకినటైతే, ఆ వైకల్యం పుట్టబోయే శిశువుకు కూడా సంక్రమిస్తుందని కొందరి అభిప్రాయం. ఇది నిజం కాదు. అంగవైకల్యం, మీకు అంటుకొనే జబ్బు కానీ కాదు.
ఒక అంగవైకల్యం గల స్త్రీని విస్మరించి, ఆమెకు అవసరమైన సహాయం అందించకపోవటమే నిర్లక్ష్యం అవుతుంది. ఉదాహరణకు
వికలాంగ స్త్రీలను ఒక్కరినీ ఇంట్లో వదిలి వేయటం, వారికి చదువు, మంచి విద్య, సరైన ఆహారం, దుస్తులు ఇవ్వకపోవటం చేస్తారు చాల మంది.
నిర్లక్ష్యం అన్నది స్త్రీ మనసును గాయపరుస్తుంది. అంతే కాకుండా ఆమెను ఒంటరిని చేస్తుంది. భయపడేలా చేస్తుంది. ఆమె పడుకొని చాలా సమయం తనంతట తాను కదలలేక ఒకేలా వుండిపోవటం వలన ఒత్తిడి పుండ్లు ఏర్పడే అవకాశం కూడా వుంటుంది.
బాదేయటం, కిందికి నెట్టేయబడటం, గిల్లటం, చెంపదెబ్బలు కొట్టటం, కొట్టేయటం, మొదలైనవన్నీ శారీరక నిరాదరణలోకి వస్తాయి. కొన్ని సందర్భాలలో వికలాంగ స్త్రీల పిల్లల్ని బెదిరిస్తారు. అందుకు ఆమె చాలా ఎక్కువగా భయపడటం జరుగుతుంది. ఎందుకంటే హింస నుంచి తన పిల్లల్ను కాపాడుకోలేనేమోనని ఒక భయం ఆమెకు.
దెబ్బలు కొట్టటం, దాడి చెయ్యటం కాకుండా, ఈ క్రింది విధంగా అనేక సందర్భాలలో అంగవైకల్యం గల స్త్రీలు నిరాదరింపబడుతున్నారు.
ఆరోగ్ధ కార్యకర్తలు ఈ పరిస్థితుల నుంచి కాపాడటానికి ప్రత్యేకమైన గది (వన్లటైతే) లో పరీక్ష చేయవచ్చు. ఆమె దుస్తులను అవసరమైన మేరకే తొలగించలి, అవసరమైనచోట ఆమె దస్తులనో లేక ఆసుపత్రి బట్టనో కష్టాలి.
వికలాంగ స్త్రీలు నిరాదరణ నుండి విముక్తి పొందటానికి మార్గం, వారు సమాజ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనటం. ఇతరులతో మాట్లాడి, పరిచయం పెంచుకోవటం వలన వారికి మద్దతు లభిస్తుంది.
నిరాదరించి బాధించే వారు తరచు స్త్రీయొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించి, వారి ధైర్యాన్ని నాశనం చేస్తారు. ఆ వ్యక్తి లేకుండా ఆమె (పిల్లలు కూడా) బ్రతకలేమన్న విధంగా నమ్మిస్తారు. మీరు ఆ బాధించే వ్యక్తి లేకుండా బ్రతకగలం అని గుర్తు పెట్టుకోండి.
స్త్రీలు హింస నుండి తమను తాము రక్షించుకొనే ఏర్పాట్లు చేసుకుంటారు. చాలా చోట్ల వారిని హింస నుండి వేధింపుల నుండి ముఖ్యంగా పోలీసులు, లాయర్లు మరియు న్యాయమూర్తులు ఒక స్త్రీకి సహాయపడే విషయంలో నమ్మదగిన వారుగా వుండటం లేదు. కాని స్త్రీలంతా కలిసి సంఘటితంగా కృషి చేస్తున్నపుడు అన్ని చోట్ల కూడా బాగా రక్షింపబడతున్నారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు
బాలికలు సహజంగా చిన్నగాను, బలహీనంగాను వుండటం మరియు తమ చుట్టూ వున్న సమాజంలో సెక్స్ పరంగా వున్న సాంఘిక నిబంధనలు, వాడుకలో వున్న పద్ధతులు గురించిన అవగాహన కూడా తక్కువ వారికి. అందువలన వారు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా వుంటుంది. బాలికలు తమ కుటుంబంలో తండ్రి, తల్లి, మామ లేక చిన్నాన్న లేదా, ఇతర బంధువు లేదా ఒకసోదరుడు లేదా ఇతర పిల్లలు మొదలైన వారి వేధింపులకు, నిరాదరణకు గురి కావచ్చు. ఒక బాలిక తన ఇంట్లో వారి నిరాదరణ గురించి ఎవరితోనైనా చెబితే, కుటుంబం అంతా ఆ సభ్యుడికి రక్షణ నిచ్చి, ఆ బాలికనే నిందిస్తుంది. కాని వేధింపునకు గురైన వ్యక్తిని నిందించటం ఎన్నడూ సరికాదు. ముఖ్యంగా ఒక బిడ్డ విషయంలో సరి అయినది కాదు.
తమ వైకల్యం కారణంగా బలహీనులైన, బయటకు వ్యక్తపరుచుకోవటం రాక వికలాంగులు అయిన స్త్రీలు, బాలికలు, ఇంకా వారి సమాజంలో పూర్తిగా అంగీకరింపబడని, ఆదరింపబడని స్త్రీలు, బాలికలు వేధింపులకు, హింసకు ఎక్కువగా గురిఅవుతారు. ఈ కారణంగానే వారిని నిరాదరించి బాధించే వ్యక్తులు ఇటువంటి స్త్రీలకే గురి పెట్టి, వారికి ఏం జరిగినా పట్టించుకొనే నాధుడే లేడని అనుకొంటూ వుంటారు.
ఒక వికలాంగ స్త్రీ తన కుటుంబంలోని ఇతర వ్యక్తుల వల్లనో, భర్తవల్లనో, లేక తన సంరక్షకుడి వల్లనో ఒక అపరిచితుడి వల్లనో లైంగిక వేధింపునకు గురికావటం జరుగుతూ వుంటుంది. చాలా తరచుగా తనకుతెలిసిన వ్యక్తి వల్లే మానభంగానికి గురవ్వటం జరుగుతుంది.
ఎందుకంటే అంగ వికలురాలైన ఫ్రీని ఇల్లు దాటి బయటకు వెళ్ళనీయరు. వెత్తే ఆమె అక్కడ క్రొత్త వారితో పరిచయాలు ఏర్పడి, స్త్రీ పురుషుల మధ్య వుండే లైంగిక సంబంధాల గురించి తెలుసుకుంటుందని భయం, ఆమె తనకు గల నిరాదరణ, వేధింపు తప్ప వేరే దారి లేదనుకుంటుంది. ఆమె, ఆ వేధించే వ్యక్తి తప్ప వేరెవరూ తన పట్ల ఆకర్షితులు కారని కూడా అనుకుంటుంది.
