మంచి మానసిక ఆరోగ్యం మంచి శారీరక ఆరోగ్యం లాగానే చాలా ముఖ్యం. మీ మానసిక ఆరోగ్యం సరిగా వున్నపుడు మీకెంతో ఆత్మబలం వసుంది. మీ యొక్క మీ కుటుంబం యొక్క అవసరాలను సంరక్షించుకోవటానికి, సమస్యలను గుర్తించి, పరిష్కరించుకోవటానికి, భవిష్యత్తును రూపకల్పన చేసుకోవటానికి, ఇతరులతో సంతృప్తి కరమైన బాంధవ్యాలను పెంపొందించుకోవటానికి తగిన భావోద్వేగ శక్తి వుంటుంది. మీ మానసిక ఆరోగ్యం మంచిగా వున్నపుడు మీరు ఇతరుల సహాయాన్ని అంగీకరిస్తారు. అయినా మీకు మీరు విలువనిచ్చుకుంటారు.
వికలాంగ స్త్రీలు చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకొంటూ వుంటారు. అందువలన వారు జీవితంలో ఎదురుపడే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోలేరు. తమతమ జీవితాలతో తృప్తి పడలేరు. సంఘానికి కూడా ఏమీ సేవ చేయలేరు. అయితే ఒక్కొక్కసారి యిూ మానసిక సమస్యలు వారివారి అంగవైకల్యం వలన కూడా కలగవచ్చు. కాని ఎక్కువగా సంఘం వారిపట్ల వ్యవహరించే తీరు కూడా యీ మానసిక వైకల్యానికి దోహదం చేస్తుంది.
వికలాంగ స్త్రీలు మానసికంగా ఎదుర్కొనే సమస్యలను యీ అధ్యాయంలో వివరించటం జరిగింది. సాధారణంగా ఎదురయ్యే మానసిక సమస్యలనూ, వాటిని కొంతవరకైనా పరిష్కరించేటందుకు సలహాలనూ, సూచనలనూ కూడా వివరించడం జరిగింది. ఇంకా కుటుంబంలోని సభ్యులూ, సమాజంలోని వారూ వీరి మానసిక ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించగలరో వివరించబడింది.
మానసిక వైకల్య సమస్యలను పరిష్కరించటమనేది తొందరగా జరిగే పనికాదు. ఎవరైనా అలా పరిష్కరించ గలమని వాగ్గానాలు చేస్తే నమ్మవదు.
వికలాంగ స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని సమస్యలు యివి; ఒత్తిడి, ఒంటరితనం, నిమ్న దృష్టితో చూడబడటం, నరములను దెబ్బతీసేటటువంటి సంఘటనలు జరగటం. అయితే పైన చెప్పబడిన సమస్యలున్న వారందరికీ మానసిక ఆరోగ్య సమస్యలు కలగకపోవచ్చు. ఉదాహరణకు ఒత్తిడి మానసిక సమస్య కాదు. అయితే యితర సమస్యలను ఎదుర్కోలేనపుడు తీవ్రమైన ఒత్తిడి కూడా మానసిక సమస్యలకు దారి తీయొచ్చు. అలాగే నరములను దెబ్బతీసే సంఘటనలు జరగటం కూడా అన్ని వేళలా మానసిక సమస్యలకు దారితీయకపోవచ్చు. కాని ఆ సమస్యలను అర్థం చేసుకొని నిలబడటానికి కావలసిన సహకారం, తోడ్పాటు లేనట్లయితే అపుడు మానసిక సమస్యలకు దారితీయొచ్చు. మానసిక ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించేటపుడు, యీ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి.
ఎవరైనా మానసిక అస్వసులుగా వున్నారని మీకు అనిపిస్తే:
ఎవరైనా మానసిక అస్వస్తులుగా వున్నారని మీకు సందేహం కలిగితే ఆమె గురించి బాగా తెలుసుకోండి. ఆమె నడవడికలో, ఆమె పద్ధతులలో వచ్చిన మార్పులను యితరుల వలన తెలుసుకోండి.
మానసిక ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఆ కుటుంబం లేదా వారి పరిసరాలలో నివశించే వారి కారణంగానే ఉత్పన్నమవుతాయి. కనుక ఆయా పరిస్థితులు ఈ సమస్యకు దోహదకారమయ్యాయ్యేమో ఆలోచించాలి. మానసిక ఆరోగ్య సమస్యలన్నిటికీ గుర్తించగల కారణాలుండవు. కొన్నిసార్లు ఒకరికి మానసిక ఆరోగ్య సమస్య ఎందుకు కలిగిందో తెలియనే తెలియదు.
ఒత్తిడి:
చాలా కాలం ప్రతిరోజూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ వుంటే, ఆ ఒత్తిడికి నలిగి పోయి అశక్తులవుతారు. మీ విలువను మీరు తెలుసుకోకుండా, మీ అవసరాలను విస్మరిస్తే యీ సమస్య తీవ్రతరమవుతుంది.
ఒత్తిడి కారణంగా శారీరక (భౌతిక) మార్పులు - వ్యాధులు
మీరు ఒత్తిడిని అనుభవించినపుడు, మీ శరీరం చాలా వేగంగా స్పందిస్తుంది. అందువలన మీ శరీరంలో కలిగే కొన్ని మార్పులు:
ఒత్తిడి అకస్మాత్తుగానూ, తీవ్రంగానూ వచ్చినదైతే మీ శరీరంలో పైన చెప్పబడిన మార్పులు వస్తాయి. ఆ ఒత్తిడి తగ్గిపోయినట్లయితే మీ శరీరం తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఆ ఒత్తిడి తీవ్రత తగ్గినటైతే ఆ ఒత్తిడి ప్రభావమే మీ శరీరంలో కలిగిన మార్పులకు కారణమని మీరసలు గుర్తించనే లేరు.
ఒత్తిడి చాలా కాలంగా అలాగే వుంటే ఆందోళన, నిస్పృహ, తలనొప్పి, అన్నపు ప్రేవుల సమస్య, శక్తిహీనత లాంటి శారీరక సమస్యలకు దారి తీయొచ్చు. ఎక్కువ కాలంగా వుండే ఆందోళన అధిక రక్తపోటు లాంటి వ్యాధులకు కూడా దారి తీయవచ్చు.