లైంగికమైన వేదింపులు అనేకసార్లు, అనేక విధాలుగా జరుగుతూ వుంటాయి. కాని కొన్నిసార్లే భావిస్తారు ఏదో లైంగిక దాడి జరిగిందనీ, మానభంగం జరిగిందనీ, లైంగిక వేధింపు అంటే, స్త్రీలు ఇష్టపడని ఏ విధమైన లైంగికమైన స్పర్శగాని, మరే విధమైన చేష్టగాని అందుకు సంబంధించినది అని అర్థం. ఒక ఫ్రీ గాని, బాలికగాని లైంగికమైన వేధింపునకు గురి అయిందని చెప్పటానికి ఈ దిగువనిచ్చిన సందర్భాలు ఉదాహరణలు.
పిల్లలందరికీ, పెద్దల దగ్గర వినయ విధేయతలతో వుండాలని బోధిస్తారు. కాని వారు ఎదిగి పెద్ద అయ్యేక, ఎపుడు విధేయత అవసరం లేదో తెలుసుకుంటారు. కాని అర్థం చేసుకోవటం, నేర్చుకోవటం చేతకాని ఫ్రీలకు తరచు ఒకటే బోధిసూ వుంటారు. ఇతర వ్యక్తుల్ని నమ్మాలని, నిశ్శబ్దంగా వుండి "మంచి' అనిపించుకోవాలనీ, వాదించకుండా చెప్పిన మాట వినాలనీ, ఈ కారణంగా వారు సులువుగా ఒకరి దోపిడీకి, ముఖ్యంగా లైంగికంగా కూడా అన్యాయానికి గురవుతూ వుంటారు.
అర్థం చేసుకోలేని సమస్య గల బాలికలతో, స్త్రీలతో తరచు, తమకు వేధింపులకు గురవ్వకుండా బ్రతికే హక్కు వుందని, తెలిసేలా సహాయపడుతూ, చెబుతూ వుండాలి. అటువంటి సంఘటనలు, అంటే ఎవరైనా తాకినా, వేధించినా మీకు గాని, వారు విశ్వసించే మరొక వ్యక్తికి గాని చెప్పే విధంగా నేర్పించాలి వారికి. అందువల్ల వారికి కొంత రక్షణ దొరుకుతుంది. అదే విధంగా ఈ సమస్య గల స్త్రీలకి అటువంటి సందర్భాలలో తమను తాము కాపాడుకోవటం ఎలాగో కూడా నేర్పించాలి.
లైంగిక దాడి అంటే ఒక స్త్రీని, తనకిష్టం లేకుండా, సెక్స్ లో పాల్గొనే విధంగా బలవంతం చేయటం. లైంగిక దాడులలో అతి హింసాత్మకమైనది మానభంగం. స్త్రీకి ఇష్టం లేకుండా, ఆమె యోనిలో అతడి పురుషాంగం, వ్రేలు, లేదా ఏ ఇతర వస్తువునైనా పెట్టటం. అలాగే నోటిలో, లేదా మల ద్వారంలో కూడా పెట్టేటపుడు, ఏ సమయంలోనైనా సరే మానభంగం జరుగుతుంది.
లైంగిక దాడి మరియు మానభంగం - ఇవి తీవ్రమైన హానిని కలిగిస్తాయి ఎవరికైనా, కాని ఆ ప్రభావం బాలికలపై ముఖ్యంగా చాలా తీవ్రంగాను, ఎక్కువ కాలం పడుతుంది. బాలికలు లైంగికంగా పరిపక్వత పొంది వుండకపోవటం అందుకు కారణం. యధార్ధానికి వారికి ఏం జరిగిందో ఎలా చెప్పాలో, వివరించాలో కూడా తెలియని స్థితిలో వుంటూరు వారు. తరచు వారు ఆ సందర్భంగా ఇతరులకు నమ్మకం కలిగించ లేక ಇಬ್ಬಂದಿ పడుతూ వుంటారు. కొన్ని కులాలలో మతాలలో ఎవరైనా ఒక బాలిక మానభంగానికి గనుక గురై వున్నటైతే, ఆమెకు ఇక వివాహానికి అర్హత లేదని, అనుమతించరు ఆమెను.
సైనిక దళాలు ఎక్కువగా వున్న ప్రాంతాలలో కొన్ని చోట్ల బాలికలను వారికి పనిమనుషులుగాను, లైంగిక బానిసలుగాను బలవంతంగా మార్చటం జరుగుతూ వుంటుంది. ఫలితంగా, తరచూ ఆ బాలికలు మానసికంగాను, శారీరకంగాను వైకల్యానికి బలవుతూ వుంటారు.
కొన్ని ప్రాంతాలలో కన్యలతో సెక్స్ లో పాల్గొనటం వలన ఎయిడ్స్ రోగం తగ్గిపోతుందన్న మూఢ నమ్మకం వుంటుంది. ఫలితంగా చాలా చిన్న ఆడపిల్లలు, ఆఖరుకు పసిబిడ్డలు కూడా ఆ నమ్మకానికి బలైపోతున్నారు. వారి శరీరాలు సున్నితంగాను, చిన్నగాను వుండటంవల్ల వారి జననాంగాలు చాలా ఎక్కువగా దెబ్బతినటం, సులభంగా వారికి హెచ్.ఐ.వి/ఎయిడ్స్ మరియు ఇతర లైంగిక పరంగా వ్యాప్తిచెందే సుఖవ్యాధులు సంక్రమిస్తాయి కూడా.
మానభంగానికి సంబంధించి స్త్రీల అనుభవాలు వేర్వేరుగా వుంటాయి. కాని మీరు కోలుకోవడానికి మీరు చేసుకో గలిగిన కొన్ని విషయాలున్నాయి. ప్రథమంగా మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోవాలి.
ఒక వికలాంగురాలైన స్త్రీకి కూడా, మానభంగానికి గురైనపుడు, ఇతర స్త్రీల లాగే అదే సహాయం అవసరం అయి వుంటుంది. మీరు విశ్వసించే ఒకరికి చెప్పటం చాలా ముఖ్యం. వారు మీరు ఆరోగ్య కార్యకర్త దగ్గరకు వెళ్ళటానికి, మీరు పోలీసులకు చెప్పాలో అక్కర్లేదో నిర్ణయం చేసుకోవటానికి సహాయపడతారు. మీకు చాలా కాలం వరకు, భయం వేస్తుంది. విచారంగా వుంటుంది. బాధకలుగుతుంది, లేదా కోపం వస్తుంది. మీ బాధను, భావాలను చెప్పకోవటానికి కూడా మీకు ఒకరు కావాలి. మీ క్షేమం కోరే మనిషిని, బలమైన మరియు ఆధారపడదగిన మనిషిని ఎన్నుకోండి. ఇతరులకు మీ విషయాలు చెప్పనివారై వుండాలి కూడ. మీ కుటుంబ సభ్యులుగాని, మామూలుగా మీకు సహాయపడే వారుగాని, మనసుకు కలిగిన బాధ వల్ల, మీకు పూర్తి సహాయం, మద్దతు అందించలేని పరిస్థితిలో వుండవచ్చు.