సాంఘిక ప్రతిబంధకాలు - ఒత్తిడులు
తమ ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు తీసుకోవటానికి కూడా వికలాంగ స్త్రీలకు ప్రతిబంధకాలైన సామాజిక హద్దులు కూడా వారి నిత్య జీవితంలో ఒత్తిడిని కలగజేస్తాయి. అనేక రకాల ఒత్తిడులను ఎదుర్కొనే వికలాంగ స్త్రీలకు ఆసరా చాలా అవసరం. వారి శక్తి మీద వారికి గట్టి నమ్మకం కలిగేలా, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకొనేలాంటి గట్టి సపోర్టు వారికి కావాలి.
లింగ పరమైన వివక్షత
స్త్రీ, పురుష భేదం వివరించటానికి వాడే శబ్దమే లింగం (జెండర్). మగ పిల్లలకిచ్చినంత ప్రాముఖ్యత, తమకివ్వని కమ్యూనిటీలలోని ఆడ పిల్లలు ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తారు. మీ అన్నదమ్ములకు విద్య, ఆహార విషయాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. మిమ్మల్ని చాలా చెడుగా విమర్శించవచ్చు. మీరెంతో కష్టపడి చేసిన పని గుర్తించబడక పోవచ్చు. అదే ఒక వికలాంగ బాలుని పట్ల గానీ, వికలాంగురాలు కాని బాలిక పట్లగానీ, ఈ విధంగా వ్యవహరించరు. మీరు ఎదుగుతున్న కొద్దీ మీరే అనుకొంటారు. మీ జీవిత భాగస్వామి గానీ, మీ కుటుంబ సభ్యులుగాని మీ పట్ల వ్యవహరించే తీరు మంచిగా వుండాలి అని అనుకొనే అర్హత మీకు లేదని. కుటుంబంలోనూ, కమ్యూనిటీలోనూ మీకు ప్రాముఖ్యత లేకపోవడం కూడా స్వాభావికమూ, సరి అయినదీ అని కూడా మీరు అనుకోంటారు. నిజానికి అది అన్యాయం అని తెలిసి కూడా.
బీదతనము
ఒక వికలాంగ బాలికనుగాని, స్త్రీని గాని ఆమెకు అవసరమైన వస్తువులను అమర్చి పోషించటం ఒక బీద కుటుంబానికి చాలా భారమైన విషయం. ఆమెకు బడికి వెళ్లటానికి అవసరమైన వినికిడి యంత్రం (హియరింగ్ ఎయిడ్), నడవటానికి సహకరించే చేతి కర్రలూ (క్రట్చెస్) గాని లభించవు. వికలాంగ బాలిక (స్త్రీ) ఆ కుటుంబ భారాన్ని మోయటంలో పాలు పంచుకోలేనిదైతే ఆమెను ఆ కుటుంబంలోని వారు భారంగా భావిస్తారు. ఆహారం కొద్దిగా వుంటే అందులో ఎక్కువ భాగాన్ని బయటికి వెళ్లి పనిచేసి సంపాదించి కుటుంబానికి సహాయం చేయగలవారికోసం కేటాయించుతారు.
అంగ వైకల్యం గురించిన అభిప్రాయాలు:
సంఘాలు (కమ్యూనిటీలు) కూడా వికలాంగ స్త్రీల గురించి తక్కువగా అంచనా వేస్తాయి. అంగ వైకల్యం, అశక్తతతో వీరు ఏమి సాధించగలరు? అని అది గ్రహించిన వికలాంగ స్త్రీలు తమని తాము చాలా తక్కువగా అనుకొంటారు. తరచూ తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ వుంటారు.
వివక్షత, ఒత్తిడి మరియు ఆత్మగౌరవం
జీవిత భాగస్వామిగా తగిన వాళ్లం కాదని తిరస్కరించబడతాము. పనిచేసే చోట పనికి రానివాళ్లంగా చూడబడతాము. విద్యావకాశాలున్నా తరచూ ఆ అవకాశాన్ని పొందలేరు. ఉదాహరణకు: వికలాంగ బాలల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక స్కూళ్ళలో కూడా బాలురకే ప్రాధాన్యత యివ్వబడుతుంది. ఏ రకమైన పని కోసమైనా శిక్షణ పొందటం మనకు వీలు కాదు. శారీరకంగా, మానసికంగా, లింగపరంగా ఆ విషయాన్ని మనం తెలుసుకొంటాము. వికలాంగులు కాని స్త్రీ, పురుషులందరి లాగా మనని స్వంత నిర్ణయాలు తీసుకోనివ్వరు. ఇంట్లోగానీ సొసైటీలో గానీ... కాని సంఘంలో ప్రతి ఒక్కరికీ కూడా వున్న పెద్ద సమస్య ఏమిటంటే ఆత్మగౌరవం లేకపోవటం - సొసైటీ వలన మనం నేర్చుకొన్నదేమిటంటే మనకి మనం విలువను ఇచ్చుకోకపోవటం. భర్తనూ, పిల్లలనూ కలిగి వుండటానికి, అర్థవంతమైన పనులు చేయటానికి మనం అనరులంగా భావించబడు తున్నాము. మన స్వంత కుటుంబీకులు కూడా మనం వాళ్లకు ఉపయోగ పడతామనిపిస్తేనే మనని కోరుతారు. - డోర్మా అహెంక్రో ఘనా |
శరీరం - రూపురేఖలు
స్త్రీ అనగానే ఒక అందమైన అభిప్రాయం వుంది సమాజంలో. ఈ కారణంగానే వికలాంగ స్త్రీలను స్త్రీలుగానే గుర్తించటం లేదు సమాజం. కాని, వికలాంగ స్త్రీలు వారి చుటూ వున్న అనేక రకాల వ్యక్తులనూ, వారి ప్రవర్తనలనూ గమనించుతూ వుండటం వలన, వారికీ తమకూ మధ్య వున్న తారతమ్యాన్ని గుర్తించగలరు. ప్రశంసించగలరు కూడా.
తమని తాము అలా అందంగా, చక్కటి వస్రధారణతో బలంగా, సమర్థ వంతులుగా ఉహించుకుంటారు. వారిలో ఎన్ని వికారాలున్నా - (మచ్చలు, అంగ వైకల్యం, వికారమైన అంగ ఆకృతులూ, వికృతమైన భావ ప్రకటనలు, మూర్చలు, నడవటానికి సహాయపడే చేతి కర్రలు, క్రెచెస్, చక్రాల కుర్చీలు, హియరింగ్ ఎయిడ్స్ వంటి వుపకరణాలను వాడున్నా) అన్నిటినీ విస్మరించి తమను తాము గొప్పగా సమర్థులుగా అనుకుంటారు.
నా రూపురేఖలను నేనెలా మార్చుకున్నాను?