కొన్ని ప్రాంతాలలో కుటుంబాలు, మొత్తం కమ్యూనిటీ కూడా, మానభంగం జరిగిన యువతి తమకు అవమానాన్ని నామోషీని తెచ్చిపెట్టినట్టు భావిస్తారు. ఆమెను, జరిగిన అమానుషానికీ, మళ్ళీ తమకు, సమాజం మొత్తానికీ చెడ్డపేరు తెచ్చిందనీ కూడా నిందిస్తారు అందరూ అన్యాయంగా, దీనినే చిన్నతనంగా భావించటం అంటారు. ఈ చిన్నతనంల వల్లే ఏ ఫ్రీ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పాలన్నా భయపడుతుంది. తన చుటూ వున్న సమాజం, తనకు జరిగిన మానభంగం గురించి తెలిస్తే, తనను నిరాదరిస్తారని భయం ఆమెకు. లేదా ఆమె కుటుంబ సభ్యులు, ఆ సంగతి బయటకు తెలియటం వల్ల తమ కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందని, తెలియకూడదనుకుంటారు. అదే ఒక వికలాంగురాలి విషయానికి వస్తే, ఆమెను అప్పటికే ఆమె వైకల్యం గురించి వేలెత్తి చూపటం జరుగుతూ వుంటుంది, దీని వల్ల ఆమె పరిస్థితి మరింత దిగజారటం జరుగుతుంది.
మానభంగానికి గురైన స్త్రీని ఎన్నడూ నిందించకూడదు. ఆమెకు తన కుటుంబం నుంచీ, సమాజం నుంచీ మద్దతు కావాలి. ఈ భావన (చిన్నతనంగా భావించటం) వలన గాయపడే స్త్రీలకు స్వాంతన దొరకదు. భవిష్యత్లో అటుంటి అన్యాయాన్ని అరికట్టటం జరగదు. ఈ భావనే ఒక అడ్డు అవుతుంది.
మీరు తేడాగా మాట్లాడినటైతే, మీరు మీ మనసు బాగోలేనపుడు మీకు ఏం జరిగిందో వివరించటం చాలా కష్టం అనిపిస్తుంది. మీరు సిగ్గుపడుతున్నా భయపడుతున్నా మాటలురావు మాట్లాడటానికి. కొన్ని సందర్భాలలో బొమ్మలు గీయటం ద్వారా కూడా ఏం జరిగిందో తెలియజేయవచ్చు. ఆరోగ్య కార్యకర్తలు మరియు స్నేహితులు పరిస్థితులను చక్కబరచగలరు.
వినటం, మాట్లాడటంలలో లోపం గల స్త్రీలు (చెముడు వారు, మూగవారు అయిన స్త్రీలు) గనుక లైంగిక వేధింపునకు గాని, మానభంగానికి గాని గురైనటైతే, వారు సహాయం పొందటం అన్నది చాలా కష్టంతో కూడుకున్న విషయం. అయినప్పటికీ ఆమె తనను ఆ కష్టానికి గురి చేసిన వ్యక్తి గురించి వర్ణించి చెప్పగలదు. కాని ఆమె సౌంజ్ఞ భాషను ఎవరూ అర్థం చేసుకోలేనటైతే, ఆమెకు తనకేం జరిగిందో, ఎవరు అందుకు కారణమో తెలియజేయటం అన్నది చాలా సమస్య అవుతుంది.
నా భర్త నన్న కొడుతుంటే, నేను పోలీసుల దగ్గరకు వెజ్ఞాను. కాని వారికి నా సౌంజ్ఞ భాష అర్థం కాక విసుగు చెందారు. నా భర్త రెండో భార్య నను కోట్టటాన్షి సమర్థిస్తుంది. ఆ విషయం ఎవరూ నమ్మటం లేదు.
మీరు గనుక వేధింపుకు గురైన, లేక మానభంగానికి గురైన స్త్రీ మాట్లాడుతున్నటైతే, ఆమెకు ధైర్యం చెప్పండి. ఆమెను ఎంత సమయం కావాలో అంతా తీసుకోమనండి ఏం జరిగిందో వివరించటానికి. మీరు వింటానని చెప్పండి ఆమెకు.
చాలా ప్రాంతాలలో మానభంగం ఒక నేరం. మీరు మానభంగానికి గురైనట్లు రుజువు చేయటానికి చాల సమయం పడుతుంది. కష్టం కూడా. పోలీసుల దగ్గరకు వెళ్ళాలన్న నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. మీ కమ్యూనిటీలో మానభంగానికి గురైన స్త్రీలకు పోలీసులు సహాయం చేశారా? మీరు మానభంగాన్ని రహస్యంగా వుంచాలనుకొన్నటైతే, పోలీసులు ఇతరులను దాని గురించి తెలుసుకోకుండా ఆపగలరా? పోలీసుల దగ్గరకు ఎపుడూ ఒంటరిగా వెళ్ళిద్దు. కొన్ని కమ్యూనిటీలలో పోలీసు స్టేషన్ కు ఒంటరిగా వెళ్ళిన ఫ్రీ, తిరిగి పోలీసులచే మానభంగానికి గురయ్యే ప్రమాదం వుందంటారు. తప్పకుండా మీతో ఎవరినైనా తీసుకెళ్ళండి. మీరు ఒక వేళ మానభంగాన్ని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటే, వీలైనంత తొందరగా వెళ్ళండి. వెళ్ళే ముందు కడుక్కోవటం గాని, షవర్ స్నానం చెయ్యటం గాని చెయ్యకండి. దస్తులు కూడా మార్చుకోకుండా వెళ్ళండి. ఇందువలన మీరు మానభంగానికి గురైనట్లు రుజువు కావచ్చు. పోలీసులతో పనిచేసే డాక్టరు దగ్గర వైద్య పరీక్ష చేయించుకోమని చెప్తారు. ఆ పరీక్ష కూడా మీరు మానభంగానికి గురైనట్లు రుజువు చేయటానికి సహాయపడవచ్చు.
మానభంగంచేసిన వ్యక్తి అరెస్టయి వున్నటైతే, మీరు అతడిని పోలీసుల సమక్షంలోగానీ, జడ్జి ఎదుట కోర్టులో గాని గుర్తుపట్టవలసి వుంటుంది. మానభంగం గురించి కోర్డు ఎక్కటం అంత సులువైన పనేం కాదు. ఏం జరిగిందో వివరించటం వలన, తిరిగి మళ్ళీ మానభంగం జరిగినంత పని చేస్తాయి. ప్రతిఒక్కరూ అర్థం చేసుకోరు. కొందరు మిమ్మల్ని నిందించటానికి గాని, లేక మీరు ಅಬಬ್ಲಿಂ చెబుతున్నారని కాని అంటారు.
మీ వైకల్యం కారణంగా కొందరు అసలు మీరు చెప్పేది వినరు. ఒక అంగ వికలురాలు నిజం చెబుతుందని, అర్థం చేసుకోగల సాక్షిగా వుండగలదని కాని విశ్వసించరు కొందరు. కాని వైకల్యం గల కొందరు స్త్రీలు కొందరు కోర్టులో మంచి ఫలితం పొందారు. ముఖ్యంగా వారు తమ వర్గం వారి సహాయం పొందినపుడు. మీరు కోరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నపుడు, ఎల్లపుడూ మీరు నమ్మే ఒక వ్యక్తిని మీతో తీసుకెళ్ళండి.
మానభంగం జరిగిన తర్వాత, మీరు ఎక్కువగా గాయపడకున్నా సరే ఆరోగ్య కార్యకర్తను చూడటం మంచిది. ఆరోగ్య కార్యకర్తకు మీరు మానభంగానికి గురైనట్లు చెప్పండి. మానభంగం వల్ల తలెత్తే సాధారణ, ఆరోగ్య సమస్యలను ఆమె నివారించగలదు, చికిత్స చేయగలదు కూడా.
మీరు గర్భాన్ని నిరోధించవచ్చు. మీరు అత్యవసర కుటుంబ నియంత్రణ పాటిస్తే, ఆరోగ్య కార్యకర్తతో దీని గురించి మాట్లాడండి. మానభంగం జరిగిన తర్వాత వీలైనంత తొందరగా కుటుంబ నియంత్రణ పాటించండి. 5 రోజులు దాటక ముందే (120 గంటలు). మీరు అత్యవసర కుటుంబ నియంత్రణ జాగ్రత్తలు తీసుకున్నా కూడా, మీకు తర్వాత నెలలో రుతుస్రావం కానటైతే సమయానికి, వెంటనే పరీక్ష చేయించుకోండి. మీరు గర్భవతి కాదని నిర్ధారణ చేసుకోవటానికి. మీరు గర్భవతిగా వున్నట్లు మీకు అనిపిస్తే, ఒక ఆరోగ్య కార్యకర్తను చూడండి. కొన్ని దేశాలలో ఒక ఫ్రీ కాని, బాలిక గాని మానభంగానికి గురైతే, గర్భస్రావం చట్టబద్ధంగా చేసుకోవచ్చు.
మిమ్మల్ని మానభంగానికి గురిచేసిన వ్యక్తి లైంగిక పరంగా వ్యాప్తి చెందే సుఖ వ్యాధులు గాని, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ గాని వుంటే అవి మీకు పాకించి వుంటాడు. ఒక ఆరోగ్య కార్యకర్త, ఒక వేళ మీరు ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుకోకపోయినా, గనేరియా, సిఫిలిస్, మరియు క్లెమాడియా వంటి సుఖవ్యాధులను నిరోధించగలదు తగిన మందులు ఇచ్చి ఏదైనా సుఖవ్యాధిని, లక్షణాలు కనిపించే వరకు ఆగి చూడకుండా నిరోధించుకుంటేనే మంచిది.
మీరు 2 నుంచి 4 వారాల తర్వాత హెచ్.ఐ.వి పరీక్ష కూడా తప్పకుండా చేయించుకోవాలి. మీకు నెగెటివ్ ఫలితం వచ్చేలోపలో మీరు సెక్స్లో పాల్గొనదలుచుకుంటే, కండోమ్స్ ను వాడండి, మీ హెచ్.ఐ.వి/ఎయిడ్స్లను రక్షించుకోవటానికి. మీరు ఆరోగ్య కార్యకర్తను కలిసి ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవటానికి మందులు గురించి అడగటం, అవెలా వేసుకోవాలో తెలుసుకోవటం వలన మీకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం తగ్గుతుంది.
మానభంగం వలన చీలికలు గాట్ల ఏర్పడతాయి జననాంగాలకు. ఇవి చాలా నొప్పిని, బాధను కలిగించవచ్చు. కాని త్వరగానే నయం అయిపోతాయి. ఒక వేళ రక్తస్రావం చాలా అధికంగా వున్నటైతే, ఒక ఆరోగ్య కార్యకర్త దగ్గరకు వెళ్ళండి. ఆమె మీ గాయాలకు కుట్లు వేసి, ఇన్ఫెక్షన్ రాకుండా మందులు ఇస్తుంది, చిన్నగా వున్న గాట్లకు చీలికలకు
హింసాత్మకమైన లైంగిక సంపర్మానికి గురైన తర్వాత సాధారణంగా స్త్రీలకు మూత్రాశయానికి సంబంధించి గాని, లేదా మూత్ర పిండాలకు సంబంధించి గాని ఇన్ ఫేక్షన్లు రావచ్చు. మీరు మూత్రం పోసుకొనేటపుడు నొప్పి కలిగినా, లేదా మూత్రంలో రక్తం కనిపించినా మీరు ఆరోగ్య కార్యకర్తను చూడండి. మీరు మందులు వాడటం అవసరం కావచ్చు. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగటం వలన కొంత ప్రయోజనం కలుగుతుంది.
మీరు లైంగిక వేధింపునకు లేక మానభంగానికి గురైన వారిని మీరు కలిసినటైతే
ఆమెకు దయతో, పరిస్థితి అర్థం చేసుకొని చికిత్స చేయండి. ఏమి జరిగిందో చెప్పేలా ఆమెను ప్రోత్సహించండి. జాగ్రత్తగా ఆమె చెప్పేది విని, మీరు ఆమెను నమ్ముతున్నట్లు, ఆమెకు తెలిసేలా చేయండి. ఆమెను నిందించకండి జరిగినదానికి. మీరు పరీక్షించేందుకు తాకటం గాని, చూడటం గాని ఆమెకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అందువల్ల మీరు ఆమెను ఏ విధంగా పరీక్షిస్తారో ముందుగా చెప్పి, ఆమె సిద్ధం తర్వాతే పరీక్షించాలి. మానభంగం వల్ల, హింస వల్ల ఆమె మానసిక భావాలు దీర్ఘకాలం అంటే సంవత్సరాలు కూడా కావచ్చు. దెబ్బతినే ప్రమాదం వుందని గుర్తుంచుకోవాలి మీరు. ఆమె ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయండి. ఆమెకు లైంగికంగా వ్యాప్తి చెందే సుఖవ్యాధులు రాకుండా, గర్భం రాకుండా మందులిచ్చి నివారించండి. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకే ప్రమాదాన్ని తగ్గించండి. ఒకవేళ మానభంగం వల్ల ఆమె గర్భవతి అయినటైతే, ఏమి చేయాలో నిర్ణయించుకొనేందుకు ఆమెకు సహాయం చేయండి.
ఆమెను ఎవరు మానభంగానికి గురిచేశారో, సరిగ్గా ఏం జరిగిందో అది వ్రాసి వుంచండి. మీ క్లినిక్లో రికారులు జాగ్రత్త చేయటం అలవాటు లేకున్నా ఒక రికారు తయారు చేసి ఎక్కడో జాగ్రత్తగా వుంచండి. ఆమె శరీరం ముందు భాగం, వెనుక భాగం యొక్క బొమ్మలు గీసి, ఆమె గాయపడిన స్థానాలను గుర్తించండి. మీరు వ్రాసింది, గీసిందీ ఆమెకు చూపి వివరించండి. అది ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా, అతడిని చట్టం ద్వారా శిక్షించాలనుకున్నా ఉపయోగపడతుందని ఆమెకు చెప్పండి.
ఆమెకు ఉద్వేగభరితమైన, మానసిక ఆరోగ్య సమస్యలను, అవసరాలను చూడండి. ఎవరితోనైనా మాట్లాడాలేమో అడగండి ఆమెను. ఆమెకు ఆత్మగౌరవం తిరిగి కలిగేలా, ఆమె జీవితం పట్ల అదుపును సంపాదించుకొనే విధంగా సహాయపడండి.
ఆమె నిర్ణయాలు, స్వయంగా తీసుకొనేందుకు సహాయపడండి. ఆమె మానభంగం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నటైతే, ఆమెకు చట్టపరమైన సేవలను అందుబాటుగా తీసుకెళ్ళేందుకు కూడా ఆమె అందుకొనేలా చేయండి.