వారు నాకు డ్రెస్ చేసిన పద్ధతీ, నా జుత్తు కట్టబడిన విధానం బట్టి నేనొక చిన్నపిల్ల మాదిరిగానే కనపిస్తున్నట్లుగా నేను తెలుసుకుంటాను. వారు నన్ను గౌరవంగా చూడటం లేదు అంటే ఆశ్చర్యమేమీ లేదు. కానీ, నేను ఎదిగిన 25 సంవత్సరాల వయసు గల స్త్రీని, చిన్న పిల్లగా చూడబడటం నాకు ఇష్టంలేదు. కనుక కమ్యూనిటీలోని ఇతర స్త్రీలు వారి జుత్తును ఎలా కట్టుకుంటారో, అదే విధంగా నా జుత్తును నేను కట్టుకొనేందుకు సహాయం చేయమని నేను నాకు సహాయం చేసే వారిని అడుగుతాను. వారు అందుకు సంతోషిస్తారు. ఈ విషయం వారు ఇంతకు ముందెపుడూ అనుకోలేదు. ఎందుకంటే వారు వారి స్వంత అమ్మాయిలకు (చిన్న వయసు కూతుళ్లకు) ఎలా జడలు వేస్తారో అలానే నాకు వేసేవారు ఇపుడు నా స్నేహితులు కమ్యూనిటీలోని ఇతర స్త్రీల మాదిరిగానే నేను డ్రైస్ చేసుకోవటానికి సహకరిస్తారు. అపుడు కమ్యూనిటీలోని వ్యక్తులందరూ నన్ను గౌరవంగా (మర్యాదగా) చూస్తారు. |
ఒంటరితనం
వికలాంగ బాలికలు ఇతర పిల్లలతో కలిసి కాకుండా వేరుగా పెరగటం వలన వారికి ఇతరులతో స్నేహాన్ని పెంపొందించుకోగల అవకాశం వుండదు. పెద్ద వారిలా బలమైన బాంధవ్యాల నేర్పరుచుకోగల సాంఘిక పరమైన నేర్పును కూడా వారు నేర్చుకోలేరు. ఒంటరిగా, విడిగా వుండటం వారిలో ఒత్తిడిని కలగచేస్తాయి. స్నేహితులను కలిగి వుండటం, కమ్యూనిటీలో ఒక భాగంగా మెలగటం - ఆత్మగౌరవం కలిగి వుండానికి దోహదకారణం అవుతాయి. యుక్త వయస్కురాలికి తనకు అంగవైకల్యం వున్నా సరే తన లైంగికత పై నమ్మకం పెరగటం కోసం సపోర్టు అవసరం. అపుడే ఆమె స్వంతంగా క్లోజైన మరియు లైంగిక సంబంధాలను ఏర్పరుచుకోగలదు.
వృత్తి నైపుణ్యతలు
ధనార్ధన కోసం చేసే వృత్తికి అవసరమైన శిక్షణను వికలాంగ స్త్రీలు పూర్తిగా పొందలేరు. వృత్తి నైపుణ్యత లేనటువంటి స్త్రీలకు పని చేసి సంపాదించటం, కుటుంబాన్ని పోషించటం చాలా కష్టమైన పనులు.
అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, వాటిలో అతి సాధారణమైన కొన్ని మానసిక సమస్యలు ఏమిటంటే - ఆందోళన, నిస్పృహ, దుర్ఘటనలను విన్నపుడు, చూచినపుడు కలిగే షాకులు, మత్తు పానీయం, మత్తుమందుల దుర్వినియోగం. నిస్పృహ (డిప్రెషన్) మామూలు స్త్రీలలో నిరాశా నిస్పృహలకు గురి అయ్యేవారు 10 మందిలో ఇద్దరు వుంటే, వికలాంగ స్త్రీలలో 10 మందిలో అయిదుగురుంటారు. ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. ఎందుకంటే వికలాంగ స్త్రీలలో (బాలికల) చాలా మందికి చదువుకోగల అవకాశం గానీ, వారి కోసం వారు ఏమైనా చేసుకోగల అవకాశం గాని వుండవు. మీరు పెరుగుతున్న కొద్దీ సామాజిక కట్టుబాట్లు, మీ శరీరంలో, ఆరోగ్యంలో వచ్చే మార్పులూ మీకు మరింత కష్టాన్ని కలిగించి కృంగదీస్తాయి.
లక్షణాలు:
మీరు ఈ బాధలను అనుభవించేటపుడు మీకు ఈ మాటలు నమ్మశక్యం కావు కాని, యిది నిజం, ఈ నిస్పృహ ఎప్పటికీ మిమ్మల్ని అంటిపెట్టుకొని వుండబోదు.
మీరు ఎదుగుతున్న కొద్దీ
మీ వయస్సు పెరిగి మీరు ఎదుగుతున్న కొద్దీ మీ శరీరం మార్పు చెందుతూనే వటుంది. మీ రోజువారీ పనులు యింకా ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి. మీలోని వైకల్యాలు యింకా ఎక్కువ అవుతాయి. మీ కొన్ని శరీర భాగాలను ఎక్కువగా వాడవలసి రావటం వలన మీకు వేరే రెండో రకమైన వైకల్యాలు కూడా కలగవచ్చు. మీరు ఎదుగుతున్న కొద్దీ, మీకలవాటైన ఎన్నో విషయాలు మీ శరీరంతో ఏకీభవించక పోవచ్చు. కనుక మీ పద్దతులను మీరు తరచూ మార్చుకోవలసి వుంటుంది. ఈ తరచూ కలుగుతున్న మార్పులు మీరెప్పటికీ స్వతంత్రులుగా వుండలేరనీ, ఇతరుల మీద ఆధారపడి వారి సహాయాన్ని పొందుతూనే వుండాలన్న అభిప్రాయాన్ని మీకు కలగ జేస్తాయి. ఈ అభిప్రాయాలు రానురానూ మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి.
ఎక్కువ సమయం విచారంగా గడుపుతున్నా లేక నిద్రపట్టక బాధ పడుతున్నా లేక మీ మనోగత భావాలు తరచూ మారిపోతున్నా మీరు ఎక్కువగా నమ్మే మీ కుటుంబ సభ్యులలో ఒకరితో గాని, లేదా ఆరోగ్య కార్యకర్తతో గాని మాట్లాడండి.
ఆత్మహత్య తీవ్రమైన నిస్పృహ ఆత్మహత్యకు దారి తీస్తుంది. చాలా మందికి వారి జీవితంలో ఒక్కసారైనా ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు వస్తుంది. కాని, ఈ ఆలోచన తరచుగా చాలా సార్లు వస్తున్నా చలా బలీయంగా వున్నా మీరు వెంటనే ఒక తర్ఫీదు పొందిన కౌన్సెలర్ ను (బుద్ధి చెప్పి మంచి సలహా యిచ్చువాడు) గాని, ఒక ఆరోగ్య కార్యకర్తను గాని కలసి సహాయం పొందాలి.
ఈ ప్రశ్నలలో వేటికైనా “అవును” అన్న సమాధానం వస్తే, మీకు నమ్మకం వున్న వ్యక్తులు ఎవరితోనైనా, మీ సమస్యలను చెప్పకుంటే చాలు - మీరు మెరుగా అవుతారు. నిస్పృహను తగ్గించటానికి కౌన్సెలర్స్ సలహాలను, డాక్టర్సు మందులనూ వాడతారు. |
ఆందోళన (నెర్వస్ గా వుండటం, లేక బాధపడుతూ వుండటం)
ఆందోళనకు ఇతర సాధారణ పేర్లు నరాలు, నరాల నొప్పలు, గుండెల్లో వ్యధ ఆందోళన, దిగులుతో చాలా కాలంగా బాధపడుతూ వుండే మీరు నరముల బలహీనతకు గురై మానసిక ఆరోగ్య సమస్యలకు గురికాగలరు.
లక్షణాలు
తీవ్రమైన ఆందోళనే ఈ భీతిల్లిపోవటానికి కారణం. ఇది చాలా అకస్మాత్తుగా వచ్చి కొన్ని నిముషాలు లేక గంటల పాటు వుంటుంది.
పై లక్షణాలతో పాటు మీరు భయబ్రాంతులవుతారు. స్పృహను కోల్పోతున్నట్లు లేక చనిపోతున్నట్లు భావిస్తారు. ఛాతీలో నొప్పి శ్వాస తీసుకోవటం కష్టంగా జరగటం లాంటి బాధలు కలగవచ్చు. ఏదో భయంకరమైన సంఘటన జరగబోతున్నట్లు అనిపించవచ్చు.
దుర్ఘటనలను చూచినపుడు, విన్నపుడు,
అనుభవించినపుడు పొందే గాయం (షాక్) - ప్రతిస్పందన
ఏదైనా భయంకరమైన విషయం లేదా సంఘటన ఒక స్త్రీ విషయంలో జరిగినపుడు, ఆమె షాకుకు గురి అవుతుంది. ఆ షాక్ (ట్రామా)కు కారణమయ్యే కొన్ని సాధారణ విషయాలు - ఇంటిలోని వారి దౌర్జన్యం, మానభంగం, తగువు, యుద్ధం, హింస, ప్రకృతి వైపరీత్యాలు - ఈ షాకుల వలన కలిగే ప్రతిస్పందనలు ఆ స్త్రీ యొక్క మానసిక లేదా శారీరక ఆరోగ్యాలను లేదా రెండు రకాల ఆరోగ్యాలనూ భంగ పరచవచ్చు. ఫలితంగా ఆమెలో అభద్రతాభావం, నిస్సహాయతా, ప్రపంచం మీదా, తన చుటూ వున్న వారిపైనా అపనమ్మకం చోటు చేసుకుంటాయి. ఆమె యిూ పరిస్థితి నుంచి కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా ఇందుకు కారణం మరొక వ్యక్తే అయినపుడు.
షాక్ (ట్రామా) కారణంగా కలిగే వైకల్యం
ఒక స్త్రీకి కొంత మామూలు జీవితం అనుభవించిన తరువాత ఏ ప్రమాదం కారణంగానో జబ్బు కారణంగానో అకస్మాత్తుగా అంగ వైకల్యం కలిగినటైతే, ఆ మార్పును తట్టుకోవటం ఆమెకు చాలా కష్ట తరమవుతుంది. ఇలా క్రొత్తగా (మధ్యలో) వైకల్యాన్ని పొందిన స్త్రీలలో కొందరైతే తాము సర్వం కోల్పోయినటూ తమకు గాని, తమ కుటుంబానికీ సంఘానికీ గాని ఎందుకూ పనికిరాని వాళ్లుగా అయిపోయామని అనుకోవచ్చు. తమ పట్ల జరిగిన ఈ సంఘటనతో వారు భయం భయంగా, స్థిరత్వం లేకుండా (అశాంతిగా) వుంటారు.
ఇలా క్రొత్తగా వైకల్యం కలిగిన ఫ్రీ విద్యావతీ, వివేకవతీ, తన మీద తనకు నమ్మకం కలిగినదిగా పెరిగి వుండి వుండొచ్చు. ఆమెకు ఇతరులలో బలీయమైన సత్సంబంధాలుండి వుండొచ్చు. అదే విధంగా వారు తనను మర్యాదగా చూడాలన్న కోరిక్త కలదై వుండవచ్చు. తన శరీరంలో కలిగిన యీ మార్పుకు అనుగుణంగా సర్దుకుపోవటానికి చాలా సమయం పట్టవచ్చు. అలా సర్దుకుపోవటం చాలా కష్ట తరమైన విషయం - ఇతరులు తమ వైకల్యం పట్ల ప్రవర్తించే తీరు కూడా కష్టంగానే వుంటుంది.
ఇలా క్రొత్తగా వైకల్యాన్ని పొందిన వారు నిరాశ పడకుండా వుండేలా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు. వారి యీ జీవితాలను గడపడానికి ఎన్నో మార్గాలున్నాయని తెలుసుకుంటారు.
నిరాదరణ కూడా ఒక రకమైన గాయమే (షాక్)
వికలాంగ బాలికలు ముఖ్యంగా వారి కుటుంబం లోని కొందరు వ్యక్తుల వలననే నిరాదరణకూ, హింసకూ గురి అవుతారు. ఒక బాలికను ఎవరైనా లైంగిక భావంతో తాకినా లేక తండ్రి, సోదరుడు, బంధువు లేక సంరక్షకుడు అందు కోసం ఆమెను ఒత్తిడి చేసినా అది నిరాదరణే. కొట్టటం, తిట్టటం బాధ పెట్టటం, క్రూరంగా హింసించటం, క్రూరమైన సంరక్షణలు తీసుకోవటం, అసలు ఆమెపట్ల శ్రద్దే తీసుకోక పోవటం ఇవన్నీ కూడా నిరాదరణ క్రిందకే వస్తాయి. నిరాదరణకూడా ఒకరకమైన గాయమే. బాలిక మానసిక ఆరోగ్యానికి విపరీతమైన హానిని కలగచేసేదే, ఒక స్త్రీ ని చిన్నపిల్లగా భావించి, నిరాదరించి బాధపెడితే, దాని ప్రభావం ఆమెపై చాలా సంవత్సరాల వరకూ వుంటుంది.