ఆమె కుటుంబానికి లేదా భాగస్వామికి ఆ విషయం తెలియజేయటంలో ఆమెకు సహాయపడండి. ఆమె కోలుకొనే వరకు, ఆమెకు మద్దతునిచ్చే మార్గాలను వెతకటంలో వారికి సహాయం అందించాలి. కుటుంబ సభ్యులకు కూడా మానభంగం వల్ల కలిగిన బాధను అధిగమించటానికి సహాయం అవసరం అని గుర్తుంచుకోండి.
మానభంగం తర్వాత మీరు సహజమైన లైంగిక సంబంధాలను కలిగి వుండవచ్చు. మీ జననాంగాలపై ఏర్పడిన చీలికలు, గాయాలు మాని బాధ కలిగించనంత వరకు ఆగాలి మీరు. చాలా మంది స్త్రీలు సెక్స్లో పాల్గొన్నప్పడు ఆ మానభంగం గురించి ఆలోచించేలా అవుతుంది మానసికంగా, ఒక వేళ మీకు అలా జరిగినటైతే, మీ భాగస్వామితో, సెక్స్ ఎప్పటిలా ఎందుకు అనిపించటం లేదో, ఎందుకు మిమ్మల్ని భయానికి గురి చేస్తుందో, మీకు ఆగటం ఎందుకు అవసరమో చెప్పండి. మీ భాగస్వామిని మిమ్మల్ని మృదువుగా కౌగలించుకోవటం, శరీరాన్ని నిమరటం ద్వారా జననాంగాలను తాకకుండా మీ భయాన్ని అధిగమించేలా చేయమని అడగండి. మీకు భయం పోయిన తర్వాత తిరిగి లైంగిక సంపర్కం మొదలు పెట్టవచ్చు. కాని అందుకు సమయం పడుతుంది. కనుక మీరిద్దరూ ఓర్పుగా వేచి వుండాలి.
ఒక స్త్రీ యొక్క భాగస్వామి ఆమె పట్ల కరుణతో, అర్థం చేసుకోగల ప్రవర్తనతో ఆమెకు సహాయ పడతాడు. మానభంగం తర్వాత, కాని కొన్ని సందర్భాలలో ఆమె భాగస్వామి, ఆమె మానభంగానికి గురైన కారణంగా ఆమెను విడిచి పెట్టటం జరుగుతుంది. ఆ సంఘటన అతడికి గౌరవ భంగం కలిగిస్తుందన్న భావం కలిగినా, చుటూ వున్న సంఘం అలా భావిస్తున్నా అతడు అవమానంతో కోపంగా ప్రవర్తిస్తాడు. అతడు ఆ సందర్భంలో అతడు సమాజంలో మాట్లాడదగిన ఒక వ్యక్తిని కలిసి మాట్లాడటం వలన అతడి భావాల గురించి, ప్రయోజనం వుండవచ్చు.
మీ శారీరక గాయాలు నయమైనప్పటికీ, ఆ సంఘటన మిమ్మల్ని చాలా కాలం వరకూ బాధిస్తూనే వుంటుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వటం జరిగింది.
మానభంగానికి గురైన స్త్రీకి ఎవరితోనైనా మాట్లాడటం చాలా అవసరం. అందువల్ల ఆమెకు కొంచెం ఉపశమనం కలుగుతుంది. లేదా తనకు కాస్త బాగా అనిపించే పనులు పెట్టుకొని వేదిక లేకుండా మనసును లగ్నం చేయటం వలన కూడా మనశ్శాంతి దొరికి, ఆ సంఘటనను మరువవచ్చు. ప్రతి స్త్రీ కూడా అందుకోసం తనదైన ఒక పద్ధతిని అవలంభిస్తుంది. కొందరు స్త్రీలు పూజలతో సహా ఏవో పరిహారాలు చేస్తారు. కొందరైతే మానభంగానికి గురిచేసిన వ్యక్తిని శిక్షించి, ఇతర స్త్రీలు తనలా బాధపడకుండా వుండేలా చూస్తారు కూడా. మీరేం చేసినప్పటికీ, మీరు ఓర్పు వహించి, ఇతరులను కూడా ఓర్పుగా వుండమని కోరాలి. మరింత సమాచారం కోసం 3వ అధ్యాయం, మానసిక ఆరోగ్యం చూడండి.
వికలాంగ స్త్రీల సంరక్షణ భారంగా భావించినపుడు, కొందరు వారిని అటువంటి వారి సంరక్షణ చూసే ఆశ్రమాలలోను, వసతి గృహాలలోను చేర్చేస్తారు. వారు తమవారైన, ఉదాహరణకు తల్లి లేక చెల్లి మొదలైన వారిని, తమకంటె ఆశ్రమంలో వారే బాగా చూసుకుంటారని కూడా భావిస్తారు. ఆశ్రమాలలోను, వసతి గృహంలోను జీవించే చాలా మంది అక్కడ వాతావరణంతోను, తమ తోటి వ్యక్తులతోను బంధం ఏర్పరుచుకుంటారు. చాలా మంది వికలాంగులు జీవించి వుండటానికి కారణం, వారు వసతి గృహాలు, పాఠశాలలు, ఆసుపత్రులు ఇంకా అనాథ శరణాలయాలు మొదలైన వాటి నుంచి వారు పొందగలిగిన సంరక్షణ వలనే.
అటువంటి సంస్థలలో నివసించే వారు తరచు ఒంటరితనంతో, బలహీనంగా కూడా వుంటారు. ఒకరి వేధింపులకు అందుబాటుగా వుంటారు. చాలా సందర్భాలలో వారు తమ కుటుంబాల నుంచి దూరంగా వుంటారు. లేదా వారి కోసం పట్టించుకొనే కుటుంబాలే వుండవు కొందరికి.
ఆశ్రమాలలో జీవించే వికలాంగులకు తరచు తమ జీవితాలపై తమకు అదుపులేని పరిస్థితులు వుంటాయి. అక్కడ వారేం చెస్తే అదే చెయ్యాలి. వినాలి. చాలా వరకు నిర్ణయాలు స్వంతంగా సుకోలేరు. అర్థం చేసుకోవటంలో, నేర్చుకోవటంలో సమస్య గల స్త్రీలు ప్రత్యేకంగా వుంచబడటం వలన ఒంటరితనం అనుభవిస్తారు.
ఆశ్రమాలలో నివసించే వారికి ఎదురయ్యే ఇతర రకాల సమస్యలు, ఆశ్రమ నిర్వహణను బట్టి వుంటాయి. చాలా సంస్థలలో ఎక్కువ మంది వ్యక్తులుండటం వలన, నిధులు తక్కువ కావటం వలన, అక్కడ పనిచేసే వ్యక్తుల సంఖ్యననుసరించి, వారికి పని ఎక్కువై పోయి, అలసిపోవటం వలన విసుగు చెందుతారు. ఈ సంస్థలలో పనిచేసే వారికి కొన్ని సందర్భాలలో, సంరక్షణ గురించి, నిబంధనలు చేయటం గురించి, సంస్థలో క్రమశిక్షణ నిర్వహించటం మొదలైన అంశాల గురించి ఎక్కువ అధికారం ఇచ్చేస్తూ వుంటారు.