నిరాదరణకు నిత్యం గురవుతూనే వున్నా చాలా మంది వికలాంగ స్త్రీ లు ఎవరికీ ఫిర్యాదు చేయరు. ఎందుకంటే ఆదరంగా చూడబడటానికి తాము అరులం కాదని వారి నమ్మకం.
గాయానికి ప్రతిస్పందన
మీరు గాయాన్ని (షాకును) అనుభవించాక మీలో ఎన్నో ప్రతిస్పందనలు కలగవచ్చు. అది:
పైన చెప్పబడినవన్నీ కూడా గడు పరిస్థితికి చాలా సహజమైన ప్రతిస్పందనలు. ఉదాహరణకు: దుస్సంఘటన జరిగినందుకు కోపం రావటం లేక యింకా పరిస్థితి ప్రమాదకరంగా వుందేమోనని గమనిసూ వుండటం సహజం. కాని రోజువారీ పనులను చేసుకోలేనంత తీవ్రంగా లక్షణాలు గనుక వుంటే లేదా ఆ లక్షణాలు ట్రామా తరువాత కొన్ని నెలల తరువాత ప్రారంభమైతే మానసిక ఆరోగ్య సమస్యలు వుండి వుండొచ్చు.
గాయాలకు ప్రతిస్పందించి వున్న స్త్రీలకు సహాయ పడటం
మీకు తెలిసిన వారెవరైనా గాయాల ప్రతిక్రియలతో బాధపడుతూ వుంటే
స్నేహితులుగాని, కుటుంబ సభ్యులు గానీ, సంరక్షకులు గాని ముందుగా ఆమె దినచర్య లలో పాలు పంచుకోవటం గాని లేదా ఆమె కోరితే కొన్ని పనులను పూర్తిగా చేసి పెట్టటం గాని చాలా మంచిది. అపుడు మీరు వినటానికి సిద్ధంగా వున్నట్లు ఆమెకు తెలియనీయండి. ఆమె మాట్లాడటానికి సిద్ధపడే వరకూ ఆగండి. సరైన సమయం చూసి కొన్ని పనులు చేసేలా ఆమెను ప్రోత్సహించండి.
వికలాంగ స్త్రీలకు మానసిక అస్వస్థత కలిగే ప్రమాదం వుంది. ఈ క్రింది కారణాల కారణంగా .
ఈ క్రింది లక్షణాలను కలిగి వుంటే వికలాంగ స్త్రీకి మానసిక అస్వస్థత కలిగి వున్నట్లు లెఖ్ఖ.
విషయ ప్రయోగం వలన, మందుల వలన, తప్పడు మందుల వలన, మెదడు దెబ్బ తినటం వలన కూడా కలగవచ్చు. మానసికమైన జబ్బు లేని వారు కూడా కొన్ని సార్లు, వారికి మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదా అని ఇతరులు అనుకొనేలా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా ఇటువంటి ప్రవర్తనలు - మూఢ నమ్మకాల కారణంగానూ సంప్రదాయ పరంగానూ వచ్చినవి అవుతాయి. అయితే పూర్తి కమ్యూనిటీ వాటిని షేర్ చేసుకోదు. ఉదాహరణకు ఒక స్త్రీ తనకు కల ద్వారా ఒక ఉపదేశాన్ని పొందేను అని చెప్పిందంటే ఆమె సాంప్రదాయక పరమైన జ్ఞానాన్ని మార్గదర్శకతనూ వాడుకుంటూండవచ్చు. అంతేకాని ఆమె భ్రమల నుంచీ, మానసిక అస్వస్థలతోనూ బాధ పడటం లేదు. ఈ లక్షణాలు బలంగానూ తరచుగానూ వసూ ఆ వ్యక్తి తన దినసరి కార్యక్రమాలను చేసుకోవటానికి కష్టం కలిగిస్తే అపుడు ఆ లక్షణాలను మానసిక అనారోగ్యానికి సంబంధించినవిగా అనుకోవచ్చు.
మానసిక అనారోగ్యానికి సంరక్షణ పొందటం
మానసిక అనారోగ్యవంతులను గురించిన జాగ్రత్తలను ఎక్కువగా వారి కుటుంబ సభ్యులే తీసుకొంటూ వుంటారు. కాని అదే ఒక తర్ఫీదు పొందిన మానసిక ఆరోగ్య కార్యకర్త ఆ బాధ్యతను నిర్వహిస్తే చాలా మంచిది. కొన్ని పరస్థితులలో మందులు అవసరమే కాని, ఆ మందులు వాడటమొక్కటే మాత్రం చికిత్స కారాదు. సాంప్రదాయ బద్ధంగా చికిత్స చేసే వైద్యులు ఈ మానసిక రోగులకు చికిత్స చేయటంలో తరచూ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. ఇలా చికిత్స చేసేవారు, మానసిక సమస్యతో బాధపడే వ్యక్తి కమ్యూనిటీ నుంచే వచ్చిన వారైతే ఆమెను, ఆమె కుటుంబాన్ని ఆమె అనుభవిస్తున్న మానసిక ఒత్తిడులను వివరంగా అర్థం చేసుకోగలుతారు. ఆ స్త్రీ ఆ సమస్యల నుంచి విముక్తురాలు కావటానికి కొందరు అటువంటి వైద్యులు పూజలు, శాంతులను కూడా చేస్తారు.
ఎటువంటి వైద్యం చేయిస్తున్నారనే దానికన్నా యిూ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు దయగా మర్యాదగా, గౌరవంగా చూడబడటం ముఖ్యం.
మానసిక అనారోగ్యానికి చికిత్స చేయటానికి నిర్ణయం తీసుకొనే ముందు యీ ప్రశ్నలను అడగండి.
ఎవరైనా ఆసుపత్రిలోనే వుండి చికిత్స చేయించుకోవలసి వస్తే, వారికి అక్కడ తిరగడానికి వీలుగా సౌకర్యంగా వున్నారో లేదో ముందే అడిగి తెలుసుకోండి. ఆసుపత్రి శుభ్రంగానూ, రోగులు సురక్షితంగానూ వుంటారన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోండి. సందర్శకులను రానివ్వటం, శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తచే రెగ్యులర్గా చికిత్స జరపబడుతుందా అన్న విషయాలను ధృవపరుచుకోండి. రోగులు స్వేచ్చగా తిరగలేకపోయినట్లయితే, వారు వారికి, యితరులకూ కూడా ప్రమాదకారులు అవుతారు. తరువాత ఆ వ్యక్తిని ఆసుపత్రి నుంచి విడుదల చేసి తీసుకు వెళ్లటానికి ఏం చేయాలో కూడా రూఢిగా తెలుసుకోండి.
అంగ వైకల్యం గల వ్యక్తులకు చుటూ తిరగటానికి, చెప్పకోవటానికి వీలుకాని విధంగా వుండే భవనాలు, సేవలు ఎలా కష్టం కలిగిస్తాయో, అదే విధంగా మానసిక ఆరోగ్య సమస్యలున్న వ్యక్తుల విషయంలో కూడా జరుగుతుంది.
మంచి జీవితాన్ని ఏర్పాటు అంగ వైకల్యం గల స్త్రీలకు ఆరోగ్యం విద్యా స్వతంత్రంగా తిరగగల శక్తి, బ్రతుకు తెరువు అవసరం. కాని యీ లక్ష్యాలను పొందటంలో ఎదురుపడే కష్టాలు మీలో మానసిక ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయి. నిస్పృహ, ఆందోళన, ఆత్మన్యూనత వంటి మీ భావాలను అధిగమించటానికి మానసిక ఆరోగ్య కార్యకర్త చేసే చికిత్స సాధారణంగా మీకవసరం లేదు. మీకు మీరు సహాయం చేసుకో గల మార్గాలున్నాయి. వేరే వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం యొక్క సపోర్టు ద్వారా మీరు మంచిగా మారే అవకాశాలున్నాయి.
తక్కువ వనరులతో మీరు చేయగల పనులు
పని ఒత్తిడులు తగ్గించుకొని ప్రశాంతంగా వుండటం కోసం సూచనలు
ఈ వ్యాయామం చేస్తునప్పుడు ఎపుడైనా మీకు అసౌకర్యంగా వున్నట్లు అనిపించినా, లేక భయం కలిగినా కళ్లు తెరిచి గాఢంగా వూపిరి తీసుకోండి. |
సహాయక సంబంధాలు
సహాయక బాంధవ్యంలో ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు ఒకరినొకరు తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి సహాయం చేసుకోవటానికి ఒప్పందం చేసుకొంటారు.
సహాయక బాంధవ్యాలు మీకు అండ లభించటానకి, మీ భావాలను గుర్తించటానికి మీలో అకస్మాత్తుగా కలిగే ప్రతిస్పందనలను అదుపు చేయటానికి సహాయం చేయగలవు. ఇది ఏ బాంధవ్యం లోనైనా జరగవచ్చు. స్నేహితుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య లేక కలిసి పని చేసే స్త్రీల మధ్య, లేక, మరొక ప్రయోజనం కోసం ఇప్పటికే కలుస్తున్న ఒక బృందం మధ్య లేక అందరికీ వుండే ఒక వుమ్మడి సమస్య కారణంగా ఒక క్రొత్త బృందం తయారవ వచ్చు. వీరిని సపోర్టు గ్రూపులు అంటారు. ఒక కొత్త బృందాన్ని తయారు చేయటం కంటే ఇప్పటికే వున్న బృందాల్ని సపోర్టు గ్రూపుగా మార్చటం సులభం.
సహాయక బృందాల నేర్పరచుకొనేటపుడు జాగ్రత్తగా వుండండి. మీ భావాలను మీ రహస్యాలను గౌరవించే వారితోనే బాంధవ్యాన్ని ఏర్పరచుకోండి.
మీకు మీరు విలువనిచ్చుకోవటం నేర్చుకోండి:
ఒక స్త్రీ తనకు అంగ వైకల్యం వున్నా లేకున్నా తన కుటుంబం, స్కూలు, కమ్యూనిటీల అండదండలతో పెరిగి చక్కటి (మంచి) జీవితాన్ని గడప గలిగినపుడు తన ఆత్మస్థైర్యం గురించిన ఆమె భావాలు చాలా గొప్పగా వుంటాయి. కాని ఒక స్త్రీ తన వైకల్యం ఇతరులలా కాక, తాను ఎందుకూ పనికి రాని దానినని భావిసూ పెరిగితే ముందు ఆమె తనకు తాను విలువనిచ్చుకోవటం నేర్చుకోవాలి.
ఆత్మ గౌరవం మానసిక ఆరోగ్యంలో ప్రధాన భాగం. మీరు గౌరవింపబడటానికి అరులు అని మీకు తెలిసినపుడు మీకు మంచి ఆత్మ గౌరవం వున్నట్లే. వ్యక్తులు మీరు చెప్పేది విని, మీ అభిప్రాయాలకు విలువనిస్తున్నారని తెలిసినపుడు - కష్టమైన విషయాలనెదుర్కొనటానికి మిమ్మల్ని మీరు సమరులుగా అనుకొంటారు.
వారివారి కుటుంబాలు, స్కూళ్లు, కమ్యూనిటీలు బాలికలను, స్త్రీలను మర్యాదగా గుర్తించినపుడు వారిలో ఆత్మగౌరవం పెరుగుతుంది. కుటుంబాలు, కమ్యూనిటీలు మీరు మంచి జీవితం గడపగలగటానికి ఎంత ఎక్కువ అండగా (సపోర్ట్) వుంటారో, అంత ఎక్కువ ఆత్మస్థిర్యాన్ని మీరు పొందగలుగుతారు. మీరు ఆత్మగౌరవాన్ని కలిగి వుండటానికి దోహదం చేసే యితర విషయాలు అర్థవంతమైన పని, ఆర్థిక, భద్రత, ప్రేమపూరితమైన సంబంధ బాంధవ్యాలు, శారీరక మరియు లైంగిక పరమైన రక్షణ.
ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవటం
మిమ్మల్ని మీరు గౌరవించుకొనే విషయాన్ని నేర్చుకోవటం, మీ ఆత్మగౌరవాన్ని పెంపొందింప చేసుకోవటం మీ బాల్యంలోనే ప్రారంభమయి మీ మిగిలిన జీవితకాలమంతా వుంటుంది. కాని మిమ్మల్ని ఒక చిన్న బిడ్డలాగా చూస్తూ విపరీతమైన రక్షణనిస్తూ మీమీద మీకు నమ్మకం కలిగించుకోవటానికీ, మీ పనులను మీరు ఎలా చేసుకోవాలో నేర్చుకోవటానికి అవకాశం దొరకక పోవటం వలన మీరు పెద్ద పెద్ద వాళ్ళలాగా జీవించలేరు. మీకు మీరు విలువను, మర్యాదనూ యిచ్చుకోగలగాలి. మీ అంగవైకల్యానికి అనుగుణంగా ఎలా మారి ఎలా పనులు చేసుకోవాలో మీ అనుభవమే మీకు నేర్పుతుంది.