ఇంతకు ముందు చెప్పబడిన వేధింపులు కాకుండా ఇటువంటి సంస్థలలో వుండే వికలాంగ ఫ్రీలు ఇతర రకాల వేధింపులకు గురవుతూ వుంటారు.
ఆశ్రమాలలో నివసించే వికలాంగ స్త్రీల సంరక్షణ చేసే వారు, మంచి ఉద్దేశ్యాలతో చేస్తారు సేవలు. కాని కొందరు సంరక్షకులు, పనివారు కూడా వికలాంగులను నిరాదరణకు గురిచేసూ వుంటారు. వారికి ఇతరులపై అధికారం చలాయించటం ఇష్టంగా వుంటుంది. ఈ సంస్థలలో పనిచేసే మిగిలిన వారు అక్కడ వికలాంగుల పట్ల జరుగుతున్న నిరాదరణ చూసి మనసు వికలమై, వారు మరొకలా ప్రవర్తించాలని కోరుకుంటారు వారిపట్ల, ఈ సంరక్షకులు తక్కువ జీతాలతో ఎక్కువ సమయం పని చేస్తారు. వారు తమకు చెప్పిన పని చేయవలసిన వారే కాని, వారు పని చేసే సంస్థలోని పరిస్థితులను మార్చే అధికారం వారికి అరుదుగా వుంటుంది.
కొన్ని సందర్భాలలో సంరక్షకులు ఏదీ చెప్పరు, మాట్లాడరు, ఎందుకంటే ఎవరికి చెప్పాలో తెలియడం వారికి, లేదా వారికి, తమ వుద్యోగాలు పోతాయన్న భయం కావచ్చు. ఒక వేళ సంరక్షకులు వేధింపుల గురించి తెలియజేసినా, అది వారి సమస్యకాదని చెప్పవచ్చు, లేదా భయ పెట్టవచ్చు వారిని, లేదా గేలి చేయవచ్చు. చాలా సందర్భాలలో సంరక్షకులు ఇక వున్న పరిస్థితులకు అనువుగా నడుచుకోవటం మొదలు పెడతారు.
అక్కడ అధికారిగా నిర్వహణ చూసే వ్యక్తికి కొన్ని సందర్భాలలో ఈ వేధింపుల గురించి తెలియకపోవచ్చు లేదా ఒక వేళ తెలిసినా ఏమీ జరగనట్టే నటిస్తారు. లేదా వికలాంగుల పట్ల హింస, వేధింపు వున్నా కొంపేం మునిగిపోదు, ఫర్వాలేదు అంటూరు కూడా.
అక్రమాలు, సంస్థలలో వికలాంగుల పరిస్థితులు దయనీయంగా వుండటం, ఇంకా వారిపట్ల చూపబడే నిరాదరణ కూడా, సమాజం మొత్తానికి సంబంధించిన విషయాలు. అటువంటి సంస్థలలో వుండే వ్యక్తులు సౌకర్యానికి సంరక్షణకు సరిపడినన్ని వనరులు అవసరం. వారు ఎవరి వేధింపులకు, నిరాదరణకు గురవ్వకుండా చూడటం చాలా అవసరం.
మీకు తెలిసిన ఎవరైనా వ్యక్తి ఆశ్రమానికి నివసించేందుకు పంపించబడి వుండి, ఆ వ్యక్తి అక్కడ నిరాదరణకు గురవ్వుతున్నట్లు మీకు తెలిసివుంటే, మార్పు కోసం కృషి చేయటానికి కొన్ని సూచనలున్నాయి.
ఆత్మరక్షణ
అంగవైకల్యం కలిగి వున్న కారణంగా, మీరు బలహీనమైన వారమని గాని, ఎల్లపుడూ ఒకరిపై ఆధారపడి వుండి తీరాలని అర్థం కాదు. మీరు అనేక విధాలుగా ఎందుర్కొనే వేధింపులు, హింస, లేదా స్ట్రేల్లా లైంగిక దాడుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటం మీరు నేర్చుకోవచ్చు.
మీకు అవసరం లేని, మీరు అక్కర్లేదు అనుకొనే సహాయాన్ని ఇతరుల నుండి అంగికరించకండి. వారిని మీకు అనవసర సహాయం అందించకుండా నివారించటం ద్వారా ప్రారంభించండి మీ ఆత్మరక్షణ ప్రయత్నం. మీ శక్తిని, సమర్థతను ఇతరులకు తెలిసేలా చేయటానికీ, మీ కోసం మీరు నోరు విప్పి మాట్లాడగలరనీ, మీ నిర్ణయాలు మీరు స్వంతంగా తీసుకోగలరనీ అందరికీ తెలియజెప్పటానికి ఇదొక మార్గం. మీకు సహాయం అందించబోయిన వ్యక్తులు మీకు హాని తలపెట్టడని తెలిసినా సరే, వారిని వద్దని వారించటానికి భయపడవదు. వారికి కోపం వచ్చినా సరే. పరిసరాలలో వేరే వ్యక్తులున్నటైతే, వారికి కూడా వినిపించేటంత గట్టిగా మాట్లాడండి. కటువుగానే వుండండి. కాని మీకు నిజమైన సహాయాన్ని అందించబోయిన వ్యక్తులను అవమానించకండి. వారు మీకు నిజమైన సహాయం అందించగలవారై వుండవచ్చు.
పురుషులు మిమ్మల్ని తాకగలం సులువగా అని భావించే అవకాశం దొరికినటైతే, వారు మీ పట్ల మరింతగా మీ పట్ల అనుచితంగా ప్రవర్తించగలమని ప్రయత్నిస్తారు. ఎవరైనా వ్యక్తి మీ అనుమతి లేకుండా మిమ్మల్ని తాకినటైతే ఈ క్రింది మూడు విషయాలు చెప్పండి ఆ వ్యక్తికి.
అతడు మీ చేయి పట్టుకున్నా, మీ చక్రాల కుర్చీని తోయటం ప్రారంభించినా, స్థిరంగా, గట్టిగా నీవు నా చెయ్యి పట్టుకున్నావ్' అందరికీ వినపడేలా అరవండి.
"నువ్వు నాకుర్చీని తోసేస్తున్నావు? "నా కుర్చీని తోయకు'
"నువ్వు అలా చేయటం నాకు ఇష్టం లేదు’
ఒక వేళ ఎవరైనా మీ వైపు వస్తుంటే, వారు మిమ్మల్ని గాయపరుస్తారని మీకు అనిపించినటైతే, ఇలా ప్రయత్నించండి.
చాలా సందర్భాలలో ఆ మాత్రం ప్రయత్నం చాలు, ఆ వ్యక్తిని దూరంగా పంపించేయటానికి. మీ పట్ల ఇంకా ముందుకు వచ్చి వేరే విధంగా ప్రవర్తించబోతే సమస్య అవుతుందనిపిస్తుంది అతడికి. అయినప్పటికీ అతడు ఇంకా దగ్గరగా రావటానికి చూస్తున్నటైతే సహాయం కోసం కేకలు పెట్టి అరవండి.