కొత్తగా అంగ వైకల్యం పొందిన స్త్రీ ఆమె కుటుంబీకుల, స్నేహితుల సహాయ సహకారాలతో ఆ అంగ వైకల్యంతో ఎలా రాజీ పడి బ్రతకాలో నేర్చుకుంటుంది. తన అంగవైకల్యానికి అనుగుణంగా పని చేయగల క్రొత్త పద్ధతులను నేర్చుకుంటుంది. కాని తనపట్ల తను చూపించుకొనే విలువనూ మర్యాదనూ మటుకు మార్చుకోదు.
ఆనీ యొక్క కథ
|
నీలిమ ఎంచుకొన్న విషయం
భోజన పదార్థాలను తయారు చేసి అమ్ముతూ ఆమె మంచి వంట మనిషిగా పేరును తెచ్చుకున్నది. |
మీకు మీరు విలువనిచ్చుకోవటం, అన్నివేళలా సులభమైన విషయం కాదు కాని అంచెలంచెలుగా అయితే అది సాధ్యమే.
ఇతరులను కలవటం మీ మొట్ట మొదటి పని. మీరు బయటికి వెళ్లలేక పోయినట్లయితే, మీ యింటి గుమ్మంలో కూర్చొని మీ ఇరుగు పొరుగు వారిని పలకరించవచ్చు. మీరు వెళ్ల గలిగితే బజారుకు వెళ్లి అక్కడి వ్యక్తులతో మాట్లాడండి. వారు మీతో మాట్లాడటం మొదలు పెట్టిన తరువాత వారు తెలుసుకుంటారు వైకల్యం గల స్త్రీలకు, వైకల్యం లేని స్త్రీలకు మధ్య పెద్దగా అంతరం లేదని, మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి మీరు ఇతరులతో మాట్లాడటానికి అలవాటు పడి సులభంగా సమాజంలో ఒక వ్యక్తిగా కలిసి పోగలుగుతారు. కొన్ని సందర్భాలలో తన వైకల్య కారణంగా స్త్రీ ఇతరులతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంది. వినికిడి శక్తి లేని (చెవుడు) స్త్రీలు, లేక స్పష్టంగా మాట్లాడలేని వారు, చేతి సౌంజ్ఞలతోను, బొమ్మలను చూపించటం ద్వారాను ఎదుటి వారికి తెలియచేయవచ్చు. ఒక వినికిడి శక్తి లేని బధిరురాలైన స్త్రీ తన ఇరుగు పొరుగు వారికి సౌంజ్ఞ (సంకేత) భాషను నేర్పించవచ్చు. మొదట మీరు మాట్లాడాలని భావించే ఇద్దరు ముగురు వ్యక్తులతో ప్రారంభించండి పాఠం. ఓర్పు కలవారిని, మీతో కలిసి పని చేయటానికి ఇష్టపడే వారిని మాత్రమే ఎన్నుకోండి. మీరు కలిసి కృషి చేయటం వలన చాలా విషయాల గురించి ఇతరులకు తెలియచేయగలుగుతారు. క్రమంగా ఇంకా ఎక్కువ మందితో కలిసి పని చేసే స్థాయికి ఎదుగుతారు.
మీరు చేయవలసిన రెండవ పని వికలాంగ స్త్రీల బృందంలో చేరి కలిసి మెలసి వుండటం మొదలు పెట్టాలి. ఒక బృందం అయితే, అందరూ కలిసి ఒక భద్రమైన ప్రదేశం ఎన్నుకొని, అక్కడ కూర్చుని స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతారు. ఇతర స్త్రీలతో కలిసి మాట్లాడుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
నాకు నేను అవగాహన కలిగి, నా అభిప్రాయాన్ని మార్చుకోవటానికి చాలా కష్టపడ్డారు
జార్జియాకు చెందిన టినా ఒక వికలాంగ స్త్రీ, ఒక నేరస్తుడి దురాగతానికి ఆమెకు వైకల్యం ప్రాప్తించింది. ఆమె తన అనుభవాన్ని ఇలా వివరించింది:
నాకు వైకల్యం వల్ల చక్రాల కుర్చీలోనే జీవితం వెళ్ళదీయాలన్న నిజం తెలుసుకొనే సరికి నాకు నేనే ఒక వృధాగా పడి వున్న వస్తువుగా అనిపించింది. చాలా బాధ కలిగింది. విరక్తి కలిగి చనిపోవాలి అనిపించింది కూడా. కాని క్రమంగా నా మనసుకు నేను చెప్పకోసాగాను. “నీ కొడుకులు నిన్ను ప్రేమిస్తారు. నీ భర్తకు నీవు కావాలి. వారికి నీ అవసరం వుంది. నీవు కాస్మెటాలజిస్ట్వి. ఎందరో స్త్రీలు, తమ ముఖాలను అందంగా మార్చుకోవటం కోసం నీవు జీవించాలి" నేను నా కుటుంబానికి, సంఘానికి కూడా ఉపయోగపడిన వ్యక్తిని అని తెలుసుకున్నాను.
నేను బ్రతకాలి అనీ, వారితో కలిసి పని చేయాలనీ నిర్ణయించుకున్నాను. ఇపుడు నేను చెప్పగలను. నా జీవితం ఉత్తమంగా మారి హాయిగా వున్నానని.
సహకార బృందాలను ఏర్పాటు చేసుకోవటం
ఇతర వికలాంగ స్త్రీలతో కలిసి మెలసి వుండటం వల్ల ఒక స్త్రీకి ఆత్మ విశ్వాసం, ఒక ఆశ కలుగుతాయి. అవి ఆమెను నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని నిలిచేలా చేస్తాయి.
కేవలం ఒక సమస్య గురించి మాట్లాడుకోవటం వల్ల కూడా ఎంతో సహాయం లభిస్తుంది. ఒక స్త్రీ తన అనుభవాలతో కూడిన కథ వినిపించినపుడు సమావేశానికి నాయకత్వం వహించిన వ్యక్తి, మిగతా స్త్రీలను కూడా తమ అనుభవాలను వినిపించమని అడగవచ్చు. అందరి కథలు విన్న తరువాత, వారి సమస్యల గురించి చర్చించి, అందులో ఒకే విధమైన సమస్యలకు సాంఘిక స్థితిగతులే కారణంగా అనిపిస్తే, ఆ పరిస్థితులకు పరిష్కారాన్ని మార్పుల ద్వారా ఎలా వెతక వచ్చో చర్చించుకోవచ్చు.