దాడి చేసే వ్యక్తులు, సాధారణంగా, చూడటానికి సులభంగా లొంగే వారిని, లోకువగా వుండే వారిని పసి కడుతూ వుంటారు. సాధారణంగా వికలాంగులైన స్త్రీలు, వారికి ఏ విధమైన వైకల్యం వున్నా సరే వారికి అనువుగా కనిపిస్తారు. ముఖ్యంగా అయోమయంగా కనిపిసూ, తాము ఎక్కడ వున్నదీ తెలియకుండా వున్నవారు వీరికి సులువుగా దొరుకుతారు. అందువలన శారీరక బలానికన్నా చాలా ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో వున్నట్లుగా కనిపించటం, ఒక స్త్రీకి మంచి రక్షణగా వుంటుంది.
ఇలా వుండటం వలన స్త్రీ ఎక్కడున్నా మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ఒక హక్కుతో చేస్తున్నట్లు వుంటుంది. ఆమె ఒక ఆత్మ విశ్వాసంతో, ఆత్మగౌరవంతో తిరుగాడుతుంటే అదే రక్షణగా వుంటుంది ఆమెకు.
ఎవరైనా దాడి చేసి గాయపరచటానికి ప్రయత్నించినపుడు ప్రతిఘటించి పోరాడటం వలన ఆమె మానభంగం నుంచి తరచు తప్పించుకోగలుగుతుంది. దాడి చేసే వ్యక్తిని మానభంగం చేయనీయకుండా ఆపటం వలన అతడికి కోపం ఎక్కువవుతుందని భావిస్తారు చాలా మంది. కాని ఆ వ్యక్తి ఎలాగైనా ప్రమాదకరమైన వాడే.
ఎదురు తిరిగి మానభంగానికి ప్రతిగా పెనుగులాడి పోరాడటం వలన, ఆ వ్యక్తికి మిమ్మల్ని మానభంగానికి గురి చేయటం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పనిగా అనిపిస్తుంది.
ఎవరైనా మిమ్మల్ని మానభంగానికి గురి చేయాలని చూసినటైతే, దానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారన్నది తెలుసుకోవటం అసాధ్యం. కొందరు కోపానికి గురై, వారికే తెలియని శక్తి ఆవహిస్తుంది. కొందరైతే కదలనేలేకపోతారు. కాని ఒకటి గుర్తుపెట్టుకోండి, మానభంగం జరిగితే మాత్రం అది మీ తప్పకాదు ఎన్నడూ కూడా.
ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని గాయపరచటానికి గాని, మానభంగం చేయటానికి గాని మీపై దాడి చేసినటైతే, కాపాడుకోవటానికి మీరేం చెయ్యగలరో, అన్నీ చేయండి
శబ్దం చేయండి, అరవండి, కేకలు పెట్టండి వద్దు' అని. మీరు అరవగలిగినంతగట్టిగా కాపాడమని అరవండి.
కారం గానిమిరియాల పొడి లేదా దుమ్ముకాని అతడి కళలో కొట్టండి. కొంత సేపు ఆ మంటతో బాధతో చూడలేకపోతాడు అతడు ఆలోగా మీరు అక్కడుంచి వెళ్లిపోవచ్చు
మీరు పడిపోబోతుంటే మీరు కాపాడుకొనే ప్రయతానికంటే ముందుగా క్రింద కూరుండి పోండి.
దాడి చేసే వ్యక్తి వంగినపుడు అతడి ముక్కుపై గాని కళ్లల్లో కాని కొట్టండి. అందుకోసం మీ తలను కూడా ఉపయోగించవచ్చు.
కూర్టోవటం గాని, మోకాళ్లపై కూర్లోవటం గాని మిమ్మల్లి కాపాడుకోవటానికిగాను మంచి భంగిమలు, మీరు బాగా నిలబడలేని వారు. కాళ్ళ బలహీనమైన తర్వాత మీ చేతి కర్రనో, క్రెచెస్ నో ఉపయోగించి అతడిపై కొట్టి, పొడిచి దాడి చేయండి.
మీ చేతి కర్రను గాని, బెత్తాన్ని గాని లాక్కొని పడవేసినటైతే, మీరు నిస్సహాయులై పడిపోతారు. అందువల్ల, ఎవరైనా మీపై దాడి చేయబోతున్నట్లు అనిపించగానే మీ కర్ర యొక్క లావుగా వుండే కొనను ఆ వ్యక్తి వైపుకు గురిపెట్టండి. ఆ కొనతో మీరు పొడవగలిగినంత గట్టిగా పొడవండి అతడిని. బేస్బాల్ లాగ కాని, క్రికెట్ ఆడినట్లుగాని కర్రను వూపుతో కదపకూడదు. అలా చేయటం వలన మీ కర్రను సులభంగా లాక్కోవటమో, పడగొట్టటమో చేస్తారు.
మీరు క్రెచెస్ ఉపయోగిస్తున్లటైతే అతడిని కొట్టటానికి దానినే ఆయుధంగా వాడండి
మీ కర్ర యొక్క పొట్టి కొనతో పొడవటమే, కర్ర వెనక్కుతీసి ఎదరకు వూపి కొట్టటం కన్కా
అంధులపై ఎవరైనా దాడి చేసినపుడు వారు చూడలేరు గనుక, వారి చేతిలో వుండే ఆధారమైన కర్ర వంటివి పడేసుకోవటం జరుగుతుంది. మీపై దాడి చేసిన వ్యక్తియొక్క శరీరాన్నే మీకు సహాయపడేలా వుపయోగించుకోవచ్చు. మెడ, భుజాలు కలిసే చోటును వెతికిపట్టుకోవాలి. ఇది సులభంగా కనుగొనగలిగిన ప్రవేశం ఆ వ్యక్తి శరీరంలో, దాని ఆధారంగా అతడి మిగతా శరీరం పరిస్థితిని తెలుసుకోవచ్చు. అపుడు మీరు అతడి సున్నితమైన స్థానాలలో కొట్టగలుగుతారు.
మీ స్నేహితుల సహకారం తీసుకొని వేగంగా అతడి భుజం కనుక్కొని, అపుడు అతడి సున్నితమైన భాగాలను ఎక్కడున్నదీ తెల్పుకోవటం ఎలాగో నేర్చుకొని అలవాటు చేసుకోండి. అలాగే పడిపోయిన కర్రను ఎలా కనుక్కోవాలో కూడా నేర్చుకోవచ్చు.
ఆత్మరక్షణ చేసుకోవటం ఎలాగో అభ్యాసం చేయటం వలన, మీరు ఎన్నడూ దాడికి గురి కాకున్నాసరే, మీకు ఒక భద్రతా భావాన్ని ధైర్యాన్ని కలిగిస్తుంది. మిమ్మల్ని మీరు కాపాడుకొనేలా ఆత్మరక్షణ చేసుకొనే విధంగా, వివిధ మార్గాలను ఆలోచించండి. ఒక స్త్రీల బృందాన్ని ఏర్పరచుకొని, ఆ విధానాలను అందరూ కలిసి నేర్చుకోవాలి. కొన్ని ఆత్మ రక్షణ శిక్షణా తరగతులలో, స్త్రీలు వారు వీలైనంత గట్టిగా కొట్టే విధానాన్ని నేర్చుకుంటారు. వారు ఒక తయారుచేసిన మనిషి నమూనా బొమ్మనుకాని, దెబ్బ తగలకుండా అదనపు దుస్తులు లేక దిండులు చుట్టుకున్న స్త్రీని గాని కొట్టి నేర్చుకుంటారు. పోట్లాడటం అలవాటులేని స్త్రీలకు ఇది ప్రయోజనకరంగా వుంటుంది.