అపుడు స్త్రీలందరూ, ఆ సమస్యల కోసం ఎవరికి వారు ఒంటరిగా పోరాడాలా? కలిసి కృషి చేయాలా? అన్న విషయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఒక్క పోరాటం, కృషి కన్నా అందరూ కలిసి చేసే సంఘటిత కృషి మంచి ఫలితాన్నిస్తుంది.
సహకార బృందాలను ఏర్పాటు చేసుకునే విధానం
భావాలను గుర్తించాలి. ఒక్కో సందర్భంలో స్త్రీలు తమ భావాలను వ్యక్త పరచకుండా దాచుకోవటం జరుగుతుంది. (అసలు తమకు అటువంటి భావాలు వున్నట్లే గుర్తుంచుకోరు.) ఎందుకంటే అవి చెడ్డగా, ప్రమాదకరంగా, బిడియపడవలసిన విషయాలుగా అనిపిస్తాయి వారికి,
ఒక కథను గాని, నాటికను గాని, చిత్రాన్ని గాని రూపొందించండి. బృందంలో సభ్యులు ఎదుర్కొన్న సమస్యల వంటి సంఘటనలనే ఆధారంగా కథను తయారు చేయవచ్చు. భావాలను ఒక పాత్ర ద్వారా వ్యక్త పరచేలా చేయడం వల్ల, వారికి కూడా తమ భావాలను గురించి వ్యక్త పరచాలన్న అభిప్రాయం కలుగుతుంది. నాయకత్వం వహించిన స్త్రీ కథ మొదలు పెట్టి కొంత వరకు చెబుతుంది. అక్కడి నుంచి బృందంలోని మరో స్త్రీ ప్రారంభిస్తుందని చెప్పటం. అలా ప్రతి ఒక్కరు కొంత కొంత భాగం చేర్చి చెప్పి పూర్తి చేస్తారు కథను. అదే విధంగా ఆ కథలోని పాత్రలను పోషించి నాటకంగా ప్రదర్శించుకోవచ్చు. లేక ఒక చిత్రంగా వేయవచ్చు ఆ కథను.
ఈ ప్రశ్నల వలన బృందంలోని స్త్రీలు తమ అభిప్రాయాలను, గురించి మాట్లాడే అవకాశం లభిస్తుంది.
ఒక సమస్యకు గల కారణాల అవగాహన
అందరూ కలిసి మాట్లాడుకోవటం వలన, వివిధ రకాల వైకల్యాలున్న వ్యక్తులు, మిగతా వారు కూడా తమలాంటి సమస్యల తోనే బాధ పడుతున్నా రన్న విషయాన్ని అర్థం చేసుకోగలరు. ఆ సమస్యలకు మూల కారణాలను గుర్తించటం జరుగుతుంది. కూడా,
మీ కమ్యూనిటి చిత్రాన్ని గీయండి
ఆ బృందం కొంచెం సేపు కలిసి సమావేశమైన తరువాత ఈ పని ప్రయోజనకరమవుతుంది. మీ కమ్యూనిటీ యొక్క చిత్రాన్ని మీ బృందం గీయవచ్చు. ఈ విధంగా ఒక సామాన్యమైన చిత్రాన్ని గీయటం వలన మీ నాయకత్వం వహించిన వ్యక్తి ఒక పనిని ప్రారంభించటానికి వీలుగా వుంటుంది. అపుడు మిగిలిన వారు ఆ చిత్రంలో కొత్త విషయాలను చేర్చవచ్చు. ఉదాహరణకు వికలాంగ స్త్రీలకు మానసిక ఆరోగ్య సమస్యలకు కారణాలను, మానసిక ఆరోగ్య సంరక్షణలను గురించిన అంశాలు, ఈ ప్రశ్నల వలన, మీ బృందం తీసుకోవలసిన చర్యల గురించి ఒక పథకాన్ని రూపొందించుకోవటానికి సహాయం లభిస్తుంది.
వికలాంగ బాలికలు, స్త్రీలు - వీరిలోని ప్రతిభలను కుటుంబం గుర్తించి, వారిని ఆ దిశగా ప్రోత్సహించటం వలన వారి మానసిక ఆరోగ్యం క్షేమంగా వుంటుంది. మీకు మీరు ఇచ్చుకొనే విలువ మీ కుటుంబం, సమాజం మీ పట్ల చూపే ఆదరణను అనుసరించి రూపు దిద్దుకుంటుంది. మీ కుటుంబం, మీ చుటూ వున్న సమాజం మీ నుంచి ఆశించే కృషి, ఉత్తమ ఫలితాల కోసం మీపై వుంచుకొన్న ఆశ కలిసి మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిత్వంతో, ఆత్మ విశ్వాసంతో, సామర్థ్యంతో పెరిగేలా చేస్తాయి.
కుటుంబాలు, సమాజాల కర్తవ్యం:
వికలాంగ బాలికలకు అక్షరాస్యత
వికలాంగ బాలికలు కూడా బడికి వెళ్ళి, ఇతర పిల్లలతో పాటు కలిసి చదువుకోవలసిన అవసరం వుంది. తన కుటుంబం ఏదో ఒక విధంగా కష్టపడి తనను బడికి పంపాలన్న కోరికతో పంపించి మిగతా పిల్లల లాగే చదువుకొనే అవకాశం కల్పించటం వలన, పాఠశాలలో తనకు ఒక స్థానం కల్పించటం వలన ఆ బాలికలో తన పట్ల తనకు విశ్వాసం, ఆత్మ గౌరవం పెరుగుతాయి. ఇతర వికలాంగ కుటుంబాల వారితో కూడా కలిసి, వివిధ రకాల వైకల్యాలు గల పిల్లలను పాఠశాలలలో ఇతర పిల్లలతో కలిసి చదువుకొనే అనుమతి కోసం కృషి చేయాలి. ఉపాధ్యాయులతో మాట్లాడి, మీ పిల్లల ప్రతిభలను గుర్తించమని అడగాలి, వైకల్యం పట్ల వారికి అవగాహనను కలిగించాలి. పాఠశాలలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేలా వారికి సహాయ పడమని కోరాలి.
వికలాంగ బాలికలకు విద్య చాలా అవసరం. వారికి ఉపాధిని, ఉద్యోగాలను సంపాదించి పెట్టే నైపుణ్యాలను నేర్చుకోవాలి వారు. అవసరమైన శిక్షణలను పొందాలి. అపుడే వారు ప్రయోజకులై తమకు తాము నిలబడి, కుటుంబానికి, సమాజానికి కూడా సహాయపడగలరు, ఉపయోగపడగలరు.