అంగవైకల్యంతోనే పెరిగే బాలికలు గాని, స్త్రీలు గాని, వారిని ఆరోగ్య కార్యకర్తలు, సహాయకులు, కుటుంబ సభ్యులు రోజూ పరీక్షించటం, పట్టుకొని నడిపించటం, తాకటం రోజూ చేసూనేవుంటారు. తరచుగా ఇందుకోసం అనుమతి అడగటం జరుగదు. ఏ స్త్రీ అయినా, ఆమెకు వైకల్యం వున్నా లేకున్నా తనను ఎవరు తాకవచ్చో చెప్పే హక్కు ఆమెకు వుంది. కుటుంబాలు, సంరక్షకులు కూడా మంచి స్పర్శకు, దురుద్దేశ్యంతో కూడిన స్పర్శకు తేడా వారికి నేర్పించటం ద్వారా వారిపట్ల లైంగిక దాడులు జరుగకుండా నివారించవచ్చు. ఆమెను తాకే ముందు ప్రతిసారీ కూడ ఆమె ఎల్లప్పడూ అనుమతిని తీసుకోండి. ఆమెకు - దినచర్యలోను, ఇంకా తన స్వంత మర్యాదగా ఆదరింపబడాలి. విషయంలోను ఏదైనా సహాయం కావాలసినటైతే ఆమెకు, మీతో చెప్పే అవకాశం ఇవ్వండి. ఆమె శరీరాన్ని ఎలా తాకాలో, ఎలా కదిలించాలో ఆమెకు సౌకర్యంగా వుండే విధానాన్ని చెప్పే అవకాశం ఆమెకు ఇవ్వండి. వారికి అయిష్టంగా అనిపించే స్పర్శలకు 'వద్దు అని అనటం వికలాంగ బాలికలకు నేర్చించండి.
వికలాంగ బాలికలతో లైంగిక వేధింపుల గురించి వివరంగా మాట్లాడి, వారిని వారు కాపాడుకోవటం నేర్చుకొనేలా చేయండి.
వైకల్యం గల బిడ్డను మీరు ప్రేమతో, మర్యాద పూర్వకంగా పెంచినటైతే, ఆమె ఒక ఆత్మవిశ్వాసంతోను, జీవించగల ధీమా గల స్త్రీగాను మారుతుంది పెరిగి. అపుడు ఇతరులు కూడా వారిపట్ల నిరాదరణ కనబరచకుండా వుంటారు.
ఒక స్త్రీ నివసించే సమాజ పరిస్థితులను అనుసరించి ఆమె గౌరవ మర్యాదలు వుంటాయి. స్త్రీల పట్ల వేధింపులను తీవ్రంగా పరిగణింపబడే ప్రాంతంలో వున్న స్త్రీలు వేధింపులకు గురికావడం అరుదు. వికలాంగ స్త్రీలు సమాజంలో ముఖ్య వ్యక్తులుగా వున్న చోట, వికలాంగ స్త్రీల పట్ల నిరాదరణ, వేధింపులు కనిపించవు. వికలాంగ స్త్రీలు వృధా వ్యక్తులుగా భావింపబడే సమాజాలలో చాలా మంది స్త్రీలు నిరాదరణ పాలవ్వటం జరుగుతుంది. వేధింపులకు, నిరాదరణకు గురయ్యే స్త్రీలకు, ముఖ్యంగా వికలాంగ స్త్రీలకు సహాయం అందించాలి. మాన భంగం జరిగినపుడు, ఆ కష్ట పరిస్థితిలో ఆదుకొనే కేంద్రాలు, అత్యవసర పరిస్థితిని ఆదుకొనే ఆశ్రమాలు, ఆశ్రయాలు మరియు వికలాంగ స్త్రీల పట్ల జరిగే హింస, వేధింపులకు వ్యతిరేకంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పరచాలి. భవనాలు, వికలాంగులకు ఉపయోగపడే విధంగా అనుకూల నిర్మాణాలతో వుండేలా ఏర్పరచాలి. అంధులకు, బధిరులకు (చెముడు గల వారికి), ఇంకా అర్ధం చేసుకోలేని అవగాహనా లోపం గల స్త్రీలకు అనువుగా తగిన సమాచారం, సౌకర్యాలు అందుబాటుగా వుండేలా చూడాలి.
వేధింపులకు, హింసకు గురైన వ్యక్తుల మానసిక ఆరోగ్యం కోసం ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, కౌన్సెలింగ్ కేంద్రాలు, చర్చిలు లేదా సమాజంలో పెద్దలు కృషి చేయవచ్చు. వారికి సలహాలు, సూచనలు ఇచ్చి తగిన అవగాహన కల్పించినటైతే, వారు విశ్వాసంతో, ఆత్మగౌరవం, సత్ర్పవర్తనలతో జీవితం తిరిగి సాగించగలుగుతారు.
పురుషులకు సమావేశాల ద్వారా, చర్చలలో పాల్గొనే అవకాశం కల్పించి, స్త్రీలను హింసించటం, వేధించటం ఎంత అన్యాయమో తెలిసేలా చేయాలి. పోలీసు అధికారులు, సమాజంలోని ఇతర అధికారులు, వికలాంగ స్త్రీలను వేధించటం ఎన్నటికీ సరైన పని కాదని గుర్తించేలా చూడాలి. సౌంజ్ఞ భాష తెలిసిన వ్యక్తులను సమాజపరమైన అన్ని సేవలలోను, అంటే పోలీసు స్టేషన్లు, క్లినిక్లు మరియు ఆసుపత్రులలో నియమించాలి.
నిరాదరణకు, హింసకు గురైన స్త్రీలకు రక్షణనిచ్చే మీ దేశంలోని చట్టాల గురించి తెలుసుకోవాలి, వాటి గురించి ఇతరులకు వివరించండి. సభలను, సమావేశాలను ఏర్పరచి వికలాంగ స్త్రీలను, ఇతర స్త్రీలను కూడా సమావేశపరచి, స్త్రీల పట్ల పెరుగుతున్న హింస, వేధింపులు - వీటికి వ్యతిరేకంగా పోరాడేలా ప్రోత్సహించాలి. ఆరోగ్య కార్యకర్తలు, వికలాంగ స్త్రీలు మరియు సమాజంలోని ఇతర వ్యక్తులు ఈ విషయాల గురించి ఆలోచించి, మాట్లాడుకున్నటైతే, స్త్రీలందరికీ కూడా ఈ బాధ తప్పతుంది.
ఒక స్త్రీ తను వేధింపులకు గురైనట్లు చెప్లినపుడు, ఆమెను విశ్వసించాలి. ఆమె ఎవరైనా సరే ఆమెకు మద్దతునీయాలి. ఇంకా ఒక వికలాంగ శ్రీ నిరాదరణకు, హింసకు గురవ్వటం అన్ల విషయం మారి ఘలోరమైనది, ఎందుకంటే బలహీనమైన ఆమె స్థితి.
ఒక స్త్రీ వేధింపులకు, హింసకు గురవ్వటం అన్దది కేవలం ఒక వ్యక్తితో కుటుంబానితో సంబంధించిన సమస్త కాదు. అది సాంఘిక మరియు సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన విషయం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020